హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ శాంతి భద్రతల అంశం కేంద్రం చేతిలో ఉండటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణలో ఉర్దూను అధికార భాషగా అమలు చేయాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయం వద్దని అసదుద్దీన్ అన్నారు. సీమాంధ్రులకు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. హైకోర్టును తక్షణమే రెండుగా విభజించాలని ఆయన పేర్కొన్నారు.