seemandhra region
-
పాఠ్యాంశాల్లో ‘సీమాంధ్ర’ముద్ర!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత విద్యా స్థాయి పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో పాఠ్యాంశాల్లో సీమాంధ్ర ప్రాంతం ముద్రను ప్రతిబింబించేలా పాఠ్యాంశాల్లో మార్పులకు కసరత్తు చేస్తోంది. సిలబస్ మార్పులపై గత జనవరిలోనే సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని సిలబస్ మార్పులపై రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ(ఎస్ఈఆర్టీ)కు, ఉన్నత విద్యాసంస్థల్లో సిలబస్ మార్పుపై వర్సిటీలకు బాధ్యతలు అప్పగించారు. ప్రాథమికస్థాయి పాఠ్యాంశాల్లో మార్సులకు సంబంధించి ఎస్ఈఆర్టీ ఆధ్వర్యంలోని కమిటీ తాత్కాలిక నివేదికను కూడా సిద్ధం చేసింది. దీనిని ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందించనుంది. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణ ప్రాంతం విడివడినందున ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాల్లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంత వివరాలను పొందుపర్చనున్నారు. -
సీమాంధ్రలో మోడీ పర్యటన ఖరారు!
విజయవాడ: సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ పర్యటనలు బీజేపీ ఖరారు చేసింది. ఏప్రిల్ 30, మే 1 తేదిన సీమాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో సభల్ని ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 తేదిన మోడీ తిరుపతి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఏప్రిల్ 1 తేదిన మదనపల్లి, నెల్లూరు, గుంటూరు, నర్సాపురం, విశాఖపట్నంలో ఏర్పాటు చేసే బహిరంగసభల్లో మోడీ పాల్గొంటారన్నారు. మోడీ సభల్లో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొంటారని వెంకయ్యనాయుడు తెలిపారు. -
'సీమాంధ్ర అభివృద్ధికి కసిగా ఆలోచిస్తున్నా'
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రను అభివృద్ధి చేసేందుకు కసిగా ఆలోచిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం చంద్రబాబు నాయుడు నివాసంలో గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఇద్దరు నేతలు వారి అనుచరులను చంద్రబాబు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సీమాంధ్రను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. తెలుగుజాతిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో గెలవదని ఆయన జోస్యం చెప్పారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే తన్నే పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం రాయపాటి సాంబశివరావు తీవ్ర పోరాటం చేశారని ఈ సందర్బంగా చంద్రబాబు ప్రశంసించారు. -
'విభజనతో సీమాంధ్రకు మేలే జరిగింది'
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు పద్మరాజు,గంగాభవాని విమర్శించారు.అందుకే కాంగ్రెస్ నేతలను ఇష్టానుసారం ఆయన పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ త్వరలో వికటిస్తుందని వారు జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో వారిరువురు మాట్లాడుతూ... అవకాశవాదం,స్వార్థంతోనే నేతలు కాంగ్రెస్ వీడుతున్నారని వారు విమర్శించరు. అయితే కేడర్ మాత్రం పార్టీ వీడటం లేదన్న సంగతిని వారు ఈ సందర్బంగా గుర్తుచేశారు. తాను అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్‌లా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అంటున్నారని, కానీ రానున్న తమ ప్రభుత్వ పాలనలో సీమాంధ్ర ప్రాంతం సింగపూర్ తలదన్నేలా అభివృద్ధి చెందుతుందని పద్మరాజు, గంగాభవానిలు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అత్యధిక తీర ప్రాంతం గల సీమాంధ్ర అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడతాయన్నారు. విభజనతో సీమాంధ్రకు మేలే జరిగిందని వారు స్పష్టం చేశారు. -
మున్సిపల్ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఘట్టం
3,990 వార్డులకు 35,998 నామినేషన్లు చివరిరోజునే 21 వేలకు పైగా నామినేషన్లు నేడు నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 18 సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. 3,990 వార్డులకు గాను 35,998 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 146 మున్సిపాలిటీలకు ఈనెల 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయింది. చివరిరోజు శుక్రవారం 21 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై 16వ తేదీన అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 18 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకోనుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరగనున్న సంగతి విదితమే. మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారం గడువు ముగియగా.. 513 డివిజన్లకు 6,837 నామినేషన్లు దాఖలైన విషయం విదితమే. సీమాంధ్రలో పలుచోట్ల కాంగ్రెస్ నామినేషన్లు నిల్ సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య బహుస్వల్పంగా ఉండడం గమనార్హం. రాష్ట్ర విభజన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇతర పార్టీల్లో చేరడం, వారితో పాటే అనుచరగణం కూడా వెళ్లిపోవడంతో కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసేవారే కరువయ్యూరు. సీమాంధ్రలోని యలమంచలి, సామర్లకోట, తణుకు, మార్కాపురం, ఎర్రగుంట్ల, ఆళ్లగడ్డ, పామిడి (నగర పంచాయతీ)లలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. ఇక రాయదుర్గం, గుత్తి మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి చొప్పున, తాడిపత్రిలో రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యూరుు. పామిడి, రాయదుర్గం, గుత్తి, తాడిపత్రి మున్సిపాలిటీలు ఏపీసీసీ కొత్త అధ్యక్షుడు రఘువీరారెడ్డి సొంత జిల్లా అనంతపురంలోనివి కావడం గమనార్హం. కాగా ఇదే జిల్లాలోని ధర్మవరంలో నాలుగు, గుంతకల్లులో ఐదు నామినేషన్లు మాత్రమే కాంగ్రెస్ తరఫున దాఖలయ్యూరుు. అరుుతే తెలంగాణ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్లు వే శారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ మినహా మిగతా 145 మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్: 6,062, వైఎస్సార్సీపీ: 6,442, టీడీపీ:8,213, టీఆర్ఎస్: 2,776, బీఎస్పీ:175, బీజేపీ: 1,906, సీపీఐ: 526, సీపీఎం: 639, లోక్‌సత్తా:161, స్వతంత్రులు: 7,940, రిజిస్టర్డ్ పార్టీలు: 660 (ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 498 నామినేషన్లు దాఖలయ్యాయి) -
'సీమాంధ్రలో 145కు పైగా సీట్లు వైఎస్ఆర్ సీపీవే'
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకే కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. సీమాంధ్రలో 145 నుంచి 150 స్థానాలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో టీడీపీని ఎవరూ నమ్మరని శోభానాగిరెడ్డి అన్నారు. కరెంట్ తీగలపై బట్టలారేసుకోవాలన్న చంద్రబాబు ఇపుడు ఉచిత విద్యుత్ అంటూ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. 9గంటల ఉచిత విద్యుత్ అంటూ చంద్రబాబు చేస్తున్న వాగ్దానాల్ని ఓట్ల కోసమే అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. -
ఆదాయం లేని సీమాంధ్రలో జీతాలూ కష్టమే!
రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతం తీవ్ర ఆదాయలోటును ఎదుర్కోనుందని రాష్ట్రపతికి వైస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాసిన లేఖలో వివరించారు. 2012-13 ఆదాయ వివరాలను ఆయన ఆ లేఖతో పాటు పొందుపర్చారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే సీమాంధ్ర ప్రాంతం ఉద్యోగుల జీతభత్యాలకూ కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికిగానీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికిగానీ తీవ్రంగా నిధుల కొరత ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు, వాటి అనుబంధ పరిశ్రమలూ హైదరాబాద్ చుట్టూ ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. దీంతో సీమాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక, ఐటీ రంగం పూర్తిగా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మొత్తం ఐటీ టర్నోవరులో హైదరాబాద్ నుంచే 99.9 శాతం వస్తోందని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌వైపే చూడాల్సి వచ్చిందని తెలిపారు. కేవలం రాష్ట్ర రాజకీయ రాజధానిగానే కాకుండా ‘సూపర్ ఎకానమిక్, ఎంప్లాయ్మెంట్ పవర్ హౌస్’గా హైదరాబాద్ అవతరించిందని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే... ఈ ఆదాయాన్ని సీమాంధ్ర ప్రాంతం కోల్పోవాల్సి రానుందని వివరించారు. లేఖలో పేర్కొన్న కొన్ని ఆదాయ వివరాలు... - 2012-13 ఆర్థిక సంవత్సరాన్ని గమనిస్తే... రాష్ట్రం సొంత ఆదాయం రూ. 75,436 కోట్లుగా (68.6 శాతం) ఉంది. కేంద్రం నుంచి వచ్చే ఆదాయం రూ. 34,064 కోట్లు (31.2 శాతం). మొత్తం ఆదాయం రూ. 1,09,500 కోట్లు. - రాష్ట్ర సొంత ఆదాయంలో వ్యాట్ ఆదాయం రూ. 42,060 కోట్లు (56 శాతం) ఉండగా, ఇతరాలు రూ. 26,351 కోట్లు (35 శాతం)గా ఉంది. వడ్డీ ద్వారా రూ. 7,025 కోట్లు (19 శాతం) వస్తోంది. - కేంద్ర ఆదాయం కింద కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ. 20,270 కోట్లు వస్తుండగా, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ. 13,794 కోట్లు వస్తోంది. - ఈ సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని గమనించాలి. ‘2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం అమ్మకపు పన్ను 22 వేల కోట్లుగా ఉంది. ఇందులో కేవలం హైదరాబాద్ నుంచే 75 శాతం వస్తోంది. హైదరాబాద్‌ను మినహాయిస్తే కోస్తాంధ్రలో కేవలం 15 శాతం మాత్రమే అమ్మకపు పన్ను ఆదాయం ఉంది’ అని పేర్కొంది. -
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. సీమాంధ్రలో రాజీనామాల వెల్లువ
సాక్షి నెట్వర్క్: లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌లో రాజీనామాలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు మొదలు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి పురందేశ్వరి తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు రాజకీయ సన్యాసం ప్రకటించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డిలు కూడా తమ పదవులకు, పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు(పెందుర్తి), ముత్తంశెట్టి శ్రీనివాస్ (భీమిలి), చింతపూడి వెంకట్రామయ్య( గాజువాక), యూవీ రమణమూర్తి (యలమంచిలి)లు పదవులకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు (గిద్దలూరు), డాక్టర్ ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం)లతో పాటు కొండపి నియోజకవర్గం జరుగుమల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయప్రసాదరావులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీకి రాజీనామా చేసినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. కృష్ణాజిల్లా గన్నవరం మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ను వదిలారు. చిత్తూరు శాసనసభ్యుడు సీకే బాబు అలియూస్ జయచంద్రారెడ్డి మంగళవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. కోర్టుకు వెళతాం: కావూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్టు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. మరో కేంద్రమంత్రి జేడీ శీలం కాంగ్రెస్ అధ్యక్షురాలికి లేఖ రాశారు. లగడపాటి రాజకీయ సన్యాసం లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో కలత చెంది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ బహిష్కృత విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం ప్రకటించారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. లోక్‌సభ సచివాలయానికి రాజీనామా లేఖను పంపానని, దాన్ని ఆమోదించుకునేందుకు బుధవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నట్లు చెప్పారు. -
విభజనతో సీమాంధ్రకు నష్టం జరగదు
-
అది వితండవాదమే: హరీష్
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో అందరికీ నచ్చజెప్పిన తరువాతనే రాష్ట్ర విభజన చేయాలని కొందరు నాయకులు మాట్లాడడంలో హేతుబద్ధత లేదని, అది వితండవాదమని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నాయకుల ఆమోదం కావాలని కోరడమంటే వన్యప్రాణులను రక్షించడానికి తెచ్చే చట్టాలకు వేటగాళ్ల అనుమతి కోరినట్టే ఉంటుందని పేర్కొన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయంతో రాష్ట్ర విభజన జరగాలంటే దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమే కాదని పేర్కొన్నారు. -
నేను ఏదీ చెప్పను!: చంద్రబాబు
విడదీయాలన్నా, కలిపి ఉంచాలన్నా రెండు ప్రాంతాలవారిని ఒప్పించాలి: చంద్రబాబు ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్ ఎందుకు నోరు విప్పడం లేదని ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను కలిపి ఉంచాలనిగానీ లేదా విభజించాలనిగానీ తాను చెప్పనని తెలుగుదే శం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్నా లేదా కలిపి ఉంచాలన్నా రెండు ప్రాంతాల వారిని ఒప్పించాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకునే వారు తెలంగాణ ప్రాంతం వారిని ఒప్పించాలని, అదే సమయంలో విభజించాలని కోరుకునే వారు సీమాంధ్ర ప్రాంతం వారిని ఒప్పించాలన్నారు. శుక్రవారం టీడీఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించే దిశగా ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రయత్నించకపోవటం దారుణమన్నారు. ఈ విషయంలో వారు ఎందుకు నోరు విప్పటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టికల్-3ని తొలగించాలని పలు పార్టీల వారిని కలిశారని, అయితే ఆ ఆర్టికల్‌ను తొలగించటం సాధ్యం కాదన్న విషయం ఆ పార్టీ నేతలకు తెలియదన్నారు. సోనియా ఆదేశాల మేరకే జగన్ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్నారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కయ్యాయని దుయ్యబట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. తాను ఢిల్లీలో ఆరోగ్యం పాడుచేసుకుని దీక్ష చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదని, మీడియా కూడా సరిగా కవరేజ్ ఇవ్వలేదని, సీఎం అక్కడ 2 గంటలు కూర్చుంటే విపరీతమైన కవరేజ్ ఇచ్చారన్నారు. విభజనలో భాగం పంచుకుంటున్న వారందరి అడ్రస్ వచ్చే ఎన్నికల్లో గల్లంతవుతుందన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించి ఉంటే బాబు నుంచి ఈ ప్రశ్నలకు సమాధానం కోరేది. విభజనకు ఇరు ప్రాంతాల వారిని ఒప్పించాలనే మాట 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చినపుడు ఎందుకు చెప్పలేదు? అఖిలపక్ష సమావేశంలో ఎందుకు చెప్పలేదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 లో సవరణలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదించిందే తప్ప తొలగించమని చెప్పలేదు. దాన్ని సవరించడానికి అవకాశం లేదంటారా? విభజన విషయంలో మీ వైఖరేంటో ఎందుకు సూటిగా చెప్పలేకపోతున్నారు? టీడీపీలో ఎవరి వాదన వారిదే రాష్ర్ట విభజన విషయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం నేతలు శుక్రవారం యథావిధిగా ఎవరి వాదనలు వారు వినిపించారు. శుక్రవారం టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన తర్వాత పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ... విభజనను వ్యతిరేకిస్తూ తాము వేసిన పిటిషన్లు శుక్రవారం కోర్టులో విచారణకు వస్తాయని తెలిసే గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాము మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. దీని తర్వాత కొద్దిసేపటికే ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లా డుతూ విభజనపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేయటాన్ని స్వాగతించారు. ఇప్పటికైనా సమైక్యవాదులు బుద్ధి తెచ్చుకోవటంతో పాటు మరోసారి చిల్లర చేష్టలకు పాల్పడవద్దన్నారు. -
సీమాంధ్ర ప్రయోజనాలూ పరిగణనలోకి..
* బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం * టీ బిల్లుకు సవరణలు కోరదాం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. ఆ మేరకు పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలు కోరాలని తీర్మానించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ ఎల్.కె.అద్వానీ నివాసంలో సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులను చర్చ లేకుండా ఆమోదించనీయ కూడదని, అవసరమైతే ప్రతి బిల్లుకు సవరణలు కోరాలని తీర్మానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి ఈ పార్లమెంటు సమావేశాలు చివరివి కావడం వల్ల బిల్లులు ఆమోదం పొందితే ఆ పార్టీకే క్రెడిట్ పోతుందని, అందువల్ల ప్రతి బిల్లుపై వీలైనంత ఎక్కువ చర్చ జరపాలని, సవరణలు కోరాలని నేతలు సూచించారు. ‘ఎన్నికల వేళ రాహుల్‌గాంధీ అనేక బిల్లులను ప్రవేశపెడతామంటూ ప్రచారం చేసుకున్నారు. ఆయన బిల్లులకు మనం ఎందుకు మద్దతివ్వాలి. ఆయన ఎన్నికల ఎజెండాకు మనం ఎందుకు సహకరించాలి..’ అని సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. పలు ఇతర అంశాలతో పాటు రాష్ట్ర విభజన బిల్లుపై కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ వైఖరిలో మార్పులేదని పునరుద్ఘాటిస్తూనే.. సీమాంధ్రుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని నిర్ణయించారు. టీ బిల్లును అసెంబ్లీ తిరస్కరించడం, సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి సహా సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు బిల్లును వ్యతిరేకిస్తుండడం తదితర పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే పక్షాలతో కలిసి అవినీతిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. టీ బిల్లు విషయంలో కాంగ్రెస్‌లోనే ఐక్యత లేదని, సొంత పార్టీ సీఎం కిరణ్ బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించారని విమర్శించారు. -
విడిపోతే సీమాంధ్ర ఎడారే !
వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రాయలసీమ వంటి ప్రాంతాల్లో తాగునీటికీ తంటాలు పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత తదితరులు మాట్లాడారు. విడిపోవడం వల్ల మూడు ప్రాంతాల ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, సభలో సమైక్య ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. విభజన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రాష్ట్రం విడిపోతే కొనసాగించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. ఓటింగ్ నిర్వహించాలి: సుచరిత రాజ్యాంగ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న తెలంగాణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. విభజన సరికాదంటూ శ్రీకృష్ణ కమిటీ తుది అభిప్రాయంతో 461 పేజీల నివేదికను వెల్లడించింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రతోపాటు తెలంగాణ కూడా తీవ్రంగా నష్టపోతుంది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే. సభలో వెంటనే సమైక్య తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలి. ‘రెండు కళ్ల’ పార్టీలవల్లే ఈ ముప్పు: రామకృష్ణారెడ్డి కొన్ని పార్టీల వైఖరి స్పష్టంగా లేనందునే విభజన బిల్లు ఇక్కడిదాకా వచ్చింది. వారు అసలు విషయాలు చెప్పకుండా మోసం చేస్తున్నారు. రెండు కళ్లు అంటూ కొన్ని పార్టీలకు స్పష్టమైన విధానం లేకపోవడంతో విభజన జరిగే ప్రమాదం నెలకొంది. నాగార్జునసాగర్ నుంచి ఇప్పటికే కుడిప్రాంతానికి నీరు సరిగ్గా రావట్లేదు. విభజన తర్వాత ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదముంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లిపోమంటే.. సీమాంధ్రుల భవిష్యత్తు ఏంకావాలి? అసమర్థుల పాలనతోనే ఉద్యమాలు: బాలరాజు రాజశేఖర్‌రెడ్డి వంటి దమ్మున్న నాయకుడు లేకపోవడం... అసమర్థ నాయకుల పాలనతో ఉద్యమాలు వచ్చాయి. పునర్వ్యవస్థీకరణ బిల్లు సభకు రావడం విచారకరం.. బాధాకరం.. దురదృష్టకరం. వైఎస్సార్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చిఉండేదికాదు. ఆయన పాలన స్వర్ణయుగం. అన్ని ప్రాంతాల్నీ సమంగా అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. ఆయన సమయంలో ఏ వాదం, ఉద్యమం లేదు. మెజారిటీ ప్రజలు విభజనకు వ్యతిరేకం. సమైక్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి ప్రస్తుత బిల్లు వ్యతిరేకం. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలి. విభజనతో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న గిరిజనులు ఐదవ షెడ్యూల్ కింద గవర్నర్ రక్షణలో ఉంటారు. ఈ ప్రాంతాల్లోనుంచి దేనిని విడదీయాలన్నా.. గ్రామసభల ఆమోదం తప్పనిసరి. కానీ అలాంటివేవీ లేకుండానే విభజిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం లేదు. ప్రజల హక్కులకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. వ్యతిరేకిస్తూ మేమిచ్చే లేఖల్ని రాష్ట్రపతికి పంపించండి. ఓటింగ్ కోసం వైఎస్ఆర్సీపీ పట్టు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో వెంటనే ఓటింగ్ నిర్వహించాలని ైవె ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఈ మేరకు నినాదాలు చేశారు. రోజూ చర్చ కొనసాగుతూనే ఉందని, ఇప్పటికైనా వెంటనే ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత వివిధ పార్టీలకు చెందిన సభ్యులు.. అబ్రహాం (అలంపూర్), సత్యవతి (ఆముదాలవలస), శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ), రామకోటయ్య (నూజివీడు), పద్మజ్యోతి (తిరువూరు), ముత్యాలపాప (నర్సీపట్నం), లింగయ్య (నకిరేకల్), శ్రీధర్ (వర్ధన్నపేట), రాములు (అచ్చంపేట), కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), వెంకట్రామయ్య (గాజువాక) చర్చలో పాల్గొన్నారు. -
ఆ రెండూ విభజన పార్టీలే: లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నైజం బయటపడిందని, ఈ రెండు పార్టీలు విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనేది స్పష్టమైందని జస్టిస్ లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు రెండు ప్రాంతాల్లో ఓట్లు, సీట్ల కోసం నాటకమాడుతున్నాయని దుయ్యబట్టారు. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర కోరుకునే వాళ్లంతా తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరుపై ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ విమర్శించారు. ఆయన ప్రస్తావించిన అంశాల్లోని ముఖ్యాంశాలు... విభజనకు వ్యతిరేకమా, అనుకూలమా అన్నదానిపై ఓటింగ్ అడగడంలేదు. చివరిదాకా చర్చలతో కాలయాపన చేసి, చివరి దశలో విభజనవాదులతో రచ్చ చేయించి బిల్లును కేంద్రానికి పంపించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి సమైక్యంపై మాట్లాడకుండా ఎప్పుడో వైఎస్ చెప్పారు.. టీడీపీ లేఖ ఇచ్చిందంటూ అసందర్భోచితంగా మాట్లాడుతూ ప్రజలు విరక్తి చెందేలా చేశారు. అన్ని రాష్ట్రాల విభజనలనూ చూశానని చెబుతున్న సభాపతి, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడులు ఓటింగ్‌పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టం. రెండు ప్రాంతాల్లో పార్టీని బతికించుకోవడం కోసం అసెంబ్లీలో డ్రామాలు ఆడుతున్నారు. ఓ వైపు పయ్యావుల కేశవ్ ఓటింగ్ గురించి అడుగుతారు కానీ.. ఎప్పుడు పెట్టాలో అడగరు. సమైక్య తీర్మానం చేయాలని గతంలో డిమాండ్ చేసిన ముద్దుకృష్ణమనాయుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇది దేనికి సంకేతం? ఓటింగ్ పెడితే విభజనకు వ్యతిరేకంగా వేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘంటాపథంగా చెబుతుంటే... వాళ్లను టార్గెట్ చేయడం ఘోరం. -
కడపలో కొనసాగుతున్న బంద్
-
బంద్‌ను పొడిగించిన వైయస్సార్సీపి
-
'సీమాంధ్రను పాక్, చైనా మాదిరిగా చూస్తోంది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హడావిడిగా విభజించాలని చూస్తే మరిన్ని తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజలు కొట్టుకొవాలని చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పరిష్కరించకపోతే భవిష్యత్తులో విభేదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరచకుండా విభజించడం సరికాదని ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రాంతాన్ని చైనా, పాకిస్థాన్ దేశాలాగా చూస్తుందని ఆయన కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరిగితే గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రానికి విన్నవించిన సంగతిని ఈ సందర్బంగా ఏరాసు ప్రతాప్ రెడ్డి గుర్తు చేశారు. విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కర్నూలు, అనంతపురం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. -
సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు తమ నివేదికలను కేంద్ర హోంశాఖకు సమర్పించాయి. విభజన నిర్ణయంతో అట్టుడుకుతున్న సీమాంధ్ర ప్రాంతానికి ఊరట కలిగించే పలు ప్రతిపాదనలను అందులో చేర్చాయి. సీమాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ మానవవనరుల మంత్రిత్వ(హెచ్ఆర్డీ) శాఖ నివేదిక ఇవ్వగా.. జల వివాదాలు తలెత్తకుండా చూడటానికి నీటి కేటాయింపుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి జల నియంత్రణ బోర్డును ఏర్పాటు చేయాలని జల వనరుల మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. సీమాంధ్ర ప్రాంతంలో ఒక ఐఐటీ, ఒక ఐఐఎం, మరో మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు హెచ్ఆర్డీ శాఖ ఆమోదం తెలిపింది. వీటితో పాటు రెండు ట్రిపుల్‌ఐటీలు, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్)ని కూడా ఏర్పాటుచేయాలని పేర్కొంది. ఈ సంస్థల ఏర్పాటుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేసింది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్న వాదనల నేపథ్యంలో.. తెలంగాణ,సీమాంధ్ర ప్రాంతాల మధ్య సమతౌల్యాన్ని సాధించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఆర్డీ శాఖ పంపిన ప్రతిపాదనలను జీవోఎం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సీమాంధ్రలో ప్రఖ్యాత విద్యాసంస్థలను ఏర్పాటుచేసి, ఏడాదిలోగా విధులు ప్రారంభించాలని కోరుతూ జీఓఎంకు పలువురు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించారు. అన్ని కేంద్ర సంస్థలనూ ఓ బిల్లు ద్వారా ఏర్పాటుచేయాలని, దానిపై అన్ని జాతీయ పార్టీలు సంతకాలు చేయాలని కోరారు. కాకినాడ ఎంపీ పళ్లంరాజు హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, సహజ వనరులు జాతీయ సంపద అని, గ్యాస్‌లో రాష్ట్రాలకు వాటా ఇవ్వడానికి ప్రస్తుత విధానంలో ఆస్కారం లేనందున దీనిపై జీవోఎంనే తేల్చాలని పెట్రోలియం,సహజవాయువు మంత్రిత్వశాఖ తమ నివేదికలో స్పష్టంచేసింది. ఆయా శాఖలు ఇచ్చిన నివేదికలను హోంశాఖ జీవోఎం ముందుంచుతుంది. -
ఆంధ్రలోకి భద్రాచలం డివిజన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే...పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలోకి కలిపే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర సాగునీటి శాఖ అధికారుల నుంచి సేకరించినట్లు తెలిసింది. పోలవరం వల్ల ముంపునకు గురయ్యే సుమారు 277 గ్రామాల్లో దాదాపు 95 శాతం గోదావరి నదికి ఎడమ వైపున ఉన్న భద్రాచలం డివిజన్‌లోనే ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్ మొత్తం సీమాంధ్ర ప్రాంతంలోకి వెళ్తుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తున్నట్టు ఇదివరకే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని అమలు చేయాలంటే...ముంపు ప్రాంతాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు. అందువల్ల భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర పరిధిలోకి తీసుకురావాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట గ్రామం వద్ద పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 277 గ్రామాలు, 44,574 కుటుంబాలు ముంపు బారిన పడనున్నాయి. ముంపు బాధితుల్లో అధికులు తెలంగాణ ప్రాంతం వారే కావడంతో పోలవరం ప్రాజెక్టును చాలా కాలంగా తెలంగాణ ప్రాంత నాయకులు వ్యతిరేకిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని కూడా కేంద్ర మంత్రుల బృందానికి అందించిన నివేదికలో టీ జేఏసీ కోరింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నివేదికను కోరడంతో.. ఆ వివరాలతో కూడిన ప్రత్యేక సమాచారాన్ని రాష్ర్ట ఇరిగేషన్ శాఖాధికారులు కేంద్రానికి పంపించారు. ఒకవేళ భద్రాచలం డివిజన్‌ను ఆంధ్ర ప్రాంతంలో కలిపితే.. తెలంగాణ ప్రాంతం వారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ంపై అభ్యంతరం తెలపడానికి కారణం ఉండదు. ప్రధాన ముంపు అంతా కూడా గోదావరి నదికి ఎడమవైపునే ఉంది. ఆ ప్రాంతాన్ని తెలంగాణ నుంచి విడదీయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా పోలవరం ప్రాజెక్టు ద్వారా 7.21 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి, గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌లోకి 80 టిఎంసీల నీటిని తరలించడానికి అవకాశముంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయవచ్చు. -
విభజన ఆగేలా లేదు...రూట్‌మ్యాప్ ఇద్దాం: పురందేశ్వరి
కేంద్రమంత్రి పురందేశ్వరి ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేకత సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన ఆగే పరిస్థితి లేనందున జీవోఎంకు రూట్‌మ్యాప్ ఇ ద్దామంటూ కేంద్ర మంత్రి పురందేశ్వరి ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమైంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం విజ యవాడ వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు నగరంలోని కొందరు పారిశ్రామికవేత్తలతో సమావేశమై సమైక్య ఉద్యమంపై చర్చించినట్లు తెలిసింది. సీమాంధ్ర ప్రాంతం చాలా నష్టపోయిందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏం కావాలనే విషయాన్ని విభజనపై నియమించిన కేంద్రమంత్రుల బృందానికి వివరిద్దామని సమావేశంలో పురందేశ్వరి ప్రస్తావించగా, అందుకు పారిశ్రామికవే త్తలు అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. తామంతా సమైక్యవాదానికి కట్టుబడి ఉద్యమం చేస్తుంటే విభజనను అంగీకరిస్తూ రూట్‌మ్యాప్ ఎలా ఇస్తామని పారిశ్రామికవేత్తలు నిలదీసినట్లు తెలిసింది. సమావేశం అనంతరం పురందేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ, తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతం చాలా రకాలుగా నష్టపోయిందని, ఇప్పటికైనా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతం ఎదుర్కొనే సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతోనే పదవుల్లో కొనసాగుతున్నట్లు కిల్లి కృపారాణి చేసిన వ్యాఖ్యలను పురందేశ్వరి సమర్థించారు. ఇదిలా ఉంటే తమ ఎంపీకి తెలియకుండా పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయడంపట్ల ఎంపీ లగడపాటి రాజగోపాల్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
‘ఉమ్మడి’ పరిధిపై ఉత్కంఠ?
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని.. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతంలో రాజధానిని నిర్మించుకునేందు కు, హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు భరోసా కల్పించేం దుకు కేంద్రప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఇది. ఉమ్మడి రాజధా ని పరిధిలోని శాంతి భద్రతలు, రెవెన్యూపరమైన అంశా లు.. కేంద్రంపరిధిలో ఉంటాయుని కూడా కేంద్ర పెద్దలు లీకులిచ్చా రు. అయితే, తెలంగాణ ఏర్పాటులో కేంద్రం వుుందడుగు వేస్తున్నకొద్దీ రాష్ట్రవాసులలో.. ప్రత్యేకించి సీమాంధ్రుల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాజధా ని పరిధి ఏమిటి?.. రాజ్యాంగ నిర్వహణ ఎలా ఉంటుంది? అన్న అంశాలపై హైదరాబాద్‌లోని లక్షలాది మంది సీమాంధ్రులతో పాటు 13 జిల్లాల ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రెవెన్యూ జిల్లాను ఉమ్మడి రాజధానిగా గుర్తిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్య, సీమాంధ్రులకు, సమైక్య ఉద్యమకారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి సీమాంధ్ర ప్రజలకు సంబంధించి, హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో ఉన్న వారికంటే వెలుపలి ప్రాంతల్లోని వారి సంఖ్యే ఎక్కువ. హైదరాబాద్ మెట్రో డెవలెప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిని, ఉమ్మడి రాజధాని పరిధిగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల బాధ్యతను కేంద్రమే తీసుకొనే అవకాశం ఉంది. దీనితో పోలీసు శాఖపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా, కేం్రద్రానికే నియంత్రణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని పోలీసు వ్యవస్థ ద్వారా సీమాంధ్ర ప్రజలకు భద్రతకు భరోసా సాధ్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. ఉమ్మడి రాజధాని పరిధి హైదరాబాద్ రెవిన్యూ జిల్లా పరిధికే పరిమితమైతే... హెచ్ఎండీఏ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న సీమాంధ్రులకు భద్రతపై భరోసా ఎలా ఇవ్వగలమని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ అంటే.. కేవలం హైదరాబాద్ రెవెన్యూ జిల్లా కాదని, విస్తృత అర్థంలో హెచ్ఎండీఏ అని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే ఉమ్మడి రాజధాని పరిధి పరిమితమని దిగ్విజయ్ చెప్పడం ప్రజల్లో పలు అనుమానాలు తావిస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్లపాటు ఉంటుంది కాబట్టి ఈ పదేళ ్లలో ఉమ్మడి రాజధానిలోని సీమాం్రధ్రుల ప్రయోజనాలకు ఇబ్బంది ఉండబోదన్న భావన ప్రజల్లో కల్పించి, వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఒక జిల్లాకే ఉవ్ముడి రాజధాని పరిధిని పరిమితం చేస్తే, హెచ్ఎండీ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న సీమాంధ్రుల్లో విశ్వాసం కలిగించడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. ఒకప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(ఎంసీహెచ్) పరిధి కూడా హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధి కంటే ఎక్కువే ఉండేది. ఎంసీహెచ్ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, చుట్టుపక్కల ప్రాంతాల్లోని 12 మున్సిపాలిటీలను కలిపేసి 2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ)ను రూపొందించారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 626 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. సీమాం్రద్రులు, జీహెచ్ఎంసీ పరిధి వెలుపల కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 7,073 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న, హైదరాబాద్ మెట్రో డెవలెప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో సీమాంధ్ర ప్రజలున్నారు. ఈ నేపథ్యంలో విభజన తర్వాత హెచ్ఎండీఏ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తే సీమాంధ్రుల భద్రతకు భరోసా కల్పించడానికి శాంతిభద్రతలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం ఉపయోగపడుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
పరిస్థితి చేయిదాటనీయొద్దు : కిరణ్‌కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో... పరిస్థితి చేయిదాటకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పారా మిలటరీ బలగాలను మోహరించాలని సూచించారు. సీమాంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.ప్రసాదరావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి టీపీ దాస్, ఇంటలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హింసాత్మక ఘటనలకు తావులేకుండా చూడాలని డీజీపీ ప్రసాదరావుకు సీఎం స్పష్టం చేశారు. పోలీసులు పూర్తి సంయమనంతో వ్యవహరించాలని.. ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా ఉపయోగించవద్దని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల రక్షణ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను పెంచాలని ఆదేశించారు. విమానాల ద్వారా బలగాల తరలింపు సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు ఉధృతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను రాష్ట్రానికి రప్పిస్తోంది. కోల్‌కతా, బెంగళూరుల నుంచి సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను విమానాల్లో రప్పిస్తున్నారు. ఆ బలగాలను విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో మోహరించనున్నట్లు డీజీపీ తెలిపారు. -
హైదరాబాద్ జోలికొస్తే... ఊరుకోం: కోదండరాం
హైదరాబాద్/నల్లగొండ, న్యూస్‌లైన్: తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్ జోలికి వస్తే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద టీఎస్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పరిరక్షణ సభ జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సభల్లో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను పరిరక్షించుకునేందుకు అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29లోపు పార్లమెంటులో బిల్లు పెట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని వనరులను దోచుకున్న సీమాంధ్రపెట్టుబడిదారులే హైదరాబాద్‌పై వివాదాలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే తెలంగాణకే నష్టం: ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే తెలంగాణకే నష్టమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సీమాంధ్రలో ప్రైవేటు బస్సులను అధిక సంఖ్యలో నడపడంతో పాటు, ప్రస్తుత సమ్మె నష్టాన్ని కప్పి పుచ్చుకునేందుకే సంస్థను ప్రభుత్వపరం చేయాలనుకుంటోందని ఆరోపించారు. తద్వారా సీమాంధ్ర ప్రాంత నష్టాలను ఈ ప్రాంతం భరించాల్సి ఉంటుందని, ఇక్కడి లాభాలను సీమాంధ్రులు గడిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసన్నారు. హైదరాబాద్ నిజాం పాలకుల నుంచే అభివృద్ధి చెందుతూ వచ్చిందని వివరించారు. రాజ్యాంగపరంగా ఉండేందుకు హక్కులు ఉంటాయని, హైదరాబాద్ తమదని సీమాంధ్రులంటే ఒప్పుకోబోమన్నారు. ఢిల్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు సమైక్య రాగం వినిపిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన ఆవశ్యకతపై చెప్పకుండా సీమాంధ్రకు నష్టం జరుగుతుందని మాత్రమే పేర్కొనడం భావ్యం కాదన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా.. ఇరు పక్షాల సమస్యలను పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. డీజీపీ మానసికస్థితి బాగాలేదు: అక్రమ ఆస్తులపై సీబీఐ ప్రశ్నించనుందన్న విషయం తెలిసినప్పటి నుంచి డీజీపీ దినేష్‌రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. తెలంగాణ జర్నలిస్తులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, అదే సీమాంధ్రలో పోలీసులు దగ్గరుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఆత్మబలిదానం చేసుకోవద్దు: ‘తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా వస్తుంది.. ఐక్యంగా కొట్లాడి సాధించుకుందాం.. దీంట్లో ఎవరికీ అనుమానం అవసరం లేదు.. దయచేసి ఎవ రూ ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని’ కోదండరాం కోరారు. తెలంగాణ కోసం ఆత్మహత్యకు యత్నించిన మమతను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న విధానాలతోనే తెలంగాణ వస్తుందో రాదో అనే అనుమానం ప్రజలకు కలుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి, తెలంగాణ తెస్తామనే భరోసాను ప్రజల్లో కలిగించాలని కోరారు. టీఎస్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ పరిరక్షణ సభలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బెల్లయ్యనాయక్, రసమయి బాలకిషన్, అద్దంకి దయాకర్, సంజీవనాయక్ తదితరులు హాజరయ్యారు. -
రాజీనామాలపై తలోదారి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకు వెళ్తుండడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు భవిష్యత్ కార్యాచరణపై శనివారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. మంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో ఈ భేటీ జరగనుంది. సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి నిర్వహించాలని మొదట భావించినా చివరకు ఎంపీలు, కేంద్రమంత్రులకు పరిమితం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, సీమాంధ్రలో ఉద్యమం, రాజీనామాలు తదితర అంశాలపై భేటీలో చర్చ జరగనుంది. సమావేశ నిర్వహణ బాధ్యత కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం తదితర మంత్రులు తీసుకున్నారు. అధిష్టానం విభజనపై వెనక్కు తగ్గేది లేదని చెబుతుండడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై వీరంతా తర్జనభర్జన పడుతున్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు సమైక్య వాదన గట్టిగా వినిపించినా.. సీడబ్ల్యూసీ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేది లేదని ఢిల్లీ పెద్దలు ప్రకటిస్తున్నారు. ఎంపీలు, కేంద్రమంత్రులు నిర్లిప్తంగా ఉన్నందునే విభజనపై కేంద్రం ముందుకెళుతోందని ఆగ్రహంతో ఉన్న సమైక్యవాదులు వారు రాజీనామా చేస్తే విభజన ప్రక్రియ నిలిచిపోతుందంటూ.. వారి రాజీనామాలకు పట్టుపడుతున్నారు. ఇప్పటికే ఎంపీలు, కేంద్రమంత్రులను లక్ష్యంగా చేసుకుని ఇళ్ల ముట్టడి తదితర నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పార్లమెంటు సమావేశాల నెపంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు ఢిల్లీలో గడిపారు. సమావేశాలు ముగియడం, ఎన్నికల సంవత్సరం కావడంతో వారు ప్రజల ముందుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు. ఏపీఎన్జీవోలు సహ ఉద్యమకారుల నుంచి రాజీనామాలపై ఒత్తిడి పెరుగుతుండడంతో ఆ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. రాజీనామాలు చేసినంత మాత్రాన విభజన ఆగదని, అలాం టప్పుడు రాజీనామాలతో ఫలితమేముంటుందని ఎంపీలు, కేంద్రమంత్రులు ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చారు. మంత్రులేగాక ఎంపీల్లోనూ కొందరు రాజీనామాలపై విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ రాజీనామా చేయనని ముందే ప్రకటించారు. పనబాక లక్ష్మి రాజీనామాపై సందిగ్ధంలో ఉన్నట్టు చెబుతున్నారు. ఎంపీల్లో రాయపాటి సాంబశివరావు కొందరి రాజీనామాలతో ఫలితం ఉండద ని, అందరూ చేస్తేనే విభజన ఆగుతుందని, అలా అయితేనే తాను రాజీనామా చేస్తానని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. అందరూ రాజీనామాలకు అంగీకరిస్తేనే తాను భేటీకి హాజరవుతానని, లేదంటే వెళ్లబోనన్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విభజన వైపే మొగ్గు చూపుతున్నందున ఆయన భార్య, ఎంపీ బొత్స ఝాన్సీ రాజీనామాకు విముఖంగానే ఉంటారని అంటున్నారు. ఎంపీ చింతా మోహన్‌దీ అదేదారి అని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ ముగ్గురూ భేటీకి హాజరవుతారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కిశోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మి కూడా రాకపోవచ్చంటున్నారు. -
ఉద్యోగులూ.. అత్యవసర సేవలకు విఘాతం కలిగించవద్దు: సీఎం
సాక్షి, హైదరాబాద్: టీటీడీ, విద్యుత్, విద్య, వైద్యం తదితర అత్యవసర సేవలకు విఘాతం కలిగించవద్దని సమ్మె చేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల ఆవశ్యకతను ఉద్యోగ సంఘాలకు వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఈవో, చిత్తూరు జిల్లా కలెక్టర్, విద్యుత్ అధికారులను ఆయన ఆదేశించారు. సమ్మె పరిస్థితిపై ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారని పేర్కొంటూ సీఎంవో పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాయలసీమ, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి గురించి కూడా ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా సీఎం కిరణ్ 13న తన 54వ పుట్టినరోజును జరుపుకునేందుకు తిరుపతి వెళ్లనున్నట్లు సమాచారం. -
సీమాంధ్రలో 40వ రోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం!
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళలు ఆదివారానికి 40వ రోజుకు చేరుకున్నాయి. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి వివిధ సంస్థలు, నేతలు, విద్యార్థులు రాస్తారోకోలతోపాటు, మానవహారాలు నిర్మిస్తూ 13 జిల్లాలో నిరసన తెలుపుతున్నారు. ఉద్యమం ప్రారంభించి.. నెలరోజులు పూర్తవుతున్నా..ఉద్యమ ప్రభావం తగ్గకపోగా.. మరింత ఉధృతమవుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి, ఇతర జిల్లాలో ర్యాలీలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ఆదివారం రోజున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున్న మానవహారాన్ని నిర్మించారు. విజయనగరంలో పలు పార్టీలకు చెందిన నేతలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇతర జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలతో రోడ్లపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ-రాజమండ్రి రహదారిపై మహిళలు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో పాల్గొన్న ఎపీఎన్జీఓ ఉద్యోగులపై జరిపిన దాడులపై నిరసన వ్యక్తం చేశారు. -
సీమాంధ్ర రైళ్లకు అదనపు బోగీలు
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమంతో సీమాంధ్ర ప్రాంతంలో బస్సులు రోడ్డెక్కని పరిస్థితి నెలకొనటంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే స్వచ్ఛందంగా స్పందించి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మరోవైపు రెగ్యులర్ రైళ్లకు కూడా అదనపు బోగీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తోంది. సీమాంధ్రలో బస్సులు నడిచే పరిస్థితి లేదని కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం దృష్టికి వచ్చినా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా రైల్వేను కోరాలనే స్పృహ లేకపోవటంతో ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా అదనపు రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుంది. ప్రస్తుతం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నా రైల్వే అధికారులు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుని అదనపు రైళ్లను నడుపుతున్నారు. ఆగస్టు నెలలో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండకపోవటంతో అదనపు రైళ్లను నడపాల్సిన పరిస్థితి రాదు. సమైక్య ఉద్యమంతో బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు రైళ్లను ఆశ్రయించటంతో రద్దీ అమాంతం పెరిగింది. దీన్ని గుర్తించిన రైల్వే అధికారులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అదనపు బోగీల వివరాలు సేకరించి రెగ్యులర్ రైళ్లకు జత చేస్తున్నారు.తాజాగా 10 వేల అదనపు బెర్తులు అందుబాటులోకి వచ్చేలా 157 అదనపు బోగీలను సిద్ధం చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు బెర్తులను ఈనెల 31వ తేదీ వరకు రద్దీ మార్గాల్లోని ప్రధాన రైళ్లకు అనుసంధానిస్తారు. అదనపు బోగీలు ఈ రైళ్లకే.. కాకినాడ-బెంగళూరు(శేషాద్రి ఎక్స్‌ప్రెస్), తిరుపతి-ఆదిలాబాద్(కృష్ణా ఎక్స్‌ప్రెస్), కాచిగూడ-చిత్తూరు(వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్), తిరుపతి-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు బోగీలను రైల్వేశాఖ సిద్ధం చేసింది. సికింద్రాబాద్-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు కూడా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పరిస్థితి ఇలాగే ఉంటే మరిన్ని అదనపు బోగీలను తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
కూరగాయలకూ.. ఉద్యమ సెగ
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమ సెగతో రాజధాని నగరంలో కూరగాయల ధరలు వేడెక్కాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పచ్చిమిర్చి, ఉల్లి దిగుమతి నిలిచిపోయింది. బెంగళూరు నుంచి బీన్స్, క్యారెట్, క్యాబేజి సరఫరా ఆగిపోయింది. దీంతో నగరంలో కూరగాయలకు కొరత రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు అన్ని రకాల కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా కేజీ రూ.40-80ల వరకు ధర పలుకుతున్నాయి. అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే పచ్చిమిర్చి, ఉల్లి ధరలు రికార్డు స్థాయిలో ఆకాశానికి ఎగబాకాయి. బుధవారం ఉదయం గుడిమల్కాపూర్‌లోని రిటైల్ మార్కెట్లో కేజీ రూ.100లు వసూలు చేశారు. కర్నూలు ప్రాంతం నుంచి ఉల్లి దిగుమతులు నిలిచిపోవడంతో ఉల్లి ధరల్లో కూడా అనూహ్యంగా మార్పు కన్పిస్తోంది. సాధారణంగా ఇళ్లలో వినియోగించే గ్రేడ్-2 రకం ఉల్లిని సైతం కేజీ రూ.40-50ల ప్రకారం విక్రయిస్తున్నారు. మార్కెట్లో రూ.500లు వెచ్చిస్తే కూడా కనీసం చేసంచి నిండని పరిస్థితి ఏర్పడింది. రైతుబజార్లలో సైతం కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్య, పేద వర్గాల వారు విలవిల్లాడిపోతున్నారు. నగరంలోని 10 రైతుబజార్లకు నిత్యం 8వేల క్వింటాళ్లకు పైగా వచ్చే కూరగాయలు బుధవారం కేవలం 4వేల క్వింటాళ్లే వచ్చాయి. బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్ హోల్‌సేల్ మార్కెట్లకు అన్నిరకాల కూరగాయల దిగుమతి తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం హోల్‌సేల్ మార్కెట్లకు 20వేల క్వింటాళ్లకు మించి సరుకు రాలేదని తెలిపారు. ఈ కొరత ప్రభావం క్రమేపీ ధరలపైపడుతూ ఐదు రోజులుగా కూరగాయల రేట్లు పెరగడం ప్రారంభమైంది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ఇలాగే కొనసాగితే... రానున్న రోజుల్లో కొన్ని రకాల కూరగాయలు కేజీ రూ.100లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెటింగ్ శాఖ ధరలు బోర్డులకే పరిమితం.. మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ధరలు రైతు బజార్లలో బోర్డులకే పరిమితమవుతున్నాయి. సమీప హోల్‌సేల్ మార్కెట్లో ఉన్న ధరలను బట్టి వ్యాపారులకు కొంత లాభం వచ్చేలా మార్కెటింగ్ శాఖ రైతు బజార్లలో ధరలను నిర్ణయిస్తుంది. రైతు బజారులో అదే ధరకు కూరగాయలను రైతులు (వ్యాపారులు) విక్రయించాలి. అయితే ఇక్కడ బోర్డుల్లో ఉన్న ధర కంటే కిలోకు అయిదు నుంచి పది రూపాయల ఎక్కువ ధరలకు రైతు బజార్లలో వ్యాపారులు కూరగాయలను అమ్ముతున్నారు. ఎస్టేట్ ఆఫీసరుకు ఫిర్యాదు చేస్తామని వినియోగదారులు చెప్పినా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు... ఇతర ప్రాంతాల నుంచి సరుకు రాకపోవడంవల్ల కొరత ఏర్పడితే నగరమంతా అదే పరిస్థితి ఉండాలి. కానీ నగరంలో ఒక ప్రాంతానికీ, మరో ప్రాంతానికి మధ్య కూరగాయల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. ‘‘నిజంగా బయట నుంచి సరుకులు రాకపోవడంవల్ల కొరత ఏర్పడితే రైతు బజార్లలోనూ భారీగా ధరలు పెరగాలి. అయితే రైతు బజార్లలో కొంత మేరకే ధరలు పెరిగి బయట మార్కెట్లో ఎక్కువ పెరిగింది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడమే కారణం. ఈ వ్యవహారాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణం’’ అని అధికారులే అంటున్నారు. గతంలో కూరగాయల ధరలు పెరిగిన సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని రైతు బజార్లలో సరసమైన ధరలకు కూరగాయలను సరఫరా చేసేది. మార్కెటింగ్ శాఖకు ఇందుకోసం నిధులు కేటాయించేది. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రులు సచివాలయానికే రావడంలేదని, అధికార యంత్రాంగం నిద్రపోతోందని, దీంతో కూరగాయల వ్యాపారులకు కళ్లెం వేసేవారే లేరన్న విమర్శలు ఉన్నాయి. ‘‘అన్ని ధరలూ ఇలా పెరిగిపోతే జనం ఏమి తిని బతకాలి. రూ. 300 తీసుకొస్తే వారానికి సరిపడా కూరగాయలు రావడంలేదు. ఇలాగైతే జనం బతికేదెలా? ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోవడంలేదు. మంత్రులు వారి సంపాదన గురించి తప్ప జనం ఇబ్బందులను పరిష్కరిద్దామని ఆలోచించడంలేదు’’ అని విజయనగర్ కాలనీకి చెందిన విమల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కమిటీ’ కహానీలు... కాంగ్రెస్ నుంచి పూటకో మాట
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగుతున్న ఆందోళనలు, పార్టీ నాయకుల ఒత్తిళ్లపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కాంగ్రెస్ అధిష్టానం గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది. ఆ ప్రాంత నేతల అభిప్రాయాలను, ఫిర్యాదులను వినేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఒకసారి.. కమిటీని ఏర్పాటు చేశామని, పని మొదలు పెట్టిందని మరొకసారి.. రెండు మూడు రోజుల్లో కమిటీని ప్రకటిస్తామని ఇంకొకసారి.. తమను కలిసిన నాయకులకు రకరకాలుగా చెప్తుండటమే ఇందుకు నిదర్శనం. అదీగాక.. ఒక్కరే ఈ సమస్యలను పరిశీలిస్తారని తొలుత చెప్పిన కాంగ్రెస్ నాయకత్వం.. ఆ తర్వాత ఇద్దరు సభ్యులతో కమిటీ అని, అనంతరం ముగ్గురు సభ్యులని చెప్పగా.. ఇప్పుడు మొత్తం ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఉంటుందని పేర్కొనటం విశేషం. సీమాంధ్ర నేతల ఆందోళనలు, అభిప్రాయాలను వినే పనిని తొలుత సహజంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అప్పగించారు. ఆ తర్వాత.. దిగ్విజయ్‌సింగ్, గులాంనబీఆజాద్లతో ఇద్దరు సభ్యుల కమిటీ ఉంటుందని హైకమాండ్ చెప్పింది. ఈ విషయం తొలుత కేంద్రమంత్రి పురందేశ్వరి, ఆ తర్వాత స్వయంగా దిగ్విజయ్ కూడా ప్రకటించారు. సోమవారం రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందని పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర నేతలతో ఆంటోనీ మాట్లాడటం మొదలుపెట్టారని కూడా ఆయన ప్రకటించారు. కానీ.. అసలు ఇలాంటి కమిటీ ఏర్పాటు గురించి తనకు ఏమీ తెలియదని ఆంటోని మంగళవారం స్పష్టం చేయటం విశేషం. ఈ కమిటీ విషయంలో తనకు పార్టీ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని కూడా ఆయన పార్లమెంటు ప్రాంగణంలో తనను కలిసిన విలేకరులతో పేర్కొన్నారు. మరోవైపు.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర సహాయమంత్రి జె.డి.శీలం ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రాంత నేతల అభిప్రాయాలను వినేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఉంటుందని చెప్పారు. ఆ కమిటీలో ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, దిగ్విజయ్‌సింగ్‌లు ఉంటారని పేర్కొన్నారు. కానీ సాయంత్రానికల్లా అది ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అని.. అందులో ఆంటోనీ, మొయిలీ, దిగ్విజయ్‌లతో పాటు ఆజాద్, సుశీల్కుమార్షిండేలు కూడా ఉంటారన్న మాట బయటకు వచ్చింది. ఈ విషయం రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఐదుగురు నేతలతో కమిటీ ఉంటుందని సోనియాగాంధీ స్వయంగా తమకు చెప్పారని ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మీడియాతో పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు చేయబోయే కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు.. ఏ ఏ అంశాలను పరిశీలిస్తుంది అనే విషయాలను దిగ్విజయ్ త్వరలో ప్రకటిస్తారని.. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు సోనియాను కలిసిన తర్వాత మీడియాతో చెప్పటం మరో విశేషం. విభజనపై వాదప్రతివాదనలు వినేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీ ఐదుగురు సభ్యుల వద్ద ఆగుతుందా ఇంకా పెరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలు తెలంగాణ ఏర్పాటు త్వరగా పూర్తికావాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ ప్రాంత నేతలకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు ఎలాంటి గందరగోళం లేదు. ‘మాకు వివరించిన ప్రకారం నోట్ ముసాయిదాను రూపొందిస్తున్నాం’ అని ఆ శాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. -
రాష్ట్రం రగిలిపోతుంటే నోరెత్తరేం ? : శోభా నాగిరెడ్డి
కిరణ్, చంద్రబాబులపై శోభా నాగిరెడ్డి ధ్వజం బాధ్యతను మరచి మొహం చాటేస్తున్నారు నోరెత్తితే సీటు లాగేస్తారని కిరణ్‌కు భయం కేసులు రాకుండా ఉండేందుకే బాబు మౌనం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన కేంద్ర మంత్రులు సెంటిమెంట్ ఒక ప్రాంతానికే పరిమితం కాదు తెలుగువారి భవిష్యత్తు ఆంటోనీ, దిగ్గీల చేతిలోనా? ఇదేమీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదు జగన్‌ను అభిమానిస్తున్నారని చిచ్చు పెట్టారు కేసీఆర్ విద్వేష ప్రసంగాలు హరీశ్‌కు గుర్తు రాలేదా? సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతం ఉద్యమాలతో రగిలిపోతున్నా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు మాత్రం ప్రజలకు ముఖం చాటేశారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ ఇద్దరూ ‘కనబడుటలేదు’ అని ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కిరణ్, బాబు వైఖరిపై మండిపడ్డారు. ‘‘సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే... ఆ ప్రాంతానికే చెందిన కిరణ్, బాబు ప్రజల ముందుకు వచ్చి వారిని సమాధానపర్చకుండా అజ్ఞాతం (అండర్‌గ్రౌండ్)లోకి వెళ్లి పోయారు. నోరెత్తి మాట్లాడితే ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తొలగిస్తారని కిరణ్ భయపడుతున్నారు. తనపై కేసులు రాకుండా చూసుకునేందుకు, ఆస్తులు కాపాడుకునేందుకే బాబు కిమ్మనడం లేదు. సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నా వీరు పట్టించుకోవడం లేదు’’ అని దుయ్యబట్టారు. ప్రతి చిన్న విషయానికి వేలు చూపుతూ, ఎదుటివారిని బెదిరించే విధంగా ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడే చంద్రబాబు ఇంత పెద్ద సమస్య రాష్ట్రంలో రగులుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఆవేశం ఏమైంది? వేలెత్తి ఎందుకు మాట్లాడ్డంలేదని శోభ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించి పోలవరంకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించినప్పుడు, రాయలసీమ ప్రాంతానికి ఏమిచ్చారని బాబు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఇవన్నీ ఆ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇక సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తమ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా బొమ్మల్లాగా కూర్చున్నారని దుయ్యబట్టారు. మరో ఆరు నెలలు మాత్రమే ఉండే పదవుల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. సమైక్యంగా ఉంచాలన్న వాంఛ ప్రజల్లో ఇంత బలీయంగా ఉంటుందని విభజన నిర్ణయం వెలువడిన తరువాతనే తమకు తెలిసిందని పళ్లంరాజు చెప్పడం దారుణమన్నారు. ‘‘సెంటిమెంట్ ఒక ప్రాంతానికే పరిమితమనుకున్నారా... మరో ప్రాంతంలో ఉండదనుకున్నారా? మంత్రి పదవి పోతుందనే భయంవల్ల మీకు సెంటిమెంట్ లేకపోవచ్చు, కానీ సామాన్య ప్రజలకు మనోభావాలు బలీయంగా ఉంటాయి’’ అని చెప్పారు. పార్లమెంట్లో కాంగ్రెస్, టీడీపీ ఎంపీలది డ్రామా కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న హడావుడిని ఒక డ్రామా అని శోభా నాగిరెడ్డి అభివర్ణించారు. సీమాంధ్రులకు అన్యాయం చేస్తూ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఉద్యమాలంటూ డ్రామాలు చేయడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయం వెలువడిన రెండోరోజే 4, 5 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మరో రాజధాని నిర్మించుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారని, మళ్లీ ఆ పార్టీకి చెందిన ఎంపీలే పార్లమెంటులో నిరసన డ్రామా చేస్తున్నారని విమర్శించారు. వీరంతా ఇపుడు డ్రామాలు చేసే కంటే విభజన ప్రకటన వెలువడటానికి ముందే రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు కదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమతో చర్చించడానికి ఏకే ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్‌లతో ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రులు చెబుతుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. 12 కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది వీళ్లిద్దరా? వాళ్లెవరు... మనపై నిర్ణయం తీసుకోవడానికి? ఇదేమీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదని, కోట్లమంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని చెప్పారు. సమన్యాయం చేయకుండా రాష్ట్ర విభజన చేస్తామనడం సరికాదన్నారు. రాష్ట్రంలో నదీజలాలతో పాటుగా ఉన్న అనేక జటిలమైన సమస్యలను పట్టించుకోకుండా కేవలం 15, 16 లోక్‌సభ స్థానాల కోసం, రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ ఈ విభజన నిర్ణయం తీసుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. రాహుల్‌ని ప్రధాని చేయడంకోసమే విభజన: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత మూడు ప్రాంతాల ప్రజలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఆదరిస్తున్నారన్న నిజాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయిందని, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వైఎస్‌పై ఉన్న అభిమానాన్ని జగన్‌పై చూపిస్తున్నారనే కోపంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం కోసం రెండు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టిందని చెప్పారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో ఏమీ జరక్కుండా రక్షణ కల్పిస్తామని కొందరు తెలంగాణ మంత్రులు చెప్పడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ‘‘మీరెవరు మాకు రక్షణ కల్పించడానికి? మిమ్మల్ని సీమాంధ్రులేమైనా అడుక్కున్నారా రక్షణ కల్పించమని? మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం సీమాంధ్రులకు లేదు. ఇక్కడ మీకు ఎంత హక్కు ఉందో మాకూ అంతే హక్కుంది. మా హక్కును పోరాడి సాధిస్తాం’’ అని స్పష్టంచేశారు. సీమాంధ్రను అభివృద్ధి చేస్తామని ఢిల్లీ నేతలు చెబుతున్నారని, కొత్తగా ఏర్పడిన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిందేనని ఆక్షేపించారు. రాజకీయ లబ్ధికోసం రాష్ట్రంలో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. షర్మిల ఇచ్ఛాపురం సభలో మాట్లాడిన మాటలను తప్పుపడుతున్న టీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు అంతకుముందు కేసీఆర్ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాలు గుర్తుకు రాలేదా? అని శోభ ప్రశ్నించారు. ‘‘సీమాంధ్రులను అవమానిస్తూ కేసీఆర్ ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఎవరికి తల్లి అని తెలుగుతల్లిని కూడా కించపరిచింది మరిచారా? జాగో, భాగో అని మాట్లాడలేదా? మీ మాటల్లో తప్పు లేదు కానీ, షర్మిల మాట్లాడితేనే తప్పుగా కనిపించిందా?’’ అని నిలదీశారు. తెలంగాణ రాకముందే ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగానే షర్మిల ప్రజలకు భరోసాగా అలా మాట్లాడారు తప్ప ఇతర ఉద్దేశాలు ఏమీ లేవని ఆమె వివరించారు.