
‘ఐదుసార్లు గెలవడం చిన్న విషయం కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాము ఎంపిక చేసిన యోగి ఆదిత్యనాథ్ సచ్ఛీలుడని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనను ఎవరూ వేలెత్తి చూపించలేరని పేర్కొన్నారు. ఒకే నియోజక వర్గం నుంచి ఐదుసార్లు గెలుపొందడడం మామూలు విషయం కాదన్నారు. గోరఖ్‌పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆదిత్యనాథ్ ఐదు పర్యాయాలు గెలిచిన సంగతి తెలిసిందే.
కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలు ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం సరైందేనని వెంకయ్యనాయుడు అన్నారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బహిరంగంగా తనను ఆదిత్యనాథ్ కోరారని వెల్లడించారు. మీరు ముగ్గురు మంచి కాంబినేషన్ అవుతారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.