
కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ ఏళ్లతరబడి కష్టపడుతూనే ఉన్నా ఫలితం దక్కకపోతే ఎలా ఉంటుంది? తనదీ అదే పరిస్థితి అంటున్నాడు పంచాయత్ నటుడు దుర్గేశ్ కుమార్ (Durgesh Kumar). పంచాయ్ సిరీస్, లాపతా లేడీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడికి అవకాశాలు రావడం లేదట! తాజాగా దుర్గేశ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోసుకున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లవుతోంది. ఇప్పటికీ అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాను.
ఆడిషన్స్‌కు కూడా పిలవట్లేదు
కష్టాలు నాకు చుట్టాలు కాదు, ఇంటిమనుషులైపోయాయి. అందరూ పంచాయత్ సిరీస్ (Panchayat Web Series)తో నేను సక్సెస్ అయ్యాననే చూస్తున్నారు. కానీ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంగా పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఒక్క ఫోన్ కాల్ రాలేదు. ఆడిషన్‌కు రమ్మని ఎవరూ పిలవలేదు. నా టాలెంట్ గుర్తించిన చిన్న నిర్మాతలతోనే నేను ఎక్కువగా పని చేస్తున్నాను. ఇప్పటికీ ఆడిషన్స్ కోసం పరిగెడుతూనే ఉన్నాను.
పాపులారిటీ ఫుల్.. అవకాశాలు నిల్
హైవే, పంచాయత్ ప్రాజెక్టులతో నన్ను నేను నిరూపించుకున్నాక కూడా ఎవరూ పెద్దపాత్రలు ఇవ్వడం లేదు. అందరికీ నేను తెలుసు. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. నా పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు. ఇంకో విషయమేంటంటే.. నేను నటించిన సినిమాలు అవార్డులు సాధిస్తున్నాయి. పలువురు సినీవిశ్లేషకులు ఆయా సినిమాలను మెచ్చుకుంటున్నారు కానీ అందులో ఎక్కడా నా పేరు ప్రస్తావించడం లేదు.
పంచాయత్‌తో ట్రెండింగ్‌లో..
నాకు రావాల్సిన క్రెడిట్ ఎప్పుడూ రాదు. కనీసం ప్రేక్షకులైనా నా పనిని గుర్తించినందుకు గర్విస్తున్నాను అన్నాడు. సరైన పని దొరక్కపోవడం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దుర్గేశ్.. హైవే, సుల్తాన్, సంజు, ధడక్, భక్షక్ వంటి చిత్రాల్లో నటించాడు. పంచాయత్ సిరీస్ నటుడిగా అతడికి ఎక్కువ గుర్తింపు తెచ్చింది.
చదవండి: రజనీకాంత్ భార్యగా ఛాన్స్ ఇప్పిస్తాం.. కాకపోతే ఒక కండీషన్!
Comments
Please login to add a commentAdd a comment