![Indian banks can deal in domestically restricted financial products overseas - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/2/FOREIGN-BANKS.jpg.webp?itok=hSJ85C6V)
ముంబై: భారత బ్యాంకులకు సంబంధించి విదేశీ శాఖలు, సబ్సిడరీలు.. ఇక్కడ అనుమతించని ఆర్థిక సాధనాల్లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది.
భారత మార్కెట్లో ప్రత్యేకంగా అనుమతించని సాధనాల్లో లావాదేవీలకు, గిఫ్ట్ సిటీ వంటి భారత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లలో వీటిని అనుమతించడానికి సంబంధించి ప్రత్యేకా కార్యాచరణ అవసరమని భావించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ అనుమతించని, ఇక్కడ అందుబాటులో లేని ఆర్థిక సాధనాల్లో భారత బ్యాంకుల విదేశీ శాఖలు, సబ్సిడరీలు లావాదేవీలు చేపట్టొచ్చని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే, గిఫ్ట్ సిటీ (గుజరాత్)లో బ్యాంకు శాఖలకు సైతం ఇదే వర్తిస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment