టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో డీప్‌ఫేక్ (Deepfake) మహమ్మారిలా వ్యాపిస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ డీప్‌ఫేక్ బారిన పడ్డారు. డీప్‌ఫేక్ బారినపడ్డ ప్రముఖుల జాబితాలోకి తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' కూడా చేరారు.
డయాబెటిస్ మెడిసిన్‌ను 'ఆదిత్యనాథ్' ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో వైరల్ అయిన తర్వాత, ఈ వీడియోకు కారణమైన ఫేస్‌బుక్ ఖాతాపై ఐపీసీ 419, 420, 511 సెక్షన్స్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ప్రముఖులకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ యాక్టర్స్ రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్‌లకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment