హైదరాబాద్ : ఉమ్మడి రాజధాని విషయంలో సీమాంధ్ర నుంచి వ్యతిరేకత వస్తోందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనకు ఎవరూ ఒప్పుకోవటం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత కింది నుంచి పైస్థాయి వరకూ అందరూ రెండుగా చీలిపోయారని దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. విభజనతో పాటు హైదరాబాద్, వచ్చే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే శేషారెడ్డి మాట్లాడుతూ సాధ్యం కానిది ఏమీ లేదని... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి పోరాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, నేతలు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారే తప్ప, రాబోయే తరం గురించి ఆలోచించటం లేదని శేషారెడ్డి అన్నారు.
ఉమ్మడి రాజధానిపై సీమాంధ్ర నుంచి వ్యతిరేకత
Published Fri, Sep 13 2013 8:59 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement