సీమాంధ్రలో మోడీ పర్యటన ఖరారు!
సీమాంధ్రలో మోడీ పర్యటన ఖరారు!
Published Sun, Apr 27 2014 3:57 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
విజయవాడ: సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ పర్యటనలు బీజేపీ ఖరారు చేసింది. ఏప్రిల్ 30, మే 1 తేదిన సీమాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో సభల్ని ఏర్పాటు చేయనున్నారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 తేదిన మోడీ తిరుపతి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
ఏప్రిల్ 1 తేదిన మదనపల్లి, నెల్లూరు, గుంటూరు, నర్సాపురం, విశాఖపట్నంలో ఏర్పాటు చేసే బహిరంగసభల్లో మోడీ పాల్గొంటారన్నారు. మోడీ సభల్లో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొంటారని వెంకయ్యనాయుడు తెలిపారు.
Advertisement
Advertisement