వారి వ్యాఖ్యలపై వెంకయ్య అభ్యంతరం | comments made by Aiyar and Khurshid are highly objectionable: Venkaiah | Sakshi
Sakshi News home page

వారి వ్యాఖ్యలపై వెంకయ్య అభ్యంతరం

Published Wed, Nov 18 2015 2:32 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

వారి వ్యాఖ్యలపై వెంకయ్య అభ్యంతరం

వారి వ్యాఖ్యలపై వెంకయ్య అభ్యంతరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షిద్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పందించారు. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం, జాతిని అవమానించేలా ఉన్నాయని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పాకిస్థాన్ పట్ల ఎన్డీఏ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని ఖుర్షిద్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ తో చర్చలు పునరుద్ధరిస్తే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించాలని అయ్యర్ అన్నారు. వీరి వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పొరుగు దేశానికి అనుకూలంగా మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఎన్నికైన స్వదేశీ ప్రధానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం జాతిని అవమానించడమేనని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ వ్యాఖ్యలను ఖండించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement