నిరుపేద విద్యార్థినికి ఎన్‌ఆర్‌ఐ చే యూత
-
దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటన
-
ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు
కేసముద్రం : అనారోగ్యంతో తల్లి మృతిచెందినప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తున్న ఓ నిరుపేద విద్యార్థినికి ఎన్‌ఆర్‌ఐ చేయూతనందించింది. ఈ మేరకు ఆమెను దత్తత తీసుకుని మెరుగైన విద్యాబుద్ధులు నేర్పిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థిని, కుటుంబసభ్యు లు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సం ఘటన మండలంలోని పెనుగొండ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెనుగొండకు చెందిన చిన్నిపెల్లి నగేష్, సుజాత దంపతులకు ఇద్దరు కూతుర్లు లావణ్య, దివ్య, కుమారుడు వంశీ ఉన్నారు. అయితే కుటుంబ పోషణ కోసం నగేష్ ఊరూరా తిరుగుతూ గాజులు అమ్ముతుంటాడు. కొన్నినెలలక్రితం పెద్ద కూతురు లావణ్య పెళ్లి చేశాడు. కాగా, రెండో కూతురు దివ్య స్థానిక జెడ్పీ పాఠశాలలో ప్రస్తుతం పదో తరగతి చదువుతుండగా, కొడుకు వంశీ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా, నగేష్ భార్య సుజాత రెండునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ క్రమంలో చదువులో ప్రతిభ కనబరిచే దివ్య తల్లి మృతితో ఆవేదనకు లోనైంది. ఇంటి పనులు చేస్తూ అటు తండ్రికి, తమ్ముడికి సేవలు చేస్తూ ఇబ్బందులతో పాఠశాలకు వెళ్తోంది. కాగా, బుధవారం మానుకోట మండలం అనంతారం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ తాడ్వాయి అనిత పెనుగొండ పాఠశాలకు క్రీడా మైదానాన్ని కొనుగోలు చేసి ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా దివ్య పరిస్థితిని ఉపాధ్యాయులు అనితకు వివరించగా ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు దివ్యను దత్తత తీసుకుని ఆమెకు ఇంటర్, డిగ్రీతోపాటు ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులను తానే భర్తిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయులు, దివ్య, కుటుంబసభ్యులు ఎన్‌ఆర్‌ఐ అనిత సేవాస్ఫూర్తితో ఆనందం వ్యMచేసి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.