భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) తన నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు చేరువవుతోంది. తాజాగా ఎస్‌బీఐ తన ముంబైలోని ప్రధాన కేంద్రం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.
ముంబైలో జరిగిన ఎస్‌బీఐ 100వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' మాట్లాడుతూ.. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IBI)గా ఏర్పాటు చేశారు. 1955 సంవత్సరంలో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22,500 శాఖలను కలిగి ఉంది. ఈ సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 23వేలుకు చేరుతుందని సీతారామన్ పేర్కొన్నారు. అంటే మరో 500 ఎస్‌బీఐ కొత్త శాఖలు ఏర్పాటు అవుతాయని స్పష్టం చేశారు. 1921లో ఎస్‌బీఐ కేవలం 250 శాఖలను మాత్రమే కలిగి ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య 90 రెట్లు పెరిగింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 65,000 ఏటీఎంలను కలిగి ఉంది. ఎస్‌బీఐకు 50 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఎస్‌బీఐ వాటా 22.4 శాతంగా ఉంది. అంతే కాకుండా రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని తెలుస్తోంది.
SBI today has 22,500 branches and is expected to add another 500 in this financial year.
SBI has 65,000 ATMs which is 29% of all ATMs in the country, has 85,000 banking correspondents, share of its deposits are 22.4 per cent of total deposits, has 50 crore plus customers,… pic.twitter.com/lPF3FShDua— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) November 18, 2024
Comments
Please login to add a commentAdd a comment