గులాబీ దళపతి కేసీఆర్ కొలువులో అమాత్యులు ఎవరు? తెలంగాణ రాష్ట్రం తొలి కేబినెట్‌లో జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? 18 మంది మంత్రివర్గ సహచరులతో కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ చర్చ సర్వత్రా సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితా లు వెలువడిందే తడువుగా శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశం, ఎల్‌పీ నేతగా కేసీఆర్ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరే కేసీఆర్ మంత్రివర్గంలో జిల్లా నుంచి మంత్రిగా ఎవరికీ అవకాశం దక్కుతుందనే అంశం చర్చనీయాంశగా మారింది.
రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొందరు సీనియర్ల పేర్లను ప్రకటించారు. మోతె గ్రామంలో మట్టిముడు పు విప్పిన ఆయన రాబోయే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డిలాంటి సీనియర్లకు మంత్రిగా అవకాశం ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నా రు.
డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో బాజిరెడ్డి గోవర్ధన్‌ను డైనమిక్ లీడర్‌గా పేర్కొ న్న కేసీఆర్ ఆయనను గెలిపిస్తే తెలంగాణ స్థాయిలో పెద్ద పదవి కట్టబెట్టబెడతానని హామీ ఇచ్చారు. గోవర్ధన్‌కు కూడ సీనియర్ నేతగా రాజకీయ అనుభవం, జిల్లా మీద మంచి పట్టు కూడా ఉంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి నాలుగోసారి ఎల్లారెడ్డి నుంచి గెలుపొందారు. ఆయన పేరు కూడ మం త్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉంది.
రేసులో గంప గోవర్ధన్, హన్మంత్ సింధే
జిల్లాలో మొత్తం స్థానాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందడటం, పలువురు మంత్రి పదవిని ఆశిస్తుండడం పార్టీలో తర్జనభర్జనలకు కారణమవుతోంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గోవర్ధన్, రవీందర్‌రెడ్డితో పాటు రెండుసార్లు కామారెడ్డి, జుక్కల్ నుంచి గెలుపొందిన గంప గోవర్ధన్, హన్మంత్ సింధే కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా బరిలో దిగిన ఈ ఇద్దరు నేతలు కూడ భారీ ఆధిక్యత నే సాధించారు. తొమ్మిదింటికి తొమ్మిది స్థానాలు గెలి చిన నేపథ్యంలో జిల్లాలో ఇద్దరికీ మంత్రి పదవి ఇ వ్వాలని అధినేత భావిస్తే, అగ్రవర్ణాల నుంచి ఒకరికి, ఇతర సామాజికవర్గాల నుంచి మరొకరికి అవకాశం ఉంటుందంటున్నారు.
ఇదే జరిగితే నాలుగు పర్యా యాలు టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన రవీందర్‌రెడ్డి, లేదా పోచారం శ్రీనివాస్‌రెడ్డిలో ఒకరికి దక్కితే, ఎస్‌సీ రిజ ర్వుడు నియోజకవర్గం జుక్కల్ నుంచి గెలుపొందిన హన్మంత్ సింధే పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. మైనార్టీ నుంచి అవకాశం దక్కితే బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు, వైశ్య సామాజికి వర్గానికి ఇవ్వాలను కుంటే అర్బన్ ఎమ్మెల్యే బిగాల కు అవకాశం రావచ్చు. ఇవేమీ ప్రాతిపదిక కా దు, భవిష్యత్‌లో తెలంగాణ పునర్‌నిర్మాణం, పార్టీ ప టిష్టం నేపథ్యంలో చురుకైన పాత్రను పోషించే యువకులకు కూడ కేసీఆర్ అవకాశం కల్పించవచ్చన్న చర్చ కూడ ఉంది. ఏదేమైనా శనివారం టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశం అనంతరం చోటు చేసుకున్న పరిణామా ల నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరికీ దక్కుతాయ న్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
సచివులు ఎవరో?
Published Sun, May 18 2014 2:25 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement