Devi Prasad
-
ఆట, పాట, మాటతో.. జన హృదయాలు గెలిచారు
చిక్కడపల్లి (హైదరాబాద్): గద్దర్ ఏ ఒక్క వర్గానికి, భావజాలానికి మాత్రమే పరిమితం కాలేదని, ఆయన పాట, మాట, ఆటతో జనహృదయాలను గెలిచారని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ కొనియాడారు. చెప్పదలచుకున్న విషయాన్ని జన హృదయాలను తాకేటట్టు నేర్పుగా చెప్పగల గొప్ప వాగ్గేయకారుడు గద్దర్ అని ప్రశంసించారు. బుధవారం రాత్రి చిక్కడపల్లి త్యాగరాయ గానసభ నిర్వహణలో లలిత కళావేదికపై ప్రజా యుద్ధనౌక, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సంతాప సభ జరిగింది. ఇనాక్ తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ సాహిత్యం సిలబస్‌గా పెట్టే ప్రయత్నంలో ఎదుర్కొంటున్న అనుభవాలు, గద్దర్‌లో విప్లవభావాలు, తెలంగాణ భావన, దళిత వర్గాల అభ్యుదయం పట్ల ఆలోచనలను పంచుకున్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ జానపద గాయకుని స్థాయికి ఎదిగిన గద్దర్.. పాట ఉన్నంతకాలం నిలిచి ఉంటారని అన్నారు. గద్దర్‌లో భిన్న కోణాలు ఉన్నాయని బేవరేజెస్ పూర్వ చైర్మన్ దేవీప్రసాద్ పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా’అన్న గద్దర్ పాటను లయబద్ధంగా పాడి తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ, గద్దర్ గొప్ప కళాకారుడు అయినప్పటికీ అందరినీ ఆప్యాయంగా పలుకరించే మానవతామూర్తి అని ప్రశంసించారు. -
తెల్ల కాగితంలా వెళ్లాలి
‘‘నేను డైరెక్టర్ అయినా ఇతర దర్శకుల చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వారికి సలహాలు ఇవ్వను. మనం డైరెక్టర్ అయినా ఒక నటుడిగా నటిస్తున్నప్పుడు ఆ దర్శకుడి వద్దకు తెల్ల కాగితంలా వెళ్లాలి. అప్పుడే దానిపై తనకు నచ్చింది రాసుకుంటాడు’’ అని దేవీ ప్రసాద్ అన్నారు. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్య పాత్రల్లో విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన దేవీ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ► ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లాదకరమైన కథ. మనుషుల్లోని మంచీ చెడులు, వాటి వల్ల ఏర్పడే సమస్యల ఇతివృత్తంగా తెరకెక్కింది. ► సాధారణంగా కొత్త దర్శకుడు లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్ లేదా యాక్షన్ చిత్రాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ విశ్వనాథ్ దానికి భిన్నంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నాడు. ► ఓ గ్రామంలోని పెద్దాయన కొడుకు పాత్ర నాది. కెరీర్ కోసం పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిన వ్యక్తిలా కనిపిస్తాను. మనం, మన సంపాదన, భవిష్యత్తు అనే ఆలోచనా ధోరణి ఉంటుంది. ► రాజేంద్రప్రసాద్‌గారితో చేయాలనే నా కోరిక ‘తోలుబొమ్మలాట’ తో నెరవేరింది. ఆయనతో పాటు ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటులందరి నుంచి నాకు తెలియని చాలా విషయాలు ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. -
ముఖ్యమంత్రి వస్తున్నారు
దేవీప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. వైష్ణవి ఫిలింస్, ఆలూరి క్రియేషన్స్ పతాకాలపై అట్లూరి నారాయణరావు, ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ– ‘‘సమకాలీన రాజకీయ అంశాలను మా చిత్రంలో చర్చించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు ఆలోచింపజేసే సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి. దేవీప్రసాద్, వాయుతనయ్, శశి, సుచిత్ర మంచి నటన ప్రదర్శించారు. సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యత ఉంది’’ అన్నారు. ‘‘నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ ఈ చిత్రాన్ని నిర్మించాం. పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: కమలాకర్. -
నా సెల్ఫీ.. ఓ సందేశం
శ్రీ చరణ్ సెన్సేషనల్ మూవీస్‌పై చిరుగురి చెంచయ్య, సుగుణమ్మ సమర్పిస్తున్న చిత్రం ‘ఇది నా సెల్ఫీ’. సి.హెచ్ ప్రభాకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నువ్వుల వినోద్, ఆరోహి నాయకా నాయికలుగా నటిస్తున్నారు. సతీశ్రాయ్ కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మాలపాటి స్వరాలు అందించారు. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో గురువారం విడుదల చేశారు. ఈ వేడుకలో దర్శకులు యన్.శంకర్, దేవీ ప్రసాద్, నిర్మాత సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. సీహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘ఇది నా సెల్ఫీ’ అనగానే అందమైన సెల్ఫీల గురించి అనుకుంటారు. సెల్ఫీల వల్ల జరిగే అనర్థాలను, జ్ఞాపకాల నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఈ చిత్రం సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. దర్శకుడు యన్.శంకర్ మాట్లాడుతూ– ‘‘నటీనటులందరూ బాగా నటించారు. పాటలన్నీ బాగున్నాయి. అన్ని ఎమోషన్స్‌తో కూడిన పాటలు ఉన్నాయి’’ అన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ
► అందుకు అందరం భాగస్వాములవుదాం: హరీశ్ ► దేవీప్రసాద్‌కు ఘన సత్కారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం కోసం పోరాడిన స్ఫూర్తితో ఉద్యోగులందరం కలసి సీఎం కేసీఆర్ ఆశించిన బంగారు తెలంగాణను సాధిం చుకుందామని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కలసికట్టుగా కృషిచేసి, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిచేసుకుందామన్నారు. తెలంగాణ నాన్గెజిటె డ్ అధికారుల కేంద్ర సంఘం (టీఎన్జీఓ) గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో ఆయన్ను సన్మానించారు. పదవి పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదని, ఉద్యమంలో దేవీ ప్రసాద్ పోరాటానికి మించిన పదవి ఏదీ ఉండదని హరీశ్ అన్నారు. ఉద్యమ కాలంలో స్వామి గౌడ్, దేవీప్రసాద్, శ్రీని వాస్‌గౌడ్, విఠల్ చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. ఉద్యమంలో ముందున్న అన్ని వర్గాలు, విభాగాల వారిని సీఎం కేసీఆర్ దశలవారీగా సముచిత స్థానం కల్పించి గౌరవించుకొంటున్నారని చెప్పారు. టీఎన్జీవోస్ని ఏకతాటిపైన నడిపిన ఘనత దేవీప్రసాద్దే అని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి న్నారు. మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి, ఎంపీ పల్లా రాజేశ్వర్, ఎమ్మెల్యేలు శ్రీని వాస్ గౌడ్, బాబూమోహన్, ఎమ్మెల్సీలు పురా ణం సతీష్, గంగాధర్, సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎన్జీవోస్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, టీఎస్పీఎస్ సభ్యుడు విఠల్ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ముందుకు సాగుదాం 30 ఏళ్లు ఉద్యోగుల కోసం కృషి చేశానని, ఎన్ని పదవులు నిర్వహించినా తెలంగాణ ఉద్యమాల సమయంలో వచ్చిన పేరే గొప్పగా భావిస్తానని దేవీప్రసాద్ చెప్పారు. ఉద్యోగులంతా ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధిలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు దేవీప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
ఢిల్లీలో నినదించిన 29 రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా.. పెద్ద సంఖ్యలో హాజరైన టీఎన్జీవో, గెజిటెడ్ అధికారుల ఫోరం సభ్యులు సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో కదంతొక్కారు. అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా చేపట్టారు. ‘పెన్షన్ భిక్షకాదు.. ఉద్యోగుల హక్కు’అని నినదిస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి టీఎన్జీవో, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ ఒకే మాటతో నూతన పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు లీలాపత్ డిమాండ్ చేశారు. పెన్షన్ ఉద్యోగుల హక్కు..: దేవీ ప్రసాద్ టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. పెన్షన్ తీసుకోవడం ఉద్యోగుల హక్కు అని, ఈ ప్రయోజనానికి ప్రతిబంధకంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఎలాంటి గ్రాట్యుటీ లభించడం లేదని ఆరోపించారు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. సీపీఎస్ విధానం రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, దీన్ని అభినందిస్తున్నామన్నారు. ఉద్యమ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను ఏకం చేస్తామని, కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ధర్నాలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు జైట్లీతో చర్చిస్తా: దత్తాత్రేయ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో యూపీ ఎన్నికల అనంతరం చర్చిస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా చర్చిస్తానని పేర్కొన్నారు. తనను కలసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ఆయన చర్చించారు. -
ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చిచ్చుకు కుట్ర
టీఎన్జీవోస్ 70 వసంతాల వేడుకలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ: ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఉన్న సత్సంబంధాన్ని చూసి జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం రాత్రి హన్మకొండలో టీఎన్జీ వోస్ యూనియన్ 70 వసంతాల వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో కడియం మాట్లా డుతూ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వ కంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా యూనియన్ పని చేస్తుందని, ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్పీకర్ సిరికొండ మధు సూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణ చేయాలని విశ్వాసం టీఎన్జీ వోస్ ఉద్యోగుల్లో కనిపిస్తుందన్నారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమ స్యలు సీఎం పరిష్కరిస్తారని, ఈ విషయం లో ఎవరూ ఎలాంటి ఇబ్బంది పడవద్ద న్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావడం, తెలంగాణ పునర్నిర్మాణమే వరంగల్ డిక్లరేషన్ అన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడితేనే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం రద్దవుతుందన్నారు. ఈ దిశగా మార్చిన 2న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. -
టీఎన్జీవోలు సిద్ధమే: దేవీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తు కోసం టెట్, ఎంసెట్ పరీక్షల నిర్వహణకు స్వచ్ఛందంగా సహకరిస్తామని టీఎన్జీవో గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వం పరీక్షల తేదీలను ప్రకటించి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ విధులను వేయాలని కోరారు. -
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
-టీఎన్జీవోస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ హన్మకొండ(వరంగల్ జిల్లా) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని టీఎన్జీవోస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ కోరారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో టీఎన్జీవోస్ యూనియన్ క్యాలెండర్‌ను సోమవారం అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ముత్తుసుందరం, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవీ ప్రసాద్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచే ఈ పోరాటం ప్రారంభం కానుందన్నారు. దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేయనున్నట్లు వివరించారు. ఈ ధర్నాలో రోజుకు మూడు రాష్ట్రాల చొప్పున ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. ఫిబ్రవరి 14, 15 తేదీలలో కేరళలోని తిరుచూరులో ఉద్యోగుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ మహిళా సదస్సులో 12 అంశాలతో వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్‌లోని అంశాలను దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి అమలు కోసం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్, నగర అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
'స్థానికత ఆధారంగానే విభజించండి'
న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులను వారివారి స్థానికత ఆధారంగానే రెండు రాష్ట్రాలకు విభజించాలని తెలంగాణ ఎన్జీవోలు కోరారు. ఈ మేరకు టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ ఆధ్వర్యంలోని ఉద్యోగ సంఘం నేతలు సోమవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్. సి. గోయల్ కు విన్నవించారు. విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని టీఎన్జీవోలు కోరగా.. సాధ్యమైనంత త్వరలో ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు గోయల్ హామీ ఇచ్చారు. -
తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రకు వెళ్లనివ్వం
నాంపల్లి: ఏపీకి చెందిన హెచ్ఓడీలను విజయవాడకు తరలించడాన్ని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ , అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు విలేకరులతో మాట్లాడారు. తరలింపు వల్ల ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు తీసుకుని పోతామంటే అడ్డుకుంటామని అన్నారు. చంద్రబాబుకు, అశోక్‌బాబుకు ఉద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఆంధ్రా ఉద్యోగులను ఆంధ్రాకు, తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. మే 28న టీఎన్జీఓ కేంద్ర వర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలియజేశారు. -
'ఎక్కడివారు.. అక్కడే పనిచేయాలి'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పన కమిటీ, ఉద్యోగుల పంపిణీ కమిటీల చైర్మన్ కమల్నాథన్ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేయాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తప్పుడు స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని దేవిప్రసాద్ తెలిపారు. -
టీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో బలం లేదు
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను చేరుకోలేదు దేవీప్రసాద్ ఓటమికి టీఎన్జీవోలకు సంబంధం లేదు టీఎన్జీవో ప్రభుత్వ అనుబంధ సంస్థ కాదు ఫిట్మెంట్ బకాయిలకు బాండ్లు ఇవ్వరు మీట్ ది ప్రెస్‌లో టీఎన్జీవో అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో బలంలేక ఓటర్లను చేరుకోలేకపోయిందని, అందువల్లనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ఓటమి చెందారని టీఎన్జీవో నూతన అధ్యక్షుడు కె. రవీందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్ని జిల్లాలకు చెందిన ఓటర్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉండడం, భిన్న సంస్కృతుల నేపథ్యం కూడా ఆయన ఓటమికి కారణమయ్యాయని అన్నారు. దేవీప్రసాద్ పోటీలో ఉండడం వల్లనే 40 వేల ఓట్లు పోలయ్యాయని తాము భావిస్తున్నట్లు చెప్పారు. టీఎన్జీవో అధ్యక్షుడిగా నియమితులైన రవీందర్‌రెడ్డితో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(టీయూడబ్ల్యూజే) గురువారం మీట్ ది ప్రెస్ నిర్వహించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్ ఓటమికీ టీఎన్జీవోలకు సంబంధం లేదని, ప్రతీ ఉద్యోగి ఆయన గెలుపు కోసం పనిచేశారని అన్నారు. టీఆర్ఎస్ ఓటింగ్ శాతాన్ని పెంచుకోలేకపోయిందని, సమయం తక్కువగా ఉన్నందు వల్ల కిందిస్థాయిలో ఓటర్ల దగ్గరికి వెళ్లలేకపోయినట్లు చెప్పారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి కూడా పనిచేసిందన్నారు. అవగాహన లేకే.. ఎన్నికల కమిషన్ పట్టభద్రుల ఓట్లు వినియోగించుకునే పద్ధతిపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలమైందని రవీందర్‌రెడ్డి అన్నారు. దానివల్లే దేవీ ప్రసాద్ ఓడిపోయారని చెప్పారు. దేవీప్రసాద్ ఎప్పటికీ ఉద్యోగ సంఘాల నేతేనని, ఆయనకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని సీఎంను కోరామని చెప్పారు. పెరిగిన పీఆర్సీకి సంబంధించి త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందన్నారు. బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేసి నగదు రూపంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. నగదు రూపంలోనే చెల్లిస్తారని, హెల్త్‌కార్డుల జారీకి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని ఆశిస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎన్జీవో సమర్థించిందని రవీందర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. సకలజనుల సమ్మె ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసినట్లు చెప్పారు. ఇన్నాళ్లూ సీమాంధ్ర పాలకులతో సమస్యలపై పోరాడిన టీఎన్జీవో ఇప్పుడు తెలంగాణలో మన ప్రభుత్వం ముందు సమస్యలపై పోరాటం చేయాల్సిన పరిస్థితి రానుందన్నారు. 42 రోజుల సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, తద్వారా రిటైరైన ఉద్యోగులకు కూడా ఉపయోగం ఉంటుందన్నారు. అంతకు ముం దు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజే యూ) సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు టీఎన్జీవోకు అవినాభావ సంబంధం ఉందన్నారు. మీడియాలో హక్కుల కోసం జర్నలిస్టులు చేసిన పోరాటాలకు కూడా టీఎన్జీవో మద్దతు పలికిందన్నారు. ఈనాడు పత్రికలో యాజమాన్య వైఖరికి నిరసనగా 24 రోజుల పాటు జరిగిన సమ్మెకు మూడున్నర దశాబ్దాల క్రితమే టీఎన్జీవో అండగా నిలిచి పత్రికలోని ఉద్యోగులకు తిండిపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి హమీద్, మన తెలంగాణ దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, హెయూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరాహత్ అలీ, కోటిరెడ్డి, ఇతర నాయకులు సోమసుందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
స్కేటింగ్ చిచ్చరపిడుగు
40 సుమోల కింద దూసుకెళ్లిన క్రీడాకారుడు తిరుపతి: తిరుపతికి చెందిన దేవీప్రసాద్ (8) స్కేటింగ్‌లో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. మూడో తరగతి చదువుతున్న ఇతను తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం సమీపంలో గురువారం 40 సుమో వాహనాల కింద 7 అంగుళాల ఎత్తులో తన రెండు కాళ్లును బ్యాలెన్స్ చేసుకుంటూ శరీరాన్ని నేలకు తగలకుండా సమాంతరంగా 15 సెకన్లలో 110 మీటర్లు దూసుకెళ్లే ఫీట్‌ను చేసి చూపించాడు. వెనుక నుంచి అదే దూరాన్ని 21.24 సెకన్లలో చేరుకుని ఔరా అనిపించాడు. ఈ స్కేటింగ్ వీడియోలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం పంపిస్తున్నామని దేవీప్రసాద్ తండ్రి లోకనాథం తెలిపారు. -
టీఆర్ఎస్కు ఝలక్!
మండలి ఫలితాల్లో అధికార పార్టీకి చేదు ఫలితం మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో ఓటమి దేవీప్రసాద్‌పై బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు, 13,318 ఓట్ల ఆధిక్యం మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఘన విజయం టీఆర్ఎస్ను గట్టెక్కించలేకపోయిన హామీలు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో మాత్రం ఆధిక్యం నేటి మధ్యాహ్నానికి ఫలితం తేలే అవకాశం సాక్షి, హైదరాబాద్, నల్లగొండ: శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఖంగుతిన్నది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్ధి దేవీప్రసాద్ ఓటమిపాలయ్యారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపొందారు. 13,318 ఓట్ల ఆధిక్యతతో విజయభేరి మోగించారు. మొత్తం 1,11,739 ఓట్లు పోలవగా రామచంద్రరావుకు 53,881 ఓట్లు, దేవీప్రసాద్‌కు 40,563 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్ గుప్తాకు 2,856 ఓట్లు మాత్రమే పడ్డాయి. లెక్కింపు పూర్తయి ఫలితం తెలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతితో వివరాలను గురువారం ప్రకటించనున్నారు. కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజక వర్గంలో ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగుతుండడంతో గురువారం మధ్యాహ్నానికి తుది ఫలితం వస్తుందని అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం కోసం టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించింది. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో మంత్రులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి పెట్టారు. హాల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. తొమ్మిది నెలలుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలను సైతం పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి దించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో ఏకంగా డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు విస్తృత ప్రచారం చేశారు. ఇంత చేసినా ఫలితం ప్రతికూలంగా రావడంపై టీఆర్ఎస్ వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి. పనిచేయని ‘పీఆర్సీ’ ప్రభుత్వంపై సుమారు రూ. 5 వేల కోట్ల ఆర్థిక భారం పడుతున్నా, ఉద్యోగ వర్గాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం చేసినా.. పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా మూడు జీవోలను సర్కారు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆ వర్గాలు పూర్తిగా తమ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తాయని టీఆర్ఎస్ నాయకత్వం భావించింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఉద్యోగులను నడిపించిన టీఎన్జీవోల నేత దేవీప్రసాద్‌ను అభ్యర్థిగా ఎంచుకోవడంలో కూడా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. కానీ, చివరకు పీఆర్సీ మంత్రం కూడా పారకపోవడం పార్టీ నాయకత్వాన్ని షాక్‌కు గురిచేసింది. అలాగే హైదరాబాద్‌లో పట్టభద్రుల ఓట్లను దృష్టిలో పెట్టుకునే ఆంధ్రా ఉద్యోగులను, సెటిలర్స్‌ను టీఆర్ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా, ప్రయోజనం లేకపోయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు చేయిచ్చాయా? టీఎన్జీవోల పెత్తనాన్ని ఉపాధ్యాయ సంఘాలు జీర్ణించుకోలేదని, అందుకే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు దేవీప్రసాద్‌కు వ్యతిరేకంగానే ఓట్లేశాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ‘ కేవలం ఉద్యోగాలు ఇవ్వడం కోసం డీఎస్సీ ప్రకటించం’ అంటూ సీఎం కే సీఆర్ శాసనమండలిలో చేసిన ప్రకటన కూడా కొంత ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క ప్రకటనా వెలువడ కపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం కూడా పట్టభద్రుల ఆగ్రహానికి కారణంగా పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ ఫలితంతో టీఆర్ఎస్ వర్గాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ ధీమాతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలన్న పార్టీ నేతల ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిట్టీలు ప్రభుత్వంపై గూడుకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతూ కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిట్టీలను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. ‘తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు-నిధులు- నియామకాల కోసం.. కుటుం బ పాలన కోసం కాద’ని కొందరు ఓటర్లు చిట్టీలు వేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని, వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఎలాంటి సాకులు చూపొద్దని కూడా చిట్టీలు పడ్డాయి. ప్రభుత్వ పెద్దల తీరు మారకపోతే ఎన్నికల్లో ఇక ముందు కూడా బుద్ధి చెబుతామంటూ కొందరు ఓటర్లు చిట్టీల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈసారి భారీగా చెల్లని ఓట్లు పోలవడం గమనార్హం. ఒక్క ‘హైదరాబాద్’ ఎమ్మెల్సీ స్థానంలోనే 8,433 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 7.54 శాతం. దీంతో అభ్యర్థుల భవితను ఇవి కూడా ప్రభావితం చేశాయి. మరో స్థానంలో టీఆర్ఎస్ ఆధిక్యం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగా టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి 10,886 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావుకు 8,935 ఓట్లు వచ్చాయి. వామపక్షాల అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డికి 2,947 ఓట్లు, కాంగ్రెస్ పక్షాన పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు 2,639 ఓట్లు లభించాయి. మొత్తంమీద చూస్తే టీఆర్ఎస్కు బీజేపీ గట్టిపోటీ ఇస్తుం డగా, కాంగ్రెస్, వామపక్షాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. మొత్తం 13 రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో పోలైన 1.50 లక్షల ఓట్ల లెక్కింపునకు కేవలం 20 టేబుళ్లనే ఏర్పాటు చేయడంతో లెక్కింపు ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. తుది ఫలితం గురువారం మధ్యాహ్నానికి వెల్లడయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, తొలి ప్రాధాన్యత ఓటులో విజేత తేలకుండా రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి వస్తే మరింత ఆలస్యం కానుంది. బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపుతో బీజేపీలో నూతనోత్సాహం నిండింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం తమ పార్టీకే ఉందని బీజేపీ నేతల్లో ధీమా పెరిగింది. మూడు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన గెలుపును పార్టీ విస్తరణకు అనువుగా మార్చుకోవాలని, పక్కా వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సానుకూ ల ఫలితాలు ఉంటాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్పై ఉద్యోగుల్లోనూ, విద్యావంతుల్లోనూ పేరుకున్న వ్యతిరేకత ఈ ఫలితాలతో వెల్లడైందని వారు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీకే అనుకూలం గా మారతాయని స్పష్టమైందని సంబరపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాత్మకంగా ఉంటూనే, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చినందుకు ఇప్పుడు సత్ఫలితాలు వస్తున్నాయని సీనియర్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో అనవసరంగా పోటీ చేశామని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ మూడో స్థానానికి పడిపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నిండింది. ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు ‘ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు. మూడు జిల్లాల్లోని పట్టభద్రులు, విద్యావంతులు, ఓయూ విద్యార్థుల పాత్ర నా గెలుపులో ఉంది. టీడీపీ, లోక్‌సత్తా, కొన్ని సంస్థలు, విద్యార్థి సంఘాలు నా గెలుపు కోసం కృషి చేశాయి. గెలుపు కోసం అధికార పార్టీ డబ్బులు వెద జల్లింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లను బెదిరింపులకు గురి చే సినప్పటికీ నాకు ఓటేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు. ఖాళీ పోస్టుల భర్తీకి, ఇతర నోటిఫికేషన్ల కోసం శాసనమండలిలో నా గళాన్ని వినిపిస్తా. దేవిప్రసాద్ పోటీ చేయనని చెప్పినా... టీఆర్ఎస్ బరిలోకి దింపింది. చివరకు ఆయన్ను బలిపశువును చేశారు’ - ఎన్. రామచంద్రరావు, బీజేపీ అభ్యర్థి ప్రజలు మాకు వ్యతిరేకం కాదు ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు కాదు. అభ్యర్థిత్వం ఆలస్యం కావడంతో ఓటర్ల దగ్గరకు వెళ్లలేకపోయాం. రామచంద్రరావు రెండు సార్లు మండలి, ఒకసారి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయారు. దీని వల్ల ఓటర్లను ఎక్కువసార్లు కలుసుకున్న నేత గా ఆయనకు అధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలు ఒక్కటై టీఆర్ఎస్ను ఓడించాయి. నా గెలుపు కోసం వంద శాతం కట్టుబడి టీఆర్ఎస్ పని చేసింది. కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కష్టపడి పనిచేశారు. ఓటర్ల ను అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు. ఓటమిపై విశ్లేషణ చేసుకుంటా. భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతాం. - దేవీప్రసాద్, టీఆర్ఎస్ అభ్యర్థి -
ఇది ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు:దేవీ ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికలలలో తన ఓటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో పట్టుభద్రుల స్థానానికి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దేవీ ప్రసాద్ అన్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు దాదాపు పదివేల ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడిన అనంతరం దేవీ ప్రసాద్ మాట్లాడుతూ తన ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికలలో దాదాపు పది వేల ఓట్లు చెల్లలేదని చెప్పారు. తనకు ఓటు వేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ గెలిచినప్పటికీ అధికార టీఆర్ఎస్కు వ్యతిరేక తీర్పుగా భావించలేం అని ఆయన అన్నారు. -
డిగ్రీ చేయని దేవీప్రసాద్.. ఎమ్మెల్సీనా?
డిగ్రీ కూడా పూర్తిచేయని దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ పదవికి ఎలా అంగీకరిస్తారని స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలం ప్రశ్నించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలంటూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే.. బ్యాలట్ పేపర్లో పార్టీల పేర్లను ఎలా ముద్రిస్తారని కూడా ఆయన తన పిటిషన్లో ప్రశ్నించారు. పార్టీల పేరు ముద్రించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు. -
సీపీఎం మద్దతు కోరిన దేవీప్రసాద్
హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీచేస్తున్న దేవీప్రసాద్ శుక్రవారం ఎంబీభవన్‌లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో సీపీఎం తరఫున తనకు మద్దతునివ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, డీజీ నర్సింహారావు, బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మద్దతు విషయంపై తమ్మినేని సానుకూలంగా స్పందించారన్నారు. ఉద్యోగసంఘాల నాయకుడిగా తనపై వామపక్షాలు అభ్యర్థిని నిలపలేదన్నారు. రాష్ట్రంలో లౌకికవిలువల పరిరక్షణకు సీపీఎం, ఇతర వామపక్షాలు మద్దతునివ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఈ నెల 10న జరిగే తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. దీనిపై ఇతర వామపక్ష పార్టీలతో కూడా చర్చించాక నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. -
హైదరాబాద్‌లో దేవీప్రసాద్.. నల్లగొండలో పల్లా
అట్టహాసంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖ లు చేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి దేవీప్రసాద్ గన్‌పార్కు నుంచి ర్యాలీగా తరలి వెళ్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల రిట ర్నింగ్ అధికారి నవీన్‌మిట్టల్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, మహేందర్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా అగిరు రవికుమార్, ఎ.సునీల్‌కుమార్, సిల్వేరు శ్రీశైలం,సిద్ధి లక్ష్మణ్‌గౌడ్,ఎల్.గౌరీశంకర్‌ప్రసాద్, షేక్ షబ్బీ ర్ అలీ నామినేషన్లు వేశారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌తో సహా ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొం డ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్, ఎన్నికల అధికారి అయిన సత్యనారాయణ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రు లు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేవీప్రసాద్ విజయం ఖాయం: నాయిని సకలజనుల సమ్మెతో చరిత్ర సృష్టించిన దేవీప్రసాద్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టిస్తారని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. బుధవారం దేవీప్రసాద్ నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవీప్రసాద్‌తో పోటీ పడగల అభ్యర్థులే లేరన్నారు. ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషిచేసిన ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉద్యోగులు, పట్టభద్రులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజకీయ జేఏసీ నుంచి మరో అభ్యర్థి పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు బదులిస్తూ రాజకీయ జేఏసీ అభ్యర్థే దేవీప్రసాద్ అని, మరొకరు పోటీచేసే ప్రసక్తే లేదన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాన్నీ అర్హులకే అందేందుకు, ఉద్యమంలో పాల్గొన్నవారు చట్టసభల్లోనూ ఉండాలనే తలంపుతో సీఎం కేసీఆర్ తనకు అవకాశమిచ్చారన్నారు. సెటిల ర్స్, ఆంధ్రా ఉద్యోగులపై తనకెలాంటి వివక్ష లేదన్నారు. మూడు జిల్లాల ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఓటింగ్‌లో పాల్గొని తనను గెలిపించాలని దేవీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గులాబీ సైనికులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య పోరు : మంత్రి హరీశ్‌రావు నల్లగొండ: ఈ ఎన్నికలు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన గులాబీ సైనికులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్ సమావేశంలోనే పోల వరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి ఖమ్మం జిల్లా ప్రజల గుండెలు గాయపర్చారని మండిపడ్డారు. తాజాగా మరికొన్ని మండలాలను ఏపీలో కలిపేందుకు బీజేపీ మద్దతుతో చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కరెంట్ ఇవ్వాలని అనేకమార్లు కేంద్రమంత్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోలేదని వాపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కల సాకారం చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు అండా నిలవాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. -
'నాకు ఏపీ ఉద్యోగుల మద్దతు ఉంది'
హైదరాబాద్:తనకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కూడా మద్దతిస్తామని ప్రకటించినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ తెలిపారు. ఆంధ్రా ఉద్యోగులు తనను వ్యతిరేకిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆంధ్రా ఉద్యోగులు తాను వ్యతిరేకం కాదని దేవీప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం తాను నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు దేవీప్రసాద్ తెలిపారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్
‘మహబూబ్‌నగర్-రంగారెడ్డి - హైదరాబాద్’ పట్టభద్రుల స్థానానికి ఖరారు నేడు ‘వరంగల్ - ఖమ్మం - నల్లగొండ’ అభ్యర్థిని ప్రకటించే అవకాశం మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకుగాను తొలి అభ్యర్థిని అధికార టీఆర్ఎస్ ఖరారు చేసింది. ‘మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ’ నియోజకవర్గం నుంచి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవో) అధ్యక్షుడు దేవీప్రసాద్ పేరును ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం పార్టీ నేతలతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. మంత్రులు, పార్లమెంటు కార్యదర్శులు, ఇతర కీలక నేతలతో మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమై సుమారు ఐదు గంటలపాటు అనేక అంశాలపై చర్చించారు. సాయంత్రం దేవీప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కానీ ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ నియోజకవర్గం విషయంలో మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదు. నాలుగు రోజులుగా ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి పోటీ ఎక్కువగా ఉండడంతో కేసీఆర్ అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ మాజీ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. కానీ ఈలోగా వరంగల్ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రవీందర్రావు కూడా ప్రయత్నాలు చేశారు. ఈ ఇద్దరినీ కాదని మధ్యే మార్గంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. పలు రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం స్వయంగా అభ్యర్థి పేరును ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఆశావహులందరినీ అందుబాటులో ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తె లిసింది. కాగా దేవీప్రసాద్ తన పేరు ఖరారైనట్లు తెలియగానే కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా మండలి ఎన్నికలు మండలి ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 4, 5 తేదీల్లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు తదితర ప్రజా ప్రతినిధులందరికీ నాగార్జునసాగర్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతోపాటు ఎమ్మెల్యే కోటాలో మరో ఆరు ఎమ్మెల్సీ పదవులకు మార్చిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో మరో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకూ ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్.. మండలి ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు పార్టీ నేతలకు రెండు రోజులపాటు శిక్షణ ఇప్పించాలని భావించినట్లు తెలిసింది. ఈ శిబిరాలకు సుమారు 120 మంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే(నా)?
-
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్
హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా టీఎన్జీవో నాయకుడు దేవీ ప్రసాద్ పేరు ఖరారైంది. మరోవైపు వరంగల్, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లె రాజేశ్వరరెడ్డి పేరును టీఆర్ఎస్ అధినాయకులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం అధికారికంగా పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్జీవో నేత దేవీప్రసాద్ ముందుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీప్రసాద్ మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కాగా దేవీప్రసాద్ రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించాల్సి ఉంది. -
ప్రతిపక్షాల నజర్
ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు మెజారిటీ లేకపోయినా పీఠం కోసం ప్రయత్నాలు హైదరాబాద్‌లో రహస్య సమావేశం టీఆర్ఎస్ తరఫున తెరపైకి టీఎన్జీవో నేత దేవిప్రసాద్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మూడేళ్లుగా ఖాళీగా ఉంటున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంపై ప్రతిపక్ష పార్టీలు కూడా కన్నేశాయి. స్థానిక సంస్థల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఏ ఒక్క పార్టీకి సొంతంగా గానీ, అన్ని పార్టీలు ఏకమై బరిలోకి దిగినా ఈ పీఠాన్ని గెలుచుకునేందుకు సరి పడా మెజారిటీ లేదు. అయినా.. ఈ స్థానం కోసం ప్రతిపక్ష పార్టీల నే తలు ఒకరిద్దరు తెరవెనుక పావులు కదుపుతున్నా రు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు, అధికార పార్టీ సభ్యులకు కూడా భారీ మొత్తంలో నజరానాలు ఇచ్చి గట్టెక్కేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు మూడు ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. గతంలో కూడా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్‌కు చెందిన ప్రేంసాగర్‌రావు ఇలాగే ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అప్పట్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కన్నా టీడీపీకి సుమారు 160 మంది సభ్యుల మెజారిటీ ఉండేది. అయినా కొందరు టీడీపీ సభ్యుల సహకారంతో కాంగ్రెస్ నుంచి ప్రేంసాగర్‌రావు గట్టెక్కారు. ఈసారీ అలాంటి ఎత్తుగడలు వేసేందుకు టీఆర్ఎస్యేతర పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగనుంది. చివరిసారిగా జిల్లాలోని స్థానిక సంస్థలకు 2007లో ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన ప్రేంసాగర్‌రావుకు లాటరీలో ఆరేళ్ల పదవీ కాలం లభించింది. 2013తో ఆయన పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంటోంది. తెరపైకి దేవిప్రసాద్ పేరు.. అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కొత్తగా టీఎన్జీవో నేత దేవిప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు దేవిప్రసాద్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్‌కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత శ్రీహరిరావు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ పేరు కూడా అధినేత పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపు అవకాశాలు పూర్తిస్థాయిలో ఉన్న జిల్లా నుంచి టీఎన్జీవో నేత దేవిప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్కు అత్యధిక బలం.. వరుస ఎన్నికల్లో జిల్లాలో విజయ ఢంకా మోగించిన టీఆర్ఎస్ స్థానిక సంస్థలపై గులాబీ జెండాను ఎగురవేసింది. జిల్లా పరిషత్‌తోపాటు, భైంసా మినహా మిగిలిన ఐదు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే 52 మండలాల్లో 42కు పైగా మండల పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కొన్ని మండలాల్లో అసలు ప్రతిపక్ష పార్టీల ఉనికే లేకుండా పోయింది. పూర్తి మెజారిటీ ఉన్న టీఆర్ఎస్కు విజయావకాశాలున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు ఎప్పుడో పూర్తి చేసింది. ఈ స్థానిక సంస్థల జిల్లా ప్రజాప్రతినిధుల ఓటరు జాబితాను రెండు నెలల క్రితమే ఎన్నికల సంఘానికి పంపారు. -
అంతర్జాతీయ ట్రేడ్ సదస్సుకు దేవీప్రసాద్
ఖాట్మాండులో ఈనెల 12 నుంచి 15 వరకు సమావేశాలు సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లోని ఖాట్మాండులో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే 12వ అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్‌కు రాష్ట్రం నుంచి టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హాజరు కానున్నారు. ప్రతి మూడేళ్లకోసారి జరిగే ఈ సమావేశాలకు హాజరు కావాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్‌నుంచి ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు హాజరుకానున్నారు. మన దేశం నుంచి 10 మందికి ఆహ్వానం అందినట్లు టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉద్యోగ, కార్మిక విధానాలు, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు, సంక్షేమ పథకాలపై ఉద్యోగుల స్పందించేతీరు, పనివిధానం ఎలా ఉందన్న అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు.