డీప్‌ఫేక్ వీడియోలు తెరమీదకు వచ్చిన సంఘటనలో గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పెట్టుబడి పథకాలను ఆర్‌బీఐ తీసుకొస్తున్నట్లు, అలాంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు వీడియోలో ఉండటం గమనార్హం. ఈ వీడియోలో ఏ మాత్రం నిజం లేదని, దీనిని ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసారని, ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలు: నిర్మలా సీతారామన్
ఆర్‌బీఐ ఎప్పుడూ పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇవ్వదు, కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలను నిజమని నమ్మితే తప్పకుండా మోసపోతారు. డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు.. ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
RBI cautions public on deepfake videos of Top Management circulated over social media giving financial advicehttps://t.co/bH5yittrIu
— ReserveBankOfIndia (@RBI) November 19, 2024
Comments
Please login to add a commentAdd a comment