Babumohan
-
ORR Accidents: విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సైతం అనేక మంది ప్రముఖులను బలిగొన్నాయి. అక్కడ జరిగిన ఘోర ప్రమాదాల్లో వీఐపీలతో పాటు వారి కుటుంబీకులూ మృత్యువాతపడ్డారు. బాబూమోహన్ కుమారుడు పవన్ కుమార్ నుంచి ఎమ్మెల్యే లాస్య నందిత వరకు ఇలా అర్థాంతరంగా ఊపిరి ఆగిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో కొందరు ప్రయాణిస్తున్న వాహనాలు మితిమీరిన వేగంతో ఉండటం, మరికొందరు సీటు బెల్ట్‌లు, హెల్మెట్లు ధరించకపోవడం వారి పాలిట శాపాలయ్యాయి. 2000 ఏప్రిల్ 22: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ సమీపంలోని పాల్మాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాటి మంత్రి పి.ఇంద్రారెడ్డి అసువులు బాశారు. 2003 అక్టోబర్ 12: అప్పటి రాష్ట్ర కారి్మక శాఖ మంత్రి బాబూమోహన్ పెద్ద కుమారుడు పి.పవన్‌కుమార్ రసూల్‌పుర నుంచి జూబ్లీహిల్స్‌కు బైక్‌పై వస్తుండగా... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్ డివైడర్‌ను ఢీ కొట్టడంతో మృత్యువాతపడ్డాడు. 2010 జూన్ 20: ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్ హైదరాబాద్ శివార్లలోని ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. ఈయన ప్రయాణిస్తున్న హైస్పీడ్ ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2011 సెపె్టంబర్ 11: హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్రోడ్పైన పుప్పాలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. 2011 డిసెంబర్ 20: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. 2012 ఆగస్టు 21: మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్ తేజ ఓఆర్ఆర్పై దుర్మరణం చెందాడు. ఈయన ప్రయాణిస్తున్న కారు టరి్నంగ్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది. 2015 నవంబర్ 25: మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనుమడు వరుణ్ పవార్, బంధువు రాహుల్ పవార్ సహా ముగ్గురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న పాల వ్యాన్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. 2016 మే 17: మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను (క్రాష్ బ్యారియర్) బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే కన్నుమూశారు. 2017 మే 10: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ కుమారుడు పి.నిశిత్ నారాయణ, అతడి స్నేహితుడు కామని రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారు. -
టికెట్టు కోసం తండ్రీకొడుకులు పోటీ.. అందోలు బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ!
సాక్షి, మెదక్: అందోలు నియోజకవర్గ బీజేపీ టికెట్టు కోసం తండ్రీకొడుకులు పోటీ పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మొదటి నుంచి కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచే మాజీ మంత్రి బాబూమోహన్ టికెట్ల కేటాయింపు సమయంలో కుమారుడు ఉదయ్బాబూమోహన్ పేరు తెరపైకి రావడాన్ని ఆయన్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ► అందోలు ఎమ్మెల్యేగా 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది, 1999 సాధారణ ఎన్నికల్లో తిరిగి రెండోసారి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలో పట్టు సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా చేతిలో బాబూమోహన్ ఓడిపోయారు. ► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బాబూమోహన్ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌ను నిరాకరించడంతో బీజేపీ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ► ప్రస్తుతం 2023 ఎన్నికల్లో బీజేపీ 52 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో బాబూమోహన్ పేరు లేదు. ఆయన కుమారుడు ఉదయ్బాబూమోహన్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నందని, అందుకే మొదటి జాబితాలో అవకాశం దలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ► ఉదయ్బాబూ మోహన్ పేరును బీజేపీ తరఫున కేటాయిస్తున్నట్లు ప్రముఖ టీవీల్లో ప్రచారం కావడంతో నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. రెండు మాసాల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు జితేందర్‌రెడ్డి అందోలు టికెట్‌ను ఉదయ్‌బాబుకు ఇద్దామని బాబూమోహన్‌తో అన్నట్లు పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ► అప్పటి నుంచి ఉదయ్‌బాబును నియోజకవర్గానికి దూరంగా ఉంచేందుకు బాబూమోహన్ ప్రయత్నిస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు. అందోలు బీజేపీ టికెట్‌ను మా జీ జెడ్పీ చైర్మన్ బాలయ్య కూడా ఆశిస్తున్న విషయం తెలిసిందే. ► అందోలు టికెట్ తనకే కేటాయించాలని పార్టీ అధిష్టానవర్గంపై బాబూమోహన్ ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ టికెట్‌పై తండ్రీకొడుకుల మధ్యే పంచాయితీ ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. -
'అల్లుడిని ముందు పెట్టి కేసీఆర్ నడిపిస్తున్నారు'
సాక్షి, కరీంనగర్: దుబ్బాక సీపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో నిరాహారదీక్షకు దిగిన బండి సంజయ్‌ను మంగళవారం రోజున బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి హేయమైన చర్య. టీఆర్ఎస్ ఓటమి భయం, అధికార దాహంతో బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ గెలుపు ఖాయం అయిన నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని ప్రజల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారు. (పోలీసులే ఆ డబ్బు పెట్టారు: సంజయ్) దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అల్లున్ని ముందు పెట్టి కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారు. హరీష్ రావు కేంద్రం మీద ఏడవడం తప్ప, రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌కు అబద్ధాల విషయంలో డాక్టరేట్లు ఇవ్వొచ్చు. మీ పునాదులు దుబ్బాక ఫలితంతో కదలబోతున్నాయి' అని డీకే అరుణ టీఆర్ఎస్పై విమర్శలు సంధించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడితో పాటు మరో కార్యకర్తను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వారిని పోలీసులు వెంటనే విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. (భయపడొద్దు.. ఎదుర్కొందాం : కిషన్‌రెడ్డి) బీజేపీ నేత, మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ.. 'దుబ్బాక ఉపఎన్నికతో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు ముచ్చెమటలు పడుతున్నాయి. బీజేపీ గెలుస్తుందనే భయంతో హరీష్ రావు అలజడి సృష్టిస్తున్నారు. మామ అల్లుళ్ళ మెప్పుకోసం సీపీ ఏదైనా చేస్తాడు. సచ్చిపోయే వరకు అధికారంలో ఉంటామనే మామ అల్లుళ్ళ కళలు నిజం కావు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలి' అని బాబు మోహన్ అన్నారు. (డీకే అరుణ ఇంటి వద్ద హైడ్రామా) -
టికెట్ ఎందుకు నిరాకరించారో కేసీఆర్‌కే తెలియాలి
-
గులాబీ పార్టీలో తగ్గని అసమ్మతి
రాష్ట్ర శాసనసభ రద్దుతో పాటు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. జహీరాబాద్ మినహా జిల్లాలోని మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పేర్లను ఖరారు చేసి పది రోజులు కావస్తున్నా పార్టీ నేతల్లో నెలకొన్న అసమ్మతి పర్వానికి తెరపడడం లేదు. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు, అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చేందుకు ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పటాన్చెరు, నారాయణఖేడ్‌లో అసమ్మతి స్వరం తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రత్యేక దృష్టి సారించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నుంచి రాష్ట్ర శాసనభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జహీరాబాద్ స్థానంలో అభ్యర్థి పేరును ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. అందోలు నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ను తప్పించి, ఆయన స్థానంలో పాత్రికేయుడు క్రాంతి కిరణ్‌కు అవకాశం ఇచ్చారు. జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించి పది రోజులు కావస్తున్నా, అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసమ్మతి నేతలు స్వరం విప్పారు. పటాన్చెరు, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్‌లో పార్టీ ప్రకటించిన అభ్యర్థులను మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వినిపించాయి. ఉద్యమ సమయంలో పదవీ త్యాగం చేసిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వరంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ప్రెస్‌మీట్ నిర్వహించి తన ఆవేదన వెల్లగక్కారు. పటాన్చెరులో సపాన్‌దేవ్, గాలి అనిల్ కుమార్, కొలను బాల్‌రెడ్డి, జె.రాములు తదితర నేతలు ఉమ్మడి ప్రెస్మీట్లో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్‌లో పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని మార్చాలంటూ అసమ్మతి నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యేకు సహకరించేది లేదని హత్నూర జెడ్పీటీసీ సభ్యులు జయశ్రీ తదితరులు తెగేసి చెప్పారు. అసమ్మతి వర్గంతో మంతనాలు.. పార్టీలో నెలకొన్న అసమ్మతిని అభ్యర్థులే పరిష్కరించుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం నుంచిసంకేతాలు అందాయి. అసమ్మతికి దారితీస్తున్న కారణాలను విశ్లేషించుకుని పనితీరు మార్చుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన పార్టీ అభ్యర్థుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పార్టీ వైఖరిని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ సంకేతాలను సీరియస్‌గా తీసుకున్న సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు అభ్యర్థులు అసంతృప్తి నేతలతో వరుసగా మంతనాలు జరుపుతున్నారు. నేరుగా వారికి ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా మరోమారు అవకాశం దక్కించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం అసమ్మతి నేతలతో దూరం పాటిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రోజురోజుకూ విభేదాలు మరింత తీవ్రం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసమ్మతి నేతలతో హరీశ్ భేటీ.. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తున్న నేతలతో మంత్రి హరీశ్‌రావు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. సపాన్‌దేవ్, అనిల్‌కుమార్, బాల్‌రెడ్డి, జయరాములుతో పాటు కొందరు తాజామాజీ సర్పంచ్‌లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని హరీశ్ అసమ్మతి నేతలకు సర్ది చెప్పినట్లు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు సమయం తీసుకుంటానని హామీ ఇవ్వడంతో బుధవారం వరకు వేచి చూడాలని అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతలు నిర్ణయించుకున్నారు. సంగారెడ్డిలో అసమ్మతి నేతలతో సఖ్యత కోసం పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ సొంత ప్రయత్నాలు చేస్తుండగా, ఒకరిద్దరు నేతలతో త్వరలో హరీశ్ భేటీ కానున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అసమ్మతి నేతలతో సంప్రదింపుల బాధ్యతను పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌కు అప్పగించారు. ఇప్పటికే ఒక దఫా అసమ్మతి నేతలతో హరీశ్ సమావేశం కాగా, మరోసారి పూర్తి స్థాయిలో భేటీ జరపాలని నిర్ణయించారు. జిల్లాలోని అసమ్మతి నేతల జాబితాపై ఇప్పటికే స్పష్టత వచ్చిందని, వారం రోజుల్లో పార్టీలో అసమ్మతి, అసంతృప్తి సమసిపోతుందని భేటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న నేత ఒకరు వ్యాఖ్యానించారు. పటాన్చెరు, నర్సాపూర్‌కు చెందిన ఇద్దరు అసమ్మతి నేతలు మాత్రం టికెట్ దక్కకుంటే వేరే పార్టీలోకి వెళ్తామంటూ సంకేతాలు ఇస్తున్నారు. -
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
-
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
‘‘అందరూ జన్మిస్తారు. జీవిస్తారు. మరణిస్తారు. కొంత మంది మరణించినా శాశ్వతంగా గుండెలో ఎప్పూడు చెరగని ముద్ర వేసి జీవిస్తారు. అలాంటి కోవకు చెందిన మనిషి శ్రీదేవి’’ అన్నారు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి. ప్రముఖ సినీతార శ్రీదేవి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి శ్రీదేవితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ–‘‘ భారతదేశ చలనచిత్రరంగంలో శ్రీదేవి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులు అభిమానించారు. హిందీలో చాందినీగా ఆకట్టుకున్నారు. ఆవిడ మరణవార్త విని దేశం మొత్తం షాక్ అయ్యింది. ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. శ్రీదేవితో మా అమ్మాయి పింకీ రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేది. శ్రీదేవి ఎంత పెద్ద ఆర్టిస్టో అంత మంచి హ్యూమన్ బీయింగ్. ఎంత ఎత్తు ఎదిగినా రూట్స్‌ని మరిచిపోలేదు. అంత గొప్ప నటి, శక్తి స్వరూపిణి దూరమైయేసరికి కోట్లాది అభిమానులు తమ అభిమానాన్ని, దుఃఖాన్ని చూపించారు. బోనీ కపూర్, శ్రీదేవి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడు వాళ్లు విడిగా వచ్చేవారు కాదు. శ్రీదేవి మరోజన్మలోను శ్రీదేవిలానే పుట్టాలి. తెలుగమ్మాయిగానే పుట్టాలి. మా శ్రీదేవి మళ్లీ వచ్చిందనుకోవాలి’’ అన్నారు. ప్రముఖ గాయని సుశీల మాట్లాడుతూ–‘‘ దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య శ్రీదేవి. మనల్ని మైమరపించి మళ్లీ తన లోకానికే వెళ్లిపోయింది. 8 ఏళ్ల వయసులో శ్రీదేవికి పాట పాడాను. అంతేకాదు ఆమె మొట్టమొదటి సినిమాకు కూడా పాట పాడాను. మనకు ఎన్నో తీపిగుర్తులను మిగిల్చి తను వెళ్లిపోయింది’’ అన్నారు.‘‘శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాల్లో నటించాను. ఆమె నిగర్విగా ఉండేది’’ అన్నారు నటుడు కోటశ్రీనివాసరావు. ‘‘శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నన్ను ఎప్పుడూ సార్ అని పిలిచేది. ఆమెకు పెద్దలంటే ఎంతో గౌరవం. ఇప్పుడు ఆమె లేదు అంటే నమ్మబుద్ది కావడం లేదు. దేశం గర్వించదగ్గ నటి శ్రీదేవి. ఆమె మరణించినా..సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారామె’’ అని అన్నారు కృష్ణంరాజు. ‘‘ శ్రీదేవి మరణవార్త విన్న తర్వాత ఎంతో దుఃఖించాను. తెలుగు అమ్మాయిగా ఎంతో సాధించింది. జీవితంలోని ప్రతి అడుగును ఒక లక్ష్యంగా చేసుకుని నడిచింది. ప్రతి పాత్రను ఒక సవాలుగా తీసుకునేది శ్రీదేవి. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారు శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటారు. శ్రీదేవి గొప్ప నటి మాత్రమే కాదు. మంచి మాతృమూర్తి కూడా. తనలాగే జాన్వీని కూడా తీర్చిదిద్దాలని అనుకున్నారు. జాన్వీ మంచి నటిగా రాణించాలని కోరుకుంటున్నాను’’అన్నారు నటి జయప్రద. ‘‘శ్రీదేవి మరణవార్తను జీర్ణించుకోలేకపోయాను. శ్రీదేవి కుటుంబంతో మా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మరిచిపోలేక పోతున్నాను. జాన్వీ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు నటి జయసుధ. ‘‘శ్రీదేవితో కలిసి నటించలేదు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమెతో ఓ సినిమాలో నటించే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. ఆమె దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలే. ముంబైలో జరిగిన శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లాలి అనుకున్నాను. కానీ..కుదర్లేదు. ఇప్పుడు సంస్మరణసభలో పాల్గొనే అవకాశం వచ్చింది’’ అన్నారు హీరో రాజశేఖర్. ‘‘1972లో ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవిని చూసిన మొదటి రోజే గొప్ప నటి అవుతుందని అనుకున్నాను. రామానాయుడు ఆమెను ‘దేవత’ను చేస్తే..ఎన్టీఆర్ ఆమెను ‘అనురాగదేవత’ను చేశారు’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘శ్రీదేవి సెట్లో ఎవర్ని బాధపెట్టలేదు. కానీ చనిపోయి అందర్నీ నొప్పించింది’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవి నటన చూసి, గొప్ప నటి అవుతుందనుకున్నాను’’ అన్నారు నటుడు బాబుమోహన్. ‘‘శ్రీదేవితో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. శ్రీదేవితో నటించే అవకాశం దక్కనందుకు బాధపడుతున్నాను. శ్రీదేవి లాంటి హీరోయిన్ కావాలని కోరుకునే వారిలో నేనూ ఉన్నాను’’ అన్నారు హీరోయిన్ నివేధా థామస్. రేలంగి నరసింహరావు, అమల, శ్రీకాంత్, అల్లు అరవింద్, జగపతిబాబు, సుమంత్, ఆలీ, శివాజీ రాజా, నరేశ్, ఉపాసన కామినేని తదితరులు పాల్గొన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రముఖుల ఇంట విషాదాలు!
►కుమారుల్ని కోల్పోయిన వారే ఎక్కువ ►మితిమీరిన వేగమే ప్రధాన కారణం ►చాలా ప్రమాదాలు ఓఆర్ఆర్ పైనే.. సిటీబ్యూరో: సిటీ కేంద్రంగా తరచుగా ప్రముఖుల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు అనేక మంది వీఐపీల వారసుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అత్యధికం మితిమీరిన వేగం వల్ల జరిగినవే. ఈ దుర్ఘటనల్లో కుమారుల్ని కోల్పోయిన ప్రముఖులే ఎక్కువగా ఉంటున్నారు. వీటిలో ఎక్కువగా ఓఆర్ఆర్పై జరిగినవే ఉన్నాయి. ప్రమాదానికి కారణమైన వాహనాలు సైతం హైస్పీడ్, ఇంపోర్టెడ్వి కావడం గమనార్హం. ►2003 అక్టోబర్ 12న అప్పటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాబూమోహన్ పెద్ద కుమారుడు పి.పవన్‌కుమార్ రసూల్‌పుర నుంచి జూబ్లీహిల్స్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్ డివైడర్‌ను ఢీకొనడంతో చనిపోయారు. ►2010 జూన్ 20న ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్ హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. ఈయన ప్రయాణిస్తున్న హైస్పీడ్ ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ►2011 సెప్టెంబర్ 11న హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్రోడ్పైన పుప్పాలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. ఆ సమయంలో ఈయన ప్రయాణిస్తున్న హైఎండ్ బైక్ ప్రమాదానికి గురైంది. ►2011 డిసెంబర్ 20న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. దీంతో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. ►2012 ఆగస్టు 21న మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్ తేజ ఓఆర్ఆర్పై దుర్మరణం చెందారు. ఈయన ప్రయాణిస్తున్న కారు టర్నింగ్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది. ►2015 నవంబర్ 25న మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనుమడు వరుణ్ పవార్, బంధువు రాహుల్ పవార్ సహా ముగ్గురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న పాల వ్యాన్‌ను బలంగా ఢీ కొంది. ►2016 మే 17న మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను (క్రాష్ బ్యారియర్) బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి (52), డ్రైవర్ స్వామిదాసు (52) అక్కడిక్కడే కన్నుమూశారు. -
'బాబూమోహన్ కు మతిభ్రమించింది'
ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ మతిభ్రమించి ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అల్లాదుర్గం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాల్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అల్లాదుర్గంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రిలే దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. అల్లాదుర్గం మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని ప్రజలు ఆందోళనలు చేపడితే ఎమ్మెల్యే బాబూమోహన్ పనీపాటలేని వారు దీక్షలు చేస్తున్నారని మాట్లాడటంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఆందోళనలు, దీక్షలు చేసే సాధించుకున్న విషయం గుర్తుచేసుకోవాలన్నారు. తెలంగాణ కోసం రాష్ట్రం మొత్త ఆందోళనలు చేస్తుంటే ఒక్క రోజు ఆందోళనలో ఎమ్మెల్యే పాల్గొన లేదని, ఆంధ్ర పార్టీ తెలుగు దేశంలో ఉన్నారని, ఇప్పుడు టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే పదవి చేపట్టి ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాలన్నారు. దీక్షా శిబిరంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు శేషారెడ్డి, కాయిదంపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు. -
బోరుబావిలో చిన్నారి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో బోరు బావిలో పడిపోయిన బాలుణ్ని కాపాడేందుకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ డీ ఆర్ ఎఫ్) బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా రాకేశ్ ను బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ఎల్ అండ్ టి కంపెనీకి చెందిన భారీ యంత్రాలతో బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. అయితే బండరాళ్లు అడ్డుపడటం సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. కాగా, రాకేశ్ బావిలో పడిపోయి 24 గంటలు గడుస్తుండటంతో అతడి పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. తల్లిదండ్రులు బైరు సాయిలు, మొగులమ్మలు సహా బంధుగణం కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. శనివారం ఉదయం సోదరుడు బాలేష్‌తో ఆడుకుంటున్న సమయంలో రాకేశ్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రాత్రికిరాత్రే వేసి, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బోరును వదిలిళ్లడం ప్రమాదానికి కారణమైంది. అభం శుభం తెలియని పసిబిడ్డలను బోరుబావులు నిర్ధాక్షిణ్యంగా మింగేస్తున్నాయని, విఫలమైన బోరుబావులతో ప్రమాదం పొంచి ఉందని ‘సాక్షి’ పలుమార్లు హెచ్చరించింది. వాటి పూడ్చివేత కోసం అక్షర ఉద్యమం చేపట్టినా అనర్థాలు పునరావృతమవుతుండటం దారుణం. సోదరుడు చెప్పడంతో.. సోదరుడు రాకేష్ బోరులో పడిపోయిన విషయం బాలేష్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్థులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. తాడు, కొక్కాలు వేసి లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమయంలోనే కొంత మట్టి బోరులోకి పడినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటలకు సమాచారం అందుకున్న 108 సిబ్బంది 12 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకొని 8.22 నిమిషాలకు బోరుబావిలోకి ఆక్సీజన్ అందించారు. వెల్దుర్తి నుంచి శ్రీనివాస్ అనే యువకుడిని పిలిపించి నైట్ విజన్ కెమెరాలు బోరుబావిలోకి పంపించి రాకేష్ ఉన్న స్థానాన్ని గుర్తించారు. 30 ఫీట్ల లోతులో తలకిందులుగా ఉన్నట్టు, చుట్టూ మట్టి పేరుకుపోయినట్టు నిర్ధారించారు. స్థానికంగా లభించిన మూడు జేసీబీలు, బయటి నుంచి మూడు 200 సీసీ, రెండు 70సీసీ హిటాచి యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. వాటి ద్వారా బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు చేపడుతున్నారు. అడ్డుపడుతున్న బండ రాళ్లు... భూమి పైపొరలోనే పెద్ద పెద్ద బండరాళ్లు రావటంతో జేసీబీలతో పని సాధ్యం కావడంలేదు. రాత్రి 11.45గంటల వరకు కేవలం 15 ఫీట్లలోతు గుంతను మాత్రమే తవ్వగలిగారు. 10 ఫీట్ల లోతులో మరో పెద్ద బండరాయి అడ్డుపడింది. దీన్ని బయటికి పెకిలించేందుకు మూడు హిటాచీలు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. గుంటూర్ నుంచి నిపుణులు... ఈ బండరాళ్లు కోయడానికి హైదరాబాద్ నుంచి విపత్తు నివారణ యాజమాన్యం బృందాన్ని, గుంటూరు నుంచి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ బృందాన్ని రప్పిస్తున్నామని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ మీడియాతో చెప్పారు. ఆదివారం వారితో బండరాయిని కోయిస్తామని చెప్పారు. జోగిపేట సీఐ నాగయ్య, పుల్కల్ ఎస్ఐ సత్యనారాయణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సహాయక చర్యలను ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్ ప్రకటించారు. ఆయన ఉదయం నుంచి సంఘటన స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి సాయంత్రం వేళలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాబూమోహన్, కలెక్టర్ రోనాల్డ్ రాస్ సందర్శించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కొద్దిసేపు అక్కడే ఉండి సహాయక చర్యలను సమీక్షించారు. -
తాగి చనిపోతే మరిచిపోయేవాడిని: బాబూమోహన్
హైదరాబాద్: ‘మద్యం తాగి వాహనాలను నడపడం తప్పు. దీని వల్ల బతుకు చీకటవుతుంద’ని ప్రముఖ సినీ హాస్య నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. గోషా మహల్ ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సోమవారం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘తాగే హక్కు మీకున్నా... మీ శరీరం కృశించిపోయేలా చేసుకునే హక్కు మీకు లేదు. మీపై ఆధాపడిన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మీరు వస్తారని ఆశిస్తుంటారు. మీరు తాగి... ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబం రోడ్డున పడుతుంద ’ని హెచ్చరించారు. ఎదురుగా వస్తున్న వ్యక్తులు ఏ పరిస్థితుల్లో ఉంటారో... ఎవరి కుటుంబం రోడ్డున పడుతుందో చెప్పలేమన్నారు. తాగినప్పుడు శరీరం మన ఆధీనంలో ఉండదని... అటువంటి సమయంలో ప్రమాదం తప్పదన్నారు. ‘మా అబ్బాయి కారులో వస్తూ... తాగి చనిపోతే మరిచిపోయేవాడిని. కానీ రోడ్డు దాటుతున్న చిన్నారిని తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి తలకు డివైడర్ తగిలి చనిపోయాడ’ని కొడుకు మరణాన్ని తలచుకొని బాబూమోహన్ కంటతడి పెట్టారు. బైకులు, కార్లు అతివేగంగా నడపడం నేరమని.. ప్రమాదంలో కుటుంబాన్ని పోషించాల్సిన మీరే అంగవైకల్యంతో ఇంట్లో పడితే ఆ భారం ఎవరు మోస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్, ప్రముఖ దర్శకుడు వేముగంటి, గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ జైపాల్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, హరినాథ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
మద్యంతో బతుకు చీకటి
నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ కొడుకు మరణాన్ని తలచుకొని కంటతడి కలెక్టరేట్: ‘మద్యం తాగి వాహనాలను నడపడం తప్పు. దీని వల్ల బతుకు చీకటవుతుంద’ని ప్రముఖ సినీ హాస్య నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. గోషా మహల్ ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సోమవారం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘తాగే హక్కు మీకున్నా... మీ శరీరం కృశించిపోయేలా చేసుకునే హక్కు మీకు లేదు. మీపై ఆధాపడిన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మీరు వస్తారని ఆశిస్తుంటారు. మీరు తాగి... ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబం రోడ్డున పడుతుంద ’ని హెచ్చరించారు. ఎదురుగా వస్తున్న వ్యక్తులు ఏ పరిస్థితుల్లో ఉంటారో... ఎవరి కుటుంబం రోడ్డున పడుతుందో చెప్పలేమన్నారు. తాగినప్పుడు శరీరం మన ఆధీనంలో ఉండదని... అటువంటి సమయంలో ప్రమాదం తప్పదన్నారు. ‘మా అబ్బాయి కారులో వస్తూ... తాగి చనిపోతే మరిచిపోయేవాడిని. కానీ రోడ్డు దాటుతున్న చిన్నారిని తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి తలకు డివైడర్ తగిలి చనిపోయాడ’ని కొడుకు మరణాన్ని తలచుకొని బాబూమోహన్ కంటతడి పెట్టారు. బైకులు, కార్లు అతివేగంగా నడపడం నేరమని.. ప్రమాదంలో కుటుంబాన్ని పోషించాల్సిన మీరే అంగవైకల్యంతో ఇంట్లో పడితే ఆ భారం ఎవరు మోస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్, ప్రముఖ దర్శకుడు వేముగంటి, గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ జైపాల్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, హరినాథ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
హోల్ ఆంధ్రాలో సోలో అందగాడు
హిట్ క్యారెక్టర్ సినిమా పేరు : మామగారు (1991) డెరైక్ట్ చేసింది : ముత్యాల సుబ్బయ్య సినిమా తీసింది : ‘ఎడిటర్’ మోహన్ మాటలు రాసింది : తోటపల్లి మధు ‘హోల్ ఆంధ్రాలో సోలో అందగాడు’ ఎవరో తెలుసా? ఇంకెవరు మన బాబూమోహనే. ‘ఈ ప్రశ్నకి బదులేది?’ సినిమాలో రెండు సీన్ల రిక్షావాడి వేషంతో ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యింది. ‘అంకుశం’లో ‘పాయే పాయే’ అంటూ ఓ మెరుపులా మెరిశాడు. ‘మామగారు’లో ముష్టివాడి వేషంతో గవర్నమెంట్ ఉద్యోగం మానేసేంత బిజీ అయిపోయాడాయన. కోట శ్రీనివాసరావు-బాబూమోహన్‌ల కాంబినేషన్ అంటే అప్పట్లో బాక్సాఫీస్‌కి ఓ మంచి కిక్. ‘మామగారు’ తర్వాత కోట-బాబూ మోహన్ కలిసి చాలా చాలా సినిమాలు చేశారు. బాబూమోహన్‌ను కోట కాలితో తన్నే సీన్లు, బాబూమోహన్ కౌంటర్లు... ఇవన్నీ ‘మామగారు’ విజయంలో మసాలా దినుసులు. ఆ ఊళ్లో మోస్ట్ బిజీయెస్ట్ ఖాళీగా ఉండే పర్సన్ అంటే ఒకే ఒక్కడు. పేరు పోతురాజు. పైన పటారం లోన లొటారం టైపు. సిల్కు చొక్కా మడత నలగకుండా తెగ బిల్డప్పులిచ్చేస్తుంటాడు. ఇస్త్రీ లేకుండా చెడ్డీ కూడా వేసుకోనని తెగ కోతలు కూడా కోస్తుంటాడు. ఇలా ఎన్ని చేసినా ఊళ్లో ఒక్కడంటే ఒక్కడు కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. వీధి అరుగు మీద కూర్చుని దారిన పోయే వాళ్లని పేకాట ఆడదాం రారండోయ్ అంటూ ఇన్వైటింగ్ చేసేస్తుంటాడు. అందరూ ఛీకొట్టి పోతుంటారు. దాంతో పోతురాజుకి ఎక్కడో కాలుతుంది. ఎవడో ఒకణ్ణి తన వెంట బంటులాగా తిప్పుకోవాలని ట్రయ్యింగ్ చేస్తుంటాడు. చివరకు ఒక బకరా దొరుకుతాడు. ఆ ఊరికి హోల్ అండ్ సోలో ముష్టివాడు. ఇతగాడికి నలుపు రంగెక్కువ. పొట్ట ఎక్కువ. దానికి ఆకలెక్కువ. ఫైనల్‌గా వీడికి టెక్కు కూడా ఎక్కువే. ఫర్ ఎగ్జాంపుల్... ఓ ఇంటి ముందు నిలబడి ‘అంబే’ అని అరుస్తూ అడుక్కుంటుంటాడు. ఆ ఇంటావిడ పోన్లే పాపం అని ప్లేట్ నిండా ఫుడ్ ఐటమ్స్ తీసుకుని బయటికొస్తుంది.‘‘ఆ పిలుపేంట్రా..! ‘అంబే’ అని అరిచేది నువ్వో, గేదో తెలీక చస్తున్నాం’’ అంది కోపంగా.‘‘మా తాతల కాలం నుంచి ‘అమ్మా’ అని అడుక్కోవడం మామూలైపోయింది. అందుకే వెరైటీగా ఉంటుందని ‘అంబే’ అంటున్నా. ఏమ్మా! గొంతు బాలేదా?’’ అని గోరోజనంగా అడిగాడు వాడు. ఆవిడకు తిక్కరేగి, ‘‘నీది పెద్ద ఘంటసాల గొంతు మరీ’’ అని విసుక్కుని తాను తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అతని ప్లేట్లోకి వంపింది. వాడు చాలా చిరాగ్గా ఈ ఐటమ్స్ వంక చూసి ‘‘ఏంటమ్మా ఇది... చారా? ఈ చారులు, పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత చేపల కూరో, చికెన్ కూర్మానో వండొచ్చు కదా’’ అని గొణిగాడు.‘‘నిన్ను కాష్ఠంలో పెట్టా! నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగర్రా. పోరా పో’’ అని కోపంగా గుడ్లురిమిందామె. ‘‘పోతాం లేమ్మా! పోకపోతే నీతో కాపురం చేస్తామా... నీ ఇల్లు కాకపోతే వంద ఇళ్ళు’’ అని విసురుగా పోయాడు వాడు. పోతురాజు అరుగు మీద దర్జాగా కూర్చుని ముష్టివాణ్ణి పిలిచాడు. ‘‘ఏంటన్నా’’ అంటూ వచ్చి సరాసరి పోతురాజు పక్కనే సెటిలయ్యాడు వాడు.పోతురాజు వాడివైపు ఎగాదిగా చూసి ‘‘ఏంట్రా నల్లపెంకు... నా పక్కన కూర్చున్నావ్. నీకూ నాకూ ఎంత తేడా ఉందో తెలుసా?’’ అని హూంకరించాడు. వాడు ఏ మాత్రం తగ్గలేదు. ‘‘తెలుసన్నా... కనీసం నేను అడుక్కుంటున్నాను. నువ్వు అది కూడా చేయడం లేదు కదా’’ చెప్పాడు వాడు టెక్కుగా. ‘‘ఏంట్రోయ్... పది కొంపల పులుసు తినేసరికి ఒళ్లు బలిసిందిరా నాయాలా... వెళ్లు... కింద కూర్చో’’ అని గట్టిగా అరిచాడు పోతురాజు. దాంతో వాడు కింద కూర్చున్నాడు. ‘‘ఒరేయ్ సీమపంది... చిల్లర ఎంతుందిరా?’’ అడిగాడు పోతురాజు. వాడు ఏ మాత్రం తడుముకోకుండా ‘‘జేబులోనా? బ్యాంకులోనా?’’ అన్నాడు.‘‘ఆ... నీ మొహానికి బ్యాంకు ఎకౌంటు ఒకటా?’’ ‘‘ఏం నీకు లేదా?’’‘‘ముయ్... ఎదవ ప్రశ్నలేశావంటే నరుకుతా. తొందరగా తినడం పూర్తి చేసిరా. ఒక ఆట వేసుకుందాం. చేయి గులగుల్లాడిపోతోంది.’’ ‘‘ఉండన్నా! ముందు అన్నం తినాలి. ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది.’’ ‘‘ఏం కూరల్రా?’’ ‘‘ఏం ఉందిలే అన్నా... చేపల పులుసు.. చింత చిగురు పప్పు.. కోడిగుడ్ల ఫ్రై... రెండు పచ్చళ్లు... మీ ఇంట్లోంచి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది.’’‘‘తమరు తినే భోజనం ప్రైమ్‌మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేడు. అదృష్టవంతుడివి.’’‘‘గొంతు సవరించి గట్టిగా ‘అబ్బా’ అని అరువ్. నా అదృష్టం నీక్కూడా పట్టుద్ది.’’ ‘‘అంటే నన్ను కూడా అడుక్కోమంటావా’’ అంటూ వాడి మీద ఇంతెత్తున లేచి కాలితో ఒక్క తన్ను తన్నాడు పోతురాజు. పొలం గట్ల మీద పోతురాజు దొరబాబులాగా నడుస్తుంటే, వెనుక గొడుగు పట్టుకుని ముష్టివాడు. ఒకడెవడో తనను చూసి దణ్ణం పెట్టలేదని చాచి ఒక్క లెంపకాయ ఇచ్చాడు పోతురాజు. ఇంకొకడు నడుముకు తుండుగుడ్డ కట్టుకున్నాడని వాడికీ క్లాస్ పీకాడు. ఆ ఊరి ప్రెసిడెంట్‌కి సొంత బావనైన తనను అందరూ రెస్పెక్టింగ్ చేసెయ్యాలన్నది పోతురాజుగారి ఉద్దేశం. ఇది ముష్టివాడు కనిపెట్టేశాడు. నీ అజమాయిషీ గురించి నువ్వే చెప్పుకుంటుంటే చీపుగా ఉంది. నీ లెవెల్‌ని నేను ఎడల్పు చేస్తా పదా’’ అన్నాడు ముష్టివాడు. పోతురాజు ముందు నడుస్తున్నాడు. వెనుక ముష్టివాడు.ఒకడు కాల్వలో ఎద్దును కడుగుతున్నాడు. వాడి ఒంటి మీద గోచి గుడ్డ మినహా ఇంకేం లేదు. ‘‘రేయ్ రా... అలా తుమ్మమొద్దులా నిలబడి చూస్తున్నావ్... రారా’’ అని పిలిచాడు ముష్టివాడు. వాడు దండాలు పెట్టుకుంటూ వచ్చాడు. ‘‘ఈయనెవర్రా? ప్రెసిడెంట్‌గారికి బావగారు. అంటే ఓసీగా తిని తిరిగే ఎదవ కాదుగా. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోచీ కట్టుకుని నిలబడతావా? ముందా గోచీ తియ్యి’’ అని ముష్టివాడు మీద పడి రక్కినంత పని చేసేసరికి, వాడు విప్పేసి దీనంగా... నగ్నంగా పోతురాజు ముందు నిలబడ్డాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని రెండు కళ్లతో చూడలేక కెవ్మని అరిచి, కయ్‌మని ముష్టివాడు మీద కాలెత్తాడు పోతురాజు. పాపం పరిస్థితులు అనుకూలించక పోతురాజు కూడా వీధి అరుగు మీద పడుకోవాల్సిన పరిస్థితి. ఆ పక్క బెడ్ - ముష్టివాడిది. పొద్దునే ఒకడొచ్చి ముష్టివాణ్ణి నిద్రలేపి ‘‘అన్నా... నీకు టీ’’ అని ఇచ్చాడు. పక్కనే ఉన్న పోతురాజు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ‘‘ఈడు నా అసిస్టెంట్’’ అని పరిచయం చేసి ‘‘ఏరా పేపర్ తెచ్చావా?’’ అనడిగాడు ముష్టివాడు. ‘‘ఇంగ్లీషు పేపర్ రాలేదన్నా. తెలుగు పేపర్ తెచ్చా’’ చెప్పాడు వాడు వినయంగా. ముష్టివాడు విసుగ్గా ‘‘ఊ... తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటాయ్’’ అనుకుంటూ ఆ పేపర్ తిరగేస్తుంటే పోతురాజు షాక్. ‘‘రేయ్... నువ్వెళ్లి కాకా హోటల్లో నా కోసం చికెన్ కూర్మా, పరోటాలు రాత్రివి ఉంటాయి. తీసుకొచ్చేశేయ్’’ అని అసిస్టెంటుకి పురమాయించి, ముష్టివాడు మళ్లీ పేపర్లో మునిగిపోయాడు. ఇదంతా చూసి పోతురాజుకు నోట మాట రాలేదు. రేడియోలో న్యూస్ వింటూ గుడి బయట దర్జాగా అడుక్కుంటున్నాడు ముష్టివాడు. ఒకతను వచ్చి 10 పైసలు దానం చేసి వెళ్లబోయాడు. ఈ ముష్టివాడు అతణ్ణి పిలిచాడు. ‘‘ఇదిగో పెద్దాయినా... పది పైసలు ముష్టి వేసి తార్రోడ్డు మీద డెరైక్ట్‌గా స్వర్గానికి వెళ్లిపోదామనే. చేయి చాపు... దీనికి యాభై పైసలు కలిపి ఇస్తున్నా. నా పేరు చెప్పి టీ తాగు పో..’’ అనేసి, అతణ్ణి పంపించేశాడు. పక్కకు తిరిగి చూస్తే పోతురాజు దేభ్యం మొహం వేసుకుని కూర్చున్నాడు.‘‘అన్నా! నీ వాటం చూస్తే తేడా కొడుతోంది. నీ మావ పోస్టు పాయే. నాన్న పోస్టు పాయే. పోన్లే... నా పోస్టు ఇస్తా... తీస్కో’’ అంటూ ముష్టివాడు తన అమ్ములపొదిలో అస్త్రం లాంటి బొచ్చెను పోతురాజుకు బహూకరించేసి వెళ్లిపోయాడు. ఆ బొచ్చెనూ, వాణ్ణీ అలాగే చూస్తూ శిలా విగ్రహంలా ఉండిపోయాడు పోతురాజు. అంతకు మించి ఏం చేయగలడు? ఎదుటోణ్ణి బకరా చేద్దామనుకుంటే మనమే బకరా అయిపోతాం మరి! - పులగం చిన్నారాయణ ఈ పాత్రకు ముందు బ్రహ్మానందాన్ని అనుకున్నారు! తమిళంలో సూపర్ హిట్ అయిన ‘నాన్ పుడిచ్చ మాపిళ్లయ్’ని తెలుగులో ‘మామగారు’గా రీమేక్ చేశారు ‘ఎడిటర్’ మోహన్. ఒరిజినల్ వెర్షన్లో గౌండ్రమణి-సెంథిల్‌పై చిన్న కామెడీ ట్రాక్ ఉంది. దాన్ని ‘అహ నా పెళ్లంట’ తరహాలో కోట-బ్రహ్మానందంపై చేద్దామన్నారు ‘ఎడిటర్’ మోహన్. నాకేమో ఆ పాత్రకు బ్రహ్మానందం కంటే బాబూమోహన్ అయితే కరెక్ట్ అనిపించింది. అంతకు ముందే ‘అంకుశం’లో అతని యాక్టింగ్ చూసి ఇంప్రెసయ్యా. ‘ఎడిటర్’ మోహన్ కూడా కోట-బాబూమోహన్ కాంబినేషన్‌కు ఓకే చెప్పారు. తమిళ వెర్షన్ కన్నా బ్రహ్మాండంగా ట్రాక్ పెంచి రాశా. షూటింగ్ టైమ్‌లోనే అందరూ తెగ ఎంజాయ్ చేశారు. ఎక్స్ట్రార్డినరీగా వర్కవుట్ అయ్యిందీ ఎపిసోడ్. ఈ సినిమా తర్వాత కోట-బాబూమోహన్ కాంబినేషన్ లేకుండా దాదాపుగా ఎవ్వరూ సినిమాలు చేయలేదు. అంతలా సూపర్హిట్టయ్యిందీ కాంబినేషన్. ‘ఏ ముహూర్తాన రాశారో కానీ అదిరిపోయిందయ్యా’ అంటూ కోట-బాబూమోహన్ ఎప్పుడు కనిపించినా నన్ను అభినందిస్తుంటారు. - తోటపల్లి మధు, రచయిత -
సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా
జోగిపేట,న్యూస్‌లైన్: ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చానని అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ పేర్కొన్నారు. ఆదివారం అందోల్ మండలం డాకూర్ గ్రామంలో ఆయనను వివిధ కుల సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది యువకులు, విద్యార్థుల ఆత్మబలిదాన ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అందుకే తన విజయాన్ని అమరులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఎదుటి పార్టీ వారు తనను అవమాన పరిచే విధంగా ప్రకటనలు చేశారన్నారు. తన పార్టీ కార్యకర్తలు, నాయకులు తన విజయానికి కృషి చేశారన్నారు. వారికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా తన విజయానికి తోడ్పడ్డాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను, కార్యకర్తలను పలకరించాలనుకున్నానని, అయితే ఈ లోగానే కార్యకర్తలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ రావడం తనకు బాధ కల్గించిందన్నారు. అందుకే పెళ్లిళ్లకు హాజరవుతూ ముఖ్యమైన కార్యకర్తలను కలుసుకుంటున్నానన్నారు. దండలు, శాలువాలు తేవద్దు తాను నియోజకవర్గంలో పర్యటించేప్పుడు శాలువాలు, పూలదండలు తీసుకరావద్దని ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు. తాను గ్రామాలకు వచ్చినప్పుడు కేవలం సమస్యలు చెబితే చాలునన్నారు. అనవసరంగా డబ్బులు వృధా చేయవద్దని కోరారు. డాకూర్‌లో సన్మానం డాకూర్ గ్రామంలో బాబూమోహన్, మాజీ ఎంపీ పి.మాణిక్రెడ్డిలకు కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. సర్పంచ్ ఏ.శంకరయ్య, మాజీ సర్పంచ్ తమ్మళి శ్రీనివాస్, కురుమ సహకార సంఘం చైర్మన్ రొడ్డ క్రిష్ణయ్య తదితరులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జి.లింగాగౌడ్, డీబీ నాగభూషణం, పిట్ల లక్ష్మణ్, సీహెచ్.వెంకటేశం, జగదీశ్, జి.రవీందర్‌గౌడ్, డాకూరి నాగభూషణంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా గెలుపు ప్రజలకే అకింతం అల్లాదుర్గం రూరల్: తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అందోల్ ప్రజలకే తన విజయాన్ని అకింతమిస్తున్నట్లు ఎమ్మెల్యే బాబుమోహన్ పేర్కొన్నారు. ఆదివారం అల్లాదుర్గం మండలంలో పోతులబోగుడలలో ఓ వివాహనికి ఆయన హాజరయ్యారు. అనంతరం వట్పల్లి వెంకట ఖాజా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని, వారికి సేవలందించి కృతజ్ఞతతో ఉంటానన్నారు.అలాగే అవినీతి లేని పాలన అందిస్తానన్నారు. మరో సారి సేవ చేయడానికి అవకాశం కల్పించిన అందోల్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. వట్పల్లి టీఆర్ఎస్ నాయకులు బాబుమోహన్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు మాజీ ఎంపీపీ కాశీనాథ్, మరవెళ్లి ఎంపీటీసీ సభ్యులు భిక్షపతి, శివాజీరావు, ఉదయ్‌కిరణ్, నాయకులు సుభాష్రావ్, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు అశోక్‌గౌడ్, కుత్బుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, ఖాజాపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
‘అందోల్’లో దామోదర్ దే రికార్డు
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సి.దామోదర రాజనర్సింహ కాగా అతితక్కువ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. 1999 సాధారణ ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి బాబూమోహన్ చేతిలో 513 ఓట్లతో దామోదర ఓటమి చెందగా 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్‌ను 24,846 ఓట్ల మెజార్టీతో ఓడించారు. అప్పట్లో దామోదరకు 67,703 ఓట్లు రాగా బాబూమోహన్‌కు 42,857 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో బాబూమోహన్ 2906 ఓట్లతో ఓటమి చెందగా 2014 ఎన్నికల్లో 3208 ఓట్లతో దామోదర రాజనర్సింహ ఓటమి చెందారు. అయితే ఈ ఎన్నికల్లో బాబూమోహన్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీదేవి 19,985 ఓట్లతో బస్వమాణయ్యపై, 1972లో కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ, లక్ష్మణ్‌కుమార్‌పై 13,901 ఓట్లతో, 1978లో రాజనర్సింహ ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి సదానంద్‌పై 738 ఓట్లతో, 1983లో లక్ష్మణ్ జీ స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరీ బాయిపై 10,515 ఓట్లతో, 1985లో దేశం అభ్యర్థి ఎం.రాజయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజనర్సింహపై 16,463 ఓట్లతో, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర్ రాజనర్సింహ టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్యపై 3014 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1998 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్, కాంగ్రెస్ అభ్యర్థి దామోదరపై 10,554 ఓట్లతో గెలుపొందారు. అందోల్ అసెంబ్లీకి 14 సార్లు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు వెయ్యిలోపు, మూడు సార్లు 3వేల ఓట్లతో అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలి టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి డిమాండ్ మెదక్‌టౌన్, న్యూస్‌లైన్: ఖరీప్ సీజన్ దగ్గరపడుతుండటంతో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా ఎరువులు, విత్తనాలకోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తోందన్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపడితే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. -
ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో రోజు గడిస్తే మున్సిపల్ ఫలితాలు బహిర్గతం కానున్నాయి. 42 రోజుల సుదీర్ఘ సస్పెన్స్‌కు తెరబడనుంది. రెండు రోజులు ఆగితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠకు లోనవుతున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. జిల్లాలో పోలింగ్ 77.09 శాతంగా నమోదైంది. ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నో తంటాలు పడ్డారు. ఎవరెన్ని తాయిళాలు ప్రకటించినా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో ఫలితాలు వస్తే కాని వెల్లడయ్యే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్, తెచ్చిన టీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు కళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ డీలా పడిపోయిందనే చెప్పవచ్చు. ఒక్క గజ్వేల్ నగర పంచాయతీలో మినహా మిగిలిన అన్ని చోట్ల టీడీపీ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీ, జోగిపేట నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి, సదాశివపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్కు మెజార్టీ వార్డులు రావచ్చని సమాచారం. సంగారెడ్డి, మెదక్ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో టీడీపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మూడు చోట్ల కూడా చైర్పర్సన్ ఎంపికకు అవసరమైనన్నీ మెజార్టీ వార్డులు రాకపోవచ్చని తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్వతంత్ర, ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు కీలకం కానున్నారు. వారు ఎవరికి మద్దతు తెలిపితే ఆ పార్టీయే చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అందోల్‌లో ఆసక్తికరం... అందోల్ నగర పంచాయతీ ఎన్నికల సమయంలో బాబూమోహన్ టీడీపీలో ఉన్నారు. ఆయన తన మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకున్నారు. మరో వైపు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా అందోల్పై ప్రత్యేక దృష్టిసారించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, మధ్య పోరు హోరాహోరీగా ఉండవచ్చని తెలుస్తోంది. త్రిముఖ పోరులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ ఎన్నికల తరువాత బాబూమోహన్ టీఆర్ఎస్లో చేరడంతో టీడీపీ తరఫున గెలిచిన అభ్యర్థులు కూడా టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ చైర్పర్సన్ ఎంపిక ఆసక్తికరంగా మారనుంది. గజ్వేల్ కీలకం.. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల ఫలితాలు జగ్గారెడ్డి జయాపజయాన్ని, గజ్వేల్ ఎన్నికలు కేసీఆర్ మెజార్టీని అంచనా వేసే వీలుంది. దీంతో రాజకీయ విశ్లేషకులు ఈ మూడింటి ఫలితాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో టీఆర్ఎస్, టీడీపీ హోరాహోరీగా తలపడనున్నాయి. సంగారెడ్డిలో కాంగ్రెస్, సదాశివపేటలో టీఆర్ఎస్కు మెజార్టీ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈనెల 13న స్థానిక సంస్థల కౌంటింగ్ ఉండడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటి నుంచే ఉత్కంఠకు గురవుతున్నారు. -
‘తూర్పు’న తారల తళుకులు
ఎన్నికల రణరంగంలో సినీ తారల తళుకులు తూర్పు గోదావరి జిల్లా రాజకీయ చరి త్రకు ఓ ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి, విజయాన్ని సొంతం చేసుకున్న తారలు ఉన్నారు. గోదావరి వాసులు కళాకారులను ఆదరిస్తారనడానికి ఆ విజయాలే తార్కాణం. కాగా ఇక్కడి నుంచి బరిలో నిలిచి అదష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశ పడ్డ వారిలో నిరాశే మిగిలిన వారూ ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని వివిధ నియోజక వర్గాల నుంచి బరిలో ఉండి గెలిచిన వారు, ఓడిన వారు, అదష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వారి వివరాలు జమున సినీ తారల తళుకు బెళుకులతో సీట్లు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ 1989 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి ప్రముఖ నటి జూలూరి జమునను బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జమున 1989 నుంచి 1991 వరకూ ఎంపీగా కొనసాగారు. 1991లో పోటీచేసి ఓడిపోయారు. కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కృష్ణంరాజు బీజేపీ నుంచి 1998లో కాకినాడ ఎంపీగా గెలిచి, విదేశీ వ్యవహారాల సహాయమంత్రిగా కొనసాగారు. 1999లో ఓడిపోయారు. 2004లో నర్సాపురం నుంచి ఎంపీగా నెగ్గారు. 2009లో పీఆర్పీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ పడి ఓడిపోయారు. మురళీమోహన్ రాజమండ్రి లోక్‌సభ స్థానానికి మురళీమోహన్ స్థానికుడు కాకపోయినా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సినీ గ్లామర్‌తో ఎదుర్కోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను అభ్యర్థిగా నిలుపగా ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. జయప్రద పై నటులందరూ స్థానికేతరులుగా ఉండి ఈ ప్రాంతంలో బరిలో నిలిచారు. కానీ రాజమండ్రి ఆడపడుచు జయప్రద మరో రాష్ట్రంలో ఎన్నికల గోదాలో దిగి విజయాలు సాధించారు. 1962లో రాజమండ్రిలో పుట్టిన జయప్రద చిన్ననాడే నగరం వదిలి వెళ్లి పోయారు. 1994లో టీడీపీలో చేరిన జయప్రద ఎన్టీఆర్ మరణానంతరం పార్టీని వీడారు. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అక్కడ వ్యక్తిగత, రాజకీయపరమైన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పలు విమర్శలు ముప్పిరిగొన్నా తట్టుకుని నిలబడ్డారు. బాబూమోహన్ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత పార్టీలో చేరి మెదక్ జిల్లా ఆంధోల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ ఎన్టీఆర్ మరణానంతరం లక్ష్మీ పార్వతి నాయకత్వంలోని ఎన్టీఆర్ టీడీపీలో చేరారు. 1996 ఎన్నికల్లో అమలాపురం ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చీల్చి, ఆ పార్టీ అభ్యర్థి బాలయోగి పరాజయానికి కారకులయ్యారని ప్రచారం సాగింది. బాబూమోహన్ 1.43 లక్షల ఓట్లు పొంది మూడోస్థానంలో నిలిచారు. 1998లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ పోటీ చేసిన బాబూ మోహన్ అప్పుడూ ఓటమినే చవి చూశారు. హేమ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె పొలిటికల్ పాత్రలోకి ప్రవేశిస్తున్నారు. తన సొంత జిల్లా తూర్పుగోదావరి నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హేమ పోటీ చేస్తున్నారు. -
పేదల సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
రాయికోడ్, న్యూస్‌లైన్: పేద ప్రజల సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బి.సంజీవరావు అన్నారు. ఆది వారం రాయికోడ్‌లో మండల నాయకులతో సమావేశమై ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర రాజనర్సింహ, బాబూమోహన్‌లపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. అందుబాటులో ఉండని పార్టీలు, నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏనాడు ఉద్యమిం చని బాబూమోహన్‌కు టికెట్ ఇచ్చిన టీఆర్ఎస్కు ప్రజాదరణ ఉండబోదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటుతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. అంతకుముందు సింగితం గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశమై ఆ తరువాత స్థానిక చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నాయకులు చంద్రశేఖర్, కేశవ్‌రెడ్డి, దేవదాస్, ఖాజా, శివారెడ్డి, బాబు, పేత్రు పాల్గొన్నారు. రూ.350 కోట్ల అభివృద్ధి ఎక్కడ? మునిపల్లి: గత ఐదేళ్లలో రూ.350 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటూ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గొప్పలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ అందో ల్ నియోజకవర్గ అభ్యర్థి బి.సంజీవరావు విమర్శించారు. ఆదివారం ఆయన మండలంలోని బుదేరా చౌరస్తాలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఎక్కడ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో దళితులను రాజకీయంగా ఎదగకుండా చేసింది దామోదర కాదా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బాలకృష్ణారెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు. -
నా గుండెల్లో పదిలంగా తెలంగాణ: కేసీఆర్
హైదరాబాద్: ఎవరెన్ని శాపాలు పెట్టినా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, కొత్త పంథాలో ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి బాబూమోహన్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్, పల్లా రాజేశ్వర్ రెడ్డి... కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తలరాత మారాలంటే పాత ప్రభుత్వాలతో సాధ్యం కాదన్నారు. తన గుండెల్లో పదిలంగా తెలంగాణ ఉందన్నారు. తెలంగాణలో సకల బాధలకు కాంగ్రెస్, టీడీపీయే కారణమన్నారు. మంచి ప్రభుత్వం కావాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలన్నారు. మొదట రాజకీయ అవినీతిని పాతరవేయాలన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. -
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు
నిరుపేద కుటుంబంలో పుట్టిన.. కేబినెట్ మంత్రిగా పనిచేశా.. 965 సినిమాల్లో ఆ మూడు ఎన్నటికీ మరువలేను హాస్యనటుడు బాబుమోహన్ దుగ్గొండిలో స్కూల్ వార్షికోత్సవానికి హాజరు దుగ్గొండి, న్యూస్‌లైన్: ‘చిన్న పల్లెలో నిరుపేద కుటుంబంలో పుట్టాను. పూరిపాక పాఠశాలలో చదివాను. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సం పాదించుకున్నా.. ఈ రోజు ఈ స్థాయిలో ఉం టానని ఎన్నడూ ఊహించలేదు’ అని ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలోని కృష్ణవేణి టా లెంట్ స్కూల్లో గురువారం రాత్రి జరిగిన చైత్ర-2014 వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీ ణ ప్రాంతాలలో పుట్టిన ఎంతో మంది కలెక్టర్ లు, డాక్టర్లు అయ్యారని, తాను ఒక మారుమూల పల్లెలో నుంచి వచ్చి పట్టుదలతో ఎంఏ, ఎల్ఎల్బీ చదివి రెండు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేశానని చెప్పారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించ వచ్చని చెప్పారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చిన్నారులకు వినయ విధేయతలు నేర్పించాల న్నారు. తాను ఇప్పటికి 965 సినిమాలలో నటించానని, వాటిలో మూడు సినిమాలను ఏనాటికీ మరువలేనని ఆయన అన్నారు. అంకుశం.. యాక్టర్‌ను చేస్తే, మామగారు.. కమెడియన్ చేయగా, మాయలోడు.. హీరో చేసిందని బాబుమోహన్ చెప్పారు. సభలో ప్రసంగిస్తూనే ‘నీలిమబ్బు కురులలోన’ ‘ఇంత కూరుంటేయ్యమ్మా.. బువ్వుంటేయ్య మ్యా’ అంటూ పాట పాడుతూ స్టెప్పులు వేసి సభికులను ఆనందంలో ముంచెత్తారు. కొందరు ఆయనతో గొంతు కలిపి స్టెప్పులేశారు. అనంతరం బాబుమోహన్ సర్కిల్ సీఐ మధు, పాఠశాల డెరైక్టర్ పెంచాల శ్రీనివాస్ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం వార్షికోత్సవ సభలో విద్యార్థులు ప్రదర్శించిన నృ త్యాలు, నాటికలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో కాకతీయ యునివర్శిటి ప్రిన్సిపాల్ రామస్వామి, ఎంవీ రంగారావు, భూపాల్‌రావు, ఎస్సై ముజాహిద్, సర్పంచ్ ఆరెల్లి చందన, పాఠశాల ఇం చార్జీ రాంబాబు, కళాశాల ఇంచార్జీ దానం వీరేందర్, పేరెంట్స్ కమిట బాధ్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బాబుపై బాబుమోహన్ గుస్సా
మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత బాబూమోహన్‌కు అధినేత చంద్రబాబుపై కోపమొచ్చింది. సీరియస్‌నెస్ లేకుండా చంద్రబాబు కామెడీ చేసి తెలుగువారి జీవితాలతో ఆడుకోవడమే బాబుమోహన్ కోపానికి కారణమట. రెండుకళ్లు, కొబ్బరి చిప్పలు, చింత పిక్కలంటూ చంద్రబాబు తన స్థాయిని మరిచి మాట్లాడటం ఆయనకు రుచించలేదని మెదక్ జిల్లా పచ్చ తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. బాబు అనుసరిస్తున్న అర్థం పర్థం లేని అస్పష్టవైఖరి వల్లే సైకిల్ స్పీడు తగ్గిందని గ్రహించిన బాబూ మోహన్ త్వరలోనే కారు ఎక్కబోతున్నారు. విలక్షణ కామెడీతో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసిన నటుడు బాబుమోహన్. టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు టిడిపిలో ఉన్నప్పుడు ఆయన చొరవతో రాజకీయాల్లోకి వచ్చిన బాబుమోహన్ 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో బాబుమోహన్ గెలుపులో కెసిఆర్‌ది కూడా ప్రధాన పాత్రే. టిడిపి అధినేత చంద్రబాబుతో విభేదించి కెసిఆర్ బైటికి పోయినప్పటికీ బాబూమోహన్, కెసిఆర్‌ల మధ్యన స్నేహం మాత్రం అలాగే ఉంది. విభజనపై స్పష్టమైన వైఖరి తీసుకోకుండా తెలుగు ప్రజల జీవితాల్లో అయోమయం సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించడం బాబూమోహన్‌ను తీవ్రంగా కలచివేసినట్టు సమాచారం. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరి చిప్పల వేదాంతంతో తనను మించిపోయి కామెడీ చేస్తుండటమే బాబూమోహన్ ఆవేదనకు కారణమట. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతో సైకిల్ స్పీడు తగ్గిందని...రాను రాను మరిన్ని గడ్డు పరిస్థితులు వస్తాయని భావిస్తున్న బాబూమోహన్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు త్వరలో కారు ఎక్కుతారని సమాచారం. చాలా కాలంగా మెదక్ జిల్లా ఆందోల్ నియోజవర్గం టిఆర్ఎస్ ఇంచార్జి పదవి ఖాళీగా ఉండటం కూడా బాబూమోహన్ రాకకోసమేనని వినికిడి. టిఆర్ఎస్ను దళితులు వీడుతున్నారనే ప్రచారం తప్పని చెప్పడానికి కూడా మాజీ మంత్రి బాబూమోహన్ చేరిక ఉపయోగపడుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారట. కాంగ్రెస్‌లో టిఆర్ఎస్ విలీనం జరిగినా, పొత్తుగానీ పెట్టుకున్నా అప్పుడు ఆందోల్ సీటు బాబూమోహన్‌కు దక్కదు. అలాంటి పరిస్థితే వస్తే భవిష్యత్‌లో ఎమ్మెల్సీ సీటైనా దక్కించుకొని రాజకీయ భవిష్యత్‌ను సుస్థిరం చేసుకోవాలనేది బాబూమోహన్ ఆలోచన అని ఆయన అనుచరులు చెప్పుకొంటున్నారు. -
నవ్వినోళ్లే శభాష్ అన్నారు : బాబూమోహన్
హనుమాన్‌జంక్షన్ : ‘‘నటనపై మోజుతో రెవెన్యూ శాఖలో చేస్తున్న ఉద్యోగం మానేసి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా.. నా ఫేస్ చూసి అంతా నవ్వారు. నువ్వు నటిస్తావా.. అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.. అంటూ ఎగతాళి చేశారు.. కానీ ఆ తర్వాత సీన్ రివర్సయింది. వెండితెరపై నేను కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నారు... థియేటర్లలో చప్పట్లు.. ఈలలు.. హోల్ ఆంధ్రాకే సోల్ అండగాడినంటూ కితాబిచ్చారు... ఇదీ నా సినీప్రస్థానం’’ అంటూ హాస్యనటుడు బాబూమోహన్ చెప్పారు. వెన్నెల ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పుట్టగుంట సతీష్‌కుమార్ హీరోగా ఎన్.కె.రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఎమ్మెల్యే భరత్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను మూడు రోజులుగా హనుమాన్‌జంక్షన్ పరిసర ప్రాంతాల్లో బాబూమోహన్‌పై చిత్రీకరిస్తున్నారు. ఆదివారం ఆయన్ను కలిసిన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. న్యూస్‌లైన్: మీ కుటుంబ నేపథ్యం? బా.మో : ఖమ్మం జిల్లాలోని బీరవోలు మా స్వగ్రామం. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. న్యూస్‌లైన్ : సినిమాల్లో మీకు ఫస్ట్ చాన్స్ ఎలా వచ్చింది? బా.మో : హైదరాబాదు రవీంద్రభారతిలో నేను ప్రదర్శించిన నాటకాన్ని చూసిన ప్రతాప్ ఆర్ట్స్ అధినేత రాఘవగారు ‘ఈ ప్రశ్నకు బదులేది’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆహుతి, ఆంకుశం చిత్రాల్లో నటించడంతో మంచి గుర్తింపు లభించింది. న్యూస్‌లైన్ : ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో నటించారు? బా.మో : తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 965 చిత్రాల్లో నటించా. న్యూస్‌లైన్ : మీకు బాగా గుర్తింపునిచ్చిన సినిమాలు? బా.మో : మామగారు సినిమాల్లో వేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అంకుశం, వన్‌బై టూ, మాయలోడు, రాజేంద్రుడు- గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకడిపంబ, అమ్మోరు చిత్రాలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. న్యూస్‌లైన్ : ఒకప్పుడు అగ్రశ్రేణి హాస్యనటుడిగా ఎదిగిన మీకు ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లడానికి కారణం? బా.మో : సినిమాలు, రాజకీయాలు.. రెండింటికీ సమతూకంలో సమయం కేటాయిద్దామనుకున్నా. కానీ ప్రజాజీవితంలో అది కుదరదని తేలిపోయింది. డేట్స్ ఇచ్చిన నిర్మాతలకు ఇబ్బందులు కలగకూడదనే సినిమాలు తగ్గించేశాను. న్యూస్‌లైన్ : మీ సహనటులకు వచ్చిన పద్మశ్రీ పురస్కారం మీకెందుకు రాలేదు? బా.మో : నేను సినిమాల్లోకి వచ్చిన రెండు, మూడేళ్లలోనే బాగా బిజీ అయ్యాను. రోజుకు ఐదారు షూటింగులు ఉండేవి. దీంతో నేను నటించిన చిత్రాల జాబితా రాయడం కుదర్లేదు. అది ఉంటే నేనూ బ్రహ్మానందంతోపాటే పద్మశ్రీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేది. న్యూస్‌లైన్ : రాజకీయాలు మీకు తృప్తినిచ్చాయా? బా.మో : ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏకైన నటుడిని నేనొక్కడినే. ఎన్టీఆర్‌కి కూడా ఈ రికార్డు లేదు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో బాధ్యతగా పనిచేశాననే తృప్తి ఉంది. 2014 ఎన్నికల్లో ఆంధోల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నా.