
సాక్షి, విజయవాడ: ఫోన్‌లో మాట్లాడుతుండడంపై పెద్దమ్మ మందలించినందుకు ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన విజయవాడ నగరంలోని చిట్టినగర్‌లో జరిగింది. పిల్లవాడి వైద్య పరీక్షల కోసం తల్లిదండ్రులు చెన్నై వెళ్లగా లిఖిత(14) అనే బాలిక ఇంటి వద్దనే ఉంది. ఈమెను చూసుకునేందుకు పెద్దమ్మ కనకరత్నంకు తల్లిదండ్రులు బాధ్యతలు అప్పజెప్పి వెళ్లారు. రెండు రోజులుగా ఫోన్‌లో అదేపనిగా ఎవరితోనో మాట్లాడుతుండడంపై పెద్దమ్మ బాలికను మందలించింది. మీ అమ్మతో చెబుతానని హెచ్చరించింది. తన గురించి తల్లికి చెబుతుందనే భయంతో లిఖిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సమాచార శాఖలో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.