narsing
-
Narsingi : అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ : నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.పోలీసుల వివరాల మేరకు నార్సింగిలోని స్థానికంగా పాషా నగర్ కాలనీలోని జీ ప్లస్ టూ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్క్ చేసి ఉన్న కారులో మంటలు వ్యాపించాయి. కారులో వేడి తీవ్రత కారణంగా మంటలు భవనం మొత్తం వ్యాపించాయి.అగ్ని ప్రమాదంతో భవనంలో నివాసం ఉంటున్న ఇద్దరు పిల్లలు కిందకి దూకారు. మంటల దాటికి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు జమీలా, సహానా,నాలుగేళ్ల చిన్నారి షీర్జా మరణించారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
కోర్టుకు నార్సింగ్ డ్రగ్స్ కేసు నిందితులు..
సాక్షి,హైదరాబాద్ : నార్సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను తెలంగాణ పోలీసులు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. సోమవారం హైదర్షాకోట్లో డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్ టెస్ట్ లు చేయగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్, అమన్ తోపాటు.. ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్‌లు ఉన్నారు. అరెస్ట్ అయిన పెడ్లర్లలో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్స్, నోహిమ్ లతో పాటు లోకల్ పెడ్లర్లు అల్లం గౌతం, వరుణ్ కుమార్, మహబూబ్ షరీలు ఉన్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.డ్రగ్స్ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధాని ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు. -
సాత్విక్‌ను బూతులు తిట్టి, చితకబాదారు: పోలీసులు రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ క్లాస్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాత్విక్ మృతిపై ఇంటర్ బోర్డ్ కమిటీ వేసి విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను కూడా వెల్లడించింది. ఇక, సాత్విక్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టు ప్రకారం.. కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ మృతిచెందాడు. సాత్విక్‌ను బూతులు తిట్టడం వల్లే మనస్తాపం చెందాడు. విద్యార్థుల ముందు కొట్టడం వల్ల హర్ట్ అయ్యాడు. ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ తిట్టడంతో మనస్తాపనికి గురయ్యాడు. చనిపోయిన రోజు స్టడీ అవర్‌లో ఆచార్య, కృష్ణారెడ్డి.. సాత్విక్‌కు చితకబాదారు. హాస్టల్లో సాత్విక్‌ను వార్డెన్ వేధించాడు అని స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇంటర్ బోర్డు అధికారులు సాత్విక్ ఆత్మహ్యతపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. నివేదికలో భాగంగా కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. -
సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే.. శ్రీచైతన్యకు షాక్!
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైత్యన కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఎంక్వైరీ కమిటీ రిపోర్టును ఇచ్చింది. తాజా రిపోర్టులో కూడా పాత విషయాలనే అధికారులు ప్రస్తావించారు. అయితే, ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. రిపోర్టులో భాగంగా సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే బాగోతం ఉందని విచారణ కమిటీ పేర్కొంది. క్లాసులేమో శ్రీచైతన్యలో.. చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్లపై అన్ని కాలేజీల్లో చెక్ చేయాలని కమిటీ సూచించింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. -
నర్సింగ్ లో ఏపీ టాప్
-
భార్య పుట్టింటికి వెళ్లిందనే..
మణికొండ: మద్యం తాగొద్దన్నందుకు భార్యను తిట్టడంతో, ఆమె పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికిలోనై నార్సింగి ఫ్లై ఓవర్‌పై నుంచి ఔటర్‌రింగ్ రోడ్డుపైకి దూకి భీమప్ప(25) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా, మద్దురు మండలం, చింతల్‌దిన్నె గ్రామానికి చెందిన బీమప్ప, సత్తమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిరువురు నార్సింగిలో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భీమప్ప రోజు మద్యం తాగి వచ్చి భార్యను వేదిస్తున్నాడు. దాంతో విసిగిపోయిన ఆమె సోమవారం రాత్రి నార్సింగిలోనే ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లింది. మర్నాడు అక్కడి నుంచి కిషన్‌నగర్‌లోని తల్లి ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికిలోనైన భీమప్ప మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య ) -
హైదరాబాదీలకు గుడ్ న్యూస్; అందుబాటులోకి ఉచిత వైద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో టీ డయాగ్నస్టిక్స్ మినీ హబ్‌ల పేరిట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నెలకొల్పుతున్న వైద్య పరీక్షల కేంద్రాలు నగరంలో మరో 10 ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సేవలందిస్తున్న 8 మినీ హబ్‌లు కొన్ని ప్రాంతాలకే అందుబాటులో ఉండడం వల్ల మరో 10 కొత్తగా నెలకొల్పారు. ఇప్పటికే 319 బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి సేవలు అందిస్తుండగా కొత్తగా ఏర్పాటైన వాటిని 151 పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానాల పరిధిలో రోగులు వినియోగించుకోనున్నారు. ఎక్కడికక్కడే.. వైద్య పరీక్షల అవసరాల కోసం కొందరు ప్రైవేట్ ల్యాబ్‌ల మీదా మరికొందరు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి వంటి పెద్దాస్పత్రుల మీద ఆధారపడే పరిస్థితిని నివారించడానికి ఇవి అందుబాటులోకి తెచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులను అవసరాన్ని బట్టి వైద్య పరీక్షల కోసం ఈ మినీ హబ్‌లకు సిఫారసు చేస్తారు. ఇక్కడ అల్ట్రాసోనోగ్రఫీ, రేడియోలజీ, రక్తపోటు అనాలసిస్, ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ, సీటీ స్కాన్లు, ఈసీజీ, రేడియాలజీ తదితర సౌకర్యాలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి) కొత్త మినీ హబ్స్ అమీర్‌పేట్, శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పటాన్ చెరు, మలక్‌పేట్, హయత్‌నగర్, రాజేంద్ర నగర్, గోల్కొండ, నార్సింగి ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. వీటిలో నార్సింగ్‌లో మినీహబ్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు లాంఛనంగా బుధవారం ప్రారంభించగా, మిగిలిన వాటిని వేర్వేరు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. (క్లిక్: వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను) -
అర్హత ఉన్నా.. మెరిట్ లిస్ట్‌లో పేరున్నా జాబ్ రాలే..
సాక్షి, మంచిర్యాల: ఎంఎస్సీ నర్సింగ్ అర్హత ఉండి మెరిట్ లిస్ట్‌లో పేరున్నా తమకు కాకుండా బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు జాబ్ ఇచ్చారని, తమకు జరిగిన అన్యాయంపై సోమవారం అభ్యర్థులు కలెక్టర్ భారతి హోళ్లికేరి, డీఎంహెచ్ఓ సుబ్బరాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్సీ, బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులతో భర్తీ చేయాల్సి ఉండగా కేవలం బీఎస్సీ వారికే అవకాశం ఇచ్చారన్నారు. అంతేకాకుండా ఎస్సీ క్యాటగిరీలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అధికారులు ఏ ప్రాతిపదికన నియామకం చేశారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి సాగర్, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జుమ్మిడి గోపాల్, ఏఐఎఫ్డీఎస్ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, తెలంగాణ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తోట రాజేష్ పాల్గొన్నారు. -
మైండ్ గేమ్
‘‘ఈ రోజుల్లో సినిమాలు ఒకసారి రిలీజ్ కావడమే కష్టంగా ఉంది. అలాంటిది ‘సూపర్ స్కెచ్’ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నాం. సినిమాపై మాకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణం’’ అన్నారు నటుడు ఇంద్ర. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్తా, కార్తీక్, చక్రి, మాగంటి ముఖ్య పాత్రల్లో రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్ స్కెచ్’ సినిమాని ఇవాళ రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘నేను కరాటే ప్రొఫెషనల్‌ని. వారియర్ కరాటే ఇంటర్న్షనల్ ఫౌండేషన్ ద్వారా కరాటే శిక్షణ ఇస్తున్నాం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చా. మొదట్లో ఇబ్బందులు పడ్డా. ‘సై, సైనికుడు, ధృవ, శ్రీమన్నారాయణ’ వంటి సినిమాల్లో నటించాను. సోలో హీరోగా ‘పుత్రుడు, కుర్ కురే’ సినిమాలు చేశా. ‘సూపర్ స్కెచ్’ సినిమాలో విలన్‌గా నటించాను. మైండ్ గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమా నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ‘సైరా’ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నా’’ అన్నారు. -
మైండ్ గేమ్
‘శ్రీమన్నారాయణ, సామాన్యుడు, దగ్గరగా దూరంగా, విక్టరీ, ప్యార్ మే పడిపోయానే’ వంటి చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికుమార్ చావలి. మైండ్ గేమ్ కాన్సెప్ట్‌తో తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీలతో పాటు విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లండ్) ప్రధాన పాత్రల్లో నటించారు. యారో సినిమాస్ సమర్పణలో యు అండ్ ఐ ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బలరామ్ మక్కల ఈ సినిమా నిర్మించారు.రవికుమార్ చావలి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన చిత్రమిది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు వాళ్లతో పాటు విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోని పాత్రలు కూడా మెప్పిస్తాయి. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం కనువిందుగా ఉంటుంది. కార్తీక్ కొడకండ్ల సంగీతం అలరిస్తుంది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. -
హత్యకు స్కెచ్
‘సామాన్యుడు, శ్రీమన్నారాయణ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి చావలి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. హత్య నేపథ్యంలో నడిచే ఈ థ్రిల్లర్ స్టోరీలో నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, సోఫియా (లండన్) కీలక పాత్రలు చేశారు. ఎరోస్ సినిమాస్ సమర్పణలో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఎడిటింగ్ జరుపుకుంటోంది. రవి చావలి మాట్లాడుతూ– ‘‘ఒక పోలీసాఫీసర్, ఓ ఫారిన్ అమ్మాయి, నలుగురు క్రిమినల్స్ మధ్య జరిగే కథ ఇది. పోలీసును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమినల్స్ పాత్రల నేపథ్యంలో తెరకెక్కించాం. పోలీస్ అధికారిగా నర్సింగ్ నటన ఈ సినిమాకి హైలైట్. శ్రీహరిగారికి ప్రత్యామ్నాయం అన్నట్టు చేశాడు. ఉత్కంఠభరితంగా సాగేలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల సూర్యలంక బీచ్, వికారాబాద్ ఫారెస్ట్‌లో 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాణం: యూ అండ్ ఐ క్రియేషన్స్, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ, కెమెరా: సురేంద్ర రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల. -
రూ.50 లక్షలు పోయి రెండు లక్షలే మిగిలాయి
-
గొంతుకోసి, రాళ్లతో కొట్టి యువతి హత్య
నార్సింగి: గొంతు కోసి, రాళ్లతో కొట్టి గుర్తు తెలియని యువతిని హత్య చేసిన ఘటన నార్సింగి ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గండిపేట ప్రధాన రహదారిలోని వీఐఎఫ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రహారీ ప్రాంతంలోని చెట్ల పొదల్లోకి ఆదివారం సాయంత్రం 4.30కి గుర్తు తెలియని యువకుడు ఓ యువతిని తీసుకొచ్చాడు. అక్కడ ఇద్దరూ గొడవపడుతుండగా స్థానిక యువకుడు గమనించి వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుస్టేషన్ ఘటనా స్థలానికి 10 కిలో మీటర్ల దూరం ఉంటుంది. సీఐ రాంచంద్రరావు, ఎస్ఐ ధనుంజయ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువతి హత్యకు గురై పడి ఉంది. మృతురాలి వయసు 20 ఏళ్లు ఉంటాయి. గొంతుకోసి, రాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపించాయి. మృతురాలి ఒంటిపై బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్ , బురఖా ధరించి ఉంది. చేతులు నల్లటి వస్త్రంతో కట్టేసి ఉన్నాయి. ఘటనా స్థలంలో మృతురాలికి సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదు. యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారా? లేక శారీరికంగా వేధించి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ రాంచంద్రరావు తెలిపారు. యువతి ఎవరు అన్న విషయం తెలిస్తే అన్ని విషయాలు బహిర్గమౌతాయన్నారు. గండిపేట ప్రధాన రహదారితో పాటు సీబీఐటీ ప్రధాన రహదారిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బురఖా ధరించిన ఓ యువతి గుర్తు తెలియని యువకుడి బైక్‌పై ఈ మార్గంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ వాహనం యజమాని వివరాలు తెలుసుకొనే పనిలో పడ్డారు. -
నర్సింగ్ విద్యార్థులకు చేయూత
విశాఖ మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌ల సంఘం (అప్నా) నగరంలో నర్సింగ్ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థినులను దత్తత తీసుకొనేందుకు ముందుకు వచ్చిందని అప్నా అధ్యక్షుడు డాక్టర్ కె.రాజే శ్వరరావు తెలిపారు. ఇండస్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏటా 800 మంది పేద నర్సింగ్ విద్యార్థులకు చేయూతనందించేందుకు నగరంలోని పది ఆస్పత్రులు ముందుకు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రులు నర్సింగ్ విద్యార్థులకు మెస్ చార్జీలు, బోర్డింగ్ ఫీజులతోపాటు ఇతర ఖర్చులు భరించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. నర్సింగ్ విద్యును ఉచితంగా అందించడంతోపాటు వారి కోర్సు పూర్తయ్యేంత వరకు అయ్యే ఖర్చులను భరించడమే కాకుండా కోర్సును అభ్యసించినవారికి కనీసం రూ.15 వేల జీతభత్యాలతో ఉద్యోగ కల్పనకు భరోసా ఇచ్చినందుకు అభినందించారు. -
హీరోగా అవకాశం వస్తే చేస్తా: నటుడు నర్సింగ్
మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో సినిమా క్యారక్టర్ ఆర్టిస్టులకు మంచి అవకాశం లభిస్తుందని 'రచ్చరంభోల' సినిమాలో విలన్ పాత్ర చేసిన నటుడు నర్సింగ్ మక్కల అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలో శ్రీ కొండపోచమ్మ జాతర ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఈ ప్రాంతంలోని నటులకు మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇంత వరకు 8 సినిమాల్లో విలన్ పాత్ర చేశానని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రచయితలకు, దర్శకులకు రానున్న కాలంలో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. హీరోగా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. -
డబ్బు కోసం మేనమామ కిరాతకం
హైదరాబాద్, న్యూస్‌లైన్: అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. వరుసకు మేనమామ అయిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జాలీ హనుమాన్‌లో నివసించే ఆర్.అనిల్‌కుమార్ (34) అబిడ్స్ చర్మాస్‌లో సేల్స్‌మన్. అతడు భార్య దీపిక, కుమారుడు యశ్‌రాజ్ కుమార్(5), కుమార్తె రితిక (3)తో కలిసి ఉంటున్నారు. యష్‌రాజ్ జిన్సీచౌరాహిలోని కృష్ణవేణి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు దీపిక చిన్నాన్న కొడుకు వినోద్ ఇంటికి వచ్చి బాలుడికి చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్లాడు. మేనమామ కావడంతో యశ్‌రాజ్ అతడితో వెళ్లాడు. రాత్రి వినోద్.. బావ అనిల్‌కు ఫోన్‌చేసి డబ్బు కోసం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన వినోద్ యశ్రాజ్ను బండ్లగూడ పీరంచెరువు దగ్గరకు తీసుకెళ్లి దారుణంగా హత్యచేశాడు. బుధవారం ఉదయం బాలుడు రక్తపు మడుగులో నిర్జీవంగా ఉండటాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడిని గుర్తు పట్టకుండా ఉండేందుకు వినోద్ పెట్రోలుతో ముఖాన్ని తగల బెట్టాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. యష్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో శవపరీక్షలు నిర్వహించారు. తలపై బండతో మోది గొంతును వైరుతో బిగించి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని ఉస్మానియా ఫోరెన్సిక్ విభాగాధిపతి టకియుద్దీన్ తెలిపారు. చాక్లెట్‌తోనే బహిర్గతం: ఎప్పుడూ తమ బాబుకు చాక్లెట్ ఇవ్వని వినోద్ మంగళవారం ఎందుకు ఇచ్చాడనే అనుమానం దీపికకు కలిగింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నట్లు సమాచారం. మెకానిక్‌గా పనిచేసే వినోద్ కొన్నాళ్లుగా పనిచేయకుండా తిరుగుతున్నాడు. -
ఆరేళ్ల బాలుడి దారుణ హత్య
హైదరాబాద్ : హైదరాబాద్ నార్సింగ్‌లో ఆరేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. బాలుడి ముఖాన్ని బండరాయితో మోది, ఉరివేసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా దుండగులు పిరంచెరువు వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న స్కూల్ ఐడీ కార్డు ఆధారంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అనంతరం బాలుడి బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ లో ఆరేళ్ల బాలుడు దారుణ హత్య
-
రికార్డుల స్వాధీనానికి ‘గ్రేటర్’ ప్రయత్నం
మణికొండ, న్యూస్‌లైన్: రాజేంద్రనగర్ మండల పరిధిలోని పది పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందే తరువాయి జీహెచ్ఎంసీ అధికారులు పంచాయతీల రికార్డుల స్వాధీనానికి ప్రయత్నం చేశారు. సోమవారం రాత్రి 7.30 నుంచి 10 గంటల వరకు జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ 11 కమిషనర్ , శేరిలింగంపల్లి సర్కిల్ 6 కమిషనర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు నార్సింగ్, పుప్పాలగూడ, నెక్నాంపూర్, ఖానాపూర్, వట్టినాగులపల్లి, హిమాయత్‌సాగర్, కిస్మత్పూర్, బండ్లగూడ, పీరంచెరువు, హైదర్షాకోట్ పంచాయతీలలో పర్యటించారు. పంచాయతీ కార్యాలయాలకు చేరుకుని గ్రామకార్యదర్శుల వివరాలను అడిగారు. ఏ గ్రామంలోను వారు అందుబాటులో లేకపోవటం, అక్కడక్కడా అందుబాటులో ఉన్న బిల్కలెక్టర్ల ద్వార వారి నెంబర్లను తీసుకుని ఫోన్లలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల నుంచి సమాచారం లేనపుడు రికార్డులను ఎలా స్వాధీనం చేస్తామని పలువురు కార్యద ర్శులు వాదనలకు దిగారు. హైదర్షాకోట్, కిస్మత్పూర్ తదితర గ్రామా కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లను బయటకు పంపి కార్యాలయాలను సీజ్ చేశారు. ఖానాపూర్, పుప్పాలగూడ, వట్టినాగులపల్లి తదితర గ్రామాలలో అధికారులు అందుబాటులో లేకపోవటంతో మంగళవారం రికార్డులను స్వాధీనం చేసుకుంటామని బిల్కలెక్టర్లకు తెలిపి వెళ్లారు. నార్సింగ్, నెక్నాంపూర్‌లలో గ్రామస్థుల ఆందోళన మా గ్రామాలను ఎవరినడిగి గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేశారని, మాకు పంచాయతీలుగానే ఉంచాలంటూ మండల పరిధిలోని నార్సింగ్, నెక్నాంపూర్ తదితర గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున పంచాయతీ కార్యాలయాల వద్ద గుమికూడి గ్రేటర్ అధికారులను అడ్డుకున్నారు. ప్రజల మనోభీష్టానికి బిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని నిరసిస్తూ అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకులే మంగళవారం నార్సింగ్ బంద్‌కు పిలుపు నివ్వటం కొనమెరుపు.