UK-India Young Professionals Scheme: ఇండోనేషియాలో బాలి వేదికగా జరుగుతున్న జీ20 తొలిరోజు సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు ఇరువురు నేతలు ముచ్చంటించారు. అదీగాక సునాక్ ప్రధాని అయ్యాక వారివురు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం యూకే ప్రధాని భారత్‌కి ఒక పెద్ద వీసా స్కీం ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు యూకేలో ఉండి, పనిచేసేలా భారత యువ నిపుణలు కోసం ప్రతి ఏడాది సుమారు 3 వేల వీసాలకు అనుమతిస్తున్నట్లు బ్రిటన్ కార్యాలయం పేర్కొంది.
గతేడాది అంగీకరించిన యూకే భారత్ స్వేచ్ఛ వలసల ఒప్పంద(మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అగ్రిమెంట్) భాగస్వామ్యన్ని గురించి నొక్కి చెబుతూ ఇటువంటి పథకం కింద ప్రయోజనం పొందిన మొదటి దేశం భారత్ అని బ్రిటన్ ప్రభుత్వ పేర్కొంది. ఈ మేరకు ధృవీకరించిన యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, డిగ్రీ చదివిన భారతీయ పౌరులు రెండేళ్ల వరకు యూకేలో ఉండి, పనిచేయడం కోసం 3 వేల వీసాలకు అనుమతిచ్చింది బ్రిటన్.
ఈ పథకం ద్వారా భారత్ బ్రిటన్‌ల ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడం తోపాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సంబంధాలు ఏర్పడటానికి ఉపకరిస్తుందని యూకే ప్రధాని డౌన్ స్ట్రీట్ కార్యాలయం పేర్కొంది. అలాగే ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో దాదాపు అన్ని దేశాల కంటే యూకే భారత్‌తోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. అంతేగాక బ్రిటన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారత్‌కి చెందిన వారు ఉన్నారని అందువల్ల యూకేలోని భారత్ పెట్టుబడితో యూకే అంతటా వారికి సుమారు 9,500 ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందని చెప్పింది.
ప్రస్తుతం యూకే భారత్‌తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ఒకవేళ ఈ ఒప్పందం ఖరారు అయితే యూరోపియన్ దేశంతో జరుపుకున్న తొలి ఒప్పందం అవుతుందని పేర్కొంది. అదిగాక ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న దాదాపు 24 బిలయిన్ పౌండ్ల వాణిజ్య సంబంధాలను ఈ ఒప్పందం మరింత బలపరుస్తుందని చెప్పింది.
అభివృద్ధి చెందుతున్న దేశం అయిన భారత్ ఈ ఆర్థిక అవకాశాలను వినియోగించుకునేలా బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలని బ్రిటన్ ఆకాంక్షిస్తోంది. భారత్‌తో మొబిటిటీ(స్వేచ్ఛ) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేలా ఇమ్మిగ్రేషన్ నేరస్తులను తొలగించే సామర్థ్యాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది.
The British government said that India is the first visa-national country to benefit from such a scheme, highlighting the strength of the UK-India Migration and Mobility Partnership agreed last year.@RishiSunak #UK #India #Visa https://t.co/VWRRWoRvoh pic.twitter.com/oDN1B6jULH
— Khaleej Times (@khaleejtimes) November 16, 2022
(చదవండి: జీ20: బైడెన్‌తో మీట్.. సునాక్‌తో ముచ్చట్లు.. ఆయనతో షేక్‌హ్యాండ్)
Comments
Please login to add a commentAdd a comment