న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ యూకేలో దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఖలిస్తానీ అనుకూలవాదులు కొందరు ఇటీవల లండన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడికి దిగడం, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలను ఈ సందర్భంగా రిషి సునాక్‌తో ప్రస్తావించారు. భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా, ఆర్థిక నేరస్తులను భారత్‌కు తిరిగి అప్పగించేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలు, ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక రంగాల పురోగతిని సమీక్షించారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment