మణికొండ, న్యూస్‌లైన్: రాజేంద్రనగర్ మండల పరిధిలోని పది పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందే తరువాయి జీహెచ్‌ఎంసీ అధికారులు పంచాయతీల రికార్డుల స్వాధీనానికి ప్రయత్నం చేశారు. సోమవారం రాత్రి 7.30 నుంచి 10 గంటల వరకు జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ 11 కమిషనర్ , శేరిలింగంపల్లి సర్కిల్ 6 కమిషనర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు నార్సింగ్, పుప్పాలగూడ, నెక్నాంపూర్, ఖానాపూర్, వట్టినాగులపల్లి, హిమాయత్‌సాగర్, కిస్మత్‌పూర్, బండ్లగూడ, పీరంచెరువు, హైదర్‌షాకోట్ పంచాయతీలలో పర్యటించారు.
పంచాయతీ కార్యాలయాలకు చేరుకుని గ్రామకార్యదర్శుల వివరాలను అడిగారు. ఏ గ్రామంలోను వారు అందుబాటులో లేకపోవటం, అక్కడక్కడా అందుబాటులో ఉన్న బిల్‌కలెక్టర్‌ల ద్వార వారి నెంబర్లను తీసుకుని ఫోన్‌లలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల నుంచి సమాచారం లేనపుడు రికార్డులను ఎలా స్వాధీనం చేస్తామని పలువురు కార్యద ర్శులు వాదనలకు దిగారు. హైదర్‌షాకోట్, కిస్మత్‌పూర్ తదితర గ్రామా కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లను బయటకు పంపి కార్యాలయాలను సీజ్ చేశారు. ఖానాపూర్, పుప్పాలగూడ, వట్టినాగులపల్లి తదితర గ్రామాలలో అధికారులు అందుబాటులో లేకపోవటంతో మంగళవారం రికార్డులను స్వాధీనం చేసుకుంటామని బిల్‌కలెక్టర్లకు తెలిపి వెళ్లారు.
నార్సింగ్, నెక్నాంపూర్‌లలో గ్రామస్థుల ఆందోళన
మా గ్రామాలను ఎవరినడిగి గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేశారని, మాకు పంచాయతీలుగానే ఉంచాలంటూ మండల పరిధిలోని నార్సింగ్, నెక్నాంపూర్ తదితర గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున పంచాయతీ కార్యాలయాల వద్ద గుమికూడి గ్రేటర్ అధికారులను అడ్డుకున్నారు. ప్రజల మనోభీష్టానికి బిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని నిరసిస్తూ అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకులే మంగళవారం నార్సింగ్ బంద్‌కు పిలుపు నివ్వటం కొనమెరుపు.
రికార్డుల స్వాధీనానికి ‘గ్రేటర్’ ప్రయత్నం
Published Tue, Sep 3 2013 12:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
Advertisement
Advertisement