British government
-
భూంకాల్ పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసంక్ర మణ సిద్ధాంతం, సైన్యసహకార పద్ధతి వంటి కుట్రపూరిత విధానాలతో బస్తర్ రాజ్యాన్ని కూడా ప్రిన్సిలీ స్టేట్‌గా బ్రిటీషర్లు మార్చారు. రాజును నామమాత్రం చేస్తూ పరోక్షంగా పాలన సాగించా రు. ఈ క్రమంలో 1878లో బ్రిటీష్ ప్రభుత్వం రిజ ర్వ్ ఫారెస్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో బస్తర్ అడవుల్లో 66 శాతం భూభాగంపై ఆదివాసీ లు హక్కులు కోల్పోయారు. రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రదేశాల్లో కర్ర పుల్ల తీసుకెళ్లాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మరోవైపు బ్రిటీ షర్ల కాలంలో బస్తర్ పాలకుడిగా ఉన్న భైరామ్ దేవ్ కుష్ఠువ్యాధి బారిన పడ్డారు. దీంతో ఆయన్ను పదవి నుంచి దూరంగా ఉంచి అతని కొడుకైన రుద్ర ప్రతాప్‌దేవ్‌ని 1891లో రాజుగా బ్రిటీష్ సర్కార్ గుర్తించింది. అయితే మేజర్ అయ్యేంత వరకు ఆయనకు పట్టాభిషేకం చేసే అవకాశం లేదు. అలా రాజుతోపాటు రాజకుటుంబంలో ప్రధాన పదవుల్లో ఉన్నవారు తమ అ«ధికారాలు కోల్పోయారు. ఇలా బ్రిటీషర్ల ఆధిపత్య ధోరణి కారణంగా ఇటు రాజవంశానికే కాక అటు ఆదివాసీలకు ఇక్కట్లు మొదలయ్యాయి. తిరుగుబాటుకు పిలుపు1909 అక్టోబర్‌లో జరిగిన దసరా వేడుకల్లో రిజర్వ్ ఫారెస్ట్ చట్టం, దాన్ని అమలు చేస్తున్న బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ బస్తర్ రాజ్య మాజీ దివాన్ లాల్ కాళీంద్రసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానికంగా పేరున్న ఆదివాసీ నేత గుండాధుర్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఫారెస్ట్ చట్టం కారణంగా తాము పడుతున్న బాధలను ఊరూరా ప్రచారం చేస్తూ తిరుగుబాటుకు ప్రజలను సిద్ధం చేశారు. ప్రతీ ఇంటి నుంచి ఒకరు పోరాటానికి రావాలని, ఆయుధాలు పట్టలేనివారు రాళ్లు, కర్రలు, కారం పొడి అయినా అందించాలని స్ఫూర్తి నింపారు. 1909 అక్టోబర్ నుంచి 1910 ఫిబ్రవరి మొదటివారం నాటికి బస్తర్‌లో అటవీ గ్రామాలన్నీ పోరాటానికి సంసిద్ధమయ్యాయి. ముఖ్యంగా బస్తర్‌లో ఉత్తర ప్రాంతమైన కాంకేర్ నిప్పు కణికలా మారింది.మూడు రోజుల్లోనే....1910 ఫిబ్రవరి 4న కుకనార్‌లో గుండాధూర్ నాయకత్వంలో ఆదివాసీలు బ్రిటీష్ అధికార కార్యాలయాలు, గోదాములు, మార్కెట్, ప్రభుత్వ అధికారుల ఇళ్లపై మెరుపుదాడులు జరిపారు. కేవలం మూడురోజుల్లోనే బస్తర్‌లోని 84 పరగణాల్లో 46 పరగణాలు తిరుగుబాటుదారుల అధీనంలోకి వచ్చాయి. కాంకేర్ ప్రాంతంలో బ్రిటీష్ అధికారులు, వ్యాపారులు ఇళ్లు వదిలి పారిపోయారు. దండకారణ్యంలో భూకంపం లాంటి తిరుగుబాటు వచ్చిందని తక్షణ సాయం అవసరమంటూ బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పటి మహారాజు రుద్ర ప్రతాప్‌దేవ్ టెలిగ్రామ్ పంపారు. దీంతో ఈ పోరాటానికి భూంకాల్ పోరాటమని పేరు వచ్చింది. గుండాధూర్ చిక్కలేదుభూంకాల్ విప్లవాన్ని అణచివేసే పనిని కెప్టెన్ గేర్‌కు బ్రిటీష్ సర్కార్ అప్పగించింది. పదిరోజులు బ్రిటీష్, బస్తర్ స్టేట్ సైన్యాలు అడవుల్లో గాలించినా విప్లవకారుల్లో కేవలం 15 మందినే పట్టుకోగలిగారు. మరోవైపు తనను పట్టుకునేందుకు వచ్చిన కెప్టెన్ గేర్‌పైనే నేరుగా దాడి చేసి బ్రిటీషర్ల వెన్నులో గుండాధూర్ వణుకు పుట్టించాడు. తృటిలో కెప్టెన్ గేర్ ఆ దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడు కున్నాడు. దీంతో బెంగాల్, జైపూర్ రాజ్యాల నుంచి అదనపు బలగాలను బస్తర్‌కు రప్పించారు. ఆ తర్వాత గుంఢాదూర్‌కు నమ్మకస్తుడైన సోనుమాంఝీ ద్వారా కోవర్టు ఆపరేషన్ జరిపి 1910 మార్చి 25 రాత్రి గుంఢాధూర్ ఆయన సహచరులు బస చేసిన అటవీ ప్రాంతంపై బ్రిటీష్ సైన్యం దాడి జరిపింది. ఇందులో 21 మంది చనిపోగా మరో ఏడుగురు పట్టుబడ్డారు. కెప్టెన్ గేర్ ఎంతగా ప్రయత్నించినా ఆదివాసీ పోరాట యోధుడు గుండాధూర్ మాత్రం చిక్కలేదు. మెరుపు తిరుగుబాటుతో బ్రిటీషర్లకు చుక్కలు చూపించిన బస్తర్ ఆదివాసీలు ఆ తర్వాత తమ హక్కుల కోసం స్వతంత్ర భారత దేశంలో ఏర్పడిన ప్రభుత్వంతోనూ ఘర్షణ పడ్డారు. ఈ పోరులో తాము దైవంగా భావించే మహారాజునే కోల్పోయారు. -
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్‌లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్‌ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్‌వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్‌లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్‌లతో కలిసి ఆ మీటింగ్‌కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్‌మిషన్‌ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్‌గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్‌లో మార్చి 21న విడుదలైంది. -
మిట్టల్‌కు నైట్‌హుడ్ పురస్కారం
లండన్/న్యూఢిల్లీ: భారతీయ టెలికం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత బ్రిటన్ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్–3 నుంచి ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించారు. బ్రిటన్, భారత్ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్‌హుడ్(కేబీఈ) అవార్డ్‌తో మిట్టల్‌ను గౌరవించింది. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు 66 ఏళ్ల మిట్టల్ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బ్రిటన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్ కమాండర్ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు. -
డౌనింగ్ స్ట్రీట్ మార్జాల మిత్రుడు
నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ‘ల్యారీ’ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహూతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కొనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. అవడానికి అది మామూలు మార్జాలమే అయినప్పటికీ దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరే ‘ల్యారీ’. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. పెంపుడు కుక్కలపై మక్కువ కలిగిన వారిగా బ్రిటిషర్లు లోక విదితం అయినప్పటికీ, వారి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రాముఖ్యం పొందే చతుష్పాదం మాత్రం మార్జాలమే. పిల్లిది అక్కడ ‘చీఫ్ మౌజర్’ హోదా. చీఫ్ మౌజర్ ప్రధాన విధి డౌనింగ్ స్ట్రీట్‌లో ఒక్క ఎలుకైనా లేకుండా చూడటం. డౌనింగ్ స్ట్రీట్‌లోనే ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయాలు ఉంటాయి. అవడానికి అది మామూలు మార్జాలమే కానీ, దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరు ‘ల్యారీ’. ‘బ్యాటర్‌సీ డాగ్స్ అండ్ క్యాట్స్ హోమ్’ నుంచి తప్పించి, దానిని అక్కడికి తెప్పించారు. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. జీవిత చరిత్రల రచనలో ప్రావీణ్యం కలిగిన నా మేనకోడలు నారాయణీ బసు బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక మార్జాలాల జీవిత చరిత్రను సంక్షిప్తంగా సంకలన పరిచారు. ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి కాలం నాటి బ్రిటిష్ ప్రభుత్వ మార్జాల జీవిత చరిత్రతో సంకలనం మొదలౌతుంది. ఆ కాలపు రాజనీతిజ్ఞుడు, క్యాథలిక్ బిషప్ అయిన లార్డ్ ఛాన్స్లర్... థామస్ వోల్సే దగ్గర ఆ మార్జాలం ఉండేది. 1929కి ముందే బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా పిల్లి సంరక్షణ బాధ్యతలను చేపట్టినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. పిల్లి పోషణ, పాలన కోసం రోజుకు ఒక పెన్నీ కేటాయించినట్లు అప్పటి బడ్జెట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నాటి నుంచి పిల్లి ఖర్చు క్రమంగా పెరుగుతూ వచ్చి 21వ శతాబ్దానికి ‘చీఫ్ మౌజర్’ బ్రిటిష్ ఖజానాకు పెట్టిస్తున్న ఖర్చు 100 పౌండ్లకు చేరుకుంది. డౌనింగ్ స్ట్రీట్ వెబ్సైట్ ప్రకారం ల్యారీ విధులు ఇలా ఉన్నాయి: ఇంటికి వచ్చే అతిథులను పలకరించడం, భద్రతకు ఉద్దేశించిన రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేయడం, కునుకు తీయడానికి పురాతన ఫర్నిచర్ ఏ మాత్రం నాణ్యతను కలిగి ఉన్నదో పరీక్షించడం. అలాగే, భవంతిలో ఎలుకలు చేరకుండా ఉండేందుకు పరిష్కారం ఆలోచించడం కూడా చేస్తోందనీ, ఆ పరిష్కారం ఇంకా వ్యూహాత్మక ప్రణాళిక దశలోనే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిందని కూడా వెబ్సైట్లో ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ల్యారీ తన బాధ్యతల కంటే కూడా ప్రధాని కార్యాలయ అవసరాలను చూడ్డానికే ఎక్కువ ఇష్టపడుతుంది. నారాయణి పరిశోధనను బట్టి కామెరున్ దగ్గర తన తర్వాత వచ్చిన ప్రధానుల కంటే కూడా ల్యారీ గురించి చెప్పడానికే ఎక్కువ సమాచారం ఉంది. ఆ పిల్లి గురించి సునాక్ అభిప్రాయాన్ని నారాయణి ప్రస్తావించలేదు. కనుక ల్యారీని అర్థం చేసుకోవాలంటే మనం కామెరున్ మీద ఆధారపడాలి. ఆయన చెబుతున్న దానిని బట్టి ల్యారీ పురుషుల సమక్షంలో కాస్త బెరుకుగా ఉంటాడు. అయితే అందుకు బరాక్ ఒబామా మినహా యింపు. ‘‘తమాషా ఏంటంటే ఒబామాను ల్యారీ ఇష్టపడతాడు. ఒబామా అతడికి మృదువైన చిన్న తాటింపు వంటి స్పర్శను ఇస్తాడు. దాంతో ల్యారీ ఒబామా దగ్గర సౌఖ్యంగా ఉంటాడు. అయితే ల్యారీ ప్రధానమంత్రుల సతీమణులను కలవరపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ల్యారీ ఒంటి వెంట్రుకలు తన భర్త సూట్లపై కనిపించడంతో సమంతా కామెరున్ ల్యారీని ప్రధాని నివాసంలోకి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. అంతెందుకు, పక్కనే ఉండే విదేశాంగశాఖ కార్యాలయంలోకి ల్యారీని ప్రవేశించనివ్వకుండా క్యాట్–ప్రూఫ్‌ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. విదేశాంగ కార్యదర్శి విలియం హేగ్ దానిని కిందికి తీసుకెళ్లండి అని కోరారు. అయితే హేగ్‌కి ల్యారీ పట్ల కొంత ఆపేక్ష ఉండేదట. కఠోర వాస్తవం ఏంటంటే ల్యారీకి ఉన్న ప్రజాదరణ కారణంగా తరచూ ప్రధాన మంత్రి కంటే కూడా ఎక్కువగా ల్యారీకి భద్రతా బలగం అవసరం అయ్యేది. కామెరాన్ దంపతులు ఆ పిల్లిని ఇష్ట పడటం లేదని కథలు వ్యాప్తి చెందడం ప్రారంభవమడంతో ల్యారీ, తను ‘పర్–ఫెక్ట్లీ వెల్’ అని ప్రధాని కామెరున్ తప్పనిసరై ట్వీట్ చేయవలసి వచ్చింది. ఆ ట్వీట్ బ్రిటిష్ ప్రభుత్వానికి భరోసాను ఇచ్చింది. నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ల్యారీ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహుతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రవేశ ద్వారం వద్ద ట్రంప్‌తో కలిసి థెరెసా మే, ఆమె భర్త ఫొటోలు దిగుతున్నప్పుడు ల్యారీ వారి వెనుక కిటికీ అంచుపై నిలబడి ప్రతి ఫొటోలోనూ కనిపించింది. తర్వాత వర్షం నుంచి తలదాచుకోడానికి సాయుధుల కనురెప్పల కాపలాలో ఉన్న ట్రంప్ క్యాడిలాక్ కారు కింద దూరిన ల్యారీని ఎంత నచ్చచెప్పీ బయటకు రప్పించలేక పోయారు. బి.బి.సి.కి చెందిన జోన్ సోపెల్ ఆ ఘటనను... ‘‘బ్రేకింగ్ న్యూస్: ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనకారులు డొనాల్డ్ ట్రంప్ వాహన శ్రేణిని నిలువరించడంలో విఫలమయ్యారు. కానీ 10 డౌనింగ్ స్ట్రీట్ పిల్లి ఆ పని చేయగలిగింది’’... అని ట్వీట్ చేశారు. కొంతకాలంగా ల్యారీపై మునుపెన్నడూ లేని విధంగా తరచూ విమర్శలు వినవస్తున్నాయి. ల్యారీ స్వభావం, పనితీరు చుట్టూ కేంద్రీకృతం అయిన విమర్శలవి. వేటాడి చంపే క్రూర స్వభావం ల్యారీలో విస్పష్టంగా లోపించడాన్ని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు గమనించారు. ‘‘ఎలుకల్ని వేటాడడం కన్నా ఎక్కువ సమయం ల్యారీ నిద్రలోనే గడుపుతున్నాడు’’ అని కొందరు ఫిర్యాదు చేశారు. అయితే నేను విన్నదేమంటే సునాక్ అతడిని విధుల నుంచి విరమింపజేసే ప్రమాదం లేదని. ఏ విధంగా చూసినా కూడా సునాక్ దంపతులకు వీడ్కోలు పలికి, కొత్తగా వచ్చేవాళ్ల మెప్పు పొందే వరకైనా ల్యారీ అక్కడ ఉంటాడు. ల్యారీ మాంసం కూరను ఇష్టపడతాడా లేక పప్పూ, అన్నం అంటాడా అనేది బహుశా అప్పుడు మనం తెలుసుకోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
G20 Summit: ఖలిస్థానీ తీవ్రవాదాన్ని సహించేది లేదు: రిషి సునాక్
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు దేశ రాజధానిలో అడుగుపెట్టడంతో హస్తీనాలో కోలాహలం పెరిగింది. 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం ఢిల్లీ చేరుకుంది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు.మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు వేదికగా నిలిచిన భారత్‌కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే వీరికి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను రిషి సునాక్ దంపతులు కాసేపు వీక్షించారు. అనంతరం షాంగ్రీలా హోటల్‌కు చేరుకొని బస చేశారు. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని సునాక్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు. హిందువుగా తాను గర్విస్తున్నానని అన్నారు. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఇండియాకు రావడం వ్యక్తిగతం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. తనను ప్రేమగా భారతదేశ అల్లునిగా పిలుస్తారని గుర్తు చేశారు. కాగా భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని సునాక్ వివాహామాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సునాక్ ఈ విధంగా చమత్కరించారు. చదవండి: జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో! ఖలిస్థానీ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటన్ (యునైటెడ్ కింగ్డమ్) భారత్‌తో కలిసి పనిచేస్తోందని రిషి సునాక్పేర్కొన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని అన్నారు. దీనికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు సహకరిస్తున్నాయని చెప్పారు. ‘తీవ్రవాదం, హింస వంటివి ఏ రూపంలో ఉన్న బ్రిటన్‌లో వాటికి తావులేదు. అందుకే ఖలిస్థానీ అనుకూల తీవ్రవాదాన్ని అధిగమించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇటీవల బ్రిటన్ భద్రతా మంత్రి టామ్ తుగేన్‌ధాట్ భారత్‌లో పర్యటించారు. లండన్‌లోని భారతీయ దౌత్య సిబ్బందికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఆందోళనలు బ్రిటీష్ ప్రభుత్వానికి తెలుసు. ఇది భారత్ సమస్య మాత్రమే కాదు బ్రిటన్‌ది కూడా. కాబట్టి కీలక సమాచారాన్ని పంచుకుంటూ.. ఈ తరహా హింసను నిర్మూలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. హింసాత్మక చర్యలు సరైనవి కావు. బ్రిటన్‌లో దానిని నేను సహించను’ అని సునాక్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థానీ వాదులు గత మార్చిలో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఖలిస్థానీ కార్యకలాపాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన యూకే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భారత్‌కు వచ్చిన ఆదేశ భద్రతా మంత్రి కూడా దీనిపై ప్రధానంగా చర్చలు జరిపిన అనంతరం తీవ్రవాదంపై కలసికట్టు పోరుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ స్పష్టం చేసింది. అక్కడ ఖలిస్థానీ తీవ్రవాదం నిరోధానికి ప్రత్యేకంగా 95,000 పౌండ్లు(కోటి రూపాయలు) కూడా కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. -
రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ..
లండన్: బ్రిటన్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ త్రుటిలో చావు దెబ్బ తప్పించుకుంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క సీటు గెలుచుకుని మిగిలిన రెండు చోట్ల ఓటమిపాలైంది. అసలే సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా నిలిచాయి. మొత్తం మూడు స్థానాలకుగాను జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని మాత్రం స్వల్ప మెజారిటీతో తిరిగి దక్కించుకుంది. ఒకవేళ ఆ స్థానాన్ని కూడా కోల్పోయి ఉంటే ఒకే రోజు మూడు సీట్లు కోల్పోయిన ప్రధానిగా రిషి సునాక్ చరిత్రలో నిలిచిపోయేవారు. అదృష్టవశాత్తు ఉక్స్ రిడ్జ్, సౌత్ రూస్లిప్ పరిధిలోని వెస్ట్ లండన్ లో గెలిచి ఆయన ఈ ఘోర అవమానం నుండి తప్పించుకున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో సోమర్టన్, ఫ్రోమ్ సీట్ లో 19 వేలు, సెల్బీ.ఎయిన్స్టీ నియోజకవర్గంలో 20 వేలు మెజార్టీతో లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది కన్జర్వేటివ్ పార్టీ. సెల్బీ, ఎయిన్స్టీలో గెలిచిన అభ్యర్థి కెయిర్ మాథెర్(25) మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇక్కడివారు అసంతృప్తితో ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు. సోమర్టన్, ఫ్రోమ్ లో గెలిచిన లేబర్ పార్టీ అభ్యర్థి సారా డైక్ మాట్లాడుతూ.. ఇది చారిత్రిక విజయం. ఈ ప్రభుత్వం చేతకానితనంతో సర్కస్ చేస్తోందని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలు రిషి సునాక్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ గా మారాయి. గతేడాది మార్చ్ నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకోవడం ఆందోళనకరమని చెబుతున్నాయి కన్జర్వేటివ్ పార్టీ వర్గాలు. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు పెరగడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే జనం ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా ప్రధాని.. మళ్ళీ ఆయనే.. -
ఆ రుతువు వచ్చేవరకూ ఆగాలి... తప్పదు
మామిడి కాయలంటే ఇష్టం. మొక్క తెచ్చావు. నీళ్ళుపోసావు... ఇంకా కాయలు రాలేదని రోజూ బిందెలకు బిందెలు నీళ్ళుపోస్తే కాయలు రావు. మొక్క చెట్టు కావాలి... అయినా వసంత రుతువుకూడా రావాలి.. అప్పుడే పూత పూస్తుంది, అది పిందెగా మారుతుంది. ఆ పిదప కొంత కాలానికి కాయ... ఆ తరువాతే పండు... అప్పటిదాకా ఓర్పు ఉండాలి. వేచి చూడాలి. ఎప్పుడో కాయ కాస్తుందని ఇప్పటినుంచే నీళ్ళెందుకు పోయడం.. అని మానేస్తే మొక్క బతకదు... అంటే ఓర్పుతోపాటు నీ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. ప్రతి దానికీ ఒక నియమం, ఒక సమయం ఉంటాయి. అప్పటిదాకా వేచి చూడగల ఓర్పు ఉండడంతో పాటూ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. వెనకటికి ఓ రాజుపై శత్రువులు విరుచుకు పడ్డారు. రాజు ఓడిపోయాడు. నిరాశతో రాజు అన్నీ వదిలేసుకొని ఒంటరిగా వెళ్ళిపోతుంటే... సైనికులు, ఆంతరంగికులు అందరూ నచ్చచెప్పారు. మనం కొంతకాలం ఆగుదాం.. మళ్ళీ శత్రువుపై యుద్ధం ప్రకటిద్దాం.. అని చెప్పినా వినకుండా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఓరోజున రాజు ఒక చెట్టుకింద కూర్చుని... దగ్గర్లోనే ఒక సాలెపురుగు గూడు అల్లడానికి నానా తంటాలు పడడాన్ని ఆసక్తిగా గమనించాడు.. అది గూడు అల్లే క్రమంలో చాలాసార్లు పోగు తెగి కిందపడిపోతున్నది... పలుమార్లు అలా చేసిన తరువాత చివరికి అది గూడు పూర్తిగా అల్లి మధ్యలో సౌకర్యవంతంగా కూర్చుని గూడుకు చిక్కుకున్న పురుగులను హాయిగా తింటున్నది. ఇది చూసిన రాజుకు జ్ఞానోదయమయింది. వెంటనే వెళ్ళి తన పరివారాన్ని చేరదీసి సర్వసన్నద్ధం అయ్యేవరకు ఆగి... ఓ రోజున యుద్ధం ప్రకటించాడు. శత్రురాజును సునాయాసంగా ఓడించి తిరిగి తన రాజ్యాన్ని పొందాడు. ప్రతిదానికీ ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం ఎక్కడా ఆపకుండా పూర్తిచేయాలి, ఫలితం వచ్చేవరకూ ఓర్పుగా వేచి చూడాలి. తొలితరానికి చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తల్లో ఒకరైన సర్ జగదీశ్ చంద్రబోస్ ఆంగ్లేయ ప్రొఫెసర్లతో సమానమైన అర్హతలు, ప్రతిభాపాటవాలు కలిగినా, వారితో సమానంగా తనకు వేతనం ఇవ్వనందుకు నిరసనగా జీతం ముట్టుకోకుండా తన వృత్తిని మూడేళ్ళపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే అదే అంకితభావంతో కొనసాగిస్తే... చివరకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దిగొచ్చి ఆయన్ని సన్మానించి పెంచిన జీతం పాత బకాయిలతో సహా చెల్లించింది. కార్యసాధనలో ఓర్పు ఎంత ముఖ్యమో... ప్రయత్నాలను చివరిదాకా కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భారతీయులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సునాక్!
UK-India Young Professionals Scheme: ఇండోనేషియాలో బాలి వేదికగా జరుగుతున్న జీ20 తొలిరోజు సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు ఇరువురు నేతలు ముచ్చంటించారు. అదీగాక సునాక్ ప్రధాని అయ్యాక వారివురు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం యూకే ప్రధాని భారత్‌కి ఒక పెద్ద వీసా స్కీం ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు యూకేలో ఉండి, పనిచేసేలా భారత యువ నిపుణలు కోసం ప్రతి ఏడాది సుమారు 3 వేల వీసాలకు అనుమతిస్తున్నట్లు బ్రిటన్ కార్యాలయం పేర్కొంది. గతేడాది అంగీకరించిన యూకే భారత్ స్వేచ్ఛ వలసల ఒప్పంద(మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అగ్రిమెంట్) భాగస్వామ్యన్ని గురించి నొక్కి చెబుతూ ఇటువంటి పథకం కింద ప్రయోజనం పొందిన మొదటి దేశం భారత్ అని బ్రిటన్ ప్రభుత్వ పేర్కొంది. ఈ మేరకు ధృవీకరించిన యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, డిగ్రీ చదివిన భారతీయ పౌరులు రెండేళ్ల వరకు యూకేలో ఉండి, పనిచేయడం కోసం 3 వేల వీసాలకు అనుమతిచ్చింది బ్రిటన్. ఈ పథకం ద్వారా భారత్ బ్రిటన్ల ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడం తోపాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సంబంధాలు ఏర్పడటానికి ఉపకరిస్తుందని యూకే ప్రధాని డౌన్ స్ట్రీట్ కార్యాలయం పేర్కొంది. అలాగే ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో దాదాపు అన్ని దేశాల కంటే యూకే భారత్‌తోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. అంతేగాక బ్రిటన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారత్‌కి చెందిన వారు ఉన్నారని అందువల్ల యూకేలోని భారత్ పెట్టుబడితో యూకే అంతటా వారికి సుమారు 9,500 ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందని చెప్పింది. ప్రస్తుతం యూకే భారత్‌తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ఒకవేళ ఈ ఒప్పందం ఖరారు అయితే యూరోపియన్ దేశంతో జరుపుకున్న తొలి ఒప్పందం అవుతుందని పేర్కొంది. అదిగాక ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న దాదాపు 24 బిలయిన్ పౌండ్ల వాణిజ్య సంబంధాలను ఈ ఒప్పందం మరింత బలపరుస్తుందని చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశం అయిన భారత్ ఈ ఆర్థిక అవకాశాలను వినియోగించుకునేలా బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలని బ్రిటన్ ఆకాంక్షిస్తోంది. భారత్‌తో మొబిటిటీ(స్వేచ్ఛ) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేలా ఇమ్మిగ్రేషన్ నేరస్తులను తొలగించే సామర్థ్యాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది. The British government said that India is the first visa-national country to benefit from such a scheme, highlighting the strength of the UK-India Migration and Mobility Partnership agreed last year.@RishiSunak #UK #India #Visa https://t.co/VWRRWoRvoh pic.twitter.com/oDN1B6jULH — Khaleej Times (@khaleejtimes) November 16, 2022 (చదవండి: జీ20: బైడెన్‌తో మీట్.. సునాక్‌తో ముచ్చట్లు.. ఆయనతో షేక్‌హ్యాండ్) -
తెల్లవారిని హడలెత్తించిన ఎర్ర మిరపకాయ్
రంపచోడవరం(తూర్పుగోదావరి): పచ్చని మన్య సీమలో అమాయక గిరిజనంపై ఆంగ్లేయులు సాగించిన అకృత్యాలపై.. విల్లంబులు ఎక్కుపెట్టిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన మహోజ్వల సాయుధ పోరాటం ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ పోరాటంలో భాగంగా ఆయన సారథ్యంలోని గిరిజన వీరులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు చేశారు. ఆ క్రమంలో తాము దాడులు చేస్తున్నట్టు బ్రిటిష్ సైన్యానికి ముందుగానే హెచ్చరిక సందేశం పంపేవారు. కాగితంపై రాసిన ఆ సందేశాన్ని బాణానికి గుచ్చి, దానిపై ఎర్ర మిరపకాయల గుత్తి తగిలించేవారు. ఆవిధంగా ఎర్ర మిరప కాయల గుత్తితో పోలీస్ స్టేషన్ వద్ద బాణం నాటుకొంటే చాలు.. బ్రిటిష్ పోలీసులు హడలెత్తిపోయేవారు. అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద సీతారామరాజు కొంత కాలం నివాసం ఉన్నారు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన తరువాత అడవుల్లోకి వెళ్లి బ్రిటిష్ సేనలను ఎదిరించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 1922లో విశాఖ జిల్లా కృష్ణదేవీపేట (కేడీ పేట) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడి ఆయుధాలను స్వా«దీనం చేసుకుని, దాడి చేసినట్టు సమయం తెలుపుతూ ఉత్తరం ఉంచారు. కొద్ది రోజుల్లోనే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడికి కొంత సమయం తీసుకోవడంతో బ్రిటిష్ అధికారులకు సీతారామరాజు భయపడ్డాడని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నట్లు 1922 అక్టోబర్ 10న బాణానికి మిరపకాయ గుత్తి ఉంచి సందేశం పంపించారు. ఆ స్టేషన్‌పై దాడి చేసేందుకు గుర్రం మీద తేనెలమంగి గ్రామంలోని తెల్ల మద్ది చెట్టు వద్దకు రాత్రి చేరుకుని వ్యూహం రచించారు. 1922 అక్టోబర్ 15న దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టారు. స్టేషన్‌పై దాడి చేసినట్టు లేఖ ఉంచారు. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్‌పై కూడా అల్లూరి దాడి చేశారు. తెల్లవారి వెన్నులో వణుకు పుట్టించేలా అల్లూరి మహోధృతంగా సాగించిన సాయుధ పోరాటంలో మిరపకాయ టపాకు ఈవిధంగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద్యమానికి వందేళ్లు అయిన సందర్భంగా నాటి సంఘటనకు గుర్తుగా ఆ మహావీరుని చిత్రంతో తపాలా శాఖ ప్రత్యేక కవర్ విడుదల చేస్తోంది. రంపచోడవరంలో బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి.హరికిరణ్, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత పటేల్, రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు, రంపచోడవరం సర్పంచ్ మంగా బొజ్జయ్య పాల్గొంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అడ్డతీగలలో కూడా అల్లూరి పోరాటంపై ప్రత్యేక తపాలా చంద్రికను ఆవిష్కరించనున్నారు. తపాలా శాఖ, హైదరాబాద్‌కు చెందిన మిత్రా గ్రూప్ కంపెనీల అధినేత ఆర్‌ఆర్‌కే రాజుల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక శ్రీ సాయి సన్నిధి ఫంక్షన్ హాలులో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. -
మాస్కు ఆంక్షలను ఎత్తేసిన ఇంగ్లండ్
లండన్: మాస్కులు తప్పనిసరి సహా పలు కోవిడ్ ఆంక్షలను ఇంగ్లండ్ గురువారం ఎత్తేసింది. బూస్టర్ డోస్ టీకా తీవ్రమైన అనారోగ్యంతోపాటు ఆస్పత్రుల్లో చేరడాన్ని తగ్గించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి ఇంగ్లండ్‌లో ఎవ్వరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఇక నైట్ క్లబ్బులు, ఇతర వేదికలకు కోవిడ్ పాసులు కూడా అవసరం లేదని తెలిపింది. ఇక ఇంటినుంచే పని, స్కూళ్లలో ఫేస్ మాస్కుల నిబంధనను గత వారమే ప్రభుత్వం ఎత్తివేసింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తిని అడ్డుకోవడానికి, బూస్టర్ డోస్ వేసుకోవడానికి సమయమిస్తూ డిసెంబర్ మొదటివారం నుంచే ‘ప్లాన్ బి’ చర్యలు ప్రారంభించింది. అందరికీ బూస్టర్ డోసు టీకాలు వేయడంతోపాటు, నిర్ధారణ పరీక్షలు, యాంటీ వైరల్ చికిత్సలను అందించడంలో యూరప్ బలంగా పనిచేసిందని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావీద్ తెలిపారు. వైరస్ పూర్తిగా నిర్మూలనయ్యే అవకాశం లేదని, వైరస్‌తో సహజీవనం నేర్చుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ తగ్గుముఖం పడుతున్నా.. పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ 84 శాతం పూర్తయ్యిందని, అర్హత ఉన్నవాళ్లంతా రెండో డోసు తీసుకున్నారని, 81 శాతం మంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరిక, ఐసీయూ చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, కొత్త సంవత్సరం సమయంలో రోజుకు రెండులక్షలున్నా ఇప్పుడు లక్షకు పడిపోయాయని తెలిపారు. మరోవైపు గురువారం యూకేలో 96,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 338 మరణాలు సంభవించాయి. గతవారమే ప్రకటన ఒమిక్రాన్ బారిన పడినవారి సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రధాని బోరిస్ జాన్సన్ గత వారమే ప్రకటించారు. అయితే... తమ వినియోగదారులను ఫేస్ మాస్కులు ధరించమని కోరతామని కొన్ని దుకాణదారులు, రవాణా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యల నుంచి తప్పుకొంది. ఇక అయితే రాజధానిలోని బస్సులు, సబ్ వే రైళ్లలో ఇప్పటికీ మాస్కులు వసరమని లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తెలిపారు. ఇక ఒమిక్రాన్ సోకి వారికి ఐదురోజుల ఐసోలేషన్ సరిపోతుందన్నారు. కోవిడ్ 19ను ఫ్లూలాగా పరిగణించి దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేస్తున్నట్లు అక్కడి ఆరోగ్యాధికారులు తెలిపారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లు సొంత ప్రజారోగ్య నియమాలను రూపొందించుకున్నాయి. అదేవిధంగా వారి వైరస్ నిబంధనలను కొంత సడలించాయి. -
గరిష్టానికి ఒమిక్రాన్ కేసులు.. అక్కడ ఇక మాస్కు తప్పనిసరి కాదు!
లండన్: దేశంలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నిబంధనల్లో చాలావాటిని బ్రిటీష్ ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు గరిష్టానికి చేరినందున (అంటే అంతకుమించి ఇక పెరగవని అర్థం) ఈ నిబంధనలు తొలగిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇకపై ఎక్కడైన తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన వచ్చే గురువారం నుంచి రద్దు కానుంది. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యేవారు టీకా సర్టిఫికెట్ తప్పక తీసుకరావాలన్న నిబంధన కూడా కనుమరుగుకానుంది. గురువారం నుంచి పాఠశాల గదుల్లో మాస్కులు తప్పనిసరి నిబంధన కూడా తొలగించనున్నట్లు ప్రధాని చెప్పా రు. ప్రజలు వర్క్ ఫ్రం హోం చేయాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు భౌతిక హాజరుపై తమ సంస్థలతో చర్చించాలని సూచించారు. అయితే కరోనా వ్యాప్తి నివారణకు తప్పనిసరి మాస్కుధారణ నిబం ధన కొనసాగిస్తామని స్కాట్లాండ్ డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ చెప్పారు. బ్రిటన్‌లో లాగా తాము నిబంధనలు ఎత్తివేయడం లేదన్నారు. పార్లమెంట్ సూచన మేరకు నిబంధనలు కొనసాగిస్తామని, పార్లమెంట్ సూచిస్తే నిబంధనలు మారుస్తామని చెప్పా రు. పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధారణ తప్పదన్నారు. ప్లాన్ బీ టు ఏ ఓఎన్ఎస్ (ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్) అంచనా ప్రకారం దేశమంతా ఒమిక్రాన్ గరిష్టానికి చేరిందని హౌస్ ఆఫ్ కామన్స్‌కు ప్రధాని తెలిపారు. ఓఎన్ఎస్ డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలు మినహా ఇంగ్లండ్‌లో ఇన్ఫెక్షన్ స్థాయిలు పడిపోతున్నాయని వెల్లడించారు. ప్లాన్ బీ (తీవ్ర నిబంధనలు) నుంచి ప్లాన్ ఏ (స్వల్ప నిబంధనలు)కు మరలేందుకు కేబినెట్ అంగీకరించిందని చెప్పారు.దేశంలో ఆస్పత్రిలో చేరికలు క్రమంగా తగ్గిపోతున్నాయని, ఐసీయూ అడ్మిషన్లు కూడా పడిపోయాయని వివరించారు. సెల్ఫ్ ఐసోలేషన్ లాంటి కొన్ని నిబంధనలు మాత్రం కొనసాగుతాయన్నారు. బ్రిటన్‌లో ఈ సెల్ఫ్ ఐసోలేషన్ సమయాన్ని 7 నుంచి 5 రోజులకు గత సోమవారం నుంచి తగ్గించారు. మార్చి నాటికి సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధన కూడా ఎత్తివేస్తామని బోరిస్ అంచనా వేశారు. కోవిడ్ దాదాపు ఎండమిక్ దశకు చేరుతోందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచించారు. -
బ్రిటన్ మాజీ ప్రధాని బ్లెయిర్‌కు ‘నైట్‌హుడ్’
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ను బ్రిటన్ రాణి ఎలిజబెత్ నైట్‌హుడ్ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లెయిర్.. ‘ఆర్డర్ ఆఫ్ గార్డర్’ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్‌హుడ్ హోదాతో గౌరవిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపై టోనీ బ్లెయిర్ను ‘సర్ టోనీ’ అని గౌరవంగా సంబోధిస్తారు. 68 ఏళ్ల టోనీ బ్లెయిర్ 1997 నుంచి పదేళ్లపాటు బ్రిటన్‌కు ప్రధానిగా సేవలందించారు. బ్రిటన్ మాజీ మంత్రి, నల్ల జాతీయురాలు బరోనెస్ వలేరీ అమోస్(67)కు సైతం నైట్‌హుడ్ హోదా దక్కింది. గృహ హింస, లైంగిక వేధింపులపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న తన కోడలు కమిల్లాను ‘రాయల్ కంప్యానియన్’గా నియమిస్తూ ఎలిజబెత్ రాణి నిర్ణయం తీసుకున్నారు. -
ఇంధన కొరతపై ఆర్మీని దించనున్న యూకే
లండన్: దేశాన్ని వణికిస్తున్న ఇంధన కొరత సమస్యను తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించనుంది. సుమారు 200 మంది మిలటరీ వ్యక్తులను తాత్కాలిక ఇంధన సరఫరాకోసం నియోగించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇంధన కొరత కారణంగా పలు పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు. దేశంలో ట్రక్ డ్రైవర్ల కొరత కారణంగా ఇంధన రవాణా కుంటుపడింది. ఆపరేషన్ ఎస్కాలిన్ పేరిట ఈ సమస్య పరిష్కారానికి మిలటరీ నుంచి కొందరిని నియమిస్తున్నామని, వీరు ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారని, సోమవారం నుంచి ఇంధన సరఫరా బాధ్యతలు చేపడతారని డిఫెన్స్ కార్యదర్శి డెన్ వాలెస్ చెప్పారు. ఈ వారంలో ఇంధన సమస్య చాలావరకు తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా సమస్య కనిపిస్తూనే ఉంది. సమస్య తీవ్రత క్రమంగా తగ్గుతోందని ప్రభుత్వం తెలిపింది. -
కోవిషీల్డ్ ఓకే.. సర్టీఫికెట్‌తోనే సమస్య
లండన్: కరోనా వ్యాక్సిన్ అంశంలో భారత్, బ్రిటన్ మధ్య చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ మెలిక పెట్టింది. అక్టోబర్ 4 నుంచి విదేశీ ప్రయాణికులు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను కొద్దిరోజుల కిందట బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ లేకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆ దేశం దిగొచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో తమకు ఎలాంటి సమస్య లేదన్న యూకే అధికారులు, భారత్ జారీ చేసే వ్యాక్సినేషన్ ధ్రువపత్రంపైనే కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ జాబితాలో ఆ్రస్టాజెనికా కోవిషీల్డ్‌ను చేరుస్తూ బుధవారం నిబంధనల్ని సవరించారు. అయితే కోవిషీల్డ్ తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం అంశంలో భారత్, యూకే పరస్పరం చర్చించుకుంటున్నాయని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని వెల్లడించారు. విదేశీ ప్రయాణికుల మార్గదర్శకాల్లో బ్రిటన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను చేర్చకపోవడంపై భారత్ పదునైన విమర్శలే చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్–ఆ్రస్టాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్నే పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో చేస్తోందని, అలాంటప్పుడు ఆ వ్యాక్సిన్‌పై ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ నిలదీసింది. భారత్‌లో తయారైన టీకాలు పనికొచ్చినప్పుడు... అదే టీకా వేసుకున్న వారు బ్రిటన్‌కు ఎందుకు రాకూడదంటూ సూటిగా ప్రశ్నించింది. భారత్ విమర్శలతో వెనక్కి తగ్గిన బ్రిటన్ వ్యాక్సిన్‌కి అంగీకరించినప్పటికీ, భారత్ జారీ చేసే వ్యాక్సిన్ ధ్రువపత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేదని, అందుకే ఆ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించి తీరాలని చెప్పింది. మరోవైపు భారత్ అధికారులు మాత్రం వ్యాక్సిన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్య లేదని, డబ్ల్యూహెచ్ఓ నిబంధనలకి అనుగుణంగానే జారీ చేస్తున్నామని చెబుతున్నారు. -
మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్ భారత్‌కు అప్పగింత
లండన్: పేరుమోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్‌ను(38) బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కిషన్ సింగ్ భారత్‌లో వాంటెడ్ నేరగాడిగా పోలీసు రికార్డులక్కాడు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసు శాఖ అతడిని ఇండియాకు అప్పగించింది. రాజస్తానీ మూలాలున్న కిషన్ సింగ్ బ్రిటీష్ పౌరుడు. 2016–17లో ఇండియాలో మెఫాడ్రోన్ (వైట్ మ్యాజిక్), మ్యావ్ మ్యావ్, కెటామైన్ అనే మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసినట్లు అతడిపై కేసు నమోదయ్యింది. 2018లో లండన్‌లో అక్కడి పోలీసులు కిషన్ సింగ్‌ను అరెస్టు చేశారు. -
ఫైజర్ టీకా వచ్చేసింది!
లండన్: ఫైజర్– బయో ఎన్ టెక్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌కు చెందిన ఔషధ నియంత్రణా సంస్థ ఎంహెచ్ఆర్ఏ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు హెల్త్ సెక్రటరీ మాట్ హాంకాక్ చెప్పారు. టీకా అధ్యయనాల్లో 95 శాతం ప్రభావశీలత చూపిందన్నారు. టీకా పంపిణీ మంత్రి నదీమ్ మాట్లాడుతూ ‘‘ కరోనాపై పోరాటంలో ఇది అతిపెద్ద అడుగు’’ అన్నారు. కంపెనీ సమర్పించిన డేటా విశ్లేషణను నిపుణులు పరిశీలించిన అనంతరం వ్యాక్సిన్‌కు ఉండాల్సిన ప్రమాణాలను, రక్షణ నియమాలను ఈ టీకా అందుకున్నట్లు ఎంహెచ్ఆర్ఏ భావించి, ప్రజల్లో వాడకానికి అనుమతినిచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టీకాను ముందుగా తీసుకునే ప్రాధామ్య వర్గాలు(ప్రియారిటీ గ్రూప్స్) అనుసరించాల్సిన సూచనలను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. వైద్యులు, వయోవృద్ధుల్లాంటి వారిని ప్రాధామ్య వర్గాలుగా పరిగణిస్తారు. ‘‘వచ్చేవారం నుంచి యూకే మొత్తం టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. టీకా విజయవంతం కావాలంటే ప్రజలంతా తమకు నిర్ధేశించిన పాత్రను సమర్ధవంతంగా పోషించాలి’’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 4కోట్ల డోసులను ప్రభుత్వం ఆర్డరు చేసింది. వ్యాక్సినేషన్లో భాగంగా 21 రోజుల వ్యవధితో రెండుమార్లు టీకా ఇస్తారు. టీకాను అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచడం అతిపెద్ద సవాలని హాంకాక్ అభిప్రాయపడ్డారు. తొలి దశలో ముందుగా 8 లక్షల వ్యాక్సిన్షాట్స్ అందుబాటులో ఉంటాయని, క్రమంగా నెలాఖరుకు మిగిలిన డోసులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. టీకాను ఫైజర్ ఎంత వేగంగా ఉత్పత్తి చేస్తే అంతవేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. టీకాలు అందుబాటులోకి వస్తుండడం సంతోషకరమైన అంశమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. రష్యాలో వ్యాక్సినేషన్ మాస్కో: ఒకవైపు ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలపగా, మరోవైపు స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్‌కు రష్యా అనుమతినిచ్చింది. వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. డిసెంబర్లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. రష్యా 20 లక్షల డోస్‌లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే లక్ష మందికిపైగా ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ చెప్పడం గమనార్హం. -
భార్యాభర్తలకూ భౌతికదూరం తప్పదు!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా లండన్, టూ టైర్, త్రీ టైర్ నగరాల్లో, కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు, సుదీర్ఘకాలంపాటు సన్నిహిత సంబంధాలు కలిగిన జంటలు ఇంట్లో అయినా, బయటైనా కలుసుకున్నప్పుడు ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ మార్గదర్శకాల్లో పేర్కొంది. అంటే వారు లైంగిక సంబంధాలు కొనసాగించరాదని పరోక్షంగా స్పష్టం చేసింది. ఒకే కప్పు కింద నివసిస్తున్న భార్యాభర్తలు, సహజీవనం సాగిస్తున్న జంటలు ఇంటా బయట భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, వారు లైంగిక సంబంధాలు కొనసాగించవచ్చని పేర్కొంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, బయటకు వెళ్లినప్పుడు పాటించాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఉద్యోగం రిత్యా, లేదా మరే ఇతర కారణాల వల్లనో వేర్వేరుగా జీవిస్తున్న భార్యాభర్తలు, సహజీవన జంటలు ఇంటా బయట కలసుకున్నప్పుడు భౌతిక దూరం పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను లైంగికంగా కలుసుకోరాదని చెప్పే హక్కు ప్రభుత్వానికి లేదని, ఇది తమ ప్రైమసీ హక్కులకు భంగం కలిగించడమేనంటూ వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కొత్తగా విధించిన ఆంక్షలు ఎంతవరకు సబబంటూ ప్రభుత్వ వర్గాలను ప్రశ్నించగా, సమాజంలో ఇప్పటికీ కరోనా వైరస్ వేగంగా విజంభిస్తోందని, కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే ఇతర కుటుంబ సభ్యులకు సోకకుండా నివారించేందుకే ఈ నిబంధనలంటూ ప్రభుత్వ వర్గాలు సమర్థించాయి. -
కరోనాపై పరిశోధనలకు ముందుకు రండి
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిపై పోరుకు అవసరమైన వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాల ఉత్పత్తి దిశగా ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసింది. విశాఖపట్నం జిల్లాలోని మెడ్‌టెక్ జోన్లో 5.6 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన అత్యవసర వైద్య ఉపకరణాల తయారీకి బ్రిటీష్ ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ చేపట్టింది. ఆసక్తి ఉన్న మెడికల్ స్టార్టప్ కంపెనీలు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ► బ్రిటీష్ హైకమిషన్, ఏపీ మెడ్‌టెక్ జోన్.. అర్హత ఉన్న కంపెనీలను ఎంపిక చేస్తాయి. ► ఎంపికైన కంపెనీలు వైద్య పరికరాల ఉత్పత్తులను ప్రారంభించేందుకు మెడ్‌టెక్ జోన్‌లోని మెడీవ్యాలీ ఇంక్యుబేషన్ సెంటర్లో 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తారు. ఆర్థిక, సాంకేతిక, మౌలిక వసతుల సహకారం అందిస్తారు. నవకల్పనలకు దోహదం కరోనా వైరస్‌ను అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజం కలిసి పని చేయాలన్న లక్ష్యంతోనే ఏపీ మెడ్‌టెక్ జోన్‌తో బ్రిటీష్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ వైద్య రంగంలో నవకల్పనల ఉత్పత్తికి దోహదపడుతుంది. – ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్, ఏపీ, తెలంగాణ కరోనాపై విజయమే లక్ష్యం కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు అవసరమైన వైద్య పరికరాల ఉత్పత్తి ఏపీ మెడ్‌టెక్ జోన్ లక్ష్యం. అంతర్జాతీయస్థాయిలో వైద్య పరిశోధనలకు ఏపీ మెడ్‌టెక్ జోన్ కేంద్ర బిందువుగా ఉంటుంది. – జితేందర్ శర్మ, ఎండీ–సీఈవో, ఏపీ మెడ్‌టెక్ జోన్ -
ఫార్ములావన్ రేసులకు బ్రిటన్ అనుమతి
లండన్: ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని కరోనా మింగేసింది. టెన్నిస్ ప్రియుల్ని ఈ అంశం బాధించింది. అయితే ఫార్ములావన్‌కు (ఎఫ్1) మాత్రం ఈ గండం లేదు. ప్రీమియం స్పోర్ట్ ఈవెంట్ అయిన ఫార్ములావన్ రేసులకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సిల్వర్‌స్టోన్ వేదిక ‘లాక్డౌన్’ నుంచి ‘ఓపెన్’ కానుంది. ఇక్కడ జరిగే రెండు రేసుల్లో పాల్గొనే వారి కోసం 14 రోజుల క్వారంటైన్ నిబంధనకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ ‘రయ్ రయ్’ కూతతో మోతెక్కనుంది. జూలై, ఆగస్టులో ఇక్కడ రెండు రేసులు జరుగనున్నాయి. బ్రిటన్ నిర్ణయంపై ఫార్ములావన్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ సీజన్లో రేసులు మళ్లీ మొదలయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. దీనిపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం సూచించే ముందు జాగ్రత్త చర్యలతో ముందడుగు వేస్తాం. ఈ రేసుల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తాం’ అని ఎఫ్1 అధికారి ఒకరు వెల్లడించారు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ కంటే ముందుగా... జూలై 5, 12వ తేదీల్లో ఆస్ట్రియాలో, 19న హంగేరీలో ఎఫ్1 రేసులు జరుగనున్నాయి. మొత్తానికి ఇంగ్లండ్‌లో ఆటలకు గేట్లు ఎత్తేయనున్నారు. దీంతో చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. -
హాంకాంగ్ ఉద్యమం.. చైనా కలవరం
20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్‌ని చైనా మెయిన్‌ల్యాండ్‌లో కలపవటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. అంతర్జాతీయంగా గతవారం హాంకాంగే హాట్ టాపిక్. స్వయం పరిపాలన కోసం అక్కడ జరుగుతున్న ఉద్యమం తీవ్రమవుతోంది. 20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్‌ని చైనా మెయిన్‌ల్యాండ్‌లో కలపటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించినా ఉద్యమం చల్లారకపోగా తిరిగిపుంజుకుంది. ఇది మరింత విస్తృతమై పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజలు వీధుల్లోకొచ్చారు. దేశం ఒక్కటే, వ్యవస్థలు రెండు.. 1997 జూలై 1న బ్రిటన్ హాంకాంగ్‌పై ఆధిపత్యాన్ని చైనాకు అప్పగించింది. హాంకాంగ్ చైనాలో భాగమైనప్పటికీ హాంకాంగ్‌కి పాలనాంశాల్లో, కొన్ని ఇతర విషయాల్లో స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానాలు మాత్రం చైనా ప్రభుత్వ అ«ధీనంలోనే ఉంటాయి. చైనా అధ్యక్షుడి పాలనలోనే ఉన్నప్పటికీ.. పరిపాలనలోనూ, ఇతర విధానాల రూపకల్పనలోనూ హాంకాంగ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఈ స్వతంత్రత ప్రధాన భూభాగమైన చైనాకన్నా అధికంగా ఉన్నదనీ, చైనా ప్రజలకన్నా హాంకాంగ్ ప్రజలు ఎక్కువ హక్కులు అనుభవిస్తున్నారనీ చైనా ఆరోపిస్తోంది. అందుకే ఇక్కడి నేరస్తులను చైనా మెయిన్‌ల్యాండ్‌కు అప్పగించేందుకు చట్టసవరణకు చైనా సిద్ధమైంది. హాంకాంగ్ ప్రజలను ఈ చర్య మరింత రెచ్చగొట్టింది. తక్షణమే చట్టసవరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు మొదలయ్యాయి. పార్లమెంటు ముట్టడి.. జూలైలో ఆందోళనకారులు పార్లమెంటును చుట్టుముట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఎట్టకేలకు చట్టసవరణ బిల్లుని చైనా ప్రభుత్వం విరమించుకుంది. ఇంకా... ఈ ఉద్యమాన్ని దొమ్మీలుగా, అల్లర్లుగా భావించొద్దని, అరెస్టు చేసిన ఉద్యమకారులను విడుదల చేయాలని, పోలీసుల హింసాకాండపై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని, సార్వత్రిక ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లు నెరవేరలేదు. -
ముందస్తుకు బ్రిటన్ జై
లండన్: బ్రెగ్జిట్ సంక్షోభాన్ని నివారించడానికి బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ ఇచ్చిన పిలుపుకి ప్రజాప్రతినిధులందరూ అనుకూలంగా స్పందించారు. దీంతో డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి జనవరి నెలఖారువరకు ఈయూ గడువు పొడిగించడంతో ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని బొరిస్ జాన్సన్ భావించారు. బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానమంత్రి ఎంపీల మద్దతుతో మాత్రమే ఆ పని చేయగలరు. ఎన్నికలకు పార్లమెంటు ఆమోదం ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై చర్చించిన హౌస్ ఆఫ్ కామన్స్ 438–20 తేడాతో ఆమోద ముద్ర వేసింది. బ్రెగ్జిట్ ప్రణాళికకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి జాన్సన్ క్రిస్మస్ పండుగకి ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వ్యూహరచన చేశారు. ఓటు హక్కు వయసుని 16కి తగ్గించాలని, ఓటింగ్‌లో ఈయూ పౌరులు కూడా పాల్గొనాలని, డిసెంబర్ 9న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎలాగైనా బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోద ముద్ర పడేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతోంది. కానీ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని విపక్ష లేబర్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. బ్రెగ్జిట్‌కు ఈయూ గడువును అక్టోబర్ 31 నుంచి 2020 జనవరి 31 వరకు పెంచిన వెంటనే ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా సహకరించింది. పార్లమెంటులో మరింత బలం పెంచుకొని ఈయూకి గుడ్‌బై కొట్టేయాలని లెక్కలు వేసుకుంటున్న బొరిస్ దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ప్రజలందరూ గ్రహించాలన్నారు. బ్రిటన్ బ్రెగ్జిట్ కల సాకారమవడానికి ప్రజలందరూ చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వామపక్షభావజాలం కలిగిన లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బన్ కూడా మార్పు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఒపీనియన్ పోల్స్ అన్నీ కన్జర్వేటివ్ పార్టీకే అధికారం దక్కుతుందని అంచనా వేస్తూ ఉండడంతో కార్బన్ నేతృత్వంలో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ ఎంపీల్లో నెలకొని ఉంది. నాలుగేళ్లలో మూడో ఎన్నికలు బ్రిటన్‌లో గత నాలుగేళ్లలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజా తీర్పులో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. 2015, 2017 ఎన్నికల్లో ప్రజల మూడ్‌లో వచ్చిన మార్పు చూస్తే ఈ ఎన్నికల్లో జాన్సన్ చావో రేవో తేల్చుకోవాల్సిందేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బ్రెగ్జిట్ ఒప్పందం ముందుకు వెళ్లాలంటే బొరిస్ జాన్సన్ కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి. హంగ్ పార్లమెంటు వస్తే మళ్లీ దేశంలో అనిశ్చితి తప్పదని నిపుణుల అభిప్రాయంగా ఉంది. -
రక్త చరిత్రకు వందేళ్లు పూర్తి..
చంఢీగడ్: బ్రిటీష్ పాలిత భారతదేశంలో మాయనిమచ్చగా చరిత్రలో నిలిచిపోయిన ఘటన జలియన్ వాలాబాగ్ దురాగతం. ఆంగ్లేయుల సైన్యం ఊచకోత దాటికి వేలాదిమంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పచ్చని నేలవంటి అమృత్సర్పై రక్తపుటేరులు పారించారు. బ్రిటీష్ దురాగతానికి వందేళ్లు గడిచినా.. భారతీయుల గుండెల్లో దిగిన ఆ తుపాకీగుండ్ల శబ్ధం ఇంకా మారుమోగుతూనే ఉంది. 1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ సమీపంలో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలను బ్రిటీష్ సైన్యం ఊచకోత కోసిన విషయం తెలిసిందే. భారతీయుల హక్కులను కాలరాస్తూ.. బ్రిటీష్ ప్రభుత్వం తీసుకువచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సమావేశమైన వేలమందిపై తూటల వర్షం కురించారు. ఈ ఘటనకు నేటితో వందేళ్లు పూర్తియిన సందర్భంగా అమృత్‌సర్‌లోని అమరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. జనరల్ డయ్యర్ మారణహోమం వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం నాడు అందరూ గుమ్మికూడి రౌలత్‌చట్టంపై చర్చిస్తున్నారు. అలాగే ఈ చట్టం కింద ప్రముఖ్య స్వాతంత్య్ర సమరయోధులు.. సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వచ్చే ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడంకోసం వారంతా ఎదురు చూస్తున్నారు. అయితే తమ పాలననకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభ గురించి తెలుసుకున్న బ్రిటీష్ జనరల్ డయ్యర్ దారుణమైన మారణహోమానికి పాల్పడ్డాడు. మైదానానికున్న అన్ని దారుల్లో సాయుధులను మొహరించి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా దిగ్బంధించి విచక్షణా రహితంగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో దాదాపు 400 మంది మృత్యువాతపడ్డట్లు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అంతకంటే ఎక్కువమందే దాదాపు 1000 మందికి పైగా చనిపోయివుంటారని చరిత్ర చెబుతోంది. ఈ దాడిలో అధికంగా చిన్నారులు. మహిళలే ప్రాణాలు కోల్పోయారు. భారతీయు ఒత్తిడిమేరకు ఈ ఉదంతంపై విచారణ జరపడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1919లో "హంటర్ కమిషన్" ఏర్పాటు చేశారు. అక్కడ సమావేశమైన గుంపుపై కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ డయ్యర్ ఒప్పుకున్నాడు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంది. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మాత్రం అతన్ని ప్రశంసించారు. పగతీర్చుకున్న ఉద్దమ్ సింగ్ పౌరులను చుట్టుముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి వేల మంది మరణానికి కారణమైన జనరల్ డైయర్ను విప్లవకారుడు ఉద్దమ్ సింగ్ హత్యచేశాడు. ఘటన జరిగిన 21 ఏళ్ల అనంతరం..1940 మార్చి 13న లండన్ కాక్స్ టన్ హాల్లో అతన్ని హతమార్చడం విశేషం. ఆ తరువాత బ్రిటీష్ ప్రభుత్వం ఉద్దమ్ సింగ్‌ని ఉరితీసింది. భారత దేశపు తొలి మార్స్కిస్ట్గా బ్రిటీష్ అధికారులు ఉద్దమ్‌ను వర్ణించడం విశేషం. భారతదేశంలో ఈ ఘటనపై ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి జలయన్వాలాబాగ్ ఘటనే నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చరిత్రకారులు చెప్తుంటారు. జలియన్ వాలాబాగ్ స్మారక స్తూపం 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ) తీర్మానించింది. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్లల నుంచి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం. -
మరో బోస్
1911లో రెండు ముఖ్య పరిణామాలు జరిగాయి. ఒకటి, బెంగాల్ విభజనను ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. రెండో కీలక పరిణామం– బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కేంద్రాన్ని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. డిసెంబర్ 23, 1912న నాటి వైస్రాయ్ హార్డింజ్ ఏనుగు ఎక్కి ఆడంబరంగా ఢిల్లీ నగరంలో ప్రవేశించాడు. చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ఇంటి ముందు ఒక బాలిక ఆత్రంగా ఎదురు చూస్తోంది, ఆ ఏనుగు రాక కోసం. దగ్గరకి రాగానే రహస్యంగా పట్టుకున్న నాటుబాంబును ఏనుగు మీది అంబారీ మీదకి విసిరింది. జనం కకావికలయ్యారు. హార్డింజ్ స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. ఈ చర్యను ఖండిస్తు డెహ్రాడూన్‌లో ఉన్న అటవీ పరిశోధన సంస్థ ఒక సభ నిర్వహించింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించినవాడు అక్కడే పని చేస్తున్న రాస్ బిహారీ బోస్. నిజానికి ఢిల్లీలో బాంబు విసిరినది బాలిక కాదు, ఆ వేషంలో ఉన్న 16 ఏళ్ల బసంత్ విశ్వాస్ అనే బాలుడు. సాక్షాత్తు వైస్రాయ్ హత్యకు పథకం వేసినవాడు మరెవ్వరో కాదు, రాస్ బిహారీ బోస్. హత్యాయత్నం విఫలం కావడంతో డెహ్రాడూన్ వెళ్లిపోయి అనుమానం రాకుండా విధులలో చేరాడు. కానీ ఈ పథకం వేసినవాడు రాస్ బిహారీ అన్న సంగతి త్వరలోనే పోలీసులు పసిగట్టారు. భారతదేశం నుంచి బ్రిటిష్ పాలనను సాగనంపాలంటే హింసామార్గం తప్ప వేరుదారి లేదని నమ్మినవారిలో రాస్ బిహారీ ఒకరు. విప్లవకారులతో, విప్లవ కార్యకలాపాలతో ఆయన మమేకత్వం గమనిస్తే విస్తుపోతాం. చాలా చిన్నతనంలోనే ఆయన బాంబులు చేయడం నేర్చుకున్నాడు. తరువాత సైన్యంలో చేరాలని అనుకున్నాడు. సాధ్యం కాలేదు. గదర్ పార్టీలో పనిచేశాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు. ఆపై తన నాయకత్వంలో పనిచేస్తున్న అజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ సుభాశ్ చంద్రబోస్‌కు అప్పించారు. దేశంలో ప్రవేశించే అవకాశం లేక జపాన్ గడ్డ మీద కన్నుమూశారు. \ రాస్ బిహారీ (మే 25, 1886– జనవరి 21, 1945) అఖండ బెంగాల్‌లోని బురద్వాన్ జిల్లా సుబల్‌దహ గ్రామంలో పుట్టారు. ఆయన మూడో ఏటనే తల్లి మరణించారు. తండ్రి బిపిన్బిహారీ బోస్. తాతగారు కాళీచరణ్ బోస్ పర్యవేక్షణలో రాస్ బిహారీ ప్రాథమిక విద్య సుబల్దహలోనే జరిగింది. తరువాత చంద్రనాగోర్‌లో ఉన్నత విద్యకు వెళ్లారు. చంద్రనాగోర్ అప్పుడు ఫ్రెంచ్ ఏలుబడిలో ఉండేది. దీనితో 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం గురించి చిన్నతనంలోనే తెలుసుకునే అవకాశం ఆయనకు వచ్చింది. దీనితో పాటు బంకించంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠం’ నవలతో కూడా ఆయన దృష్టి వికసించింది. ఇంకా నవీన్ సేన్ కవితల సంకలనం ‘ప్లాసి యుద్ధం’ కూడా ఆయనను ఉత్తేజపరిచింది. వీటితో పాటు సురేంద్రనాథ్ బెనర్జీ, వివేకానంద వంటి వారి ఉపన్యాసాలు కూడా రాస్ బిహారీలో చిన్నతనంలోనే ఒక కొత్త ప్రాపంచిక దృష్టికి అవకాశం కల్పించాయి. ఢిల్లీలో హార్డింజ్ హత్య పథకం విఫలమైన తరువాత రాస్ బిహారీ కొద్దికాలం చంద్రనాగోర్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన దొరికితే ఉరిశిక్ష ఖాయం. భారతదేశం నుంచి బయటపడాలని 1915లో భావించారాయన. పీఎన్ ఠాకూర్ పేరుతో, ఒక కవి అవతారం దాల్చి జప బయటుదేరారు. మొదట కోబ్ నౌకాశ్రయానికి, తరువాత టోక్యో చేరుకున్నారు. అక్కడే విశాల ఆసియావాదులను ఆశ్రయించారు. మిత్సుర టొయోమా అందులో ఒకరు. ఈయనే మొదట రాస్ బిహారీకి ఆశ్రయం ఇచ్చారు. కానీ కొద్దికాలానికే బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన ఆచూకీ తెలిసిపోయింది. తమకు అప్పగించవలసిందిగా ఇంగ్లండ్ జపాన్ను కోరింది. భారతీయ విప్లవకారులను వెతికే పని ఆరంభించిన జపాన్ పోలీసు యంత్రాంగం టొయోమా ఇంటిని కూడా సోదా చేసింది. అయితే మితవాద నాయకుడైనందువల్ల ఆ ఇంటిని ఎక్కువ సేపు సోదా చేయలేదు. దీనితో బోస్ టోక్యోలోనే షింజుకు అనే కొత్త రహస్య స్థావరానికి వెళ్లిపోయారు. అక్కడ సోమా కుటుంబీకులు నడుపుతున్న నకామురయా బేకరీలో ఆశ్రయం పొందారు. టొయోమో, సోమా కుటుంబం వీరంతా భారత స్వాతంత్య్రోద్యమం పట్ల సానుభూతి కలిగినవారే. ఐజో, కొత్సుకొ సోమా కూడా అలాంటివారే. వారు తమ బేకరీలోనే రహస్య ప్రదేశంలో రాస్ బిహారీని ఉంచారు. ఈ విషయం ఇతరులు ఎవ్వరికీ తెలియనివ్వకుండా తమ కుటుంబ సభ్యుల మధ్యనే దాచారు. రాస్ బిహారీని అంత జాగ్రత్తగా కాపాడారు. ఆ సమయంలోనే ఒక బ్రిటన్ నౌక జపాన్ వారి వాణిజ్య నౌకను పేల్చింది. దీనితో రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసిపోయాయి. ఫలితంగా రాస్ బిహారీని అప్పగించాలంటూ బ్రిటన్ చేసిన విజ్ఞాపన రద్దయింది. అప్పుడు ఆయన బయట ప్రపంచంలోకి స్వేచ్ఛగా అడుగు పెట్టారు. సోమా కుటుంబంతో ఏర్పడిన అనుబంధంతో ఐజో, కొత్సుకొ సోమా పెద్ద కుమార్తె తొషికోను వివాహం చేసుకుంటానని రాస్ బిహారీ కోరాడు. అందుకు ఆ దంపతులు అంగీకరించారు. అసలు ఆ సమయంలో రాస్ బిహారీని అల్లుడిగా చేసుకోవడానికి ఆ దంపతులు అంగీకరించడం. భర్తగా స్వీకరించడానికి తొషికో ఇష్టపడడం పెద్ద విషయమే. ఎందుకంటే విదేశీయులని పెళ్లి చేసుకోవడానికి ఆనాటి జపాన్ సమాజం అంగీకరించేది కాదు. పైగా విదేశాల నుంచి వచ్చి ప్రవాసం గడుపుతున్న వారితో వివాహాలు అసలే నిషిద్ధం కూడా. అందుకే తొషికో గురించి చెప్పకుండా రాస్ బిహారీ జీవిత చిత్రం పరిపూర్ణమని అనిపించదు. అంతేకాదు, జపాన్ చేరుకున్న తరువాత కూడా రాస్ బిహారీ తన భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని విరమించలేదు. అందుకోసం ఆయన విదేశాలకు వెళుతూ ఉండేవారు. అలాంటి సమయంలో తొషికో కుటుంబ బాధ్యత అంతా చూసుకునేవారు. కానీ ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత తొషికో క్షయ బారిన పడి తన 28వ ఏటనే హఠాత్తుగా కన్నుమూశారు. ఆమె మరణం బోస్‌ను బాగా కుంగదీసింది. ఆయన మరోసారి వివాహం చేసుకోలేదు కూడా. నకామురయా బేకరీ పై అంతస్తులో చిన్న రెస్టారెంట్ ప్రారంభించి, మామగారితో కలసి వ్యాపారం చేశారు. ఈ చిన్న రెస్టారెంట్లో తయారు చేసే భారతీయ వంటకాల కోసం జపాన్ జాతీయులు విరగబడేవారు. ఇది ఎంతగా ఎదిగిపోయిందంటే జపాన్ స్టాక్ ఎక్సె ్చంజ్‌లో వాటాలు అమ్మిన తొలి జపాన్ ఆహారాల సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇది సహజంగానే స్థానికులలో ఆసూయకు కారణమైంది. ఒక సామ్రాజ్యవాద వలస దేశానికి చెందిన మనిషితో తొషికో ప్రేమ వ్యవహారం అంటూ ఆమె గురించి చెడుగా రాసేవి. కానీ ‘నకామురయా బోస్’గా ఆయన ఎందరో జపనీయులకు ఇష్టుడిగా మారిపోయారు. ఆయన తయారు చేసిన కూరకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఒకపక్క ఆ రెస్టారెంట్ పని చేస్తూనే భారత దేశ విముక్తి గురించి ఆలోచించేవారు రాస్ బిహారీ. టోక్యోలోనే ఇండియన్ క్లబ్ పేరుతో ఒక చిన్న సంస్థను స్థాపించి, దాని ద్వారా ఇంగ్లిష్ పత్రికలకు అనేక వ్యాసాలు రాసేవారాయన. రేడియో ప్రసంగాలు ఇచ్చేవారు. భారతీయులు సాగిస్తున్న స్వాతంత్య్రం పోరాటానికి మద్దతు ఇవ్వవలసిందిగా ఆయన ప్రపంచ దేశాలకు నిరంతరం విజ్ఞప్తి చేస్తూ ఉండేవారు. అనేక మందికి ఉత్తరాలు రాసేవారు. భారత్‌కు స్వాతంత్య్రం అంటే అది భారత్‌కు మాత్రమే ప్రయోజనం కాదు. ప్రపంచానికి ప్రయోజనం అని భావించారాయన. అందుకు కారణం కూడా చూపించారు. భారత్‌లో ఇంగ్లండ్ తిష్ట అలా కొనసాగుతూ ఉంటే, పేద, బడుగు దేశాలకు రక్షణ నానాటికీ కరువైపోతుందని ఆయన భావించారు. భారత్‌ను ఇంగ్లండ్ పాలించినంత కాలం ప్రపంచంలో శాంతి ఉండదు అని కూడా ఆయన రాశారు. దీనితో పాటు జపాన్‌లోనే ఉంటున్నప్పటికీ భారతదేశంలో సాగుతున్న ఉద్యమాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. ‘గాంధీజీ గతకాలపు మనిషి. సుభాశ్ చంద్రబోస్ ఈ కాలం మనిషి’ అని ఒక సందర్భంలో రాస్ బిహారీ వ్యాఖ్యానించారు కూడా. ఆసియా దేశాల మధ్య ఐక్యతకు ఎంతో ప్రాధాన్యం ఉన్నదో రాస్ బిహారీ అద్భుతంగా ఆనాడే గుర్తించారని అనిపిస్తుంది. ఆ ఐక్యతను ఆయన మనసారా ఆకాంక్షించారు. ఆగస్టు 1, 1926న నాగసాకిలో ఆయన నిర్వహించిన సభ చరిత్రాత్మకమైనదని చెప్పాలి. డాక్టర్ హోక్వా అనే ప్రముఖునితో కలసి రాస్ బిహారీ ఆసియా దేశాల ప్రతినిధుల గోష్టి నిర్వహించారు. దీనికి 42 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో చైనా వారు 11 మంది. భారతీయులు 8, అప్ఘాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి ఒక్కొక్కరి వంతున హాజరయ్యారు. ఇంకా జపాన్‌వారు 20 మంది పాల్గొన్నారు. ఆసియా ఆసియావాసులకే అన్న నినాదం రాస్ బిహారీ అక్కడ ఇచ్చారు. 1926లో ఆయన స్థాపించిన పాన్ ఆసియన్ అసోసియేషన్, 1930లో నెలకొల్పిన జపాన్–ఇండియా మిత్రమండలి కూడా ఎంతో ప్రాధాన్యం కలిగినవి. ఈ మిత్రమండలి ఏటా మూడు లేదా నాలుగు పర్యాయాలు సమావేశాలు జరిపేది. జపాన్, భారత్ దేశాల మధ్య సత్సంబంధాల గురించి చర్చించేది. ప్రధానంగా పురాతన సంస్కృతులు కలిగిన జపాన్, భారత్‌ల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. హిందూ మహాసభ జపాన్ శాఖను ఆయనే ప్రారంభించి, వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు బోస్. ఇంతలోనే రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఈ యుద్ధంలో బ్రిటన్ కీలకంగా ఉంది. ఇంగ్లండ్‌ను చావు దెబ్బ కొట్టడానికి ఈ యుద్ధాన్ని ఆయుధంగా మలుచుకోవాలని విప్లవవాదుల ఆశయం. 1942లో సింగపూర్ జపాన్ అధీనంలోకి వచ్చింది. ఆగ్నేయాసియాలో 32,000 మంది భారతీయ సిపాయిలను జపాన్ యుద్ధఖైదీలుగా పట్టుకుంది. వీరిందరికీ భారత స్వాతంత్య్రం కోసం పోరాడే అవకాశం కల్పిస్తానని సింగపూర్‌లో జపాన్ సైనిక వ్యవహారాల అధిపతి మేజర్ ఫుజీవరా ప్రమాణం చేశాడు. ఈ వ్యవహారం చూడడానికి సింగపూర్ వచ్చిన రాస్ బిహారీ అక్కడే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ను 1924లో స్థాపించారాయన. ఈ యుద్ధఖైదీల సాయంతో భారత్‌ను విముక్తం చేసే పనిలో తోడ్పడేందుకు రాస్ బిహారీ టోక్యో నుంచి బ్యాంకాక్ వెళ్లారు. తరువాత ఆజాద్ హింద్ ఫౌజ్‌కు నాయకత్వం వహించవలసి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలోనే మేజర్ మోహన్‌సింగ్ నాయకత్వంలో పోరాడుతున్న 40 వేల మంది భారతీయ సైనికులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. వీరందరితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయవలసిందని జపాన్ సైనికాధికారులు అవకాశం ఇచ్చారు. ఆ పని మొదలయింది. అయితే ఆగ్నేయాసియాలో యుద్ధం గురించి సింగ్‌కూ, జపాన్ అధికారులకు మధ్య విబేదాలు వచ్చాయి. దీనితో సింగ్‌ను అరెస్టు చేసి, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు, అంటే రాస్‌బిహారీకి అజాద్ హింద్ ఫౌజ్‌ను అప్పిగించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. తరువాత రాస్ బిహారీ అజాద్ హింద్ పౌజ్ను భారతదేశం నుంచి రహస్యంగా సింగపూర్ వచ్చిన నేతాజీ బోస్‌కు అప్పచెప్పారు. 1945 నాటికి రాస్ బిహారీ నిరంతరం రేడియో ప్రసారాలను వినడానికి అలవాటు పడ్డారు. అందులో ఒక వార్త కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అది భారతదేశం స్వాతంత్య్రమైందన్న వార్త. కానీ ఆ వార్త వినకుండానే ఆయన కన్నుమూశారు. ఆయన పార్ధివదేహాన్ని తీసుకువెళ్లడానికి జపాన్ రాజకుటుంబం ప్రత్యేక వాహనాన్ని పంపించింది. 1924 నాటికే జపాన్లొ రాస్ బిహారీ ఒక ప్రముఖ పౌరుడు. - ∙డా. గోపరాజు నారాయణరావు -
టికెట్ తనిఖీ సిబ్బందీ రన్నింగ్ స్టాఫే
న్యూఢిల్లీ: బ్రిటిష్ జమానాలో రద్దయిన సౌకర్యాలను రైల్వే టికెట్ తనిఖీ సిబ్బంది 87 ఏళ్ల తర్వాత తిరిగి పొందేందుకు మార్గం సుగమమైంది. రైలు ప్రయాణం సురక్షితంగా సాగడంలో కీలకంగా వ్యవహరించే లోకో డ్రైవర్లు, అసిస్టెంట్ లోకో డ్రైవర్లు, గార్డులు, బ్రేక్స్మెన్ తదితరులను రన్నింగ్స్టాఫ్గా వ్యవహరిస్తారు. 1931 వరకు టికెట్ తనిఖీ సిబ్బంది కూడా రన్నింగ్ స్టాఫ్‌లో భాగంగానే ఉండేవారు. అయితే, తమకు వ్యతిరేకంగా పోరాడే భారతీయ నేతలు రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో వీరిని రన్నింగ్‌స్టాఫ్ జాబితా నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తొలగించింది. అప్పటి నుంచి టికెట్ తనిఖీ సిబ్బంది మిగతా ‘రన్నింగ్‌స్టాఫ్’తో పోలిస్తే వేతనాలు, అలవెన్సులు, పింఛన్లు తదితర విషయాల్లో వివక్షకు గురవుతున్నారు. దీంతో వీరు తమను తిరిగి రన్నింగ్‌స్టాఫ్ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు స్పందించిన రైల్వే శాఖ ఈ విషయమై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని తాజాగా నియమించింది. -
చారిత్రకం.. కళాత్మకం
కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల హయాంలోనే ఆధునిక హైదరాబాద్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. ఓవైపు రాచరిక, నియంతృత్వ పరిపాలన కొనసాగినప్పటికీ... మరోవైపు అద్భుతమైన, కళాత్మకమైన భవనాలు, రహదారుల నిర్మాణమూ జరిగింది. నగరం నలుమూలలనుఅనుసంధానం చేసే రోడ్లు...ఆ రోజుల్లోనే అందుబాటులోకి వచ్చాయి. చార్మినార్ కేంద్రంగావిస్తరించుకున్న హైదరాబాద్,హుస్సేన్‌సాగర్ చెరువుకు ఉత్తరాన అభివృద్ధి చెందిన సికింద్రాబాద్... రెండూ జంటనగరాలుగా, విభిన్న సాంస్కృతిక జీవన సముదాయాలుగా విలసిల్లాయి. వైవిధ్యమైన నగరఆవిష్కరణకు ఈ సంస్కృతులు దోహదం చేశాయి. ఈ విశిష్టమైన సాంస్కృతిక జీవనంలో భవనాలు, రోడ్లు భాగమయ్యాయి. అప్పట్లోనిర్మించిన ఎన్నో కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా నగర చరిత్రను చాటి చెబుతున్నాయి. రహదారులు ప్రముఖుల స్మారకంగా నిలుస్తున్నాయి. నేడు నిజాం రాజ్యం భారత్‌లో విలీనమైన దినం(సెప్టెంబర్ 17) సందర్భంగాఆనాటి భవనాలు, రోడ్లపై‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్ :మూడో నిజాం ‘సికిందర్ జా’ పేరుతో ఏర్పాటైన సికింద్రాబాద్ మొదటి నుంచే ఆధునికతను సంతరించుకుంది. బ్రిటీష్ ప్రభుత్వంతో నిజాం సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 1806లో హుస్సేన్‌సాగర్‌కు ఉత్తరాన ఉన్న 4 చదరపు మైళ్ల ప్రాంతాన్ని బ్రిటీష్ సైనిక పటాలలకు ఇచ్చేశారు. మొదట్లో 5వేల బ్రిటీష్ బలగాల విస్తరణ కోసం ఏర్పాటైన ఈ ప్రాంతం బ్రిటీష్ కంటోన్మెంట్‌గా అనతి కాలంలోనే విస్తరించింది. ఆ తరువాత 17 చదరపు మైళ్లకు విస్తరించింది. 50వేల బలగాలకు స్థావరమైంది. మిలటరీ ప్రాంతాలతో పాటు సాధారణ ప్రజల నివాసాలు కూడా అభివృద్ధి చెందాయి. సికింద్రాబాద్ ఏర్పడినప్పటి నుంచి 1948 వరకు ఈ ప్రాంతం బ్రిటీష్ ప్రభుత్వ హయాంలోనే ఉంది. దీంతో ఇక్కడ నిర్మించిన రోడ్లు బ్రిటీష్ ప్రముఖులు, స్వాతంత్య్రోద్యమ నేతల పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. రాష్ట్రపతి రోడ్ హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబురాజేంద్రప్రసాద్ తొలిసారి నగర పర్యటనకు వచ్చారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న తొలి రాష్ట్రపతి ప్రయాణించిన సికింద్రాబాద్‌లోని ఒక దారికి రాష్ట్రపతి రోడ్‌గా నామకరణం చేశారు. హరిహర కళాభవన్ చౌరస్తా, సికింద్రాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం, ప్యాట్నీ సెంటర్ మీదుగా కర్బలామైదాన్ వరకు ఉన్న రహదారిని రాష్ట్రపతి రోడ్‌గా వ్యవహరిస్తారు. ఆర్పీ రోడ్డు ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలకు పెట్టింది పేరు. అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఇక్కడ లభిస్తాయి. మదీనా బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా నగరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల నిర్వహణకు పంపించేవారు. అప్పట్లో సౌదీ అరేబియా చాలా పేద దేశం. హైదరాబాద్ సంస్థానం ధనికమైనది. దీంతో సౌదీ అరేబియాలోని ముస్లింల పుణ్యక్షేత్రాల నిర్వహణకు నిజాం పాలకులు ఈ బిల్డింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంపించేవారు. సెంట్రల్ లైబ్రరీ 1891లో నయాపూల్‌కు సమీపంలో మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్గామీ తన సొంత పుస్తకాలతో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఇదే ప్రదేశంలో 1932లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రస్తుతమున్న భవనం నిర్మించారు. ఇది 1955 వరకు ఆసిఫియా లైబ్రరీగా ఉండగా, ప్రస్తుతం సెంట్రల్ లైబ్రరీగా పిలుస్తున్నారు. బ్రిటీష్ రెసిడెన్సీ 1798లో అప్పటి బ్రిటీష్ రాయబారి జేమ్స్ అచిల్లెస్ కిర్క్‌ప్యాట్రిక్ దీనిని నిర్మించాడు. అత్యంత విలాసవంతమైన ఈ భవనంలో నిజాం సంస్థానంలో ఉండే బ్రిటీష్ ప్రతినిధులు ఉండేవారు. నిజాం సంస్థానం భారత్‌లో విలీనం అనంతరం 1949లో ఈ భవనంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. సరోజినీదేవి రోడ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని మహాత్ముడు పిలిచిన స్వాతంత్య్రోద్యమ నాయకురాలు, కవయిత్రి సరోజినీ నాయుడు కొంతకాలం పాటు సికింద్రాబాద్‌లో నివసించారు. స్వాతంత్య్రానంతరం పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా సరోజినీనాయుడు నియమితులయ్యాక సికింద్రాబాద్ నుంచి మకాం మార్చారు. ఆమె జ్ఞాపకార్థం నామకరణం చేసిన సరోజినీదేవి రోడ్డు జనజీవనంలో భాగమైంది. ఎస్డీ రోడ్డుగా పిలిచే ఈ రహదారిలోనే సంగీత్ చౌరస్తా, మంజు, నటరాజ్ థియేటర్లు, క్లాక్‌టవర్, మినర్వా, చంద్రలోక్, సూర్యలోక్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మినిస్టర్ రోడ్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి నగరంలోకి వచ్చే ప్రముఖులు, మంత్రులు రాకపోకలు సాగించిన మార్గం మినిస్టర్ రోడ్‌గా స్థిరపడింది. కేంద్రం నుంచి నగరానికి వచ్చే మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ రహదారి నుంచే రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం రసూల్‌పురా చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌కు కలిపే రహదారి ఇది. ఈ రహదారికి ట్యాంక్‌బండ్‌తో పాటు నెక్లెస్ రోడ్‌ను కూడా అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఈ రహదారి మొత్తం కార్ల డెకరేషన్‌కు అవసరమైన దుకాణాలకు నిలయంగా మారింది. నగరంలో చెప్పుకొదగిన కిమ్స్ ఆసుపత్రి కూడా ఇదే రహదారిలో ఉంది. సర్దార్ పటేల్ రోడ్ దేశవ్యాప్తంగా జరిగిన స్వాతంత్య్రోద్యమం హైదరాబాద్ ప్రజల కంటే సికింద్రాబాద్ ప్రజలనే ఎక్కువగా ప్రభావితం చేసింది. హైదరాబాద్ ప్రత్యక్షంగా నిజాం పరిపాలనలో ఉంటే సికింద్రాబాద్ పరోక్షంగా బ్రిటీష్ కంటోన్మెంట్‌గా కొనసాగుతుండేది. దీంతో ఇక్కడి ప్రజలు భారత స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యకు సికింద్రాబాద్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారత సైనిక బలగాలను సమున్నతంగా స్వాగతించారు. ఈ మొత్తం పరిణామానికి కేంద్రబిందువు అప్పటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఆదేశం మేరకు సైన్యం రంగంలోకి దిగి నిజాం పాలనకు చరమగీతం పాడింది. సికింద్రాబాద్ సెయింట్‌జాన్స్ చర్చి ముందున్న ఈశ్వరీబాయి విగ్రహం నుంచి బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ వరకు గల రహదారికి సర్దార్ పటేల్ రోడ్ (ఎస్పీ రోడ్డు)గా నామకరణం చేశారు. హరిహరకళాభవన్, యాత్రినివాస్ హోటల్, బేగంపేట్ విమానాశ్రయం, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, బేగంపేట్ పోలీస్‌స్టేషన్, హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల కార్యాలయం ఈ రహదారిలోనే ఉన్నాయి. జేమ్స్ స్ట్రీట్–ఎంజీ రోడ్ లక్షలాది జనసందోహంతో, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే జేమ్స్ స్ట్రీట్ సికింద్రాబాద్‌కు హాట్‌లైన్ వంటిది. నిజాం రాజు సికిందర్ జాతో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటీష్ సైనిక అధికారి మేజర్ జనరల్ జేమ్స్ అచిల్లెస్ కిర్క్‌ప్యాట్రిక్ పేరుతో ఇది జేమ్స్ స్ట్రీట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సైనికులకు అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లకు ఇది ప్రధాన మార్కెట్‌గా ఉండేది. క్రమంగా జనరల్ బజార్, రెజిమెంటల్ బజార్, పాట్ బజార్ తదితర ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం దేశవ్యాప్త పర్యటనలు చేసిన మహాత్మాగాంధీ సికింద్రాబాద్‌కు వచ్చారు. కర్బలా మైదానంలో ప్రసంగించేందుకు ఆయన అప్పటి జేమ్స్ స్ట్రీట్ గుండా పాదయాత్ర చేశారు. మహాత్ముడు నడిచిన ఈ జేమ్స్ స్ట్రీట్‌కు స్వాతంత్య్రానంతరం ‘మహాత్మాగాంధీ రోడ్’ (ఎంజీ రోడ్డు)గా నామకరణం చేశారు. ఇందుకు గుర్తుగా ఇక్కడి వ్యాపారులు ఎంజీ రోడ్లో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 2కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రహదారి స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వ్యాణిజ్య ప్రాంతం. ప్యారడైజ్ హోటల్, చర్మాస్, కేఎఫ్‌సీ, రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్, రాణిగంజ్ బస్‌డిపో ఈ రహదారిలోనే ఉన్నాయి. చార్మినార్ గోల్కొండ కేంద్రంగా కుతుబ్‌షాహీల పాలన కొనసాగింది. అయితే అప్పటికే గోల్కొండలో జనం పెరిగిపోయారు. జనాభాకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో ఐదో కులీకుతుబ్ షా కొత్త నగరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. మూసీ నదికి కూతవేటు దూరంలో 1591లో చార్మినార్ కట్టడాన్ని నిర్మించాడు. అలా చార్మినార్ కేంద్రంగా హైదరాబాద్ నగరం ఉనికిలోకి వచ్చింది. నగర ఏర్పాటుతో ప్రజల సౌకర్యార్థం రోడ్లు, ప్రభుత్వ దవాఖానాలు, మార్కెట్ తదితర ఏర్పడ్డాయి. పత్తర్‌గట్టీ చార్మినార్ ఉత్తర దిశలో మూసీ నది వైపు గుల్జార్‌హౌస్ కేంద్రంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ఆసఫ్జాహీ పాలకులు నిర్ణయించారు. ఇక్కడ బంగారం, వెండితో పాటు దుస్తుల విక్రయాలు జరగాలని.. అందుకు అనుగుణంగా పత్తర్‌గట్టీ మార్కెట్‌ను రాళ్లతో నిర్మించారు. పత్తర్ అంటే రాయి, గట్టీ అంటే సున్నం, బంక మిశ్రమం. వీటితోనే ఈ మార్కెట్‌ను నిర్మించారు. అందుకే దీన్ని పత్తర్‌గట్టీ మార్కెట్ అంటారు. ఇది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మొజంజాహీ మార్కెట్ 1935లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన చిన్న కుమారుడు మొజంజాహీ బహదూర్ పేరుతో ఈ మార్కెట్‌ను నిర్మించారు. అప్పటికే నగరంలో వివిధ మార్కెట్లో ఉన్నాయి. అయితే పండ్ల విక్రయాలకు ప్రత్యేక మార్కెట్ ఉండాలని మొజంజాహీ మార్కెట్ ఏర్పాటు చేశారు. 1980 వరకు ఇక్కడ ఎక్కువ శాతం పండ్ల విక్రయాల షాపులుండేవి. తర్వాత పండ్ల మార్కెట్‌ను కొత్తపేట్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ మార్కెట్లో పండ్ల, ఇతర షాపులు కొనసాగుతున్నాయి. అబిడ్స్ మార్కెట్ ఆర్మేనియా దేశస్థుడు అల్బర్ట్ అబిడ్స్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు దుస్తులు తయారు చేసేందుకు వచ్చాడు. వివిధ దేశాల వస్తువులను దిగుమతి చేసుకొని నిజాం రాజుకు ఇచ్చేవాడు. అలా ప్రస్తుతమున్న అబిడ్స్ జీపీవోకు ఎదురుగా ‘అబిడ్స్ షాప్’ పేరుతో విదేశీ వస్తువుల దుకాణాన్ని ప్రారంభించాడు. అప్పటి నుంచి దీనికి అబిడ్స్‌గా పేరొచ్చింది. గన్‌ఫౌండ్రీ ఆరు, ఏడో నిజాంల హయాంలో ఎడ్యుకేషన్ హబ్‌గా కొనసాగిన గన్‌ఫౌండ్రీకి ఎంతో చరిత్ర ఉంది. 1768లో ఫ్రెంచ్ జనరల్ మైఖేల్ జోచిం మేరీ రేమండ్ ఆయుధాలను నిల్వ చేయాడానికి గన్‌ఫౌండ్రీలో కర్మాగారం నిర్మించారు. నిజాం పాలనా కాలంలో ఇదే ఏకైక ఆయుధాల నిల్వ ప్రదేశం. తర్వాత నిజాం పాలకులు ఇక్కడ వివిధ ప్రభుత్వ సంస్థలు నిర్మించారు. హుస్సేన్‌సాగర్ హుస్సేన్‌సాగర్ నగరం నడిబొడ్డున నిర్మించిన సరస్సు. 1562లో ఇబ్రహీం కులీకుతుబ్ షా పాలనా కాలంలో ఈ జలాశయ నిర్మాణం చేపట్టారు. అయితే పర్యవేక్షణ మాత్రం ఆయన అల్లుడు హుస్సేన్ షా వలీ చూసుకునేవాడు. చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవడంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. దీనికి ఇబ్రహీం సాగర్ అని పేరు పెట్టాలని కుతుబ్‌షా అనుకున్నాడు. కానీ ప్రజలు హుస్సేన్ షా పేరు మీదుగా హుస్సేన్‌సాగర్ అని పిలవడం ప్రారంభించారు. అప్పట్లో ఇది నగర ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చింది. సాగర్ మధ్యలోని ఏకశిల బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. అఫ్జల్‌గంజ్ మార్కెట్ ఐదో నిజాం హయాంలో అఫ్జల్‌గంజ్ మార్కెట్ నిర్మించారు. అప్పటి వరకు పాతబస్తీలోని షా గంజ్, షంషీర్గంజ్, మిస్రీ గంజ్ ఉండేవి. నగర జనం పెరగడంతో నయాపూల్ పడమర వైపు విశాలమైన ప్రదేశంలో సకల సౌకర్యాలతో అఫ్జల్‌గంజ్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా సిద్ధంబర్ బజార్, బేగం బజార్, ఉస్మాన్‌గంజ్ మార్కెట్లు వెలిశాయి. ఈ మార్కెట్లు నేటికీ కొనసాగుతున్నాయి. -
యూరప్ పర్యటనకు కల్వకుర్తి ఎమ్మెల్యే
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి యూరప్ దేశాల పర్యటనకు వెళు తున్నారు. ఈ మేరకు తనకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తనను వారి దేశానికి రావాల్సిందిగా కోరారని, ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్ నాలుగో తేదీ వరకు ఆరు రోజుల పాటు బ్రిటన్‌లో పర్యటించనున్నట్లు చల్లా వంశీచంద్ వెల్లడించారు. తన పర్యటనలో స్కాట్లాండ్ దేశ పార్లమెంట్ సమావేశాల తీరు తెన్నులను పరిశీలించడంతో పాటు ఎడింబర్గ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇండియా ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌తో సమావేశం కానున్నామని తెలిపారు. -
ఉద్యమ నాయిక!
స్ఫూర్తి రాజ్‌కుమారి అమృత్ కౌర్ రాజ్‌కుమారి అమృత్ కౌర్... భారత జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళల్లో ఒకరు. ఆమె 1822లో లక్నోలో పుట్టారు. వారిది కపుర్తల రాజకుటుంబం. ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలు, సాంఘిక సంస్కర్త. గాంధీ బాటలో హరిజన ఉద్ధరణకు, మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. జలియన్‌వాలాబాగ్ దురంతం రాజ్‌కుమారిని కలచివేసింది. గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితమై స్వాతంత్య్రోద్యమంలో చొరవగా పాల్గొన్నారామె. దండి సత్యాగ్రహం సందర్భంగా 1930లో ఆమెను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. ఆ తర్వాత ఏడేళ్లకు ఆయుధాలు రవాణా చేస్తున్నారనే నెపం మోపి ఆమెను మరోసారి అరెస్ట్ చేశారు. అప్పుడామె మూడేళ్ల కొడుకును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమంలో భాగంగా రాజ్‌కుమారి దేశమంతటా పర్యటించారు. అంటరానితన నిర్మూలన అవసరాన్ని వివరించారు. ఆమె వెళ్లిన ప్రతిచోటా మహిళలతో ఓ చిన్న సమూహాన్ని ఏర్పరిచి చదువకు బీజాలు వేశారు. రాజకుటుంబంలో పుట్టిన యువరాణి సామాన్యుల కోసం ఉద్యమించడం, సామాన్యులతో కలిసి పని చేయడం వల్ల ఆమె స్ఫూర్తితో అనేకమంది ఉద్యమబాటపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్‌కుమారి కౌర్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో ఉన్న అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్) ఆమె చొరవతోనే ఏర్పాటైంది. -
చంద్రబాబుకు బ్రిటన్ షాక్!
-
అంత సొల్లొద్దు
బాబుకు బ్రిటన్ షాక్! ⇒ రాజధానిపై ఊహాగానాలు కాకుండా వాస్తవాలు చెప్పాలని సూచన ⇒ లండన్ పర్యటన రద్దు చేసుకున్న సీఎం ⇒ ఆయన స్థానంలో మంత్రి నారాయణ సాక్షి, అమరావతి: చంద్రబాబుకు బ్రిటన్ ప్రభుత్వం షాకిచ్చింది. దీంతో ఆయన తన లండన్ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో మంత్రి నారాయణ వెళుతున్నట్లు సీఆర్డీఏ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు..బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు లండన్‌లో ఇంటర్నేషనల్ ట్రేడ్ వాటర్ టెక్నాలజీపై ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పురోగతి, మార్కెటింగ్ అవకాశాలపై విస్తృత చర్చలు జరపడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం. ఇందులో పాల్గొనేందుకు మరికొందరితో పాటు ఏపీ సర్కారుకూ ఆహ్వానం అందింది. అయితే సదస్సులో చెప్పాలనుకునే విషయాన్ని ముందుగా తమకు తెలియజేయాలని ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం కోరింది. ఏ దేశం వెళితే ఆ దేశంలా, ప్రపంచస్థాయిలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పే చంద్రబాబు ఈసారి కూడా.. భవిష్యత్తులో ఎంత అద్భుతంగా రాజధానిని తీర్చిదిద్దబోయేదీ సవివరంగా తెలియజేసేలా ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాబు డైరెక్షన్ మేరకు అధికారులు ప్రజెంటేషన్‌ను తయారు చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని నిర్మాణానికి రైతులంతా భూములిచ్చారని, ఆయన తన సమ్మోహనా శక్తితో లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, ఇంటర్నేషనల్ స్కూళ్ళు, కాలేజీలు తరలి వస్తున్నాయని, పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రాజధాని పరిధిలో భవిష్యత్‌లో 3 లక్షల ప్రత్యక్ష, 5.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయంటూ గ్రాఫ్లతో సహా అద్భుత ఊహాచిత్రానికి రూపకల్పన చేసి సీడీ రూపంలో బ్రిటన్‌కు పంపారు. అయితే ప్రభుత్వం పంపిన నివేదికపై బ్రిటన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాగానాలు కాకుండా ఇప్పటివరకు సాధించిన పురోగతి చెబితే బాగుంటుందని తెలిపింది. సదస్సులో వాస్తవాలను ప్రస్తావించాలని సూచించినట్టు తెలిసింది. లండన్ వేదికగా మరోసారి అంతర్జాతీయ సమాజానికి లెక్చర్ ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఊహించని ఈ పరిణామంతో తన పర్యటన రద్దు చేసుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వెళ్లాల్సి ఉన్నా.. లండన్‌లో జరిగే ఇంటర్నేషనల్ ట్రేడ్ సదస్సుకు వాస్తవంగా ముఖ్యమంత్రి వెళ్ళాల్సి ఉందని, కానీ ఆయన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఆయన ప్రతినిధిగా మంత్రి నారాయణ వెళ్తున్నారని సీఆర్డీఏ మీడియా సలహాదారు ఎ. చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విష యమై సీఆర్డీఏ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని, సదస్సులో ఏయే అంశాలను ప్రస్తా వించాలో వివరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. నేనొక్కడినే కష్టపడుతున్నా: చంద్రబాబు మంత్రులెవరూ సరిగా పనిచేయడం లేదని మండిపాటు రాష్ట్ర మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేనొక్కడినే రాత్రిపగలూ పనిచేస్తున్నానన్నారు. మీరు ఏం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇకపై మంత్రులు, అధికారులను పరిగెత్తిస్తా నని హెచ్చరించినట్లు తెలిసింది. మంగళవా రం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం లో మంత్రులు, టీడీపీ నేతల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వస నీయ సమాచారం మేరకు.. కొందరు మం త్రులు అధికారుల్లా ఫీలవుతున్నారని, ఒక్క రూ సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు. జిల్లాల్లో మంత్రుల పర్యటనలు మొక్కుబడిగా మారాయని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే ఉపయో గం ఏమిటని ప్రశ్నించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టా త్మకంగా తీసుకోవాలని, తేలిగ్గా తీసుకుంటే కుదరదని చెప్పారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు గట్టిగా పనిచే యాలన్నారు. మరోవైపు మంత్రివర్గ సమావే శంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కామి నేని శ్రీనివాస్‌తో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొం డయ్యపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా పథకం అమలును ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశా రు. ‘ఈ పథకాన్ని నువ్వు వదిలేశావ్..’ అని అచ్చెన్నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానిం చినట్లు తెలిసింది. డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడం లో జాప్యం, ఇతర కారణాల వల్ల ఈ పథకం అమలులో ఇబ్బందులు వస్తున్నాయని కామినేనిని ఉద్దేశించి చెప్పారు. రెండు సమావేశాల్లోనూ మంత్రులను టార్గెట్ చేసి బాబు మాట్లాడటంతో వారు అవాక్కయి నట్లు సమాచారం. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు శివాలెత్తడంపై మంత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇలావుండగా సమన్వయ సమావేశంలో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలను తిప్పికొట్టాలని మంత్రులు, టీడీపీ నేతలకు సూచించారు. ఏ పత్రికలోనైనా వ్యతిరేక వార్త వస్తే వెంటనే స్పందించి ఎదురుదాడి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. కోడెల వ్యాఖ్యలు వక్రీకరించిన వారిపై చర్యలు తీసుకుంటాం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సమావేశంలో పలువురు నేతలు పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై స్పందించిన చంద్రబాబు.. శాసనసభాపతిపై ఆషామాషీగా కామెంట్లు చేస్తే ఇబ్బందులు పడతామని తెలిసేలా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. -
అమరావతికి బ్రిటన్ మసాలా బాండ్లు
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ మెక్ అలిస్టర్ వెల్లడి రాజధాని నిర్మాణానికి బ్రిటన్ సహకారం కావాలన్న సీఎం సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి మసాలా బాండ్ల రూపంలో నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ తెలిపారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజి ద్వారా ఈ బాండ్లు ఇచ్చే అవకాశముందన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో శుక్రవారం అలిస్టర్ ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సిటీ నిర్మాణ సామర్థ్యం, అనుభవం, అమరావతికి సహకారం’అనే అంశాలపై సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో అలిస్టర్ మాట్లాడుతూ.. అమరావతి సహా దేశంలోని 8 స్మార్ట్ సిటీల నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం 11 మిలియన్ పౌండ్లు వెచ్చించనుందని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని తొలి దశ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలవుతున్న తరుణంలో బ్రిటన్ సహకారం కావాల్సి ఉందన్నారు. 15న మంత్రివర్గ సమావేశం: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుంది. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. -
లోకంలో అన్నిటికన్నా పెద్ద శత్రువు అదే!
‘‘గోదావరీ నదీజలాలు పుష్కలంగా ఇక్కడి ప్రజల కాళ్ల కింది నించి పారుతూ వెళ్ళి వృథాగా సముద్రం పాలవుతుండగా, వీరు కరువుకాటకాల బారిన పడకుండా చూడడానికి... వాటిని అలా వదిలివెయ్యడంలో తగిన ఔచిత్యం కనిపించడం లేదు’’ అని ఆర్థర్ కాటన్ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ‘‘నీవు ఆనకట్ట కట్టి నీటిని నిల్వచేసి కొన్ని వేల ఎకరాలు సాగు కావడానికి కారణం కాగలవా?’’ అని జవాబొచ్చింది. అంతే! ఆయన గుర్రం వేసుకుని అరణ్యాల వెంట తిరిగి గోదావరి ప్రవాహ ప్రాంతమంతా పరిశీలించి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే పది కాలాలపాటు నిలబడుతుందన్నది సర్వేచేసి చివరకు కొండల మధ్యనున్న ధవళేశ్వరం వద్ద అయితే బాగుంటుందని ఎంపిక చేశారు. ఆయన ఈ దేశంలో ఉన్నన్నాళ్లూ కష్టపడి ప్రాజెక్ట్ పూర్తిచేసి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావడానికి కారణమయ్యాడు. ఒక దశలో ఆయన ఒక సంవత్సరం పాటు తీవ్రంగా అనారోగ్యం పాలయి, చివరకు ప్రాణాపాయంలో కూడా పడ్డాడు. కొద్దిగా కోలుకోగానే మళ్లీ వచ్చి ప్రాజెక్ట్ పని పూర్తిచేశాడు. అందులోంచి నీళ్లు రైతుల పొలాలకు పారుతుంటే చూసి పొంగిపోయాడు. ఎక్కడివాడు? ఈ దేశంవాడా? ఈ జిల్లావాడా? ఈ ధర్మంవాడా? నిజమైన దేశభక్తుడన్నవాడు తన దేశప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించాలని ఆయనే ఒకచోట రాసుకున్నాడు. ఒక్క లేఖ రాసినందుకు ప్రభుత్వం ‘‘నీవు చెయ్యగలవా?’’ అంటే ‘‘చెయ్యగలను’’ అని నిలబడడమే కాదు, ప్రాజెక్ట్ కట్టే సందర్భంలో వ్యక్తిగతంగానే కాదు, ఆరోగ్యపరంగానే కాదు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు. అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. చరిత్రలోనే కాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఒక సంకల్పానికి నిలబడడం అంటే అదీ. జీవితంలో ఆశయ సిద్ధికోసం మనం నిర్ణయం తీసుకోవాలి. ఆ లక్ష్య సాధనలో భీతి ఉన్న నాడు, భగవంతుడు కూడా అనుకూలించి తీరతాడు, తూర్పుగోదావరి జిల్లాలోనే డొక్కా సీతమ్మ అనే ఒక మహాతల్లి తన ఆస్తులు కరిగిపోతున్నా వెరవక ఆకలితో తలుపుతట్టిన కొన్ని వందలమందికి ప్రతిరోజూ దగ్గరుండి ఆప్యాయంగా అన్నం తినిపించి పంపేది. మనకు తినడానికి లేదే అని భర్త వారిస్తే, ‘‘నేను పెట్టేటప్పుడు - సాక్షాత్తూ ఆ మహావిష్ణువే వచ్చి తింటున్నాడన్న భావనతో పెడతాను. ఎవర్ని నమ్మి పెడుతున్నానో వాడే చూసుకుంటాడు’’ అని నమ్మి పెట్టింది. ఆమె పేరుమీద ఒక ఆక్విడక్ట్ కూడా కట్టారు. అప్పటి బ్రిటీష్ చకవర్తి తన పట్టాభిషేక మహోత్సవానికి ఆమె ఫొటోను కలెక్టర్ చేత తెప్పించుకుని ఒక సోఫాలో పెట్టి సతీసమేతంగా ఆమెకు నమస్కారం చేసుకున్న తరువాత పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆయన పంపించిన పట్టం ఇప్పటికీ ఉన్నది. ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్ళింది ఏమిటి... కేవలం లక్ష్యశుద్ధి మాత్రమే. అసలు లక్ష్యంపై నిలబడడానికి సంస్కార బలమొకటి ఏర్పడితే, హితశత్రువుని దాటగలిగితే అనవసరపు ఆకర్షణలకు ప్రలోభాలకు వశం కాకుండా నిలబడగలిగిన వాడవైతే అసలు ఒక కార్యం చేయడం కాదు, కార్యం ఎలా చేయాలన్న దానికి కూడా ఆదర్శమూర్తి అవుతాడు. అతనిని ఆదర్శంగా తీసుకుని కోట్లమంది ఆ మార్గంలో వెళ్లి తరిస్తారు. అలాంటి వాడు తయారుకావాలంటే ఆ విచక్షణా జ్ఞానానికి అవసరమైనది- హిత శత్రువునకు వశం కాకుండా ఉండగలగడమే. తరువాత. అహిత శత్రువు. ఇది శత్రువు, దీని జోలికి వెళ్లకూడదని తెలుసు, కానీ వెళ్లకుండా ఉండలేడు. దీనితో ఉంటే నేను పాడైపోతానని తెలిసి కూడా అప్పటికది కల్పిస్తున్న సంతోషంలో, ఉద్వేగంలో దాన్ని విడిచిపెట్టలేక దానితో కూడి పాడైపోవడం. అందుకే సంగమం చాలా ప్రధానమైనది. ఎంత పెద్ద ఇనుపముక్క అయినా నీటితో చేరితే తుప్పుపట్టి పోతుంది. అదే అగ్నిహోత్రంతో కూడితే ఎలా కావాలంటే అలా వంగి లోకానికి ఉపకరిస్తుంది. దేనితో కూడామా అన్నది ముఖ్యం. దాన్ని గెలవడం తేలిక కాదు. దేని జోలికి వెళ్లకూడదో దాని జోలికి వెళ్లవద్దు. దానితో ప్రయోగాలు చెయ్యవద్దు. ‘‘నేను అతీతుణ్ణండీ, నాకేమీ కాదనుకోవద్దు’’. ే అన్నిటికన్నా పెద్ద శత్రువు ... కాలం విలువ తెలుసుకోలేని అజ్ఞానం. అందుకే మహనీయుల చరిత్ర పుస్తకాలుగా రావాలి. వారు చెప్పిన మాటలు వినాలి. డొక్కా సీతమ్మగారి మీద, కాటన్గారి మీద, అలాంటివారి మీద పెద్దపెద్ద వేదికల పైన ప్రసంగాలు జరగాలి. లాల్‌బహదూర్ శాస్త్రి, అరబిందో, భగవాన్ రమణులు అటువంటి వారిని గురించి పిల్లలకు ప్రత్యేకంగా చెప్పాలి. అలా జరిగిన నాడే లక్ష్యసిద్ధి కలుగుతుంది. ఆ సంకల్పం ధృతితో కూడినదై అహిత శత్రువులను విడిచిన నాడు ఎవరి సంకల్పమైనా ఉత్తమ సంకల్పమై కొన్ని కోట్ల మందికి ఆదర్శవంతులవుతారు. ఒక సంకల్పానికి కట్టుబడి ఉండడానికి మనకు స్ఫూర్తి ఎవరు? మనకు అడుగడుగునా కన్పించే హనుమ విగ్రహాలు చాలు. అలాగే మహనీయుల శిలామూర్తులు మనకు పలు ప్రాంతాల్లో కనపడతాయి. తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం, అమలాపురం, రావులపాలెం జంక్షన్... ఎక్కడికెళ్ళినా గుర్రం మీద కూర్చుని ఉన్న కాటన్ దొర కనబడతాడు. -
జలియన్‌వాలాబాగ్
ఉద్యమనాయకులు సత్యపాల్, డా. సైఫుద్దీన్‌ల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ అమృత్సర్(పంజాబ్)లోని జలియన్‌వాలాబాగ్‌లో వందలాదిమంది దేశభక్తులు సమావేశమయ్యారు. ఎలాంటి కవ్వింపు చర్యల్లో లేవు. ఎలాంటి హింసాత్మక సంఘటనలూ చోటు చేసుకోలేదు. అయినప్పటికీ బ్రిటిష్ వాడికి కోపం వచ్చింది. ఒంటిని రాక్షసత్వం ఆవహించింది. జనరల్ డయ్యర్ ఆదేశాలతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దేశభక్తులపై పదినిమిషాల పాటు విచక్షణరహితంగా కాల్పులు జరిగాయి. 370 మంది చనిపోయారని, 1200 మంది గాయపడ్డారని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. 1000 మందికిపైగా మరణించారు. మాటలకందని ఈ విషాదం చరిత్ర పుటలపై తడి ఆరని నెత్తుటి చుక్కై మెరుస్తూనే ఉంది. -
టీఆర్ఎస్ పాలన బ్రిటీష్ రాజ్యాన్ని తలపిస్తోంది: చింతల
బాన్సువాడ(నిజామాబాద్ జిల్లా): తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుతామని ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్...బ్రిటిషర్లు, నిజాములను తలపించే విధంగా పాలన కొనసాగిస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ) విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు అన్యాయంగా ఇతర పార్టీల నాయకులు, ప్రజలను వేధిస్తున్నారని, అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నించిన వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న భవనం గురించి ప్రశ్నించినందుకు స్థానిక బీజేపీ నేత రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బాన్సువాడ సీఐ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి జిల్లా ఎస్పీకి తాను ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. -
రాజన్ పేరుతోనూ ‘లాటరీ’ స్కామ్‌లు!
నమ్మొద్దంటూ ప్రజలకు ఆర్బీఐ హెచ్చరిక న్యూఢిల్లీ: బ్యాంక్ లాటరీ స్కామ్‌లు రోజుకో అవతారం ఎత్తుతున్నాయి. ఏకంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఫొటో, పేరును కూడా మోసగాళ్లు వినియోగిస్తున్న ఉదంతాలు తాజాగా వెలుగుచూశాయి. ‘మీరు లాటరీలో రూ.5.5 కోట్లు గెలుచుకున్నారు. అప్రూవల్ ఫీజు కింద రూ.15,500 నగదు డిపాజిట్ చేస్తే మీ అకౌంట్లోకి డబ్బు జమచేస్తాం. బ్రిటిష్ ప్రభుత్వం ఆర్బీఐకి ఇచ్చిన నిధుల్లో భాగంగా ఈ లాటరీని అందిస్తున్నాం’ అంటూ రాజన్ పేరుతో కొంతమందికి ఈ-మెయిల్స్ వెళ్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చింది. ఇటువంటి ఆఫర్లను నమ్మొద్దని.. వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్లు, క్రెడిట్/డెబిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాం కింగ్, విదేశాల నుంచి నగదు బట్వాడా వంటి రూపంలో వ్యక్తులతో నేరుగా తాము ఎలాంటి లావాదేవీలు నిర్వహించమని స్పష్టం చేసింది. మొబైల్ బ్యాంకింగ్‌పై దృష్టిపెట్టాలి... మొబైల్ బ్యాంకింగ్ సేవలకు ఖాతాదారులు నమోదు చేసుకునే ప్రక్రియను సులభతరంగా ఉండేలా చూడాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ బ్యాంకింగ్‌కు నమోదు చేసుకోవడం, యాక్టివేషన్, వాడకం తదితర అంశాలపై బ్యాంకులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. -
మనుషులు మారారు! బతుకులింకా మారలేదు!!
నల్లమల అడవుల్లో అదో కుగ్రామం.ఒకప్పుడు దాని పేరు సెటిల్మెంట్.ఇప్పుడు సిద్ధాపురం. ఆ ఊరిలో క్రీడా పతకాన్ని సాధించిన యువకుడు ఉన్నాడు. కంప్యూటర్స్‌లో పట్టభద్రులున్నారు. కానీ, పట్టా చేతపుచ్చుకుని ఉద్యోగానికెళితే ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. పెళ్లి చేసుకుంటామంటే అమ్మాయినివ్వరు. ఆ ఊరి ఆడపిల్లను కోడలిగా చేసుకోవడానికి ఏ ఊరూ ముందుకు రాదు. ఇది ఏ దేవుని శాపమూ కాదు. కేవలం స్వార్థపరుల కుయుక్తుల ఫలితం! బ్రిటిష్ కాలంలో వెలసిన ఈ గ్రామ వివరాల్లోకి వెళితే... ఒకప్పుడు చెన్నై, బేతంచర్ల, దేవరకొండ, కప్పట్రాళ్లతిప్ప ప్రాంతాల్లో కరడుగట్టిన దొంగలుండేవారు. వారిలో పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. దాదాపుగా 30 మంది దొంగలను సమీకరించి, వారిని కుటుంబాలతో సహా ఒక ప్రదేశానికి తరలించింది. తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసి, దానికి సెటిల్మెంట్ అని పేరు పెట్టింది. నిత్యజీవిత అవసరాలకు తగినట్లు సౌకర్యాలు సమకూరుస్తూ క్రమంగా గ్రామంగా రూపుదిద్దింది. బడి, ఆసుపత్రి, పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆ గ్రామం పేరు... సిద్ధాపురం. నల్లమల అటవీ ప్రాంతంలో, కర్నూలు జిల్లా కేంద్రానికి 82 కి.మీ.ల దూరంలో ఉందీ ఊరు. నిజానికి బ్రిటిష్‌వారి కాలంలో వీరి జీవితాలను బాగు చేయడానికి చాలా కసరత్తే జరిగింది. పని మీద దృష్టి మళ్లిస్తే దొంగతనాలను మరిపించవచ్చనే ఉద్దేశంతో 70 ఎకరాల సర్కారు పొలాన్ని ఇచ్చి, చెరువు తవ్వి సాగుచేసుకోమన్నారు నాటి అధికారులు. పశువుల పెంపకం అలవాటు చేశారు. సభ్యసమాజంలో ధైర్యంగా జీవించగలిగేటట్లు వారిలో పరివర్తన తీసుకువచ్చారు. అంతా అనుకున్నట్లే జరిగితే... ఇది ఓ ఆదర్శగ్రామం అయ్యేది. అయితే నూటికి తొంభై మంది మంచిగా మారిపోయి, గౌరవప్రదంగా జీవిస్తున్నప్పటికీ పదిశాతం మంది దొంగతనాలను వదలకపోవడంతో సిద్ధాపురం ఓ ‘దొంగల గ్రామం’గా ముద్ర వేయించుకుంది. ఆ ముద్ర నుంచి బయట పడడానికి నాటి నుంచి నేటి వరకూ అష్టకష్టాలు పడుతూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చింది... కానీ! దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిష్ పాలకులు దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. కానీ స్థానిక అధికారులకు సిద్ధాపురం గురించి అవగాహన లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. పరివర్తన చెందకుండా ఉన్న పదిశాతం మంది వీరవిహారం చేయడం మొదలు పెట్టారు. తెలుగు నేల మీదే కాక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కడ దొంగతనాలు చేయాలన్నా వీరే ముందుండేవారు. ఒక సమయంలో వీరు తమకు తెలియకుండానే కొందరు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయారు. వారు చెప్పినట్టు నాటు సారా తయారుచేయడం, అడవిలో చెట్లను నరికి అక్రమ రవాణాకు సహకరించడం, జంతువులను వేటాడడం వంటి అరాచకాలకు పాల్పడేవారు. కేవలం వీరివల్ల ఆ ఊరు దొంగల గ్రామంగానే మిగిలి పోయింది. నిజానికి 360 కుటుంబాలున్న ఆ గ్రామం ఇప్పుడు బాగా మారింది. పిల్లలు చదువుకున్నారు. పెద్దలు వ్యవసాయం చేసుకుంటున్నారు. గేదెలను మేపుకుంటూ పాల వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ దురదృష్టం... ఇప్పటికీ ఎప్పుడు ఎక్కడ చోరీ జరిగినా అందరి చూపూ వీరి మీదికే మళ్లుతోంది. మార్పు వచ్చింది..! సిద్ధాపురం వాసుల్లో మంచి మార్పు వచ్చింది. ఇంకా కొందరు దొంగలున్నారు. వారిలోనూ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వారికి అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. వారికి తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్రమ మార్గంలో కాకుండా సక్రమ మార్గంలో సంపాదించేందుకు తోడ్పడుతున్నాం. - నరసింహారెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ, కర్నూలు జిల్లా కాలం మారింది... మేమూ మారాం! ‘దేశం శాస్త్ర సాంకేతికంగా ఎదుగుతోంది. ఆ ప్రకారమే మేమూ ఎదుగుతాం’ అంటున్నారు సిద్ధాపురం యువకులు. ఈ ఊళ్లో బీఏ, బీకామ్ బీఎస్సీ, కంప్యూటర్స్ కోర్సులు చేసిన వాళ్లు ఉన్నారు. స్పోర్ట్స్ అవార్డు అందుకున్న సుధాకర్ ఉన్నాడు. కానీ వీరిని నిరుద్యోగం పీడిస్తోంది. ‘‘ఎక్కడ ఉద్యోగానికి వెళ్లినా సిద్ధాపురం పేరు చెబితే వెనక్కు పంపేస్తున్నారు. పోనీ ఊళ్లోనే ఉండి ఏ గేదెలో మేపుకుంటూ బతుకుదామంటే ఎక్కడ దొంగతనం జరిగినా మమ్మల్ని అరెస్టు చేస్తారని భయం’’ అని యువకులు ఆవేదన చెందుతున్నారు. వారి భయంలో నిజం లేకపోలేదు. కొన్నిసార్లు వేరేవాళ్లు చేసిన నేరాలు కూడా వారిమీద పడుతుంటాయి పాపం. ఇటీవల శ్రీశైలం స్వామి దర్శనం కోసం వెళ్లినప్పుడు... సిద్ధాపురం వాసులని తెలిసి బట్టలూడదీసి కూర్చోబెట్టారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇక్కడి యువకులకు అమ్మాయినివ్వడానికి ఏ ఊరివాళ్లూ ముందుకు రావట్లేదు. అలాగే ఈ ఊరి అమ్మాయిలను చేసుకోవడానికి కూడా ఏ ఊరి యువకులూ మొగ్గుచూపట్లేదు. మరోపక్క సిద్ధాపురం అన్ని రకాలుగానూ వెనుకబడి ఉంది. అభివృద్ధి పనులు లేవు. సిమెంట్ రోడ్లు, వీధిలైట్లు, మురుగు కాలువలు లేవు. వర్షం వస్తే గ్రామమంతా బురద! బ్రిటిష్ పాలకులు పెట్టిన ఆసుపత్రి మూతపడింది. వందల పశువులున్నా పశువైద్యులు లేరు. పాఠశాల కూడా శిథిలావస్థలో ఉంది. వీరి కోసం ఎవరూ ఏమీ చేయక పోవడం బాధాకరం. అయితే అంతకంటే ఎక్కువ బాధ, తమను ఇంకా దొంగలుగానే చూస్తుంటే కలుగుతోందని అంటు న్నారు వారు. ‘అక్రమ మార్గాన్ని వదిలేశాం, సక్రమంగా బతుకుతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి, అందరిలో కలుపుకోండి’ అని వేడుకుంటున్నారు. ‘పరివర్తన చెందాం... మమ్మల్ని నమ్మండి’ అని బతిమాలుతున్నారు. వారి వేదన ఇప్పటికైనా అందరికీ అర్థమైతే అదే చాలు! - రవిరెడ్డి, సాక్షి, కర్నూలు ఫోటోలు: హుస్సేన్ -
జిన్ను సారా జూడనొక్క తీరుగనుండు
తాగి చూడ వాటి టేస్టు వేరు మధువులందు మేలి మధువులే వేరయా వైనుతేయుని మాట వలపు బాట! మబ్బు మబ్బుగా ఉన్న వాతావరణంలో మందుబాబుల మనసు ‘మద్య’మావతి రాగాలాపన చేయడం కద్దు. నిత్య ‘తీర్థ’ంకరులకు ‘మందు’బాబులనే పేరు బహుశ జిన్ కారణంగానే వచ్చి ఉంటుంది. ఇంగ్లండ్‌లో జిన్ను ఒకానొక కాలంలో ఔషధంగానే పరిగణించేవారు. పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడిన రోగులకు, గౌట్ రోగులకు అప్పటి ఇంగ్లిష్ వైద్యులు జిన్‌తో చికిత్సలు కూడా చేసేవారు. జిన్ ప్రభావంతో అవి నయమైనట్లు ఆధారాలైతే లేవు. పదిహేడో శతాబ్దికి చెందిన డచ్ వైద్యుడు ఫ్రాన్సిస్కస్ సిల్వియస్ దీనిని కనిపెట్టినట్లు చరిత్రకారుల ఉవాచ. అనతికాలంలోనే ఇది ఇంగ్లండ్‌లో ప్రాచుర్యం పొందింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం లెసైన్సులు లేకుండానే జిన్ అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించింది. బ్రిటిష్ వారి ద్వారానే జిన్ భారత్‌కు చేరుకుంది. బ్రిటిష్ వారు ఇక్కడికొచ్చిన కొత్త రోజుల్లో దోమల జోరు కారణంగా మలేరియా బెడద తీవ్రంగా ఉండేది. దీనికి విరుగుడుగా జిన్‌కు జోడీగా భారత్‌లో దొరికే టానిక్ వాటర్‌ను ‘ఉప’ద్రవంగా వాడేవారు. జిన్, దానికి తోడుగా క్వినైన్ కలిసిన టానిక్ వాటర్ లేకుంటే, బహుశ మనకు స్వాతంత్య్ర పోరాటమే అవసరం ఉండేది కాదేమో! బ్రిటిష్ వారిని తరిమికొట్టే పనిని ఇక్కడి దోమలే విజయవంతంగా పూర్తి చేసేవి. ఇంతటి ఘనచరిత్ర గల ద్రవం జిన్‌తో ఈ వారం... ‘మధు’రోక్తి మధువు అపార్థానికి గురైన పోషక పదార్థం - పీజీ వుడ్‌హౌస్, ఇంగ్లిష్ వ్యంగ్య రచయిత స్మూత్ టానిక్ జిన్ : 45 మి.లీ. వోడ్కా : 15 మి.లీ. టానిక్ వాటర్ : 50 మి.లీ. కొబ్బరినీరు : 90 మి.లీ. గార్నిష్ : పలుచని నిమ్మచెక్క, ఐస్‌క్యూబ్స్ - వైన్‌తేయుడు -
సామాన్యుడిపైకొరడా
నీటిబిల్లు బకాయిదారులపై ఆర్ఆర్ యాక్ట్ ప్రభుత్వ విభాగాల బకాయిలపై మౌనం జలమండలి తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు సాక్షి, సిటీబ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత నీరందిస్తూ ఢిల్లీ జలబోర్డు ఆమ్ ఆద్మీ మనసు దోచుకుంటోంది. ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయని మన జలమండలి.. సామాన్యులపై కొరడా ఝళిపిస్తూ లాభాల బాటలో నడవాలని ప్రయత్నిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆరు నెలలుగా నీటిబిల్లు బకాయిపడిన సామాన్య, మధ్యతరగతి వర్గాలకు.. బ్రిటీషు ప్రభుత్వం 1864లో చేసిన రెవెన్యూ రికవరీ యాక్ట్, సెక్షన్-5 ప్రకారం ఏకంగా 941 రెడ్‌నోటీసులిచ్చి సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రూ.850 కోట్లు బకాయిపడిన మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీసు క్వార్టర్లు, సర్కారు కార్యాలయాల విషయంలో జలమండలి మిన్నకుంటుంది. ఈ విషయంలో హోదా రీత్యా జలమండలికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కూడా ప్రేక్షకపాత్రకే పరిమితమౌతుండటం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. సామాన్యులపైనే కరకు చట్టం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్న చందంగా మారింది జలమండలి తీరు. గ్రేటర్ పరిధిలో మొత్తం 8.05 లక్షల కుళాయిలున్నాయి. వీటిలో సామాన్య, మధ్యతరగతి, నిరుపేదలకు సంబంధించిన కుళాయిలు సుమారు 4 లక్షల వరకు ఉన్నాయి. వీరిలో నెలవారీగా ఠంచనుగా బిల్లు చెల్లించేవారు 90 శాతం మంది ఉంటారు. మరో పదిశాతం మాత్రం వివిధ వ్యక్తిగత, ఆర్థిక కారణాల రీత్యా ఆర్నెల్లు, ఏడాదికి బిల్లు చెల్లించడం.. బోర్డు ఏర్పడినప్పటి (1989వ సంవత్సరం) నుంచీ ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇటీవల సర్కారు పెద్దలకు దుర్బుద్ధి పుట్టింది. నీటిబిల్లులను పక్కాగా వసూలు చేసి జలమండలిని లాభాల బాట పట్టించేందుకు ఒకవైపు నీటిబిల్లులను ఎడాపెడా పెంచడంతోపాటు, ఆర్నెల్లు బిల్లు బకాయి పడితే చాలు రెవెన్యూ రికవరీ యాక్ట్-1864 లోనిసెక్షన్-5 ప్రకారం కొరడా ఝళిపిస్తోంది. మహానగరం పరిధిలో గత నెలరోజులుగా 941 రెడ్నోటీసులిచ్చింది. వీటిలో 64 కుళాయి కనెక్షన్లను తొలగించింది. ఇంతటితో ఆగక ఆర్.ఆర్.యాక్ట్ ముసుగుతో బకాయిదారుల ఇళ్లలోని టీవీలు,ఫ్రిజ్‌లు, కూలర్లు వం టి గృహవినియోగ వస్తువులను బలవంతంగా సీజ్ చేసి సామాన్యులను హతాశులను చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో ఒకవైపు ఉచిత నీరు ఇస్తున్నప్పటికీ ఆ దిశగా నగరంలో చేసిన ప్రయత్నాలు లేకపోగా ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడటం హేయమని స్వచ్ఛం ద సంఘాలు, ప్రజాసంఘాలు, విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూ.850 కోట్ల సర్కారు బకాయిలపై మౌనం! మహానగరంలో జలమండలికి మూతపడిన ప్రభుత్వరంగ సంస్థలు, సర్కారు కార్యాలయాలు, వసతి గృహాల నుంచి రావాల్సిన బకాయిలు రూ.850 కోట్ల వరకు ఉన్నాయి. వీటి వసూలుకు జలమండలి ఆపసోపాలు పడుతోంది. ఆయా విభాగాలకు మొక్కుబడిగా లేఖలు రాసి చేతులు దులుపుకొంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి హోదా రీత్యా చైర్మన్‌గా ఉన్నప్పటికీ బకాయిల వసూలుకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో జలమండలి రోజురోజుకూ రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. యుద్ధప్రాతిపదికన బకాయిల వసూలు చేయడమో లేదా ప్రభుత్వం ఆ మొత్తాన్ని గ్రాంటుగా మంజూరు చేయడమో చేస్తేనే బోర్డు ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గడమే కాదు.. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలకు చెందిన 4 లక్షల కుళాయిలకు ఉచిత నీరు సరఫరా చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా కరకు చట్టాల అమలుపై జలమండలికి కనువిప్పు కలుగుతుందా? -
రూ. 80 కోట్ల విలువైన భూమి కబ్జా
సాక్షి, బెంగళూరు : హుబ్లీలో రూ. 80 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రముఖ రాజకీయ నేతల బంధువులు ఆక్రమించుకున్నారని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్(ఎన్సీపీఎన్ఆర్) అధ్యక్షుడు హీరేమఠ్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 1915లో ప్రజావసరాల కోసం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం హుబ్లీలో దాదాపు 8ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. హుబ్లీ స్పోర్ట్స్ గ్రౌండ్‌గా పిలవబడే ఈ మైదానం అప్పటి నుంచి 2008 వరకు ఆటమైదానంగానే కొనసాగిందని పేర్కొన్నారు. అయితే 2008-2009 మధ్య కాలంలో ఆటమైదానం బాధ్యతలను నిర్వర్తించిన కర్ణాటక జిమ్ఖానా అసోషియేషన్ సంస్థ కొంత మంది రాజకీయ నాయకులను, వారి బంధువులను సభ్యులుగా చేర్చుకుందని వివరించారు. అనంతరం వీరంతా కలిసి ఆటమైదానం రూపు రేఖలను మార్చడం మొదలుపెడుతూ రిక్రియేషన్ క్లబ్ పేరిట నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ కోసం మాత్రమే కేటాయించిన ఈ స్థలంలో బిలియర్డ్స్, స్పా, బార్ తదితరాలను నిర్మించి వాటి ద్వారా రాజకీయ నేతల బంధువులు డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ తమ్ముడు ప్రదీప్ శెట్టర్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి తమ్ముడు గోవింద్ జోషి, ఎంపీ అనంతకుమార్ తమ్ముడు నందకుమార్‌తో పాటు హుబ్లీ-ధార్వాడ మాజీ మేయర్ వీరణ్ణ సవది, వ్యాపార వేత్త రమేష్ శెట్టి ప్రముఖ పాత్ర వహించారని ఆరోపించారు. ఇదే విషయంపై సీనియర్ జర్నలిస్ట్ పాటిల్ పుట్టప్ప గత నెలలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి వినతి పత్రాన్ని కూడా అందించారన్న హీరేమఠ్ ఆ వినతి పత్రం ప్రతులను విలేకరులకు అందజేశారు. హుబ్లీలోని ఈ ఆటమైదానాన్ని తక్షణమే ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక ఆటమైదానం అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
వీసా బాండ్లపై బ్రిటన్ కేబినెట్లో విభేదాలు
లండన్: వివాదాస్పద వీసా బాండ్ల అమలు విషయంలో బ్రిటన్ మంత్రివర్గంలో విభేదాలు పొడసూపాయి. భారత్ వంటి దేశాల నుంచి వచ్చే సందర్శకులపై 3 వేల పౌండ్ల (సుమారు రూ.3 లక్షలు) వీసా బాండ్ విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కన్జర్వేటివ్‌ల నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములు కొందరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ పథకం అమలైతే హై రిస్కు దేశాలుగా బ్రిటన్ భావిస్తున్న భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందిన పౌరులు ఆరు నెలల యూకే వీసా కోసం 3 వేల పౌండ్లు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. వీసా గడువు ముగిసినా బ్రిటన్ విడిచివెళ్లని పక్షంలో డిపాజిట్‌ను కోల్పోవలసి ఉంటుంది. -
మోడీకి బ్రిటన్ పార్టీల ఆహ్వానం
లండన్: బ్రిటన్ను సందర్శించాల్సిందిగా బీజేపీ ఎన్నికల కమిటీ ప్రచార సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్ అధికార కన్సర్వేటివ్ పార్టీతోపాటు ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలు కూడా మోడీకి ఆహ్వానం పంపటంపై ఏకీభవించటం ఆరుదైన విషయమని చెబుతున్నారు. 2002లో గోద్రా అల్లర్ల అనంతరం నరేంద్రమోడీ తమ దేశానికి రాకుండా బ్రిటన్ పదేళ్ల పాటు బహిష్కరించిన విషయం తెలిసిందే. గతేడాది బ్రిటన్ తన దృ క్పథాన్ని మార్చుకుంది. భారత్‌లో యూకే దౌత్యాధికారి జేమ్స్ బెవాన్ గత ఏడాది అక్టోబర్‌లో 22న మోడీని కలిసి బ్రిటన్ రావాలని ఆహ్వానించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఐరోపా యూనియన్ కూడా మోడీని బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఢిల్లీలో ఆయనకు విందు ఇచ్చింది. తాజాగా బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా మోడీకి ఆహ్వానం పలికింది. లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఎంపీ బారీ గార్డినర్ ఈమేరకు గత వారం లేఖ పంపారు. ‘ఆధునిక భారత్ భవిష్యత్తు’ అనే అంశంపై దిగువ సభ(హౌస్ ఆఫ్ కామన్స్)లో ప్రసంగించాలని మోడీని కోరారు. కాగా, వెంటనే బ్రిటన్ను సందర్శించే యోచనేదీ మోడీకి లేదని అని గుజరాత్ సీఎం కార్యాలయం ప్రతినిధి పేర్కొన్నారు.