International Trade
-
భారత్‌కు స్విస్ ఎంఎఫ్ఎన్ హోదా రద్దు..
న్యూఢిల్లీ: ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంలో (డీటీఏఏ) భాగంగా భారత్‌కి అనుకూల దేశంగా ఇచ్చిన హోదా (ఎంఎఫ్ఎన్) నిబంధనను స్విట్జర్లాండ్ ప్రభుత్వం రద్దు చేసింది. భారత్ ట్యాక్స్ ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏదైనా ఓఈసీడీలో (ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ) చేరినప్పుడు, ఎంఎఫ్ఎన్ నిబంధన ఆటోమేటిక్‌గా అమల్లోకి రాదంటూ నెస్లే కేసులో భారత సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చిన నేపథ్యంలో స్విస్ ఫైనాన్స్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో భారత్‌లో స్విస్ పెట్టుబడులపై ప్రభావం పడనుండగా, ఆ దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కంపెనీలపై అధిక పన్నుల భారం పడనుంది. తమ దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కంపెనీలు ఆర్జించే డివిడెండ్లపై స్విట్జర్లాండ్ ఇకపై 10 శాతం పన్ను విధించనుంది. -
విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్
ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా అవతరించడమే భారత్ లక్ష్యమని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అధీకృత ఆర్థిక ఆపరేటర్ల (ఏఈవోలు) భాగస్వామ్య విస్తరణ, సమగ్ర స్వేచ్ఛా ఆర్థిక కేంద్రాలు, వినూత్నమైన విధానాలను ప్రోత్సహించడం వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పారు.‘సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ అనుసంధానతతో నూతన బెంచ్‌మార్క్‌లను (ప్రమాణాలు) ఏర్పాటు చేయాలనే భారత్ లక్ష్యం’ అని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఈవోల సదస్సులో భాగంగా మల్హోత్రా తెలిపారు. టెక్నాలజీ, విశ్వాసం రెవెన్యూ విభాగానికి రెండు స్తంభాలుగా పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిర్వహణలో భారత్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అప్పీళ్లు, రిఫండ్లు, చెల్లింపులు తదితర సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!‘బిలియన్ల కొద్దీ బిల్లులను ఏటా జారీ చేస్తుంటాం. టెక్నాలజీ సాయం లేకుండా ఈ స్థాయిలో నిర్వహణ సాధ్యం కాదు. భారత్ అన్ని పోర్టులను ఆటోమేట్ చేయాలనుకుంటోంది. 20 ప్రధాన పోర్టుల్లో 17 పోర్టులు ఇప్పటికే ఆటోమేట్‌గా మారాయి. పోర్టుల్లో అన్ని సేవలను, అన్ని సమయాల్లో ఆన్లైన్, ఎలక్ట్రానిక్ రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
విదేశాల్లో పెరిగిన భారత బ్యాంకు శాఖలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యాంకుల విదేశీ అనుబంధ సంస్థలు, శాఖల సంఖ్య 417కి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 399గా ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య విదేశీ శాఖల్లో 0.5 శాతం, అనుబంధ సంస్థల్లో 6.2 శాతం పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన 2022–23 ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విదేశాల్లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 14 భారతీయ బ్యాంకులు, అలాగే భారత్‌లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 44 విదేశీ బ్యాంకులపై ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారత్‌లో విదేశీ బ్యాంకుల శాఖలు, ఉద్యోగుల సంఖ్య తగ్గింది. -
కార్పొరేట్లకు మద్దతులో ఎస్బీఐ పాత్ర భేష్
కొలంబో: భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలోసైతం కార్పొరేట్లకు మద్దతు ఇవ్వడంలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న సేవలు అద్భుతమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అంతక్రితం ఆమె శ్రీలంక తూర్పు ఓడరేవు పట్టణం ట్రింకోమలీలో ఎస్బీఐ శాఖను ప్రారంభించారు. తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంకలో భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు విచ్చేసిన సీతారామన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎస్బీఐ బ్రాంచ్‌ను ప్రారంభించే ముందు నగరంలో ప్రధాన హిందూ దేవాలయాన్ని సైతం సందర్శించి పూజలు చేశారు. అనంతరం లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఎస్బీఐ శాఖ ప్రారంభం అనంతరం ఆమె ఏమన్నారంటే. వాణిజ్యాభివృద్ధిలో ఎస్బీఐ 159 సంవత్సరాల గణనీయమైన ప్రభావాన్ని కలిగిఉంది. ఇది శ్రీలంకలో అత్యంత పురాతనమైన బ్యాంక్. స్వదేశంతో పాటు విదేశాల్లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు భారత్ 1 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన క్రెడిట్ లైన్‌ను సజావుగా కొనసాగించడానికి ఎస్బీఐ మార్గం సుగమం చేసింది. శ్రీలంకలోని బ్రాంచ్ కార్యకలాపాలతో పాటు, ఎస్బీఐ శ్రీలంక యోనో యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా బలమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఎస్బీఐ నిర్వహిస్తోంది. తద్వారా డిజిటల్ చెల్లింపుల పురోగతికి దోహదపడుతోంది. ద్వైపాక్షిక చర్చల పునఃప్రారంభ నేపథ్యం... దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం (ఈటీసీఏ) కోసం భారత్– శ్రీలంక ఉన్నతాధికారుల మధ్య చర్చల పునఃప్రారంభం నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శ్రీలంక మూడురోజుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2016 నుంచి 2018 వరకు ఇరుదేశాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. ఆ తర్వాత చర్చలు నిలిచిపోయాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ మధ్య 12వ దఫా చర్చలు జరిగాయి. 12వ రౌండ్లో వస్తు సేవలు, కస్టమ్స్ విధానాలు, వాణిజ్య సౌలభ్యం, వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు, నివారణ వంటి పలు అంశాలు చోటుచేసుకున్నాయి. భారత్‌కు చెందిన అనేక ప్రముఖ కంపెనీలు శ్రీలంకలో ఇప్పటికే పెట్టుబ డులు పెట్టాయి. పెట్రోలియం రిటైల్, టూరిజం, హోటల్, తయారీ, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలలో భారతదేశం నుండి ప్రధాన పెట్టుబడులు ఉన్నాయి. 2022–23లో శ్రీలంకకు భారత్ ఎగుమతులు 5.11 బిలియన్ డాలర్లు. 2021–22లో ఈ విలువ 5.8 బిలియన్ డాలర్లు. ఇక భారత్ దిగుమతులు చూస్తే, 2021–22లో ఈ విలువ ఒక బిలియన్ కాగా, 2022–23లో 1.07 బిలియన్ డాలర్లకు చేరింది. -
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్‌ఆర్‌వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్‌కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్‌లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్‌జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
పనామా ట్రాఫిక్‌జామ్!
అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌకలు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కారణమేమిటి? పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం. మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’ పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనేట్ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని ముందుకు వాలింది. ► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు. ► 2013 ఏడాదిలో హెచ్కేఎన్డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది. అంత ఈజీ కాదు... నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే... ► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్‌ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది. ► అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి. ► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే. ► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఇదీ పనామా కథ ► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. ► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. ► దీని పొడవు 80 కిలోమీటర్లు. ► పనామా కాలువ మధ్యలో గతూన్ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు ఈ కాలువకు రిజర్వాయర్‌గా ఉంది. ► ఇటు పసిఫిక్ మహా సముద్రం, అటు అట్లాంటిక్ మహా సముద్రం వైపు కరేబియన్ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్ ఆఫ్ పనామను ఆనుకుని పనామా కాలువ ఉంటుంది. ► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది. ► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి. ఏం జరగనుంది? ► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు. ‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’ – మిషెల్ వైస్ బోక్మ్యాన్, లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు -
Upi-Paynow Linked: పేనౌతో ఎస్బీఐ జట్టు
ముంబై: యూపీఐ ప్లాట్‌ఫాం ఆధారంగా సీమాంతర చెల్లింపులకు వెసులుబాటు కల్పించే దిశగా సింగపూర్‌కి చెందిన పేనౌతో జట్టు కట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. భీమ్ ఎస్బీఐపే మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. భారత్ నుంచి సింగపూర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల ద్వారా, సింగపూర్ నుంచి భారత్‌కు యూపీఐ ఐడీ ద్వారా నగదు బదిలీ చేయొచ్చని వివరించింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక రెమిటెన్సులు ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. -
డిసెంబర్ క్వార్టర్లో మాంద్యంలోకి యూరప్ దేశాలు
ఫ్రాంక్ఫర్ట్: ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్‌లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది. -
త్వరలో 10 బిలియన్ డాలర్లకు ’రూపీ’ ఎగుమతులు
కోల్‌కతా: రూపాయి మారకం ఆధారిత ఎగుమతులు త్వరలో 8–10 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు. రష్యాలో భారత ఉత్పత్తులకు డిమాండ్ పటిష్టంగా ఉండటం, రెండు దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన తెలిపారు. విదేశీ కరెన్సీ మారకం ఆధారిత ఎగుమతులకు ఇచ్చే ప్రయోజనాలన్నీ రూపీ ఆధారిత ఎగుమతులకు కూడా ప్రభుత్వం, బ్యాంకులు కల్పించడం కోసం ఎగుమతిదారులు ఎదురుచూస్తున్నారని సహాయ్ తెలిపారు. యూకో తదితర బ్యాంకులు ప్రాసెసింగ్ మొదలుపెట్టాక వచ్చే పక్షం రోజుల్లో రూపాయి మారకంలో సెటిల్మెంట్ ఆధారిత వాణిజ్య విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు సహాయ్ వివరించారు. ప్రస్తుతం రష్యాకు భారత్ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రష్యా నుండి దిగుమతులు (ఎక్కువగా ఆయిల్) 400 శాతం పెరిగాయి. ఇక భారత్ నుంచి రష్యాకు ఎక్కువగా టీ, కాఫీ, పొగాకు, చక్కెర మినహా ఇతర ఎగుమతులు తగ్గుతున్నాయి. అయితే, రూపాయి ట్రేడింగ్ మెకానిజం అందుబాటులోకి వచ్చాక ఈ వాణిజ్య లోటు క్రమంగా తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. 750 బిలియన్ డాలర్ల టార్గెట్ సాధిస్తాం.. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 750 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సులభంగానే సాధించగలమని సహాయ్ ధీమా వ్యక్తం చేశారు. దేశీయంగా సర్వీసుల వృద్ధి పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తుల ఎగుమతులు 6.6 శాతం వృద్ధితో 450 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సర్వీసులు 30 శాతం వృద్ధి చెంది 330–340 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి ఉత్పత్తుల ఎగుమతులు 232 బిలియన్ డాలర్లుగాను, సర్వీసులు 150.4 బిలియన్ డాలర్లుగాను ఉన్నట్లు తెలిపారు. ‘అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అవాంతరాలు ఉన్నప్పటికీ భారత్ పటిష్ట స్థానంలో ఉంది. యూరప్‌కు రష్యా ఉత్పత్తుల ఎగుమతులు (చమురు, గ్యాస్ కాకుండా) 65 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి. అలాగే తయారీ కోసం చైనాపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇతర దేశాలు పాటిస్తున్న విధానాలు కూడా భారత్ ఎగుమతులను పెంచుకునేందుకు దోహదపడవచ్చు‘ అని సహాయ్ చెప్పారు. -
రెండు ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ వాణిజ్యం లక్ష్యం
శాన్ఫ్రాన్సిస్కో: భారత్ వస్తు, సేవల ఎగుమతులు గత సంవత్సరం ముగిసే నాటికి 675 బిలియన్ డాలర్లు దాటాయని, 2030 నాటికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని దేశం ఆకాంక్షిస్తున్నదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇక్కడి స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో సంభాషించిన గోయల్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, భారతదేశం తన స్వాతంత్య్ర 100వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సమయానికి, 30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ ప్రణాళికలు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ విలువ 35 నుంచి 45 ట్రిలియన్ల స్థాయినీ అందుకోగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ల ఎకానమీతో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. భారత్ ముందు వరుసలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు ఉన్నాయి. దశాబ్దం క్రితం భారత్ 11వ స్థానంలో ఉండేది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధితో బ్రిటన్ను భారత్ ఎకానమీ ఆరవ స్థానంలోకి నెట్టింది. తక్షణం ఇబ్బందులే... కాగా, అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం, అనిశ్చితి వంటి పరిస్థితుల్లో భారత్ ఎగుమతులు కష్టకాలాన్ని ఎదుర్కొన తప్పదని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాలు వంటి రంగాలు ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, రష్యా–ఉక్రెయిన్, చైనా–తైవాన్ మధ్య ఉద్రిక్తతలు, సరఫరాల సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి వేగానికి, డిమాండ్ బలహీనతకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయి. విలువలో 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతుల్లో క్షీణత నమోదుకావడం 20 నెలల్లో ఇదే తొలిసారి. ఎగుమతుల క్షీణత–భారీ దిగుమతులపై ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు కూడా ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు ఇదే ఐదు నెలల కాలంలో 45.64 శాతం పెరిగి 317.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 53.78 బిలియన్ డాలర్ల నుంచి 125.22 బిలియన్ డాలర్లకు చేరింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతుల విలువ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లు. యూఎస్ ఇన్వెస్టర్లతో స్టార్టప్స్ అనుసంధానం భారత స్టార్టప్స్‌ను యూఎస్ ఇన్వెస్టర్లతో అనుసంధానించేందుకు.. సపోర్టింగ్ ఎంట్రప్రెన్యూర్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అప్‌స్కిల్లింగ్ (సేతు) పేరుతో కార్యక్రమానికి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ శ్రీకారం చుట్టారు. భారత్‌లో వ్యవస్థాపకత, వృద్ధి దశలో ఉన్న స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న యూఎస్‌లోని ఇన్వెస్టర్ల మధ్య భౌగోళిక అడ్డంకులను అధిగమించడానికి సేతు రూపొందించారు. నిధుల సమీకరణ, ఉత్పత్తుల విక్రయం, వాణిజ్యీకరణకై ఇన్వెస్టర్లు మార్గదర్శకత్వం వహిస్తారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని స్టార్టప్స్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు భారత్‌లో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్టు గోయల్ తెలిపారు. స్టార్టప్స్‌లో 90 శాతం, అలాగే నిధులు అందుకున్న స్టార్టప్స్‌లో సగం ప్రారంభ దశలోనే విఫలం అవుతున్నాయని గుర్తు చేశారు. వ్యాపారాన్ని నిర్వహించడంలో అనుభవం లేకపోవడం ఒక కీలక సమస్య అని అన్నారు. నిర్ణయం తీసుకోవడానికి, నైతిక మద్దతు కోసం వ్యవస్థాపకులకు సరైన మార్గదర్శకత్వం అవసరమని వివరించారు. స్టార్టప్స్‌కు అండగా నిలిచేందుకు మార్గ్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 200 పైచిలుకు మెంటార్స్ పేర్లు నమోదు చేసుకున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో మాట్లాడుతున్న గోయల్ -
విధాన చికిత్సతోనే ఆర్థికారోగ్యం
అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి వేగంగా పతనమవుతోంది. డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపాయలు వెచ్చించాలి. విలువ తగ్గిన కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోతాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. రూపాయి విలువ పతనం మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమ లాభదాయికతను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ విధానపరమైన జోక్యం ద్వారా కేంద్రప్రభుత్వం రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి మారక విలువ ఇటీవలి సంవత్సరాల్లో దిగజారిపోతూ వచ్చింది. దీంతో ఆర్థికవ్యవస్థ, అంతర్జాతీయ నగదు బదిలీలు ప్రభావితం అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ సాపేక్షిక బలం ఈ సంవత్సరం 5.9 శాతానికి పడిపోయింది. దీంతో అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి బలం వేగంగా పతనమవుతూ వస్తోంది. అంటే డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపా యలు వెచ్చించాలన్నమాట. రూపాయి విలువ పతనమవుతున్నదంటే, స్థూల ఆర్థిక ప్రాథమిక సూత్రాల బలహీనతకు అది సంకేతం. స్థూల ఆర్థిక చరాంకాల్లో వడ్డీ రేటు, అంతర్జాతీయ వాణిజ్యం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణం, నిరు ద్యోగిత, మదుపు అనేవి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సూచికలు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చాలినన్ని చర్యలు చేపట్టకపోవడం... రూపాయి పతనం సహా, స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు దిగ జారడాన్ని అనుమతించినట్టయింది. రూపాయి పతనమవుతున్న రేటు సమీప భవిష్యత్తులో భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రమాదాలను ఎదుర్కొనబోతోందన్న సంకేతాలను వెలువరిస్తోంది. మారకపు రేటు అస్థిరత్వం అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిణా మాలతో నేరుగా ప్రభావితం అవుతుంది. అంతర్జాతీయంగా చూస్తే, చుక్కలనంటిన చమురు ధరలు, చమురు దిగుమతులపై భారతదేశం అత్యధికంగా ఆధారపడటం అనేవి స్వేచ్ఛాయుతంగా చలించే మార కపు రేటు వ్యవస్థలో రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేశాయి. విలువ తగ్గిపోయిన భారతీయ కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం మేరకు ముడి చమురు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ప్రపంచంలోనే చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న మూడో దేశం భారత్. ఏటా 212.2 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2021–22లో ఈ దిగు మతులు విలువ 119 బిలియన్ డాలర్లు. బ్రెంట్ ఆయిల్ ధర బ్యారెల్ 110 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు అమ్మ కాలు డాలర్లలోనే జరుగుతున్నాయి కనుక డాలర్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. రూపాయి విలువ పడిపోవడం అనేది మన ఎగుమతు లకు సాయం చేసినప్పటికీ, దిగుమతులపై అధికంగా ఆధారపడటం కారణంగా భారత్ దెబ్బతింటోంది. దేశీయంగా చూస్తే, భారత్ ఇప్పటికే 9.6 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయిలో కరెంట్ అకౌంట్ లోటు సమస్యను ఎదుర్కొంటోంది. ఇది దేశ స్థూలదేశీయోత్పత్తిలో 1.3 శాతానికి సమానం. రూపాయి బలహీనపడుతుండటంతో కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరగవచ్చు. పైగా, జీడీపీలో 6.4 శాతం అధిక ద్రవ్యలోటు వల్ల 2022–23 సంవత్సరంలో భారత విదేశీ రుణం రూ. 1,52,17,910 కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో 9.41 లక్షల కోట్ల మేరకు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. లేదా ఇది మొత్తం రెవెన్యూ వ్యయంలో 29 శాతం. రూపాయి విలువ పతనం కావడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. పైగా, ద్రవ్యోల్బణం అత్యధికంగా 7 శాతానికి చేరడం, విదేశీ సంస్థాగత మదుపుదారులు 2022లో 28.4 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను ఉపసంహరించుకోవడం కూడా డాలర్ మారక రూపాయి క్షీణించడానికి దారి తీసింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం వల్ల తాము పెట్టిన పెట్టుబడులకు తక్కువ రాబడులు రావడం లేదా లాభ దాయకత తగ్గిపోవడంతో పెట్టుబడుల ఉపసంహరణ వేగం పుంజు కుంది. లాభాలను ఆశించడంతోపాటు, తాము పెట్టుబడులను పెట్టా లంటే స్థిరమైన, నిలకడైన స్థూల ఆర్థిక వ్యవస్థ ఉండాలని విదేశీ సంస్థాగత మదుపుదారులు కోరుకుంటారు. మరోవైపున రూపాయి కొనుగోలు శక్తి బలహీనపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతుల ఖర్చులు అత్యధికంగా పెరిగి పోయాయి. అధిక ద్రవ్యోల్బణం రేటు రూపాయి విలువను దిగజార్చి వేసింది. అంటే జీవనవ్యయం పెరిగిపోయిందని అర్థం. దీని ఫలి తంగా ఉత్పత్తి ఖర్చులు, జీవన వ్యయం పెరిగి, పరిశ్రమలు, మదుపు దారులు లాభాలు సాధించే అవకాశం హరించుకుపోయింది. అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్లోని ‘హాట్ కరెన్సీ’తో పోలిస్తే ఒక దేశం కరెన్సీ విలువ పెరగడాన్ని బట్టే ఆ దేశ ఆర్థిక శక్తి నిర్ణయించబడుతుందని ఇది సూచిస్తుంది. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థికవ్యవస్థగా మారాలని భారత్ ఆకాంక్షిస్తోంది. కానీ ఇతర దేశాలతో సమానంగా భారత ఆర్థిక శక్తిని నిర్ణయించడంలో అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్ ముఖ్యపాత్ర వహిస్తుందని మరవరాదు. విధానపరమైన జోక్యం ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకోలేక పోయినట్లయితే ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ప్రమాదముంది. రూపాయి విలువ పతనం వల్ల చెల్లింపుల సమస్య మరింత దిగజారిపోతుంది, మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమల లాభదాయిక తను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. విదేశాలకు వెళ్లే భారతీయులపై భారం పెరిగిపోతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. నిరుద్యోగం అమాంతం పెరుగుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ సకాలంలో, కఠినమైన విధాన పరమైన జోక్యం చేసుకోవడం ద్వారానే డాలర్ మారక రూపాయి విలువ పతనాన్ని కేంద్రప్రభుత్వం అడ్డుకోవచ్చు. పెరిగిపోతున్న ఎక్స్చేంజ్ రేట్లను సమర్థంగా నిర్వహించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అంతకు మించి భారత్‌లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. డీజిల్, పెట్రోల్ వంటి ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ పన్నులు అధికంగా ఉన్నాయి. వీటిని కుదించాల్సిన అవసరం ఉంది. డాలర్ల రూపంలో విదేశీ మారకద్రవ్యాన్ని 49 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపర్చడంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వలను 600 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పర్చడంలో ఆర్బీఐ సమర్థంగా పనిచేస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల రూపంలో ఉంచిన డాలర్లను విడుదల చేయడం ద్వారా మన కరెన్సీ విలువను స్థిరపర్చడానికి ఆర్బీఐ జోక్యం తోడ్పడుతుంది. మన రూపాయికి విదేశీ విలువ పైనే ఆర్థిక పురోగతి, ద్రవ్య సుస్థిరత ఆధారపడి ఉంటాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మదుపు దారులు, ప్రవాస భారతీయ మదుపుదారులను ప్రోత్సహించాలంటే రూపాయి విలువకు విదేశాల్లో స్థిరత్వాన్ని ఆర్బీఐ కలిగించాలి. ఎందుకంటే ఆఫ్ షోర్ కరెన్సీ, ఇతర ద్రవ్యపరమైన రిస్కులు ఆర్థిక వ్యవస్థపై వేగంగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి, బలమైన ఆఫ్‌షోర్ రూపీ మారక మార్కెట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ మారక స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా, డాలర్ మారక రూపాయి అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న ఆటు పోట్లను తగ్గించవచ్చు కూడా. దీనికి సంబంధించి ఉషా తోరట్ అధ్యక్షతన ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్లపై టాస్క్ ఫోర్స్ రూపొందించిన నివేదిక సిఫార్సులను రిజర్వ్ బ్యాంక్ తప్పనిసరిగా పరిగణించాల్సి ఉంది. బలమైన దేశీయ, విదేశీ రూపీ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తే, అది స్థిరమైన ధరల నిర్ణాయకం లాగా వ్యవహరిస్తుందనీ, విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో మన రూపాయిపై డాలర్ కలిగించే షాక్‌లను తట్టు కునేలా చేస్తుందనీ ఈ నివేదిక సూచించింది. కృష్ణ రాజ్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్, బెంగళూరు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇక ‘రూపీ’లోనూ విదేశీ వాణిజ్యం!
ముంబై: భారత రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా గుర్తించే దిశగా కీలక అడుగు పడింది. వాణిజ్య లావాదేవీలను రూపాయల్లో సెటిల్మెంట్ (నిర్వహించేందుకు) చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. తాజా చర్య భారతదేశం నుండి ఎగుమతులకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడానికి అలాగే రూపాయిపై గ్లోబల్ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దాదాపు 6 శాతం కరిగిపోయిన రూపాయికి మద్దతును ఇవ్వడానికి ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే దేశం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంది. ఈ దిశలో తాజాగా అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి భారత్ రూపాయి పట్ల విశ్వాసం పెరగడానికి కీలకచర్య తీసుకుంది. లాభం ఏమిటి? కొన్ని దేశాలతో వాణిజ్యం కోసం అమెరికా డాలర్ వంటి ప్రపంచ కరెన్సీని ఉపయోగించకుండా, ప్రత్యామ్నాయ మార్గాన్ని భారత్‌కు కల్పిస్తుంది. ఉదాహరణకు, ఉక్రెయిన్ నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యాకు డాలర్ అందుబాటును అమెరికా తగ్గించింది. ఇది రష్యన్ వస్తువుల తక్కువ ధరను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్న భారతీయ కంపెనీలను... దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతులవైపు చూసేలా చేసింది. కొత్త యంత్రాంగం పనితీరు ఇలా... కొత్త సెటిల్మెంట్ యంత్రాంగం ప్రకారం, ఎగుమతులు– దిగుమతులు రెండు వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల మధ్య మార్కెట్ నిర్ణయించబడే మారకపు రేటుతో రూపాయిలో డినామినేట్ అవుతాయి. ఈ మేరకు ఇన్వాయిస్ రూపొందుతుంది. ఈ వాణిజ్య ఒప్పందాల సెటిల్మెంట్కు అధీకృత భారతీయ బ్యాంకులు భాగస్వామి ట్రేడింగ్ దేశంలోని ఆ దేశ అధీకృత బ్యాంకులో ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను తెరవాలి. ఈ యంత్రాంగాన్ని ఉపయోగించే భారతీయ దిగుమతిదారులు రూపాయల్లో చెల్లించాలి. ఈ మొత్తాలు వస్తువులు లేదా సేవల సరఫరాలకు సంబంధించి ఇన్వాయిస్లకుగాను భాగస్వామి దేశం కరస్పాండెంట్ బ్యాంక్ ప్రత్యేక వోస్ట్రో ఖాతాలోకి జమ అవుతాయి. మరోవైపు భారతీయ ఎగుమతిదారులు, భాగస్వామి దేశం కరస్పాండెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వోస్ట్రో ఖాతాలోని బ్యాలెన్స్ నుండి రూపాయలలో తమ డబ్బును పొందుతారు. ఈ విధానం కింద భారతీయ ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులను కూడా రూపాయిల్లో పొందవచ్చు. అయితే, అటువంటి ముందస్తు చెల్లింపు చేయడానికి ముందు, బ్యాంకులు సంబంధిత ఖాతాల్లో అందుబాటులో ఉన్న నిధులను ముందుగా అమలు చేసిన ఎగుమతి ఆర్డర్ల కు చెల్లింపులు చేయడానికి ఉపయోగించాలి. ఆపై నిధులనే పరస్పర అవగాహన మేరకు ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులుగా వినియోగించాలి. 80 దిశగా రూపాయి... డాలర్ మారకంలో రూపాయి పతన రికార్డు ఆగడం లేదు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం 19 పైసలు పతనంతో 79.45కు క్షీణించింది. ఒక దశలో 79.50ని కూడా చూసింది. రూపాయికి ఈ రెండు స్థాయిలూ చరిత్రాత్మక కనిష్టాలు. అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్, దేశం నుంచి విదేశీ పెట్టుబడుల వరద, క్రూడ్ ఆయిల్ ధరల అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల పెంపు వంటి పలు అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. -
గ్లోబల్ విలేజ్‌కు మహమ్మారి తూట్లు..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ విధానాలతో ప్రపంచం కుగ్రామంగా మారితే కోవిడ్-19 ప్రభావంతో ఈ భావన మసకబారనుంది. కరోనా మహమ్మారికి ముందు ప్రపచం గ్లోబల్ విలేజ్‌గా రూపుమార్చుకోగా..ఈ మహమ్మారి నెమ్మదించిన తర్వాత దేశాలు తమ ప్రజలను కాపాడుకునేందుకు రక్షణాత్మక విధానాలతో సరిహద్దుల్లో గిరిగీసుకునే పరిస్థితి నెలకొంది. ఈ వాతావరణం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. కోవిడ్-19తో ఇప్పటికే సాధారణ జనజీవనం, ఆర్థిక కార్యకలాపాలు స్తంబించడంతో ప్రపంచ వాణిజ్యం 2020లో 13 నుంచి 32 శాతం పడిపోతుందని డబ్ల్యూటీఓ అంచనా వేస్తుండగా మహమ్మారి పురోగతి చూస్తుంటే అంతర్జాతీయ వాణిజ్యంపై కోవిడ్-19 ప్రభావం అంచనాలకు మించి ఉండనుంది. బారత్ సహా పలు దేశాలు ఇప్పటికీ లాక్డౌన్లో కొనసాగుతుంటే ఈ సంక్షోభం 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించిన స్ధాయిలో ప్రబావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీమాంతర వాణిజ్యమే మార్గాంతరం లాక్డౌన్ అమలుతో రవాణా నిలిచిపోవడంతో డిమాండ్, సరఫరాల వ్యవస్థకు తీవ్ర ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకున్న అనంతరం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆయా దేశాలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పరిమితంగా ఉన్న క్రమంలో స్ధానిక మార్కెట్లు , వ్యాపారులకు ఊతమిచ్చేందుకు ముందుకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో సీమాంతర వాణిజ్య పునరుద్ధరణకకు బారత్ చొరవ చూపాలి. ఏడాది కిందట 2019 ఏప్రిల్ 18న సలామాబాద్, చకన్ ద బాగ్ల ద్వారా సాగే సీమాంతర వాణిజ్యాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్‌కు చెందిన విద్రోహ శకక్తులు ఈ మార్గం దా్వరా దేశంలోకి అక్రమ ఆయుధాలు, నార్కోటిక్స్, నల్లధనం చేరవేస్తాయనే ఆందోళనతో భారత్ ఈ నిర్ణయం తీసకుంది. ఇరు దేశాల మధ్య విశ్వాసపూరిత వాతావరణం నెలకొల్పే ఉద్దేశంతో 2008లో సీమాంతర వాణిజ్యాన్ని ప్రారంభించారు. వారానికి నాలుగు రోజుల పాటు రోజుకు 70 ట్రక్కుల సరుకు రవాణాకు ఇరు దేశాల ప్రజలు, వ్యాపారులకు అనుమతించారు. 2008 నుంచి 2019 మధ్య నియంత్రణ రేఖ వెంబడి రూ 7500 కోట్ల వాణిజ్య కార్యకలాపాలు నమోదయ్యాయి. దాదాపు 1,70,000 పనిదినాలు, జమ్ము కశ్మీర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టర్లకు రూ 66 కోట్లు సరుకు రవాణా రాబడి సమకూరింది. జమ్ము కశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో ఈ గణాంకాలు నామమాత్రమైనా దీనిపై పెద్దసంఖ్యలో స్ధానిక వ్యాపారులు, ట్రాన్స్పోర్టర్లు, రోజువారీ కార్మికులు తమ జీవనం వెళ్లదీస్తున్నారు. జాతీయ భద్రతపై ఆందోళనలు, ఈ వర్తకంపై అనిశ్చితి ఇలాంటి ఎన్నో సందిగ్ధతలున్నా సీమాంతర వాణిజ్యం పదేళ్లకు పైగా నిరాటంకంగా కొనసాగింది. చదవండి : నేటి ‘కరోనా శుభ్రత’ నాడే ఉంది! 2019లో సీమాంతర వాణిజ్యాన్ని ప్రభుత్వం నిలిపివేసినప్పటి నుంచీ దీనిపై ఆధారపడిన వేలాది కుటుంబాల మనుగడ ప్రశ్నార్ధకమైంది. ఇతర రంగాలకు మళ్లాలనుకునే వర్తకులు, కార్మికులు, ట్రాన్స్‌పోర్టర్లకు కోవిడ్-19 రూపంలో పెను విఘాతం ఎదురైంది. మహమ్మారి నెమ్మదించిన తర్వాత పరిమితంగానైనా సీమాంతర వాణిజ్యానికి అనుమతిస్తే ఆర్థిక కార్యకలాపాలు పుంజకుంటాయని చెబుతున్నారు. భద్రతాపరమైన సమస్యలు తలెత్తకకుండా నియంత్రణ పద్ధతులు పాటిస్తూ పూర్తి పారదర్శకతతో, ఆడిటింగ్ ప్రమాణాలతో, భద్రతా సిబ్బంది నీఘా నీడన సీమాంతర వాణిజ్యానికి అనుమతించాలన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న అనంతరం అంతర్జాతీయ వాణిజ్యం స్వరూం మారుతుందనే అంచనాల నేపథ్యంలో స్ధానిక మార్కెట్లకు ఊతమిచ్చేలా ఆయా దేశాలు సరిహద్దుల్లో పొరుగుదేశాలతో బోర్డర్ ట్రేడ్‌కు ప్రాధాన్యతను ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో బారత్ సైతం ఇదే బాటన నడవాలని భావిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఇన్నోవ్యాప్టివ్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం
గచ్చిబౌలి: హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాన్ని ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ సోమవారం ప్రారంభించింది. ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం, టెక్నికల్ సర్వీస్ సెంటర్‌ను సైయింట్ చైర్మన్ బి.వి. మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ దేశీయంగా తమ వాణిజ్యాన్ని అభివృద్ధి పర్చాలని మోహన్ రెడ్డి సూచించారు. వినియోగదారులకు సేవలందించడంలో సాంకేతికత, నాణ్యత, నైపుణ్యత, విశ్వాసం, సమయ పాలన, మార్కెట్ మెళకువలు, నూతన ఆవిష్కరణలు, కాస్ట్ ఎఫెక్టివ్ నెస్ అనే అంశాలు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ సహా వ్యవస్థాపకులు, ముఖ్య కార్య నిర్వహణాధికారి సందీప్ రవండే మాట్లాడుతూ 5 మిలియన్ డాలర్లతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 150 వర్కింగ్ స్టేషన్లతో గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. త్వరలో హైదరాబాద్, బెంగుళూర్ నగరాలలో మరో మూడు మిలియన్ డాలర్ల వ్యయంతో లోకోడ్, నో– కోడ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇన్నోవ్యాప్టివ్ సంస్థ ప్రస్తుతం ఆమెరికాలోని హోస్టర్‌లో కేంద్ర కార్యాలయాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. కేంద్రం కార్యాలయంతో పాటు 16 దేశాల్లో సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ ఆపరేషన్స్ వైస్ ప్రసిడెంట్ అభిషేక్ పరకాల, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమర్‌ప్రతాప్, హెచ్ఆర్ అండ్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ అమన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. -
మొట్టమొదటిసారి పెరుగుతున్న వాణిజ్య అడ్డంకులు
గత దశాబ్దకాలంలో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓ వైపు బ్రెగ్జిట్ చర్చలు, మరోవైపు అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, దాని ప్రతీకారంగా ఇతర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బకొడుతున్నాయి. బ్రెగ్జిట్ చర్చలతో వ్యాపార మార్కెట్లో అస్థిరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ అస్థిరత ఇంకా కొనసాగుతూ ఉండగానే... అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై టారిఫ్‌లు విధించింది. ఈ టారిఫ్‌లను తీవ్రంగా నిరసిస్తూ.. ఇతర దేశాలు కూడా అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం సన్నగిల్లుతోందని ప్రపంచ నేతలు అంటున్నారు. తాజాగా కెనడాలో జరిగిన జీ7 సమావేశంలో కూడా అంతర్జాతీయ ప్రతినిధులు ఇదే విషయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల అధినేతలందరూ తమ తమ ఆందోళనను వెల్లబుచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుల జాబితా కూడా మారిపోయిందని తెలిసింది. అసలు 2017లో టాప్ ఎగుమతిదారులుగా ఉన్న దేశాలేమిటో ఓ సారి చూద్దాం.. ఏడాదికి 2.26 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులతో 2017లో చైనా ఆధిపత్య స్థానంలో ఉంది. ఆ అనంతరం జర్మనీ భారీ మొత్తంలో ఆటోమొబైల్స్‌ను ఎగుమతి చేసి.. ప్రతేడాది 1.45 ట్రిలియన్ డాలర్లను ఆర్జించింది. అంటే ఒక్కో వ్యక్తికి 18వేల డాలర్లు వచ్చాయన్న మాట. అయితే అమెరికా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎగుమతిదారిగా ఉన్నప్పటికీ, తలసరి ఆదాయం పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం ఎగుమతుల్లో జర్మనీ కంటే తక్కువ స్థాయిల్లోనే ఉన్నట్టు వెల్లడైంది. 2017లో అమెరికా 1.55 ట్రిలియన్ డాలర్ల ఎగుమతలు చేపట్టింది. అంటే ఒక్కో వ్యక్తికి 4,800 డాలర్లు మాత్రమే ఆర్జించింది. -
చంద్రబాబుకు బ్రిటన్ షాక్!
-
అంత సొల్లొద్దు
బాబుకు బ్రిటన్ షాక్! ⇒ రాజధానిపై ఊహాగానాలు కాకుండా వాస్తవాలు చెప్పాలని సూచన ⇒ లండన్ పర్యటన రద్దు చేసుకున్న సీఎం ⇒ ఆయన స్థానంలో మంత్రి నారాయణ సాక్షి, అమరావతి: చంద్రబాబుకు బ్రిటన్ ప్రభుత్వం షాకిచ్చింది. దీంతో ఆయన తన లండన్ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో మంత్రి నారాయణ వెళుతున్నట్లు సీఆర్డీఏ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు..బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు లండన్‌లో ఇంటర్నేషనల్ ట్రేడ్ వాటర్ టెక్నాలజీపై ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పురోగతి, మార్కెటింగ్ అవకాశాలపై విస్తృత చర్చలు జరపడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం. ఇందులో పాల్గొనేందుకు మరికొందరితో పాటు ఏపీ సర్కారుకూ ఆహ్వానం అందింది. అయితే సదస్సులో చెప్పాలనుకునే విషయాన్ని ముందుగా తమకు తెలియజేయాలని ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం కోరింది. ఏ దేశం వెళితే ఆ దేశంలా, ప్రపంచస్థాయిలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పే చంద్రబాబు ఈసారి కూడా.. భవిష్యత్తులో ఎంత అద్భుతంగా రాజధానిని తీర్చిదిద్దబోయేదీ సవివరంగా తెలియజేసేలా ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాబు డైరెక్షన్ మేరకు అధికారులు ప్రజెంటేషన్‌ను తయారు చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని నిర్మాణానికి రైతులంతా భూములిచ్చారని, ఆయన తన సమ్మోహనా శక్తితో లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, ఇంటర్నేషనల్ స్కూళ్ళు, కాలేజీలు తరలి వస్తున్నాయని, పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రాజధాని పరిధిలో భవిష్యత్‌లో 3 లక్షల ప్రత్యక్ష, 5.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయంటూ గ్రాఫ్లతో సహా అద్భుత ఊహాచిత్రానికి రూపకల్పన చేసి సీడీ రూపంలో బ్రిటన్‌కు పంపారు. అయితే ప్రభుత్వం పంపిన నివేదికపై బ్రిటన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాగానాలు కాకుండా ఇప్పటివరకు సాధించిన పురోగతి చెబితే బాగుంటుందని తెలిపింది. సదస్సులో వాస్తవాలను ప్రస్తావించాలని సూచించినట్టు తెలిసింది. లండన్ వేదికగా మరోసారి అంతర్జాతీయ సమాజానికి లెక్చర్ ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఊహించని ఈ పరిణామంతో తన పర్యటన రద్దు చేసుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వెళ్లాల్సి ఉన్నా.. లండన్‌లో జరిగే ఇంటర్నేషనల్ ట్రేడ్ సదస్సుకు వాస్తవంగా ముఖ్యమంత్రి వెళ్ళాల్సి ఉందని, కానీ ఆయన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఆయన ప్రతినిధిగా మంత్రి నారాయణ వెళ్తున్నారని సీఆర్డీఏ మీడియా సలహాదారు ఎ. చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విష యమై సీఆర్డీఏ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని, సదస్సులో ఏయే అంశాలను ప్రస్తా వించాలో వివరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. నేనొక్కడినే కష్టపడుతున్నా: చంద్రబాబు మంత్రులెవరూ సరిగా పనిచేయడం లేదని మండిపాటు రాష్ట్ర మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేనొక్కడినే రాత్రిపగలూ పనిచేస్తున్నానన్నారు. మీరు ఏం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇకపై మంత్రులు, అధికారులను పరిగెత్తిస్తా నని హెచ్చరించినట్లు తెలిసింది. మంగళవా రం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం లో మంత్రులు, టీడీపీ నేతల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వస నీయ సమాచారం మేరకు.. కొందరు మం త్రులు అధికారుల్లా ఫీలవుతున్నారని, ఒక్క రూ సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు. జిల్లాల్లో మంత్రుల పర్యటనలు మొక్కుబడిగా మారాయని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే ఉపయో గం ఏమిటని ప్రశ్నించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టా త్మకంగా తీసుకోవాలని, తేలిగ్గా తీసుకుంటే కుదరదని చెప్పారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు గట్టిగా పనిచే యాలన్నారు. మరోవైపు మంత్రివర్గ సమావే శంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కామి నేని శ్రీనివాస్‌తో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొం డయ్యపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా పథకం అమలును ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశా రు. ‘ఈ పథకాన్ని నువ్వు వదిలేశావ్..’ అని అచ్చెన్నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానిం చినట్లు తెలిసింది. డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడం లో జాప్యం, ఇతర కారణాల వల్ల ఈ పథకం అమలులో ఇబ్బందులు వస్తున్నాయని కామినేనిని ఉద్దేశించి చెప్పారు. రెండు సమావేశాల్లోనూ మంత్రులను టార్గెట్ చేసి బాబు మాట్లాడటంతో వారు అవాక్కయి నట్లు సమాచారం. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు శివాలెత్తడంపై మంత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇలావుండగా సమన్వయ సమావేశంలో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలను తిప్పికొట్టాలని మంత్రులు, టీడీపీ నేతలకు సూచించారు. ఏ పత్రికలోనైనా వ్యతిరేక వార్త వస్తే వెంటనే స్పందించి ఎదురుదాడి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. కోడెల వ్యాఖ్యలు వక్రీకరించిన వారిపై చర్యలు తీసుకుంటాం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సమావేశంలో పలువురు నేతలు పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై స్పందించిన చంద్రబాబు.. శాసనసభాపతిపై ఆషామాషీగా కామెంట్లు చేస్తే ఇబ్బందులు పడతామని తెలిసేలా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. -
అంతర్జాతీయ ట్రేడ్ సదస్సుకు దేవీప్రసాద్
ఖాట్మాండులో ఈనెల 12 నుంచి 15 వరకు సమావేశాలు సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లోని ఖాట్మాండులో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే 12వ అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్‌కు రాష్ట్రం నుంచి టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హాజరు కానున్నారు. ప్రతి మూడేళ్లకోసారి జరిగే ఈ సమావేశాలకు హాజరు కావాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్‌నుంచి ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు హాజరుకానున్నారు. మన దేశం నుంచి 10 మందికి ఆహ్వానం అందినట్లు టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉద్యోగ, కార్మిక విధానాలు, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు, సంక్షేమ పథకాలపై ఉద్యోగుల స్పందించేతీరు, పనివిధానం ఎలా ఉందన్న అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు. -
‘ఆహార భద్రత’ ఇలాగేనా?!
మూడు నెలలక్రితం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో ఏర్పడిన వివాదం సమసిపోయింది. వాణిజ్య సౌలభ్య ఒప్పందం(టీఎఫ్ఏ) విషయంలో ఎడ మొహం, పెడమొహంగా ఉన్న భారత్, అమెరికాల మధ్య గురువారం రాజీ కుదిరింది. టీఎఫ్‌ఏపై సంతకం చేయాలంటే... ఆహారభద్రతపై ఎలాంటి ఆంక్షలూ విధించరాదని జెనీవాలో మూడు నెలలక్రితం జరిగిన డబ్ల్యూటీఓ సాధారణ మండలి సమావేశంలో పట్టుబట్టిన మన దేశం వాదనకు అమెరికా పాక్షికంగా అంగీకరించింది. దాని ప్రకారం టీఎఫ్‌ఏపై భారత్ సంతకం చేస్తుంది. అందుకు ప్రతిగా మన ఆహార భద్రత కు సంబంధించిన అంశాలపై తుది పరిష్కారం లభించేవరకూ అగ్రరాజ్యాలు ఆంక్షలకు పట్టుబట్టవు. 2017 వరకూ ఆహారభద్రత జోలికి అగ్రరాజ్యాలు రాకుండా ఉంటే టీఎఫ్‌ఏపై సంతకం చేస్తామని నిరుడు బాలి సదస్సులో మన దేశం అంగీకరించింది. అదే సమయంలో టీఎఫ్‌ఏపై మరిన్ని తదుపరి చర్చలు అవసరమని చెప్పింది. అయితే, బాలి సదస్సు తర్వాత టీఎఫ్ఏ విషయంలోగానీ, మన ఆహారభద్రత విషయంలోగానీ అగ్రరాజ్యాలు కిమ్మనలేదు. చర్చలకు చొరవ తీసుకోలేదు. తీరా జెనీవా సమావేశం నాటికి తొలుత అంగీకరిం చినట్టు టీఎఫ్‌ఏపై సంతకం చేయాలని కోరాయి. దీన్ని మన దేశం తీవ్రంగా వ్యతిరేకించింది. పర్యవసానంగా అది కాస్తా ప్రతిష్టంభనతో ముగిసింది. టీఎఫ్ఏ విషయంలో ఇలా మన దేశం ఆఖరి నిమిషంలో అడ్డం తిరిగినందువల్ల ప్రపంచం లోనే ఏకాకులమయ్యామని ప్రముఖ ఆర్థికవేత్తలు నొచ్చుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో లక్ష కోట్ల డాలర్ల మేరకు విస్తరించే బంగారంలాంటి అవకాశాన్ని కాలరాస్తున్నామని విమర్శించారు. రెండున్నర దశాబ్దాల తర్వాత బాలి సదస్సు చరిత్రాత్మకమైన అంగీకారానికొస్తే మన దేశం జెనీవాలో దాన్ని కాస్తా నీరుగార్చిం దన్నారు. అసలు సంబంధమే లేని టీఎఫ్ఏ అంశంతో ఆహారభద్రతను ముడిపెట్ట డం తప్పని వాదించారు. అలాంటివారంతా ప్రస్తుత రాజీపై హర్షామోదాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది మనకు దౌత్యపరమైన విజయమని అభివర్ణిస్తున్నారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎన్డీయే సర్కారు రాజీపడని ధోరణిని ప్రదర్శించినందుకు మెచ్చుకున్నవారూ చాలామందే ఉన్నారు. టీఎఫ్ఏ వల్ల అగ్రరాజ్యాలు చెబుతున్నట్టు అంతర్జాతీయ వాణిజ్యం మరో లక్ష కోట్ల డాలర్ల మేర పెరగవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తులు, ఇతర సరుకులు స్వేచ్ఛగా ఒక చోటునుంచి మరో చోటుకు కదులుతాయి. వాటిపై నిర్దిష్టమైన పరిమితులకు మించి సుంకాలు విధించడం దేశాలకు సాధ్యంకాదు. ఇదంతా ప్రధానంగా పారిశ్రామిక దేశాలకు ఉపయోగపడుతుంది. అంతేకాదు...వర్థమాన దేశాలు, బడుగు దేశాలు అమెరికా, యూరోప్ ప్రమాణాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని భారీ మొత్తాల్లో పెట్టుబడులను సమీకరించుకోక తప్పదు. మళ్లీ అందుకు అవసరమైన సాంకేతికతను అగ్రరాజ్యాలనుంచే కొనుగోలు చేయాలి. అంటే టీఎఫ్ఏ వల్ల అన్నివిధాలా బాగుపడేది అగ్రరాజ్యాలే. పైగా టీఎఫ్ఏలోని ఒక క్లాజు మొత్తం వ్యవసాయోత్పత్తుల విలువలో సబ్సిడీల శాతం 10 శాతానికి మించరాదని చెబుతున్నది. దీన్ని ఉల్లంఘించిన దేశంపై ఇతర దేశాలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే టీఎఫ్ఏ వర్థమాన దేశాలపాలిట యమపాశమవుతుంది. వర్థమాన దేశాలన్నీ ప్రధానంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడతాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు వ్యవ సాయంతో ముడిపడి ఉంటాయి. అందువల్లే రైతులకు సబ్సిడీ ధరలపై ఎరువులు అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో నిరుపేద వర్గాలవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ ధరలకు తిండిగింజలు అందించాల్సి ఉంటుంది. అందు కోసమని ఎఫ్‌సీఐ ద్వారా ఆహార ధాన్యాల సేకరణ చేయాలి. వ్యవసాయ రంగానికి వర్థమాన దేశాలిచ్చే ఇలాంటి రక్షణల వల్ల స్వేచ్ఛా వాణిజ్య స్ఫూర్తి దెబ్బతిం టుందని అగ్రరాజ్యాలు వాదిస్తున్నాయి. వాస్తవానికి ఈ రక్షణలు లేకపోతే అటు వ్యవసాయరంగమూ దెబ్బతింటుంది...ఇటు నిరుపేదలకు తిండిగింజలు అందు బాటులో ఉండవు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో పడుతుంది. టీఎఫ్ఏ విషయంలో గట్టిగా నిలబడినందుకు మోదీ సర్కారును అభినందించాల్సిందే. అయితే అదే సమయంలో దేశీయంగా తీసుకున్న కొన్ని చర్యలు వ్యవసాయరంగానికి తోడ్పడేవి కాదు. ఉదాహరణకు పంటలకిచ్చే కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విషయంలో ఈసారి కేంద్రం ఉదారంగా వ్యవహరించ లేదు. అటు వరికైనా, ఇటు గోధుమకైనా నిరుటితో పోలిస్తే క్వింటాల్‌కు పెంచిన ధర రూ. 50 మాత్రమే. అంతేకాదు...తాను ప్రకటించే ఎంఎస్పీపై రాష్ట్రాలు బోనస్ ఇచ్చే విధానాన్ని నిరుత్సాహపరచాలని మొన్నటి జూన్‌లో నిర్ణయించింది. ఇలాంటి నిర్ణయాలు పరోక్షంగా మన ఆహార భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అంతర్జాతీయ వేదికలపై ఆహారభద్రతను సంరక్షించుకోవడానికి పోరాడుతూనే దాన్ని దెబ్బతీసే విధానాలను మనమే అమలు చేయబూనడం న్యాయం అనిపించుకోదు. ఇప్పటికే వ్యవసాయానికి చేసే వ్యయం భారీగా పెరిగిపోతుండగా, అందుకు అనుగుణంగా తన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక రైతాంగం విలవిల్లాడుతున్నది. రైతులు ఎక్కువగా వినియోగించే డీఏపీ అయినా, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరలైనా ఈ రెండు మూడేళ్లలోనే ఎంతగా పెరిగాయో అందరికీ తెలుసు. అదునుకు వర్షాలు కురవక, అనువుగాని సమయంలో కుంభవృష్టి కురిసి అన్నివిధాలా నష్టపోతున్న రైతును ప్రభుత్వ విధానాలు కూడా చావుదెబ్బ తీయడం సరికాదు. డబ్ల్యూటీఓ వంటి అంతర్జాతీయ వేదికలపై పోరాడిన స్ఫూర్తినే ఇక్కడి విధానాల రూపకల్పనలో కూడా చూపి ఆహార భద్రత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పాలకులు గ్రహించాలి. -
నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నాను
నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నాను. ఎకానమీలో అత్యధిక మార్కులు సాధించడం ఎలా? -ఎస్.కిశోర్, కోఠి కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రిలిమ్స్‌లో ఎకానమీ నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి. ఉపాధి, పంచవర్ష, వార్షిక ప్రణాళికలు, ద్రవ్యం, బ్యాంకింగ్, వ్యవసాయం, ప్రభుత్వ విత్తం, జ నాభా, పేదరికం, విదేశీ వాణిజ్యం, అవస్థాపనా సౌకర్యాలు వంటివి పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్. ప్రశ్నలు ఈ అంశాల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా 2013 సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని గమనిస్తే ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నాయి. కాబట్టి ఎకానమీకి సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన కోసం ఎన్సీఈఆర్టీ ఆరో తరగతి నుంచి 12వ తరగతి పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. గతేడాది ప్రిలిమ్స్‌లో బ్యాంకింగ్ నుంచి నాలుగు ప్రశ్నలు, అంతర్జాతీయ వాణిజ్యం నుంచి మూడు ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం. కాబట్టి అభ్యర్థులు ఆర్థిక నివేదికలు, వ్యవసాయం, సేవా రంగం, పారిశ్రామిక రంగం, బ్యాంకింగ్, జాతీయాదాయం, యూఎన్డీపీ నివేదిక, 12వ పంచవర్ష ప్రణాళిక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ద్రవ్యం - బ్యాంకింగ్, సుస్థిర అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. కార్పొరేట్ గవర్నెన్స్‌పై సెబీ జారీ చేసిన మార్గదర్శకాలు, రిజర్వ్ బ్యాంక్ - కొత్త బ్యాంకులకు సంబంధించిన లెసైన్స్‌ల మంజూరు, కరెంట్ అకౌంట్ లోటు వంటివి కూడా ముఖ్యమైనవే. ప్రిపరేషన్లో కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా సంబంధిత అంశాలను కరెంట్ అఫైర్స్‌కు అన్వయించి చదువుకోవాలి. ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఆ నోట్స్‌ను ప్రతిరోజూ రివిజన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడానికి స్వీయ పరీక్షను నిర్వహించుకోవాలి. ఇన్పుట్స్: తమ్మా కోటిరెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, సివిల్స్ జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ పోస్టులు: సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): 8 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్): 13 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ల్యాబ్ టెక్నీషియన్): 4 హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫ్): 10 ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోక్ ఎగ్జామినేషన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: http://itbpolice.nic.in సీటెట్ - సెప్టెంబరు 2014 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ‘సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - సెప్టెంబరు 2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2014 పేపర్ - 1 (ఒకటి నుంచి ఐదో తరగతి) అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ/ఇంటర్ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి. పేపర్ - 2 (ఆరు నుంచి ఎనిమిది తరగతులు) అర్హతలు: ఏదైనా డిగ్రీ/ బీఎడ్/ డీఎడ్/ బీఈఎల్ఎడ్ ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 4 పరీక్ష తేది: సెప్టెంబరు 21, వెబ్సైట్: www.ctet.nic.in సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ-డాక్) కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ డిజైన్ అర్హతలు: 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 4 వెబ్సైట్: http://www.cdachyd.in/ -
డబ్ల్యూటీఓ చరిత్రాత్మక ఒప్పందం
బాలి చర్చలు సఫలం భారత్ ‘ఆహార భద్రత’కు డబ్ల్యూటీఓ అంగీకారం ప్రపంచ వాణిజ్యానికి అవరోధాల సడలింపే కీలకం రూ. 61 లక్షల కోట్ల మేర పెరగనున్న వాణిజ్యం భారత్‌కు ఇది చరిత్మ్రాత్మక నిర్ణయం: ఆనంద్‌శర్మ బాలి (ఇండోనేసియా): ఏళ్ల తరబడి వరుస వైఫల్యాల అనంతరం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఎట్టకేలకు.. అంతర్జాతీయ వాణిజ్యంపై చరిత్రాత్మక ఒప్పందాన్ని ఖరారు చేసింది. పేదలకు సబ్సిడీ ధరలతో ఆహార ధాన్యాలు అందించే ఆహార భద్రత పథకానికి రక్షణ కల్పించాలన్న భారత్ వంటి దేశాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ.. 159 దేశాల మంత్రులు శనివారం ఉదయం బాలి ప్యాకేజీకి అంగీకారం తెలిపారు. దోహా చర్చలు మొదలైన తర్వాత కుదిరిన ఈ తొలి ఒప్పందం వల్ల ప్రపంచ వాణిజ్య రంగం రూ. 61 లక్షల కోట్ల (లక్ష కోట్ల డాలర్లు) మేర పెరుగుతుందని అంచనా. గత నాలుగు రోజులుగా సుదీర్ఘంగా సాగిన చర్చల్లో.. క్యూబా చివరి నిమిషంలో అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరో మూడు లాటిన్ అమెరికా దేశాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాయి. ఐదో రోజు శనివారం చర్చల్లో ఒప్పందం ఖరారైంది. ‘‘డబ్ల్యూటీవో తొమ్మిదో మంత్రిత్వ సదస్సు బాలి ప్యాకేజీని పూర్తిగా ఆమోదించింది. ఇది చరిత్రాత్మక విజయం. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని ఇండోనేసియా వాణిజ్య మంత్రి గీతావీర్జవాన్ సదస్సు ముగింపు సందర్భంగా ప్రకటించారు. కస్టమ్స్ విధివిధానాలను సరళం చేయటం, మరింత పారదర్శకంగా చేయటం ద్వారా వాణిజ్యానికి అవరోధాలను సడలించటం బాలి ఒప్పందంలో కీలకమైన అంశం. డబ్ల్యూటీఓ చర్చలు ప్రారంభమైనపుడు.. ఆహార భద్రత, సబ్సిడీ విషయంలో భారత్ కఠిన వైఖరి ప్రదర్శించటంతో ఈ చర్చలు కూడా విఫలమవుతాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే శుక్రవారం నాటి చర్చల్లో.. భారత్ వంటి దేశాలు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించటానికి, ప్రజలకు సబ్సిడీ ధరల్లో ఆహార ధాన్యాలను అందించటానికి, దానిపై ఎలాంటి జరిమానాలూ విధించకుండా ఉండటానికి డబ్ల్యూటీఓ అంగీకరించింది. దీంతో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఈ నిర్ణయం భారతదేశానికి చరిత్రాత్మకమైనదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్‌శర్మ అభివర్ణించారు. దోహా చర్చల పునరుద్ధరణ, పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, బాలి డిక్లరేషన్ సానుకూలమైన పరిణామమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పేద, ధనిక దేశాలకు సమాన అవకాశాలను కల్పించేందుకు విస్తృత ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని బాలి ఒప్పందం సజీవంగా ఉంచింది. బాలి చర్చలు విజయవంతమైనందుకు సహకరించిన సభ్య దేశాలకు, ఆతిథ్యమిచ్చిన ఇండొనేసియాకు డబ్ల్యూటీఓ డెరైక్టర్ జనరల్ రాబర్టో అజివెడో కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేం ప్రపంచాన్ని మళ్లీ డబ్ల్యూటీఓలోకి తెచ్చాం. చరిత్రలో మొదటిసారిగా డబ్ల్యూటీఓ విజయం సాధించింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాం: కిసాన్‌సభ న్యూఢిల్లీ: రైతులకు మద్దతు ధర అందించే, కోట్లాది మంది అన్నార్తులకు ఆహార భద్రత కల్పించే దేశపు సార్వభౌమాధికార హక్కును ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ఉల్లంఘిస్తోందని.. దానిని తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఎం అనుబంధ రైతు సంఘం అఖిల భారత కిసాన్‌సభ ప్రకటించింది. ఆహార భద్రత అవసరాల కోసం ప్రభుత్వం చేసే నిల్వలపై అసమానత్వం నిబంధనలతో కూడిన డబ్ల్యూటీఓ మంత్రిత్వ ప్రకటనను భారత ప్రభుత్వం.. రాష్ట్రాలతో, పార్లమెంటులో చర్చలేకుండా అంగీకరించి ఉండాల్సింది కాదని కిసాన్‌సభ శనివారం ఒక ప్రకటనలో తప్పుపట్టింది. -
రెక్క విప్పుతున్న జపాన్ ‘డేగ’
చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాగే అబే కూడా ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. అంతర్జాతీయ వాణిజ్యం చైనా ప్రధాన అస్త్రం. జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి. ‘ఒకే పర్వతంపై రెండు పులులు మనలేవు.’ప్రాచీన చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. జపాన్ ప్రధాని షింజో అబే ఇటీవల చైనాపై విరుచుకుపడ్డారు. విపరీతంగా పెరిగిపోతున్న జపాన్ రక్షణ వ్యయం పట్ల గత నెల చివర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. జపాన్ ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద సైనిక బడ్జెట్గల దేశం. ఈ ఏడాది అది సైనిక దళాలపై 5 వేల కోట్ల డాలర్లను ఖర్చు చేయనుంది. చైనా తన స్థూలజాతీయోత్పత్తిలో (జీడీపీ) 10 శాతాన్ని సైన్యంపై ఖర్చు చేస్తుండగా, తాము 3 శాతాన్నే ఖర్చు చేస్తున్నామని అబే అక్కసు. ప్రపంచంలోని మూడవ అతి పెద్ద దేశమైన చైనాతో 65వ స్థానంలో ఉన్న జపాన్ రక్షణ వ్యయాన్ని పోల్చడం అర్థరహితం. చైనా గత కొన్నేళ్లుగా 10 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుండగా, జపాన్ ఈ ఏడాదే వృద్ధి బాట పట్టింది. ప్రపంచంలోని రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని చైనా నుంచి తిరిగి దక్కించుకోగలమని అబే విశ్వాసం! అందుకే అబే ‘ఆసియా పర్వతంపై’ చైనా స్వేచ్ఛా విహారాన్ని సహించలేకుండా ఉన్నారు. ఆయన తరచుగా జపాన్ ‘గత వైభవాన్ని’ గుర్తుచేసుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఇతర దేశాలపై సాగించిన దురాక్రమణ యుద్ధాలకు ఒకప్పటి ప్రధాని తమీచి మురయామా క్షమాపణలు చెప్పడాన్ని సమర్థించడం లేదని అబే సెలవిచ్చారు. అసలు ‘దురాక్రమణ’ అంటేనే ఎవరూ ఇదమిత్థంగా నిర్వచించలేదని వాదించారు. ‘వివిధ దేశాల మధ్య ఘటనలు మనం ఎక్కడ నిలబడి చూస్తున్నాం అనే దాన్ని బట్టి విభిన్నంగా కనిపిస్తాయి’ అని అన్నారు. 1910 నుంచి 1945 వరకు జపాన్ కొరియాను దురాక్రమించి, అత్యంత పాశవిక అణచివేత సాగించింది. 1931-37 మధ్య అది చైనాలోని సువిశాల భాగాన్ని ఆక్రమించింది. ఒక్క నాంకింగ్లోనే రెండు లక్షల మంది చైనీయులను ఊచకోత కోసింది. 1941లో పెరల్ హార్బర్ (అమెరికా) దాడితో ప్రారంభించి థాయ్‌లాండ్, మలయా, బోర్నియా, బర్మా, ఫిలిప్పీన్స్‌లపై దండెత్తింది. ఆసియా దేశాల మహిళలను సైన్యపు లైంగిక బానిసలుగా దిగజార్చిన హేయ చరిత్ర నాటి జపాన్‌ది. జీవ, రసాయనిక ఆయుధాల తయారీ కోసం అది ‘యూనిట్ 731’ను ఏర్పాటు చేసింది. కొరియా, చైనా, రష్యా తదితర దేశాలకు చెందిన లక్షలాది మందిని ‘ప్రయోగాల’ కోసం హతమార్చింది. అబే ఆ స్థానం నుంచి ‘గత వైభవాన్ని’ చూస్తున్నారు. ఈ ఏడాది ‘731 యూనిట్’ సంస్మరణ సభకు హాజరై ‘731’ అని ప్రముఖంగా రాసి ఉన్న యుద్ధ విమానం కాక్‌పిట్‌లో ఎక్కి మరీ ఫొటోలు దిగారు! ‘అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి బెదిరింపులను లేదా బలప్రయోగాన్ని జపాన్ శాశ్వతంగా తిరస్కరిస్తుంది’ అనే రాజ్యాంగంలోని నిబంధనకు తిలోదకాలివ్వడానికి ‘దేశ రక్షణకు చట్టపరమైన ప్రాతిపదిక పునర్నిర్మాణ సలహా మండలిని’ అబే నియమించారు. జపాన్ ‘రక్షణకు’ ఇప్పటికే ఐదు లక్షల సేనలతో త్రివిధ దళాలున్నాయి. ఆత్యాధునిక క్షిపణులు తప్ప సకల సాయుధ సంపత్తి ఉంది. దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులపై ఫిలి ప్పీన్స్, వియత్నాం వంటి దేశాలకు చైనాకు మధ్య వివాదాలు రగులుతున్నాయి. జపాన్ ఇదే అదనుగా ఒకప్పటి తన వలసవాద అవశేషమైన సెనెకాకు దీవులను ‘జాతీయం’ చేసి చైనాతో కయ్యానికి కాలుదువ్వింది. ఆ సాకుతో చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. తనలాగే అమెరికా సైనిక స్థావరాలున్న దేశమైన ఫిలిప్పీన్స్‌తో జపాన్ చేయి కలిపింది. భారత్‌తో సైనిక సహకారానికి ఉవ్విళ్లూరుతోంది. అణు వ్యాపా ర భాగస్వామ్యంతో భారత్‌ను అమెరికా, జపాన్ల చైనా వ్యతిరేక వ్యూహంలో భాగస్వామిని చేయాలని అశిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలాగే అబే కూడా వర్తమాన ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. చైనా ‘శాంతియుతంగా’ ఆధిపత్యపోరు సాగిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం దాని ప్రధాన అస్త్రం. ప్రపంచ వాణిజ్యం లో చైనాదే అగ్రస్థానం. జపాన్ విదేశీ వాణిజ్యంలో సైతం అమెరికా తర్వాత ద్వితీయ స్థానం చైనాదే. ఏటా ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ 30,000 కోట్ల డాలర్లు! జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి. గత వారం ఇండోనేసియాలోని బాలీలో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో (ఎపెక్) చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ కేంద్ర బిందువుగా నిలవడం అదే సూచిస్తోంది. చైనాను చూసి కాకపోయినా జర్మనీని చూసైనా అబే ‘శాంతియు తం’గా ఆర్థిక ప్రాభవం కోసం ప్రయత్నించడం ఉత్తమం. - పిళ్లా వెంకటేశ్వరరావు