phone talking
-
భారత్–కెనడాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోవాలి
లండన్: భారత్–కెనడాల మధ్య విభేదాలు సమసిపోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. భారత్–కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రిషి సునాక్, ట్రూడోలు ఫోన్లో మాట్లాడుకున్నారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది, భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తముందనేందుకు ఆధారాలున్నాయంటూ ట్రూడో చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. అదేవిధంగా, బ్రిటన్‌లోని ఓ గురుద్వారా కమిటీ సమావేశానికి వెళ్లిన భారత దౌత్యాధికారి విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అనుకూలవాదులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇరు దేశాల ప్రధానులు సంభాషించుకున్నారు. భారత్‌తో విభేదాలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, జెనీవా ఒప్పందంతోపాటు దేశాల సార్వభౌమాధికారాన్ని, చట్ట నియమాలను గౌరవించాలన్నారు. భారత్‌తో సంబంధాలు త్వరలోనే మెరుగుపడతాయని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ యూకేలో దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తానీ అనుకూలవాదులు కొందరు ఇటీవల లండన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడికి దిగడం, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలను ఈ సందర్భంగా రిషి సునాక్‌తో ప్రస్తావించారు. భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా, ఆర్థిక నేరస్తులను భారత్‌కు తిరిగి అప్పగించేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలు, ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక రంగాల పురోగతిని సమీక్షించారని అధికారులు తెలిపారు. -
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫిలిప్పీన్స్ 17వ అధ్యక్షుడిగా జూన్‌లో బాధ్యతలు చేపట్టిన మార్కోస్ జూనియర్‌కు మోదీ అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్ పాత్ర కీలకమైందిగా భారత్ భావిస్తోందన్నారు. ఫిలిప్పీన్స్ అభివృద్ధికి భారత్ సంపూర్ణంగా సహకరిస్తుందని ప్రధాని తెలిపారు. రొడ్రిగో డ్యుటెర్టే స్థానంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా మార్కోస్ జూనియర్ జూన్ 30వ తేదీన బాధ్యతలు చేపట్టారు. -
కోవిడ్‌పై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనాపై పోరులో భారత్‌కు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో భారత్‌కు అవసరమైన అన్నిరకాల సహాయం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని ప్రధాని మోదీకి తెలిపారు. మందులు, వెంటిలేటర్లు, వైద్య పరికరాలు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు సాధ్యమైనంత తొందరగా అందజేస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం రాత్రి బైడెన్ ఫోన్లో మాట్లాడారు. భారత్‌లో కోవిడ్ సంక్షోభ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్లు, మందులు చౌకధరలకు అందుబాటులో ఉండేలా ‘వ్యాపార సంబంధిత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ట్రిప్స్)లో మినహాయింపులు ఉండాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లు్యటీవో)లో భారత్ చొరవ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మోదీ... బైడెన్ దృష్టికి తెచ్చారని కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఈ రోజు ఫలవంతమైన సంభాషణ జరిపాను. ఇరుదేశాల్లో కోవిడ్ పరిస్థితులపై విపులంగా చర్చించాం. భారత్‌కు అమెరికా అందిస్తున్న సహాయానికి ప్రెసిడెంట్ బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపాను. వ్యాక్సిన్ ముడిసరుకుల సరఫరా.. సాఫీగా, సమర్థవంతగా జరగాల్సిన అవసరాన్ని బైడెన్‌తో చర్చల్లో ప్రస్తావించడం జరిగింది. ఆరోగ్యరంగంలో భారత్– అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి కోవిడ్–19 విసురుతున్న సవాళ్లకు పరిష్కారం చూపగలదు’ అని మోదీ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. భారత్‌కు సాయం చేయడానికి ముం దుకు రావడంపై బైడెన్‌కు మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి, కోవాక్స్‌లో పాల్గొనడం, క్వాడ్ వ్యాక్సిన్ సాయంలో పాలుపంచుకోవడం (విదేశాలకు కరోనా టీకాలకు అందించడం) ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి భారత్ తమ వంతు ప్రయత్నం చేసిందని మోదీ గుర్తుచేశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో పరస్పర సమన్వయం, సహకారంతో పనిచేయాలని తమ తమ దేశాల అధికారులను బైడెన్, మోదీలు ఆదేశించారు. ఇకపై తరచూ సంప్రదింపులు జరపాలని ఇరువురూ నిర్ణయించారు. కోవిడ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అండగా ఉంటామని భరోసానిస్తూ అందుకు సూచికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. అక్కడి భవనాలపై మువ్వన్నెల రంగుల్లో విద్యుత్ దీపాలను వెలిగించిన దృశ్యం -
మరి కొద్ది గంటల్లో పెళ్లి అనగా..?
లక్నో : మరి కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువ ఇంజనీర్ ఆజాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భాజభజాంత్రిలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. ఈ విషాద సంఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు సమీపంలోని నందోసి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గాంగ్వర్ ఓ ప్రైయివేట్ బిల్డర్స్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతనికి అదే రోజు సాయంత్రం షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి జరగాల్సింది. పెళ్లి పనులతో ఆ కుటుంబమంతా సందడి నెలకొంది. ఇంతలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్‌పాల్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. తన ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ఫోన్ ద్యాసలో ఉన్న నరేశ్‌ను వేగంగా వచ్చిన రాజ్యారాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కోసం వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనడం బాధాకరంగా ఉందని అతని బంధు మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫోన్ మాట్లాడడంపై పెద్దమ్మ మందలించిందని..
సాక్షి, విజయవాడ: ఫోన్లో మాట్లాడుతుండడంపై పెద్దమ్మ మందలించినందుకు ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన విజయవాడ నగరంలోని చిట్టినగర్‌లో జరిగింది. పిల్లవాడి వైద్య పరీక్షల కోసం తల్లిదండ్రులు చెన్నై వెళ్లగా లిఖిత(14) అనే బాలిక ఇంటి వద్దనే ఉంది. ఈమెను చూసుకునేందుకు పెద్దమ్మ కనకరత్నంకు తల్లిదండ్రులు బాధ్యతలు అప్పజెప్పి వెళ్లారు. రెండు రోజులుగా ఫోన్లో అదేపనిగా ఎవరితోనో మాట్లాడుతుండడంపై పెద్దమ్మ బాలికను మందలించింది. మీ అమ్మతో చెబుతానని హెచ్చరించింది. తన గురించి తల్లికి చెబుతుందనే భయంతో లిఖిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సమాచార శాఖలో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హలో.. నేను కలెక్టర్ మాట్లాడుతున్నా
కలెక్టర్: నీ పేరు ఏమిటి? రైతు: నా పేరు నరసింహారెడ్డి. కలెక్టర్: ఎందుకు వచ్చావు. రైతు:సార్.. నాకు పంట పొలం ఆన్లైన్ ఎక్కించడంలో అధికారులు తిప్పుతున్నారు. అందుకే ఇక్కడికి వచ్చా. కలెక్టర్: అవునా ... ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు. అసలు సమస్య ఏమిటీ.. రైతు:సమస్య ఏమిటో నాకు తెలియదు సార్. నేను దాదాపు ఐదారు నెలలుగా తిరుగుతున్నా. కలెక్టర్:ఓకే.. నాకు అర్థమైంది. నేను తహసీల్దార్‌తో మాట్లాడతా ఉండు. కలెక్టర్: హలో .. తహసీల్దార్ గారూ.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా.. ఎందుకు నరసింహారెడ్డికి సంబంధించిన పొలం విస్తీర్ణం ఆన్లైన్లో ఎక్కించలేదు. మీకు ఉన్న ప్రాబ్లం ఏమిటి. ఇన్ని రోజులుగా తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు. ఎప్పుడు పరిష్కరిస్తారు. మళ్లీ ఈ రైతు నా దగ్గరికి వస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. జాగ్రత్త. దాదాపు రైతును 5 నిమిషాల పాటు తన వద్ద ఉంచుకుని ఆ సమస్యపై కింది స్థాయి అధికారితో మాట్లాడి స్వయంగా కలెక్టరే ఇన్ని రోజుల్లో పరిష్కారమవుతుందని చెప్పడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనదైన శైలిలో అధికారుల్లో మార్పు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న కలెక్టర్ బాబురావు నాయుడు ఏది చేపట్టినా అది సంచలనమే అవుతోంది. ప్రత్యేకంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ వచ్చిన కలెక్టర్ ఇప్పుడు ఒక నూతన సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. కడప కలెక్టరేట్లో నిర్వహించే మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసేందుకు ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. కలెక్టర్ కూడా ప్రస్తుతం ల్యాప్‌ట్యాప్ ద్వారా కొత్త విధానంతో అక్కడికక్కడే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ప్రజలు అర్జీలు తీసుకుని తన వద్దకు రాగానే కలెక్టర్ అక్కడే పరిశీలించి.. అక్కడే పరిష్కారం చూపడం..మండల కేంద్రాలకు సంబంధించి సమస్య అక్కడే పరిష్కారం కావాల్సిన పరిస్థితుల్లో ల్యాప్‌ట్యాప్ ద్వారా సంబంధిత మండల కేంద్రానికి ఫోన్ చేసి కలెక్టర్ స్వయంగా మాట్లాడుతున్నారు. మొదటగా ‘హలో.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా మీ మండలంలోని ఫలానా గ్రామానికి చెందిన రైతు వచ్చాడు. ఇతనికి సంబంధించి ఫలానా సమస్య పెండింగ్‌లో ఉంది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు పరిష్కారం చేయలేదు. మీ దగ్గరికి చాలా సార్లు తిరిగినా పట్టించుకోలేదు, ఇప్పుడు నా వద్దకు వచ్చాడు. అలాంటి పరిస్థితి మరోసారి తెచ్చుకోకండి, ఇప్పుడు ఆ రైతును మీ దగ్గరికే పంపిస్తున్నా, సమస్యను పరిష్కరించండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడండి. వారిని మాత్రం ఇబ్బందులకు గురిచేయొద్దని’ అక్కడికక్కడే జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ ల్యాప్‌ట్యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ తరహాలో మండల అధికారితో మాట్లాడి పరిష్కారం చూపుతుండటం గమనార్హం. కలెక్టర్ ప్రారంభించిన ఈ కొత్త విధానంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ కలెక్టర్ ల్యాప్‌ట్యాప్‌లో చూస్తూ అవతలి అ«ధికారితో మాట్లాడుతుండగా హాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ మీద జిల్లా కలెక్టర్‌తోపాటు బాధిత రైతు, మండల కేంద్రంలోని అధికారులు కూడా ఇక్కడి స్కీన్ మీద కనిపిస్తుండటం కొత్త విధానం ప్రత్యేకత. -
జైళ్లో ఐఎస్డీ సౌకర్యం లేదు: డీఐజీ నరసింహా
-
'భత్కల్ 27 సార్లు మాట్లాడాడు'
యాసిన్ భత్కల్ మొత్తం 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని జైళ్ల శాఖ డీఐజీ నరసింహ తెలిపారు. భత్కల్ తన భార్యతో మాట్లాడిన అంశాలు బహిర్గతం అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భత్కల్ వద్ద సెల్‌ఫోన్ ఉందన్న మాట అవాస్తవమని చెప్పారు. అతడు తన తల్లితోను, భార్యతోను జైలు ఫోన్ నుంచే మాట్లాడాడన్నారు. నిబంధనల ప్రకారం భత్కల్ మాట్లాడిన ప్రతి కాల్‌ను రికార్డు చేశామని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలందరికీ ల్యాండ్ లైన్ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ఆ ఫోను వాడుకోడానికి కూడా మొదట్లో తాము భత్కల్‌కు అనుమతి ఇవ్వలేదని.. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు వారంలో రెండుసార్లు ఫోన్ మాట్లాడుకునేందుకు అనుమతి ఇచ్చామన్నారు. అది కూడా ఒక్కోసారి 5 నిమిషాలు మాట్లాడేందుకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. భత్కల్ మొత్తం 27 సార్లు మాట్లాడాడని వివరించారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారాన్ని ఎన్ఐఏ తమకు ఇవ్వలేదని డీఐజీ నరసింహ చెప్పారు. అయితే తాజాగా వెల్లడైన అంశాల నేపథ్యంలో చర్లపల్లి జైలుకు అదనపు భద్రత కల్పిస్తున్నామని ఆయన అన్నారు.