విభజన ఆగేలా లేదు...రూట్‌మ్యాప్ ఇద్దాం: పురందేశ్వరి | Division may not stop, Route map has to be given: Purandeswari | Sakshi
Sakshi News home page

విభజన ఆగేలా లేదు...రూట్‌మ్యాప్ ఇద్దాం: పురందేశ్వరి

Published Thu, Oct 17 2013 4:09 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Division may not stop, Route map has to be given: Purandeswari

కేంద్రమంత్రి పురందేశ్వరి ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేకత
 సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన ఆగే పరిస్థితి లేనందున జీవోఎంకు రూట్‌మ్యాప్ ఇ ద్దామంటూ కేంద్ర మంత్రి పురందేశ్వరి ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమైంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం విజ యవాడ వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు నగరంలోని కొందరు పారిశ్రామికవేత్తలతో సమావేశమై సమైక్య ఉద్యమంపై చర్చించినట్లు తెలిసింది. సీమాంధ్ర ప్రాంతం చాలా నష్టపోయిందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏం కావాలనే విషయాన్ని విభజనపై నియమించిన కేంద్రమంత్రుల బృందానికి వివరిద్దామని సమావేశంలో పురందేశ్వరి ప్రస్తావించగా, అందుకు పారిశ్రామికవే త్తలు అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. తామంతా సమైక్యవాదానికి కట్టుబడి ఉద్యమం చేస్తుంటే విభజనను అంగీకరిస్తూ రూట్‌మ్యాప్ ఎలా ఇస్తామని పారిశ్రామికవేత్తలు నిలదీసినట్లు తెలిసింది.
 
 సమావేశం అనంతరం పురందేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ, తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతం చాలా రకాలుగా నష్టపోయిందని, ఇప్పటికైనా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతం ఎదుర్కొనే సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతోనే పదవుల్లో కొనసాగుతున్నట్లు కిల్లి కృపారాణి చేసిన వ్యాఖ్యలను పురందేశ్వరి సమర్థించారు. ఇదిలా ఉంటే తమ ఎంపీకి తెలియకుండా పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయడంపట్ల ఎంపీ లగడపాటి రాజగోపాల్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement