చంద్రబాబుకు బ్రిటన్ ప్రభుత్వం షాకిచ్చింది. దీంతో ఆయన తన లండన్ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో మంత్రి నారాయణ వెళుతున్నట్లు సీఆర్‌డీఏ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు..బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు లండన్‌లో ఇంటర్నేషనల్ ట్రేడ్ వాటర్ టెక్నాలజీపై ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పురోగతి, మార్కెటింగ్ అవకాశాలపై విస్తృత చర్చలు జరపడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం. ఇందులో పాల్గొనేందుకు మరికొందరితో పాటు ఏపీ సర్కారుకూ ఆహ్వానం అందింది.