
జీ7 భేటీ కోసం వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. భారత్–యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పట్టిష్టంచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో పురోగతిపై సునాక్‌తో కలిసి మోదీ సమీక్ష చేశారు.
మూడోసారి ప్రధాని అయ్యారంటూ మోదీని సునాక్ అభినందనలు తెలపగా త్వరలో జరగబోయే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటూ సునాక్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు చేయాల్సిన కృషిపై కూలంకషంగా చర్చించారు. ‘‘ రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, కీలక, అధునాతన సాంకేతిక రంగాలతోపాటు ప్రజాసంబంధాల్లోనూ ఇరుదేశాల మధ్య భాగస్వామం మరింత బలపడటంపై ఇరు నేతలు చర్చించారు’’ అని భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.
Comments
Please login to add a commentAdd a comment