M Venkaiah Naidu
-
ANR 100th Birthday Celebrations: నాగేశ్వరరావుగారు నట విశ్వవిద్యాలయం
‘‘తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు అని ఎప్పుడూ చెబుతుంటాను. తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం నాగేశ్వరరావుగారిలోని గొప్పతనం. అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మహా కవి కాళిదాసు.. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగి΄ోయేవారు. నాగేశ్వరరావుగారు ఒక పెద్ద నటనా విశ్వ విద్యాలయం. ఈ రోజు పరిశ్రమలోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ విశ్వ విద్యాలయంలో విద్యార్థిననుకుని, ఆ గుణగణాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌కు మంచి ప్రణాళికలు వేసుకున్నట్లవుతుంది’’ అన్నారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం (సెప్టెంబరు 20) ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు మహానటులు.. మహా మనిషి. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావుగారు. అవతలివాళ్లు నేర్చుకోదగ్గ కొన్ని మంచి సంప్రదాయాలు, విలువల్లో ఆయన జీవించి, నటించి మనకు చూపించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తే అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. నాగేశ్వరరావుగారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, జీవిత చరమాంకంలోనూ నటిస్తూనే ఉన్నారు. కొంతమంది జీవిత కాలంలో జీవిస్తారు. జీవిత కాలం పూర్తయిన తర్వాత కూడా జీవించే మహానుభావులు కొందరు. వారిలో అక్కినేని నాగేశ్వరరావుగారు అగ్రగణ్యులు. ఆయన మంచి నటులే కాదు.. పరిణతి చెందిన గొప్ప ఆశావాది కూడా. ఆయన నాస్తికుడు. గొప్ప తాత్త్వికుడు. ఆయన పెద్దగా చదువుకోలేదని అంటారు. కానీ జీవితాలను చదివారు. జీవితంలో ఆయన ΄ోరాటం చేశారు.. జీవితాన్ని ప్రేమించారు.. ఆస్వాదించారు. జీవితంలో నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు’’ అని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘1950 సమయంలో నాగేశ్వరరావుగారు సినిమాల్లో నటించడంప్రారంభించాక, సొంతిల్లు కట్టుకోవడానికి ముందే మద్రాస్ విశ్వ విద్యాలయానికి పాతికవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పాతిక వేలు ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి కూడా పాతిక వేలు విరాళం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. 1959లోలక్ష రూపాయల విరాళం ఇచ్చి గుడివాడ కళాశాలను నిలబెట్టారు. నాలాంటివారు ఎందరో చదువుకోగలిగారు. ఆ విధంగా ఆప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఓ విప్లవానికి ఆయన నాంది పలికారు’’ అన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ – ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి కష్టం, కళల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఆయన్ను ఓ లెజెండ్‌ని చేశాయి. యువ నటీనటులకు నాగార్జునగారు స్ఫూర్తి అని నా ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో చెబుతుంటారు. నాగార్జునగారేమో తన తండ్రి చూపించిన మార్గంలో నడిచానని చెబుతుంటారు’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే.. ఆయన ఓ మహానుభావుడు... ఆయన మనతో లేరనే భావన నా మనసులో చిన్నతనం నుంచే ముద్రపడింది. ఏ విగ్రహం చూసినా నాకు అదే అనిపించేది. అందుకే వెంకయ్యనాయుడుగారు ఆవిష్కరించేంతవరకూ నేను నాన్నగారి విగ్రహాన్ని చూడలేదు. చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నాన్నగారు మాతో లేరనే విషయాన్ని అంగీకరించాల్సి వస్తుందేమోనని... శిల్పి వినీత్ ఈ విగ్రహాన్ని అద్భుతంగా చెక్కాడు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని జీవించారు. తరతరాలుగా గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు. కోట్లమంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి.. ఇలా వివిధ రకాలుగా నాన్నగారు అందరికీ తెలుసు. మాకు మాత్రం నాన్నగారు మా గుండెలను ప్రేమతో నింపిన వ్యక్తి. నన్ను, నా తోబుట్టువులను, మా పిల్లలను.. అందర్నీ చల్లగా చూసిన వ్యక్తి. మాకు మనసు బాగున్నా, బాగోలేకున్నా నాన్నగారి దగ్గరికి వెళ్లి కూర్చుంటే చాలు అన్నీ సర్దుకునేవి. అన్నపూర్ణ స్టూడియోస్ నాన్నగారికి నచ్చిన స్థలం. నచ్చిన చోట విగ్రహం పెడితేప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు అంటారు. సో.. ఆయన ప్రాణంతో మా దగ్గరే ఉన్నారని,ప్రాణంతో మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాము. నా ఆలోచనల్లోనే కాదు.. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో నాన్నగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినవారికి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన నాన్నగారి అభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు. ఏయన్నార్ పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని మాట్లాడుతూ– ‘‘మనిషి ఎంత కీర్తి సంపాదించినా, ఎంత ధనం గడించినా తలగడ మీద తల పెట్టగానే నిద్ర΄ోవడం అనే ఆస్తి, సౌకర్యం ఏ ధనం ఇవ్వలేదు. ఏయన్నార్‌గారు తలగడ మీద తల పెట్టగానే హాయిగా నిద్ర΄ోయేవారు. 1974లో బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ ముందు రోజు నర్సు నిద్రకోసం మాత్ర ఇస్తే తీసుకోలేదు. ఏ మాత్ర వేసుకోకుండానే హాయిగా నిద్ర΄ోయారు. ఆ తర్వాత ఆయన జీవితం అందరికీ తెలిసిందే. నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. అన్నపూర్ణ సంస్థ, ఏయన్నార్ ఫిల్మ్ స్కూల్, కాలేజీ, ఆయన చిత్రాలు, ఫ్యాన్స్ తీపి గుర్తులు’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావు గారు ఒక గ్రంథం. ఆయన ‘మరపురాని మనుషులు’ సినిమాకు అసోసియేట్‌గా చేశాను. అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాల్లో నటించాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి చేరుకున్న వ్యక్తి నాగేశ్వరరావుగారు. మహానట వృక్షం. కళాకారులకు గొప్ప వరం. స్వయంశిల్పి. స్నేహశీలి. అద్భుతమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి’’ అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఓ వేడుకలో నాగేశ్వరరావుగారితో మాట్లాడే అవకాశం లభించింది. స్టార్ అయిన మీరు ‘మిస్సమ్మ’ సినిమాలో కమెడియన్‌గా ఎందుకు చేశారు? అని ఆయన్ను అడిగాను. ‘దేవదాసు’ తర్వాత అన్నీ తాగుబోతు పాత్రలే వస్తున్నాయని, ఇమేజ్ మార్చుకోక΄ోతే ఇబ్బందవుతుందేమోనని, ఆ పాత్రను తానే అడిగి మరీ చేశానని చె΄్పారు. నాగేశ్వరరావుగారికి ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకానికి నమస్కారం చేయాలనిపించింది’’ అన్నారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారితో ఎక్కువ సినిమాలు చేయడం నా అదృష్టం. క్రమశిక్షణతో పాటు ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. ఏయన్నార్ కుమార్తె నాగ సుశీల మాట్లాడుతూ– ‘‘అందరికీ పండగలు ఉంటాయి. కానీ మా అక్కినేని అభిమానులకు నాన్నగారి జయంతే పండగ. అభిమానుల ్ర΄ోత్సాహం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. అమ్మానాన్నలు మేం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకునేవారు. అలా మేమందరం కలిసే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేశాం’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ– ‘‘తాతగారు తన జీవితంలో కృతజ్ఞతకు విలువ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో తారా స్థాయికి ఎదిగిన ఆయనకు కళామతల్లికి తిరిగి ఇవ్వాలని ఉండేది. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఏయన్నార్ నేషనల్ అవార్డు, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. ఇలా ఎన్నో ఆయన కృతజ్ఞతలోంచి వచ్చిన ఆలోచనలే’’ అన్నారు. ‘‘నాగేశ్వరరావుగారి విగ్రహం పనులను నాకు అప్పగించిన అక్కినేని కుటుంబ సభ్యులకు ధన్య వాదాలు. దాదాపు ఐదున్నర నెలలు వర్క్ చేశాం’’ అన్నారు విగ్రహ రూపకర్త వినేష్ విజయన్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్గారంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్ ఐకాన్‌గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ప్రేరణ కలిగించే కేస్ స్టడీగా చాలా మంది ఫిల్మ్ స్కూల్స్‌లో చదువుతుంటారు. ఈ జాబితాలో నేనూ ఉన్నాను. తాతగారితో నేను కలిసి నటించడం నా అదృష్టం. మన పుట్టుక మన చేతిలో ఉండదు. అలాంటిది అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడిగా పుట్టడం నా అదృష్టం’’ అని అన్నారు. తాత ఏయన్నార్‌కు అఖిల్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమల, సుప్రియ, సుమంత్.. ఇలా అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, మంచు విష్ణు, నాని, నాజర్, అనుపమ్ ఖేర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, సి. కల్యాణ్, కేఎల్ నారాయణ, ‘దిల్’ రాజు, చినబాబు, నాగవంశీ, బి. గోపాల్, వైవీఎస్ చౌదరి, పి. కిరణ్, గుణ్ణం గంగరాజు, విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొని, అక్కినేని నాగేశ్వరరావుకి నివాళులు అర్పించారు. -
చెయ్యాల్సింది వదిలి ఇంకేదో చేస్తున్నారు!
‘‘భారత రాజ్యాంగంలో కీలకమైన 44వ అధికరణ ప్రకారం దేశానికంతకూ కలిపి ఒకే ఒక పౌర స్మృతి అమలులో ఉండాలి. ఇది లేనందుననే దేశంలోని సామాజికులలో ఐక్యత, అమలు జరగాల్సిన ఆర్థిక న్యాయం కుంటుపడి పోతున్నాయి’’ – ఎం. వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ప్రకటన (7.7.2023) వెనకటికొకడు ‘తాడి చెట్టు ఎందుకెక్కావురా’ అంటే, కల్లు కోసమనే రీతిగా సమాధానం చెప్పకుండా ‘దూడ మేత కోసం’ అని సమాధానం చెప్పాడట. ‘ఒకే దేశం ఒకే జాతి’ అనే బీజేపీ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ‘ఉమ్మడి పౌర స్మృతి’ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందనేది బహిరంగ రహస్యమే. అసమానతలను రూపు మాపుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. కానీ ఆ విషయాన్ని మరచి అందుకు పూర్తిగా భిన్నమైన భూస్వామ్య, పెట్టు బడిదారీ వ్యవస్థల మూలాలు చెక్కు చెదరకుండా భారత కాంగ్రెస్, బీజేపీ పాలకులు సంపూర్ణ మంత్రి వర్గాల పేరుతోనో, సంకీర్ణ ప్రభుత్వాల నాటకంతోనో ఇంతకాలం కాలక్షేపం చేస్తూ వచ్చారు. కుల, మత, వర్గ విభేదాలు ప్రజల మధ్య పెరగ డానికి, పాక్షిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుని తాత్కాలికంగా గట్టెక్కడానికి ఎత్తులు, పైఎత్తులతో కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. అటువంటి ఒక ఎత్తుగడే ‘ఉమ్మడి పౌర స్మృతి.’ తమ స్వార్థ రాజకీయాలను వివిధ అణగారిన ప్రజా శక్తులు ఆందోళనల ద్వారా, సమ్మెల ద్వారా, ఉధృత స్థాయిలో ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటూ వస్తూండటంతో పాలక వర్గాలు అరెస్టులు, కాల్పులు, నిర్బంధ విధానాల ద్వారా ప్రజా శక్తుల్ని అణచ జూస్తు న్నారు. ఈ సందర్భంగా, ప్రజలపై నిర్బంధ విధానాన్ని అమలు జరపడం ద్వారా పాలకులు అనుసరించే ఎత్తుగడలకు విచిత్రమైన రెండు ఘటనలను చరిత్రనుంచి ఉదహరించుకుందాం: ముందుగా పాత సోవియెట్ యూనియన్‌లో చోటుచేసుకున్న సంఘటన. పంటలు పండించడంలో ఆరితేరిన ఒక రైతు ఒక మార్కెట్ స్క్వేర్‌లో నిలబడి, ‘మన వ్యవసాయ మంత్రి ఒక తెలివితక్కువ దద్దమ్మ (ఫూల్) అని అరిచాడట. అంతే ఆ రైతును అరెస్టు చేసి 10 సంవత్సరాల ఒక మాసం పాటు జైల్లో నిర్బంధించారు. అందులో ఆ రైతు, మంత్రి గారిని ‘ఫూల్’ అని అగౌరవ పరచినందుకు ఒక మాసం పాటు, ప్రభుత్వ గుట్టును రట్టు చేసినందుకు 10 ఏళ్ళూ శిక్ష విధించారు. ఇంతకూ అసలు రహస్యం – ఆ రైతు పెద్ద మంత్రిని ఎద్దేవా చేసినందుకు విధించిన జరిమానా చిన్నదే, కానీ మంత్రిని ‘పనికిమాలిన దద్దమ్మ’ అన్న విమర్శ ప్రజల మనస్సుల్ని బాగా ప్రభావితం చేసినందుకు బారీ పెనాల్టీ విధించడం జరిగిందట! అలాగే మన దేశంలో జరిగిన మరో సంఘటన చూద్దాం. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ... వీళ్లందరి ఇంటిపేర్లుగా మోదీ ఎలా వచ్చింది? దొంగలందరి ఇంటిపేరుగా మోదీ ఎలా వచ్చింది’ అన్న రాహుల్ గాంధీ ‘జోక్’ కూడా క్రిమినల్ కేసులో చేరిపోయింది. దీనిపైన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే వ్యాఖ్యా నిస్తూ ‘జోక్‌ను, విమర్శను పరువు నష్టం కింద భావించి ఒక వ్యక్తిని అమెరికాలో జైలులో నిర్బంధించరు. ‘ఏలిననాటి శని’ లాంటి వలస చట్టం వల్ల ఇది ఇక్కడ సాధ్యమయింద’న్నారు. ‘ఏదో ఒక మోదీని అవమానించారని కాదు, మోదీలందరినీ ఉద్దేశించి అన్న సాధారణ అర్థంలో రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కోర్ట్ శిక్ష విధించింది’ అని ఆయన వివరించారు. పలువురు వ్యక్తులను సంబోధించే క్రమంలో ఇంటి పేర్లు, వంశనామాలు పెట్టి పిలిచినంత మాత్రాన ‘పరువు నష్టం’ కింద జమ కట్టడానికి వీలు కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన హోమీ మోదీ, లాలా మోదీ, సయెద్ మోదీ, పూర్ణేందు మోదీ వంటి పేర్లను ప్రస్తావించారు. భారత రాజ్యాంగానికి విశిష్టమైన వ్యాఖ్యాన పరంపర అందించిన సుప్రసిద్ధ మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమ నేతల్లో అగ్రజుడైన ఉన్నత న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దేశంలోని పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తల్ని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేసి, నిరా ధారమైన ఆరోపణలతో జైళ్లపాలు చేసినప్పుడు నిద్రాహారాలు లెక్క చేయ కుండా వారికి లీగల్ సహాయం అందించి విడుదలయ్యేటట్టు చేశారు. నక్సలైట్ ఖైదీల విడుదల కోసం ఏర్పడిన రక్షణ కమిటీకి కన్వీనర్‌గా పనిచేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును ప్రస్తావిస్తూ కన్నాభిరాన్, న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న తీరును ప్రస్తావించి ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలోని కోర్టులు అధికార, అనధికార స్థానాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న బలవంతులైన వారిని దుర్మార్గపు పరిణామాలకు బాధ్యుల్ని చేసి శిక్షించలేక పోతున్నాయి. చివరికి అణగారిన కార్మికులు ఆత్మగౌరవం కోసం పోరాడు తున్న సందర్భాల్లో కూడా అలాంటి వారి రక్షణకు కొన్ని కోర్టులు ముందుకు రావడం లేదు’’! చివరగా... చరిత్రలో కొందరు పాలకులు ప్రజలపైన, చివరికి, ప్రసిద్ధ చరిత్రకారులపైన ఎన్ని కిరాతకమైన ఆంక్షలు విధిస్తారో, దుర్మార్గాలకు పాల్పడుతుంటారో తెలియచేసే ఉదాహరణ ఒకటి చూద్దాం. చైనా చరిత్రలో ‘సీమా కియాన్’ అనే ప్రసిద్ధ చరిత్రకారుడు చక్రవర్తిని విమర్శించి ప్రజల ముందు అభాసుపాలు చేశాడు. అందుకు ఆ చక్రవర్తి ఒక దుర్మార్గమైన ‘ఆఫర్’ ఇచ్చాడు. చేసిన నేరానికి ‘ఉరిశిక్ష కావాలా లేక ఆ స్థానంలో నపుంస కుడిగా మారి పోతావా’ అని అడిగాడు. మరి తాను చరిత్రకారుడు కాబట్టి నపుంసకుడిగా ఉండిపోయి అయినా తాను ప్రారంభించిన చరిత్ర రచనను పూర్తిచేయాలనుకున్న కియాన్ నపుంసకునిగా మారడానికే మొగ్గాడు. (సైమన్ సీబాగ్ మాంటిఫియోర్ ‘ది వరల్డ్: ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హుమా నిటీ’). బహుశా కారల్ మార్క్స్ మహనీయుడు అందుకే అని ఉంటాడు: ‘‘మనుషులు తమ చరిత్రను తామే లిఖించుకుంటారు. కానీ, తమ ఇష్టా ఇష్టానుసారంగా రాసుకుంటూ పోలేరు. ఎవరికి వారు తమకు తామై ఎంచు కునే సందర్భాల ప్రకారమూ రాసుకోలేరు. మరి ఏ పునాది ఆధారంగా రాస్తారు – సిద్ధాన్నంలాగా అప్ప టికే ఉన్న పరిస్థితులు ఆధారంగా, గతం నుంచి సంక్రమించిన పరిస్థితులు ఆసరాగా తప్ప మరొక మార్గం లేదు’’! అవును కదా మరి – ‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు తానేను’’! abkprasad2006@yahoo.co.in -
‘భారతీయన్స్’ మూవీ ప్రెస్ మీట్.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు (ఫోటోలు)
-
శ్రీ సాంస్కృతిక కళాసారథి వార్షికోత్సవం: భారత మాజీ ఉప రాష్ట్రపతికి సత్కారం
శ్రీ సాంస్కృతిక కళాసారథి ద్వితీయ వార్షిక విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా సింగపూర్ పర్యటనలో ఉన్న భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఘనంగా సత్కరించింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, సంతోష్ జులూరి, ఇతర కార్యవర్గ సభ్యులు శ్రీధర్ కొల్లూరి, శశిధర్ రెడ్డి, నడికట్ల భాస్కర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి విజయోత్సవ సభలో సొసైటీ తరపున జ్ఞాపక అందజేసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి ని భావితరాలకు అందజేయడం లో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి మరియు తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ లను అభినందించారు. వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సింగపూర్ తెలుగు కళాకారుల సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ సొసైటీని ప్రత్యేకంగా ఆహ్వానించిన కవుటూరు రత్న కుమార్‌కు ప్ర త్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు. -
‘మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం’
మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం తెలుగు వారిగా మన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మలేషియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, మలేషియా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేషియాలోని తెలుగు సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. 41 ఏళ్ళ క్రితం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు, నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఆహ్వానం మేరకు మిత్రులు జైపాల్ రెడ్డితో కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంస్కృతిలో జీవన విధానం, విశ్వాసాలు భాగంగా ఉంటాయన్న ఆయన, ఈ రెండు కాలగమనంలో పురోగమించాలే తప్ప, తిరోగమించరాదని సూచించారు. ఇటీవల తమ చెన్నై పర్యటనలో భాగంగా ఉన్నతమైన కుటుంబ విలువలకు చిరునామాగా నిలిచిన బటర్ ఫ్లై గ్రూప్ అధినేత మురుగేశన్ చెట్టియార్ గృహాన్ని సందర్శించారని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటిలో 65 మంది కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించడం గొప్పవిషయమని తెలిపారు. ఇలాంటి విలువలను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ కుమార్తె, మనుమడిని కూడా వారి ఇంటికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. భాష మన సంస్కృతికి జీవనాడి అన్న ఆయన, ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని, భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని పేర్కొన్నారు. భారత్, మలేషియా మధ్య చక్కని బంధం ఏర్పడటంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమన్నారు. ఈ నేపథ్యంలో 1960ల నుంచి మలేషియా తెలుగు సంఘం పోషిస్తున్న పాత్రను అభినందించిన ఆయన, తెలుగు సాంస్కృతిక వారసత్వం, భాషను పరిరక్షించుకునేందుకు ప్రారంభమైన మలేషియా తెలుగు సంఘం, పేర్లు మార్చుకున్నా ప్రాథాన్యతలను మార్చుకోకుండా అదే స్ఫూర్తితో పని చేస్తుండటం ఆనందదాయకమన్నారు. మలేషియాలోని ఇతర ప్రజల మధ్య సామరస్యంగా జీవించటంలో, బహుళ జాతుల మధ్య తెలుగు సంఘం గౌరవం, గుర్తింపును నిలబెట్టడానికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఇదే స్పూర్తి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. -
మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు. బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ‘జ్ఞానగని అయిన మీ ప్రతిభాశక్తి మొదట్నుంచీ నన్ను అమితంగా ఆకర్షిస్తోంది. దశాబ్దాల మీ అపార అనుభవం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. చురకత్తుల్లాంటి మీ ఏకవాక్య పలుకులు నన్ను ఎన్నోసార్లు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. భావ వ్యక్తీకరణ అనేది మీలోని అత్యంత ప్రధానమైన అస్త్రం. నెల్లూరు నుంచి న్యూఢిల్లీదాకా సాగిన మీ అసాధారణ ప్రయాణ ఘట్టం అద్భుతం, సదా ఆదర్శనీయం వెంకయ్య గారూ’ అంటూ వెంకయ్యపై మోదీ పొగడ్తల వాన కురిపించారు. ‘సవాళ్లు ఎదురైన ప్రతీసారీ మరింత రెట్టించిన ధైర్యం, ఉత్సాహం, బాధ్యతలతో ముందుకు సాగారు. రాజ్యసభ చైర్మన్‌గా పార్లమెంటరీ క్రమశిక్షణ, సంప్రదాయాల పరిరక్షణలో అందరికీ చుక్కానిగా మారారు. రాజ్యసభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తించినపుడు పార్లమెంట్ గౌరవాన్ని తగ్గి్గస్తున్నారంటూ మీరు పడే బాధ ప్రతిసారీ మీ స్వరంలో ప్రతిధ్వనించింది’ అని అన్నారు. బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిప్రదాత ‘బీజేపీతో దశాబ్దాల మీ అనుబంధం చిరస్మరణీయం. వ్యవస్థీకృత అంశాల్లో మీ అంకితభావం ప్రతీ పార్టీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. తొలినాళ్లలో పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అంతగా విస్తరించని కాలంలోనే బీజేపీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. అకుంఠిత దీక్షతో పనిచేశారు. పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసి పార్టీని వ్యవస్థాగతంగా పటిష్టంచేశారు. ప్రస్తుతం అవి ప్రజాసేవా కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. పార్టీలో దశాబ్దాల అనుబంధంలో మీ నుంచి నేను నేరుగా ఎన్నో అంశాల్లో సలహాలు, సూచనలు పొంది లబ్ధిపొందాను. చిన్న మాటల్లోనే పెద్ద భావాలను పలికించగల భావ వ్యక్తీకరణ మీ సొత్తు. ఈ విషయంలో మీరు వినోబా భావేను స్మరణకు తెస్తారు’ అని మోదీ అన్నారు. -
మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమం సందర్భంగా సమాజంలోని దురాచారాలను తరిమి వేయడంపై యువత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మహిళలకు సరైన గౌరవం కల్పించడంతోపాటు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చేయూతనందించినపుడే అందరినీ సమాజాభివృద్ధిలో భాగస్వాములుగా చేయగలమని ఉపరాష్ట్రపతి సూచించారు.బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. -
స్వార్థ రాజకీయాలొద్దు
న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు జాతి ప్రయోజనాలే పరమావధిగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. ప్రజలు శాంతి, సామరస్యంతో మెలగాలన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకుంది. కానీ అందుకు గాంధేయ మార్గాన్నే అనుసరించాలి. నేనెల్లప్పుడూ ఎంపీలతో కూడిన పెద్ద కుటుంబంలో సభ్యుడిననే భావించుకున్నాను. కుటుంబంలోలానే పార్లమెంట్‌లోనూ విభేదాలు తలెత్తుతుంటాయి. ఒక్కో పార్టీకి ఒక్కో అభిప్రాయముండొచ్చు. జాతి ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి’’ అన్నారు. రాష్ట్రపతిగా సేవ చేసే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటానన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు. ‘‘విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులు, ఎంపీలకు కృతజ్ఞతలు. పార్లమెంట్ కార్యక్రమాలను సజావుగా నిర్వహించి ఘన సంప్రదాయాలను కొనసాగించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా కృతజ్ఞతలు’’ అన్నారు. రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి తుది ప్రసంగం చేయనున్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మోదీ, ఓం బిర్లా, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. వెంకయ్య వీడ్కోలు విందు రాష్ట్రపతికి వెంకయ్య తన నివాసంలో వీడ్కోలు విందు ఇచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన కోవింద్ దంపతులను వెంకయ్య దంపతులు సాదరంగా ఆహ్వానించారు. విందులో తెలుగు వంటకాలు వడ్డించారు. విందు ఇచ్చారు. రాష్ట్రపతిగా కోవింద్‌హుందాగా బాధ్యతలు నిర్వహించారని వెంకయ్య కొనియాడారు. కోవింద్ జీవితం ఆదర్శనీయమైందని, ఆయన ఆలోచనలు, ప్రసంగాల నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని అన్నారు. న్యాయవాది నుంచి రాష్ట్రపతి దాకా... దేశ 14వ రాష్ట్రపతిగా ఐదేళ్లపాటు సేవలందించిన రామ్‌నాథ్ కోవింద్ సాధారణ న్యాయవాదిగా జీవితం ఆరంభించారు. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో పార్లమెంట్ సభ్యుడిగా, గవర్నర్‌గా సేవలందించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 2017 జూలై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. కోవింద్ 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా పరౌంఖ్ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వొకేట్–ఆన్–రికార్డుగా ఎంపికయ్యారు. 1980 నుంచి 1993 దాకా సుప్రీంకోర్టులో కేంద్రం తరఫు న్యాయవాదిగా పనిచేశారు. అణగారిన వర్గాలకు, ప్రధానంగా మహిళలు, పేదలకు ఉచితంగా న్యాయ సేవలందించారు. బీజేపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1994 నుంచి 2006 దాకా రెండుసార్లు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో బిహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. బిహార్ విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017లో అధికార ఎన్డీయే తరఫున రాష్ట్రపతిగా ఘన విజయం సాధించారు. కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి అయిన రెండో దళితుడు కోవింద్. పుస్తక పఠనమంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. సామాజిక సాధికారతకు విద్యే ఆయుధమని చెబుతుంటారు. దివ్యాంగులు, అనాథలకు సమాజంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచిస్తుంటారు. రాష్ట్రపతి హోదాలో కోవింద్ 33 దేశాల్లో పర్యటించారు. సైనిక దళాల సుప్రీం కమాండర్‌గా 2018 మేలో సియాచిన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమైన కుమార్ పోస్టును కూడా ఆయన సందర్శించారు. -
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు..??
-
నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల
‘‘చీకటిలో దారి చూపించే వెన్నెల ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం. నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’. భాషా ప్రావీణ్యం కన్నా విషయ ప్రావీణ్యం మరింత గొప్పదని ఆయన్ని చూసి తెలుసుకోవచ్చు’’ అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి పుస్తకా విష్కరణ సభ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘సిరివెన్నెల’ సతీమణి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు ఆర్థిక ఆలంబన కోసం కాకుండా అర్థవంతమైన సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక రచనా విధానాన్ని కొనసాగించారు. ప్రతి పాటలో, మాటలో సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలతో పాటు సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని వినేవాణ్ణి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆయనతో కాలక్షేపం చేసేవాణ్ణి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణ రెడ్డి, వేటూరి, ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు పాటలకు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హింస, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయి. ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు భాషకు గౌరవాన్ని పెంచితే ప్రస్తుత సమాజం తెలుగు భాషను విస్మరిస్తోంది.. ఇంగ్లిష్ మోజులో పడి తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాష మన కళ్లు అయితే, ఇతర ప్రపంచ భాషలు కళ్లద్దాలవంటివి. ప్రస్తుతం సమాజంలో వివక్ష పెరిగిపోయింది.. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీగా మారాయి’’ అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘సీతారామశాస్త్రిగారితో ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను.. ఆయన స్వతహాగా పాడిన పాటలు విని ఆస్వాదించేవాణ్ణి’’ అన్నారు. ‘‘ఆయన పాటలను పుస్తకంగా తీసుకురావడం వెనుక ‘సిరివెన్నెల’గారి సాహిత్యం గొప్పతనం ఉంది’’ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘‘సిరివెన్నెల’గారి సినిమా పాటలతో 4 సంపుటాలు, సినిమాయేతర రచనలతో మరో రెండు సంపుటాలు విడుదల చేస్తాం. త్వరలోనే ‘తానా సిరివెన్నెల విశిష్ట పురస్కారం’ కూడా విడుదల చేయనున్నాం’’ అని ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ అధ్యక్షుడు లావు అంజయ్య, మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సాగును లాభసాటిగా మార్చాలి
ఏజీ వర్సిటీ: దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా పరిశోధనలు విస్తృతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ రంగంలో జరిగే ప్రతి పరిశోధన అంతిమ లక్ష్యం వ్యవసాయాన్ని సుస్థిరం చేయడం, వాతావరణ మార్పుల నుంచి పంటలను రక్షించుకోవడం, అన్నదాతల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం, దేశ ఆహార భద్రతను కాపాడటమే కావాలన్నారు. వెంకయ్య శనివారం రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (ఐసీఏఆర్–ఎన్‌ఏఏఆర్‌యం) స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహమివ్వాలని కోరారు. ప్రతి రైతును సంప్రదాయ విధానం, ఆధునాతన సాంకేతిక పద్ధతులతో కలిసి పనిచేసేలా చైతన్యపరచాల్సిన బాధ్యతను వ్యవసాయ విద్యాలయాలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే విషయంలోనూ స్థానిక భాషలోనే శాస్త్రవేత్తలు వారికి బోధించాలని చెప్పారు. జెనోమిక్స్, మాలిక్యులర్ బ్రీడింగ్, నానోటెక్నాలజీ మొదలైన రంగాలపై దృష్టిసారించాలన్నారు. డ్రోన్లు, కృత్రిమ మేధ వంటి సాంకేతికతనూ వ్యవసాయానికి మరింత చేరువ చేయడంలో ఐసీఏఆర్ మరింత కృషి చేయాలని చెప్పారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న వారు వ్యవసాయాన్ని సంఘటిత రంగంగా మార్చేందుకు కృషి చేయాలని హితవు పలికారు. వాతావరణ సమస్యలు, ఇతర అనేక ఇబ్బందులు ఎన్నున్నా అన్నదాత తన బాధ్యతను విస్మరించకుండా ఆహారోత్పత్తికోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని వెంకయ్య చెప్పారు. కరోనా సమయంలోనూ దేశంలో ఆహారోత్పత్తి ఏమాత్రం తగ్గకపోగా ఉత్పత్తి పెరిగిందని, ఇది అన్నదాతల అంకితభావానికి నిదర్శమని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛలోక్తి విసిరారు. ఆయనతోపాటు రానున్న రెండు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌న్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేష్‌కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్ సభ్యులు నరేష్ గుజ్రాల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. It has been an honour raising issues relating to Andhra Pradesh's welfare in the Rajya Sabha in my 1st term, and as it comes to an end, I thank Sri @YSJagan garu for this honour & his faith in me. pic.twitter.com/opsHJrT8zm — Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2022 చదవండి: (అఖిలేష్‌కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?) ఈ సందర్భంగా ఆయన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పనితీరును అభినందిస్తూ తాను అనేక పర్యాయాలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నిర్మల సీతారామన్‌తో సమావేశమయ్యానని ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసే వారని అభినందించారు. టూరిజం, ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే టీజీ వెంకటేష్ కమిటీని అధిగమించడానికి కామర్స్ కమిటీ చైర్మన్‌గా తాను తాపత్రయపడుతుండే వాడినని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్ అవుతున్న సహచర సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక వీడ్కోలు, అభినందనలు చెప్పారు. చదవండి: (కర్ణాటకలో మొఘలుల పాఠ్యాంశాలకు గుడ్‌బై!) -
ఒక రోజు ముందే..
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. డిసెంబర్ 23 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉండగా, ఒకరోజు ముందే ముగిశాయి. సమావేశాల చివరి రోజు కూడా సభలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. ప్రస్తుత సమావేశాల్లో రైతు చట్టాల ఉపసంహరణ బిల్లు, ఎన్నికల సంస్కరణల బిల్లు, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల కాలపరిమితి పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ముగింపు సందేశాన్ని చదివారు. సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్‌తో సమావేశమయ్యారు. అంశాలపై విబేధాలను చర్చల్లో చూపాలి కానీ ఆందోళనల్లో కాదని స్పీకర్ హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ 18 సార్లు సమావేశమైంది. సమావేశాలు 88 గంటల 12 నిమిషాలు కొనసాగాయి. కోవిడ్, శీతోష్ణస్థితి మార్పుపై అత్యధిక సమయం చర్చించారు. డిసెంబర్ 2న జరిగిన కరోనాపై చర్చలో 99 మంది సభ్యులు పాల్గొన్నారు. నిరసనల కారణంగా సభా సమయంలో 18గంటల 48 నిమిషాలు నష్టపోయామని స్పీకర్ చెప్పారు. మొత్తం మీద ఈ దఫా లోక్‌సభ సమావేశాల్లో ఉత్పాదకత 82 శాతమన్నారు. ఈ సెషన్లో ప్రభుత్వం 12 బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆరు బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు సిఫార్సు చేశారు. రాజ్యసభ పనితీరుపై వెంకయ్య ఆవేదన బుధవారం రాజ్యసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా సభలో ఆందోళనలు అధికమై పనితీరు బాగా తగ్గడంపై సభాపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వరకు సమావేశాలు జరగాల్సిఉండగా ఒకరోజు ముందే ముగిశాయి. సామర్ధ్యం కన్నా తక్కువ పనితీరును సభ కనబరిచిందని బుధవారం సభారంభం కాగానే వెంకయ్య సభ్యులకు వివరించారు. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే మరింత మెరుగ్గా సమావేశాలు జరిగి ఉండేవన్నారు. అందరూ సభా నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన తప్పులను గుర్తించి ఇకపై జరగకుండా జాగ్రత్తపడాలని హితవు పలికారు. రాబోయే పండుగలకు సంబంధించి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ జరిగింది. విపక్షాల ఆందోళన నడుమ కీలక బిల్లులకు సభ ఆమోద తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించింది. విపక్షాలు 2019 ప్రజాతీర్పును తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. వీరి కారణంగా రాజ్యసభ ఉత్పాదకత 48 శాతానికి క్షీణించిందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్నా ప్రభుత్వం 12మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా కృత్తిమ మెజారిటీ సంపాదించి బిల్లులు పాస్ చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. నిరవధిక వాయిదా తర్వాత బయటికొస్తున్న సభ్యులు -
ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నీహారిక వివాహ ఆశీర్వచన కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వివిధ రాజకీయపార్టీల ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్) -
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం
సాక్షి, న్యూఢిల్లీ: ఏడేళ్లుగా ఈశాన్యభారతంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోందని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రాంతంలో తిరుగుబాటు శక్తుల ప్రభావం తగ్గుతూ వస్తోందని ఆయన వెల్లడించారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 2014 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అభినందించారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో చట్టసభల పనితీరును ప్రస్తావిస్తూ, పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించే బదులు, అనవసర వాదులాటల ద్వారా సభా సమయాన్ని వ్యర్థం చేయడం సరికాదన్నారు. 2015–20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా ఆరు రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ధోరణి ఆందోళనకరమన్నారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలన్నారు. ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పన విస్తృతంగా జరుగుతోందని, తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. 2014లో ప్రధానమంత్రి ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదన్నారు. అరుణా చల్ ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు ఇతర భాగస్వామ్య పక్షాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. -
76వ వసంతంలోకి రాష్ట్రపతి: ప్రధాని మోదీ, సీఎంలు జగన్, కేసీఆర్ విషెస్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారంతో 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవారని, దేశానికి ఆయన జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. చదవండి: నిశ్చితార్థం అయింది.. పెళ్లికి అబ్బాయి నో అన్నాడని.. Birthday greetings to Rashtrapati Ji. Due to his humble personality, he has endeared himself to the entire nation. His focus on empowering the poor and marginalised sections of society is exemplary. May he lead a long and healthy life. @rashtrapatibhvn — Narendra Modi (@narendramodi) October 1, 2021 ఉప రాష్ట్రపతి హృదయపూర్వక శుభాకాంక్షలు ‘నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింప్లిసిటీ, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆయురారోగ్యం, సంతోషాలతో చాలా ఏళ్లు దేశానికి సేవ చేయాలని ప్రార్థిస్తున్నా’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవలు అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. Warm greetings to Hon'ble President Shri Ram Nath Kovind Ji on his birthday. May the Almighty bless him with a long & healthy life in the service of our nation. @rashtrapatibhvn — YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2021 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ఏపీ రాజ్‌భవన్ ట్వీట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు ఆరోగ్యంతో సుదీర్ఘ జీవితం పొందాలని.. దేశానికి ఇంకొన్నాళ్లు సేవ చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. CM Sri KCR conveyed birthday greetings to Hon'ble President Sri Ram Nath Kovind Ji on behalf of Telangana Government and its people. "May God bless Sri Ram Nath Kovind Ji with good health and long life for serving the nation for many more years", CM wished.@Rashtrapatibhvn — Telangana CMO (@TelanganaCMO) October 1, 2021 -
వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపొందాలి
శంషాబాద్ రూరల్: కరోనాపై పోరాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రత్యామ్నాయమని, వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపుదాల్చాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీల్లో మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కోవాగ్జిన్ ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న ట్రస్టు ఆవరణలో వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు వీడాలని కోరారు. దేశీయంగా తయారీతో తగ్గిన ఖర్చు: దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా అన్ని ప్రాంతాలకు టీకాలు అందించే వీలుంటుందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా అన్నారు. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని కేంద్రాల నుంచి కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉష పాల్గొన్నారు. -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
హుందాతనం మరవొద్దు
కేవాడియా/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరిం చాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. పార్లమెంట్లో, శాసన సభల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అన్‌పార్లమెంటరీ పదజాలానికి దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణారాహిత్యం, అనుచితమైన పదప్రయోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ బుధవారం గుజరాత్‌లోని కేవాడియా పట్టణంలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మాట్లాడారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా స్పీకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. బడుగుల అభివృద్ధే పరమావధి కావాలి చట్టసభల పనితీరుపై సామాన్య ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి ఆకాంక్షలు సైతం పెరుగుతున్నాయని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వాల పరమావధి కావాలని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమే: ఓం బిర్లా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు పాటిస్తూ ఈ భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకోవాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు పనిచేసేలా రాజ్యాంగం పునాదులు వేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులుగా మనమంతా ప్రజల బాగు కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటించాలని ఓం బిర్లా పేర్కొన్నారు. మూడు వ్యవస్థలు కలిసి పని చేయాలి: వెంకయ్య ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో కలిసి పనిచేయాలని కోరారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో çకోర్టులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించాయని అన్నారు. అయితే, శాసన, కార్యనిర్వా హక వ్యవస్థల్లో కోర్టులు అనవసరంగా కలుగజేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయని వెల్లడించారు. చట్టసభల్లో తరచుగా జరుగుతున్న ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ‘డి’లు.. డిబేట్, డిస్కస్, డిసైడ్కు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని కోరారు. -
ఇలా జరగడం బాధాకరం: ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన శ్రీ బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకర’’మన్నారు. ( జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’ ) ఎస్పీ బాలు మరణవార్త కలవరపరిచింది : కిషన్ రెడ్డి ‘‘గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త కలవరపరిచింది. 16 భారతీయ భాషలలో 40,000 పాటలను అందించిన బహుముఖ గాయకుడిని కోల్పోయాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ -
నెల్లూరు వైద్యకళాశాలకు ఎంసీఐ గుర్తింపు
సాక్షి, ఢిల్లీ : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. తాజాగా కేంద్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా ఐదేళ్ళ నిరీక్షణకు తెరపడినట్లయ్యింది. దీంతో కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి వసతులు కూడా మెరుగుపడనున్నాయి.ఎంసీఐ అనుమతుల గురించి వెంకయ్యనాయుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి హర్షవర్ధన్ సహా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు దీనికి సంబంధించి మార్గం సుగమం అయింది. ఎంసీఐ అనుమతుల నేపథ్యంలో లాంఛనాలను త్వరితగతిన పూర్తిచేసి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యేలా చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి కేంద్రమంత్రికి సూచించారు. (భారత్ బంద్ : 20 రైతు సంఘాల మద్దతు) డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల.. 2014-15 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో భారతీయ వైద్యమండలి అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే మొదటి బ్యాచ్ విద్యార్థుల శిక్షణాకాలం ముగుస్తున్న సమయంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు చొరవతీసుకొని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. కాలేజీలో మౌలిక వసతులకు సంబంధించి కళాశాల యాజమాన్యం గతంలో ఇచ్చిన నివేదికలు, నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ భారతీయ వైద్య మండలి అనుమతులు నిరాకరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి చొరవతో మరోసారి జనవరి 30, 2020న ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులకు సంబంధించి ఎంసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కేంద్ర బృందం పరిశీలించింది. సంతృప్తికరమైన నివేదిక ఇవ్వడంతో.. కాలేజీకి ఎంసీఐ గుర్తింపు లభించింది. (రెండేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన రైలు.. అయినా!) -
ముగిసిన పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రకటిత సమయం కన్నా 8 రోజుల ముందే ఈ సమావేశాలు ముగిశాయి. మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు ఆమోదం అనంతరం లోక్‌సభను బుధవారం సాయంత్రం స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం మధ్యాహ్నమే చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. చివరిరోజైన బుధవారం కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులు సహా పలు కీలక బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. సెప్టెంబర్ 14న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మరోవైపు, ఎంపీల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో 8 రోజుల ముందే ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల మౌన నిరసన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో మౌన నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ‘సేవ్ ఫార్మర్స్’, ‘సేవ్ వర్కర్స్’, ‘సేవ్ డెమొక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో విపక్ష సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ.. తదితర పార్టీల సభ్యులు పాల్గొన్నారు. కార్మిక బిల్లుల ఆమోదంపై ప్రధాని హర్షం కార్మిక రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు బుధవారం పార్లమెంటు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లులు కార్మికుల సంక్షేమానికి, ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తాయన్నారు. కనీస వేతనాలు, సరైన సమయానికి వేతనాలు ఇవ్వడం, కార్మికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం.. తదితర అంశాలకు ఈ బిల్లులు హామీ ఇస్తున్నాయన్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనకు ఈ బిల్లులు ఉదాహరణ అన్నారు. ఈ సంస్కరణలతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరమవుతుందన్నారు. ‘ఇవి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బిల్లులు. వీటితో అనవసర జాప్యం, అధిక ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గుతాయి’ అన్నారు. కంపెనీల మూసివేతలో అడ్డంకులను తొలగించడం, 300 మంది వరకు కార్మికులున్న కంపెనీలు తమ ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే తొలగించే వెసులుబాటు.. తదితర ప్రతిపాదనలు ఆ బిల్లుల్లో ఉన్నాయి. ఈ నిర్ణయాల వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా, పార్లమెంటు ఆమోదం పొందిన 3 బిల్లులతో పాటు, 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 సమగ్ర చట్టాలుగా రూపొందించారు. -
8 మంది ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్‌ను విసిరేయడం తెల్సిందే. సభామర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్‌లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య తోసిపుచ్చారు. జీరో అవర్ అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివారం సభలో చోటు చేసుకున్న ఘటనలపై ఆవేదన చెందానన్నారు. ‘కొందరు సభ్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కి, గట్టిగా అరుస్తూ, డాన్స్‌లు చేశారు. పేపర్లు చింపి, మైకులు విరగ్గొట్టి, డెప్యూటీ చైర్మన్ విధులకు ఆటంకం కలిగించారు. మార్షల్స్ అడ్డుకోకుంటే, డెప్యూటీ చైర్మన్‌పై దాడి కూడా జరిగేది. ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయం? ఆత్మ విమర్శ చేసుకోండి’ అని ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీమీ స్థానాలకు వెళ్లండి. డివిజన్ ఓటింగ్ చేపడ్తామ’ని డెప్యూటీ చైర్మన్ చెప్పినా విపక్షసభ్యులు పట్టించుకోలేదన్నారు. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై సహచర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేటు పడిన సభ్యులు ఆ తరువాత బయటకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, సభలోనే కూర్చుని నిరసన కొనసాగించారు. వారికి ఇతర విపక్ష సభ్యులు జతకలవడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన సభ.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల ధర్నా: తమపై విధించిన సస్పెన్షన్‌కు నిరసనగా ఆ 8 మంది సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరవధిక ధర్నాకు దిగారు. నిరవధిక నిరసనకు వీలుగా దుప్పట్లు, దిండ్లు తెచ్చుకున్నారు. ఇతర విపక్ష ఎంపీలతో కలిసి గాంధీజీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. నినాదాలు, పాటలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. శివసేన, సీపీఐ, ఎస్పీ, జేడీఎస్ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వారికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఈ సస్పెన్షన్ ఒక ఉదాహరణ అని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ విమర్శించారు.వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని, రెండు కోట్లమంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న జరిగే దేశవ్యాప్త నిరసనలకు మద్దతు తెలుపుతూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని కాం గ్రెస్ మండిపడింది. ఇది ప్రజాస్వామ్య భారత్ గొంతు నొక్కడమేనని రాహుల్ అన్నారు. ఆరోగ్య సిబ్బంది భద్రత బిల్లు: కరోనాపై పోరాడే ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
పెద్దల సభలో రగడ : ఉన్నతస్ధాయి భేటీలో చర్చ
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో జరిగిన గందరగోళంపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నివాసంలో ఉన్నతస్ధాయి సమావేశం జరిగింది. రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. విపక్ష ఎంపీల తీరుపై ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై 12 విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై కూడా ఈ భేటీలో చర్చించారు. రైతులకు ప్రధానమంత్రి భరోసా విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభలో రెండు వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కనీస మద్దతు ధర వ్యవస్థతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులకు సేవ చేసేందుకే తామున్నామని, వారికి వీలైనంత సాయం చేసేందుకు అన్ని చర్యలూ చేపడతామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడాన్ని ప్రధాని స్వాగతిస్తూ ఇది భారత వ్యవసాయ రంగ చరిత్రలో కీలక ఘట్టమని వ్యాఖ్యానించారు. కోట్లాది రైతుల సాధికారతకు ఇది ఊతమిస్తుందని అన్నారు. విపక్షాల తీరు బాధ్యతారాహిత్యం : నడ్డా వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా పెద్దల సభలో ప్రతిపక్షాల ప్రవర్తనను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రంగా తప్పుపట్టారు. విపక్షాల తీరు బాధ్యతారాహిత్యమని, ప్రజాస్వామ్యాన్ని వారు అపహాస్యం చేశారని మండిపడ్డారు. చదవండి : పెద్దల సభలో పెను దుమారం -
పెద్దల సభ : ఎథిక్స్ కమిటీ బలోపేతం
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభను హుందాతనానికి ప్రతీకగా మలిచే క్రమంలో రాజ్యసభ ఎథిక్స్ కమిటీని మరింత బలోపేతం చేశారు. ఎంపీల ప్రవర్తనపై వచ్చే ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు ఇద్దరు ఉన్నతాధికారులకు అధికారాలను కట్టబెట్టారు. ఎథిక్స్ కమిటీ మరింత బాగా పనిచేసేలా పలు చర్యలు చేపట్టాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయించారు. పెద్దల సభలో ఎంపీలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాజ్యసభ సభ్యులకు 14 సూత్రాల ప్రవర్తనా నియమావళిని నిర్ధేశిస్తూ పార్లమెంటు గౌరవాన్ని భంగం కలిగించేలా ఎంపీలు వ్యవహరించరాదని నియమావళిలో పొందుపరిచారు. ప్రశ్నోత్తరాల సమయం, ఎంపీ ల్యాడ్స్ నిధులు, బ్యాంకు రుణాల ఎగవేత అంశాలపై ఎంపీలపై ఫిర్యాదులను ఎథిక్స్ కమిటీ విచారించింది. కాగా, బీజేపీ ఎంపీ శివప్రతాప్ శుక్లాను రాజ్యసభ ఎథిక్స కమిటీ చీఫ్‌గా ఇటీవల నియమితులయ్యారు. శుక్లాతో పాటు మరో ముగ్గురు ఎంపీలను ఎథిక్స్ కమిటీలో రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు నియమించిన సంగతి తెలిసిందే. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి. విజయసాయిరెడ్డి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావులు ఉన్నారు. దీంతో రాజ్యసభ ఎథిక్స్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య చైర్మన్ సహా 11 మందికి చేరింది. చదవండి : ఏ న్యాయానికి ఈ మూల్యం! -
షిఫ్ట్ పద్ధ్దతిలో పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముందని రాజ్యసభ సెక్రటేరి యట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా పలు ముందు జాగ్రత్త చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. దీన్లో భాగంగా, ఈసారి ఉభయ సభలు ఒకదాని తర్వాత మరోటి సమావేశం కానున్నాయి. ఉదయం ఒక సభ జరిగితే, మరో సభ సాయంత్రం సమావేశమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ చివరి సమావేశాలు జరిగిన ఆరు నెలల్లోగా సమావేశాలు జరగాల్సి ఉంది. 1952 తర్వాత ఇదే ప్రథమం..! రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 17వ తేదీన సమావేశమై పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఏర్పాట్లు పూర్తయితే, ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం తుదిమెరుగులు దిద్దాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ అధికారులు రెండు వారాలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భౌతికదూరం పాటిస్తూ ఏర్పాటు చేసిన సీట్ల అమరిక కారణంగా ఉభయ సభల చాంబర్లతోపాటు గ్యాలరీల్లోనూ రాజ్యసభ సభ్యులు కూర్చుంటారు. రాజ్యసభ చాంబర్లో 60 మంది, గ్యాలరీల్లో 51 మంది, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభ చాంబర్లో కూర్చుంటారు. 1952వ సంవత్సరం తర్వాత ఇలాంటి ఏర్పాటు చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే ప్రథమమని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. భారీ డిస్ప్లే స్క్రీన్లు రాజ్యసభ చాంబర్లో 4 భారీ డిస్ప్లే స్క్రీన్లు, నాలుగు గ్యాలరీల్లో కలిపి 6 చిన్న స్క్రీన్లు, గ్యాలరీల్లో ఆడియో కన్సోల్స్, సూక్ష్మక్రిములను చంపే అల్ట్రా వయొలెట్ పరికరాలు, ఆడియో విజువల్ సిగ్నల్స్ కోసం ఉభయ సభలను కలుపుతూ ప్రత్యేక కేబుళ్లు, అధికారుల గ్యాలరీని చాంబర్‌తో వేరు చేస్తూ ప్రత్యేక ప్లాస్టిక్ షీట్ల అమరిక వంటివి ఇందులో ఉన్నాయని రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వీటిని చేపట్టినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది. సీట్ల అమరిక ఇలా... వివిధ పార్టీల సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభలో కొందరికి, మరికొందరికి లోక్‌సభలోని అధికార పక్షం, ఇతరులు కూర్చునే రెండు బ్లాకులను ప్రత్యేకించారు. రాజ్యసభ చాంబర్లో ప్రధానమంత్రి, విపక్ష, అధికార పక్షం నేతలు, ఇతర పార్టీల వారికి సీట్లు కేటాయించారు. మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, రాజ్యసభ సభ్యులైన కేంద్ర మంత్రులు రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవలేలకు కూడా చాంబర్లోనే చోటు కల్పించారు. మిగతా మంత్రులకు అధికార పక్షం సభ్యుల సీట్లే కేటాయించారు. సభ్యులు తమ సీట్ల నుంచే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని సీట్లకు హెడ్ఫోన్లు, తదితర పరికరాలను అమర్చారు. రాజ్యసభలోని ప్రతి గ్యాలరీలో ఆయా పార్టీలకు కేటాయించిన సీట్ల వద్ద ప్లకార్డులను ఏర్పాటు చేశారు. రాజ్యసభలో బ్యాక్టీరియా, వైరస్‌ను నాశనం చేసేందుకు ‘అల్ట్రా వయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిమితంగానే అధికారులకు అవకాశం రాజ్యసభలోకి సెక్రటేరియట్‌కు చెందిన అధికారులను పరిమితంగా 15 మందినే అనుమతిస్తారు. అదేవిధంగా, విదేశీ ప్రతినిధులకు కేటాయించిన ప్రత్యేక బాక్స్‌లో రిపోర్టర్లకు చోటు కల్పించారు. భౌతిక దూరం పాటిస్తూ, 15 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలు కూడా ఉభయసభల్లో కార్యక్రమాలను ప్రస్తుతమున్న ఏర్పాట్ల ప్రకారమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దీంతోపాటు, వివిధ అధికార పత్రాలను సభ్యులకు భౌతికంగా అందజేసే అవసరాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఏర్పాట్లు చేçపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఏర్పాట్లు చేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కావలసిన ఏర్పాట్లను మాత్రం లోక్‌సభ స్పీకర్, నేను పర్యవేక్షిస్తున్నాం’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘పార్లమెంట్ సమావేశాల నాటికి పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మహమ్మారి సమయంలో కూడా పార్లమెంటు సమావేశాలను విధిగా నిర్వహించాల్సిందే. ఏవైనా మార్పులు తేవాలనుకున్నా.. ఒకసారి సమావేశమై మార్పులు తేవొచ్చు. సమావేశాలు నిర్వహిస్తే కనీసం 3 వేల మంది సిబ్బంది పార్లమెంటు ప్రాంగణంలో ఉంటారు. అందువల్ల భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఆంక్షలు అమలుచేయాల్సి వస్తుంది. వర్చువల్ సమావేశాలు నిర్వహించాలంటూ సలహాలు వస్తున్నాయి. వర్చువల్‌కి, నేరుగా మాట్లాడడానికి చాలా తేడా ఉంది..’అని వెంకయ్య అన్నారు. ఢిల్లీలోని తెలుగు పాత్రికేయులతో ఆయన ఆన్లైన్లో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. కరోనా విషయంలో మీడియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని, వార్తల్లో అతిశయోక్తులు వద్దని సూచించారు. -
కరోనా కాలంలో అన్నదాతల పాత్ర అనిర్వచనీయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కష్టకాలంలో అన్నదాతలు పోషించిన పాత్ర గొప్పదని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రైతుల అంకితభావం, చిత్తశుద్ధి కారణంగానే ఆహార భద్రతకు సమస్యరాలేదని తెలిపారు. అంతేకాకుండా గత సంవత్సరం కంటే ఎక్కువగానే దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. శుక్రవారం ఎం.ఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన ‘సైన్స్ ఫర్ రెజిలియంట్ ఫుడ్,న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్స్’ సదస్సును వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారతీయ అన్నదాతల శక్తిసామర్థ్యాలు, అంకితభావం, సంప్రదాయ వ్యవసాయపద్ధతులపై వారికున్న పరిజ్ఞానం అభినందనీయమని ప్రశంసించారు. వారి కృషికి రైతులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా.. రైతు బిడ్డగా ఇందుకు గర్విస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. (‘న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 3 కోట్లకు పైగానే’ ) భారతీయ సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి ఆధునిక సాంకేతికత, శాస్త్ర పరిశోధనలు తోడైతే భారతదేశం మరింత పురోగతి సాధిస్తుందన్నారు. ఆహారంలోని పోషకాహార విలువలను పొందే విధంగా ప్రాసెసింగ్ పద్ధతులపై దృష్టిపెట్టడంతోపాటు ఆహారధాన్యాల నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా పురుషులతో పాటు మహిళలను సమానంగా ప్రోత్సహించడం గొప్పవిషయమని అన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే క్రమంలో మరింత ప్రగతి జరగాల్సిన అవసరం ఉంని..ఆకలి, పౌష్టికాహారలోపం, శిశు మరణాల రేటు తగ్గించే విషయంలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించిందని కొనియాడారు. నూతన విద్యావిధానంలో.. పాఠశాలల్లో చిన్నారులకు చక్కటి పోషకాహార అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. ఎస్ స్వామినాథన్‌తో పాటు శ, విదేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. (మానవ తప్పిదమే; బీరూట్ పోర్టు డైరెక్టర్ అరెస్ట్) -
కరోనా ఒక ‘సంస్కరణ కర్త’
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ బంధనం లో చిక్కుకుని గత కొన్ని నెలల కాలం లో మనం గడిపిన జీవితంపై ప్రజలం తా ఆత్మశోధన చేసుకోవాలని, ఈ సమయంలో సరైన జీవిత పాఠాలు నేర్చుకున్నామో లేదో తమకు తాముగా అం చనా వేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. అనూహ్య అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన సన్నద్ధతతో ఉన్నామా అన్నది తరచి చూసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. కోవిడ్–19కు కారణాలు, పర్యవసానాలపై ప్రజలతో తన భావనలు పంచుకునేందుకు వెంకయ్య నాయుడు ఫేస్బుక్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘కరోనా కాలంలో జీవిత భావనలు’అన్న శీర్షికతో ఆయన తన అభిప్రాయాలను సంభాషణా శైలిలో వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పది ప్రశ్నలను సంధించారు. ‘ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలే పలు జీవిత పాఠాలను నేర్పుతాయి. కోవిడ్–19 సంక్షోభంతో ఇళ్లకే పరిమితమై గత 4 నెలల్లో నేర్చుకున్న జీవిత పాఠాలను, జీవితంలో మార్పులను మదింపు చేసుకునేందుకు ఈ ప్రశ్నలు దోహదపడతాయి. కరోనా మహమ్మారిని కేవలం ఒక వైపరీత్యంగా మాత్రమే పరిగణించరాదు, మన జీవనశైలిని సంస్కరించే ‘దిద్దుబాటుదారు’గా, ‘సంస్కరణ కర్త’గా చూడాల్సిన అవసరం ఉంది’అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఆతృతకు తావులేకుండా.. ఎలాంటి ఆతృతకు తావులేని జీవనవిధానానికి ఆయన పలు సూచనలు చేశారు. సరైన ఆలోచన, జీవన విధానం, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ఆహారాన్ని ఔషధంగా పరిగణించడం, సామాజిక బంధంతో ఒక అర్థవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవడం వంటి సూచనలను పొందుపరిచారు. వైపరీత్యాలకు గల కారణాలను గురించి ప్రస్తావించారు. ‘మొత్తం భూగోళం మానవులకోసమే అన్నట్టుగా మనుషులు పెత్తనం చెలాయించడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది’ అని అన్నారు. తల్లిదండ్రుల, పెద్దల సంరక్షణలో తాము చేస్తున్న తప్పులేమిటో గుర్తించారని, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనడానికి సన్నద్ధమయ్యారని, ఇన్నాళ్లూ కోల్పోయిందేమిటో తాము ఇళ్లకే పరిమితమైనపుడు గుర్తించారన్నారు. ‘మనమంతా సమానులుగా పుట్టాం. కాలం గడుస్తున్న కొద్దీ చివరకు సమా నత్వంలో భేదాలు తలెత్తాయి. కొన్ని వర్గాల కష్టాలను, కడగండ్ల తీవ్రతను ఈ మహమ్మారి ఎత్తిచూపింది’అని అభిప్రాయపడ్డారు. -
కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్‌కు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉభయసభల సెక్రెటరీ జనరల్స్ అధికారులను ఆదేశించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తూ ఈ సమావేశాల్లో ఎంపీలు స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు పార్లమెంట్ ప్రాంగణంలోని ఆయా సభల్లోనే జరిగే వీలుందని వెల్లడించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు శనివారం సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎలా నిర్వహించాలన్న దానిపై చర్చించారు. అయితే, ఈ సమావేశాలను ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహించాలో ఇంకా తేదీలు నిర్ణయించలేదు. వాస్తవానికి సెప్టెంబర్ 22వ తేదీలోగా ప్రారంభించాల్సి ఉంది. -
ఆవిష్కరణలను ప్రోత్సహిద్దాం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ యువతలో, ఐటీ నిపుణుల్లో నిబిడీ కృతమై ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించేం దుకు అవసరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని, తద్వారా ‘ఆత్మనిర్భర భారత్’లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభాప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎలిమెంట్స్’యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం ఇతరులను అనుకరించడాన్ని పక్కనపెట్టి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు. -
రాజ్యసభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా
న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 37 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు వెల్లడించారు. రాజ్యసభకు 55 సీట్లు ఖాళీ కాగా 37 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ‘ప్రమాణస్వీకారానికి గాను నూతనంగా ఎన్నికైన సభ్యులను లాక్డౌన్ ఎత్తివేసే వరకు వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాం’ అని రాజ్యసభ చైర్మన్ ఒక అడ్వైజరీలో సూచించారు. కొత్తగా ఎన్నికైన వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన జీతభత్యాలన్నీ వారు ఎన్నికైనట్లు ప్రకటించిన నాటి నుంచి వర్తిస్తాయని అధికారులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేసి సభలో తన స్థానంలో కూర్చోవాలి. అయితే, ఇందుకు కాలపరిమితి అంటూ ఏదీ లేదు. -
'దేశాభివృద్ధి నైతిక విలువలపైనే ఆధారపడి ఉంది'
సాక్షి,వరంగల్ : వరంగల్‌లోని ఏవివి విద్యాసంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లాటినం ఉత్సవాలను భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' కాకతీయుల సుపరిపాలనకు కేంద్రమైన ఓరుగల్లుకు రావడం.. ఇక్కడి గడ్డపై జరిగే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మొదటి నుంచి విద్య, సాహిత్య, సాంస్కృతిక, వ్యవసాయక కేంద్రంగా ఓరుగల్లు ప్రభాసిల్లింది. 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ.. ఇంత గొప్ప విద్యాసంస్థను స్థాపించిన చందా కాంతయ్యను మనమంతా గుర్తుంచుకోవాలి. భారతదేశంలోని 65 శాతానికి పైగా ఉన్న యువతే భారత్‌కు పెద్ద బలం. వచ్చే 35 ఏళ్లపాటు ప్రపంచానికి అవసరమైన మానవవనరులను అందించే శక్తి సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయి. అయితే దీనికి కావాల్సిందల్లా అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడమే. దేశాభివృద్ధి నైతిక విలువల పునరుద్ధరణపైనే ఆధారపడి ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే ఈ రకమైన విద్యా విధానం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నా' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్, నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, రాజ్యసభ సభ్యు లు కెప్టెన్ లక్ష్మికాంత రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్, తదితరులు పాల్గొన్నారు. -
మరిన్ని సుప్రీం బెంచ్‌లు అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. బుధవారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘విభిన్న రంగాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. కక్షిదారుల వ్యయప్రయాసలను తగ్గించేందుకు, సత్వర న్యాయం అందే దిశగా, దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో సుప్రీం కోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలి. రాజకీయ నేతలపై క్రిమినల్ కేసుల విషయంలో వేగం అవసరం. ఫిరాయింపులకు పాల్పడినవారిపై పరిమిత కాలంలో నిర్ణయం తీసుకోవాలి. రాజ్యసభలో సభ సజావుగా జరగని సందర్భాల కంటే నిర్మాణాత్మక చర్చలను మీడియా చూపించాలి’ అని పేర్కొన్నారు. -
ఆలోచనలో మార్పు రావాలి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచార ఘటనపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి క్రూరమైన ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని అరికట్టడానికి చేయాల్సిన సూచనలపై చర్చను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకరం. హైదరాబాద్‌లో జరిగిన దుర్ఘటన అమానవీయం. మానవత్వం సిగ్గుపడే ఇలాంటి ఘటనలు ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. యావద్భారతంలో మహిళలు, యువతులు, చిన్నారులపై అత్యాచార ఘటనలను చూస్తున్నాం, వింటున్నాం. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చేయాలనేదానిపై చర్చించాలి. శిక్షలు విధించినప్పుడు కూడా అప్పీలు, క్షమాభిక్ష అంటూ ఏళ్ల తరబడి ప్రక్రియ నడుస్తోంది. ఇంతటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై క్షమాభిక్ష అంశం అనేది ఎవరైనా ఊహించుకుంటారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కేసు తమ పరిధిలో లేదంటూ పోలీసులు చెప్పిన కారణాలు సహేతుకం కాదు. పలు సందర్భాల్లో తప్పుచేసిన వారు జువైనల్ అని అంటున్నారు, హేయమైన నేరాలు చేయగలిగే వారికి వయసుతో ఏం సంబంధం ఉంటుంది. ఈ అంశంపై కూడా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చట్టం ఒక్కటే పరిష్కారం కాదన్నారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పురావాలని వెంకయ్య సూచించారు. దోషులను బహిరంగంగా శిక్షించాలి జయాబచ్చన్, ఎంపీ దిశ అత్యాచారం, హత్య లాంటి ఘటనల్లో దోషులను బహిరంగంగా కొట్టి చంపాలి. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. నేనే కాస్త కఠినంగా మాట్లాడుతున్నానని తెలుసు. అయినా అలాంటి నేరగాళ్లను బహిరంగంగా కొట్టి చంపడమే సరైంది. ఈ తరహా ఘటనలపై ఎన్నోసార్లు మాట్లాడా. నిర్భయ, కథువా, హైదరాబాద్‌లో జరిగిన ఘటనలపై ప్రజలు, ప్రభుత్వం నుంచి ఇప్పుడు కచ్చితమైన సమాధానాన్ని కోరుకుంటున్నా. రక్షణ కల్పించడంలో విఫలమైన అధికారులను దేశం ముందు తలదించుకునేలా చేయాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇటీవల ఓ అత్యాచార ఘటనలో కింది కోర్టు ఉరిశిక్ష విధిస్తే.. అప్పీల్‌కు వెళ్లిన దోషులు జీవితఖైదు పొందారని, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టాలు రూపొందించాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. హత్యాచార ఘటన జరిగిన 15–20 రోజుల్లోనే విచారించి దోషులను శిక్షించాలని ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి సూచించారు. టీఎంసీ ఎంపీ డా.సంతను సేన్, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, కాంగ్రెస్ ఎంపీ అమీ యాజ్నిక్, అన్నాడీఎంకే ఎంపీ విజలా సత్యనాథ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, డీఎంకే ఎంపీ పి. విల్సన్, కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ మాట్లాడారు. ఏకతాటిపైకి రావాలి గులాం నబీ ఆజాద్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు యావత్ దేశం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అత్యాచారం, హత్య ఘటనల నిరోధానికి చట్టాలు చేసినా, వాటి ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితిని కనిపించడం లేదు. మహిళలపై ఇలాంటి దాడులను ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ అధికారి కోరుకోరన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలు, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలన్నారు. -
ఆర్టికల్ 370 రద్దు.. ఉగ్రవాదం మటాష్!
సాక్షి, చెన్నై: ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలో వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఇప్పటిది కాదని, ఈ నిర్ణయం అమలు, దీని ప్రభావం విషయాల్లో తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దు జీవితంలో ఎంత ఎత్తకు ఎదిగినా.. నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎక్కడిని వెళ్లినా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం తనకు అలవాటని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానంపై ‘లిజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్’ పేరుతో వెంకయ్య పుస్తకం రాశారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వెంకయ్య నిర్వహించిన 330 ప్రజాకార్యక్రమాలతో పుస్తకాన్ని ప్రచురించారు. అమిత్ షాతోపాటు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డెమోక్రసి గుండెల్లో 370 బుల్లెట్!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడం వల్ల జరగబోయే పరిణామాలు, పర్యవసనాలేమిటీ? లాభ నష్టాలేమిటీ? అన్న అంశాలతోగానీ, ప్రభుత్వ ఎజెండాతోగానీ తమకు సంబంధం లేదని, అయితే ఇందుకోసం అనుసరించిన ప్రక్రియనే ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఉందని పలువురు ప్రజాస్వామ్య వాదులు విమర్శిస్తున్నారు. అటు కశ్మీర్ ప్రజల అభిప్రాయాలనుగానీ ఇటు మిగతా భారతీయుల అభిప్రాయంగానీ తెలుసుకోకుండా వ్యవహరించిన విధానం ముమ్మాటికి ప్రజాస్వామ్య విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ‘కేంద్ర బలగాలకు చెందిన 35 వేల మంది సైనికుల నిఘా మధ్య కశ్మీర్ ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి, వారి సెల్యులార్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ ఫోన్లను కట్ చేసి, ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసి, వారి నాయకులను గృహంలో నిర్బంధించడం ద్వారా ఆర్టికల్ 370 రద్దు బిల్లును తీసుకురావడం ఏమిటీ? కశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోకుండా, కేవలం రాష్ట్ర గవర్నర్ ఆమోదాన్ని తీసుకోవడం ఏమిటీ? ప్రజల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఏర్పాటయ్యే అసెంబ్లీ లేనప్పుడు, ప్రజల అభిప్రాయానికి ఎన్నికలతో సంబంధం లేని గవర్నర్ ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభలోనూ అంతే... ‘కొత్త చట్టానికి సంబంధించిన ఏ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టినా రెండు రోజుల ముందు సభ్యులకు నోటీసు ఇచ్చి ఆ బిల్లు ప్రతి సభ్యులకు అందజేయడం సభ సంప్రదాయం. ప్రజాభిప్రాయ సేకరణ కోసం అంతకు వారం ముందునుంచే ప్రజలకు అందుబాటులో ఉంచడం ఆనవాయితీ. సభా సంప్రదాయాలకు, ఆనవాయితీలకు తాను కట్టుబడి ఉంటానని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తొలినాళ్లలో పలుసార్లు చెప్పారు. మరి అలాంటిదేమీ లేకుండా అనూహ్యంగా బిల్లును సభలో ప్రవేశపెట్టడం, మొక్కుబడిగా చర్చకు అవకాశం ఇచ్చి, త్వరితగతిన బిల్లును ఆమోదించేసుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడవడం కాదా?’ -
రిపీట్ కావొద్దు; కేంద్రమంత్రికి వార్నింగ్!
న్యూఢిల్లీ : పార్లమెంటుకు హాజరు కాకుండా సభా సమయాన్ని వృథా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక సహాయ శాఖా మంత్రి సంజీవ్ కుమార్ బలయాన్‌పై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ తప్పిదం పునరావృతం కావొద్దని హెచ్చరించారు. బుధవారం నాటి ఎజెండాలో మంత్రి పేరు ఉన్నప్పటికీ ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సభాపతి స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...‘ మంత్రి గారు.. మొన్నటి ఎజెండాలో మీ పేరు ఉంది. కానీ మిమ్మల్ని పిలిచినపుడు అందుబాటులో లేరు. భవిష్యత్తులో ఇంకోసారి ఇలా చేయకండి’ అని బలయాన్‌తో వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన మంత్రి గైర్హాజరీ పట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కెబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం, మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు గానీ సభలో లేకపోవడం పట్ల మోదీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకానీ మంత్రుల పేర్లను తనకు అందజేయాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని ఆదేశించారు. -
‘రూపాయికే అంత్యక్రియలు’ భేష్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయుక్తంగా కుల, మతాలకు అతీతంగా అంతిమ సంస్కారాన్ని కేవలం రూపాయి ఖర్చుతో ముగించేలా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీకే) తీసుకున్న నిర్ణయానికి జాతీయ స్థాయిలో అభినందనలు లభిస్తున్నా యి. ఎవరైనా వ్యక్తి చనిపోతే వారి బంధువులు శ్మశానవాటికలో రూపాయి చెల్లించి రసీదు తీసుకుంటే అంతిమ సంస్కారానికి అవసరమైన సామగ్రిని అందించడం ఈ పథకం ఉద్దేశం. ఆఖిరి సఫర్ ముగిసిన తరువాత 50 మంది బంధువులకు రూ.5కే భోజన ఏర్పా ట్లు కూడా కార్పొరేషనే చేయనుంది. కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం ప్రకటించిన ఈ పథకం ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును ఆకర్షించింది. ఈ పథకం కోసం రూ.1.5 కోట్లు కేటాయించినందుకు మేయర్ రవీందర్‌సింగ్‌ను ట్విట్టర్ ద్వారా అభినందించారు. 50 మంది కుటుంబసభ్యులకు భోజన ఏర్పాట్లు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ పథకంపై స్పందిస్తూ కరీంనగర్ మేయర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. ఇది తమ ఆప్తులకు అంతిమ సంస్కారాలు చేసే పేదలకు ఎంతో ఉపశమనమని పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్‌తో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వేగంగా స్పందించారు. తక్షణమే మున్సిపాలిటీల్లో కరీంనగర్ తరహాలో ‘అంతిమ సంస్కారం’ పథకం అమలుకు ప్రయత్నించనున్నట్లు అరవింద్ కుమార్ పేర్కొన్నారు. కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎగ్జిట్ పోల్సే.. ఎగ్జాట్ పోల్స్ కాదు
సాక్షి, గుంటూరు : ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 1999 నుంచి వస్తోన్న ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకూ తప్పుడు సమాచారాన్నే ఇచ్చాయన్నారు. శాంతి విశ్వవిద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడైన ఆయనకు ఆదివారం గుంటూరులోని క్లబ్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 42 ఏళ్ల తర్వాత తొలిసారి తాను లేకుండా ఎన్నికలు జరిగాయన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినందున ఎగ్జిట్ పోల్స్ హడావుడి సహజమే అన్నారు. అయితే వీటికి ఎలాంటి బేస్ ఉండదని.. ఎగ్జాట్ పోల్స్ కోసం చూడాలని వెంకయ్య హితవు పలికారు. మే 23 న అసలైన ఫలితాలు వచ్చేవరకు గెలుపు పట్ల అన్ని పార్టీలు నమ్మకంగానే ఉంటాయన్నారు వెంకయ్య నాయుడు. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం అన్నింటికన్నా ప్రధానమన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉంటే.. ఎన్నికలు, అభ్యర్థులు, పార్టీల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాక నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధాకరమని, రాజకీయ నేతల భాష అభ్యంతరకరంగా తయారైందని.. రాజకీయాలు చాలా దిగజారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శత్రువులు కారని, వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం సరికాదని ఆయన సూచించారు. క్యారెక్టర్.. క్యాండిడేట్.. క్యాలిబర్.. కెపాసిటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో అభ్యర్థులకు ఓట్లు వేయాలి. కానీ ప్రస్తుత రాజకీయల్లో క్యాష్, క్యాస్ట్ ఆధారంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారని వెంకయ్యా నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కోట్లు ఖర్చు పెడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను మనమే అవహేళన చేసుకుంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉచిత విద్యుత్ సరికాదు..
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ లాంటి హామీల కంటే నిరంతర విద్యుత్ ఇవ్వడం ప్రయోజనకరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సంస్థ హైదరాబాద్‌లో ‘క్లీన్ అండ్ సేఫ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్’ అంశంపై తలపెట్టిన మూడ్రోజుల అంతర్జాతీయ సదస్సును వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించి ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర విద్యుదుత్పత్తిపై కాకుండా, ఉచిత విద్యుత్ మీద దృష్టి పెడుతున్నాయని, అది మంచిది కాదన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌తోనే ప్రజలకు మేలు అని వెంకయ్య అన్నారు. అభివృద్ధికి విద్యుత్ అవసరం దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోం దని వెంకయ్య తెలిపారు. వేగంగా సాగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దృష్ట్యా స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు, సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు, అంతర్జాతీయ సమాజం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అణుశక్తిని పెంచుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ఖర్చుతో లభించే అణుశక్తిని సమర్థమైన శక్తి వనరుగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం అణుశక్తి కర్మాగారాలు చౌకగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. కూడంకులం అణువిద్యుత్ యూనిట్–1 ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ ధర యూనిట్‌కి రూ.3 ఉంటుందని తెలిపారు. భారత్‌లో అణుశక్తి అభివృద్ధిలో డాక్టర్ హోమి జే బాబా కృషి ఎంతో ఉందన్నారు. ఆయన నిర్దేశించిన విధానంలో దేశం బలమైన 3 దశల అణు విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన పురోగతి సాధించిందని, తక్కువ ధర లో స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్.. ప్రస్తుతం దేశంలో స్వచ్ఛభారత్ ప్రభుత్వ కార్యక్రమం స్థాయి నుంచి ప్రజా ఉద్యమంగా మారిందని వెంకయ్య చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు మరింత అవగాహనను పెంపొందిచడంలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన భారత్ ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలంలో మనమంతా ప్రకృతితో ఆడుకున్నామని, ఇప్పుడు ప్రకృతి మనతో ఆడుకుంటోందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవటం మనందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు ఆర్.చిదంబరం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడు శిశిర్ కుమార్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ విద్యాభవన్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
సాక్షి, తిరుపతి : భారతీయ విద్యాభవన్ 29వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ... నేటి విద్యార్థులు రేపటి తరానికి భవిష్యత్తని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే భారతీయ విద్యాభవన్ ఎంతో గొప్పదని కీర్తించారు. ఉన్నతమైన సంకల్పంతో కె.ఎన్. మున్షీ భారతీయ విద్యాభవన్‌ను స్థాపించారని తెలిపారు. భారతీయ విద్యాభవన్‌కు టీటీడీ సహకారం అందించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్చుకోవాలని సూచించారు. స్వశక్తితో సొంతకాళ్లపై ప్రతి ఒక్కరూ నిలబడాలంటే విద్య ఎంతో అవసరమని అన్నారు. విద్యావిధానంలో మార్పుకోసం విద్యావేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
హ్యాపీ బర్త్‌డే మోదీజీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 68వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఆయనకు ప్రముఖ నేతలు, రాజకీయ ప్రత్యర్థులతో పాటు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు ట్విటర్లో ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక తన పుట్టిన రోజు వేడుకల్ని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఉన్నారు. ‘ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుస్సుతో, మరెంతో కాలం దేశ ప్రజల సేవకు ఆయన అంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని కోవింద్ ట్వీట్ చేశారు. మాల్టా పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారు. మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తన సందేశంలో రాహుల్ పేర్కొన్నారు. కొద్దిసేపు టీచర్ అవతారమెత్తిన మోదీ 68వ పుట్టినరోజు వేడుకల్ని తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ జరుపుకున్నారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించిన మోదీ దాదాపు 30 నిమిషాల పాటు పూజలు నిర్వహించారు. డెరెకా ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాల స్కూలు పిల్లలతో ముచ్చటించారు. టీచర్ అవతారమెత్తి వాళ్లకు పలు అంశాల్ని బోధించారు. ప్రశ్నించేందుకు విద్యార్థులు ఎన్నడూ భయపడవద్దని.. నేర్చుకోవడంలో అదే కీలకమని వారికి చెప్పారు. ‘విశ్వకర్మ జయంతి రోజున నేను మీ పాఠశాలకు వచ్చాను. ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరికీ శుభాకాంక్షలు’ అని ప్రధాని పేర్కొన్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో 568 కిలోల లడ్డూను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీలు ఢిల్లీలో ఆవిష్కరించారు. షికాగోలో 13,000 ఎత్తులో విమానం నుంచి దూకి మోదీకి శుభాకాంక్షలు చెబుతున్న స్కైడైవర్ శీతల్ మహాజన్ -
రాజ్యసభ ‘డిప్యూటీ’కి హోరాహోరీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం గురువారం జరగనున్న ఎన్నిక అధికార, విపక్షాల బల ప్రదర్శనకు వేదిక కానుంది. ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలుచేశారు. అనంతరం ఇరువురు అభ్యర్థులు తమదే విజయం అని చెబుతున్నా హోరాహోరీ తప్పేట్లు లేదు. హరివంశ్ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్ కాంగ్రెస్ తరపున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244. ఇందులో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు కనీసం 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం అధికార పార్టీ తమకు 126 మంది ఎంపీల బలముందని చెబుతోంది. విపక్ష కూటమి తమ వద్ద అవసరమైన ఎంపీల బలముందని పేర్కొంది. గెలుపు మాదంటే మాదే! కాంగ్రెస్‌కు తృణమూల్, డీఎంకే, వామపక్ష పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీలు తమ మద్దతు ప్రకటించాయి. విపక్ష కూటమికి సరిపోయేంత బలముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. హరిప్రసాద్ వంటి వ్యక్తికి పార్టీలకు అతీతంగా ఎంపీలు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రసవత్తరమైన పోటీ ఉంది’ అని కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ అన్నారు. అధికార కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తున్న శివసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కూటమి అభ్యర్థికే అండగా ఉంటామని అకాలీదళ్ తెలిపింది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్లుఎన్డీయే బలపరిచిన అభ్యర్థికే జై కొట్టనున్నట్లు తెలుస్తోంది. కూటముల బలాబలాలు బీజేపీ లెక్కల ప్రకారం హరివంశ్‌కు 91 మంది ఎన్డీయే ఎంపీల సంపూర్ణ మద్దతుంది. వీరితోపాటు ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్ సింగ్‌లు తోడున్నారు. ఎన్డీయేయేతర పక్షాలైన అన్నాడీఎంకే ఎంపీలు 13 మంది, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, ఏకైక ఐఎన్ఎల్డీ అభ్యర్థి మద్దతు తమకుందని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ కలిస్తే హరివంశ్ ఖాతాలోకి 115 ఓట్లు చేరతాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించడమే తమ కర్తవ్యమని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు అధికార పక్షానికి కీలకం కానుంది. వీరి మద్దతు దక్కితే 124 ఎంపీల బలంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలిచినట్లే. అటు విపక్షం కూడా తమ లెక్కలను స్పష్టం చేసింది. విపక్ష కూటమి అభ్యర్థికి 61 మంది యూపీఏ ఎంపీలు, 13 మంది ఎస్పీ, 13 మంది తృణమూల్ ఎంపీలతోపాటు ఆరుగురు టీడీపీ, ఐదుగురు సీపీఎం, నలుగురు బీఎస్పీ, నలుగురు డీఎంకే, ఇద్దరు సీపీఐ, ఒక జేడీఎస్ అభ్యర్థి మద్దతుంది. ఈ సంఖ్య మొత్తం 109. ఓ నామినేటెడ్ సభ్యుడు, మరో ఇండిపెండెంట్ ఎంపీ హరిప్రసాద్‌కు మద్దతిచ్చేందుకు సమ్మతించారు. దీంతో విపక్ష బలం 111కు చేరింది. అయితే, కరుణానిధి మృతి నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఢిల్లీకి వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది విపక్ష కూటమిని ఆందోళన పరుస్తోంది. ఇద్దరు ఎంపీలున్న పీడీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించింది. తమ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తే తమ ఎంపీలు విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు చెబుతామని ఆప్ ఎంపీలు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ ఎన్నికను చైర్మన్ వెంకయ్య నాయుడు తీర్మానం ద్వారా స్వీకరిస్తారు. ఇరువురు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ 9 నోటీసులు వచ్చాయని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి స్వీకరిస్తారు. ఇందులో మొదటిది తీర్మానాన్ని ప్రకటించాక.. అందులో పేర్కొన్న అభ్యర్థికి ఎందరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మూజువాణి ఓటుతో నిర్ణయిస్తారు. ఇందులో ఆ అభ్యర్థి గెలిస్తే ఆయన్ను డిప్యూటీ చైర్మన్‌గా ప్రకటిస్తారు. లేదంటే ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అయితే తీర్మానాల్లో మొదటిది ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ను ప్రతిపాదిస్తూనే ఉందని తెలుస్తోంది. -
వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి
కృష్ణాజిల్లా , గన్నవరం: దేశానికి వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు వంటివని, అటువంటి వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న గ్రామీణ ప్రజలంతా పట్టణాలకు వలస వెళ్తుండడం వల్ల భవిష్యత్‌లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని అదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆదివారం జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ రెండో వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించే విధంగా ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల్లో స్నేహభావంతో పాటు ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు. దేశ జనాభాలో 35 శాతం మంది ఉన్న యువతను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతోనే స్వర్ణభారత్ ట్రస్ట్‌ను స్థాపించడం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండానే ప్రైవేట్ సంస్థల సాయంతో నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ శిక్షణ, వైద్య సేవలను కూడా అందిస్తున్నట్లు వివరించారు. త్వరలో విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో ట్రస్టును స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలు, యువత, రైతుల ప్రాధాన్యతను గుర్తించి వారిలోని నైపుణ్యాభివృద్ధికి స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రముఖ సినీనటుడు వెంకటేష్ మాట్లాడుతూ కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించి ట్రస్ట్‌లో సేవాలందించాలని ఉందన్నారు. అనంతరం ఒమేగా హస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్, సీపీ గౌతమ్ సవాంగ్, పలువురు ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలుగు మహాసభలు ఆరంభ వేడుకలు
-
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుండాలని వేడుకున్నానని చెప్పారు. ఆయన వెంట మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
-
ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం
విజయవాడ: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నేడు స్వరాష్ట్రానికి వచ్చారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి వచ్చిన వెంకయ్యనాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. గవర్నర్ నరసిహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. -
ఉపరాష్ట్రపతిగా నేడు వెంకయ్య ప్రమాణం
-
ఆ పాపం బడాబాబులదే: వెంకయ్య
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండిబకాయిల పెరిగిపోవడానికి కారణం సంపన్న కార్పొరేట్లే తప్ప పేదలు కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తీసుకున్న రుణాల చెల్లింపులో పేదల ట్రాక్ రికార్డు చాలా మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అట్టడుగు వర్గాల వారిపై బ్యాంకులు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ‘బ్యాంకుల దృక్పథం మారుతోంది. ఇది మరింతగా మారాలి. అల్లయ్యలు.. మల్లయ్యలకే (మాల్యాలు) కాదు.. ఊళ్లల్లో .. చిన్న చిన్న పట్టణాల్లో ఉండే పుల్లయ్యలకు కూడా రుణాలివ్వడంపై దృష్టి పెట్టాలి. మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పేదల వల్ల రాలేదు.. దీనికి కారణం చాలా చాలా పెద్దోళ్లే. స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు 98–99 శాతం దాకా కట్టేస్తూనే ఉన్నారు‘ అని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ చట్టం రెరా అమలుకు అవసరమయ్యే యంత్రాంగాన్ని జూలై 30 నాటికల్లా సిద్ధం చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్లు నేషననల్ హౌసింగ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు. -
త్రిభాషా సూత్రానికి కట్టుబడి ఉన్నాం..
టీనగర్: కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రానికి కట్టుబడి ఉందని, అదే సమయంలో హిందీ నేర్చుకోమని ఎవరినీ బలవంతపెట్టమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మాతృభాష, ఆంగ్లంతోపాటు హిందీ నేర్చుకుంటే మంచిదని అన్నారు. తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌ను త్వరలో నియమిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. చెన్నైలో ఆదివారం రామానుజర్ సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా సమతా పాదయాత్ర , తమిళనాడు చలనచిత్ర వాణిజ్యమండలి, నిర్మాతల కౌన్సిల్, శ్రీరామచంద్ర యూనివర్సిటీలో 25వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్య చికిత్సలందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం టెలిమెడిసిన్ సెంటర్లు ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. అలాగే 24 గంటలపాటు ప్రజలు వైద్యులతో అందుబాటులో ఉండేందుకు నేషనల్ హెల్ప్‌లైన్ ఏర్పాటుకానున్నట్లు తెలిపారు. వర్సిటీ స్నాతకోత్సవంలో మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ బహూకరించారు. ఎంబీబీఎస్‌లో ఆల్‌రౌండ్ మెరిట్ సాధించిన డాక్టర్ ఉమా రవిశంకర్‌కు ఐదు గోల్డ్ మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ చాన్సలర్ వీఆర్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. -
2 లక్షల ఇళ్లకు రేపే ముహుర్తం
అందరికీ ఇళ్లు అనే పథకం కింద రెండు లక్షల అందుబాటులోని గృహాలు రేపు లాంచ్ కాబోతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో క్రెడాయ్ నిర్వహిస్తున్న అందుబాటులోని గృహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చేపట్టబోతున్నారు. అందరికీ అందుబాటులో గృహాలు అందించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తమ పదవిలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ డెవలపర్లు, వారి అసోసియేషన్లతో కలిసి ఈ పథకాన్ని చేపడుతోంది. అందుబాటులో గృహాలను ప్రమోట్ చేయడానికి కేంద్రప్రభుత్వం వివిధ రకాల చర్యలను కూడా చేపడుతోంది. బడ్జెట్ లో చౌక గృహాల నిర్మాణానికి మౌలిక హోదా కూడా కల్పించింది. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళుతుండటంతో, కనీసం చౌక గృహ నిర్మాణం వరకైనా మౌలిక హోదా ఇవ్వాలని స్థిరాస్తి సంఘాలు కోరడంతో బడ్జెట్ లో దీన్ని ప్రకటించింది. కాగ, అందుబాటులోని గృహాల గరిష్ట సైజు 643 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 900 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాకు సమానంగా ఉంటుంది. సిటీలు, ప్రాంతాల ఆధారంగా ఈ ప్రాజెక్టుల ధర రూ.12 లక్షల నుంచి రూ.35 లక్షలుగా ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలను కొనుగోలుదారులకు చేరేలా కృషిచేస్తామని క్రెడాయ్ పేర్కొంది. -
వెంకయ్య కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వ్యక్తులు ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు చట్టం తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని సూచించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మత ఛాందసవాదశక్తులతో చేతులు కలపబోమని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ మేన్ ఎంటర్ ప్రైజెస్ గా మారిందని దుయ్యబట్టారు. బీసీల కమిషన్ కు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు సంబంధించి త్వరలోనే పార్లమెంట్ లో బిల్లు పెడతామని వెల్లడించారు. బీఎస్పీ, ఎంఐఎం, సమాజ్ వాదీ పార్టీలో యూపీఏలో భాగమన్నారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, ప్రతిపక్షాలు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సూచించారు. అమాయకులకు శిక్ష పడరాదని, సత్యం బాబు కేసు విషయంలో పునః విచారణ చేపట్టాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. -
‘ఐదుసార్లు గెలవడం చిన్న విషయం కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాము ఎంపిక చేసిన యోగి ఆదిత్యనాథ్ సచ్ఛీలుడని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనను ఎవరూ వేలెత్తి చూపించలేరని పేర్కొన్నారు. ఒకే నియోజక వర్గం నుంచి ఐదుసార్లు గెలుపొందడడం మామూలు విషయం కాదన్నారు. గోరఖ్‌పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆదిత్యనాథ్ ఐదు పర్యాయాలు గెలిచిన సంగతి తెలిసిందే. కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలు ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం సరైందేనని వెంకయ్యనాయుడు అన్నారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బహిరంగంగా తనను ఆదిత్యనాథ్ కోరారని వెల్లడించారు. మీరు ముగ్గురు మంచి కాంబినేషన్ అవుతారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
వర్గీకరణ చేసి తీరుతాం : వెంకయ్య
-
వర్గీకరణ చేసి తీరుతాం
అప్పుడే మాదిగ కులాలకు న్యాయం ధర్మయుద్ధం మహాసభలో వెంకయ్యనాయుడు వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది మా ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం నేను ముందుండి నడిపిస్తా.. అవసరమైతే పోరాటం చేస్తా నోట్ల రద్దు సమస్య పెద్దగా లేదు ఉంటే ఈ సభకు ఇంతమంది వచ్చేవారే కాదు పార్లమెంట్లో వర్గీకరణపై బిల్లు పెడితే మద్దతు: సురవరం సాక్షి, హైదరాబాద్ ‘‘రాజ్యాంగం హక్కులు కల్పించినా మాదిగ కులాలకు ఆ ఫలాలు అందలేదు. దీంతో ఆ కులాలన్నీ ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనకబడ్డాయి. ఆ కులాలను ముందుకు తీసుకురావాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి. అందుకు బీజేపీ కట్టుబడి ఉంది. అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి. అయితే వర్గీకరణ అంశం సులువైంది కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లు పెట్టి చట్టాన్ని తీసుకురావాలి. ఈ ప్రక్రియను నేను ముందుండి నడిపిస్తా. అవసరమైతే పోరాటం చేస్తా..’’అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్సలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నేను మాట్లాడితే కొన్ని వర్గాలు నాపై కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి. దళిత కులాలను విభజిస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ నేను వర్గీకరణ ప్రక్రియను తప్పకుండా అమల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయాలన్న సందర్భంలో కొన్ని వర్గాలు హిందువులను విభజిస్తున్నారంటూ గోల చేశాయి. కానీ రిజర్వేషన్లు జరగకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అభివృద్ధి కొన్ని వర్గాలకే పరిమితమయ్యేది’’అని వెంకయ్య అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కులాల మధ్య గొడవలు పెట్టడం లేదని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేందుకు కృషి చేస్తుందని, ఇందులో రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘‘నెల్లూరుకు వాజ్‌పేయి వచ్చినప్పుడు నేను మైకు పట్టుకుని ప్రకటనలు చేశా.. కానీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను పార్టీ పెద్దగా ఆయన పక్కన కూర్చున్నా. నేనెప్పుడూ అంతటి స్థానం అందుకుంటానని ఊహించలేదు. వర్గీకరణ ప్రక్రియ అమల్లోకి వస్తే మాదిగ ఉపకులాల ప్రజలు కూడా అత్యున్నత స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నా. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా తీసుకొచ్చేందుకు అన్ని పార్టీల సమ్మతికి ప్రయత్నిస్తా. మాదిగ కులాల కలలను సాకారం చేస్తా. బిల్లుకు సరికొత్త రూపు తీసుకొస్తా’’అని చెప్పారు. నోట్ల సమస్య పెద్దగా లేదు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, దేశంలో ప్రతి అంశాన్ని సమూలంగా మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ క్రమంలోనే నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు పెద్దనోట్లను రద్దు చేశామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు సమస్య పెద్దగా లేదని, సమస్య ఉంటే ఇంతపెద్ద సంఖ్యలో ప్రజలు సభకు వచ్చేవారే కారన్నారు. దేశ ప్రజల ఆశలు త్వరలో ఫలిస్తాయని... ఒకేసారి వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పాసయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మాదిగ కులాలు చేస్తున్న వర్గీకరణ ఉద్యమం న్యాయమైందని, ఈ అంశంపై ప్రధానికి వివరిస్తానన్నారు. కేంద్ర సర్వీసుల్లో మాదిగ కులాలకు అన్యాయం జరుగుతోందని కొందరు తనను ప్రశ్నించారని, వర్గీకరణ అమలైతే ఈ సమస్య ఉండదని చెప్పారు. ఇప్పటికే ఆలస్యమైంది: సురవరం ఎస్సీల వర్గీకరణ ప్రక్రియ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, దీంతో మాదిగ ఉపకులాల్లో మూడు తరాలకు పైగా నష్టపోయాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిల్లు పెడితే దేశంలోని అన్ని వామపక్ష పార్టీలు మద్దతిస్తాయని ఆయన తెలిపారు. దళితులపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని, వీటిని ఆపేందుకు ప్రభుత్వాలు మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. వర్గీకరణకు మాల కులాలు మద్దతుగా నిలవాలని, దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటే ఇతర వర్గాలు లాభపడతాయని, దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్‌కు నాపై కోపం వచ్చినట్టుంది..: మందకృష్ణ ‘‘ఈ సభకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు పలుమార్లు ప్రయత్నించా. ఈ రోజు మధ్యాహ్నం కూడా ట్రై చేశా. కానీ అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులతో చాలా ప్రయత్నం చేశా. కానీ వీలు చిక్కలేదు. నాపై ఎందుకు ఇంతటి కోపాన్ని పెంచుకున్నారో అర్థం కావడంలేదు. తెలంగాణకు దళితుడ్ని సీఎంగా చేస్తానని ఆయన అన్నారు. ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడిగా. అందుకు ఆయనకు నాపై కోపం వచ్చినట్లుంది. కోపముంటే నాపై చూపాలి. కానీ మా మాదిగ కులాల ఆశయాలపై రుద్దొద్దు..’అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ఢిల్లీలో ఓ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పాదాభివందనం చేశా. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు చూశా. కానీ నాకు ఎవరి వద్ద బానిసత్వం చేయాల్సిన పనిలేదు. వర్గీకరణ కోసం గత 22 ఏళ్లుగా వెంకయ్యనాయుడు నాకు సలహాలు, సూచనలిస్తూ ముందుకు నడిపించారు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల అధ్యక్షులతో మద్దతుగా లేఖలు ఇప్పించారు. నా మాదిగ కులాల ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా’’అని పేర్కొన్నారు. వెంకయ్య తనకు పెద్దన్న లాంటివారని, ఆయనకు పాదాభివందనం చేస్తే తప్పులేదని అన్నారు. సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ పక్షనేత జానారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ పక్షనేత కిషన్‌రెడ్డి, ఎంపీలు నంది ఎల్లయ్య, ఆనంద్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలివచ్చారు. -
అందుకోసమే ఎన్డీటీవీని నిషేధించాం!
-
అందుకోసమే ఎన్డీటీవీని నిషేధించాం!
న్యూఢిల్లీ: హిందీ న్యూస్ చానెల్ ఎన్డీటీవీ ఇండియాపై ఒకరోజు నిషేధం విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ చానెల్‌పై నిషేధం విధించినట్టు పేర్కొంది. ‘ దేశ భద్రత, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే ఆ చానెల్‌ను ఒకరోజు ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేశారంటూ.. అందుకు శిక్షగా వచ్చే బుధవారం ఒకరోజుపాటు ప్రసారాలు నిలిపివేయాలని ఎన్టీటీవీని కేంద్రం ఆదేశించింది. 2008 ముంబై దాడుల నేపథ్యంలో దేశభద్రతను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇదివరకే ఉన్న నియమనిబంధనలు, సూత్రాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమే కానీ, ఇది కొత్తగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్య కాదని వెంకయ్య అన్నారు. ఈ విషయంలో రాజకీయ ప్రేరణతోనే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్టీటీవీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఎమర్జెన్సీ తర్వాత మీడియాపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అని ఎన్డీటీవీ యాజమాన్యం నిరసన తెలిపింది. -
వెంకయ్య నాలుకకు నరం లేదా?: నారాయణ
రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్వి కె. నారాయణ హర్షం వ్యక్తంచేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తాననడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుల్లో ఆదివారం సీపీఐ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి బస్సు యాత్రను జాతీయ కార్యదర్శి కె. నారాయణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అబద్దాల కోరు అని, ఆయనకు తనను విమర్శించే నైతిక హక్కులేదని అన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానన్న వెంకయ్య నాలుకకు నరం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆశలు, భ్రమలు కల్పించి మోసం చేయడం బీజేపీకే చెల్లిందన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. -
హోదా ఇచ్చే అవకాశం లేదు: వెంకయ్య
-
హోదా ఇచ్చే అవకాశం లేదు: వెంకయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాతో ప్రయోజనాలున్నాయని ఆయన అంగీకరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 14వ ఆర్థిక సంఘం సూచన మేరకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు. విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో కాంగ్రెస్ చేర్చలేదని తెలిపారు. విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయని చెప్పారు. విభజనతో జరిగిన ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని సరిదిద్దాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రత్యేక హోదాతో ప్రతి ఊరు ఆరు నెలల్లో హైదరాబాద్ అయిపోతుందని చేస్తున్న ప్రచారం సరికాదన్నారు. ప్రత్యేక హోదాతో ఏవైతే ప్రయోజనాలు కలుగుతాయే వాటిని ఏపీకి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. నూటికి నూరుశాతం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని హామీయిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇప్పటివరకు మంజూరు చేసిన సంస్థలు, ఆర్థిక ప్రయోజనాలను ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మరోసారి ఉటంకించారు. -
‘స్మార్ట్ గంగా సిటీ’ షురూ
న్యూఢిల్లీ: ‘స్మార్ట్ గంగా సిటీ’ కార్యక్రమాన్ని శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు, ఉజ్జయిని నుంచి జల వనరుల మంత్రి ఉమాభారతి ప్రారంభించారు. గంగానదీ పరీవాహక ప్రాంతాల్లోని పది నగరాలలో ఈ కార్యక్రమాన్ని తొలి విడతలో ప్రారంభించారు. మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలుచేయనున్నారు. తొలి విడతకు హరిద్వార్, రిషికేష్, మథుర, వారణాసి, కాన్పూర్, అలహాబాద్, లక్నో, పట్నా, షాహీబ్‌గంజ్, బారక్‌పూర్‌ను ఎంపిక చేశారు. ఈ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం 40 శాతం మూలధన నిధులు ఇవ్వనుంది. మిగతా 60 శాతం నిధులను 20 సంవత్సరాల్లో విడతల వారిగా ఇవ్వనున్నారు. గతంలో 70 శాతం మాత్రమే కేంద్రం భరించేదని ఇప్పుడు కేంద్రమే 100 శాతం నిధులను ఇస్తుందని ఉమ చెప్పారు. -
భావోద్వేగానికి గురైన మంద కృష్ణ
న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్ వద్ద జరిగిన మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడికి పాదాభివందనం చేసిన మంద కృష్ణ ధర్నాలో భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమంలోని ఆటుపోట్లను, కుట్రలను ఆయన వివరించారు. ‘తినడానికి తిండిలేని జాతి. ప్రయాణానికి ఖర్చులు లేని జాతి. ఎన్ని త్యాగాలు చేస్తే ఎన్ని బాధలు భరిస్తే ఈరోజు ఢిల్లీకి వేలాదిగా తరలిరాగలిగిందో అర్థం చేసుకోవాలి. మాదిగ జాతి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీదే.. మీరు వర్గీకరణకు సహకరించి మాకు మరో అంబేడ్కర్‌గా నిలవాలి..’ అంటూ వెంకయ్య నాయుడికి విన్నవించారు. వర్గీకరణపై ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తా: వెంకయ్య షెడ్యూలు కులాల వర్గీకరణ దిశగా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాన మంత్రికి వివరించినట్టు తెలిపారు. ‘మీ కోరిక అసాధారణమైనది కాదు. అన్యాయమైనదీ కాదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాల్సిందే. వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలతో ఈ అంశం మాట్లాడాను. అందరూ ఈ డిమాండ్ సహేతుకమని అన్నారు. వర్గీకరణపై అధ్యయనం జరుగుతోంది. ఒకసారి అడుగు ముందుకు పడితే మళ్లీ వెనక్కి రావడం ఉండదు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. దళితులపై దాడులు, ఇతర సమస్యలను రాజకీయ కోణంలో చూడకండి. ఇది సామాజిక రుగ్మత. కులాలను ఓటు బ్యాంకుగా చూడరాదు. సమాజంలో వెనకబడి, ఆఖరి వరుసలో ఉన్న వారిని ముందు పైకి తేవాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టడం సాధ్యం కాదు. నేను ఉత్తుత్తి హామీలు ఇవ్వను. ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని పార్టీలతో చర్చిస్తున్నాం. రాజకీయాలకతీతంగా వర్గీకరణ జరిగి తీరుతుందని నాకు నమ్మకం ఉంది..’ అని పేర్కొన్నారు. వర్గీకరణ వల్ల దళితుల్లోని 59 కులాలకు మేలు జరుగుతుందని, దీన్ని గ్రహించి మాలలు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. మావంతు ప్రయత్నం చేస్తాం... కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. ఎస్సీ వర్గీకరణ కోసం మావంతు ప్రయత్నం చేస్తాం. ఈ విషయమై ప్రధానితో మాట్లాడుతాను. యూపీఏ హయాంలో వర్గీకరణకు అనుకూలంగా ఉషామెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చినా వర్గీకరించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది. ఢిల్లీ గడ్డపై ఎవరూ సాహసించని, ఎవరూ చేయని దీక్షలు ఎమ్మార్పీఎస్ చేయగలిగింది.. ఈ దీక్షలు ఫలితాన్ని ఇస్తాయి..’ అని పేర్కొన్నారు. మాదిగలకు మంద కృష్ణ మాదిగ దేవుడిచ్చిన వరమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. వర్గీకరణ చేస్తే బీజేపీ వెంట నిలబడతామని హర్యానా వర్గీకరణ ఉద్యమ నేత స్వదేశ్ కబీర్ పేర్కొన్నారు. వర్గీకరణతోనే మాదిగలకు స్వాతంత్య్రం లభిస్తుందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ మహాధర్నాకు ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగాటి సత్యం సభాధ్యక్షత వహించగా జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు, నేతలు మందకుమార్, నాగయ్య, బ్రహ్మయ్య, బి.ఎన్.రమేశ్, కోళ్ల వెంకటేశ్, తీగల ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది మనువాదుల కుట్ర: చెన్నయ్య
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలను వర్గీకరించేందుకు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, మనువాదులు కుట్ర పన్నారని మాల మహానాడు-టీఎస్ జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. దళితులపై బీజేపీ హయాంలోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. బుధవారం ఇక్కడి జంతర్‌మంతర్‌లో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. బీజేపీ మనువాద కుట్రలతో, విభజించు-పాలించు అన్న సూత్రంతో లబ్ధిపొందాలని చూస్తోందని ఆరోపించారు. వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని బీజేపీ కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఆ దిశగా కేంద్ర మంత్రులు ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆధిపత్య కులాల ఆధీనంలో రాజకీయ అధికారం ఉన్నంత కాలం పీడిత వర్గాలకు న్యాయం జరగదని చరిత్ర నిరూపించిందని ఆందోళన వ్యక్తంచేశారు. గోసంరక్షణ పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశంలో దళితులపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 21వ రోజుకు చేరింది. -
ప్రత్యేక హోదా సర్వరోగ నివారిణి కాదు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే, అయినంతమాత్రాన అది సర్వరోగ నివారిణి కాదు, సంజీవని అంతకంటే కాదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఆదివారం ఆయన కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారతి ట్రస్టులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో ప్రత్యేక హోదా అంశంపై ఆచితూచి మాట్లాడారు. ఈ విషయంలో తనపై వచ్చే విమర్శలకు జవాబు చెప్పబోనని అంటూనే ప్రస్తుతం జరుగుతున్న చర్చకు వివరణ ఇచ్చారు. ఆర్థిక సంఘం ప్రతిపాదనలతో సందిగ్ధత నెలకొని ప్రత్యేకహోదా సమస్య తలెత్తిందన్నారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కేవలం హోదా వల్లే అంతా జరిగిపోతుందని భావించకూడదన్నారు. ఇప్పటికే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని, రాష్ట్రానికి పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలను మంజూరుచేసిందని చెప్పారు. విభజనతోపాటే హోదా కూడా చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ప్రత్యేక హోదా సమస్య తలెత్తి ఉందేది కాదని చెప్పారు.దేశమంతటా ఒకే విధంగా పన్నుల విధానాన్ని అమలు చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందుతుందని తాను భావిస్తున్నానన్నారు. తిరంగా యాత్ర భావితరాలకు దేశభ క్తిని ప్రబోధించేందుకు, స్వాతంత్య్రోద్యమ చారిత్రక ఘాట్టాలను గుర్తు చేస్తూ ఆగస్టు 15 నుంచి తిరంగాయాత్రను దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు వెంకయ్య చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 9వ తేదీన మధ్యప్రదేశ్‌లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన ప్రదేశం నుంచి ప్రారంభిస్తారని చెప్పారు. మీడియా సమావే శంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వెంకయ్యకు ఎయిర్ ఇండియా క్షమాపణ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకు ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ) క్షమాపణ చెప్పింది. ఆయన ప్రయాణించాల్సిన విమానం ఆలస్యం కావడంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం ఆయన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అయితే పైలట్ ఆలస్యంగా రావడంతో ఆయన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. ఎయిర్ ఇండియా నిర్వాకంతో ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని ట్విటర్ ద్వారా వెంకయ్య వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంపై విచారం వ్యక్తం చేసింది. పైలట్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో సమయానికి ఎయిర్ పోర్టుకు రాలేకపోయాడని ఏఐ అధికార ప్రతినిధి తెలిపారు. 'గుర్గావ్, సెక్టార్ 21లో నివసిస్తున్న పైలట్ ను తీసుకురావడానికి ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 9.45 గంటలకు కారు పంపించాం. ట్రాఫిక్ చిక్కుపోవడంతో మరో కారు చూసుకోవాలని పైలట్ కు కారు డ్రైవర్ ఫోన్ చేశాడు. పైలట్ మరో వాహనంలో ఎయిర్ పోర్ట్ కు బయలు దేరాడు. అయితే అతడు కూడా ఢిల్లీ-గుర్గావ్ మార్గంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. ట్రాఫిక్ జామ్ కారణంగానే పైలట్ ఆలస్యంగా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడ'ని ఏఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
బాబు, వెంకయ్యల నైతిక ఓటమి : కత్తి పద్మారావు
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడకపోవడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేదని, ఈ విషయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైతికంగా ఓటమి చెందారని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు నేడు కేంద్రంలో కీలక పాత్రలో ఉండి మొండిచెయ్యి చూపించడం ఆశ్యర్యానికి గురిచేస్తుందన్నారు. తెలుగుజాతిని ఐక్యం చేసి అఖిలపక్షంలో పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉందన్నారు. వామపక్ష సభ్యులందరూ తెలుగువారే అయినప్పటికీ, వారందర్నీ కలుపుకొని పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎందుకు యుద్ధంచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనేక సందర్భాల్లో వామపక్షాలతో జతకట్టిన చంద్రబాబు ఇప్పుడెందుకు వారితో కలిసి వెళ్లరని ప్రశ్నించారు. విపక్ష ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడంతో అపకీర్తిపాలైన చంద్రబాబు ప్రత్యేకహోదా రాకపోవడంతో చరిత్రహీనుడయ్యే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ ప్రాంతీయ, కుల, మతాలను రెచ్చగొడుతుందని, అందులోభాగమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమన్నారు. ఇందులో మొదటి ముద్దాయి వెంకయ్యనాయుడు కాగా, రెండవ ముద్దాయి చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పనిసరిగా ఇవ్వాలని, అన్ని రాజకీర పార్టీలు ఈ డిమాండ్‌ను కొనసాగించాలని పద్మారావు సూచించారు. -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై చర్చ
హైదరాబాద్: కేంద్ర న్యాయ శాఖ, హోం శాఖ, శాసనసభ కార్యదర్శులతో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశంపై చర్చించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో 225, తెలంగాణలో 153 వరకు శాసన సభ స్ధానాలను పెంచే విషయంపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా చర్చించి నట్టు వెంకయ్య తెలిపారు. తెలంగాణ నుంచి స్థానాల పెంపుపై కరీంనగర్ ఎంపీ వినోద్ సోమవారం తనతో సమావేశమైనట్టు వెల్లడించారు. 2026 వరకు సీట్ల పెంపు అవసరం లేదంటే విభజన చట్టంలోని సెక్షన్ 26 లో సీట్ల పెంపుపై పేర్కొనాల్సిన అవసరం లేదన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఈ వ్యవహారంపై చర్చిస్తున్నామని వెంకయ్య నాయుడు తెలిపారు. బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో సీట్ల పెంపు బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. న్యాయ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని హోంశాఖకు నివేదిస్తుందన్నారు. సవరణ బిల్లును హోంశాఖ పార్లమెంట్ ముందకు తీసుకొస్తుందని వివరించారు. వీలైనంత త్వరగా సవరణ బిల్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
కాంగ్రెస్ మొండివైఖరిపై ఎన్డీఏ ప్రచారం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్ ను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యసభను స్తంభింపజేస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ తీరుపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని మోదీ సర్కారు భావిస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం పంజాబ్, జమ్మూకశ్మీర్ ఎంపీలతో సమావేశమయ్యారు. శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ మొండివైఖరిపై ప్రచారం నిర్వహించాలని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలను వెంకయ్య కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేనందున కీలక బిల్లులు పాసవకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని, ప్రధాన విపక్షం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలిపాయి. -
'ప్రత్యేక హోదా కావాలని నేనూ కోరుకుంటున్నా'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాను కూడా ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని శుక్రవారం లోక్ సభలో చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని వెల్లడించారు. దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిల్లో పెట్టుకుని రాష్ట్రాలు వ్యవహరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉన్నందునే ప్రత్యేక హోదా అడుగుతున్నామని వివరించారు. -
'ఉమ్మడి పౌరస్మృతి ఉండాలన్నారు'
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కృషి ఎనలేనిదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా శుక్రవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అంబేడ్కర్ అస్పృశ్యత, అసమానతలపై పోరాటం చేశారని పేర్కొన్నారు. స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమని ఉద్బోధించారని గుర్తు చేశారు. సామాజికంగా, నైతికంగా ప్రజలు ఎదగాలని ఆయన కోరుకున్నారన్నారు. మనుషులంతా సత్ప్రవర్తనతో మెలగాలని, విద్యతోనే అది అలవడుతుందని రాజ్యాంగ నిర్మాత భావించారని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అంబేడ్కర్ గట్టిగా ఆకాంక్షించారని అన్నారు. -
వారి వ్యాఖ్యలపై వెంకయ్య అభ్యంతరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షిద్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పందించారు. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం, జాతిని అవమానించేలా ఉన్నాయని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ పట్ల ఎన్డీఏ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని ఖుర్షిద్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ తో చర్చలు పునరుద్ధరిస్తే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించాలని అయ్యర్ అన్నారు. వీరి వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పొరుగు దేశానికి అనుకూలంగా మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఎన్నికైన స్వదేశీ ప్రధానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం జాతిని అవమానించడమేనని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ వ్యాఖ్యలను ఖండించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. -
పటేల్‌కు న్యాయం జరగలేదు
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు చరిత్రలో న్యాయం జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘దేశ సమైక్యతకు, సంస్థానాల విలీనానికి, స్వాతంత్య్రానంతరం దేశంలో శాంతి నెలకొల్పేందుకు పటేల్ చేసిన కృషిని నేడు దేశం స్మరించుకుంటోంది. దేశ తొలి ప్రధానిగా పటేల్ అయి ఉంటే దేశ ప్రగతి వేరేలా ఉండేదని దేశ ప్రజల భావన. పటేల్ పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరం. చరిత్రలో చాలా మంది నాయకులకు తగిన గుర్తింపు లభించలేదు. దేశం కోసం కృషిచేసిన నాయకులను దేశానికి ప్రస్తుతం తెలియపరుస్తున్నాం..’ అని పేర్కొన్నారు. ‘సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు కాదు. ఆయన జాతీయ నాయకుడు. పటేల్ జయంతిని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది..’ అని పేర్కొన్నారు. -
శ్రీలంక తమిళులకు శాశ్వత పరిష్కార ం
టీనగర్: శ్రీలంక తమిళులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కె.వెంకయ్య నాయుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమం అంటూ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడు శనివారం చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీలంక తమిళుల సమస్యలో శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని దీనికి సంబంధించి ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. అక్కడ శాశ్వత పరిష్కారం లభించాలంటే రాజీవ్-జయవర్దనే ఒప్పందం ప్రకారం 13వ చట్ట సవరణను శ్రీలంకలో పూర్తిగా అమలు జరపాలన్నారు. అలా జరిగిన పక్షంలో అక్కడి తమిళులు సమాన హక్కులు, హోదాతో జీవించే ఆస్కారం ఉంటుందన్నారు. అం దువల్ల 13వ చట్ట సవరణను ఖచ్చితంగా అమలు జరపాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నారు. భారత జాలర్ల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. శ్రీలంకలో జరిగిన యుద్ధ నేరాల గురించి అంతర్జాతీయ విచారణ జరపాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి ప్రస్తుతం చెప్పలేమని, తగిన సమయంలో మోడీ సరైన నిర్ణయాన్ని తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ మొసలి కన్నీరు: రైతు సంక్షేమం పేరిట కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని వెంకయ్య నాయుడు విమర్శించారు. ఇటీవలి ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతమైందని, విదేశీ పారిశ్రామికవేత్తలు పలువురు దేశంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. దీంతో దేశంలో పారిశ్రామికాభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అదే విధంగా అనేక మంది స్వదేశీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు జరుపుతోందన్నారు. వారి పరిశ్రమల స్థాపనకు విస్తారమైన స్థలాలు కావాలని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఆసక్తితో ఉందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి అడ్డుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆంధ్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో వ్యవ సాయ భూములను ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకున్నారన్నారు. అటువంటి కాంగ్రెస్ నే డు రైతుల కోసం మొసలికన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపొందుతుందని, సేతు సముద్ర పథకాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. -
సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
నెల్లూరు : ప్రత్యేక హోదా అంశం ఇంకా కేంద్ర పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పరిశ్రమలకు రాయతీ తదితర అంశాలపై నీతి ఆయోగ్ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను వెల్లడిస్తామన్నారు. -
నేను లేకుంటే మీకు దిక్కేలేదు
-
నేను లేకుంటే మీకు దిక్కేలేదు
కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ వెంకయ్యనాయుడు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా, ఏకపక్షంగా విభజించారు. ఒక రాష్ర్ట ప్రజల గొంతుకోశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదు. వెంకయ్యనాయుడును అడ్డుకుంటామని అంటున్నారు. నేను లేకుంటే మీకు దిక్కే లేదు. నేను ఇక్కడి ఎంపీని కాదు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాలేదు. భవిష్యత్‌లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయను. కానీ తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే మాట్లాడుతున్నా. నేను రాష్ట్రానికి వస్తే ఓ ప్రాజెక్టు వస్తుంది. నేను రాకపోతే ఏమిరాదో వారికే తెలుసు’’ అని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అంకురార్పణ చేశారు. శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుండగా కొందరు యువకులు ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు చేశారు. ‘దయచేసి నినాదాలివ్వొద్దు’ అంటూ అసహనం వ్యక్తం చేసిన ఆయన ఆ సందర్భంలోనే పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం తాము పదవిలోకి వచ్చి 15 నెలలు మాత్రమే అయ్యిందని, ఈ కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామనీ, అయినప్పటికీ ఇంకా ఏదో చేయలేదంటూ కాంగ్రెస్ తీవ్ర రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోను తీసుకొస్తామని చెప్పారు.అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా విషయం చర్చలో ఉందని, తుది నిర్ణయం కోసం అనేక రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఏ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. మోదీ మెడలు వంచుతారా.. అదేం భాష.. అన్నిదేశాల అధిపతులు, ప్రపంచమంతా మోదీని కీర్తిస్తుంటే.. మోదీ మెడలు వంచుతామంటూ ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విశ్వగురు చేయాలన్న లక్ష్యంతో మోదీ ప్రపంచ దేశాలు తిరుగుతుంటే ‘టూరిస్ట్ మోదీ’ అని ఆక్షేపిస్తున్నారని విమర్శించారు. ప్రధానంటే నూతిలో కప్పలా ఒకేచోట కూర్చుని అరుస్తుండాలా? అని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే వారసత్వం కాదనీ, జవసత్వాలు కావాలని కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ స్టేట్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. త్వరలో విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మిస్తామని, వాటి నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా గ్రూపు మహిళలకు అప్పగిస్తామని చెప్పారు. వచ్చే పంద్రాగస్టుకల్లా ప్రతి స్కూల్లో టాయిలెట్లు: స్మృతి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం రూ.మూడు వేల కోట్లను మంజూరు చేసిందని, తాడేపల్లిగూడెంలోని నిట్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఉన్నత సాంకేతిక విద్య చదువుకున్న విద్యార్థులు రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే పంద్రాగస్టు నాటికి దేశంలోని ప్రతి స్కూల్లోనూ మగపిల్లలు, ఆడపిల్లలకు విడివిడిగా టాయిలెట్లు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయమై చొరవ తీసుకుని 100 శాతం విజయం సాధించాలని కోరారు. -
ఊసులన్నీ చెబుతాడు... కానీ
ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు వారికే కాదు దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దేశప్రజలకు పరిచయం అక్కర లేకుండానే తెలిసిన పేరు. ఇంకా చెప్పాలంటే 'కమల దళపతుల్లో' తలలో నాలుక. వాజ్‌పేయి... నరేంద్ర మోదీ... ఇలా ఎవరు ప్రధానిగా ఉన్నా వెంకయ్య మాత్రం ఆయా ప్రభుత్వాల్లో వాషింగ్ పౌడర్ 'వీల్ చక్రం' కంటే స్పీడ్‌గా తన హవాను కొనసాగిస్తారు. దాంతో వెంకయ్యే కమలనాధులకే నాధుడుగా మారిపోయారని ఆ పార్టీలోని వర్గాలు సీరియస్‌గా చెప్పుకుంటారు. అయితే వెంకయ్య ఎక్కడ ఏ సభలో అయినా... వేదిక ఎక్కి ఏ అంశంపై ప్రసంగం మొదలు పెట్టినా... అక్కడ ఆసీనులైన పెద్దలే కాదు.... సభకు వచ్చిన చిన్న చితక మొత్తం ఆయన ఊదే 'నాద స్వరం' కి తలకాయలు తాటికాయల్లా ఊపాల్సిందే. అంతటి వాక్ పటిమ గల మాటల ఘనాపాటి వెంకయ్య. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్ని దేశాలు తిరిగారు.... ఆయా దేశాల నుంచి భారత్‌కు ఎలా లబ్ది చేకూరుతోంది.... సదరు దేశాలు మన దేశంలో ఎన్ని కోట్ల రూపాయిల్లో పెట్టుబడులు పెడుతున్నాయో అంకెలతో సహా వివరించ గల సత్తా ఉన్న నేత. మోదీ వాక్ ప్రవాహంలో పడి భారత ప్రజలు ఆయన్ని ప్రధాని పీఠం ఎక్కిస్తే.. వెంకయ్య వాగ్ధాటికి ముగ్దుడైన మోదీ మాత్రం ఆయనకి అత్యంత కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను ఏరి కోరి కట్టబెట్టారు. ఈ విషయం అందరికి తెలిసందే. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన సందర్భంగా వెంకయ్య ..రైల్వే జోన్... ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు వేగం పెంపు.... అవీ ఇవీ అన్నీ తెస్తామని ఊసులు చెప్పారు. కానీ ప్రత్యేక హోదాపై మాత్రం ఒక్క ముక్క మాట్లాడలేదు. అయితే పార్లమెంట్లో విభజన బిల్లు చర్చ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ అయిదేళ్లంటే...కాదు కాదు పదేళ్లంటూ చెప్పిన నాటి ప్రతిపక్షంలోని వెంకయ్య...అధికారంలోకి వచ్చాక ఆయన ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎన్ని సెటైర్లు వేసిన కూడా ప్రత్యేక హోదా అంశంపై మాత్రం వెంకయ్య ఏమీ స్పందించకుండా ...ఒకటో క్లాస్ పిల్లోడులా నోటి మీద వ్రేలు వేసుకోకుండా వైట్ అండ్ వైట్ డ్రస్‌లో గుడ్ బాయిలా కనిపిస్తుంటారు. అయినా ప్రత్యేక హోదా తన సొంత రాష్ట్రానికి తీసుకురావాలంటే వెంకయ్య తలుచుకుంటే ఎంత పని... కానీ ఆయన తలుచుకోవడమే లేదు. అంతే.