krishnaveni talent school
-
మల్లేపల్లి : స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
సాక్షి, దేవరకొండ : కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరోని తండాలో ఇస్లావత్ అఖిల్(5) అనే యూకేజీ విద్యార్థి బస్సు కింద పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాలు..తండాలో నివసిస్తున్న ఇస్లావత్ కూమార్, శాంతి దంపతుల కుమారుడు అఖిల్‌ను కొండమల్లేపల్లిలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ చదివిస్తున్నారు. రోజూ స్కూల్ బస్సులో వెళ్లి వస్తుండే అఖిల్,రోజులాగే మంగళవారం కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా, డ్రైవరు చూసుకోకుండా బస్సు కదిలించడంతో వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవరు పరారయ్యాడు. ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోలేని తండావాసులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. -
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు దగ్ధం
సిరిసిల్ల రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వ్యాన్ దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పాఠశాల యాజమాన్యం అంటే గిట్టని వారెవరో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. నష్టం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు
నిరుపేద కుటుంబంలో పుట్టిన.. కేబినెట్ మంత్రిగా పనిచేశా.. 965 సినిమాల్లో ఆ మూడు ఎన్నటికీ మరువలేను హాస్యనటుడు బాబుమోహన్ దుగ్గొండిలో స్కూల్ వార్షికోత్సవానికి హాజరు దుగ్గొండి, న్యూస్‌లైన్: ‘చిన్న పల్లెలో నిరుపేద కుటుంబంలో పుట్టాను. పూరిపాక పాఠశాలలో చదివాను. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సం పాదించుకున్నా.. ఈ రోజు ఈ స్థాయిలో ఉం టానని ఎన్నడూ ఊహించలేదు’ అని ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలోని కృష్ణవేణి టా లెంట్ స్కూల్లో గురువారం రాత్రి జరిగిన చైత్ర-2014 వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీ ణ ప్రాంతాలలో పుట్టిన ఎంతో మంది కలెక్టర్ లు, డాక్టర్లు అయ్యారని, తాను ఒక మారుమూల పల్లెలో నుంచి వచ్చి పట్టుదలతో ఎంఏ, ఎల్ఎల్బీ చదివి రెండు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేశానని చెప్పారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించ వచ్చని చెప్పారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చిన్నారులకు వినయ విధేయతలు నేర్పించాల న్నారు. తాను ఇప్పటికి 965 సినిమాలలో నటించానని, వాటిలో మూడు సినిమాలను ఏనాటికీ మరువలేనని ఆయన అన్నారు. అంకుశం.. యాక్టర్‌ను చేస్తే, మామగారు.. కమెడియన్ చేయగా, మాయలోడు.. హీరో చేసిందని బాబుమోహన్ చెప్పారు. సభలో ప్రసంగిస్తూనే ‘నీలిమబ్బు కురులలోన’ ‘ఇంత కూరుంటేయ్యమ్మా.. బువ్వుంటేయ్య మ్యా’ అంటూ పాట పాడుతూ స్టెప్పులు వేసి సభికులను ఆనందంలో ముంచెత్తారు. కొందరు ఆయనతో గొంతు కలిపి స్టెప్పులేశారు. అనంతరం బాబుమోహన్ సర్కిల్ సీఐ మధు, పాఠశాల డెరైక్టర్ పెంచాల శ్రీనివాస్ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం వార్షికోత్సవ సభలో విద్యార్థులు ప్రదర్శించిన నృ త్యాలు, నాటికలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో కాకతీయ యునివర్శిటి ప్రిన్సిపాల్ రామస్వామి, ఎంవీ రంగారావు, భూపాల్‌రావు, ఎస్సై ముజాహిద్, సర్పంచ్ ఆరెల్లి చందన, పాఠశాల ఇం చార్జీ రాంబాబు, కళాశాల ఇంచార్జీ దానం వీరేందర్, పేరెంట్స్ కమిట బాధ్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆరేళ్ల బాలుడి దారుణ హత్య
హైదరాబాద్ : హైదరాబాద్ నార్సింగ్‌లో ఆరేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. బాలుడి ముఖాన్ని బండరాయితో మోది, ఉరివేసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా దుండగులు పిరంచెరువు వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న స్కూల్ ఐడీ కార్డు ఆధారంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అనంతరం బాలుడి బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ లో ఆరేళ్ల బాలుడు దారుణ హత్య
-
అభివృద్ధి పథంలో షాద్‌నగర్
రాష్ట్ర రాజధానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత చేరువలో, పాలమూరు జిల్లా ముఖ ద్వారంగా ఉన్న షాద్‌నగర్ మొదటి నుంచి వ్యాపారకేం ద్రంగా ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తోంది. వివిధ రకాల ఉత్పత్తి సంస్థలకు, వినియోగదారులకు అనుసంధానంగా ఇక్కడి వ్యాపార వేత్తలు, వాణిజ్య, విద్యా సంస్థల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా కాకుండా వినియోగదారుల సేవలే పరమావధిగా కృషి చేస్తున్నారు. విద్యా రంగానికి వెలుగులు పంచడంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వారికి వివిధ రకాల బైక్‌లను అందుబాటులో ఉంచడంలో సాయికృష్ణ హీరో షోరూం ముందు వరుసలో ఉంది. మేనేజర్ మురళీకాంత్రెడ్డి పర్యవేక్షణలో కంపెనీ ద్వారా శిక్షణ పొందిన నైపుణ్యం గల మెకానిక్‌లతో సర్వీస్ చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. వివాహాది శుభకార్యాలకు వేదికగా, అవసరమైన పార్కింగ్ ప్లేస్‌తో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించడంలో కుంట్ల రాంరెడ్డి గార్డెన్స్ నంబర్‌వన్‌గా నిలిచింది. పేదోడి బిర్యానీ (కుష్కా)కి పేరుగాంచడంతో పాటు 20 ఏళ్లుగా భోజన ప్రియుల టేస్ట్‌కు తగ్గట్లుగా వివిధ రకాల వంటకాలను అందించడంలో ఆశియా నా హోటల్‌ది అందెవేసిన చేయి. నాణ్యతే పరమావధిగా బంగారు ఆభరణాలు విక్రయించడంలో శ్రీ వెంకటరమణ జ్యువెలరీస్, హోల్‌సేల్ ధరలకే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న శ్రీ వెంకటరమణ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్, గృహాలను ఆకర్షణీయంగా తీర్చిదిదే ఏషియన్ పెయింట్స్ విక్రయంలో జిల్లాలో నంబర్‌వన్‌స్థానంలో నిలచిన శ్రీ వెంకటరమణ పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్ వ్యాపారంలో దినాదినాభివృద్ధి చెందుతున్నాయి. వినియోగదారుల చేత పొదుపు చేయిస్తూ వారి అవసరాలు తీర్చడంలో మణికంఠ చిట్‌ఫండ్స్ అధినేత మలిపెద్ది శంకర్ విశేషంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎల్ఐసీ ప్రీమియం పాయింట్ ద్వారా మలిపెద్ది చైతన్య సుదీర్ఘసేవలు అందిస్తున్నారు. నాణ్యత గల విత్తనాలు, ఎరువులను రైతులకు అందిస్తూ అన్నదాత సేవలో శ్రీనివాస ట్రేడర్స్ సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ ముందు వరుసలో నిలిచింది. రోగులకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ అత్యాధునికమైన టె క్నాలజీతో సంతాన సాఫల్యం కోసం విజయజ్యోతి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా డాక్టర్ విజయకుమారి వైద్యసేవలు అందజేస్తున్నారు. ఫ్లెక్సీ బ్యానర్స్ ముద్రణారంగంలో వినూత్న తరహాలో రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ వినాయక డిజిటల్ దినదినాభివృద్ధి చెందుతుంది. వివాహాది శుభకార్యాలకు తనదైన శైలిలో వీడియో, ఫొటో కవరేజీ చేస్తూ రాజేశ్వరి ఫొటో స్టూడియో, జిరాక్స్ అందరికీ అందుబాటులో ఉంది. మరోవైపు టాటా ఏస్, ట్రాక్టర్లతో పాటు వివిధ కంపెనీల ఫోర్ వీలర్ స్పేర్ పార్ట్సు మరియు అన్ని రకాల బ్రాండెడ్ ఆయిల్‌ను ప్రభు ఆటోమొబైల్స్ వినియోగదారులకు అందజేస్తుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆధునిక స్టైల్ తో టైలరింగ్ నిర్వహిస్తున్న వినోద్ టైలర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇలా వ్యాపార వాణిజ్య విద్యారంగాలలో పేరెన్నికగన్న సంస్థలన్నీ నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా సేవలందిస్తున్నాయి. -
హెచ్ఐవీపై విద్యార్థి వినూత్న ప్రచారం
చేగుంట, న్యూస్‌లైన్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణపై ఓ బాలుడు వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల ఒకటిన అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఒక్క రోజు కార్యక్రమాలతో మార్పు రాదని గమనించిన చేగుంటలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి సాయి సాకేత్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. తనకు సమయం చిక్కినప్పుడల్లా ప్లకార్డుతో చేగుంట, వడియారం గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం వడియారం గ్రామంలో హెచ్ఐవీ నివారణ కోసం ప్లకార్డు ప్రదర్శిస్తూ కనిపించాడు. ఎయిడ్స్/హెచ్ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ వస్తే ఎలాంటి చికిత్స పొందాలో స్థానికులకు వివరిస్తున్నాడు. ఎయిడ్స్ నివారణ ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారుల కన్నా ఈ విద్యార్థి ప్రచారమే బాగుందని అతడి ప్రయత్నాన్ని స్థానికులు అభినందించారు.