బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్‌పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖతాలో ఒక పోస్ట్ పెట్టారు.
‘యూకే సార్వత్రిక ఎన్నికలలో అపూర్వ విజయం సాధించిన కీర్ స్టార్మర్‌కు హృదయపూర్వక అభినందనలు. భారత్-యూకే మధ్య పరస్పర వృద్ధి, శ్రేయస్సును పెంపొందిస్తూ అన్ని రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ సానుకూల, నిర్మాణాత్మక సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
అదేవిధంగా ఎన్నికల్లో ఓటమి పాలైన కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సైతం మోదీ తన సందేశాన్ని అదించారు. సునాక్ అద్బుతమైన నాయకత్వం, భారత్-యూకే సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
కాగా యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్‌ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది.
Heartiest congratulations and best wishes to @Keir_Starmer on the remarkable victory in the UK general elections. I look forward to our positive and constructive collaboration to further strengthen the India-UK Comprehensive Strategic Partnership in all areas, fostering mutual…
— Narendra Modi (@narendramodi) July 5, 2024
Comments
Please login to add a commentAdd a comment