
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేరారు. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్‌తో మోదీ ఆదివారం సంభాషించారు. ఈ పాడ్‌కాస్ట్‌ను ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో వెంటనే షేర్ చేశారు. దీంతో సోమవారం మోదీ ట్రూత్ సోషల్‌లో అరంగేట్రం చేశారు. ‘ట్రూత్‌సోషల్‌లో చేరడం సంతోషంగా ఉంది.
ఇక్కడ ఉద్వేగ భరిత గొంతులతో సంభాషించడానికి, రాబోయే కాలంలో మరింత అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొడానికి ఎదురు చూస్తుంటాను’ అని ప్రధాని మొదటి పోస్ట్‌లో పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో.. ఫ్రిడ్మన్‌తో జరిగిన తన సంభాషణను పంచుకున్నందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నా మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు. నా జీవిత ప్రయాణం, భారతదేశ నాగరిక దృక్పథం, ప్రపంచ సమస్యలు, మరెన్నో అంశాలను నేను కవర్ చేశాను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment