నర్సింగ్ విద్యార్థులకు చేయూత
Published Wed, Jul 27 2016 12:24 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
విశాఖ మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌ల సంఘం (అప్నా) నగరంలో నర్సింగ్ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థినులను దత్తత తీసుకొనేందుకు ముందుకు వచ్చిందని అప్నా అధ్యక్షుడు డాక్టర్ కె.రాజే శ్వరరావు తెలిపారు. ఇండస్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏటా 800 మంది పేద నర్సింగ్ విద్యార్థులకు చేయూతనందించేందుకు నగరంలోని పది ఆస్పత్రులు ముందుకు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రులు నర్సింగ్ విద్యార్థులకు మెస్ చార్జీలు, బోర్డింగ్ ఫీజులతోపాటు ఇతర ఖర్చులు భరించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. నర్సింగ్ విద్యును ఉచితంగా అందించడంతోపాటు వారి కోర్సు పూర్తయ్యేంత వరకు అయ్యే ఖర్చులను భరించడమే కాకుండా కోర్సును అభ్యసించినవారికి కనీసం రూ.15 వేల జీతభత్యాలతో ఉద్యోగ కల్పనకు భరోసా ఇచ్చినందుకు అభినందించారు.
Advertisement
Advertisement