Joint capital
-
ఉమ్మడి రాజధాని: పదేళ్ల హక్కు కేసీఆర్‌కు చంద్రబాబు తాకట్టు
తాడికొండ: రాష్ట్ర విభజన అనంతరం 2024 వరకు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను వాడుకునే హక్కును కేసీఆర్‌కు తాకట్టు పెట్టి అర్ధరాత్రి ఆంధ్రా కరకట్టకు పారిపోయి వచ్చిన చంద్రబాబుకు సీఎం జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 227వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. కరోనా రోగులను హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటుంటే చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు అండ్ కో కేసీఆర్‌ను పల్లెత్తు మాట ప్రశ్నించకుండా.. ఇక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయి.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా పారిపోయి వచ్చినందునే.. నేడు ఈ దుస్థితి దాపురించిందన్నారు. బాబుకు కొమ్ముకాస్తూ ఏపీ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలిన ఎంపీ రఘురామకృష్ణరాజు పాపం పండి జైలుకు వెళ్లాడని, ఇక చంద్రబాబు, నారా లోకేష్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. -
సెక్షన్ 8పై పిల్ సరికాదు
రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు: హైకోర్టు హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కట్టబెట్టాలని పేర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8ని కొట్టేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) రూపంలో పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ చట్ట నిబంధన చట్టబద్ధతను పిల్ రూపంలో సవాలు చేయడానికి వీల్లేదని, అందువల్ల ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని స్పష్టం చేసింది. సెక్షన్ 8పై పిల్ కాకుండా, రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని తేల్చి చెప్పింది. దీంతో పిటిషనర్లు తమ పిల్‌ను ఉపసంహరించుకుని, రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 8ని కొట్టివేయాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన రైతు సాంబరాజు పద్మనాభరావు, శ్రీరామగిరి స్పిన్సింగ్ మిల్స్ డెరైక్టర్ (ఫైనాన్స్) అల్లం భిక్షం, న్యాయవాదులు మరిశెట్టి తాతాజీ, కె.మోహన్‌రాజులు సంయుక్తంగా హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది
తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చంద్రబాబు * ఉమ్మడి రాజధాని, సెక్షన్-8పై గవర్నర్దే అధికారం * కానీ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు * పదేళ్ల తర్వాతే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది * ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు * పార్టీలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది * టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో సీఎం వ్యాఖ్యలు సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతి మరచిపోయి తెలంగాణ ప్రభుత్వం ప్రతీదానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం ఉంటుంది. కానీ ఈ అంశాలపై గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు. అయినా మన మంత్రులు, ఎంపీలు, అధికారులపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం ఎలా చేస్తుంది? పదేళ్ల తరువాతే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అవుతుందనే విషయం గుర్తించాలి. ఉద్యోగుల భద్రత, ఆంధ్రుల ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీఆర్ఎస్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. విజయవాడ శేషసాయి కల్యాణమండపంలో శనివారం జరిగిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ 9, 10 పరిధిలో ఉన్న సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్లలేకపోయామని, చాలా చోట్ల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల గైర్హాజరు... బాబు అసంతృప్తి విస్తృతస్థాయి సమావేశానికి కీలక నేతలు సైతం గైర్హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన గంటకుపైగా మీటింగ్ హాలులో కుర్చీలు ఖాళీగా ఉండటంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆహ్వానితులు కచ్చితంగా టైమ్‌కు రాకపోతే ఎలా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సుకు, శనివారం పార్టీ సమావేశానికి కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావుతోపాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి హాజరుకాలేదు.ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, పూసపాటి అశోక్‌గజపతిరాజు, పార్టీ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడారు. జర్నలిస్టులకు పెద్ద ఆసరా: సీఎం రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులతో సమాన సౌకర్యాలు ఉండే హెల్త్‌కార్డు జర్నలిస్టులకు పెద్ద ఆసరాగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. 14వేలమంది జర్నలిస్టుల్లో 8,321మందికి హెల్త్‌కార్డులను జారీ చేస్తున్నామని చెప్పారు. మినీ సెక్రటేరియట్‌కు రూ.3 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లో అద్దెకుంటున్న భవనంలోనే ఓ భాగంలో (డోర్ నెం.8-2-293/82/ఎ/369-బి) మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసేందుకు లీజు అగ్రిమెంటు కింద ప్రభుత్వం రూ.3 లక్షలు మంజూరు చేసింది. మంత్రివర్గ సమావేశం 3కి వాయిదా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై 3కు వాయిదా పడింది. తొలుత ఈ సమావేశా న్ని జూలై 2న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా సాక్షి, విజయవాడ బ్యూరో: రంజాన్ సం దర్బంగా రాష్ట్రంలోని ముస్లింలకు చం ద్ర న్న రంజాన్ తోఫా ( కానుక)ను ఇస్తున్న ట్టు చంద్రబాబు ప్రకటిచారు. శనివా రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల కార్యక్రమం లో సీఎం ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ కానుకలో రెండు కిలోల పంచదార, కిలో సేమియా, ఐదు కిలోల ఆటా (గోధుమ పిండి) పంపిణీ చేస్తామన్నారు. -
'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు'
హైదరాబాద్: విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ నరసింహాన్‌కు అప్పగించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఈ అధికారం తక్షణమే అప్పగించాలని కేంద్రాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు. -
‘ఆవిర్భావా’నికి ఆర్భాటమేల?
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటూ, ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్నందున తామింకా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నట్లు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు నాటి మద్రాస్ ప్రభుత్వం మద్రాస్ నగరంలో ఆంధ్రులకు తాత్కాలిక రాజధానిని కూడా అనుమతించలేదు. ఏపీ ప్రభుత్వాన్ని, రాజధానిని హైదరాబాద్ నుంచి తరలించేంత వరకు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా మనజాలదు. ప్రథమ వార్షికోత్సవ సంబరాలకంటే సీఎం కేసీఆర్ ఈ అంశంపైనే దృష్టిపెట్టాలి. ప్రియమైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవ శుభ సందర్భంగా మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైంది. మీ విధానాల అమలుకు తోడ్పడేందుకోసం ఈ ఉత్త రంలో నా నిర్మాణాత్మక ఆలోచనలను పొందుపరుస్తున్నాను. ఎంతో నమ్ర తతో, విశ్వాసంతో నేను రాస్తున్న ఈ లేఖను మీరు ప్రత్యేక శ్రద్ధతో పరిశీ లిస్తారని ఆశిస్తున్నాను. మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంవ త్సర కాలం పూర్తి చేసుకున్నందుకు మీకు నా శుభాభినందనలు. గత ఏడాదిగా ప్రభుత్వ విధానాలు, పనితీరును సమీక్షించుకోవడానికి ఇది తగిన సమయమని నా అభిప్రాయం. తెలంగాణలోనే ఉన్నామా? నా మౌలిక ప్రశ్న ఏమిటంటే.. మన కలల తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధిం చుకున్నామా? మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ, వాస్తవంలో హైదరా బాద్‌లో ఒక భాగాన్ని మాత్రమే పొందాము. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంతో చిక్కల్లా ఏదంటే హైదరాబాదే. పైగా విభజన చట్టం పదేళ్లపాటు అంటే 2025 వరకు కొన్ని కీలకమైన అంశాలను తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో లేకుండా వెలుపల ఉంచినట్లు కనిపిస్తోంది. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇది 5 ఏళ్లుగా మాత్రమే ఉండేది. కానీ ఆంధ్రా లాబీ ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలపై అన్నిరకాలుగా ఒత్తిళ్లు పెట్టి పదేళ్లకు పొడిగించారు. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఎంఐఎమ్ నేత అసదుద్దీన్ లోక్‌సభలో దీనిపై 19 సవరణలు ప్రతిపాదించారు. పైగా సోనియా వద్ద కూడా ఆయన ఈ అంశంపై చర్చకు పెట్టారు. ఆయన్ను మనం అభినందించాలి. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, టీఆరెస్ ఎంపీల పాత్ర పెద్దగా లేదని మీరు గుర్తించాలి. అదే సమయంలో అన్ని పార్టీల ఆంధ్ర ఎంపీలు, కేంద్ర ప్రభుత్వంలోని 7 గురు ఆంధ్రా మంత్రులు, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రి వెంకయ్య నాయుడు జోక్యం వల్ల బిల్లు పూర్తిగా మారిపోయింది. దీంతో ఆంధ్ర నేతలను సంతోషపెట్టే క్రమంలో హైద్రాబాద్‌లో ఒక ముక్కను మాత్రమే మనం పొందగలిగాం. అందుకే మునుపటిలాగానే హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ కొనసాగుతోందని తెలంగాణ కార్యకర్తల్లో అభిప్రాయముంది. తాము కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఏడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవాన్ని సంబరంగా జరుపుకోవలసిన అవ సరం ఉందా అనే అంశాన్ని మీరు తీవ్రంగా పరిశీలించాలి. చట్టం నుంచి ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి గవర్నర్‌ని తొలగించినప్పుడు, గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాం టి జోక్యం లేకుండా తెలంగాణ ప్రభుత్వం స్వేచ్ఛగా పని చేసుకోవడాన్ని అనుమతించినప్పుడు మాత్రమే భారీస్థాయిలో మనం సంబరాలు జరుపుకో వచ్చన్న నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు. ఇది మీరు పరిశీలనలోకి తీసుకోవలసిన కీలక సమస్య. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో మిగులు రాష్ట్రం. కాబట్టి మరో నాలుగేళ్లపాటు మీరు దీన్ని మిగులు రాష్ట్రంగానే ఉంచాలి. గతంలో ఆంధ్ర పాలకులు చేసినట్లుగా కాకుండా మన సొంతవనరుల నుంచి వచ్చే ఆదాయం తోటే తెలంగాణను అభివృద్ధి చేయాలి. కాబట్టి ప్రభుత్వ డబ్బును వివిధ అవసరాలకు ఖర్చు పెట్టేటప్పుడు పొదుపు పాటించాల్సి ఉంది. ఇది మాత్ర మే రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం స్థాయిలో ఉంచుతుంది. కాబట్టి మీ పరిధిలో ఉన్న శాఖలు పెడుతున్న అనుత్పాదక వ్యయాన్ని మీరు సమీక్షించాలి. ఈ విధంగానే మీ మంత్రులు తమ శాఖలతో వ్యవహరించడంలో మీరొక కొత్త ట్రెండ్‌ను ఏర్పర్చగలరు. ఈ విషయానికి సంబంధించి, ‘ప్రతి ముఖ్యమంత్రి ప్రజాధనానికి ట్రస్టీ మాత్రమే. ప్రతి రోజూ వారు భారీ ఎత్తున డబ్బును సేకరించి, ఖర్చు పెడుతుంటారు. అయితే ఆ వ్యయం పారదర్శకతతోనూ, జవాబుదారీతనంతోనూ ఉండాలి’ అంటూ మొదట్లో గాంధీజీ, తర్వాత సుప్రీంకోర్టు చేసిన సూచనను మీరు మననం చేసుకోవాలి. సమస్య మూలం హైకోర్టే ఇక కీలకమైన హైకోర్టు సమస్యపై మీరు తక్షణం దృష్టి సారించాలి. మరో మూడు నెలల్లో హైకోర్టు విభజనను సాధించాలి. ప్రస్తుతం హైకోర్టులోని 28 మంది జడ్జీలలో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణకు సంబంధించిన వారు. 22 మంది ఆంధ్ర నుంచి వచ్చారు. అందుకే హైకోర్టుకు సంబం ధించినంత వరకు తామింకా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామన్న భావనతో మన న్యాయవాదులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రానికి సంబంధించిన మెజారిటీ న్యాయమూర్తులు కలిగించే ప్రభావాన్ని మనం సులువుగానే అర్థం చేసుకోగలం. కాబట్టి మీ ప్రభుత్వం హైకోర్టు విభజన కోసం ఇక్కడా, ఢిల్లీలో కూడా తీవ్రంగా ప్రయత్నించాలి. రోజువారీ ప్రాతి పదికన ఈ సమస్యతో వ్యవహరిం చడానికి మీరు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పర్చాలి. పై సమస్యల పరిష్కారంలో ఇటీవలే రిటైరైన ప్రముఖ సుప్రీం కోర్టు జడ్జీలు, ఇతర న్యాయ ప్రముఖులు మీకు తోడ్పడగలరు. ఈ తరుణంలో ప్రభుత్వానికి అనుభవజ్ఞులైన విజ్ఞానఖనుల సలహా, సూచనలు ఎంతైనా అవసరం. స్వచ్చందంగా సహకరించడానికి వివిధ రంగాల్లో సమర్థులు, అనుభవజ్ఞులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎలాంటి ప్రోత్సాహకాలనూ ఆశించకుండా ప్రభుత్వానికి సేవలందించేవారున్నారు కాని వీరి సేవలందుకునే విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రయత్నమైనా జరిగిందా? ఈ సందర్భంగా 2043 ఏళ్ల క్రితం నివసించిన అలెగ్జాండర్ ది గ్రేట్ చరిత్రను మనం గుర్తు తెచ్చుకోవాలి. భారతదేశాన్ని జయించిన తొలి చక్రవర్తిగా ఈయన పేరు మన చరిత్రలో నమోదైంది. ఇంతటి ధీమంతుడికి అరిస్టాటిల్ బోధకుడిగా, సలహాదారుగా ఉండేవాడు. ఆయన పర్యవేక్షణ వల్లే అలెగ్జాండర్ గర్వం, అహంకారం నుంచి బయటపడి అనేక దేశాలను జయిం చగలిగాడు. నేటి భారత పాలకులకు కూడా ఇది చక్కటి పాఠం కాగలదు. ఈ నేపథ్యంలో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు నాటి మద్రాస్ ప్రభుత్వం మద్రాస్ నగరంలో ఆంధ్రులకు తాత్కాలిక రాజధానిని కూడా అనుమతించని ఘటనను మీరు మననం చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లోనే ఆంధ్రా నేతలు కర్నూలులో తమ సొంత రాజధానిని, ఆంధ్ర హైకోర్టును గుం టూరులోనూ ఏర్పర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా మద్రాసు నగరాన్ని ఉంచాలంటూ జస్టిస్ వాంచూ కమిటీ సమర్పించిన నివే దికను నెహ్రూ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అలాగే మద్రాసు నగరంలో తాత్కాలికంగా ఆంధ్రా హైకోర్టును నెలకొల్పాలంటూ వాంచూ కమిటీ చేసిన ప్రతిపాదనను కూడా నెహ్రూ ప్రభుత్వం తోసిపుచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం నాటి మద్రాస్ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. మద్రాసును ఉమ్మడి రాజధానిని చేస్తే పలు సమస్యలు పుట్టుకొస్తాయని, వాటి పరిష్కా రంతో తమ సమయం వృథా అవుతుందని నాటి మద్రాస్ సీఎం సి.రాజగో పాలాచారి, ఎంపీలు పోరుపెట్టారు. కానీ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర నేతలకు అనుకూలంగా వివాదాస్పద నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించాయి. ఆ కీలక సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలాంటి తీవ్ర నిరసనను ప్రకటిం చకుండా ఉండిపోయారు. వారు సామూహికంగా రాజీనామాలు సమర్పిం చాల్సి ఉండె. ప్రత్యేకాంధ్ర కోసం జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా 1972 నవంబర్‌లో ఆంధ్రా ప్రాంతంలోని కాంగ్రెస్ మంత్రులు రాజీనామాలు సమర్పించారు. ఆ సమయంలో ఒత్తిడి వ్యూహాల ద్వారానే వారు కాంగ్రెస్ అధిష్టానాన్ని బెదిరించి మరీ తమ డిమాండ్లన్నీ సాధించుకు న్నారు. అయితే ఆంధ్ర కాంగ్రెస్ నేతల ఉదాహరణల నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలాంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు అనేవి మీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ప్రతిబంధకాలను కలిగిస్తాయి. ఈ పరిస్థితుల్లో దేశంలోని 28 ఇతర రాష్ట్రాలకు మల్లే తెలంగాణ ప్రభుత్వం తన రాజ్యాంగ విధులను నెరవేర్చడం చాలా కష్టం. కాబట్టి ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు అనేవి మన రాష్ట్ర రాజ్యాంగ హక్కులను అతిక్రమిస్తున్నాయి. పైగా భారత ప్రభుత్వ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి ఇది విరుద్ధంగా ఉంటోంది. 1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రా లేవీ నేడు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలకు గురికాలేదు. కాబట్టి ఈ ఉమ్మడి ప్రహసనానికి వీలైనంత త్వరలో తెర దించాలి. ఈ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసికట్టుగా నిరసనలు తెలుపాలి. పై కారణాల వల్ల ఆంధ్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర హైకోర్టును వారి సొంత రాష్ట్రానికి ఎంత త్వరగా పంపించాలి అనే అంశంపై మీరు కార్యాచరణను రూపొందించుకోవాలి. ఇదే మన సమస్యకు మూలం. దీన్ని పరిష్కరిస్తే ఆరు కోట్ల మంది ఆంధ్రులు, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు. రాష్ట్ర సారథిగా మీకు నా అభినందనలు, శుభాకాంక్షలు. (కేసీఆర్‌కు మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి రాసిన బహిరంగ లేఖలోని ప్రధానాంశాలు ఇవి) మొబైల్ : 7702941017 : panditnr@gmail.com) - ఎమ్.నారాయణ రెడ్డి -
‘విభజన’ పరిష్కారం ఇక వేగిరం!
గవర్నర్ చేతికి హైదరాబాద్ శాంతిభద్రతలు రూల్స్ జారీకి కేంద్ర హోంశాఖ సుముఖత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య విభజన వివాదాల పరిష్కారం ఇక వేగవంతం కానుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్సీ గోయల్ నియామకం కావడంతో విభజన చట్టంలోని అంశాలను ఇక వేగంగా అమలుచేసే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడు భావిస్తున్నారు. బుధవారంనాటి ఢిల్లీ పర్యటనలో సీఎస్, డీజీపీలు ప్రత్యేకంగా హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమై విభజన అంశాలను వివరించారు. ఈ క్రమంలో గోయల్ సానుకూలంగా స్పందించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలి వరకు హోం కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామి కాలయాపన చేశారని, ఇప్పుడా పరిస్థితి ఉండదని ఏపీ కూడా భావిస్తోంది. విభ జన చట్టంలోని సెక్షన్ 8(సి) మేరకు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పదేళ్లపాటు గవర్నర్ పర్యవేక్షించాలి. దీనికి కేంద్ర హోంశాఖ రూల్స్ జారీ చేయలేదు. దీనిపై స్పందించిన గోయల్.. సాధారణ రూల్స్ జారీ చేయవచ్చని అన్నట్టు తెలిసింది. ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు లేదా జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సంస్థల ఆస్తుల పంపిణీ విషయంలో చట్టంలో హెడ్ క్వార్టర్స్ అని ఉండడంతో టీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ సంస్థల్లోని ఆస్తుల పంపిణీకే అంగీకరిస్తామని, మిగతా సంస్థల పంపిణీకి అంగీకరించబోమని పేర్కొంది. దీనిపై హెడ్ క్వార్ట ర్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సంస్థలే అంటే కుదరదని, ఆర్టీసీకి ఉమ్మడి రాజధానిలో బాడీ బిల్డింగ్ యూనిట్‌ను, ఆసుపత్రిని నిర్మించారు దానిలో కూడా వాటా కావాలని ఏపీ కోరుతోంది. దీనిపై కూడా కేంద్రం వివరణ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 10వ షెడ్యూల్లో 107 సంస్థలుండగా ఆ సంస్థలు పదేళ్ల పాటు ఉమ్మడి యాజమాన్యంలో పనిచేసేలా ఇరు రాష్ట్రాలూ అవగాన ఒప్పందాలు చేసుకునేలా హోంశాఖ చర్యలు చేపట్టనుంది. -
రాజధానిపై మక్కువేల?
* మదనపల్లె తాగునీటి సమస్యపై పోరాటం * ఎంపీ మిథున్‌రెడ్డి మదనపల్లె: ‘పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ప్రస్తు తం రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సింది పోయి రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రికి అంత మక్కువ ఎందుకు’ అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కుని వారికి జీవనాధారం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మదనపల్లెలోని వైఎస్సార్ సీపీ నాయకులు రైస్ మిల్ మాధవరెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని పేరుతో తెలుగుదేశం నాయకులు విలువైన భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను బలవంతంగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం బాధాకరమని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో కరువు తీవ్రం గా ఉందని, పశువులకు గ్రాసం లేకపోవడం, వ్యవసాయానికి సాగునీరు లేకపోవడంతో భూములన్నీ బీళ్లుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తాగేందుకు నీరు కూడా లేవని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి కోట్లాది రూపాయలను రాజధాని పేరుతో ఖర్చు చేయడం తగదన్నారు. కేవలం రూ.750 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీ-నీవా కాలువ ద్వారాకృష్ణా నదీ జలాలు రాయలసీమకు వచ్చే అవకాశముందన్నారు. వీటి గురించి పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా మదనపల్లె మున్సిపాలిటీలో 15 రోజులకొకసారి తాగునీరు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూడు రోజులకొకసారి ఇవ్వకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుండ్లూరి షమీం అస్లాం, జిల్లా కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు షరీఫ్, యువజన విభాగం కార్యదర్శి ఎస్ఏ కరీముల్లా, యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, నియోజకవర్గ మైనారిటీ నాయకులు బాబ్జాన్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బిజినెస్ రూల్స్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు
పాల్వాయి ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి హరీబాయి చౌదరి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానికి సంబంధించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా బిజినెస్ రూల్స్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీబాయి చౌదరి సభకు లిఖితపూర్వక సమాధానం అందజేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పాలనా సౌలభ్యం కోసం ప్రజల ప్రాణ, ఆస్తుల సంరక్షణపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ ట్రాన్సాక్షన్ రూల్స్(బీటీఆర్)ను మార్చేందుకు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం జూన్ 4న బీటీఆర్ మార్చడంపై అభిప్రాయాన్ని కోరగా జూలై 5న తెలంగాణ ప్రభుత్వం బదులిచ్చింది. శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రివర్గం ద్వారా గవర్నర్‌కు నివేదికలు పంపిస్తామని ఆ లేఖలో పేర్కొంది. సంబంధిత నేరాలను గమనించేందుకు డీజీపీ కార్యాలయంలో ఒక అధికారిని నియమిస్తామంది. అలాగే ఉమ్మడి రాజధాని ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో భాగమని, ఇక్కడ ఉమ్మడి శాంతిభద్రతల బలగాలు ఉండబోవని తెలిపింది. శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలో అంశమైనందున.. ఇతర రాష్ట్రాలకు చెందిన బలగాలు తమ రాష్ట్ర పరిధిలో ఉండజాలవని తెలంగాణ పేర్కొంది.’ అని వివరించారు. -
హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలూ ఉండవు: ఎంపీ కవిత
హైదరాబాద్ : ‘హైదరాబాద్ కామన్ క్యాపిటలే తప్ప జాయింట్ క్యాపిటల్ కాదు... దానిపై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలూ ఉండవు’ అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థల ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 2 తరువాత ఉద్యమాలకు రెస్ట్ ఉంటుందని అనుకున్నాం కాని అది జరగడం లేదని పోలవరం, ఉద్యోగుల విభజన, హైదరాబాద్ ఆస్తులు, గవర్నర్ అధికారాలపై ఇలా నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, విఠల్, జేఏసీ ప్రతినిధులు రమణరెడ్డి, థామస్‌రెడ్డి, గోవర్ధన్, కనకరాజు, అంజయ్య, వెంకటేశ్వరరావు, కరీముల్లాతో పాటు వివిధ కార్పొరేషన్లకు చెందిన యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తరలింపులో తొందరొద్దు
తుది నివేదికలో... ఉమ్మడి రాజధాని పదేళ్లు ఉందన్న సంగతి మరవద్దు తాత్కాలిక కార్యాలయాల కోసం గుంటూరు - విజయవాడను పరిశీలించవచ్చు అలాగే, తక్షణావసరాల కోసం నూజివీడు - గన్నవరం - ముసునూరు ప్రాంతాన్ని చూడొచ్చు కొత్తగా(గ్రీన్‌ఫీల్డ్) సూపర్ సిటీ నిర్మించే హడావుడి వద్దు హైకోర్టుకు విశాఖ బెస్ట్.. హైకోర్టు, సచివాలయం ఒకే చోట ఉండాలని లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక, ఇతర అంశాలపై సూచనలు చేయడానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ గడువుకు రెండు రోజుల ముందే నివేదికను సిద్ధం చేసింది. ఇంతకాలం సాగిన ‘విజయవాడ రాజధాని’ ఊహాగానాలకు ఇందులో ఎలాంటి ముగింపు లేదు. అభివృద్ధి అంతా ఒక్కచోట కేంద్రీకరించరాదన్న సూత్రానికి మాత్రం పెద్ద పీట వేశారు. తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సిబ్బంది, చిన్న కార్యాలయాలతో సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయం ఏర్పాటు చేయడానికి వీజీటీఎం(విజయవాడ గుంటూరు, తెనాలి, మంగళగిరి), దాని వెలుపల ఉన్న అవకాశాలను పరిశీలించవచ్చునని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. హైదరాబాద్‌లో పని చేస్తున్న కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రక్రియలో తొందరపాటు తగదని నిష్కర్షగా చెప్పింది. అదే జరిగితే అనర్థమేనని, కొన్ని అనుభవాలను ఉటంకించింది. హైకోర్టును విశాఖపట్నంలో నెలకొల్పే ప్రతిపాదనకు కమిటీ ఓటు వేసింది. ఎలాంటి శషభిషలూ లేకుండా కమిటీ వెల్లడించిన అంశం ఇదొక్కటే. ప్రస్తుత పరిస్థితులలో గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరం ఏర్పాటుకు బృందం సానుకూలత వ్యక్తం చేయడంలేదు. రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టులకు స్థలాలను ఎంపిక చేయడానికి తొందరేమీ లేదనీ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఇందుకు పదేళ్లు వ్యవధిని ఇస్తోందని కమిటీ అభిప్రాయపడింది. అయినా ఏ కార్యాలయం ఎక్కడికి తరలించాలన్న అంశం మీద సత్వర నిర్ణయాలు మాత్రం జరగాలని పేర్కొన్నది. తుది నివేదికలో పలు ఆసక్తికర సూచనలను కమిటీ చేసింది. నివేదికలోని ప్రధానాంశాలు... కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ చట్టం 2014 కింద కేసీ శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ ఏడాది మార్చి 28న ఏర్పడిన ఈ కమిటీ ఆరు నెలల్లోగా (ఆగస్టు 31) తన నివేదికను సమర్పించాల్సి ఉండగా రెండు రోజుల ముందే 29న సమర్పించింది. సార్వత్రిక ఎన్నికలు, నూతన రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తదితర కారణాల వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడానికి వాస్తవంగా కమిటీకి లభించిన సమయం దాదాపు పన్నెండు వారాలు మాత్రమే. ఈ తక్కువ వ్యవధిలోనే కమిటీ మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాలను సందర్శించగలిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, తదితర మంత్రులతోనూ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ, ప్రభుత్వేతర సంస్థలతోనూ, ఇంకా ఇతరులతోనూ సంప్రదింపులను జరిపింది. ఈ-మెయిల్ ద్వారా అందిన 4,728 సూచనలను కూడా కమిటీ పరిశీలించింది. మునుపటి ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడం ఒకవంక పలు సమస్యలను సృష్టించింది, మరోవంక 13 జిల్లాలతో కూడిన రాష్ర్టం అంతటా సంతులిత అభివృద్ధిని సాధించడానికి అమూల్యమైన అవకాశాలను కూడా అందించిందని కమిటీ అభిప్రాయపడింది. ఒకప్పటి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అందుకు సార్వత్రిక మద్దతు లభించినట్టుంది. కానీ తెలంగాణ ఏర్పాటు మాత్రం ఏపీలో కొంత అసంతృప్తికి దారితీసింది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ప్రాంతీయ, ఉపప్రాంతీయ ఆకాంక్షలు గణనీయంగా పెరుగుతున్నాయని, తరచుగా అవి అసంతృప్తి, ఆందోళనల రూపంలో వ్యక్తమవుతున్నాయని కమిటీ గుర్తించింది. అంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి సముచితమైన రీతిలో పంపిణీ అయ్యేట్టుగా చూడటం, రాజధాని నిర్వర్తించాల్సిన వివిధ విధులకు ఆ ప్రాంతం ఎలా తోడ్పడేదిగా ఉండటం అనేదే నివేదిక రూపకల్పనలోని ప్రధాన లక్ష్యమైంది. రాయలసీమలోని పలు ప్రాంతాలను సందర్శించినప్పడు రాజధానిని ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు కమిటీకి వినవచ్చాయి. అందుకోసం ఆందోళనలను చేపడతామనే బెదిరింపులను సైతం దాని ముందు వ్యక్తమయ్యాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం ప్రభుత్వ కార్యాలయాల స్థాపనకు, భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఒకటి లేదా రెండు భాగాల పట్ల పక్షపాతం చూపుతారనే భయం రాయలసీమలో ఇప్పటికీ ఉంది. అందువల్లనే మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో రాజధాని విధులను నిర్వహించే ప్రాంతం అనేది కమిటీ ప్రధాన లక్ష్యంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందున్న సవాళ్లు: ఆర్థికాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని సుగమం చేయడానికి ఉద్దేశించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని శివరామకృష్ణన్ కమిటీ స్ఫూర్తిగా తీసుకున్నది. ప్రారంభం నుంచి ఈ కమిటీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక ఉత్పాదనలో 20 శాతం మాత్రమే వ్యవసాయం, దాని అనుబంధ రంగాల నుంచి వస్తుండగా, 14 శాతం ఉత్పాదన ఫైనాన్స్, స్థిరాస్తి రంగంనుంచి, మరో 14 శాతం ఉత్పాదన వాణిజ్యం, హోటల్స్, రెస్టారెంట్ల నుండి వస్తున్నట్లు తెలిసింది. వస్తూత్పత్తి రంగం దోహదం చాలా తక్కువ. మొత్తం శ్రామిక శక్తిలో 52 శాతం వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనే ఉండగా వస్తూత్పత్తి రంగంలో కేవలం 10 శాతం శ్రామికులు మాత్రమే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్ర (తెలంగాణేతర) జనాభా 4.94 కోట్లు కాగా 2051 నాటికి ఈ ప్రాంత జనాభా 6.7 కోట్లకు చేరుకుంటుంది. పెరగనున్న ఈ అదనపు శ్రామిక శక్తికి ఉద్యోగాలు వెదికిపెట్టడమే ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోనున్న అతి పెద్ద సవాలు. ఈ కోణం నుంచే తన పని మొదలు పెట్టవలసి ఉంటుందని కమిటీ గుర్తించింది. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, ఉప ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా వ్యూహాన్ని సూచించడమే తన కర్తవ్యంగా కమిటీ భావించింది. రాజధాని పాలనా నిర్వహణకు సాధ్యమయ్యే ప్రాంతాన్ని విశ్లేషించడానికి కమిటీ దీన్నే దృష్టిలో ఉంచుకుంది. ఆర్థిక వృద్ధి, ఉపాధి, ఆదాయ సృష్టి, అభివృద్ధి అవకాశాల సమాన పంపిణీ అనేవి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి అత్యవసరమైనవని కమిటీ దృఢ అభిప్రాయం. వ్యవసాయంపై దాదాపు 55 శాతం మంది ఆధారపడి ఉండటం, సాపేక్షంగా తక్కువ అక్షరాస్యత (65 శాతం), స్వల్ప పట్టణీకరణ (29శాతం) తోపాటు, పెరుగుతున్న యువ శ్రామిక శక్తి, వస్తూత్పత్తి-సేవల రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం వంటివి సవాలుగా ఉన్నాయి. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలను రాష్ట్రం సృష్టించాల్సి ఉంది. ఉత్పాదకత అధికస్థాయికి చేరుకున్నాక ఏటా మూడు లక్షల ఉద్యోగాల కల్పన అవసరమవుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి, ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి శివరామకృష్ణన్ కమిటీ జిల్లా వారీ సామాజిక, ఆర్థిక డేటాను సేకరించింది. కమిటీ చర్చల నేపథ్యాన్ని, వాటి హేతుబద్ధతను అర్థం చేసుకోవడానికి ఈ నివేదిక దోహదపడుతుంది. రాజధాని విధులు ఒక నగరాన్ని ప్లాన్ చేయడం, రూపొందించడం, కార్యకలాపాలను నిర్వర్తించడం అనేది సుదీర్ఘ ప్రక్రియ. కేవలం అయిదు నెలల స్వల్ప కాలంలో రాజధానికి సంబంధించి మూడు వైఖరులను కమిటీ పరిశీలించింది. 1. గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతం. ఇక్కడ ఒకే నగరం/సూపర్ సిటీని నిర్మించవచ్చు 2. ప్రస్తుతం ఉన్న నగరాలను విస్తరించడం. 3. అన్నిప్రాంతాలకూ అభివృద్ధి పంపిణీ గ్రీన్‌ఫీల్డ్ రాజధానీ నగరం ఏర్పాటు ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ‘ప్రపంచ స్థాయి నగరం’ గురించి పదే పదే సూచిస్తున్నారు. రాజధానికి అనువైన ప్రాంతాల పరిశీలనకు, రాజధాని రూపకల్పనను నిర్ణయించేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అధ్యక్షతన ప్రభుత్వ స్థాయిలో ఒక కమిటీని కూడా నియమించింది. ప్రభుత్వ విధులు అత్యంత వైవిధ్యభరితంగా, సృజనాత్మకంగా ఉంటున్న నేటి కాలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట ఉంచాలనుకోవడంలో ప్రత్యేక కారణమేదీ కనబడదు. స్వాతంత్య్రానంతర ప్రత్యేక పరిస్థితుల్లో చండీగఢ్‌ను 115 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, గాంధీనగర్‌ను 177 చ.కి.మీలలో, భువనేశ్వర్‌ను 419 చ.కి.మీలలో కొత్త నగరాలుగా నిర్మించారు. మొత్తంగా నేటి ఏపీ అభివృద్ధి సాంద్రతను దృష్టిలో ఉంచుకుంటే ఇంత భారీ స్థాయిలో భూములు లభ్యంకావటం కష్టమే. రాష్ట్రంలోని వివిధ నగరాలకు ఉన్న రోడ్డు, రైలు మార్గాల సదుపాయాలను, వాటిని మరింతగా అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి ఉన్న అవకాశాలను గమనంలోకి తీసుకుంటే ఒకే ప్రాం తంలో సూపర్ నగరానికి అనువైన ప్రదేశం కోసం అన్వేషిం చడం అనవ సరం. పైగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల వ్యవస్థ అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి. ఆధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థతో భౌగోళిక దూరాల అడ్డంకిని అధిగమించిన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. అందువలన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి దూరాలనేవి పెద్దగా ఆటంకం కావు. ప్రభుత్వం, దాని కార్యకలాపాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడంలోని సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించింది. విభజన అనంతర ఆంధ్రప్రదేశ్‌కు ఒకే పెద్ద రాజధాని నగరం అవసరం ఉంటుందని కమిటీ భావించటం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేంద్రీకృతమై ఉన్న శాసనసభ, కోర్టులు, వివిధ మంత్రిత్వ శాఖలు, కమిషనరేట్లు, డెరైక్టరేట్లతో కూడిన పరిపాలనా విభాగం వగైరాలన్నీ దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందినవి. ఈ కేంద్రీకరణే విభజన సమయంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. 2014 జూలై మొదట్లో పట్టణ, గ్రామీణ ప్లానింగ్ శాఖ నుంచి రాజధానికి అనువైన ఎనిమిది ప్రాంతాల గురించిన సమాచారాన్ని కమిటీ అందుకుంది. ఈ ఎనిమిది ప్రాంతాలు ‘మధ్య ఆంధ్ర’ అని కమిటీ ప్రస్తావించిన సాధారణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవి విజయవాడ, గుంటూరు పట్టణాలకు మరీ దూరంగా లేవు. వీటిలో ముసునూరు ప్రాంతం ఏలూరు పట్టణం పక్కనే ఉంది. పులిచింతల ప్రాంతం విజయవాడ స్టేషన్‌కు 40 కి.మీ దూరంలో, మాచర్ల ప్రాంతం విజయవాడకు 100 కి .మీ దూరంలో ఉంది. మాచర్ల, పులిచింతల తెలంగాణ సరిహద్దులో ఉన్నందున రాజధాని ఏర్పాటుకు ఇవి ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ప్లానింగ్ శాఖ సూచించిన మరో నాలుగు ప్రాంతాలు బొల్లాపల్లి, వినుకొండ, మార్టూరు, దొనకొండ. వీటిలో మార్టూరు ప్రాంతం గుంటూరు-ఒంగోలు 5వ జాతీయ రహదారిపై ఉండగా, వినుకొండ ప్రాంతం గుంటూరు- నరసరావుపేట మీదుగా కర్నూలుకు వెళ్లే రాష్ట్ర హైవేతో అనుసంధానంలో ఉంది. దొనకొండ ప్రాంతం వినుకొండకు దక్షిణాన రోడ్‌తో అనుసంధానమై ఉంది. బొల్లాపల్లి ప్రాంతం నల్లమల రిజర్వ్ ఫారెస్టు సమీపంలో ఉంది. ఈ ప్రాంతాల న్నింటిలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ భూమి, క్షీణించిన అట వీ భూములు, సాగుకింద ఉన్న భూమి తదితర వివరాలను పట్టణాభివృద్ధి శాఖ పూర్తిగా సేకరించింది. అయితే ఈ వివరాలు కేవలం లాంఛనప్రాయమైనవేనని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం చెప్పడంతో వీటి సమగ్ర పరిశీలనలోకి కమిటీ వెళ్లలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలను సూచించాలని, ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట నిర్మించడానికి అనువైన భూభాగాల వివరాలను తెలపాలని కమిటీ, ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దురదృష్టవశాత్తూ ఏపీ ప్రభుత్వం ఈ సమాచారాన్ని కమిటీకి పంపలేదు. అయితే పలు జిల్లా కేంద్రాలకు సంబంధించి పది కిలోమీటర్ల పరిధిలో 10 నుంచి 25 ఎకరాల మేరకు ఉన్న విడి ప్రాంతాలపై సమాచారాన్ని ఈ ఆగస్టు 18న ప్రభుత్వం పంపింది. విశాఖపట్నం, అనంతపురం ఇందుకు అనువైన ప్రాంతాలుగా సూచించింది కూడా. జిల్లా కేంద్రాల సమీపంలో ఉండే ఈ విడి ప్రాంతాలు వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. కానీ భూమిలేని పేదలకు వీటిని ఇప్పటికే అప్పగించినందున కనీస మొత్తం ఇచ్చి వీటిని వెనక్కు తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి తెలిపింది. దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని కమిటీ అభిప్రాయం. నగరాల విస్తరణ కొత్త ప్రాంతంలో ఒకే నగరాన్ని నిర్మించడంపై కమిటీ అభిప్రాయాలకు భిన్నంగా, గ్రీన్ ఫీల్డ్ నగరం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేనట్లు కనబడుతుంది. వైజాగ్, తిరుపతి, విజయవాడ-గుంటూరు వంటి ప్రస్తుతం ఉన్న నగరాలను మెగా సిటీలుగా విస్తరించవచ్చని, మరో 13 - 14 నగరాలను పదిలక్షలు అంతకు మించిన జనాభా కలిగిన నగరాలుగా విస్తరించవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే కేవలం కార్యనిర్వాహక కసరత్తుతో పట్టణాల విస్తరణ సాధ్యపడదు. మౌలిక సదుపాయాలు, పర్యావరణ అంచనా ప్రాతిపదికనే వీటి విస్తరణను పరిశీలించవలసి ఉంటుందని కమిటీ భావన. మధ్య ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకే రాజధాని నగరం ఏర్పడవచ్చుననే అభిప్రాయం ఇటీవలి కాలంలో ప్రబలింది. అది కూడా విజయవాడపైనే ప్రధానంగా కేంద్రీకరించింది. అది ఉత్తరాంధ్ర, రాయలసీమలకు భౌగోళికంగా మధ్యలో ఉంటుందనే సామాన్యాభిప్రాయమే దీనికి తావిచ్చింది. అయితే ఆ ప్రాంతం ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఎంత అనువుగా ఉన్నా, విజయవాడ-గుంటూరు మధ్య జరిగే కేంద్రీకరణ దీర్ఘకాలంలో ఆర్థిక, పర్యావరణపరమైన దుష్ఫలితాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలను దెబ్బతీస్తుంది. పైగా, భౌగోళికంగా అన్ని ప్రాంతాలతో కనెక్ట్ అయి ఉండటం, రాష్ట్రం మధ్యలో ఉండటం, సామీప్యం అనేవి మాత్రమే అభివృద్ధిని సాధించలేవు. పైగా కమిటీకి ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు ఈ ప్రాంత వ్యవసాయ వ్యవస్థ సాధ్యమైనంతవరకు దెబ్బతినకుండా చూడాలని ప్రత్యేకంగా పేర్కొన్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దేశంలోనే అత్యుత్తమమైన వ్యవసాయ భూములున్నాయి. దేశ వరి సాగులో ఒక శాతం పంట ఇక్కడినుంచే వస్తోంది. జాతీయ వరి ధాన్యాగారంగా దీన్ని పేర్కొంటున్నారు. మరోవైపున గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జనాభా అత్యధికంగా ఉంది. పైగా శ్రామిక జనాభాలో వరుసగా ఆ జిల్లాల్లో 65%, 56% మంది రైతులుగా, వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. వ్యవసాయ భూములను ఇతర అవసరాల కోసం మార్చే ఏ ప్రయత్నమైనా వారిని నిరుద్యోగులుగా మారుస్తుంది. విలువైన సాగుభూములను కోల్పోవాల్సి వస్తుంది. చిన్న కమతాలు అంతర్ధానమౌతాయి.పౌరులకు నష్టం వాటిల్లి రియల్ ఎస్టేటర్లకు లాభాలు చేకూరుతాయి. ఈ ప్రాంతంలో నీటిమట్టం చాలా ఎక్కువ. ఇక్కడి మట్టి చాలా పెళుసుగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఎత్తై భవనాలు కనిపించవు. ఇక్కడి నిర్మాణాల పునాదులు బలహీనంగా ఉంటాయి. విజయవాడ-గుంటూరు పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నిర్మాణానికి స్వాగతం పలికితే నిర్మాణరంగం పంట పడుతుంది కాని ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులపై ఇది తీవ్రమైన ఒత్తిడి కలిగించక మానదని కమిటీ అభిప్రాయం. ఇప్పటికే నీటి సరఫరా, మురికినీటి కాలువలు, రోడ్లు ఈ ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి. మెట్రోరైలు, కమ్యూనికేషన్లు వంటి ప్రతిపాదనలు అమలయితే సమస్యలు మరింత పెరుగుతాయి. ఏపీ ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు ఆ రెండు జిల్లాల్లో సాగులో లేని భూములు లేదా క్షీణించిపోయిన అటవీ భూములు చెప్పుకోదగినంతగా లేవు. ఈ కమిటీ కొద్దిగా భూమి అందుబాటులో ఉన్న రెండు మూడు ప్రాంతాలను పరిశీలించింది. 5వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న మంగళగిరి రిజర్వు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంది. కానీ అక్కడ ఇప్పటికే టీబీ శానిటోరియం, ఏపీఎస్పీ బెటాలియన్ గృహసముదాయం ఉన్నాయి. పైగా 200 ఎకరాల్లో అక్కడ ఎయిమ్స్ తరహా వైద్య విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. గన్నవరంను కూడా కమిటీ పరిశీలించింది. ఇప్పటి కే ప్రతిపాదించినట్టు అక్కడి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయడానికే అక్కడి భూములు బొటాబొటిగా సరిపోతాయి. విజయవాడకు ఉత్తరాన కృష్ణా ఇరు ఒడ్డులలోని స్థలాన్ని గుర్తించే ప్రయత్నాలు కూడా కమిటీ చేసింది. కానీ ఇక్కడి భూముల్లో అత్యధికభాగం ప్రైవేటు భూములు. భూముల విలువ ఎక్కువ కావడంతో ఏ ప్రాజెక్టు ఖర్చైనా విపరీతంగా పెరిగిపోతుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాల అభివృద్ధి కోసం వీజీటీఎమ్ అభివృద్ధి సంస్థ ఇప్పటికే సమగ్ర అభివృద్ధి ప్రణాళికను తయారు చేసింది. 7,060 చ.కి.మీ.ల విస్తీర్ణంలోని ఈ ప్రాంతంలో మొత్తం జనాభా 17.22 లక్షలదాకా ఉంది. అందులో 9 లక్షలమంది పనిచేసే జనాభా. వారిలో 82 శాతం వ్యవసాయంపై ఆధారపడినవారు. స్థానిక ట్రాఫిక్ మాత్రమేగాక, ప్రాంతీయ ట్రాఫిక్ రద్దీ సైతం అక్కడ ఎక్కువే. వ్యవసాయ భూములు ఎక్కువ కావడం వల్ల హైదరాబాద్‌లోలాగా అక్కడ రింగ్ రోడ్డు నిర్మాణమూ తీవ్ర సమస్యే. వీజీటీఎమ్లో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం అభిలషణీయమూ, ఆచరణ సాధ్యమూ కాదు. పైగా హైదరాబాద్‌లాగా అది కూడా పెద్ద ఆకర్షణగా మారి రాష్ట్రంలోని ఇతర కేంద్రాల వృద్ధి అవకాశాలు దారిమరలిపోయేలా చేసే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. ప్రభుత్వ కమిషనరేట్లు, డెరైక్టరేట్లు సృష్టించే అభివృద్ధి, ఉపాధి కల్పన తక్కువే. వీటికంటే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, పర్యావరణ సంబంధిత రంగాలు, విద్య, ఇతర సంస్థలను నెలకొల్పితే మరింత ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని కమిటీ భావన. అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి పంపిణీ రాష్ట్రంలోని వివిధ భాగాలు విభిన్నమైన సహజ వనరులకు నిలయాలుగా ఉన్నాయి. వాటిని అభివృద్ధి పరచడం ఆవశ్యకం. ఉదాహరణకు, రాష్ట్రంలో దేశంలోనే అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. వాటిలో నీరుపారుదల సౌకర్యాలతో పలుపంటల సాగు జరుగుతోంది. చెరకు, పొగాకు, పళ్లతోటలు, చేపల పెంపకం వగైరా వైవిధ్య భరితమైన వ్యవసాయ కార్యకలాపాలు సాగుతున్నాయి. రాయలసీమలో గణనీయంగా ఖనిజ వనరులున్నాయి. దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులలో కోస్తాంధ్ర వాటా 40% గా ఉంది. అందుచేత రాజధాని కార్యకలాపాలు, ఇతర సంస్థలను మూడు ప్రాంతాలు లేదా ఉపప్రాంతాలలో పంపిణీ చేయడానికి అనువైన స్థలాలను కమిటీ గుర్తించింది. ఈ ఉప ప్రాంతాలు 1. ఉత్తరాంధ్రలోని వైజాగ్ రీజియన్. 2. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరుతో కూడిన రాయలసీమ. 3. కాళహస్తి - నడికుడి రైల్వే లైన్. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు నివేదిక కోసం ఆంధ్రప్రదేశ్‌ను స్థూలంగా ఈ జిల్లాలూ, ప్రాంతాలుగా పేర్కొనడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర లేదా ఉత్తర కోస్తాగా పేర్కొనడం జరిగింది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను మధ్యాంధ్రగా; కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలను రాయలసీమగాను, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కోస్తాంధ్రగాను విభజించడం జరిగింది. విశాఖ ప్రాంతం ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు, వస్తువుల తయారీ, నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణం, పెట్రో కెమికల్స్ వ్యవహారాలను చూసే కార్యాలయాలను ఇక్కడ నెలకొల్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న పరిశ్రమలు, మత్స్య సంపద, ఉద్యోగ కల్పన పనులు చూసే కార్యాలయాలు లేదా డెరైక్టరేట్లను కూడా ఈ ప్రాంతానికి తరలించాలి. ఈ ప్రాంతం హైటెక్ జోన్‌గా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఉత్తరాన శ్రీకాకుళం, దక్షిణాన కాకినాడ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని చిరకాలంగా భారీ పరిశ్రమల, నౌకాశ్రయాల, సాంకేతిక సంస్థల కేంద్రంగా పిలుస్తున్నారు. రాయలసీమ రాజధాని కార్యకలాపాలకు అవసరమైన వ్యవస్థలను రాయలసీమలో నెలకొల్పాలి. అనంతపురం, తిరుపతి మీదుగా కడప సహా కర్నూలు నుంచి చిత్తూరు వరకు అర్థచంద్రాకారంలో ఉండే ఈ ప్రాంతం రైల్వే సౌకర్యం ద్వారా రవాణాకు నెలవుగా ఉంది. ఇందులోని ముఖ్య నగరాలలో ఒకటైన కర్నూలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని. ఇక్కడ నుంచే రాజధానిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ చారిత్రక తప్పిదంతో జరిగిన నష్టాన్ని పూరించాలని రాయలసీమ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయనీ, నిరంతరం నీటి కొరతతో ఇబ్బంది పడుతూ ఉంటుందని పేరున్నప్పటికీ, వాస్తవానికి అనంతపురం-కర్నూలు, కడపలలో నిర్మాణంలో ఉన్న జల పథకాలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న పథకాలు చాలా ఉన్నాయి. తుంగభద్ర కర్నూలు గుండా ప్రవహిస్తుంది. అలాగే కృష్ణా జలాల కేటాయింపును పునస్సమీక్షించాలి. కాళహస్తి ప్రాంతం కూడా అభివృద్ధికి అవకాశం ఉన్న జోన్‌గా అవతరిస్తుంది. 2014-15 రైల్వే బడ్జెట్లో కాళహస్తి-నడికుడి రైల్వే లైను నిర్మాణం ప్రతిపాదనలు ఉన్నాయి. 300 కిలోమీటర్ల ఈ లైను వల్ల గుంటూరు జిల్లా వినుకొండ ముఖ్య రైల్వే కూడలిగా మారుతుంది. వైజాగ్-చెన్నై కారిడార్‌కు ఉన్న ప్రకృతి వైపరీత్యాల సమస్యల వల్ల కాళహస్తి ప్రత్యామ్నాయంగా చూసుకోవచ్చు. ప్రభుత్వ కార్యకలాపాలు నడిపే వివిధ డెరైక్టరేట్లు, ఇతర కార్యాలయాలను ఏయే ప్రాంతాలకు తరలించాలో సాధ్యమైనంత తొందరగా నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం తరువాతే అభివృద్ధి చెందవలసిన ఆయా జోన్లకీ, జిల్లాలకీ ఆ కార్యాలయాలను తరలించే పని చేపట్టడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్న 200 ప్రభుత్వ కార్యాలయాలూ, ప్రభుత్వం అధీనంలో పని చేసే వ్యవస్థలూ భవిష్యత్‌లో ఎక్కడకు తరలాలన్న అంశాన్ని నిర్ణయించుకునే కార్యక్రమం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవలసినది ఏపీ ప్రభుత్వమే. రాజధానిలో రాజ్యాంగ వ్యవస్థలు రాజధానిలో రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు- ఈ మూడు రాజ్యాంగ ప్రతీకాత్మక వ్యవస్థలుగా భావిస్తారు. రాజ్‌భవన్ ప్రాంగణం ఏర్పాటుకు 15 ఎకరాల స్థలం అవసరమైనట్టు కనిపిస్తుంది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ వ్యవస్థ పదేళ్లు కొనసాగాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజ్‌భవన్ ఎక్కడ నిర్మాణం కావాలనే అంశం తేల్చడానికి ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు కొంత సమయం అవసరం. శాసనసభ నిర్మాణానికి 80 నుంచి 100 ఎకరాల స్థలం కావాలి. చట్టసభను తక్షణం తరలించవలసిన అవసరం లేదు. కాబట్టి కొత్త సభను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశానికి కూడా చాలా సమయం ఉంది. అయితే, తాత్కాలిక ఏర్పాట్లు చేసినా అవి పాతుకుపోయే రీతిలో ఉండరాదని మాత్రం బృందం సూచిస్తోంది. హైకోర్టు ప్రాంగణం, ఇందుకు సంబంధించిన న్యాయ వ్యవహారాల కార్యాలయాల స్థాపనకు 100 నుంచి 140 ఎకరాల భూమి కావాలి. పునర్ విభజన చట్టం మేరకు హైదరాబాద్‌లో హైకోర్టును నాలుగు లేదా ఐదేళ్లు ఉమ్మడిగా వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో హైకోర్టు నిర్మాణం ఏర్పాటు గురించి యోచించినపుడు మాత్రం విశాఖపట్నాన్ని పరిగణనలోనికి తీసుకోవచ్చు. అసెంబ్లీ, సచివాలయం ఉన్నచోటే హైకోర్టును ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల కార్యాలయాలకు, సచివాలయ నిర్మాణానికి 15 నుంచి 20 ఎకరాలు అవసరం. అత్యవసర కారణాల దృష్ట్యా ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయాల ఏర్పాటుకు నూజివీడు, గన్నవరం, ముసునూరులలో ఒక దానిని పరిశీలించవచ్చు. ఐటీ పార్కు కోసం గన్నవరంలో కట్టిన భవనం ఇప్పటికీ ఖాళీగానే ఉంది కూడా. గుంటూరు, విజయవాడలలో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకోమంటూ ప్రభుత్వ శాఖలను ఆహ్వానిస్తే అది విపత్కర పరిణామాలకు దారి తీస్తుంది. భవిష్యత్తులో వాస్తవ రాజధానికి వాటిని తరలించడం కష్టసాధ్యం. ఇందుకు ఉత్తరాఖండ్ నిదర్శనం. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి ఏ తరహా కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయం తీసుకునే అధికారం ఏపీ ప్రభుత్వానిదే అయినా, బృందం కొన్ని సూచనలు మాత్రం చేసింది. పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు వంటి వ్యవహారాలు చూస్తే శాఖల కార్యాలయాలను సీఎం కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. వీటి సేవలు అవసరమైన చోట నెలకొల్పవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖలను విశాఖలో; వ్యవసాయ సంబంధిత కార్యాలయాలను ప్రకాశం జిల్లాలో; పశు సంవర్థక శాఖను ఒంగోలులో; విద్యా శాఖ వ్యవస్థలను అనంతపురంలో; నీటి సరఫరా, ఆరోగ్యవ్యవహారాల శాఖలను నెల్లూరులో, సంక్షేమ కార్యాలయాలను కడపలో నెలకొల్పడం సముచితం. అలాగే 9వ షెడ్యూలులో పేర్కొన్నట్టు ప్రభుత్వ కార్యాలయాలు నలుమూలలా విస్తరించాలి. సంగ్రహ స్వరూపం - ప్రస్తుత పరిస్థితులలో గ్రీన్ఫీల్డ్లో రాజధాని నగరం ఏర్పాటుకు బృందం సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయినా ఈ అంశాన్ని పరిశీలించదలుచుకుంటే సర్కారు భూమి పుష్కలంగా దొరికే ప్రాంతాన్ని అన్వేషించాలి. - నేటి నగరాలను విస్తరించే యోచనలో ఉంటే, పర్యావరణం, మౌలిక వ్యవస్థలను దృష్టిలో ఉంచుకోవాలి. - ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటును తాత్కాలిక ప్రాతిపదికను చేపడితే అదంతా అసంగతంగా, వృథా వ్యవహారంగా మిగిలిపోతుంది. - పునర్వ్యవస్థీకరణ చట్టంలో తొమ్మిదో షెడ్యూలులో పేర్కొన్న 89 అంశాలలో సమగ్ర అభివృద్ధి కోసం కొత్త రాష్ట్రానికి వాటిలో ఎన్ని అవసరమో జాబితాను రూపొందించుకోవాలి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే క్రమంలో ఇప్పుడు హైదరాబాద్‌లో పని చేస్తున్న వివిధ డెరైక్టరేట్లు, కమిషనరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల జాబితాను కూడా తయారుచేయాలి. - విద్యా సౌకర్యాల కల్పన కోసం ప్రతిపాదించే ఆయా ప్రాంతాలపై కూడా పూర్తి స్పష్టతను సాధించాలి. - నగరాల విస్తరణకు లేదా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు గానీ ప్రభుత్వానికి అన్ని చోట్ల ఇతరత్రా భూమి అవసరం. అన్ని జిల్లాలలోను, జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల లోపులోనే 25 హెక్టార్ల వరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండవచ్చు. - రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటి విషయంలో పునర్ విభజన చట్టం పదేళ్లు వెసులుబాటు ఇచ్చిన సంగతిని, హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. - తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సిబ్బంది, కార్యాలయాలతో సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయం ఏర్పాటు చేయడానికి వీజీటీఎం, దాని వెలుపల ఉన్న అవకాశాలను పరిశీలించవచ్చు. - ప్రాధాన్యం కల్పించవలసిన మౌలిక సదుపాయాల కల్పన పథకాల కొనసాగింపు గురించి ఆలోచించాలి. -
ఆ అభ్యంతరాలు అపోహ మాత్రమే!
* గవర్నర్‌కు అధికారాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు * ప్రత్యేక సందర్భాల్లోనే ఆయన జోక్యం చేసుకుంటారు * కేంద్ర హోంశాఖ వర్గాల స్పష్టీకరణ * బదిలీల ప్రక్రియ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చూస్తుంది సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడంపై వచ్చిన అభ్యంతరాలు కేవలం అపోహలేనని కేంద్ర హోంశాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 8(1) ప్రకారం అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధానిలో పాలనా వ్యవహారాల నిమిత్తం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంది. సెక్షన్ 8(2) ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ఆస్తుల పరిరక్షణ, ముఖ్యమైన సంస్థల భద్రత, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపు విషయంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సెక్షన్ 8(3)ప్రకారం తెలంగాణ ప్రభుత్వ మంత్రి మండలిని సంప్రదించి గవర్నర్ తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అయితే ఆగస్టు 8వ తేదీన కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిన సర్క్యులర్ ఈ వివాదానికి కారణమైంది. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ స్థాయి బదిలీకి సైతం గవర్నర్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని, ఇది సహేతుకం కాదని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ముఖ్యమంత్రి అధికారాలను పలుచన చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన వారికి సర్దిచెప్పారు. ఈ విషయమై శుక్రవారం హోంశాఖ అధికారులను సంప్రదించగా.. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే గవర్నర్‌కు అధికారాలు ఉంటాయని స్పష్టంచేశారు. ‘తెలంగాణకు పంపిన సర్క్యులర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. బదిలీలనేవి పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చూసుకుంటుంది. ఇది సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ బోర్డు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినదే అయి ఉంటుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ జోక్యం ఉండదు. అలాగే గవర్నర్ సైతం రోజువారీ వ్యవహారాల్లో కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జోక్యం చేసుకుంటారు.. దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని హోంశాఖకు చెందిన ముఖ్యఅధికారి పేర్కొన్నారు. -
రాజధానిపై బాబు కుట్ర
- సీమకు ద్రోహం చేసే ప్రయత్నం - రాజధానిని సాధించుకుంటాం - ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ ప్రొద్దుటూరు టౌన్: పదేళ్లపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేసే కుట్ర దాగి ఉందని రాయలసీమ విద్యార్థి వేదిక కన్వీనర్ మల్లేల భాస్కర్ విమర్శించారు. గురువారం రాయలసీమ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. పుట్టపర్తి సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో భాస్కర్ మాట్లాడుతూ చంద్రబాబు కుట్రలు సాగనివ్వమని హెచ్చరించారు. రాయలసీమలో రాజధానిని సాధించుకుంటామంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధాని ఇవ్వకుంటే రాష్ట్రంపై పోరాడుతామని ప్రతినబూనారు. రాజధానికోసం రాయలసీమ ఉద్యమం తీవ్రరూపం దాల్చకముందే విజయవాడను రాజధాని చేయాలని చంద్రబాబు కుట్రపన్ని రాయలసీమను బలిపీఠంపై నిలిపారన్నారు. ఒక వైపు కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇంకా పర్యటన దశలో ఉండగానే చంద్రబాబు ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోస్తాలో అధిక సీట్లు వచ్చాయని రాజధానిని కోస్తాకు తీసుకెళుతున్నామంటే రాయలసీమ ప్రజల మనసుల్లో శాశ్వత ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు. కోస్తా, రాయలసీమ మధ్య జరిగిన చారిత్రక శ్రీబాగ్ ఒడంబడికను చంద్రబాబు ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ ఖలందర్, ఆర్ఎస్ఎఫ్ పట్టణాధ్యక్షుడు కొండారెడ్డిలు మాట్లాడుతూ రాయలసీమలోని విలువైన అటవీ సంపద ఎర్రచందనాన్ని అమ్మి కోస్తాలో రాజధాని నిర్మాణానికి ఖర్చు చేస్తామనడం సీమకు ద్రోహం చేయడమేనన్నారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమకు కృష్ణా జలాల్లో నికర వాటా ఇవ్వకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ద్వారా కోస్తా జిల్లాలకు కృష్ణా జలాలను తరలించుకుపోతున్నారన్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజుపై జాతీయ జెండా ఎగురవేసే చంద్రబాబు రాయలసీమలోనే రాజధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంద్రబాబును, అతని మంత్రివర్గ సభ్యులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రొద్దుటూరు జర్నలిస్టు సం ఘం అధ్యక్షుడు వనం శర్మ, ఆర్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు జావిద్, సహాయకార్యదర్శి చరణ్, శ్రీనివాసులరెడ్డి, అభ్యాస్, షిర్డిసాయి, మాస్టర్, భావన, మేధా కాలేజి విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు -
గవర్నర్‌కు అధికారాలపై పిటిషన్ల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కట్టబెట్టే ఏపీ పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 8ని కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను పిటిషనర్లు గురువారం ఉపసంహరించుకున్నారు. పిటిషన్లను రిట్లుగా దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లను ఉపసంహరించుకుని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. -
గవర్నర్ అధికారాలపై కేంద్రం వెనక్కు!
తమకు సమాచారం ఉందని మంత్రి నాయిని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని శాంతిభద్రతలను గవర్నర్ చేతిలో పెట్టాలన్న ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకున్నట్టు తమకు సమాచారం ఉందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ పోలీసు సంఘం ఆధ్వర్యంలో ప్రతి నిధి బృందం ఆయన్ను కలిసి 50 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా విలేకరులతో నాయిని మాట్లాడుతూ.. పై విషయాన్ని వెల్లడించారు. అలాగే రైతుల పట్ల పోలీసులు సంయమనం పాటించాలని, లాఠీలు ఉపయోగించకుండా చూడాలని స్పష్టంచేశారు. ప్రజలను స్నేహపూర్వకంగా చూడాలని, అది చేతకాకపోతే తన వద్దకు పంపాలని పోలీసులకు చురకలంటించారు. చట్టానికి ఎవరైనా లోబడే పనిచేయాలని తేల్చిచెప్పారు. పోలీసులు సరిగా పనిచేస్తే స్థానికంగా అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణ ఇమేజ్ను పెంచేందుకు కృషి చేయాలని పోలీసులకు సూచించారు. రైతుల ఆందోళనల్లో తప్పు లేదని, వారు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. కరెంటు ఇబ్బందులు కొన్నాళ్ల తర్వాత ఉండవని పేర్కొన్నారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే ఇప్పుడు విద్యుత్ కొరత వేధిస్తోందన్నారు. సింగరేణిలో కొత్త మైన్స్ ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ నెల 19న జరగబోయే ఇంటింటి సర్వేలో అవసరమైతే పోలీసులు కూడా సివిల్ డ్రెస్‌తో పాల్గొని సర్వే చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
నిఘా నీడలో సిటీ!
- జంట కమిషనరేట్ల పరిధిలో 2000 సీసీ కెమెరాలు - ప్రాంతాల గుర్తింపునకు నిఘా వర్గాల సర్వే సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో త్వరలో 2000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏఏ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే విషయంపై కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ నిఘావర్గాలతో సర్వే చేయిస్తున్నారు. పాతబస్తీలో ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిసింది. గత రెండు దశాబ్దాల కాలంలో నగరంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిఘా వర్గాలు కమిషనర్లకు సూచించాయి. శివార్లలో కాలనీలు, బస్తీలు విస్తరించడంతో రెండు కమిషనరేట్ల పరిధిలో గతంలో కంటే సమస్యాత్మక ప్రాంతాలు పెరిగాయి. మత ఘర్షణలు, అల్లర్లు, రౌడీముకల దాడులు జరిగిన ప్రాంతాలు కూడా వీటిలో ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా.. ఎందుకు జరిగింది? కారకులు ఎవరు అనేది సులభంగా తెలిసిపోతుంది. సీసీ కెమెరాల్లోని ఫుటేజీ నిందితుడికి శిక్షపడేందుకు కూడా దోహదపడుతుంది. గతంలో ఏదైనా గొడవ జరిగితే స్థానిక యువకులను అనుమానితులుగా స్టేషన్‌కు పిలిచి విచారణ పేరుతో వేధించేవారు. సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తే నిందితుడి గుర్తింపు వెంటనే జరిగిపోవడంతో పాటు అమాయకులను వే ధించడం ఆగిపోతుంది. సీసీ కెమెరాల్లో ప్రతి చిన్న విషయం రికార్డు అయిపోతుంటుంది కాబట్టి ఎవ్వరూ నేరం చేయడానికి సాహసించరని, దీంతో నేరాలు అదుపులోకి వస్తాయని పోలీసులంటున్నారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారా వచ్చే ఫుటేజీల పర్యవేక్షణకు జోన్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలో ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుంచి నిత్యం ఆయా కూడళ్లలో వాహనాల రద్దీని పరిశీలించి, ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సహకరిస్తుంటారు. అలాగే, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న కెమెరాల ద్వారా ఎక్కడైన గొడవలు జరుగుతుంటే గుర్తించి వెంటనే అదుపులోకి తెచ్చేయవచ్చు. వ చ్చే రెండు మూడు నెలల్లో నగరంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఉపయోగంలోకి తీసుకొస్తామని అధికారులంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ సీసీ కెమెరాలతో పాటు హోటళ్లు, దుకాణాలు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లు, ఆసుపత్రుల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసేలా యజమానులుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వం తరఫున సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయితే నగర జీవి అనుక్షణం మూడో కన్ను నీడలో పయనించకతప్పదు. -
గవర్నర్ నిర్ణయాల అమలు తప్పదు
తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని నగరంపై గవర్నర్‌కు అధికారం కల్పించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. చట్టంలో ఉన్న మేరకు గవర్నర్‌కు అధికారాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మార్చుకోవాల్సిందేనని కేంద్ర హోం శాఖ సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారి రాష్ట్రానికి లేఖ పంపించారు. విభజన చట్టంలోని సెక్షన్ ఎనిమిదిలో గవర్నర్‌కు దఖలు పరిచిన అధికారాలు అమలు చేయడం సాధ్యం కాదంటే.. ఆ మేరకు విభజన చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. గవర్నర్‌కు అధికారాలు కల్పించేలా ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌లో మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏయే అంశాల్లో మార్పు చేయాలన్న విషయంలో కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్ సుదీర్ఘ లేఖ రాసిన సంగతి విదితమే. అయితే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించారు. రాజీవ్‌శర్మ రాసిన లేఖకు ప్రతిస్పందిస్తూ.. కేంద్ర హోం శాఖ వర్గాలు సోమవారం సాయంత్రం పాత విషయాన్నే పునరుద్ఘాటిస్తూ సమాచారం పంపించాయి. చట్టాన్ని అమలు చేయడం మినహా గత్యంతరం లేదని కేంద్రం వెల్లడించినట్లు తెలిసింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ‘నవ తెలంగాణ సమాలోచన’ పేరిట రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశంలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దీనిపై ఎలా స్పందించాలన్న అంశంపై ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఉమ్మడి రాజధాని నగరంలో శాంతిభద్రతల అంశాన్ని పర్యవేక్షించే గవర్నర్‌కు సలహాలు ఇవ్వడానికి మాజీ డీజీపీ ఏకే మహంతిని కేంద్ర ప్రభుత్వం సలహాదారునిగా నియమించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవే క్షించాలంటే.. గవర్నర్ నియమించిన అధికారులైతేనే ఆయనకు నేరుగా నివేదించడానికి వీలవుతుందని, లేని పక్షంలో ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారం అడగాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, ఈ వాదనను తెలంగాణ ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఉమ్మడి రాజధాని నగరంలో ఏవైనా తీవ్ర సమస్య తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దాలి తప్ప.. పోలీసు అధికారుల పోస్టింగ్స్ ఇవ్వడం, నేరుగా సమీక్షించడం చట్టంలో ఎక్కడా లేదని వారు వాదిస్తున్నారు. అయితే, కేంద్రం మాత్రం చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కే పవర్
పోలీసు పోస్టింగ్‌లు, బదిలీలుగవర్నర్ చేతికి.. విభజన చట్టంలో సవరణకు కేంద్రం ముసాయిదా బిల్లు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు,డీజీపీలతో ప్రత్యేక బోర్డుఏర్పాటుకు ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిప్పి పంపిన తెలంగాణ సర్కారు రాష్ర్ట హక్కులను కాలరాయడమేనని మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టేందుకు కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. హైదరాబాద్‌లో పోలీసులపై ఆయనకే పెత్తనం అప్పగించాలని.. వారి పోస్టింగ్‌లు, బదిలీల బాధ్యతలు ఆయనకే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముసాయిదా ప్రతిని తెలంగాణ సర్కారు తిప్పి పంపింది. పోలీసులపై గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ కేంద్రానికి ఘాటుగా లేఖ రాసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇప్పటికే లేఖను కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు, హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఏదేని విషయంలో తీవ్ర విభేదాలు తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకుని ఆ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విభజన చట్టంలోని సెక్షన్ 8 సూచిస్తోందని ఆ లేఖలో స్పష్టం చేశారు. పాలనాపరమైన నిర్ణయాలు, శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖ ఆధునీకరణ తదితర బాధ్యతలన్నీ తెలంగాణ ప్రభుత్వానివేనని తేల్చి చెప్పారు. విభజన చట్టానికి మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన కనీస అధికారాల్లో పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌లు కూడా ఉన్నాయని, రాష్ర్ట హక్కులను కాలరాసే విధంగా చట్ట సవరణకు సిద్ధమవడం అన్యాయమని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను గవర్నర్ గౌరవించాలని, హైదరాబాద్ పోలీసు వ్యవస్థపై గవర్నర్‌కు అధికారులు కల్పించాలని విభ జన చట్టంలో ఎక్కడా లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం కొత్తగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాయి. ఉమ్మడి రాజధానిలో తన విధులేమిటో తెలుసుకునేందుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గతంలో కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఈ ముసాయిదాను రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించేందుకు వీలుగా విభజన చట్టంలోని సెక్షన్ 8కు సవరణలు చేస్తూ ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రానికి పంపింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కూడిన కామన్ పోలీస్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదివార ం టీఆర్ఎస్ ఎంపీలతో క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టే ముసాయిదా బిల్లును పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించాలని, దాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న అనురాగ్ శర్మను తెలంగాణ డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. తర్వాత నగర కమిషనర్‌గా అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డిని తెలంగాణ సర్కారు నియమించింది. ఇక అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, డీసీపీల్లోనూ ఒకరిద్దరు మినహా అంతా పాత వారే కొనసాగుతున్నారు. -
ఎవరి మీటర్లు వారివే!
మీటర్లు ఏర్పాటయ్యే వరకు జనాభా ప్రాతిపదికన బిల్లుల చెల్లింపు తెలంగాణకు ఒరిజినల్ బిల్లు, ఆంధ్రాకు జిరాక్స్ హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సచివాలయూలతో పాటు పలు ఇతర శాఖల కార్యాలయాలు కూడా ఒకే ప్రాంగణం, ఒకే భవనంలో పనిచేస్తున్నాయి. అయి నా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ కార్యాలయూలు కావడంతో విద్యుత్, నీటి చార్జీలను ఎలా లెక్కించాలి, ఎవరు ఎంత చెల్లించాలనే సమస్య తలెత్తింది. పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలో ప్రకటించిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న విద్యుత్, నీటి మీటర్లను తెలంగాణకు వదిలేసి, ఆంధ్రప్రదేశ్‌కు విడిగా విద్యుత్, నీటి మీటర్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విద్యుత్ , నీటి మీటర్లకు ఆయా శాఖలు, విభాగాలు దరఖాస్తు చేిసినా ఇంకా మీటర్ల ఏర్పాటు కాలేదు. ఎవరి మీటర్లు వారికి ఏర్పాటయ్యేందుకు రెండు నెలలు పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అప్పటి వరకు విద్యుత్, నీటి చార్జీలను ఎవరు, ఎంత చెల్లించాలనే అంశంపై ఏపీ ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మీటర్ల ఏర్పాటునకు రెండు నెలలు సమయం ఇస్తూనే అప్పటివరకు విద్యుత్, నీటి చార్జీలను జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణ సర్కారు 42 శాతం చొప్పున చెల్లించాలనే నిబంధనను విధించాలని ప్రతిపాదిస్తోంది. ఒరిజినల్ బిల్లుతో తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే, జిరాక్స్ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చార్జీలు చెల్లిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంటోంది. ఇందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆయా శాఖల కార్యదర్శులు అంగీకరించడంతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన అపెక్స్ కమిటీ ఆమోదం కూడా అవసరం అవుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. పాత బకాయిలు రూ. 200 కోట్లు ఉమ్మడి రాష్ట్రానికి చెందిన విద్యుత్, నీటి చార్జీల బిల్లులన్నింటినీ రాష్ట్ర విభజన తేదీకి ముందే చెల్లించేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. అరుుతే రాష్ట్రం విడిపోక ముందు పాస్ అరుు్య చెల్లింపులు జరగని బిల్లులను రాష్ట్రం విడిపోయాక తొలుత తెలంగాణ పీఏఓ చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆ బిల్లుల మొత్తాన్ని జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రానికి ఎంత అనేది అకౌంటెంట్ జనరల్ సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో బిల్లులు పాస్ అరుు్య చెల్లింపులు జరగకుండా (మే నెలలో) రాష్ట్రం విడిపోయిన తరువాత చెల్లించాల్సిన విద్యుత్, నీటి చార్జీలు రూ.200 కోట్ల మేరకు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ లెక్కతేల్చింది. ఆ లెక్క ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రం ఎన్ని నిధులు చెల్లించాలో స్పష్టం చేయాల్సిందిగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి అకౌంటెంట్ జనరల్‌కు లేఖ రాశారు. ఇలావుండగా ఇంకా ఎవరైనా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్, నీటి చార్జీల బిల్లులను సమర్పించకపోతే అవి ఏ రాష్ట్రం చెల్లించాలనేది చెప్పడం కష్టమేనని, ఆ బిల్లులతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
డబుల్ ట్రబుల్
ట్రాఫిక్‌పై ఉమ్మడి రాజధాని ప్రభావం హైదరాబాద్: ‘ఉమ్మడి’ నగరం హైదరాబాద్‌లో ఇప్పుడు అంతా డబుల్. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు స్పీకర్లు, నలుగురు ఉప ముఖ్యమంత్రులు, అన్ని శాఖలకు ఇద్దరేసి చొప్పున మంత్రుల రాకపోకలతో నగరంలో ట్రాఫిక్ సీన్ మారిపోయింది. సిటీ ఉమ్మడి రాజధాని కావడంతో పోలీసు విభాగంపై భారం రెండింతలయింది. వీవీఐపీలు రాకపోకలు సాగించే మార్గాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పటం లేదు. అయితే ఉమ్మడి ప్రముఖుల అంశం అత్యంత సున్నితమైందని, ఏమరుపాటు వహిస్తే అనవసర అపార్థాలకు తావిచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ ఇబ్బందులు భరించక తప్పదంటూ ఉన్నతాధికారులు చెప్పకనే చెబుతున్నారు. రెట్టింపైన ప్రముఖుల జాబితా... సిటీ ఉమ్మడి రాజధాని కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఈ అత్యంత ప్రముఖులంతా అత్యధిక సమయం నగరంలోనే ఉండాల్సిన పరిస్థితి. దీంతో ట్రాఫిక్ ఆపాల్సిన సందర్భాలు పెరుగుతున్నాయి. అత్యంత ప్రముఖులుగా పరిగణించే రాజ్యాంగ, రాజకీయ హోదా కలిగిన వారి కాన్వాయ్‌ల కదలికల నేపథ్యంలో సిటీ రోడ్లు, కీలక జంక్షన్లలో ట్రాఫిక్ ఆపడం అనివార్యంగా మారింది. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘గ్రీన్ ఛానల్’ కల్పించడం అంటారు. అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రముఖులు వెళ్లడానికి కల్పించే సౌకర్యం. వారి హోదా మాత్రమే కాకుండా భద్రతాకారణాల దృష్ట్యా ఇది అనివార్యం. వీరు ప్రయాణిస్తున్న వాహనాలు, కాన్వాయ్‌లు ఆయా ప్రాంతాలను దాటి వెళ్లే వరకు ఆ పరిధిలోని మార్గంలో ఇతర వాహనాలను అనుమతించరు. ఒకప్పుడు ఈ కాన్వాయ్‌లు ప్రయాణిస్తున్న సందర్భంలో వాటి దిశకు వ్యతిరేకంగా వచ్చే వాహనాలను సైతం ఆపేవారు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దినప్పటికీ రోజూ కనిష్టంగా 40 చోట్ల వాహనాలను ఆపాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉమ్మడి రాజధానిలో పెరిగిన ప్రముఖుల కారణంగా ఈ సంఖ్య 80కి చేరింది. రద్దీ ప్రాంతాల్లోనే అత్యధికం... నగరంలోని ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు, పరిపాలన తదితర కార్యకలాపాలు సాగించే ప్రాంతాలు ఎక్కువ పశ్చిమ(బంజారాహిల్స్, జూబ్లీహిల్స్), మధ్య మండలం (అబిడ్స్, ముషీరాబాద్, సైఫాబాద్). ఈ ప్రాంతాల్లోనే ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ. పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లోనే ఉంటున్నాయి. మరోపక్క సాఫ్ట్వేర్ హబ్‌గా ఉన్న హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు నగరం నుంచి ప్రయాణించే వాహనాలు పశ్చిమ మండలం మీదుగానే వెళ్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆపితే సాధారణ స్థితికి తీసుకురావడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. ఆ మండలాలపై అధిక భారం... ఉమ్మడి రాజధాని ప్రభావం నగరంలో ఉండే ప్రముఖుల్లో దాదాపు 80 శాతం మంది నివసించే పశ్చిమ మండలంతో పాటు ఉభయ రాష్ట్రాల శాసనసభలు ఉన్న మధ్య మండల పోలీసులపై అత్యధికంగా ఉంటోంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో సహా ఇతర మంత్రులు పశ్చిమ మండలంలోనే ఉంటున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఒకే సముదాయంలో జరుగుతున్నాయి. వీటికి పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు భారీ స్థాయిలో సిబ్బందిని మోహరిస్తున్నారు. గతంలో ఏటా నెలరోజులకు పైగా అసెంబ్లీ బందోబస్తును నిర్వహిస్తే, ఇకపై రెండు నెలలకు పైగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ భారం మధ్య మండల పోలీసులపై పడుతోంది. అలాగే రెట్టింపైన ప్రముఖుల నివాసాలకు భద్రత, బందోబస్తు కల్పించడం పశ్చిమ మండల అధికారులపై పడుతున్న మరో భారం. అంతర్గత భద్రత అప్పగించే ప్రతిపాదన... ఉమ్మడి రాజధాని దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ఇతర కార్యాలయాలతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల, అధికారుల నివాసాలు 10 ఏళ్లు హైదరాబాద్‌లోనే కొనసాగనున్నాయి. అయితే వీటి భద్రత ఏపీ అధికారులే చూసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. జంట కమిషనర్లు ప్రతిపాదించినట్లు అదనపు సిబ్బందిని ప్రభుత్వం కేటాయించినా.. భర్తీ చేయడం తక్షణం సాధ్యం కాని నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మార్షల్స్ సహా బందోబస్తుకు ఏపీ నుంచి కొందరు అధికారుల్ని రప్పించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక కార్యాలయాల వద్ద భద్రత, బందోబస్తు విధుల్లో ఉండేందుకు సిబ్బందిని రొటేషన్ పద్దతిపైన ఏపీ నుంచి తీసుకువస్తే ఈ భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. వ్యక్తిగత భద్రతా అధికారుల్ని సైతం అక్కడ నుంచే పంపేలా చూడాలని ప్రతిపాదించనున్నారు. అలాగే, నిర్దిష్టమైన ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే ఆ కార్యాలయం ఏ ఠాణా పరిధిలో ఉంటే వారు కలగజేసుకుంటారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో ఇదే పద్ధతి కొనసాగుతోంది. వీళ్లొస్తే మన బండి ఆగాల్సిందే.. ⇒ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ⇒ తెలంగాణ, ఏపీముఖ్యమంత్రులు ⇒ శాసనసభ, మండలిల్లోని నలుగురు ప్రతిపక్ష నేతలు ⇒ ఉభయసభల ఇద్దరు స్పీకర్లు, ఇద్దరు డిప్యూటీ స్పీకర్లు ⇒ 2 రాష్ట్రాల నలుగురు డిప్యూటీ సీఎంలు ⇒ తెలంగాణ, ఏపీ హోం మంత్రులు ⇒ ఇరు రాష్ట్రాల డీజీపీలు రోజుకు ఎన్నిసార్లంటే... ఈ 19 మంది ఒక్కసారి కార్యాలయాలకు వెళ్లి రావాలన్నా 38 సార్లు ఆపాల్సిందే.అసెంబ్లీ సమావేశాలుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.సభలు, సమావేశాలు, ప్రత్యేక సందర్భాల్లో 80 సార్లకు పైగా ఆపాల్సిన పరిస్థితి.అత్యధికంగా ట్రాఫిక్‌ను పీక్ అవర్స్‌లో రద్దీ ప్రాంతాల్లోనే ఆపాల్సి వస్తోంది. -
‘ఉమ్మడి’ భద్రతకు 5,500మంది పోలీసులు
గవర్నర్‌కు డీజీపీ ప్రతిపాదనలు హైదరాబాద్: తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు పదేళ్లు ఉమ్మడి రాజధాని కాబోతున్న హైదరాబాద్ నగర భద్రతకోసం అదనంగా 5,500మంది పోలీసు సిబ్బంది కావాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. డీజీపీ బి ప్రసాదరావు ఈ మేరకు గవర్నర్ నరసింహన్‌కు ఒక ప్రతిపాదన పంపారు. అదే సమయంలో మరో రెండు ఏఆర్ బెటాలియన్లు అదనంగా అవసరమని పేర్కొంటూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ కూడా మరో ప్రతిపాదన డీజీపీకి పంపించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని హైదరాబాద్ రాజధాని పరిధిలోకి తీసుకు రావడంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో దాదాపు 14వేల మంది పోలీసులున్నారు. మరో రెండు బెటాలియన్ల కేంద్ర పారామిలటరీ బలగాలు అందుబాటులో ఉన్నా యి. అయితే, రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల రక్షణతో పాటు సచివాలయంలో ఇద్దరు సీఎంల బ్లాక్‌ల భద్రత, ముఖ్యమంత్రుల నివాసాల భద్రత కోసం ఎక్కువ భాగం సిబ్బంది వినియోగమతారని అధికారులు తేల్చారు. ఆందోళనలు, గణేశ్ నిమజ్జనోత్సవం, బోనాలు వంటి ఉత్సవాలకు అదనపు పోలీసు బలగాలను ఇతర జిల్లాలనుంచి తరలించేవారు. విభజన తర్వాత జిల్లాల నుంచి అదనపు పోలీసుసిబ్బంది రప్పించడం కష్టమేనని, నగరంలో రెండు అసెంబ్లీలు, రెండు శాసన మండలుల నిర్వహణలో అవసరమైన భద్రత ఏర్పాటు కూడా నగర పోలీసులకు కత్తిమీద సామేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులోని పోలీసు సిబ్బంది అవసరాలకు ఏమాత్రం సరిపోరని, అదనంగా 5500 మంది పోలీసులు సివిల్, ఏఆర్, విభాగాలకు సంబంధించి అవసరమవుతారని నగర పోలీసు కమిషనర్ ప్రతిపాదించారు. మరో రెండు సాయుధ రిజర్వు బెటాలియన్లు అదనంగా అవసరమని మరో ప్రతిపాదనను పంపించారు. రెండు ప్రతిపాదనలను డీజీపీ గవర్నర్‌కు పంపించారు. -
తెలంగాణ సీఎం నిర్ణయమే కీలకం
*ఉమ్మడి రాజధాని అయినా.. కమిషనర్లను ఎంపిక చేసేది ఆయనే *సీమాంధ్ర ముఖ్యమంత్రి పాత్ర పూర్తిగా శూన్యం *స్పష్టం చేస్తున్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు సాక్షి, హైదరాబాద్ : పదిరోజుల్లో రానున్న అపాయింటెడ్ డేతో అధికారికంగా రెండు రాష్ట్రాల పరిపాలన ప్రారంభం కావడంతోపాటు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మారనుంది. వీలున్నంత కాలం రెండు రాష్ట్రాల పరిపాలనా ఇక్కడి నుంచే సాగనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో శాంతిభద్రతల అంశం ఉమ్మడి గవర్నర్ చేతికి వెళ్లనుంది. అయినప్పటికీ హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ల ఎంపిక మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి, ఇక్కడి క్యాబినెట్ నిర్ణయం మేరకే జరగనున్నాయి. ఈ విషయంలో సీమాంధ్ర సీఎం, ఇతర ప్రజాప్రతినిధుల పాత్ర ఏమాత్రం లేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. తెలంగాణ మంత్రిమండలే కీలకం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రాంతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ గరిష్టంగా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. రెండు రాష్ట్రాలకూ కలిపి ఒకే గవర్నర్ ఉంటారు. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి జీవన భద్రత, ప్రజల స్వేచ్ఛ, ఆస్తుల భద్రత తదితరాలు గవర్నర్‌కు ఉండే ప్రత్యేక బాధ్యతలు. శాంతిభద్రతలు, అంతర్గత భద్రతపై కూడా గవర్నర్ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రిమండలితో గవర్నర్ సంప్రదించిన తరువాతే సొంతగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఏ అంశమైనా గవర్నర్ నిర్ణయమే తుది నిర్ణయం. గవర్నర్‌కు సూచనలు, సలహాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారుల్ని నియమిస్తుంది. ఉమ్మడి రాజధాని అయినప్పటికీ భౌగోళికంగా హైదరాబాద్, సైబరాబాద్‌లు తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం కావడంతో ఇక్కడ పోలీసు కమిషనర్ల నియామకం మాత్రం ప్రత్యక్షంగా తెలంగాణ మంత్రిమండలి, పరోక్షంగా ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే జరగనున్నాయి. విపత్కర పరిస్థితుల్లోనే గవర్నర్ జోక్యం శాంతిభద్రత అంశం ఉమ్మడి గవర్నర్ చేతిలో ఉన్నప్పటికీ ప్రతి అంశంలోనూ ఆయన జోక్యం ఉండదు. ఉమ్మడి రాజధానిలో నివసించే సీమాంధ్రుల భద్రత విషయాన్ని నేరుగా ‘ప్రత్యేక బిల్లు’లో ఎక్కడా ప్రస్తావించలేదు. జనం ధన, మాన, ప్రాణాల భద్రత, ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఎక్కడ నివసించినా రాజ్యాంగబద్ధంగా అక్కడి ప్రభుత్వమే చూడాల్సి ఉంటు ంది. ఈ నేపథ్యంలోనే ఈ బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం పైనే ఉంటాయి. ఉమ్మడి రాజధానిలో ప్రజల భద్రతపై తెలంగాణ మంత్రిమండలితో చర్చించి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితులు, తీవ్ర సంక్షోభాలు తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ నేరుగా తన విచక్షణాధికారా ల్ని వినియోగిస్తారు. అలాంటప్పుడు కేంద్రం నియమించే ఇద్దరు సలహాదారులు ఉమ్మడి రాజధానిలో భద్రత వ్యవహారాలకు సంబంధించి గవర్నర్‌కు సూచనలు, సలహాలు అందిస్తారు. అవసరమైతే వినియోగించేందుకు ఐదేళ్ల పాటు ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)ను హైదరాబాద్‌లో మోహరించి ఉంచుతారు. చండీగఢ్‌లో ఉమ్మడి అంగీకారంతో... చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం కాకముందు హర్యానా, పంజాబ్‌లకు ఉమ్మడి రాజధానిగా ఉండగా అక్కడో ప్రత్యేక విధానాన్ని అవలంభించారు. ఆ నగర పోలీసు కమిషనర్‌ను రెండు రాష్ట్రాల సీఎం అంగీకారంతో నియమించేవారు. నగరంలో శాంతిభద్రతలకు సంబంధించి పోలీసు కమిషనర్ పోస్టు ఎంతో కీలకమైంది. చండీగఢ్ ఉమ్మడి రాజధాని కావడంతో రెండు ప్రభుత్వాల కార్యాలయాలు, కార్యకలాపాలు, పరిపాలన ఆ నగరం కేంద్రంగానే సాగాయి. దీంతో ఇరు ప్రభుత్వాల అంగీకారాన్నీ పరిగణనలోకి తీసుకునేవారు. ఇక్కడ వివాదం రేగితే దాన్ని పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేవారు. రెండు ప్రభుత్వాలు సూచిస్తున్న వ్యక్తుల అనుభవం, పూర్వ చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకునేది. హైదరాబాద్, సైబరాబాద్‌ల విషయంలో ఈ విధానం అమలు చేయడం సాధ్యం కాదన్నది మాజీ పోలీసు బాస్‌ల మాట. -
‘యూటీ’ మాటే లేదు: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్‌ను ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే అవకాశం లేదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అలాంటి ఆలోచన మంచిది కాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీమాంధ్రకు దక్కనందున ఇంకొక ప్రాంతానికి దక్కరాదనే ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి రాజధాని నిర్మించుకోవడం చక్కని పరిష్కారమవుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన ఐదేళ్ల ప్రత్యేక హోదా వ్యవధిని మరింతగా పెంచాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
గవర్నర్‌తో చర్చించాకే..
అధికార నివాసాలపై మహంతి నిర్ణయం ప్రస్తుత అసెంబ్లీలోనే ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రం సమావేశాలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం కన్వీనర్‌గా ఐఏఎస్ పి.వి.రమేశ్ సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికార నివాసాలు కేటాయింపు, ఢిల్లీలోని అంధ్రప్రదేశ్ భవనం, ఇద్దరు సీఎస్‌లకు, ఇద్దరు డీజీపీలకు అధికార నివాసాలు కేటాయింపు సున్నితమైన అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై గవర్నర్ నరసింహన్‌తో చర్చించిన తరువాత ఆయన సలహాలు, సూచనలమేరకు వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్స్‌లో ముఖ్యమంత్రి అధికార నివాసం, క్యాంపు కార్యాలయం ఉంది. దీన్ని ఇప్పుడు తెలంగాణ సీఎంకు కేటాయించాలో, సీమాంధ్ర ముఖ్యమంత్రికి కేటాయించాలో అధికారులు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సీఎంకి ఒక అధికార నివాసం, క్యాంపు కార్యాల యం ఉండాలని భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేకంగా గ్రీన్‌ల్యాండ్స్‌లో వాటిని నిర్మిం చారు. ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎంకు గ్రీన్‌ల్యాండ్‌లోని అధికార నివాసం కేటాయిస్తే మరో రాష్ట్ర సీఎంకు అధికార నివాసంగా ఏది కేటాయించాలనేది సమస్యగా మారింది. అలాగే ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, ఇద్దరు డీజీపీలకు అధికార నివాసాలను, సచివాలయంలో ఇద్దరికీ అధికారిక కార్యాలయాలను కేటాయించాలి. ఉమ్మడి రాజధానిలో తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు అసెంబ్లీ సమావేశాలను ప్రస్తుత అసెంబ్లీలోనే ఒకరు తరువాత ఒకరు నిర్వహించుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నివేదికను సమర్పించారు. కాగా సచివాలయంలోని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం కన్వీనర్‌గా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌ను నియమించాలని సీఎస్ నిర్ణయించారు. ఈ విభాగంలో ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, బి.వెంకటేశం, జయేష్ రంజన్ పనిచేస్తారు. ఈ విభాగంలో డిప్యుటీ కార్యదర్శిగా ఎల్. సుబ్బారెడ్డి నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
రాజ్యాంగ పరిధికి లోబడి ఉమ్మడి రాజధాని: దిగ్విజయ్
న్యూఢిల్లీ: రాజ్యాంగ పరిధికి లోబడి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆ అవకాశం రాజ్యాంగంలో ఉందని తెలిపారు. ఉమ్మడి రాజధానికి రాజ్యాంగ సవరణ అవసరంలేదన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సంబంధించి ఆంటోని కమటీ సీఫార్సులు జిఓఎంకు అందించినట్లు తెలిపారు. జిఓఎం ఈ రోజు నివేదిక సిద్ధం చేస్తుందని చెప్పారు. అన్ని అంశాలను జిఓఎం పరిశీలిస్తుందన్నారు. జిఓఎం నివేదిక కేంద్ర మంత్రి మండలి మందుకు వస్తుందని చెప్పారు. తెలంగాణ బిల్లు త్వరలో అసెంబ్లీకి ముందుకు వస్తుందన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని దిగ్విజయ్ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేయడంలో తప్పులేదన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గౌరవిస్తారని చెప్పారు. సిడబ్ల్యూసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. -
రాజ్యాంగ పరిధికి లోబడి ఉమ్మడి రాజధాని
-
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన
-
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన
న్యూఢిల్లీ: సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఈ ఉదయం కేంద్ర మంత్రి, జిఓఎం సభ్యుడు జైరామ్ రమేష్‌ను కలిశారు. వారి మధ్య చర్చ ప్రధానంగా హైదరాబాద్ పైనే జరిగింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు కోరారు. అలా కాని పక్షంలో పరిమిత ఆంక్షలతో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ప్రతిపాదించారు. జైరామ్ రమేష్‌ను కలిసినవారిలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు పల్లంరాజు, పనబాక లక్ష్మి, చిరంజీవి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, జెడి శీలం ఉన్నారు. కావూరి సాంబశివరాలు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, విద్యా, ఉద్యోగ అంశాలు కేంద్ర పరిధిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జిఓఎం ఈ విధమైన ప్రతిపాదన చేస్తుందని భావిస్తున్నారు. -
యూటీ ప్రతిపాదన తగదు
కందుకూరు, న్యూస్‌లైన్: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఆమోదించడం తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి నిదర్శనమని, సీమాంధ్ర నేతలు యూటీ చేయాలనడం అర్థరహితమని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే సమయంలో హైదరాబాద్‌ను యూటీ చేయాలని, భద్రాచలం మాదేనంటూ సీమాంధ్ర నేతలు కుటిల రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. జీఓఎంకు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కేవలం ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఉందని, సీమాంధ్రలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పరీవాహక ప్రాంతాలు ఉన్నాయని, తీర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గమని ఈ ప్రాంత ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారన్నారు. సీమాంధ్ర నేతలు సమస్యలు సృష్టించకుండా భౌతికంగా విడిపోయి మానసికంగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు సురేందర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, ఈశ్వర్‌గౌడ్, ఇజ్రాయిల్, కృష్ణనాయక్, మహేష్‌గౌడ్, చిర్ర సాయిలు, రాణాప్రతాప్‌రెడ్డి, దశరథ, బాబురావు, శోభ, లత, కరుణాకర్‌రెడ్డి, సమీర్, ఎస్.పాండు, హామీద్, దేవేందర్, కె.పాండు, దర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
జీవోఎంతో తెలంగాణ కేంద్ర మంత్రుల సమావేశం
-
జీవోఎంతో తెలంగాణ కేంద్ర మంత్రుల సమావేశం
న్యూఢిల్లీ : తెలంగాణ కేంద్ర మంత్రుల బృందం సోమవారం జీవోఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ పాల్గొన్నారు. అంతకు ముందు జీవోఎంతో భేటీ అవుతున్న నేపథ్యంలో.. ఆ కమిటీ ఎదుట ప్రతిపాదించాల్సిన అంశాలపై కాంగ్రెస్ తెలంగాణ నేతలు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో ఈరోజు ఉదయం మరోసారి సమావేశమై నివేదికకు తుది మెరుగులు దిద్దారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించినా సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏడాదిలోపే నిర్మించుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలంగాణ కేంద్ర మంత్రులు విభజనపై జీవోఎంకు నివేదించనున్నారు. ఒకవేళ అక్కడి ప్రభుత్వం జాప్యం చేసినట్లయితే కేంద్రమే జోక్యం చేసుకుని త్వరితగతిన కొత్త రాజధానిని నిర్మించి సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడికి తరలించాలని కోరనున్నారు. -
జనవరిలోగా తెలంగాణ: రాజనరసింహ
-
జనవరిలోగా తెలంగాణ: రాజనరసింహ
న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 5 ఏళ్లు ఉంటే చాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. తెలంగాణ విభజనకు ఏర్పాటు చేసి కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)తో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. రాజనరసింహ కేవలం పది నిమిషాలు మాత్రమే వారితో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనవరిలోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే అన్నారు. 10 జిల్లాలతో కూడి తెలంగాణ కావాలన్నారు. తెలంగాణ రెవెన్యూ తమ సొంతం అని చెప్పారు. ఆంధ్ర ప్రాంతానికి అవసరమైన ప్యాకేజీలు ఇవ్వాలని జిఓఎంను కోరినట్లు తెలిపారు. ఉద్యోగుల విషయంలో 371డి కొనసాగించాలని చెప్పారు. గోదావరి నదిపైన రెగ్యులేటరీ అథారిటీ అవసరంలేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. -
ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేదు: అసద్
-
సీఎం పదవి కోసం అన్నింటికీ ఒప్పుకుంటున్నారు
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కేవలం పరిపాలన కోసం కొంతకాలం ఉండవచ్చని ఆయన అన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ శాంతి భద్రతల అంశం కేంద్రం చేతిలో ఉండటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 7లో ఇదే చెపుతుందన్నారు. తెలంగాణలో ఉర్దూను అధికార భాషగా అమలు చేయాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. సీమాంధ్ర కేంద్రమంత్రులకు ఈ ప్రాథమిక విషయాలు తెలియవని అసదుద్దీన్ అన్నారు. తెలంగాణలో, ఆంధ్రాలో భూమికి సంబంధించిన చట్టాలు వేరుగా ఉన్నాయన్నారు. రాజ్యాంగం ప్రకారం సీమాంధ్ర రెవెన్యూను తెలంగాణకు తరలించలేరన్నారు. ఖైరతాబాద్ మండల పరిధిలో సీమాంధ్ర తాత్కాలిక రాజధాని ఉండాలని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తానొక్కడినే కారులో తిరుగుతానని.... తనకు లేని ఆందోళన సీమాంధ్రులకు ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణలో సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయం వద్దని అసదుద్దీన్ అన్నారు. సీమాంధ్రులకు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రక్షణ శాఖ కార్యాలయాలకు భద్రత ఉండగా సీమాంధ్రులకు భయమెందుకన్నారు. హైకోర్టును తక్షణమే రెండుగా విభజించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల స్వార్థబుద్ధిని తాను ఖండిస్తున్నట్లు ఒవైసీ అన్నారు. కేవలం సీఎం పదవి కోసం అన్నింటికీ ఒప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. అలా ఒప్పుకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారని ఒవైసీ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. నిర్దేశిత కాల పరిమితిలోగా విభజన చేయమని జీవోఎంను కోరినట్లు ఒవైసీ తెలిపారు. తెలంగాణలోని ముస్లింలకు, క్రైస్తవులకు ముప్పు ఉందని... అయితే సీమాంధ్ర ప్రజలకు కాదని ఆయన అన్నారు. బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత ఘర్షణల నివారణ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. అనంతపురం , కర్నూలు జిల్లాలను తెలంగాణ కలపాలన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం తెలంగాణలో కలుపుతామన్నా తమకు ఇబ్బంది లేదని ఒవైసీ తెలిపారు. -
హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒప్పుకోం: ఎంఐఎం
-
హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒప్పుకోం: ఎంఐఎం
హైదరాబాద్ : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తేల్చి చెప్పారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ విభజన అనివార్యమైతే రాయల తెలంగాణకే తాము మొగ్గు చూపుతామన్నారు. అసదుద్దీన్ కేంద్రపాలితం ఆలోచనే కాకుండా.. ఉమ్మడి రాజధానిపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. షరతులు లేని రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నారు. విభజనపై ఏర్పాటు అయిన జీవోఎంకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ....మజ్లీస్ 46 పేజీల నివేదిక పంపింది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు వెంటనే కొత్త రాజధాని ఏర్పాటు సత్వర చర్యలు చేపట్టాలని ఎంఐఎం తన లేఖలో కోరింది. విడదీయాల్సి వస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాలను కలిసి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆపార్టీ సూచించింది. -
ఉమ్మడి రాజధానికి పదేళ్లు అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం(జీవోఎం)ను కోరారు. మూడు నుంచి ఐదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచితే చాలని, ఈ లోపు సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం ప్రకటించిన విధంగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం మాత్రమే కావాలని, ప్రత్యేకించి సరిహద్దులు మార్చాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. 371(డి) అధికరణను సవరించడానికి రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం లేదని, విభజన బిల్లు మాదిరిగానే సాధారణ మెజారిటీతోనే దీనిని సవరించవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా శాసనమండలిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మండలి రద్దవుతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిల్లులో ఈ అంశాన్ని తప్పనిసరిగా పొందుపర్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డి, రాజలింగంగౌడ్, వి.భూపాల్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు, ఎస్.సంతోష్‌కుమార్, ఎమ్మెస్ ప్రభాకర్, ఫారూఖ్ హుస్సేన్ సీనియర్ నేతలు పి.నర్సారెడ్డి, ఎస్.ఇంద్రసేనారెడ్డి, బి.మోహన్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి సమావేశమై కేంద్ర మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాల్సిన అంశాలపై చర్చించి నివేదిక రూపొందించారు. అనంతరం ఆ నివేదికను యాదవరెడ్డి మీడియాకు విడుదల చేశారు. నివేదికలో ముఖ్యాంశాలు: 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సరిహద్దులను మర్చాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన పని లేదు. హైదరాబాద్‌కు సీమాంధ్ర జిల్లాలు 200 కి.మీల నుంచి 900 కి.మీల దూరంలో ఉండటంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. మూడు నుంచి ఐదేళ్లు మాత్రమే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ప్రయోజనాల మేరకు వెంటనే సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలి. ప్రణాళికా సంఘంలోని సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించి తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి తగిన సాయం చేయాలి. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ కల్పించే విషయంలో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ మేరకు నీటి వనరులను పంపిణీ చేయాలి. -
అధిష్టానం పెద్దలతో గవర్నర్ వరుస భేటీలు
న్యూఢిల్లీ : హస్తినలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంతో భేటి అయిన ఆయన సుమారు ఆరగంట పాటు రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం టెన్ జన్‌పథ్ లో సోనియాగాంధీతో ....నరసింహన్ 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు . అటు తరువాత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని యంత్రాంగంపై చర్చించినట్లు తెలుస్తోంది. -
భద్రాచలంపై వితండవాదం వద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సరిహద్దుల ప్రకారమే రాష్ట్రాన్ని విభజించాలని, దీనిపై అభ్యంతరాలు పెట్టవద్దని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ తమ సీమాంధ్ర ప్రాంత నేతలకు విజ్ఞప్తి చేసింది. పార్టీ గతంలో రూపొందించిన రోడ్ మ్యాప్ ప్రకారమే రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందానికి నివేదికను సమర్పించాలని సలహా ఇచ్చింది. సీమాంధ్రుల సమస్యలపై తమకూ సానుకూలత ఉందని, దాన్ని చేతగానితనంగా భావిస్తే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మంత్రుల బృందానికి అందజేయాల్సిన నివేదిక రూపురేఖలపై చర్చించేందుకు పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ మంగళవారమిక్కడ భేటీ అయింది. ఉద్యమ కమిటీ ఛైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం కీలకమైన పది అంశాలను చర్చించింది. సీమాంధ్ర ప్రాంత బీజేపీ నేతలు కోరుతున్నట్టు భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపకూడదని, దానిపై చర్చ కూడా వద్దని పలువురు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కడితే మునిగిపోయే గ్రామాలన్నీ తెలంగాణలోనే ఎక్కువగా ఉంటాయని, అయినా సీమాంధ్రప్రయోజనాల దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు తాము అంగీకరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానిపై వితండవాదానికి దిగవద్దని సీమాంధ్ర నేతలకు సలహా ఇచ్చారు. హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రుల భద్రతకు తాము బాధ్యత వహిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు అందరిదని, హైదరాబాద్‌పై పూర్తి అధికారం తెలంగాణకే ఉండాలని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పదేళ్ల పాటు కాకుండా నాలుగైదేళ్లకు కుదించేలా చూడాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. పింఛన్లు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా జీవోలు జారీ చేయాలని కూడా కొందరు నేతలు సూచించారు. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటు వ్యయం మొత్తాన్నీ కేంద్రమే భరించేలా చూడాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అమలయ్యేలా చూడాలని కోరారు. రెండు మూడ్రోజుల్లో సీమాంధ్ర ఉద్యమ కమిటీతోనూ చర్చించి నివేదికను తయారు చేసి పార్టీ జా తీయ నాయకత్వానికి పంపాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాగా, విజయవాడ నగరానికి చెందిన మాంటిస్సోరీ విద్యాసంస్థల డెరైక్టర్ అవిర్నేని రాజీవ్ బీజేపీలో చేరారు. -
సీమాంధ్ర కొత్త రాజధానికి ఒకట్రెండేళ్లు చాలు: ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో కొత్త రాజధాని నిర్మాణానికి ఒకట్రెండేళ్లకు మించి వ్యవధి అక్కర్లేదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగింపును మూడేళ్లకే పరిమితం చేయాలన్న తెలంగాణ జేఏసీ డిమాండ్‌పై ఈటెల ఈ విధంగా స్పందించారు. ఆయున వుంగళవారం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు బాల్క సుమన్‌లతో కలసి తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను పదేళ్లదాకా, ఉమ్మడి రాజధానిగా ఉంచే విషయంపై తాము మొన్నటి వరకు ఆలోచించామని అరుుతే, సీవూంధ్రలో పెద్దపెద్ద కాంట్రాక్టర్లే ఉన్న కారణంగా రాజధాని నిర్మాణానికి అంత గడువు అక్కర్లేదని అనుకుంటున్నావుని రాజేందర్ చెప్పారు. విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎంకు) తెలంగాణ జేఏసీ నివేదిక ఇచ్చినా పార్టీతరఫున తామూ నివేదిక ఇస్తావున్నారు. అరుుతే, పార్టీ నివేదికలో ఏ అంశాలుంటాయో చె ప్పడానికి ఆయన నిరాకరించారు. ఏ త్యాగం చేశారని జైత్రయాత్రలు?: ప్రత్యేకరాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏ త్యాగం చేశారని ఇప్పుడు జైత్రయాత్రలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటావుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలువరించే సత్తా లేకపోతే, తెలంగాణ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ కుర్చీని కాపాడుతున్నది మీరే కాదా? అని తెలంగాణ వుంత్రులను ప్రశ్నించారు. తెలంగాణ మంత్రుల బలం లేకుండా ఆయన ఆపదవిలో కొనసాగే అస్కారమే లేదన్నారు. సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇవ్వడంపై తమకు అభ్యంతరం లేకపోయినా, 56 ఏళ్ల సమైక్య పాలనతో ఎన్నోవిధాల నష్టపోయిన తెలంగాణకు తగిన న్యాయం చేయాలన్నారు. తెలంగాణ అంశాన్ని జాప్యంలేకుండా తేల్చాలన్న జయప్రకాశ్ నారాయణ్ ఇపుడు వూట వూర్చారని, విభజనపై నిర్ణయమే తప్పుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. విభజనపై సుప్రీంలో కేసు వేస్తానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అంటున్నారని, పార్లమెంట్ విశేషాధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదన్న విషయం వారికి తెలియదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 56 ఏళ్ల పాటు తెలంగాణకు ఏమి సమన్యాయం జరిగిందని, సీమాంధ్ర నేతలు సమన్యాయం అడుగుతున్నారని సోవూరపు సత్యనారాయణ ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు జై త్రయాత్రలు మాని వచ్చిన తెలంగాణను ఎలా రక్షించుకోవాలన్న దానిపై దృష్టి పెడితే మంచిదని సలహా ఇచ్చారు. -
హైదరాబాద్‌ను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా అంగీకరించం
హైదరాబాద్ : హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా అంగీకరించమని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. మంత్రుల బృందానికి ఇచ్చిన నివేదికపై టీజేఏసీ శనివారమిక్కడ సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ మూడేళ్లకు మించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు వీల్లేదన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకే నీటి పంపిణీ జరగాలన్నారు. ప్రత్యేక రాష్ట్రంతోనే అన్ని సమస్యలకు పరిష్కారమని కోదండరాం వ్యాఖ్యానించారు. మిగతా రాష్ట్రాలకు కల్పించే అన్నిహక్కులను తెలంగాణకు కల్పించాలన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని వనరుల వినియోగానికి సంపూర్ణ అధికారం తెలంగాణకు ఉండాలన్నారు. తెలంగాణ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు రూపకల్పన జరగాలని డిమాండ్ చేశారు. విభజనకు 371డీ ఆర్టికల్ అడ్డురాదని ఉద్యోగ సంఘాల టీజేఏసీ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. -
‘ఉమ్మడి’ పరిధిపై ఉత్కంఠ?
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని.. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతంలో రాజధానిని నిర్మించుకునేందు కు, హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు భరోసా కల్పించేం దుకు కేంద్రప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఇది. ఉమ్మడి రాజధా ని పరిధిలోని శాంతి భద్రతలు, రెవెన్యూపరమైన అంశా లు.. కేంద్రంపరిధిలో ఉంటాయుని కూడా కేంద్ర పెద్దలు లీకులిచ్చా రు. అయితే, తెలంగాణ ఏర్పాటులో కేంద్రం వుుందడుగు వేస్తున్నకొద్దీ రాష్ట్రవాసులలో.. ప్రత్యేకించి సీమాంధ్రుల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాజధా ని పరిధి ఏమిటి?.. రాజ్యాంగ నిర్వహణ ఎలా ఉంటుంది? అన్న అంశాలపై హైదరాబాద్‌లోని లక్షలాది మంది సీమాంధ్రులతో పాటు 13 జిల్లాల ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రెవెన్యూ జిల్లాను ఉమ్మడి రాజధానిగా గుర్తిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్య, సీమాంధ్రులకు, సమైక్య ఉద్యమకారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి సీమాంధ్ర ప్రజలకు సంబంధించి, హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో ఉన్న వారికంటే వెలుపలి ప్రాంతల్లోని వారి సంఖ్యే ఎక్కువ. హైదరాబాద్ మెట్రో డెవలెప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిని, ఉమ్మడి రాజధాని పరిధిగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల బాధ్యతను కేంద్రమే తీసుకొనే అవకాశం ఉంది. దీనితో పోలీసు శాఖపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా, కేం్రద్రానికే నియంత్రణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని పోలీసు వ్యవస్థ ద్వారా సీమాంధ్ర ప్రజలకు భద్రతకు భరోసా సాధ్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. ఉమ్మడి రాజధాని పరిధి హైదరాబాద్ రెవిన్యూ జిల్లా పరిధికే పరిమితమైతే... హెచ్ఎండీఏ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న సీమాంధ్రులకు భద్రతపై భరోసా ఎలా ఇవ్వగలమని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ అంటే.. కేవలం హైదరాబాద్ రెవెన్యూ జిల్లా కాదని, విస్తృత అర్థంలో హెచ్ఎండీఏ అని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే ఉమ్మడి రాజధాని పరిధి పరిమితమని దిగ్విజయ్ చెప్పడం ప్రజల్లో పలు అనుమానాలు తావిస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్లపాటు ఉంటుంది కాబట్టి ఈ పదేళ ్లలో ఉమ్మడి రాజధానిలోని సీమాం్రధ్రుల ప్రయోజనాలకు ఇబ్బంది ఉండబోదన్న భావన ప్రజల్లో కల్పించి, వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఒక జిల్లాకే ఉవ్ముడి రాజధాని పరిధిని పరిమితం చేస్తే, హెచ్ఎండీ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న సీమాంధ్రుల్లో విశ్వాసం కలిగించడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. ఒకప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(ఎంసీహెచ్) పరిధి కూడా హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధి కంటే ఎక్కువే ఉండేది. ఎంసీహెచ్ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, చుట్టుపక్కల ప్రాంతాల్లోని 12 మున్సిపాలిటీలను కలిపేసి 2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ)ను రూపొందించారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 626 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. సీమాం్రద్రులు, జీహెచ్ఎంసీ పరిధి వెలుపల కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 7,073 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న, హైదరాబాద్ మెట్రో డెవలెప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో సీమాంధ్ర ప్రజలున్నారు. ఈ నేపథ్యంలో విభజన తర్వాత హెచ్ఎండీఏ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తే సీమాంధ్రుల భద్రతకు భరోసా కల్పించడానికి శాంతిభద్రతలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం ఉపయోగపడుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఉమ్మడి రాజధానిగా ఒప్పుకోం
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద టీపీఎఫ్ మూడవ ఆవిర్భావ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ సీమాంధ్ర వారు హైదరాబాద్‌ను తాత్కాలి క రాజధానిగా మాత్రమే వాడుకోవాలని, ఎలాంటి షరతులు లేని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కమిటీల ద్వారా వనరుల పంపిణీ చేయాలని, ప్యాకేజీలు ఇస్తే అవి ఇన్నాళ్లు సీమాంధ్ర పాలకు ల చేతిలో నష్టపోయిన తెలంగాణకే ఇవ్వాల న్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీలో 22 గ్రామాలను కలపడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో చీకటి ఒప్పందాలు, కుట్రలకు పోవద్దని అన్నా రు. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తూనే ఈనెల 9న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీఎఫ్ మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, తెలంగాణ వాదులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకులు నలమాస కృష్ణ, బి.రమాదేవి, ఉమదేవి, జనగామ కుమారస్వామి, రాజేంద్రప్రసాద్, నర్సిం గరావు, జంజర్ల రమేశ్, రజిత, పాణి, సుధాకర్, ఎన్.రాజయ్య, మంద సంజీవ, బిల్ల మహేందర్, బి.రాములు, కళ పాల్గొన్నారు. -
ఒకే సచివాలయం..రెండు ప్రభుత్వాలు
-
ఒకే సచివాలయం.. రెండు ప్రభుత్వాలు
ఉమ్మడి రాజధానిలో ఇరు ప్రభుత్వాల వ్యవహారాలు చండీగఢ్ తరహాలో ప్రభుత్వ కార్యాలయాల విభజన ఉద్యోగులను బట్టి సచివాలయంలో భవనాల కేటాయింపు రెండు రాష్ట్రాలకు విడివిడిగా ప్రధాన ద్వారాలు డెరైక్టరేట్లు, కమిషనరేట్‌ల్లోనూ విభజన కొన్ని రంగాల ఉద్యోగులకే ‘ఆప్షన్లు’.. మిగతా ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే సాక్షి, హైదరాబాద్: ఒకే సచివాలయం.. రెండు ప్రభుత్వాలు, వివిధ శాఖల డెరైక్టరేట్లు, కమిషనరేట్ కార్యాలయాల్లోనూ వేర్వేరుగా పరిపాలన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ, పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో జరగనున్న పరిణామమిది. ప్రస్తుతం రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువుగా ఉన్న సచివాలయం కూడా విభజన అనంతరం రెండు భాగాలు కానుంది. సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకు ప్రస్తుత సచివాలయం నుంచే ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు పాలన సాగించే అవకాశముంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే సమయంలో ఉద్యోగులు, కార్యాలయాల పంపిణీ ఏవిధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. త్వరలో సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను చూస్తామని, చండీగఢ్ తరహాలో ప్రభుత్వ కార్యాలయాల విభజన ఉంటుందని ఉద్యోగులు, అధికారుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. సచివాలయంలో ప్రస్తుతం తొమ్మిది బ్లాక్‌లు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆధారంగా సచివాలయంలో కొన్ని బ్లాక్‌లను తెలంగాణ రాష్ట్రానికి, మరి కొన్ని బ్లాక్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే సచివాలయానికి ఉన్న రెండు గేట్లలో ఒకదాని నుంచి ఒక రాష్ట్ర సీఎం, మరోదాని నుంచి మరో రాష్ర్ట సీఎం రాకపోకలు సాగిస్తారని చెబుతున్నాయి. ప్రస్తుత సీఎం సి బ్లాక్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి డీ బ్లాక్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే అసెంబ్లీ స్థానాల ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరుగుతుందని, ఇందుకు ప్రాతిపదికను కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న వివిధ శాఖల డెరైక్టరేట్లు, కమిషరేట్ కార్యాలయాల్లోనే ఇరు రాష్ట్రాల ఉద్యోగులు పనిచేస్తారని, కేంద్ర కేబినెట్ కమిటీ రూపొందించే ప్రాతిపదిక ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సచివాలయంలో మొత్తం 5 వేల మంది ఉద్యోగులుండగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు 3 వేల మంది, తెలంగాణ ప్రాంతం వారు రెండు వేల మంది ఉన్నారు. ఇందులో ఏప్రాంతానికి చెందిన వారు అదే ప్రాంత ఉద్యోగులుగా పనిచేస్తారని... ఏ రాష్టాన్ని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ కొన్ని రంగాల ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు రాష్ట్రాల ‘అసెంబ్లీ’ అక్కడే.. ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం అసెంబ్లీ సమావేశాలను అదే భవనంలో ఒక రాష్ర్టం తరువాత మరో రాష్ట్రం నిర్వహించుకోనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా హైదరాబాద్‌లో ఎటువంటి నిర్మాణాలనూ చేపట్టేది లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
విభజనేమైనా కాంగ్రెస్ ఇంటి సమస్యనా?
-
ఉమ్మడి రాజధానిపై సీమాంధ్ర నుంచి వ్యతిరేకత
హైదరాబాద్ : ఉమ్మడి రాజధాని విషయంలో సీమాంధ్ర నుంచి వ్యతిరేకత వస్తోందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనకు ఎవరూ ఒప్పుకోవటం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత కింది నుంచి పైస్థాయి వరకూ అందరూ రెండుగా చీలిపోయారని దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. విభజనతో పాటు హైదరాబాద్, వచ్చే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శేషారెడ్డి మాట్లాడుతూ సాధ్యం కానిది ఏమీ లేదని... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి పోరాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, నేతలు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారే తప్ప, రాబోయే తరం గురించి ఆలోచించటం లేదని శేషారెడ్డి అన్నారు. -
జంట రాజధాని కోసం పాక్ ప్రణాళిక
ఇస్లామాబాద్: జంట రాజధాని నగరాన్ని నిర్మించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మార్గల్లా హిల్స్ వద్ద 1,200 కోట్ల డాలర్ల (రూ.76,100 కోట్లు) వ్యయంతో జంట రాజధానిని నిర్మించాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు గురువారం ‘ది న్యూస్’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. ఈ కథనం ప్రకారం... కొత్తగా నిర్మించనున్న జంట రాజధానిని ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్‌తో అనుసంధానించేందుకు సొరంగ మార్గాన్ని నిర్మించాలని రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీడీఏ) భావిస్తోంది. ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు సీడీఏ ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ఇస్లామాబాద్-రావల్పిండి నగరాల మధ్య రెండు రింగ్ రోడ్లతో పాటు రావల్పిండిలోని రావత్ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు త్వరలోనే ఖరారు కానుందని, ఖరారైన వెంటనే ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారని ‘ది న్యూస్’ తెలిపింది. దీనికోసం 25 వేల ఎకరాల స్థల సేకరణ కోసం సీడీఏ సన్నాహాలు ప్రారంభించిందని, సాధ్యమైనంత త్వరగా దీనిని సాకారం చేసేందుకు యుద్ధప్రాతిపదికపై పనులు చేపట్టాల్సిందిగా ప్రధాని షరీఫ్ సీడీఏను ఆదేశించారని వెల్లడించింది. -
‘ఉమ్మడి రాజధాని’పై పునరాలోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న ప్రతిపాదనకు అంగీకరించే విషయాన్ని పునరాలోచించుకోవాలని తెలంగాణ జేఏసీ యోచిస్తోంది. జేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన మంగళవారం జరిగిన స్టీరింగ్ కమిటీ భేటీలో.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం మేరకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అంగీకరిస్తే.. కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేతలు అభిప్రాయపడ్డారు. గత రెండు జేఏసీ సమావేశాలకు దూరంగా ఉన్న బీజేపీ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఆ పార్టీ ప్రతినిధులుగా రాజేశ్వరరావు, వేణుగోపాలరెడ్డి, అశోక్‌కుమార్‌యాదవ్, సుధాకర్శర్మలు హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రతినిధిగా డి.శ్రవణ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలో రెండు వర్గాల ప్రతినిధులుగా ఝాన్సీ, సంధ్య, ఉద్యోగ సంఘ నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాసగౌడ్, విఠల్, తెలంగాణ మాలమహానాడు నేత అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు. అధ్యయనానికి నిపుణుల కమిటీ... పదేళ్లపాటు ఉమ్మడి రాజధానికి తెలంగాణవాదులు అంగీ కారం తెలిపే విషయంలో మెతకగా వ్యవహరించినందునే సీమాంధ్ర నేతలు ఈ అంశాన్ని జటిలం చేసేందుకు యత్ని స్తున్నారన్న భావన భేటీలో వ్యక్తమైంది. సీమాంధ్ర ఎత్తుగడను అడ్డుకునేందుకు ప్రతిఘటన కార్యక్రమాలు చేపట్టటమే మంచిదనే నిర్ణయానికి నేతలు వచ్చారు. హైదరాబాద్‌ను యూటీగా ప్రకటించకుండానే ఉమ్మడి రాజధానిగా ప్రకటించే అవకాశాలకుగల న్యాయపరమైన అంశాలపై ఆరా తీశారు. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మించుకునే వరకు హైదరాబాద్‌ను మొత్తం ఉమ్మడి రాజధానిగా ఉంచే బదులు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయం వంటి కీలక కార్యాలయాలుండే నగరంలోని ఒకటి రెండు మండలాల ప్రాంతాన్ని మాత్రమే రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాంతంగా ఉంచే అవకాశాలున్నాయా అన్నదాని పై చర్చించారు. చివరకు హైదరాబాద్ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిని అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ కమిటీ నెలాఖరులోగా ఒక సదస్సును నిర్వహించి తగు సూచనలు చేయనుంది. 30న హైదరాబాద్‌లో టీ-జేఏసీ సభ: కోదండరాం తెలంగాణ నోట్‌ను కేంద్రం త్వరగా పూర్తిచేసి, ఆ తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా బిల్లును ఆమోదించాలన్న డిమాండ్‌తో టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లో బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు కోదండరాం తెలిపారు. అయితే తేదీ మారే అవకాశాలూ ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో జరిపే సభకు ముందూ, తరువాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై చర్చించేందుకు 14న జేఏసీ విస్త్తృతస్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ఏపీఎన్జీవోల సభ వల్ల పెరిగిన ఘర్షణ వాతావరణంతో హైదరాబాద్‌ను పదేళ్ల ఉమ్మడి రాజధానిగా అంగీకరించడంపై పునరాలోచన చేయాలని జేఏసీపై ఒత్తిడి వస్తోందన్నారు. దీనిపై జేఏసీ విస్త్తృతస్థాయి భేటీలో చర్చిస్తామన్నారు. ఏపీఎన్జీవోల సభ సంద ర్భంగా జరిగిన ఘర్షణల కేసుల్లో అరెస్టుల విషయంలో సర్కారు వివక్ష చూపుతోందన్నారు. సీమాంధ్రలో బీజేపీ, సీపీఐ కార్యాలయాలపై దాడులు జరగడాన్ని జేఏసీ ఖండిస్తోందన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను విరమింపజేసే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా, ప్రేక్షక పాత్ర వహిస్తుం డడాన్నిబట్టి ఈ సమ్మెను సర్కారే నిర్వహిస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయని దేవీప్రసాద్ అన్నారు. -
హైదరాబాద్‌పై మాట్లాడటానికి మీరెవరు?: హరీష్‌రావు
సిద్దిపేట, న్యూస్‌లైన్: ‘హైదరాబాద్‌పై మాట్లాడటానికి మీరెవరు..? ఏ హోదాలో ఉదారతను ప్రకటిస్తున్నారు.. ఎవరిని అడిగి ప్రతిపాదిస్తున్నారు?’అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీష్‌రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా అంగీకరిస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకు లు పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సీమాంధ్ర అధికారిక కార్యకలాపాలకు మాత్రమే భాగ్యనగరాన్ని రాజధానిగా పరిమితం చేయాలని డిమాం డ్ చేశారు. రాబడి, శాంతిభద్రతలవంటివన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ఉండాల్సిందేనని చెప్పారు. హెచ్ఎండీఏను కేంద్రం పరిధిలోకి తేవడమంటే తెలంగాణలోని సగం జిల్లాలను విడదీసినట్లేనని, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలను వెంటనే మానుకోవాలన్నారు. వారిని సస్పెండ్ చేసే దమ్ముందా?: చంద్రబాబుకు కేటీఆర్ సవాల్ సాక్షి, హైదరాబాద్: తమది క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం ఎందుకు చేయడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు ప్రశ్నించారు. టీడీపీ విధానం తెలంగాణకు అనుకూలమని చెబుతున్న చంద్రబాబు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తున్న ప్రజాప్రతినిధులతో పాటు నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విభజనకు అంగీకరించిన చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడం ఏమిటన్నారు. ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని అర్భకుడు సీఎం కిరణ్ అని. ఆయనకు దమ్ముంటే కేసీఆర్ విసిరిన సవాల్‌కు స్పందించాలని కోరారు. తెలంగాణవాదులపై సంస్కారహీనంగా వ్యవహరిస్తున్న వారితో ఎలా కలిసుండాలని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న దీక్ష గురించి విలేకరులు ప్రస్తావించగా... వేరే రాష్ర్టంలో జరుగుతున్న దీక్ష గురించి తామెందుకు మాట్లాడాలని చెప్పారు. హరికృష్ణా.. ఎన్టీఆర్ ఇప్పుడే గుర్తుకొచ్చారా?: కడియం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావును సీఎం పదవి నుంచి దించేటప్పుడు అందులో భాగస్వామి అయిన హరికృష్ణకు ఇన్నాళ్లకు తండ్రి గుర్తుకొచ్చినట్టున్నారని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడూ చేసేప్పుడు తమతోనే ఉన్న హరికృష్ణ ఆనాడు నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన టీఆర్ఎస్ నేతలు బి.వినోద్‌కుమార్, రమణాచారిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బావమరిది ఎన్టీఆర్ సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినప్పటికీ టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాత్రం తమ పార్టీది తెలంగాణ అనుకూల వైఖరి అని చెప్పడం వింతగా ఉందన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడంపై శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంపై ఈ స్థితిలోనే ఒత్తిడి చేయలేని కాంగ్రెస్ నేతలు రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలను ఎలా గౌరవిస్తారని సందేహం వ్యక్తం చేశారు. ఈనెలాఖరులో కరీంనగర్ నుంచి కేసీఆర్ పర్యటన ప్రారంభం కానుందని చెప్పారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర పాలిత ప్రాంతం అనేది హైదరాబాద్‌కు నప్పదని తెలిపారు. దిగ్విజయ్‌సింగ్ సైతం ఇదే విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. -
‘మహా’ నగరంపై మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం గత కొన్నేళ్లుగా పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ‘హుడా’ నుంచి హెచ్ఎండీఏగా రూపాంతరం చెందాక ఇది మరింతగా పెరిగింది. భూముల లభ్యత, తక్కువ ధర, మానవ వనరులు, రవాణా, విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాల విషయంలో హైదరాబాద్ అనుకూలంగా ఉండటంతో పారిశ్రామిక, ఐటీ, విద్యా, వైద్య, కార్పొరేట్, సేవల రంగం బాగా విస్తరించింది. దీంతో అనతి కాలంలోనే హైదరాబాద్ మెట్రో నగరంగా అభివృద్ధి సాధించింది. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను శాశ్వత రాజధానిగా లేదా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ప్రకటించనున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇరుప్రాంతాల వారూ హైదరాబాద్‌పైనే పట్టుబడుతుండటంతో.. హెచ్ఎండీఏ చర్చనీయాంశంగా మారింది. అప్పులెవరికి..? హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే.. ఇప్పటికే నగరాభివృద్ధి కోసం హెచ్ఎండీఏ చేసిన అప్పు రూ. 1,100 కోట్లు, ఆదాయ పన్ను బకాయిలు రూ. 550 కోట్లను ఎవరు తీర్చాలన్నది ప్రశ్న. దీన్ని ఇరు ప్రాంతాల వారికి పంచితే.. పదేళ్ల తర్వాత సీమాంధ్ర ప్రాంతం వారు నగరాన్ని వీడాల్సి వస్తే అప్పు తీర్చేందుకు ఇష్టపడరు. ఒకవేళ శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే ఇరు ప్రాంతాల వారు సమానంగా స్వీకరించాల్సి ఉంటుందని ఓ వాదన. హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండీఏకు మొత్తం 7,400 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టింది. అందులో వివిధ విద్యా సంస్థలకు, ఐటీ సంస్థలకు, పరిశ్రమలకు ఇప్పటికే 3,700 ఎకరాల భూమిని విక్రయించారు. మరో 3,700 ఎకరాల భూమి హెచ్ఎండీఏ ఆధీనంలో ఉంది. అది కూడా ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విడివిడిగా ఉంది. దాంతోపాటు ఒక్కో ప్రాంతంలో భూమి ధర ఒక్కో రకంగా ఉండటంతో దానిని ఏ ప్రాతిపదికన పంచుతారన్నది ప్రజల్లో ఉదయిస్తున్న ప్రశ్న. ఒకవేళ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మిగతా నాలుగు జిల్లాల్లోని ప్రాంతాలను.. ఆయా జిల్లాల నుంచి పూర్తిగా తప్పించాల్సి ఉంటుంది. ఇది అంత సులువుగా తేలే వ్యవహారం కాదు. ఆయా జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే అది మరో సమస్యగా తయారవుతుంది. ఈ ప్రాజెక్టుల గతేమిటి? హైదరాబాద్‌లో తలపెట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను హెచ్ఎండీఏ ప్రారంభించాల్సి ఉంది. కానీ, విభజన నేపథ్యంలో దీనిపై హెచ్ఎండీఏ తర్జనభర్జన పడుతోంది. మియాపూర్‌లో భారీ బస్ టెర్మినల్, బాటసింగారం, మంగళపల్లిల్లో తలపెట్టిన లాజిస్టిక్ పార్కులను ఇప్పట్లో ప్రారంభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ‘పీవీ ఎక్స్‌ప్రెస్ వే’లో మూడుచోట్ల అసంపూర్తిగా ఉన్న ర్యాంపుల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే రూ.20 కోట్లు వెచ్చించాల్సి ఉంది. దీంతోపాటు నగరంలోని 14 ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఫ్లైఓవర్లకు ఇక మోక్షం లభించదని హెచ్ఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే హ్యాబిటాట్ సెంటర్, సైన్స్ సిటీ, జవహర్‌నగర్‌లో ఎడ్యుకేషన్ హబ్ వంటి కొత్త ప్రాజెక్టులు ఇక మరుగున పడే పరిస్థితి కనిపిస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు జైకా నుంచి తీసుకొన్న సుమారు రూ. 11వేల కోట్లకు పైగా రుణాన్ని చెల్లించే వ్యవహారం కూడా ప్రధాన అంశంగా మారనుంది. -
ఉమ్మడి రాజధానికి బీజేపీ వ్యతిరేకం: దత్తాత్రేయ
హైదరాబాద్ : హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి బీజేపీ వ్యతిరేకమని ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ సమర్థించింది కాబట్టే యూపీఏ నిర్ణయం తీసుకుందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చి లిఖితపూర్వకంగా నిర్ణయం ఉంటేనే చట్టబద్ధత లభిస్తుందని దత్తాత్రేయ అన్నారు. ప్రస్తుత సీమాంధ్రలో పరిస్థితులకు కారణం ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులే కారణమని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్ల కాలంలో హైదరాబాదు నగరం పోలీసు వ్యవస్థ, శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న విధంగా హైదరాబాద్‌లోనూ శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థ బాధ్యతలను కేంద్ర హోం శాఖ నిర్వహించేలా చర్యలు తీసుకునే విషయం పరిశీలనలో ఉన్నదని ఆయన నిన్న ఓ జాతీయ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దాంతో ఉమ్మడి రాజధాని కాబోతున్న హైదరాబాదులోని సీమాంధ్రులకు భద్రత కల్పించేందుకు ఢిల్లీ తరహా రక్షణ విధానం అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.