నా గుండెల్లో పదిలంగా తెలంగాణ: కేసీఆర్ | KCR Blames Congress, TDP for Telangana backwardness | Sakshi
Sakshi News home page

నా గుండెల్లో పదిలంగా తెలంగాణ: కేసీఆర్

Published Wed, Apr 2 2014 4:07 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

నా గుండెల్లో పదిలంగా తెలంగాణ: కేసీఆర్ - Sakshi

నా గుండెల్లో పదిలంగా తెలంగాణ: కేసీఆర్

హైదరాబాద్: ఎవరెన్ని శాపాలు పెట్టినా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, కొత్త పంథాలో ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి బాబూమోహన్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్, పల్లా రాజేశ్వర్ రెడ్డి... కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తలరాత మారాలంటే పాత ప్రభుత్వాలతో సాధ్యం కాదన్నారు. తన గుండెల్లో పదిలంగా తెలంగాణ ఉందన్నారు. తెలంగాణలో సకల బాధలకు కాంగ్రెస్, టీడీపీయే కారణమన్నారు. మంచి ప్రభుత్వం కావాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలన్నారు. మొదట రాజకీయ అవినీతిని పాతరవేయాలన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement