లండన్ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ప్రధాని కీర్ స్టార్మర్ తన నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులకు ఇచ్చిన ఆతిథ్యం వివాదంగా మారింది.
యూకే ప్రధాని అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన దీపాలు వెలిగించడం, కూచిపూడి నృత్య ప్రదర్శన, కీర్ స్టార్మర్ ప్రసంగం జరిగింది. అంనతరం, అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు.
అయితే, అతిథులుగా వచ్చిన తమ మనోవభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్ స్టార్మర్ తమకు నాన్‌వెజ్, లిక్కర్‌లను అందించారని బ్రిటన్ హిందువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీష్ కే శర్మ.. ప్రధాని కార్యాలయం ఇచ్చిన ఆతిథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత 14 సంవత్సరాలుగా10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ నాన్ వెజ్ ఐటమ్స్, వైన్స్, బీర్ వంటి వాటికి జోలికి వెళ్లలేదు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల్లో మాంసాహారంతో చేసిన వంటకాలు పెట్టారు. వైన్,బీర్‌లను అందించి మూర్ఖం, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
దీపావళి వేడుకల్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ అంశంపై కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిటన్,భారత్‌లలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మారర్ స్పందించాల్సి ఉంది.
కాగా, బ్రిటన్ లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. 650 స్థానాలకు గాను నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకొని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment