‘ఉమ్మడి’ పరిధిపై ఉత్కంఠ? | Curiosity over the borders of common capital? | Sakshi
Sakshi News home page

‘ఉమ్మడి’ పరిధిపై ఉత్కంఠ?

Published Wed, Oct 9 2013 2:44 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

‘ఉమ్మడి’ పరిధిపై ఉత్కంఠ? - Sakshi

‘ఉమ్మడి’ పరిధిపై ఉత్కంఠ?

సాక్షి, హైదరాబాద్:  పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని.. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతంలో రాజధానిని నిర్మించుకునేందు కు, హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు భరోసా కల్పించేం దుకు కేంద్రప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఇది. ఉమ్మడి రాజధా ని పరిధిలోని శాంతి భద్రతలు, రెవెన్యూపరమైన అంశా లు.. కేంద్రంపరిధిలో ఉంటాయుని కూడా కేంద్ర పెద్దలు లీకులిచ్చా రు. అయితే, తెలంగాణ ఏర్పాటులో కేంద్రం వుుందడుగు వేస్తున్నకొద్దీ రాష్ట్రవాసులలో.. ప్రత్యేకించి సీమాంధ్రుల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాజధా ని పరిధి ఏమిటి?.. రాజ్యాంగ నిర్వహణ ఎలా ఉంటుంది? అన్న అంశాలపై హైదరాబాద్‌లోని లక్షలాది మంది సీమాంధ్రులతో పాటు 13 జిల్లాల ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు.
 
 ఈ నేపథ్యంలో హైదరాబాద్ రెవెన్యూ జిల్లాను ఉమ్మడి రాజధానిగా గుర్తిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్య, సీమాంధ్రులకు, సమైక్య ఉద్యమకారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి సీమాంధ్ర ప్రజలకు సంబంధించి, హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో ఉన్న వారికంటే వెలుపలి ప్రాంతల్లోని వారి సంఖ్యే ఎక్కువ. హైదరాబాద్ మెట్రో డెవలెప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిని, ఉమ్మడి రాజధాని పరిధిగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల బాధ్యతను కేంద్రమే తీసుకొనే అవకాశం ఉంది. దీనితో పోలీసు శాఖపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా, కేం్రద్రానికే నియంత్రణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని పోలీసు వ్యవస్థ ద్వారా సీమాంధ్ర ప్రజలకు భద్రతకు భరోసా సాధ్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. ఉమ్మడి రాజధాని పరిధి హైదరాబాద్ రెవిన్యూ జిల్లా పరిధికే పరిమితమైతే... హెచ్‌ఎండీఏ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న సీమాంధ్రులకు భద్రతపై భరోసా ఎలా ఇవ్వగలమని ప్రశ్నిస్తున్నారు.
 
  హైదరాబాద్ అంటే.. కేవలం హైదరాబాద్ రెవెన్యూ జిల్లా కాదని, విస్తృత అర్థంలో హెచ్‌ఎండీఏ అని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే ఉమ్మడి రాజధాని పరిధి పరిమితమని దిగ్విజయ్ చెప్పడం ప్రజల్లో పలు అనుమానాలు తావిస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్లపాటు ఉంటుంది కాబట్టి ఈ పదేళ ్లలో ఉమ్మడి రాజధానిలోని సీమాం్రధ్రుల ప్రయోజనాలకు  ఇబ్బంది ఉండబోదన్న భావన ప్రజల్లో కల్పించి, వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఒక జిల్లాకే ఉవ్ముడి రాజధాని పరిధిని పరిమితం చేస్తే, హెచ్‌ఎండీ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న సీమాంధ్రుల్లో విశ్వాసం కలిగించడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.
 
 ఒకప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(ఎంసీహెచ్) పరిధి కూడా హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధి కంటే ఎక్కువే ఉండేది. ఎంసీహెచ్ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా,  చుట్టుపక్కల ప్రాంతాల్లోని 12 మున్సిపాలిటీలను కలిపేసి 2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్‌ఎంసీ)ను రూపొందించారు. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 626 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. సీమాం్రద్రులు, జీహెచ్‌ఎంసీ పరిధి వెలుపల కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 7,073 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న, హైదరాబాద్ మెట్రో డెవలెప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో సీమాంధ్ర ప్రజలున్నారు. ఈ నేపథ్యంలో విభజన తర్వాత హెచ్‌ఎండీఏ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తే సీమాంధ్రుల భద్రతకు భరోసా కల్పించడానికి శాంతిభద్రతలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం ఉపయోగపడుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement