
తిరువళ్లూరు(చెన్నై): తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్న పెద్దనాన్న కొడుకును గుమ్మిడిపూండి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఎడూర్ కాలనీకి చెందిన సుమిత(22), అదే ప్రాంతానికి చెందిన పెద్దనాన్న కొడుకు త్యాగరాజన్(27) ఇద్దరూ వరుసకు అన్న చెల్లెలు. పెద్దనాన్న కొడుకు కావడంతో సుమిత చనువుగా మెలిగింది.
సుమితకు ఇటీవల పెళ్లిచూపులు ఏర్పాటు చేసి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో యువతికి పెద్దనాన్న కొడుకు త్యాగరాజన్ రోజూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్టు తెలిసింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సుమిత కాబోయే భర్తకు పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత యువతి గుమ్మిడిపూండి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
చదవండి తెలంగాణలో టమాటాలు చోరీ.. తెల్లారేసరికి బాక్స్‌లు మాయం
Comments
Please login to add a commentAdd a comment