పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు
- నిరుపేద కుటుంబంలో పుట్టిన..
- కేబినెట్ మంత్రిగా పనిచేశా..
- 965 సినిమాల్లో ఆ మూడు ఎన్నటికీ మరువలేను
- హాస్యనటుడు బాబుమోహన్
- దుగ్గొండిలో స్కూల్ వార్షికోత్సవానికి హాజరు
దుగ్గొండి, న్యూస్‌లైన్: ‘చిన్న పల్లెలో నిరుపేద కుటుంబంలో పుట్టాను. పూరిపాక పాఠశాలలో చదివాను. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సం పాదించుకున్నా.. ఈ రోజు ఈ స్థాయిలో ఉం టానని ఎన్నడూ ఊహించలేదు’ అని ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలోని కృష్ణవేణి టా లెంట్ స్కూల్‌లో గురువారం రాత్రి జరిగిన చైత్ర-2014 వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీ ణ ప్రాంతాలలో పుట్టిన ఎంతో మంది కలెక్టర్ లు, డాక్టర్‌లు అయ్యారని, తాను ఒక మారుమూల పల్లెలో నుంచి వచ్చి పట్టుదలతో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివి రెండు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేశానని చెప్పారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించ వచ్చని చెప్పారు.
చిన్నప్పుడే తల్లిదండ్రులు చిన్నారులకు వినయ విధేయతలు నేర్పించాల న్నారు. తాను ఇప్పటికి 965 సినిమాలలో నటించానని, వాటిలో మూడు సినిమాలను ఏనాటికీ మరువలేనని ఆయన అన్నారు. అంకుశం.. యాక్టర్‌ను చేస్తే, మామగారు.. కమెడియన్ చేయగా, మాయలోడు.. హీరో చేసిందని బాబుమోహన్ చెప్పారు. సభలో ప్రసంగిస్తూనే ‘నీలిమబ్బు కురులలోన’ ‘ఇంత కూరుంటేయ్యమ్మా.. బువ్వుంటేయ్య మ్యా’ అంటూ పాట పాడుతూ స్టెప్పులు వేసి సభికులను ఆనందంలో ముంచెత్తారు. కొందరు ఆయనతో గొంతు కలిపి స్టెప్పులేశారు.
అనంతరం బాబుమోహన్ సర్కిల్ సీఐ మధు, పాఠశాల డెరైక్టర్ పెంచాల శ్రీనివాస్ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం వార్షికోత్సవ సభలో విద్యార్థులు ప్రదర్శించిన నృ త్యాలు, నాటికలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో కాకతీయ యునివర్శిటి ప్రిన్సిపాల్ రామస్వామి, ఎంవీ రంగారావు, భూపాల్‌రావు, ఎస్సై ముజాహిద్, సర్పంచ్ ఆరెల్లి చందన, పాఠశాల ఇం చార్జీ రాంబాబు, కళాశాల ఇంచార్జీ దానం వీరేందర్, పేరెంట్స్ కమిట బాధ్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.