పోటాపోటీ సమీక్షలు
వరంగల్, న్యూస్‌లైన్: ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ తమ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమకే ప్రజలు అనుకూలంగా తీర్పునిస్తారని ఈ రెండు పక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రెండు పార్టీల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ తమదే విజయమంటే తమదే అని పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు. ఒకరికొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ మాటల గారడీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు స్థానిక పోరు ఫలితాల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
మునిసిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పదవులను దక్కిం చుకునేలా ఇరు పార్టీల నేతలు మైండ్‌గేమ్‌కు తెరతీశారు. కాం గ్రెస్, టీఆర్‌ఎస్ ప్రధాన నే తలు పొన్నాల, కేసీఆర్ ఎవరికివారు ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీచేసిన అభ్యర్థులతో ఇప్పటికే ప్రత్యేక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల ఐదో తేదీన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించి నేతలను అప్రమత్తం చేసింది. సమావేశంలో పోరిక బలరామ్‌నాయక్, కత్తి వెంకటస్వామి మధ్య వాగ్వాదం జరిగినప్పటికీ... స్థానిక, సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వస్తాయనే ధీమాతో ఉన్నారు. మునిసిపల్, జెడ్పీ ఎన్నికల్లో ఎక్కడైనా అటుఇటుగా కొంత తేడా వస్తే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా పావులు కదపాలని నిర్ణయం తీసుకున్నారు.
అవసరమైన మేరకు క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచారు. ఈ దిశలోనే శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమీక్షించనున్నారు. కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తు వేస్తూ.... చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అమలు చేయూల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మొత్తానికీ... ఇరుపార్టీల దృష్టి స్వతంత్రులపైనే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే అంచనాతో ఉన్న కేసీఆర్.. ముందస్తు కసరత్తులో భాగంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరుుతే... పోలింగ్ సరళిపై రోజురోజుకూ వ్యక్తమవుతున్న భిన్న స్వరాలు పోటీచేసిన అభ్యర్థుల్లో గుబులు పెంచుతున్నారుు. అరుునప్పటికీ... తెలంగాణలో తొలి ప్రభుత్వం తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమకే మంత్రి పదవులు అనే స్థాయికి చేరుకోవడం గమనార్హం.