ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యాంకుల విదేశీ అనుబంధ సంస్థలు, శాఖల సంఖ్య 417కి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 399గా ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య విదేశీ శాఖల్లో 0.5 శాతం, అనుబంధ సంస్థల్లో 6.2 శాతం పెరిగింది.
రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన 2022–23 ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విదేశాల్లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 14 భారతీయ బ్యాంకులు, అలాగే భారత్‌లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 44 విదేశీ బ్యాంకులపై ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారత్‌లో విదేశీ బ్యాంకుల శాఖలు, ఉద్యోగుల సంఖ్య తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment