అది వితండవాదమే: హరీష్
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో అందరికీ నచ్చజెప్పిన తరువాతనే రాష్ట్ర విభజన చేయాలని కొందరు నాయకులు మాట్లాడడంలో హేతుబద్ధత లేదని, అది వితండవాదమని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నాయకుల ఆమోదం కావాలని కోరడమంటే వన్యప్రాణులను రక్షించడానికి తెచ్చే చట్టాలకు వేటగాళ్ల అనుమతి కోరినట్టే ఉంటుందని పేర్కొన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయంతో రాష్ట్ర విభజన జరగాలంటే దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమే కాదని పేర్కొన్నారు.