బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు | Man gets 10 years jail for sexually assaulting girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు

Published Tue, Jun 25 2024 4:14 AM | Last Updated on Tue, Jun 25 2024 4:14 AM

Man gets 10 years jail for sexually assaulting girl

విజయవాడస్పోర్ట్స్‌: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి  పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహిళకు, నున్న గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పిల్లలను తీసుకుని ఇబ్రహీంపట్నంలోని పుట్టింట్లో ఉండేది.

కొన్నాళ్ల తరువాత భర్త వచ్చి తన ఐదేళ్ల పెద్ద కుమార్తెను నున్నలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాంబేకాలనీకి చెందిన 20 ఏళ్ల కుంచాల దుర్గారావు అలియాస్‌ తమ్మిశెట్టి దుర్గారావు అలియాస్‌ దుర్గా ఆ పాపను డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పాపకు స్నానం చేయిస్తుండగా మర్మాంగాల వద్ద ఇన్ఫెక్షన్‌ రావడాన్ని గమనించిన తల్లి ఆరా తీయగా దుర్గారావు చేసిన అత్యాచారం బయటపడింది.

వెంటనే పాపను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో పాప తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్‌ ఆరో తేదీన నున్న పోలీసులు కేసు నమోదు చేసి 2020 ఆగస్టు 12వ తేదీన నిందితుడు దుర్గారావును అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో నిందితుడు దుర్గారావుకు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement