
పరిగి: యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మండలంలోని బీచిగానిపల్లిలో చోటుచేసుకుంది. హిందూపురం అప్‌గ్రేడ్ సీఐ జీటీ నాయుడు, ఇన్‌చార్జ్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. బీచిగానిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శివప్ప కుమారుడు యుగేంద్ర (19) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఓ ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన యుగేంద్ర.. ఆదివారం ఉదయం కాలనీకి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించాడు.
సీఐ జీటీ నాయుడు, ఇన్‌చార్జ్ ఎస్‌ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించారు. గొంతు కోసి హత్య చేయడమే కాకుండా అతడి మర్మాంగాన్ని సైతం కోసినట్లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. యుగేంద్ర మృతదేహం వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అన్యాయంగా తన కుమారుడిని చంపేశారంటూ శివప్ప విలపించిన తీరు గ్రామస్తులను కన్నీరు పెట్టించింది. శివప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment