హైదరాబాద్ : హైదరాబాద్ నార్సింగ్‌లో ఆరేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. బాలుడి ముఖాన్ని బండరాయితో మోది, ఉరివేసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా దుండగులు పిరంచెరువు వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న స్కూల్ ఐడీ కార్డు ఆధారంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అనంతరం బాలుడి బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.