సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో తిరుగులేని ఆధిక్యతను సాధించిన సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును వివిధ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగసంఘాల నేతలు కలసి అభినందనలు తెలిపారు. కేసీఆర్ నివాసం, తెలంగాణభవన్ వద్ద శుక్రవారం ఉదయం నుండే కోలాహలం కనిపించింది. ఐఏఎస్ అధికారులు కృష్ణప్రసాద్, హూడా, రిటైర్డు ఐఏఎస్ అధికారులు కేసీఆర్‌ను కలిశారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నేత రాంనరసింహారెడ్డి, టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, కారెం రవీందర్ రెడ్డి, విఠల్, ఏ. పద్మాచారి,వర్కింగ్ ప్రెసెడెంట్ లచ్చిరెడ్డి, గోపాల్‌రెడ్డి,ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ భవన్‌లో మిన్నంటిన సంబురాలు: టీఆర్‌ఎస్ గెలుపుతో తెలంగాణభవన్ సంబురాలతో మిన్నంటింది. తెలంగాణ భవన్‌లో పెద్ద టీవీస్క్రీన్ ఏర్పాటు చేశారు. ఫలితాలను ఎప్పటి కప్పుడు అందించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచినప్పుడల్లా కేరింతలు కొడుతూ తమ హర్షం వ్యక్తం చేశారు. బ్యాండు మేళాలు, పెద్ద ఎత్తున బాణాసంచా, నినాదాలు వంటివాటితో తెలంగాణ భవన్ దద్దరిల్లింది.
కేసీఆర్‌కు అభినందనల వెల్లువ
Published Sat, May 17 2014 1:08 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement