branches
-
ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలు: నిర్మలా సీతారామన్
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) తన నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు చేరువవుతోంది. తాజాగా ఎస్బీఐ తన ముంబైలోని ప్రధాన కేంద్రం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.ముంబైలో జరిగిన ఎస్బీఐ 100వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' మాట్లాడుతూ.. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IBI)గా ఏర్పాటు చేశారు. 1955 సంవత్సరంలో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిందని గుర్తు చేశారు.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22,500 శాఖలను కలిగి ఉంది. ఈ సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 23వేలుకు చేరుతుందని సీతారామన్ పేర్కొన్నారు. అంటే మరో 500 ఎస్బీఐ కొత్త శాఖలు ఏర్పాటు అవుతాయని స్పష్టం చేశారు. 1921లో ఎస్బీఐ కేవలం 250 శాఖలను మాత్రమే కలిగి ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య 90 రెట్లు పెరిగింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 65,000 ఏటీఎంలను కలిగి ఉంది. ఎస్బీఐకు 50 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఎస్బీఐ వాటా 22.4 శాతంగా ఉంది. అంతే కాకుండా రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను ఎస్బీఐ నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని తెలుస్తోంది.SBI today has 22,500 branches and is expected to add another 500 in this financial year. SBI has 65,000 ATMs which is 29% of all ATMs in the country, has 85,000 banking correspondents, share of its deposits are 22.4 per cent of total deposits, has 50 crore plus customers,… pic.twitter.com/lPF3FShDua— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) November 18, 2024 -
ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సీఎస్ శెట్టి.. ఎస్బీఐ అభివృద్ధికి పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 600 బ్రాంచ్‌లు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.ఎస్బీఐ కొత్త శాఖలను పెద్ద రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లతో సహా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ గత ఆర్ధిక సంవత్సరంలో 137 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించింది. ఇందులో 59 గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.2024 మార్చి నాటికి ఎస్బీఐ దేశంలో 22,542 శాఖలను, 65,000 ఏటీఎంలను, 85,000 బిజినెస్ కరస్పాండెంట్లను కలిగి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి అనుకున్న విధంగా అన్నీ సక్రమంగా జరిగితే ఎస్బీఐ శాఖల సంఖ్య 23,142కు చేరుతుంది. ఎస్బీఐకు ప్రస్తుతం 50 కోట్ల కంటే ఎక్కువ ఖాతాదారులు ఉన్నట్లు సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రతి భారతీయ కుటుంబానికి మేము బ్యాంకర్ అని చెప్పడానికి మేము గర్విస్తున్నామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత్ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్ఐడిపాజిటర్ల కోసం కొత్త ప్లాన్స్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిపాజిటర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్, రికవరింగ్ డిపాజిట్స్, సిప్ పెట్టుబడుల కాంబోతో ఓ కొత్త సర్వీస్ తీసుకురావాలనే ఆలోచనలో ఎస్బీఐ ఉన్నట్లు సీఎస్ శెట్టి వెల్లడించారు. ఈ ఆవిష్కరణలు మొత్తం యువ కస్టమర్లను, ముఖ్యంగా Gen Z తరాన్ని ఆకర్షించడానికి ఉద్దేశించినట్లు ఇటీవల పేర్కొన్నారు. -
ఐఐటీల్లో అరుదైన కోర్సులు (ఫోటోలు)
-
దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు: ఎస్బీఐ
నెట్వర్క్ విస్తరణ ప్రణాళికలో భాగంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 శాఖలను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన ఎస్బీఐ గత ఆర్థిక సంవత్సరంలో 137 శాఖలను ప్రారంభించింది. ఇందులో 59 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.ఎస్బీఐ బ్రాంచ్‌లో 89 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నప్పటికీ కొత్త శాఖల అవసరమా అని కొందరు ప్రశ్నించినప్పుడు.. బ్యాంకింగ్ సర్వీసులో కొత్త విభాగాలు పుట్టుకొస్తున్న సమయంలో కొత్త శాఖల అవసరం చాలా ఉందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా స్పష్టం చేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమున్న ప్రదేశాలను గుర్తిస్తామని, అక్కడ కొత్త శాఖలు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని దినేష్ కుమార్ ఖరా అన్నారు. ఇందులో భాగంగానే 400 శాఖలు ప్రారభించనున్నట్లు పేర్కొన్నారు. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉందని స్పష్టం చేశారు. -
అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్‌లు క్లోజ్!
అగ్రరాజ్యం అమెరికాలో రికార్డ్ స్థాయిలో బ్యాంక్ శాఖలు మూత పడుతున్నాయి. అక్కడి బ్యాంకులు గత నెలలో ఒక్క వారంలో 37 బ్యాంచ్‌లను మూసివేయడానికి అనుమతి కోరాయి. మూసేస్తున్న బ్యాంచ్లలో మూడింట రెండు వంతులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, టీడీ బ్యాంక్, కీబ్యాంక్ శాఖలే ఉన్నాయి. అమెరికాలో బ్రాంచ్‌లను మూసేస్తున్న బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు వరుసలో నిలిచింది. ఇది గత సంవత్సరం దాదాపు 160 శాఖలను మూసేసింది. 2024 మొదటి నెలలోనే 30 బ్రాంచ్‌లు మూసేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ధోరణి ఇంతటితో తగ్గేలా కనిపించడం లేదు. యూఎస్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ‘ఆఫీస్ ఆఫ్ ద కంప్ట్రోలర్ ఆఫ్ ద కరెన్సీ’ (OCC) నుంచి సమాచారం ఆధారంగా జనవరి 21 నుంచి 27వ తేదీ వరకు మూత పడిన బ్యాంక్ బ్రాంచ్‌ల వివరాలను డైలీ మెయిల్ కథనం పేర్కొంది. అమెరికాలో ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ను మూసివేయాలనుకున్నా లేదా కొత్తది ఏర్పాటు చేయాలనుకున్నా ఓసీసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. యూఎస్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ప్రకారం.. గత జనవరి నెలలో మొత్తం 139 షెడ్యూల్డ్ బ్యాంక్ బ్రాంచ్‌లు శాశ్వతంగా మూతపడ్డాయి. 2023లో నెలవారీ సగటు కంటే ఇది అధికం. మరో వారంలో 41 శాఖలు మూసివేస్తామని అమెరికన్ బ్యాంకులు గత నెలలోనే ప్రకటించాయి. -
నేడు తుది దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు బుధవారం జరగనుంది. ఈ విడతలో వివిధ బ్రాంచీలకు చెందిన 19 వేల సీట్లను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 82,666 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు ఆ విడతలో సీట్లు లభించినా రిపోర్టు చేయకపోవడంతో మిగిలిపోయిన 18 వేల సీట్లను కలిపి రెండో దశలో 30 వేలకుపైగా సీట్లు కేటాయించారు. రెండో దశలోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి. ఆ విడతలో సీట్లు లభించినా 7 వేల మంది చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌లో 19 వేల వరకూ సీట్లు కేటాయించనున్నారు. 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ తుది విడత సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. లేకుంటే సీటు రద్దవుతుంది. ఇందులో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ జరగనుంది. ఎన్ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్ కూడా పూర్తవ్వడంతో వాటిల్లో సీట్లు పొందని వారికి ఇది ఉపయోగపడుతుంది. స్పెషల్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవ్వగానే ఈ నెల 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేసి సీటు దక్కించుకోవాలి. ఒక కాలేజీలో తుది విడత కౌన్సెలింగ్‌లో ఏదైనా బ్రాంచీలో సీటు వచ్చి ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వేరొక బ్రాంచీలో సీటు వస్తే కేటాయింపు పత్రాన్ని సమర్పించి సీటు మార్పిడి చేసుకోవాలి. వేరొక కాలేజీలో సీటు వచి్చన పక్షంలో అంతకుముందు రిపోర్టు చేసిన కాలేజీలో టీసీ, ఇతర సరి్టఫికెట్లను ఈ నెల 25లోగా తీసుకొని ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టు చేయాలి. యాజమాన్య కోటా సీట్ల పరిశీలన ఎంసెట్ కౌన్సెలింగ్ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ప్రత్యేక కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా సీట్ల భర్తీ వివరాలను పంపాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి కాలేజీలోనూ 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది. ఇందులో 15 శాతం ఎన్ఆర్ఐ సిఫార్సులకు సీట్లు ఇస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలి. జేఈఈ, ఎంసెట్ ర్యాంకులను, ఇంటర్లో వచి్చన మార్కులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ రూల్స్ ఎంతమేర పాటించారనేది అధికారులు పరిశీలిస్తారు. -
తెలుగు రాష్ట్రాల్లో ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ విస్తరణ
హైదరాబాద్: ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ (యెల్లో ముత్తూట్) తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 50 శాఖలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఒకే రోజున 10 శాఖలను సంస్థ సీఈవో పీఈ మథాయ్ ప్రారంభించారు. కొత్త బ్రాంచీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ శాఖల సంఖ్య 250కి, దేశవ్యాప్తంగా 900 పైచిలుకు స్థాయి కి చేరుతుందని ఆయన తెలిపారు. నూతన శాఖల్లో బంగారం రుణాలతో పాటు బీమా, మనీ ట్రాన్స్ఫర్, సూక్ష్మ రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్ తదితర సర్వీసులు అందించను న్నట్లు వివరించారు. రెండో విడత కింద జనవరిలో మరికొన్ని శాఖలను ప్రారంభించనున్నట్లు మథాయ్ చెప్పారు. కంపెనీ వచ్చే రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. చదవండి: ఇది కదా ఆఫర్ అంటే.. ఇలా చేస్తే, కేవలం రూ.1490లకే యాపిల్ ఎయిర్‌పొడ్స్! -
విదేశీ బ్యాంక్ శాఖలకు కొంత స్వేచ్ఛ
ముంబై: భారత బ్యాంకులకు సంబంధించి విదేశీ శాఖలు, సబ్సిడరీలు.. ఇక్కడ అనుమతించని ఆర్థిక సాధనాల్లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. భారత మార్కెట్లో ప్రత్యేకంగా అనుమతించని సాధనాల్లో లావాదేవీలకు, గిఫ్ట్ సిటీ వంటి భారత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లలో వీటిని అనుమతించడానికి సంబంధించి ప్రత్యేకా కార్యాచరణ అవసరమని భావించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ అనుమతించని, ఇక్కడ అందుబాటులో లేని ఆర్థిక సాధనాల్లో భారత బ్యాంకుల విదేశీ శాఖలు, సబ్సిడరీలు లావాదేవీలు చేపట్టొచ్చని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే, గిఫ్ట్ సిటీ (గుజరాత్)లో బ్యాంకు శాఖలకు సైతం ఇదే వర్తిస్తుందని తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ శాఖలు రెట్టింపు!
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ వృద్ధి ప్రణాళికలతో ఉంది. ఏటా 1,500 నుంచి 2,000 శాఖలను వచ్చే ఐదేళ్ల పాటు పెంచుకోనున్నట్టు చెప్పారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో బ్యాంకు శాఖలను రెట్టింపు చేసుకోనున్నట్టు బ్యాంకు ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ ప్రకటించారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 6,000కు పైగా శాఖలు ఉన్నాయి. 2021–22 వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి జగదీశన్ ఈ విషయాలను తెలిపారు. హెచ్డీఎఫ్సీ విలీనాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల భవిష్యత్తు పూర్తి భిన్నంగా ఉంటుందని ప్రకటించారు. ‘‘ఓఈసీడీ దేశాలతో పోలిస్తే జనాభా పరంగా బ్యాంకు శాఖలు భారత్‌లో తక్కువే ఉన్నాయి. అందుకే వచ్చే ఐదేళ్లలో మా శాఖల నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసుకోవాలని నిర్ణయించాం’’అని జగదీశన్ వివరించారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి అనుకూలంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ ప్రక్రియ 15–18 నెలల్లో పూర్తవుతుందని అంచనా. హెచ్‌డీఎఫ్‌సీకి ఉన్న గొప్ప నైపుణ్యాలు, ఉత్పత్తుల పట్ల అవగాహన, అనుభవం, సిస్టమ్ తమకు బలంగా మారుతుందని జగదీశన్ పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఈ అవకాశాన్ని కోల్పోదన్నారు. గృహ రుణాలకు వాతావరణం పూర్తి సానుకూలంగా మారిపోయినట్టు చెప్పారు. రెరా రావడంతో ఈ రంగంలో ప్రక్రియల్లో పారదర్శకత వచ్చినట్టు అభిప్రాయపడ్డారు. ప్రాపర్టీ మార్కెట్లో ధరలు దిద్దుబాటుకు గురికాడాన్ని, పెరుగుతున్న ఆదాయాలను ప్రస్తావించారు. ఇవన్నీ తమకు అనుకూలమని చెప్పారు. -
నిరుద్యోగులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీపికబురు
ముంబై: నిరుద్యోగులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీపికబురు అందించింది. బ్రాంచీ నెట్ వర్క్, బిజినెస్ కరస్పాండెంట్లు, బిజినెస్ ఫెసిలిటేటర్లు, డిజిటల్ అవుట్ రీచ్ ప్లాట్ ఫారమ్ వంటి మొదలైన వారి కలయికతో రాబోయే 18-24 నెలల్లో 2,00,000 గ్రామాలకు తమ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రైవేట్ రంగ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఇందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లో 2500 మందిని నియమించుకొనున్నట్లు కూడా పేర్కొంది. దేశంలోని మొత్తం గ్రామాలలో మూడింట ఒక వంతు మందికి కొత్తగా బ్యాంక్ సేవలు అందే అవకాశం ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ తెలిపింది.(చదవండి: అమ్మాయిలకు అద్దె ఇళ్ల కష్టాలు.. బౌన్సర్లతో బెదిరింపులు) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుతం 550కి పైగా జిల్లాల్లోని సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థలకు(ఎంఎస్ఎంఈలు) సేవలను అందిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,00,000 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామాల్లో కోతకు ముందు - కోత అనంతర పంట రుణాలు, ద్విచక్ర వాహనాలు రుణాలు, ఆటో రుణాలు, బంగారంపై రుణాలు అందిస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. వేగంగా మారుతున్న గ్రామీణ పర్యావరణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త మార్పులు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. "భారత ప్రభుత్వం, వివిధ పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మారుస్తోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో బాధ్యతాయుతమైన నాయకుడిగా, సమాజంలోని అన్ని వర్గాలకు అత్యుత్తమ శ్రేణి బ్యాంకింగ్ ఉత్పత్తులు & సేవలను అందించాలని మేము విశ్వసిస్తున్నాము" అని శుక్లా తెలిపారు. -
125 కొత్త శాఖలను ఆరంభించిన బంధన్ బ్యాంకు
హైదరాబాద్: బంధన్ బ్యాంకు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 125 నూతన శాఖలను ప్రారంభించినట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా బంధన్ బ్యాంకు శాఖలు 1,013కు పెరిగాయి. అలాగే, 3,206 బ్యాంకింగ్ యూనిట్లు, 195 గృహ రుణ సేవా కేంద్రాలు కూడా బ్యాంకు నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. దీంతో మొత్తం మీద దేశవ్యాప్తంగా తమకు 4,414 బ్యాంకింగ్ ఔట్లెట్లు ఉన్నట్టు బంధన్ బ్యాంకు తెలిపింది. అలాగే, రెండు మినహా దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోకి విస్తరించినట్టు పేర్కొంది. డిసెంబర్ చివరికి బంధన్ బ్యాంకు రూ.54,908 కోట్ల డిపాజిట్లు, రూ.65,456 కోట్ల రుణ పుసక్తంతో ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రాంచీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని.. వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223, ఏటీఎంలు 1,580 ఉన్నాయని తెలిపింది. -
3400 ప్రభుత్వ బ్యాంకు శాఖలు మాయం
న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్ల కాలంలో (2014-15 నుంచి 2018-19 వరకు) ప్రభుత్వరంగ బ్యాంకుల పరిధిలో 3,400 బ్యాంకు శాఖలు కనుమరుగయ్యాయి. అంటే వీటిని మూసేయడం లేదా విలీనం చేయడం జరిగింది. 5 ఆర్థిక సంవత్సరాల్లో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల 3,400 కి పైగా శాఖలు మూసివేత లేదా విలీనం అయ్యాయని ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా వెల్లడైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య పెద్ద ఎత్తున విలీనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నీముచ్‌కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ప్రశ్నకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా కనుమరుగైన వాటిల్లో 75 శాతం బ్యాంకు శాఖలు ఎస్బీఐకి చెందినవే ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనం ఎస్బీఐతోనే ఆరంభమైన విషయం తెలిసిందే. అనుబంధ బ్యాంకులతోపాటు భారత్ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనం అయ్యాయి. ఎస్బీఐకి సంబంధించి మొత్తం 2,568 శాఖలను గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో విలీనం లేదా మూసివేతకు గురైనాయి. కాగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటాచలం దీనిపై మాట్లాడుతూ ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన దేశంలోని పది ప్రభుత్వ యాజమాన్య బ్యాంకుల విలీనంతో నాలుగు పెద్ద బ్యాంకులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనీసం 7,000 శాఖలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
వంద దేశాల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) కీలకపాత్ర పోషించారని, ఉద్యమ భావజాల వ్యాప్తికోసం వివిధ దేశాలలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఏర్పాటు చేసి, స్వరాష్ట్ర సాధనకు కృషి చేశారని ఎంపీ కె.కవిత అన్నారు. ప్రస్తుతం 33 దేశాల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఉన్నాయని, రానున్న రోజుల్లో వంద దేశాల్లో శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ లండన్ ఎన్ఆర్ఐ సంఘం ఎనిమిదో వార్షికోత్సవ సమావేశం తెలంగాణ భవన్లో శనివారం జరిగింది. ఈ సభలో కవిత ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో, సూచనలతో తెలంగాణకోసం విదేశాల్లో వివిధ పేర్లతో ఎన్ఆర్ఐలు సంఘా లు పెట్టి పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయం లో ఎన్ఆర్ఐలు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొన్నా రాష్ట్రం సాధిం చాం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణ బిడ్డల అండతో రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శం గా నిలుస్తోంది. మన పారిశ్రామిక విధానం చూసి అమెరికాలోనూ ఇంతమంచి విధానం లేదని అక్కడి వారు అంటున్నారు. గల్ఫ్‌లాంటి దేశాల్లో తెలంగాణ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని ప్రకటిస్తారు. మీరందరూ గర్వపడేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఇక్కడ పార్టీకి, అక్కడ మన వారికి వారధిలా ఉండాలి. మనమంతా కలిసి పనిచేస్తే దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తది’ అన్నారు. ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ నేతలు కూర్మాచలం అనిల్, దూసరి అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్‌ను కలిసిన కవిత.. కవిత శనివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహ న్ను రాజ్‌భవన్‌లో కలిశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువనాయకత్వ సదస్సు ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు. -
పొదుగు
‘‘పొద్దన్నంతా యాడేడో తిరిగొచ్చిందిచాలక ఇంకేడికి బోతన్నావురా’’ అని లోపల్నించే కసురుకుంది అమ్మ. పంచలో కుక్కిమంచంలో కునికిపాట్లుపడుతున్న నాయనమ్మ ఉలిక్కిపడి ‘‘పిలకాయలకు ఇస్కూలు సెలవులిస్తే ఇంటిపట్టున యాడుంటారు చెప్పు. అయినా ఇంటికాడుంటే ఇద్దరికీ క్షణం పడదు’’ అని గొణిగి మంచానికి ఆనించిన చేతికర్రతో అక్కడక్కడే తిరుగుతున్న కోడిపుంజుని హుష్పాడుకోళ్ళు’’ అని అదిలించింది.నాగి చొక్కా గుండీలు పెట్టుకుంటూ గడ్డివాము అవతలకి దాటాడు. గడ్డివాముకి పక్కనే చెట్టునీడకి కట్టేసిన గేద ఊరికూరికే తలమీద విసిగిస్తున్న ఈగని అదిలించడానికి కొమ్ములు విదిలించింది.సీత చేతులు వెనక్కి కట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ గడ్డివాముదాకా వచ్చి నాగి ఎటుపోతున్నాడా అని చూసింది. ‘‘నువ్వేడికే.. ఆడితోపాటు నువ్వుకూడా పోతావా ఏంది?’’ అని మళ్ళీ సీతను కసురుకున్నది నానమ్మ. ఆసరికే నాగి గడ్డివాము దాటుకుని, ఇంటెనక కాలవ దూకి దాసరోళ్ళ పెరడు అవతలికి వెళ్ళి వెనక్కు చూసాడు. సీత ఇంకా అక్కడే నిలబడి చూస్తా ఉంది. ‘‘ఈయమ్మి రెండు మూడు దినాలనుంచి నాకు చూపించకుండా ఏదో దాస్తా ఉంది. అదేందో తేలడంలా.. అనుకున్నాడు నాగి. అమ్మయితే కొనుక్కోవడానికి ఏమీ ఇవ్వదు. ఇంట్లో వండింది తనకు తెలీకుండా పోదు. నిన్న రాత్రి నాయన సీతకి ఇచ్చిన రూపాయిలో అర్ధరూపాయి నాకీయకపోతే అమ్మూరుకోదు. ఇక నాయనమ్మ దగ్గర ఏదన్నా ఉంటే అది నాకే.. ఇంతకీ ఆయమ్మి ఏది దాచిపెడుతున్నట్టు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ఊరవతలకి వచ్చేసాడు. నడిమధ్యాహ్నం దాటిన ఎండ. పైన నిట్టనిలువు సూర్యుడు మలుపు తిరిగాడు. కొమ్మలు ఎత్తిపట్టుకున్న పొడవాటి చెట్లకు నీడలు మొదలయ్యాయి.సీమచింతకాయ చెట్టుమీద పికిలిపిట్ట ఊరికూరికే ఉలిక్కిపడుతూ ఒకటే ఆ కొమ్మకూ ఈ కొమ్మకూ ఎగురుతూఉంది. సెలవురోజు వస్తే నాగి ఇంటిదగ్గర ఉండడు. ఊరవతల కాలవ దాటుకొని పోరంబోకు బూముల్లో చెట్లు పుట్టల మధ్య జీరంగులకోసమో, రేక్కాయలకోసమో, కలేక్కాయల కోసం తిరుగుతుంటాడు. ఏదీ లేకపోతే కావలగట్టుమీద కూర్చుని చేపలుపట్టే ముసలితాతతో కలిసి చేపలు పడుతూంటాడు. చేపలతాత పేరేమిటో తెలీదు. ఆయనకి ఇల్లూ వాకిలి లేదంటారు. నాగికి ఊరిబయటే పరిచయం. ఎప్పుడు చూసినా కాలవలో నుంచుని మోకాలులోతు నీళ్ళలో వంగుని వల సవరించుకుంటూనో నీళ్ళలో చేపలకోసం తడుముకుంటూనో ఉంటాడు. అతడి కాళ్ళు చేతులు నీళ్ళలో నానినాని మెత్తగా చీకిపోయి ఉంటాయి.బక్కపల్చటి నల్లటి శరీరం. భుజానికి తగిలించిన తాటాకు చేపలబుట్ట వేలాడుతూ ఒంటిమీద చొక్కా ఉందో లేదో అన్నట్టు ఉంటుంది. నల్లటి మొహానికి వేలాడే పలుచటి పొడవాటి గడ్డం. కాలవలో వంగుని వలను సర్దుకుంటున్న తాతను చూసి ‘‘ఏం తాతో ఇయ్యాల సేపలు దొరికినయ్యా’’ అన్నాడు.నీళ్ళలో వంగున్న తాత నడుమెత్తి ‘‘నువ్వా నాగి.. ఇయ్యాల ఇస్కూలు లేదా.. చాన్నాళ్ళకొచ్చినావే’’ అన్నాడు.‘‘స్కూలు లేత్తాతా’’ అని తాతకి సమాధానం చెబుతూ ఒడ్డునుంచి నీళ్ళలోకి దిగాడు. చల్లగా తగిలాయి. ఇంకాస్త ముందుకెళ్ళాక నీరు మోకాళ్ళపైదాకా వచ్చి నిక్కరు అంచు తడిసింది. గులకరాళ్ళని ఆసరాగాచేసుకుని నిదానంగా అలలకు ఎదురడుగులేస్తూ కాలవ అవతలికి వెళ్ళాడు. కాలవగట్టు? పైనుంచి ఏటవాలు కరకట్ట కిందకి అడుగులు దబదబ పడ్డాయి. పరిగెడుతున్నట్లు అక్కడ్నుంచి చింతతోపులోకి వచ్చాడు. అక్కడికి చీకట పడితే మనుషులెవరూ ఉండరు. గుబురు చింతచెట్లకింద నీడ ఉన్నా పిల్లలెవరూ అటువైపు వెళ్ళరు. చింతతోపు దాటాక నడక నెమ్మదించింది. డొంకదారిలో బాగిమాను మీద వాలిన ఒంటరి జెముడుకాకిని చూసుకుంటూ తాటితోపులోకి అడుగుపెట్టాడు. తాటి చెట్లు ఒకదాని వెనక మరొకటి వరసకట్టి గుండ్రంగా గుంపులు గుంపులుగా నుంచున్నాయి.తోపు మధ్యలో జపాన్ తుమ్మ, బూరుగు, కానుగ చెట్లు దట్టంగా ఉన్నాయి. కొత్త మనిషిని చూసి ఉడతొకటి ఉలిక్కిపడి చెట్టు తొర్రలోకి తుర్రుమంది. నేలమీద చీదరవాదరగా పెరిగిన మొక్కలు. కొన్ని ఉమ్మెత్త, జిల్లేడు, నాంజేడు, ఉత్తరేణి లాంటి మోకాలెత్తు మొక్కలు. మనిషి చేతికి అందేట్లు కొమ్మలున్న వేప, అవదం చెట్లు. చిగురు చేతికందనంత దూరంలో ఆకాశం చివరికి విస్తరించిన యూకలిప్టస్ చెట్లవరస. గుచ్చుకుంటే ఏమవుతుందో అని భయపెట్టే కరెంటుతుమ్మ ముళ్ళు. ఎక్కడపడితే అక్కడ ఆకుపచ్చ గచ్చపొదలూ, విసిరేసినట్లున్న రాళ్ళూ రప్పలు. పలికిచెట్టు పక్కనుంచి నడుస్తుంటే రెండడుగుల దూరంలో కొమ్మచివర తూనీగ కనిపించింది.నిదానంగా వెనకాలే వెళ్ళి వంగి పట్టుకునేంతలో మళ్ళీ అది ఎగిరిపోయి మనిషి నిలబడి అందుకునేంత ఆకు మీద వాలింది. ముందుకెళ్ళి నిదానంగా కొమ్మ వెనకాలే మునివేళ్ళమీద నుంచుని ఆకుమీద వాలిన తూనీగ తోక పట్టుకోబుతుండగా ఉన్నట్లుండి అక్కడ చెదురుమొదురుగా ఉన్న సన్నటి కొమ్మల మధ్య గోధుమరంగు గువ్వ కనిపించింది. దాని రెక్కల మీద మచ్చలు. నాగి బిత్తరపోయి దాన్నలా చూస్తుండగానే అది ఒక నిమిషం అలాగే కూర్చుని నాగిని చూసి టపటపా రెక్కలు విదిల్చి ఒక్కసారిగా దబ్బున ఎగిరిపోయింది. నాగి ఉలిక్కిపడి కొంచెంసేపు అలానే నిలబడి కొమ్మల్ని పక్కకి వంచి రెండడుగులు ముందుకెళ్ళి మునివేళ్ళమీద నుంచుని గూట్లోకి చూసాడు. సన్నటి పుల్లలతో కూర్చినట్లున్న గూడు. కొమ్మల మధ్య అల్లిన అమరిక.పదిలంగా రెండు తెల్లటి గువ్వ గుడ్లు. వెడల్పాటి గోళీకాయల్లా. చేతికందేంత దగ్గరగా. నాగి వెనక్కి జరిగి అలానే నుంచుండిపోయాడు. తూనీగ ఎటెళ్ళిపోయిందో గాలిలో కలిసిపోయింది. ఎగిరిపోయిన గువ్వ ఎక్కడా కనిపించలేదు. నాగి అక్కడే నేలమీద కూర్చుండిపోయాడు. ‘గువ్వ గుడ్లు చూసాడంటే ఎవరూ నమ్మరు. అమ్మకి చెప్తే యాడాడ తిరిగొస్తన్నావురా అని చెవులు మెలిపెట్టుద్ది. సీతకి చెప్తే చాల్లే అబద్ధాలు అంటుంది. నానమ్మ అసలు వినిపించుకోదు. ఇక మిగిలింది ఇంటి పక్కనే ఉండే సికాకోళ్ళ శీనుగాడికి చెప్తే వాడస్సలు నమ్మడు. బో..చూసాంలేవో.. మేమూ చూసాం..అని అబద్ధమాడతాడు. లోకంలోని వింతలన్నీ వాడికే తెలుసునంటాడు.’ తను గువ్వ గూడు చూసినట్లు ఎవరికైనా చెప్పాలనిపించింది నాగికి. వెనక్కి కాలవ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.నాగి చెప్పింది వినగానే ‘‘గువ్వగూడా.. నువ్వేమన్నా కదిపినావా? అన్నాడు తాత ఒడ్డున కూర్చుని ఎండకు ఒళ్ళు ఆరబెట్టుకుంటూ.‘‘లేతాత్తా.. నేనేం కదపలేదు’’ ‘‘సరే..పోయి చూద్దాం పద’’ అన్నాడు తాత. ఇద్దరూ చెట్టు దగ్గరకు వచ్చారు. తాత చెట్ల గుబురులోకి వెళ్ళి కొమ్మల్ని తప్పించి లోపలికి చూస్తూ ‘‘యాడబయా.. ఇక్కడ గూడేం లేదే’’ అన్నాడు. ‘ఉంది తాతా నేనకడ్నే చూసాను’’. తాత మళ్ళీ లోపలకి ముందుకెళ్ళి వెతికాడు. ఈసారి నాగికూడా కొమ్మల్లోకి దూరాడు. అక్కడ కొమ్మలు తప్ప గూడేం కనిపించలేదు. ‘‘గువ్వేనంటావా?’’ అన్నాడు తాత.‘‘గువ్వనే తాత. రెక్కలమీద మచ్చలుగూడా ఉండాయి. ఇక్కడ్నే చూసినాన్తాతా.. గూట్లో గుడ్లు కూడా ఉండాయి.’’తాత ఒకడుగు వెనక్కేసి ‘‘గుడ్లుండాయా.. అన్నాడు ఆశ్చర్యపోయి. నా కళ్ళతో చూసినాన్తాతా...‘‘గుడ్లున్న గూట్లో సెయ్యిపెట్టినావా?’’ అనడిగాడు తాత కళ్ళు పెద్దవిచేసి.‘‘లేతాత్తా. అడుగు దూరం నుంచి సూసినానంతే. నన్ను సూడగానే అది లటక్కమని ఎగిరిపోయింది.’’ ‘‘నిన్ను గూటిదగ్గర సూస్తే మళ్ళీ అది గూటికి రాదబయా’’ అన్నాడు తాత బాధగా మొహం పెట్టి. ‘‘ఎందుకు రాదు తాతా?’’‘‘అదంతే అబయా.. పిట్ట గూటిమీద నరుడి నీడ పడితే అది గూటికి చేరదు. ఇంక సెయ్యిపెడితే సరేసరి.. అంతే సంగతి.’’ తాత మళ్ళీ గుబురులోకి దూరాడు. ఎంత వెతికినా అక్కడ గూడు కనిపించలేదు. మనుషుల తొక్కిడికి కొమ్మలు పక్కకి తిరిగి గుబురు చెదిరింది. చివరికి తాత కొమ్మల్లోంచి బయటికి వచ్చాడు.‘‘ఇక్కడేం లేదబయా. మడిసి నీడ పడిన గూడు. గువ్వ మాయం చేస్తది. సరే ఇక ఇంటికి పోదారి.’’ ‘‘నిజ్జెం తాతా. నేనిక్కడే నా కళ్ళతో సూసినాను. నన్ను సూడగానే ఎగిరిపోయింది. మచ్చల గువ్వు’’ తాత బయటికి వచ్చాక నాగి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కొమ్మకొమ్మనూ చూసాడు. అదే చెట్టు. అదే కొమ్మ.అతడి చూపులు అంతకుముందు చూసినదానికోసం వెతుకుతూ ఉన్నాయి. తను వెతికేది అంతకుముందు చోటేనా అని మళ్ళీ చూసుకున్నాడు. వెతికేకొద్దీ పట్టుదల ఎక్కువైంది. చూసినచోటు అదికాదేమోనని పక్కన ఉన్న చెట్ల కొమ్మల్లోకి వెళ్ళి వెతికాడు. కొద్దిసేపటిక్రితం కనిపించింది మళ్ళీ కనిపించలేదు. గువ్వ ఎగిరిపోయింది సరే. గూడూ మాయమైంది. నాగిని నిండా నిరాశ కమ్ముకుంది. నాగి నుంచున్న చోటునే కూలబడి కూర్చున్నాడు. ఎదురుగా తొండ ఒకటి సర్రున ముందుకు పాకి తల పైకీ కిందికీ తిప్పుతూ ఎక్కిరిస్తా ఉంది. అప్పటికే తాత వెనక్కి మళ్ళి చెట్లమధ్య కనుమరుగయ్యాడు. ఉన్నట్టుండి నాగికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏదో వింత వస్తువు చేతికి అందినట్లే అంది చేజారినట్లయింది. గువ్వ గూటికి రాదని తెలిసీ తెలియని దుఃఖం పొంగుకొచ్చింది. దుఃఖం ఏడుపుగా మారింది. ఏడుపు ఎక్కిళ్ళయింది. అప్పటికి పొద్దు గుంకుతూ ఉంది. బూడిదలో ఆరిపోతున్న నిప్పులా ఉన్నాడు చివరి సూర్యుడు. పడమటి ఆకాశం ఎర్రగా పగిలింది. చెట్ల నీడలు నిదానంగా తూరుపుకి పరుచుకుంటున్నాయి.పిట్టలు గూళ్ళకు చేరే సమయం. మధ్యాహ్నమంతా కాసిన ఎండకు నుదురు నల్లబడింది. చెంపల మీద ఆరిపోయిన కన్నీళ్ళు చెమటతో కలిసి చారికలు కట్టాయి. జుట్టు ముందుకు పడింది. మొహం వాడిపోయింది. ఎప్పుడొచ్చినాడో చేపల్తాత మళ్ళీ ఎదురుగా వచ్చి నుంచున్నాడు. ఏడుస్తున్న నాగిని చూసి కలవరపడ్డాడు. ‘‘ఏందబయా.. ఇంకా ఇంటికి పోలేదా. ఎందుకేడస్తండా..’’తాతను చూసాక మళ్ళీ ఎక్కిళ్ళు మొదలైనాయి. మాసిన కాలరుతో కళ్ళు తుడుచుకున్నాడు. నాగెందుకు ఏడుస్తున్నాడో చేపలతాతకు ముందు అర్థం కాలేదు. అర్థమయ్యాక ‘ఓ అదా సంగతి’ అన్నాడు. ‘‘యిక ఇంటికిపా.... సీకటి పడతా ఉంది. నిన్ను ఊరికాడ దిగబెడతా.. పురుగూ పుట్రా వుంటది. సీకటి పడ్డాక గువ్వ ఇంటికొస్తదబయా. ఏడవబాకబయా.. నే మంత్రమేస్తాగా. నువ్వు కదిలేదాక అదిక్కడికి రాదు. తాత భుజంమీద చేయివేసి సముదాయించాడు. నాగి కాలరుతో కళ్ళు తుడుచుకున్నాడు. చేపలతాత బుట్ట చంకనేసుకున్నాడు. ఇద్దరూ ఊరుదారి పట్టారు. నాగికి అడుగులు ముందుకు పడుతున్నా ధ్యాసంతా వెనకే ఉంది. దారిలో ఏ పిట్ట కనిపించినా అది గువ్వేనేమో అని తేరిపార చూస్తున్నాడు. పడమటి దిక్కున పగిలిన ఆకాశం మెల్లగా మూసుకుపోతూ మసక చీకటి అలముకుంటూ ఉంది.దూరంనుంచి కనిపిస్తున్న ఊరిచివరి వీధిలైటు మిణుక్కుమంటూ ఉంది. అలవాటైన దారిలో గబగబఅంగలేస్తున్న తాత తాటితోపులో అడుగుపెట్టాడు. తాత నీడని అంటిపెట్టుకుని పరిగెడుతున్నట్లు నడుస్తున్న నాగి వెనక్కి చూసాడు. డొంకలో నిలబడ్డ నిలువెత్తు తాటిచెట్లు తిరిగి చూస్తున్న చింపిరి జుట్టు మనుషుల్లా ఉన్నాయి. ఇద్దరూ చింతతోపుదాకా వచ్చేసరికి పూర్తిగా చీకటిపడి చల్లటి గాలి మొదలైంది. అప్పటిదాకా వెనకెనక్కి చూసుకుంటూ తాతకు వెనకాలే నడుస్తున్న నాగి తాత పక్కకివచ్చి నడవసాగాడు. చెట్లమీద గూళ్ళకు చేరిన పిట్టలు చీకట్లో కికిక్..కికిక్..అంటూ చప్పుడు చేస్తూ ఉన్నాయి. దబదబ అడుగులేస్తున్న తాత ఒక్కసారి ఆగి తలపైకెత్తి ఆకాశంలోకి చూసి వానరాబోతుందబయా.. దబదబ నడవాలి అన్నాడు. కళకళమని చప్పుడు చేసుకుంటూ ప్రవహిస్తున్న కాలవలో గులకరాళ్ళమీద పాదాలు గుదిగుచ్చినడుస్తూ ఇద్దరూ కాలవదాటారు. కాలవలో నీళ్ళు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి.చివరికి పొలిమేరల దగ్గర కాలిబాట రెండుగా చీలిన చోట చేపల్తాత నుంచుండి పోయాడు. ‘‘ఇక దబ్బున ఇంటికిపా.. మీ అమ్మనాయినలు ఎదురుసూస్తా ఉంటారు. దబ్బున పో.. అంటూ వెళ్ళిపోయాడు. అవతలిపక్క కాలిబాటమీద నడుచుకుంటూ పోతున్న తాత చెట్లమధ్యనుంచి చీకట్లో కనుమరుగయ్యాడు. పూర్తిగా చీకటి పడింది. ఊళ్ళోకి అడుగుపెట్టి దాసరోళ్ళ పెరడు దగ్గరకు వచ్చేసరికి దబదబమని చినుకులు మొదలయ్యాయి. నాగి పరుగందుకున్నాడు. గడ్డివాము దగ్గరకొచ్చేసరికి వానలో తడుస్తున్న గేద మోరతిప్పి చూసింది. ఇంటిదాకా వచ్చేసరికి చొక్కాలాగు పూర్తిగా తడిసిపోయాయి. నాగిని చూడగానే ‘‘ఇంత సీకటిదాక ఇంత వానలో యాడ తడిసొస్తండా.. ఇప్పుడేళయిందా నీకు’’ అన్నది నాయనమ్మ కేకేసింది. నెత్తిమీద చీరకొంగు వేసి తడిసిన తల తుడిచింది. ‘‘అన్నాలేళయిందిగా అయ్యగారికి పెత్తనాలు అయిపోయాయి’’ అన్నది అమ్మ లోపలనుంచి. బయటి వానకి పొయ్యి లోపల పెట్టింది అమ్మ. అడ్డం పెట్టిన తడిక సందుల్లోంచి తెల్లటి పొగ ఒకటే బయటికి వస్తాఉంది. వానకు తడిసిన పుంజు పంచలో చోటుకోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంది. తడిసిన బట్టలిప్పి నిక్కరేసుకుని మళ్ళీ మంచమ్మీద నానమ్మ పక్కన కూర్చుంటూ ‘‘సీతక్కాడికి పోయిందే? అన్నాడు. ‘‘పొద్దుగూకాక మీ నాయిన దాన్ని బయటికి తీసుకెళ్ళాడు.వాళ్ళటెళ్ళారు.. ఇటు వాన మొదలైంది’’ అన్నది నాయనమ్మ మంచంలో ఒరుగుతూ. ‘‘కొనుక్కోడానికి దానికేదన్నా ఇచ్చినావేమే?’’ అన్నాడు. ‘‘ఇయ్యడానికి నాకాడ యాడుండాయి.మీనాయన బజారుకు తీసుకెళ్ళాడుగా.. వచ్చేటప్పుడు కారబ్బూంది తెస్తారేమో.. తీసుకుని తిను ’’ అన్నది నాయనమ్మ. నిర్విరామంగా కురుస్తున్న వానకి కరెంటు పోయింది. చీకట్లో అమ్మ కిరసనాయిలు దీపం ముట్టించింది. మంచంమీద నుంచి లేచి నట్టింట్లో దీపం ముందు కూర్చున్నాడు. వానకి తడిసి ఆరిన ఒళ్ళు దీపం వెలుతురులో మెరుస్తూ ఉంది. సీత దాచిపెట్టిందేదో వెతకాలనుకున్నాడు. నిలబెట్టిన నవారు మంచంకోడెక్కి బీరువా పైన చూసాడు. అక్కడ ఏదీ కనపడలేదు. గూట్లో ఉన్న స్కూలుబ్యాగులో చెయ్యిపెట్టి లోపటిదాకా వెతికాడు. నలిగిన స్కూలు పుస్తకాలూ, ఒకటి రెండు నలిగిన కాగితాలూ తప్ప ఏంలేవు.జామెంట్రీబాక్సు తెరిస్తే అందులో పెన్నూ పెన్సిలూ, రబ్బరూ తప్ప మరేంలేవు. ‘‘దాని ఇస్కూలు బ్యాగు నీకెందుకురా? అని అమ్మ కసిరి పొగలుకక్కుతున్న అన్నంపళ్ళెం ముందు పెట్టింది. బ్యాగు అక్కడే ఒదిలేసి కూర్చుని అన్నం తింటుంటే చెక్కబీరువా కిందనుంచి రెండు చుంచులు బయటికి వచ్చాయి. అమ్మ వాటిని చూసి హుష్షో అంది విసుగ్గా. చుంచులు చటుక్కున బీరువా కిందికి ఉరికాయి.నాగి పళ్ళానికి పక్కన రెండు అన్నం మెతుకులు వేసాడు. చుంచులు మళ్ళీ బయటికి వచ్చి మెతుకులు తిన్నాయి. పళ్ళెంలో చెయ్యి కడుక్కుని మళ్ళీ నానమ్మ పక్కలోకి చేరాడు. మంచంకింద సదురుకున్న పుంజు అప్పుడప్పుడూ కురకుర మంటూ ఉంది. ‘‘నానమా గువ్వ గూట్లో సెయ్యి పెడితే ఏమయిద్దే?’’ అన్నాడు. ‘‘ఏమయిద్ది. ఏం కాదు. గువ్వ గూట్లో సెయ్యి పెట్టావా’’ అన్నది నానమ్మ . ‘‘లేదు నానమా..’’ అన్నాడేకాని చీకట్లోకి చూస్తూ గువ్వ తనను చూసిందని చెప్దామనుకున్నాడు. చెప్పలేదు. ఈపాటికి గువ్వ గూటికి చేరి ఉంటదా అని కాసేపు విచారించాడు. తోటి గువ్వ ఎక్కడ కూర్చుంటదా అనుకున్నాడు. మరికాసేపు వానలో తడిసిన గుడ్లు ఏమవుతాయా అనుకున్నాడు. పగలంతా తిరిగిన అలసటకి కళ్ళు మూతలు పడ్డాయి. నానమ్మను చుట్టుకుని నిద్రలోకి జారిపోయాడు.తరవాత నిద్రలో దూరంగా రోడ్డుమీద సైకిలు బెల్లు కొట్టిన చప్పుడూ, నాయిన రావటం, నాయనమ్మ లేచి కూర్చోడం, సీత కారబ్బూందీ పొట్లం విప్పటం, అమ్మ తిట్లూ వినిపించాయి. మెలకువ వచ్చినట్లయి మళ్ళీ ముడుచుకుపడుకున్నాడు. నాన్న నాగిని రెండు చేతులతో ఎత్తుకుని లోపల మంచంమీద పడుకోపెట్టాడు. అప్పటిదాకా కురిసిన వానకి చలి మొదలయింది. నాగి వెచ్చటి దుప్పటిలోకి మరింత ముణగదీసుకున్నాడు. నిద్రలో చలి. చలిలో చీకటి. చీకట్లో వాన. చీకటి నీలంరంగు వెలుతురులోకి తెరుచుకుంది. నేలమీద ఉత్తరేణి పొదలు. చేతికి అందుతున్న కానుగ చెట్టు కొమ్మలు. హఠాత్తుగా కళ్ళముందర చేపల్తాత కనిపించాడు. ‘‘ఏడవబాకబయా.. గువ్వలొస్తాయిగా నేను మంత్రమేస్తానుండు’’ అన్నాడు. నాగికి కాలవగట్టుమీద నిలబడి చూస్తున్నాడు. చేపల్తాత నేలపైన ఒంటికాలిమీద నుంచుని తపస్సు చేస్తున్న మునివలె రెండు చేతులూ పైకి గాలిలోకి నిట్టనిలువుగా చాపాడు. తరువాత కుడిచేయి పైకే ఉంచి ఎడమచేయి ముందుకు చాపాడు. ఆ తరువాత కుడిచేయి ముందుకు సాచి ఎడమచేతితో కలిపాడు. ముందుకు చాచిన గుప్పిట. ‘‘తీసుకో నాగి’’ అన్నాడు తాత. నాగి చెయ్యిచాచాడు. చేతివేళ్ళకి మెత్తగా తగిలింది. నాగి జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని చూసాడు. అది గోధుమరంగు మచ్చలగువ్వ ! మొహం మీద వానచినుకులు పడుతున్నాయి. ఎవరో మొహం మీద చల్లటి నీళ్ళు చిలకరించారు. నాగి ఒక్కసారిగా నిద్రలో ఉలిక్కిపడ్డాడు. ఒళ్ళు జలదరించినట్లయింది. ముక్కుమీద ఏదో చిన్నగా గుచ్చుకున్నట్లయింది. ఒకసారి అటూ ఇటూ మెసిలిమళ్ళీ దుప్పట్లోకి మునుక్కున్నాడు.‘‘నిద్దట్లో ఎవర్ని పిలస్తండా’’ అన్న మాట వినిపించింది. దిండుమీద తల దగ్గర మళ్లీ ఏదో కదిలిన చప్పుడయింది. నాగి కళ్ళు తెరిచి చూసాడు. పసుపురంగు దూదిలా ఉంది. రెండు చిన్నటి కళ్ళు. నన్నటి ముక్కు. పసుపురంగు కోడిపిల్ల. నాగి దానికేసి చూస్తుండగానే పసుపురంగు కోడిపిల్ల తల అటు ఇటు తిప్పి నాగి మొహంమీద మరోసారి ముక్కుతో పొడిచింది. అతడి కళ్ళు నవ్వాయి.చేతివేళ్ళు సుతారంగా కోడిపిల్లని పట్టుకున్నాయి. సీత తనకు చెప్పకుండా దాచిపెట్టినదేదో అర్థమయ్యింది. వెనక ఎవరో గట్టిగా నవ్వుతున్నారు.. ...సీత -
నేడు ఆ ఎస్బీహెచ్ శాఖలు తెరిచే ఉంటాయి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలతో ముడిపడి ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలు సోమవారం కూడా తెరిచే ఉంటారుు. ట్రెజరీల ద్వారా లావాదేవీలు జరిగే ఈ బ్యాంకుల్లో సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి చలానాలు, రసీదులు స్వీకరించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికె.రామకృష్ణారావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
రూ.100 నోట్లు సిద్ధంగా ఉన్నాయ్..!
ముంబై: బ్లాక్ మనీపై దేశ ప్రధానమంత్రి సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చురుగ్గా కదులుతోంది. రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దుపై ఆందోళన చెందాల్సి అవసరం లేదన్న సంకేతాలు అందించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తమ అన్ని బ్రాంచ్ లోలనూ, ఏటీ ఎం కేంద్రాలలోనూ సరిపడినన్ని 100 రూపాయల నోట్ల నిల్వలు రడీగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది. నవంబరు 11 నుంచి ఏటీఎం కేంద్రాలు సిద్ధంగా ఉంటాయని తెలిపింది. మరోవైపు దాదాపు అన్ని బ్యాంకులు రేపు (గురువారం) సెలవు పాటిస్తుండగా, సాయంత్రం ఆరుగంటల వరకు తమ బ్యాంకులు పని చేస్తాయని, 10 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. అలాగే తమ ఖాతాల్లో రూ.500, రూ. 1000 నోట్ల డిపాజిట్లకు ఎలాంటి లిమిట్ లేదని వెల్లడించింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంచలన నిర్ణయంతో తాజాగా 100 నోటు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దు చేయడంతో ప్రజల్లో రూ.100 నోటుపై విపరీతమైన క్రేజ్ పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. -
బ్రాంచ్‌ల మూతకు ఎస్బీఐ ప్లాన్
ముంబై : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన బ్రాంచులను తగ్గించుకునే ప్రణాళికను రచిస్తోంది. తన గ్రూపు నుంచి 30 శాతం బ్రాంచులను పునర్ నిర్మించుకోవడం లేదా మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మెకిన్సే సూచన మేరకు ఎస్బీఐ ఈ మేరకు అడుగులు వేయనున్నట్టు సమాచారం. బ్రాంచ్ అప్టిమైజేషన్కు మెకిన్సేను సలహాదారుగా నియమించామని ఎస్బీఐ ఎండీ రాజ్నీష్ కుమార్ స్పష్టంచేశారు. అయితే బ్రాంచుల సైజు తగ్గించడంపై మాత్రం వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. బ్రాంచ్‌ల, ఏటీఎమ్‌ల అప్టిమైజేషన్ కోసం, వినియోగదారులకు మెరుగైన అనుభవాలు అందించడానికి మెకిన్సేతో కలిశామని కుమార్ వెల్లడించారు. యాక్సేంచర్ ఫైనాన్సియల్ సర్వీసులతో కూడా తాము కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. బ్రాంచుల అప్టిమైజేషన్ చర్యలో భాగంగా, ఎస్బీఐ ఇటీవలే తన 400 బ్రాంచులను మూసివేయడం లేదా పునర్ నిర్మించుకోవడం చేసింది. దీంతో బ్యాంకు తన వ్యయాలను తగ్గించుకుంది. కొత్త బ్రాంచులను కలుపుకోవడాన్ని యేటికేటికి తగ్గిస్తూ వస్తున్న ఎస్బీఐ..గతేడాది కేవలం 451 బ్రాంచులనే జోడించుకుంది. ప్రస్తుతం ఈ బ్యాంకు 16,784 బ్రాంచులు కలిగిఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంతో ముగిసే లోపు ఐదు అనుబంధ బ్యాంకుల, భారతీయ మహిళా బ్యాంకు విలీన ప్రక్రియతో మరో 6,978 బ్రాంచులు తనలో కలుపుకోనుంది అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియతో వ్యయాలు కచ్చితంగా తగ్గుతాయని కుమార్ తెలిపారు. లేకపోతే విలీనాన్ని తామెందుకు ప్రతిపాదిస్తామన్నారు. బ్రాంచుల కొత్త ఫార్మాట్ కోసం బ్యాంకు యోచిస్తోందని వెల్లడించారు. 133 ఇన్ టచ్ బ్రాంచులను సెల్ఫ్ సర్వీసు మోడ్ లో వివిధ రకాల ఆన్లైన్ సేవలు అందించడానికి ఎస్బీఐ ప్రారంభించింది. ఒక్కసారి విలీన ప్రక్రియ పూర్తయితే కంపెనీ రూ.37లక్షల కోట్ల అసెట్ బేస్‌తో, 24వేల బ్రాంచులు, 58వేల ఏటీఎమ్లుగా బ్యాంకు ఆవిర్భవించనుంది. . -
నాకు ఎక్కడా బ్రాంచ్‌లు లేవు
నాకు ఎక్కడా బ్రాంచీలు లేవంటున్నారు సీనియర్ హాస్యనటుడు గౌండర్ మణి. ఈ బ్రాం చీల వ్యవహారం ఏమిటని ఆశ్చర్య పడుతున్నారా.! ప్రస్తుతం హాస్యనటులుగా దుమ్ము రేపుతున్న సంతానం, వివేక్, వడివేలుకు ముందు తరం హాస్యనటుడు గౌండర్ మణి. 1990 ప్రాంతంలో సెంథిల్, గౌండర్‌మణి కామెడీ లేని సినిమా ఉండదు. ఆ తర్వాత హీరోగా, విలన్‌గా కొన్ని చిత్రాలు చేసిన గౌండర్ మణి చాలాకాలం తెర మరుగయ్యారు. తాజాగా మళ్లీ హీరో అవతారంతో తెరపైకి రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 49వో, వ్యవసాయ దారుల ఇతి వృత్తాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో గౌండర్ మణి పాత్ర చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెర మీదకు త్వరలో రానుంది. తాజాగా, ఎనక్కు వేరు ఎంగుం కిలైగల్ కడయాదు (నాకు ఎక్కడా బ్రాంచీలు లేవు) చిత్రంలో గౌండర్ మణి సరికొత్త గెటప్‌తో కనిపించబోతున్నారు. ఈ చిత్రం తనదైన మార్కు చిత్రంగా , వినోదాల విందు గా ఉంటుందని దర్శకుడు గణపతి బాల కుమారన్ అంటున్నారు. ఈయన దర్శకుడు సుశీంద్రన్ శిష్యు డు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ, మంచి కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న గౌండర్మణికి తన కథనచ్చడంతో నటించేందుకు వెం టనే అంగీకరించారన్నారు. ఇందులో గౌండర్ మణి సినిమా షూటింగ్‌లకు అద్దెకు నడిపే క్యారవన్ వ్యాన్ యజమానిగా నటిస్తున్నారని వివరించారు. ఆ విధంగా ఆయన చెన్నై నుంచి మదురైకు వెళ్లే మధ్యలో జరిగే వినోద భరిత సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతి వృత్తంగా పేర్కొన్నారు. జయరాం ప్రొడక్షన్స్ పతాకంపై జే షణ్ముగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నై, తిరుచ్చి, మదురై, రామనాధపురం ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు.