
మణికొండ: మద్యం తాగొద్దన్నందుకు భార్యను తిట్టడంతో, ఆమె పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికిలోనై నార్సింగి ఫ్లై ఓవర్‌పై నుంచి ఔటర్‌రింగ్ రోడ్డుపైకి దూకి భీమప్ప(25) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా, మద్దురు మండలం, చింతల్‌దిన్నె గ్రామానికి చెందిన బీమప్ప, సత్తమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిరువురు నార్సింగిలో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
భీమప్ప రోజు మద్యం తాగి వచ్చి భార్యను వేదిస్తున్నాడు. దాంతో విసిగిపోయిన ఆమె సోమవారం రాత్రి నార్సింగిలోనే ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లింది. మర్నాడు అక్కడి నుంచి కిషన్‌నగర్‌లోని తల్లి ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికిలోనైన భీమప్ప మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య )
Comments
Please login to add a commentAdd a comment