venkateshwarlu
-
బరాజ్‌ల నిర్ణయం కేసీఆర్‌దే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే నిర్ణయం తీసుకున్నారని నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు చెప్పారు. 2016 జనవరిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు. వ్యాప్కోస్ రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, కేసీఆర్ స్వయంగా సంతకం చేశారని అన్నారు. ఈ డీపీఆర్ ఆధారంగా వివిధ కాంపోనెంట్ల అంచనాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారని వివరించారు. బరాజ్‌లను ఎక్కడ కట్టాలో ప్రభుత్వమే చెప్పగా, ఆ మేరకు డీపీఆర్‌ను వ్యాప్కోస్ సిద్ధం చేసిందన్నారు. నిర్మాణ దశలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థలాలను మార్చినట్టు చెప్పారు. గ్రావిటీ కాల్వ పొడవు తగ్గించడం, నిల్వ సామర్థ్యం పెంచడం, అటవీ భూముల సేకరణను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం ఆరు గంటల పాటు నిర్వహించిన రెండో విడత ఎగ్జామినేషన్‌లో వెంకటేశ్వర్లు ఈ మేరకు వివరణ ఇచ్చారు. తొలి విడతలో ఆయనకు 71 ప్రశ్నలు వేసిన కమిషన్.. తాజాగా రెండో విడతలో ఏకంగా 128 ప్రశ్నలు సంధించింది. శుక్రవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని ఆదేశించింది. నిర్మాణ దశలో మార్పులు ‘డీపీఆర్‌ను 2016 మార్చిలో కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) సమర్పించిన తర్వాత నిర్మాణంలో పలు మార్పులు, చేర్పులపై నిర్ణయాలు జరిగాయి. డీపీఆర్‌లో అన్ని కాంపోనెంట్లు లేవు. గైడ్‌బండ్, ఫ్లడ్ బ్యాంకులు, డైవర్షన్ చానల్స్‌ను తర్వాత చేర్చాం. నిర్మాణ దశలో సైట్ పరిస్థితుల ఆధారంగా మరికొన్ని మార్పులు చేశాం. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్సీ)లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ మార్పులు జరిగాయి. డీపీఆర్‌లో అన్నారం బరాజ్‌ను 120 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా, అటవీ భూముల ముంపు, సైట్ పరిస్థితుల ఆధారంగా 119 మీటర్లకు కుదించాం. ప్రాథమికంగా మూడు బరాజ్‌లకు వేర్వేరు డీపీఆర్‌లను తయారు చేయగా, తర్వాత ఉమ్మడి డీపీఆర్‌ను తయారు చేశాం..’అని కమిషన్‌కు వెంకటేశ్వర్లు తెలిపారు. సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 2007లో రూ.17,875 కోట్లతో అనుమతిచ్చి 2008లో రూ.38,500 కోట్లకు అంచనాలను పెంచి రూ.6,156 కోట్ల పనులు సైతం పూర్తి చేశాక 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏమిటి?’అని కమిషన్ నిలదీసింది. ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌కు మహారాష్ట్ర అభ్యంతరం తెలపడంతో 148 మీటర్లకు ఎత్తు తగ్గించి ఒప్పందం చేసుకున్నాం. ఆ ఎత్తులో బరాజ్ కడితే 44 టీఎంసీల లభ్యతే ఉంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ చేశారు’ అని వెంకటేశ్వర్లు వివరించారు.మ్యాథమెటికల్లీ తప్పుడు నిర్ణయమే ! ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా రెండుదశల్లో కలిపి 304 మెగావాట్ల పంపుల సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి వీలుండగా రీఇంజనీరింగ్ చేసి పంపుల సామర్థ్యాన్ని 11 వేల మెగావాట్లకు పెంచడం సరైందేనా అని కమిషన్ ప్రశ్నించగా, గణితపరంగా తప్పుడు నిర్ణయమేనని మాజీ ఈఎన్సీ పేర్కొన్నారు. కోల్‌బెల్ట్ ఏరియాలో మేడిగడ్డ బరాజ్ నిర్మించారా? అని ప్రశ్నించగా వాస్తవం కాదని ఆయన బదులిచ్చారు. బరాజ్ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నట్టు జాదవ్‌పూర్ వర్సిటీ ఇచి్చన నివేదికను ప్రస్తావించగా దానితో తాను ఏకీభవించనని చెప్పారు. ప్రభుత్వ అధినేత ఆదేశాలతో బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేశామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. బెంగాల్ సహా 4 రాష్ట్రాల్లో నిర్మించిన బరాజ్‌లలో సికెంట్ పైల్స్ వాడినట్టు చెప్పగా.. తన స్వరాష్ట్రం బెంగాల్ పేరును ఉటంకించడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మీరు చెప్పింది అబద్ధం!
సాక్షి, హైదరాబాద్: ‘మీ సమాధానం పూర్తి అబద్ధం. నిజాలే చెప్తానని ప్రమాణం చేసి తప్పుడు సాక్ష్యం ఇస్తారా? మేడిగడ్డ బరాజ్‌లోని 1, 2వ నంబర్ బ్లాకుల్లో ఆర్సీసీ కటాఫ్‌లు, 3–7 నంబర్ బ్లాకుల్లో సికెంట్ పైల్స్ వినియోగించాలని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ సూచించినట్టు ఏవైనా డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయా?’అని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు స్మార్ట్‌గా ఉంటే ఫర్వాలేదు.. ఓవర్ స్మార్ట్‌గా ప్రవర్తిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. కమిషన్‌ను తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తే పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విచారణలో భాగంగా కమిషన్ శనివారం మూడున్నర గంటలపాటు నల్లా వెంకటేశ్వర్లుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి 71 ప్రశ్నలను సంధించింది. తనకు ఆంగ్లంలో అంతగా ప్రావీణ్యం లేదని, మేడిగడ్డ నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగంపై అంతకుముందు ఇచ్చిన సమాధానాన్ని సరిదిద్దడానికి అవకాశం కలి్పంచాలని ఆయన కోరగా.. కమిషన్ తిరస్కరించింది. ఆంగ్లం రాకుండా ఈఎన్సీగా ఎలా పనిచేశారని మండిపడింది. తనకు జ్ఞాపకం ఉన్న వివరాలు చెప్పానని, అందులో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చంటూ వెంకటేశ్వర్లు క్షమాపణ కోరారు. తమ్మిడిహట్టి వద్దు అన్నది ప్రభుత్వ అధినేతనా? హైపవర్ కమిటీనా? తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చి బరాజ్ నిర్మించడానికి డీపీఆర్ తయారీ బాధ్యతను ఏప్రిల్ 2015లో వ్యాప్కోస్‌కు కట్టబెట్టినట్టు నల్లా వెంకటేశ్వర్లు కమిషన్‌కు తెలిపారు. లొకేషన్ మార్పుపై నిర్ణయం ఎవరిదని ప్రశ్నించగా, ప్రభుత్వ అధినేతది అని బదులిచ్చారు. ఇలాంటి నిర్ణయాలు మంత్రివర్గం తీసుకోవాలి కదా? అని కమిషన్ ప్రశ్నించగా, మంత్రివర్గంలో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై చర్చ జరిగిందని బదులిచ్చారు. ‘2016 మార్చి 27న నాటి సీఎం (కేసీఆర్) నిర్వహించిన ఓ సమావేశంలో వ్యాప్కోస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ డీపీఆర్ సమర్పించారు. తమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు లోకేషన్‌ను మార్చాలని డీపీఆర్‌లో వ్యాప్కోస్ ప్రతిపాదించింది. వ్యాప్కోస్ ప్రతిపాదనలను హైపవర్ కమిటీ ఆమోదించింది’అని వెంకటేశ్వర్లు చెప్పారు. లొకేషన్ మార్పుపై సీఎం నిర్ణయం తీసుకున్నట్టు అంతకుముందు చెప్పారు కదా.. అని కమిషన్ నిలదీయగా, సీఎం రీఇంజనీరింగ్ చేయాలని సూచించారని మళ్లీ వివరణ ఇచ్చారు. వ్యాప్కోస్ ప్రతిపాదించిన ప్రాంతానికి 5.4 కి.మీ. దిగువన అన్నారం, 2.20 కి.మీ. దిగువన సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలన్న ప్రతిపాదనల ఆధారంగా హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మార్పులను హైపవర్ కమిటీ భేటీలో వ్యాప్కోస్ కూడా సమ్మతించిందని ఆయన పేర్కొనగా, దానికి రుజువులు ఉన్నాయా? అని కమిషన్ ప్రశ్నించింది. సమావేశం మినిట్స్‌లో ఈ విషయం ఉన్నప్పటికీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన వ్యాప్కోస్ ప్రతినిధి దానిపై సంతకం చేయాల్సిన అవసరం లేదని ఆయన బదులివ్వగా.. కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. వ్యాప్కోస్ ఇచ్చిన కొలతలు, సాంకేతిక ప్రమాణాల ప్రకారమే బరాజ్‌లు నిర్మించారా? అన్న ప్రశ్నకు.. మేడిగడ్డ బరాజ్ గేట్ల సైజు మినహా ఇతర మార్పులేమీ చేయలేదన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్ల సంఖ్యతోపాటు వాటి సైజుల్లో మార్పులను సీఈ సీడీఓ సూచించారన్నారు. నిర్మాణంలో డిజైన్లను వక్రీకరించాల్సి రావడంతో 2018, 2021లో రెండుసార్లు బరాజ్‌ల అంచనాలను సవరించినట్టు తెలిపారు. డిజైన్లలో లోపంతోనే... బరాజ్‌ల నిర్మాణం 2019 జూన్‌లో పూర్తికాగా, సెపె్టంబర్లో వచ్చిన వరదల్లో దెబ్బతినడానికి కారణాలేమిటి? అని కమిషన్ ప్రశ్నించింది. బరాజ్‌ల నుంచి విడుదలయ్యే వరద భీకర వేగంతో బయటకి దూసుకొచ్చి నేలను తాకే చోట నీటినిల్వలు లేకపోవడంతో ఆ వేగానికి అక్కడ ఉన్న లాంచింగ్ అప్రాన్ కొట్టుకుపోయి నష్టం జరిగిందని వెంకటేశ్వర్లు అన్నారు. నిల్వతో ఏర్పడే పీడనశక్తి విడుదలకి డిజైన్లలో సరైన పరిష్కారాలను చూపకపోవడంతోనే బరాజ్‌ల పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి నష్టం జరిగిందని చెప్పారు. పంపింగ్ కోసం బరాజ్‌లో కనీస నిల్వలను నిర్వహించాల్సి రావడమూ ఒక కారణమన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ‘జెడ్’ఆకృతి షీట్‌పైల్స్‌కి బదులు సికెంట్ పైల్స్‌ను వాడాలని ఎన్ఐటీ–వరంగల్‌తోపాటు ఐఐటీ–చెన్నై రిటైర్డ్ ప్రొఫెసర్ సిఫారసు చేశారన్నారు. -
సైట్ చూడకుండానే డిజైన్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత నిర్మిత స్థలాన్ని(సైట్) సందర్శించకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బరాజ్ డిజైన్లు, డ్రాయింగ్స్‌ను నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) ఇంజినీర్లు రూపొందించా రని ఆ విభాగం రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజ నీర్ మహ్మద్ అబ్దుల్ఫజల్ వెల్లడించారు. కాళే శ్వరం ప్రాజెక్టు నాటి రామగుండం సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సైట్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారం(క్రాస్ సెక్షన్ల) ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్స్‌ను రూపొందించినట్టు తెలి పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఆయన హాజరై వాంగ్మూ లం ఇచ్చారు.నాటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన సాంకేతిక అనుమతులు, హైపవర్ కమిటీ సిఫారసుల ప్రకారం సుందిళ్ల బరాజ్ నిర్మాణం విషయంలో నిర్ణయాలు జరిగాయని తెలిపారు. వరంగల్ ఎన్ఐటీ నిపుణులు అందించిన జియో టెక్నికల్ స్టడీస్ నివేదిక ఆధారంగా షీట్ పైల్స్‌కు బదులుగా సికెంట్ పైల్స్‌తో సుందిళ్ల బరాజ్ నిర్మించడానికి వీలు కల్పిస్తూ డిజై న్లలో మార్పులు చేశామన్నారు.బరాజ్‌కు అద నపు గేట్లు పెట్టాలని ఎవరు నిర్ణయం తీసుకు న్నారని కమిషన్ ప్రశ్నించగా, 58 గేట్లు, మరో 10 స్లూయిస్ల(పూడిక తొలగింపు గేట్లు)తో బరాజ్ నిర్మించడానికి మాత్రమే డ్రాయింగ్స్, డిజైన్లు ఇచ్చామని బదులిచ్చారు. అదనపు గేట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనగానీ, దానికి డిజైన్లు సిద్ధం చేయాలని కోరుతూ ఫైల్ గానీ తన వద్దకు రాలేదన్నారు. అదనపు గేట్ల ఏర్పాటు విషయంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. 2డీ మోడల్ స్టడీస్ ఆధారంగానే సుందిళ్ల బరాజ్ డిజైన్లు రూపొందించామన్నారు. తమకు బరాజ్ నిర్మాణంతో సంబంధం లేదని చెప్పారు. హరిరామ్ ఇచ్చిన లేఖను అందజేసిన నరేందర్‌రెడ్డి ⇒ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్ పనులకు తానే బాధ్యుడిని అని ధ్రువీకరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నాటి సీఈ హరిరామ్(ప్రస్తుతం గజ్వేల్ ఈఎన్సీ) ఇచ్చిన లేఖను సీడీవో రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్‌రెడ్డి శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు అందజేశారు. బరాజ్‌ల డిజైన్లు, డ్రాయింగ్స్‌ను కేంద్ర జలసంఘానికి పంపడానికి ముందు చెక్ లిస్ట్‌పై సంతకం చేయడానికి తాను నిరాకరించగా, హరిరామ్ ఈ మేరకు ధ్రువీకరణ పత్రం రాసిచ్చారని ఆయన గురువారం కమిషన్‌కు నివేదించిన విషయం తెలిసిందే. శుక్రవారం మళ్లీ కమిషన్ ఎదుట ఆయన హాజరై ఈ పత్రాన్ని ఆధారంగా అందజేశారు.గురువారం జరిగిన విచారణ సందర్భంగా కమిషన్‌కు ఇవ్వలేకపోయిన సమాచారాన్ని శుక్రవారం ఆయన అందజేశారు. రేడియల్ గేట్లను ఒకే ప్రయత్నంలో 2 మీటర్లకు మించి పైకి ఎత్తడం సాధ్యం కాదని, వాటిని ఎందుకు డిజైన్లలో ప్రతిపాదించారని కమిషన్ ఆయన్ను ప్రశ్నించింది. ఈ వాదన సరైనది కాదని తెలిపే పత్రాలను ఆయన కమిషన్‌కు అందజేశారు. కమిషన్ తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్ ఈ నెల 27న నిర్వహించనుంది. -
బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
విజయవాడస్పోర్ట్స్: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహిళకు, నున్న గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పిల్లలను తీసుకుని ఇబ్రహీంపట్నంలోని పుట్టింట్లో ఉండేది.కొన్నాళ్ల తరువాత భర్త వచ్చి తన ఐదేళ్ల పెద్ద కుమార్తెను నున్నలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాంబేకాలనీకి చెందిన 20 ఏళ్ల కుంచాల దుర్గారావు అలియాస్ తమ్మిశెట్టి దుర్గారావు అలియాస్ దుర్గా ఆ పాపను డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పాపకు స్నానం చేయిస్తుండగా మర్మాంగాల వద్ద ఇన్ఫెక్షన్ రావడాన్ని గమనించిన తల్లి ఆరా తీయగా దుర్గారావు చేసిన అత్యాచారం బయటపడింది.వెంటనే పాపను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో పాప తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్ ఆరో తేదీన నున్న పోలీసులు కేసు నమోదు చేసి 2020 ఆగస్టు 12వ తేదీన నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో నిందితుడు దుర్గారావుకు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
ఖమ్మం: మరీ ఇంత ఘోరమా?
సాక్షి, ఖమ్మం: జిల్లాలో వేకువ ఝామునే ఘోరం జరిగింది. ఓ వృద్ధురాలు, ఆమె ఇద్దరు మనవరాళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఆ వృద్ధురాలి తనయుడు కనిపించకుండా పోవడంతో అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం జరిగింది. పిట్టల పిచ్చమ్మ(60), ఆమె మనవరాళ్లు నీరజ(10), ఝాన్సీ(6)లు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న ఇద్దరినీ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు చిన్నారుల తండ్రి వెంకటేశ్వర్లే ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అయితే ఆమెను కూడా భర్తే వెంకటేశ్వర్లే హత్య చేసి ఉంటాడని పోలీసులు వద్ద స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంకటేశ్వర్లు ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు. -
రెచ్చిపోయిన పచ్చమూకలు..BC నేత వెంకటేశ్వరులు ఇంటిపై రాళ్ళ దాడి
-
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు ఏ విధంగా కట్టారు? ప్లానింగ్ ఏమిటి? డిజైన్లు ఎవరు తయారు చేశారు? మోడల్ స్టడీస్ చేశారా? డిజైన్లకు తగ్గట్టే నిర్మాణం జరిగిందా? తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు? అక్కడ అదనంగా నీటి లభ్యత ఉందని ఎలా నిర్ధారించారు? బ్యారేజీలు ఆ ప్రాంతాల్లోనే కట్టాలని చెప్పిందెవరు? నిపుణుల నివేదిక ఉందా?’’ అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయానికి నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును పిలిపించి ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యతను నిర్థారించే హైడ్రాలజీ నివేదికలు అందించాలని కోరారు. ఇక ‘‘నీటి లభ్యతపై కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చెప్పిందేంటి? మీరు చేసిందేంటి? 2019లో బ్యారేజీలు పూర్తికాగా.. అదే ఏడాది వచ్చిన తొలి వరదలకే వాటికి నష్టం జరిగితే ఎందుకు మరమ్మతులు జరపలేదు?’’ అని ప్రశ్నించినట్టు తెలిసింది.లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఆదేశంనిర్మాణం పూర్తికాక ముందే బ్యారేజీలు పూర్తయినట్టు సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారని.. డిఫెక్ట్ లయబిలిటీ గడువు పూర్తికాకుండానే సెక్యూరిటీ డిపాజిట్లను ఎందుకు కాంట్రాక్టర్‌కు విడుదల చేశారని విచారణ కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. ‘‘డిఫెక్ట్ లయబులిటీ కాలంలోనే బ్యారేజీలకు నష్టాలు జరిగినా కాంట్రాక్టర్లతో మరమ్మతులు ఎందుకు చేయించలేదు? బ్యారేజీల వైఫల్యానికి కారణం నిర్మాణ లోపాలా? డిజైన్లలో లోపాలా? నిర్వహణ, పర్యవేక్షణ లోపాలా?ప్రమాణాల మేరకు.. వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల స్థితిగతులను వరిశీలించారా?’’ అని నిలదీసినట్టు తెలిసింది. వీటన్నింటిపై అంశాల వారీగా నల్లా వెంకటేశ్వర్లు సమాధానాలు ఇవ్వగా.. వివరాలన్నీ లిఖితపూర్వకంగా సమర్పించాలని జస్టిస్ చంద్రఘోష్ ఆదేశించినట్టు సమాచారం.విచారణ కోసం స్వతంత్ర కమిటీకాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ, నిర్వహణ లోపాలు, కారణాలను వెలికితీయడంతోపాటు బాధ్యులను గుర్తించడంలో విచారణ కమిషన్‌కు సహకారం అందించడానికి వీలుగా నిపుణులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.నీటి పారుదల శాఖతోగానీ, ఏ రాజకీయ పార్టీ లేదా ఏ సంఘంతోగానీ సంబంధం లేని నిపుణులను కమిటీలో నియమించాలని సూచించారు. కాగా.. చంద్రఘోష్ రాష్ట్ర పర్యటన ముగించుకుని ఆదివారం కోల్‌కతాకు వెళ్లను న్నారు. కాళేశ్వరం బ్యారేజీలపై కమిషన్ ఫిర్యా దుల స్వీకరణ ఈనెల 31వ తేదీతో ముగియనుంది. -
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు ఏ విధంగా కట్టారు? ప్లానింగ్ ఏమిటి? డిజైన్లు ఎవరు తయారు చేశారు? మోడల్ స్టడీస్ చేశారా? డిజైన్లకు తగ్గట్టే నిర్మాణం జరిగిందా? తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు? అక్కడ అదనంగా నీటి లభ్యత ఉందని ఎలా నిర్ధారించారు? బ్యారేజీలు ఆ ప్రాంతాల్లోనే కట్టాలని చెప్పిందెవరు? నిపుణుల నివేదిక ఉందా?’’ అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయానికి నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును పిలిపించి ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యతను నిర్థారించే హైడ్రాలజీ నివేదికలు అందించాలని కోరారు. ఇక ‘‘నీటి లభ్యతపై కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చెప్పిందేంటి? మీరు చేసిందేంటి? 2019లో బ్యారేజీలు పూర్తికాగా.. అదే ఏడాది వచ్చిన తొలి వరదలకే వాటికి నష్టం జరిగితే ఎందుకు మరమ్మతులు జరపలేదు?’’ అని ప్రశ్నించినట్టు తెలిసింది.లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఆదేశంనిర్మాణం పూర్తికాక ముందే బ్యారేజీలు పూర్తయినట్టు సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారని.. డిఫెక్ట్ లయబిలిటీ గడువు పూర్తికాకుండానే సెక్యూరిటీ డిపాజిట్లను ఎందుకు కాంట్రాక్టర్‌కు విడుదల చేశారని విచారణ కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. ‘‘డిఫెక్ట్ లయబులిటీ కాలంలోనే బ్యారేజీలకు నష్టాలు జరిగినా కాంట్రాక్టర్లతో మరమ్మతులు ఎందుకు చేయించలేదు? బ్యారేజీల వైఫల్యానికి కారణం నిర్మాణ లోపాలా? డిజైన్లలో లోపాలా? నిర్వహణ, పర్యవేక్షణ లోపాలా?ప్రమాణాల మేరకు.. వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల స్థితిగతులను వరిశీలించారా?’’ అని నిలదీసినట్టు తెలిసింది. వీటన్నింటిపై అంశాల వారీగా నల్లా వెంకటేశ్వర్లు సమాధానాలు ఇవ్వగా.. వివరాలన్నీ లిఖితపూర్వకంగా సమర్పించాలని జస్టిస్ చంద్రఘోష్ ఆదేశించినట్టు సమాచారం.విచారణ కోసం స్వతంత్ర కమిటీకాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ, నిర్వహణ లోపాలు, కారణాలను వెలికితీయడంతోపాటు బాధ్యులను గుర్తించడంలో విచారణ కమిషన్‌కు సహకారం అందించడానికి వీలుగా నిపుణులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.నీటి పారుదల శాఖతోగానీ, ఏ రాజకీయ పార్టీ లేదా ఏ సంఘంతోగానీ సంబంధం లేని నిపుణులను కమిటీలో నియమించాలని సూచించారు. కాగా.. చంద్రఘోష్ రాష్ట్ర పర్యటన ముగించుకుని ఆదివారం కోల్‌కతాకు వెళ్లను న్నారు. కాళేశ్వరం బ్యారేజీలపై కమిషన్ ఫిర్యా దుల స్వీకరణ ఈనెల 31వ తేదీతో ముగియనుంది. -
కారు, ఆటో ఢీ... ముగ్గురి దుర్మరణం
బేస్తవారిపేట: నిద్రమత్తులో కారు... ఆటోను ఢీకొట్టి న ఘటనలో ఇద్దరు రైతులు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ షేక్ ఖాశీంషా, కారులోని బైనగాని ఓబయ్య, గురవయ్య తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... బేస్తవారిపేట మండలంలోని ప్రకాశం జిల్లా, బార్లకుంటకు చెందిన చిత్తారు వెంకటేశ్వర్లు (53), చిత్తారు రాములు (40), బిళ్ల చిన్నవెంకటేశ్వర నాయుడు కలిసి ఎండుమిర్చి పంటను అమ్ముకునేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళా్లరు. విక్రయించిన సొమ్ముతో గుంటూరులో రైలు ఎక్కారు. కంభంలో దిగాల్సి ఉండగా, నిద్రపోవడంతో గిద్దలూరులో దిగారు. అక్కడ నుంచి బేస్తవారిపేటకు వచ్చేందుకు ఆటో ఎక్కారు. మరోవైపు విజయవాడలో కొత్తగా కొనుగోలు చేసిన కారును తీసుకుని తండ్రీకొడుకులు ఓబయ్య, గురవయ్య వెళుతూ మార్గమధ్యంలో నిద్రమత్తులో పూసలపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ఇరుక్కుపోయిన ముగ్గురిలో వెంకటేశ్వర్లును రోడ్డుపై వెళ్లే వాహనదారులు బయటకు తీశారు. ఆ సమయానికే అతడు మృత్యువాత పడ్డాడు. రాములు, చినవెంకటేశ్వర నాయుడు ఆటోలో చిక్కుకుపోయారు. ఈలోగా లీకైన ఆయిల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపించడంతో ఇద్దరి శరీరాలు కాలిపోయాయి. వారి వద్ద మిర్చి పంట విక్రయించిన సొమ్ము రూ.10లక్షలు కాలి బూడిదైపోయాయి. మృతుడు చిన్న వెంకటేశ్వర నాయుడు సీఎస్‌పురం మండలం, నల్లమడుగుల సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. -
ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవల్లిక (23) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక అశోక్‌నగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ‘‘ఆత్మహత్యపై శుక్రవారం రాత్రి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లాం. ఆమె గదిలో సూసైడ్ లెటర్ దొరికింది. ఆమె సెల్‌ఫోన్ కాల్ రికార్డ్‌లు, వాట్సాప్ చాటింగ్‌లతో పాటు ఆమె స్నేహితులను విచారించాం. ప్రవల్లిక మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన శివరామ్ రాథోడ్‌తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించాం. ప్రియుడితో ఫొటోలు, సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా ఉన్నాయి. తనను మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇరువురి మధ్య జరిగిన చాటింగ్‌లను గుర్తించాం. శివరామ్, ప్రవల్లిక ఇద్దరు కలిసి నగరంలో ఓ హోటల్‌కు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. మరింత విచారణ కోసం మృతురాలి సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్, ప్రవల్లిక చాటింగ్స్ ఆధారంగా శివరామ్ రాథోడ్‌పై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. అలాగే సూసైడ్ నోట్, లెటర్‌పై ఉన్న హ్యాండ్ రైటింగ్ ప్రవల్లికదేనా కాదా అనేది నిర్ధారించేందుకు ఆమె నోట్‌బుక్స్ కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. ఏం జరిగిందంటే.. శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ప్రవల్లిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్ధి సంఘాల నేతలు అడ్డుకున్నారు. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అర్ధరాత్రి వరకూ మృతదేహాన్ని హాస్టల్లోనే ఉంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రేమ వ్యవహారమే ప్రవళ్లిక ఆత్మహత్యకు కారణమని తేల్చారు. పక్షం రోజుల కితమే హాస్టల్లో చేరిక కాగా, 15 రోజుల క్రితం హాస్టల్లో జాయిన్ అయిన ప్రవల్లిక సంధ్య, అక్షయ శ్రుతిలతో కలిసి ఉండేది. ఎక్కువగా ఎవరితో మాట్లాడేది కాదని అంటున్నారు. ప్రవల్లిక ఉరివేసుకున్న రూమ్‌లో సూసైడ్ నోట్‌తో పాటు లవ్ సింబల్స్‌తో ఉన్న ఓ లెటర్‌ను కూడా పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతురాలి సెల్ ఫోన్ లో తాను ప్రేమించిన శివరామ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ఫ్రెండ్స్‌తో చేసిన చాటింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ప్రేమగురించి కుటుంబసభ్యులకు తెలుసు–డీసీపీ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ప్రవల్లిక ఎలాంటి గ్రూప్స్ పరీక్షలకు అప్లయ్ చేయలేదని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎలాంటి పోటీ పరీక్షలు కూడా రాయలేదన్నారు. ప్రవల్లిక ప్రేమ విషయం కూకట్‌పల్లిలో డిగ్రీ చదువుతున్న తమ్ముడు ప్రణయ్‌తో పాటు తల్లిదండ్రులకు కూడా తెలుసే ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. వారి వద్ద మరింత సమాచారం సేకరిస్తామన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆందోళనలు చేసి పోలీసులపై రాళ్లురువి్వన కేసులో బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. నివేదిక కోరిన గవర్నర్.. ప్రవల్లిక ఆత్మహత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టీఎస్పీఎస్సీ కార్యదర్శిలను ఆదేశించారు. ప్రవల్లిక ఆత్మహత్య పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేసిన గవర్నర్, ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. రాహుల్ గాందీ, ఖర్గే సంతాపం ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉదాసీనతే కారణమని ఆరోపించారు. -
ఆడిటర్ వెంకటేశ్వర్లు కీలక పాత్ర...సంచలన నిజాలు బయటపెట్టిన ఏఏజీ పొన్నవోలు..!
-
ప్రాణాలకు తెగించి కరెంట్ ఇచ్చిన లైన్‌మ్యాన్
-
ముమ్మాటికీ హత్యాయత్నమే
సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే. ఆయన్ని హతమార్చాలనే కుట్రతోనే నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ నివేదిక ఇచ్చింది. చార్జిషీట్లోనూ ఇదే పేర్కొంది. అంతకు ముందు సిట్ కూడా ఇదే చెప్పింది’ అని ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. కానీ, ఓ వర్గం మీడియా క్రియేటివ్ సెన్సేషన్ కోసమే కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి తెస్తోందని, దర్యాప్తు అధికారుల నివేదికకు విరుద్ధంగా ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంకటేశ్వర్లు బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. నిందితుడే స్వచ్ఛందంగా అంగీకరించాడు నిందితుడు శ్రీనివాసరావు గతంలో బెయిల్‌పై విడుదలైన తర్వాత తన న్యాయవాదితో (ఇప్పుడున్న న్యాయవాదే) కలిసి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్పప్పుడు ఆయనపై తానే దాడి చేశానని స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఇప్పుడు అదే న్యాయవాది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఆయుధాన్ని సమకూర్చారంటూ కొత్త వాదన తెరపైకి తేవడం సిగ్గుచేటు. న్యాయ స్థానంలో దాఖలు చేసిన పత్రాల్లోని విషయాన్ని చూడాలి తప్ప, కోర్టులో జరగనివి, జరిగినవి చెప్పడం కచ్చితంగా కోర్టు ధిక్కరణే. దీనికి బాధ్యులు చర్యలు ఎదుర్కోక తప్పదు. సీఎం జగన్‌పై హత్యాయత్నంలో నిందితుడు శ్రీనివాసరావు ఒక ఆయుధం మాత్రమే. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల హస్తం లేకుండా ఈ ఘటన జరగడానికి అవకాశం లేదనడానికి అనేక అనుమానాలు ఉన్నాయి. కేవలం దర్యాప్తును, కోర్టు విచారణను తప్పుదోవ పట్టించడానికి, రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయడం న్యాయం కాదు. మీడియాతో సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు కోడి కత్తి అంటూ కేసు తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఓ పత్రిక (ఈనాడు) మొదటి నుంచీ వ్యవహరిస్తోంది. ఘటన జరిగిన వెంటనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడు జె.శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అని ప్రకటించారు. సానుభూతి కోసమే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న డీజీపీ ఏకపక్షంగా ప్రకటించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఓ వర్గం మీడియా సైతం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన (2018 అక్టోబరు 25) మర్నాటి నుంచే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కథనాలు ప్రచురించింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఏకపక్షంగా రాసేశారు. ఆ దాడిలో వైఎస్ జగన్‌కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ కత్తి మెడలో దిగి ఉంటే ప్రాణాలు పోయేవని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ, ఓ ప్రతిక (ఈనాడు) మాత్రం వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. బాధితుడైన వైఎస్ జగన్‌ను అవహేళన చేస్తోంది. బ్లేడ్లతోనే ఎన్నో హత్యలు చేస్తున్నారు. కోడి కత్తి చిన్నగా ఉన్నా అత్యంత పదునుగా ఉంటుంది. కానీ కేసు తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రతిసారీ కోడి కత్తి అంటూ ఓ ఆయుధాన్ని కేసుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. దాడి నాటి దృశ్యం కేసులున్న వ్యక్తికి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఎలా? నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ విమానాశ్రయం రెస్టారెంట్ ఫ్యూజన్ ఫుడ్స్‌లో ఉద్యోగంలో చేరడంతోనే ఈ కుట్రకు బీజం పడింది. వాస్తవానికి విమానాశ్రయంలో పనిచేసే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేస్తేనే ఉద్యోగంలో చేర్చుకోవాలి. శ్రీనివాసరావుకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఎన్వోసీ ఎవరు ఇచ్చారన్నది కీలకంగా మారింది. శ్రీనివాసరావుపై 2017లో అప్పటి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఓ కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్తో పాటు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అంటే అతనికి నేర చరిత్ర ఉన్నట్టే. పైగా, అతన్ని రెస్టారెంట్లో చేర్పించడానికి ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఆతృత కనబరచడం గమనార్హం. శ్రీనివాసరావుపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులు లేవని ఆ పోలీస్ స్టేషన్ అధికారి ఎన్వోసీ ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో అతనిపై కేసులు ఉన్నాయో లేవో వారికి తెలియదని చెప్పినట్టే. కానీ హర్షవర్ధన్ చౌదరి మాత్రం శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి నేర చరిత్ర లేదని తానే సొంతంగా నిర్ధారిస్తూ ఎన్వోసీ సమర్పించారు. ఏ ప్రాతిపదికన ఆయన అలా చెప్పారు? అంటే శ్రీనివాసరావు నేర చరిత్రను గోప్యంగా ఉంచుతూ డీజీసీఏను తప్పుదోవ పట్టిస్తూ మరీ ఎన్వోసీ ఇచ్చారు. ఇందులో కచ్చితంగా కుట్రకోణం ఉంది. సాక్ష్యం చెప్పడానికి రానని సీఎం చెప్పలేదు ఎన్ఐఏ దర్యాప్తు అనంతరం తొలి చార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో పెద్ద కుట్రకోణం దాగి ఉందని, తదుపరి దర్యాప్తు చేపడతామని పేర్కొంది. తొలుత 39 మంది సాక్షులను తూతూమంత్రంగానే విచారించి వదిలేసింది. 2019 జనవరి 23న చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సాక్షిని కూడా విచారించలేదు. ఒక్క డాక్యుమెంట్‌ను కూడా సేకరించలేదు. సిట్ అధికారులు ఇచ్చిన రికార్డులను మాత్రమే 2019 జూలై 23న కోర్టులో దాఖలు చేశారు. తాజాగా కొత్త అంశాలు వెలుగులోకి రాలేదని మాత్రమే కోర్టులో చెప్పింది. దర్యాప్తు అవసరం లేదని ఎక్కడా రాయలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఇకపై ఎన్ఐఏ విచారణ అవసరం లేదని చెప్పినట్టు రాస్తోంది. ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రానని ఎక్కడా చెప్పలేదు. తన సాక్ష్యం రికార్డు ప్రక్రియలో ప్రజలకు అసౌకర్యం కులుగుతుందని మాత్రమే చెప్పారు. అడ్వొకేట్ కమిషన్ ద్వారా సాక్షులను విచారించే అవకాశం ఉందని, దాని ప్రకారం తనను విచారించాలని అనుమతి కోరుతూ ఎన్ఐఏ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కూడా వక్రీకరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ కోరిక మేరకే విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపైనా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాలు విశాఖ ఎన్ఐఏ న్యాయస్థానానికి, మిగిలిన జిల్లాల్లోని కేసుల విచారణ పరిధి విజయవాడ న్యాయస్థానానికి ఉంటుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సైతం జీవో ఇచ్చింది. కుట్రకోణం ఉంది.. అనుమానాలివే తనపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందని ఈ కేసులో బాధితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు బలాన్ని చేకూరుస్తూ స్పష్టమైన అంశాలను ప్రస్తావించారు. నేర చరిత్ర ఉన్న నిందితుడు శ్రీనివాసరావును విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఉద్యోగంలో చేర్పించడం, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి నిందితుడు ఆయుధాన్ని అక్రమంగా తీసుకురావడం, ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి టీడీపీ నేత కావడం మొదలైన అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కుట్ర కోణాన్ని, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి హత్యాయత్నం వెనుక కుట్రను ఛేదించాలని, దాని వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపున ఎన్ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాం. ఎన్ఐఏ సమగ్రంగా దర్యాప్తు చేయాలనేదే మా వాదన. అందులో మేం చెప్పిన అంశాలివీ.. ♦ విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరికి, నిందితునికి ఉన్న సంబంధం ఏమిటి? ♦ నిందితుడు శ్రీనివాసరావుపై గతంలో కేసులు ఉన్నప్పటికీ, విమానాశ్రయంలోని రెస్టారెంట్లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో చెప్పిన విషయం వాస్తవమే కదా! ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు? ♦ హర్షవర్థన్ చౌదరికి విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? ♦ హర్షవర్థన్ చౌదరి, నారా లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ♦ ఎన్ఐఏకి రికార్డు ఇవ్వొద్దని సిట్ దర్యాప్తు అధికారి శ్రీనివాసరావును అప్పటి డీజీపీ ఎందుకు ఆదేశించారు? కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? ♦ స్థానిక పోలీసులు బయోమెట్రిక్ హాజరు మిషన్‌ను సీజ్ చేసి వివరాలు సేకరించగా అందులో నిందితుడు శ్రీనివాసరావు పేరు నమోదు కాలేదు. హర్షవర్ధన్ కూడా పేరు ఎంట్రీ చేయలేదని చెప్పారు. కానీ, ఎన్ఐఏ దగ్గరికి వచ్చేసరికి బయోమెట్రిక్ హాజరులో నిందితుడు అక్కడే పని చేస్తున్నట్టు, దాడి జరిగిన రోజు కూడా అక్కడే ఉన్నట్టు చెప్పారు. ఇవి పరస్పర విరుద్ధ అంశాలు. ♦ అదే రోజు విమానాశ్రయం లాంజ్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదు? -
పక్కా ప్లాన్ ప్రకారమే కత్తితో దాడి: న్యాయవాది వెంకటేశ్వర్లు
సాక్షి, విజయవాడ: విశాఖ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసుపై సీఎం తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వెల్లడించారు. కాగా, సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నంపై కేసులో ఎన్ఐఏ 39 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు ఎన్ఐఏకి సిట్ వివరాలు అప్పగించలేదు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉంది. 2017లో శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీనివాస్ పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసింది. నాటి డీజీపీ ఎన్ఐఏకి రికార్డ్ చేయవద్దని సిట్‌కి ఆదేశాలు ఇచ్చారు. రికార్డులు ఎన్ఐఏకి పోలీసులు మొదట అప్పగించలేదు. ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?.. ఎయిర్‌పోర్టు అథారిటీకి శ్రీనివాస్ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. శ్రీనివాస్‌ది ఎయిర్‌పోర్టులో ఇల్లీగల్ ఎంట్రీ. కత్తితో ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?. శ్రీనివాస్‌పై కేసు ఉన్నందుకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేసే నాటికి శ్రీనివాస్‌పై కేసు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్ వేశారు. ప్లాన్ ప్రకారమే దాడి.. సీఎం జగన్‌పై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది. సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఎన్ఐఏ కూడా చెప్పింది. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు -
ఘోర రోడ్డు ప్రమాదం.. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ మృతి
సాక్షి, తిరుపతి: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి మర్రిగుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వెంకటగిరి జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ నాయకులు కోలా వెంకటేశ్వర్లు(45) మృతి చెందారు. ఆయన కారు ఇనుప లోడు లారీని ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు తిరుపతి నుంచి వెంకటగిరి వెళ్తుండగా రేణిగుంట యోగానంద కాలేజి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. అదే కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాజుల మండ్యం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: అనంతలో విషాదం: కరెంట్ తీగలు తెగి కూలీల దుర్మరణం -
వీథి నుంచి వెండి తెరకు
మతి స్థిమితం తప్పి వీధుల్లో తిరిగే వారికి ఎవరైనా ఆహారం ఇస్తారు. కొందరు బట్టలు ఇస్తారు. మరికొందరు షెల్టర్ ఏర్పాటు చేస్తారు. కాని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక దీనురాలిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెను తన కూతురిగా చూసుకున్నాడు. వైద్యం చేయించాడు. మనిషిగా మార్చాడు. ఆ మనిషి కథతో ‘మనసున్నోడు’ అనే సినిమా తయారవుతోందిప్పుడు. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. సీన్ –1 సరిగా చూస్తే తప్ప ఆ చెత్త కుప్ప దగ్గర ఆమె ఉన్నట్టు తెలియదు. ఆ చెత్త మధ్య ఆమె కూడా ఒక చెత్త కుప్పలా ఉంది. చెత్తలోనే ఏరుకు తింటోంది. అక్కడే నిదురిస్తుంది. ఏ ఊరో తెలియదు. ఏ భాషో తెలియదు. ఏమీ మాట్లాడదు. ఒక పాతికేళ్లు ఉంటాయి. కాని విధి కొట్టిన దెబ్బలకు దిమ్మరిగా మారింది. కట్ చేస్తే... సీన్ –2 కోదాడ వ్యవసాయ మార్కెట్. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె తెలుగు మాట్లాడుతోంది. స్వస్థతతో ఉంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఉద్యోగం చేస్తూ నెలకు 15 వేలు సంపాదిస్తోంది. నాడు చెత్తకుప్పల్లో తిరిగిన యువతి నేడు ప్రయోజకురాలు. అంతేనా? ఆమె కథతో సినిమా కూడా తయారవుతోంది. ఎంత ఆసక్తికరం ఈ కథ..! ఎవరీ యువతి... ?! 2001. తెలంగాణలోని కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు. చెప్పులు కుట్టుకునే పల్లే వెంకటేశ్వర్లు మధ్యాహ్నం పని పూర్తయ్యాక సామాను అంతా సర్దుకుని కూచున్నాడు. అంతలో అతని పక్కన విసురుగా వచ్చి ఓ రాయి పడింది. ఎటునుంచి పడిందా అని చూసిన అతనికి చింపిరి జుత్తు, చిరిగిన దుస్తులు, దయనీయమైన పరిస్థితిలో మతి స్థిమితం లేని ఓ యువతి కనిపించింది. మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడవేసిన ఆహారం కోసం పందులు, కుక్కలతో పోటీ పడి ఏరుకొని తింటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఆరా తీయబోయాడు. కాని అర్థంకాని పిచ్చి మాటలు.. చేష్టలతో అతనిపైనే రాళ్లురువ్వసాగింది. ఓపికతో ఆమెకు నచ్చజెప్పి తాను తెచ్చుకున్న అన్నం పెడితే ఆబగా తినేసింది. ఎండకు ఎండుతూ.. వానకి తడుస్తూ ఉన్న ఆ యువతిని ఇలా రోడ్డు మీద వదిలి వేయడం కంటే ఇంటికి తీసుకెళ్లడం మంచిదని భావించాడు. కుటుంబంలో ఒకరిగా.. మానసిక ఆరోగ్యం కోల్పోయిన ఆ అభాగ్యురాలిని ఇంటికి తెచ్చిన వెంకటేశ్వర్లును చూసి భార్య నిరోధించలేదు. కాకుంటే ‘ఇప్పటికే ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న మనం భరించగలమా!’ అని భయపడింది. కానీ మానవత్వంతో ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంది. చింపిరి జుత్తు కత్తిరించి, స్నానం చేయించి.. తమ పిల్లల బట్టలు వేసింది. పిల్లలకు ఇక నుంచి ఈ అక్క మీతోనే ఉంటుందని ఆ భార్యాభర్తలు చెప్పారు. మానసికచికిత్స చేయించమని కొంతమంది సాయమందించడంతో హైద్రాబాద్‌లోని ‘ఆశ’ మానసిక చికిత్సాలయం వద్దకు తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. ఏడాది పాటు అక్కడే ఆ యువతికి ఉచిత చికిత్సను అందించారు. దీంతో ఆమెకు పునర్జన్మ లభించింది. ముంబయ్‌కి వెళ్లిన కథ చికిత్స తరువాత తన వివరాలను ఒక్కొక్కటి చెప్పసాగిందామె. తన పేరు అముద అని, తండ్రి నారాయణ నాడర్ అని, తమది తమిళనాడులోని తిరునల్వేలి’ అని చెప్పింది. బతుకుదెరువు కోసం నలుగురు అక్కాచెల్లెళ్లం కలిసి ముంబాయిలోని ధారవికి వెళ్లామని, అక్కడ దయాసదన్ లో 10 తరగతి వరకు చదువుకొని మాంటిస్సోరీలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. తరువాత తమిళనాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, భర్త వేధింపులు భరించలేక పురుగులమందు తాగానని, ఆ తరువాత ఏమైందో.. తాను కోదాడకు ఎలా వచ్చానో తెలియదని చెప్పడంతో కథ అంతటితో ఆగిపోయింది. అయినవారికి కలపాలని వెంకటేశ్వర్లు ముంబాయిలోని దయాసదన్ కు ఉత్తరం రాసి, అముద బంధువుల కోసం ఆరా తీసాడు. కాని వారు అక్కడ లేరని, ఒక చర్చిలో అముద చెల్లెలు ఉంటుందని చెప్పడంతో ఆమెను తీసుకొని ముంబయి వెళ్లాడు. అక్కను గుర్తుపట్టిన చెల్లెలు తామే ఇతరుల వద్ద బతుకుతున్నామని, ఆమెను ఆదరించలేమని చెప్పడంతో అక్కడి నుండి తిరిగి వచ్చారు. భర్త ఆచూకి కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక అముద తన కూతురే అనుకొని తన దగ్గరే ఉంచుకొని ఉన్న దాంట్లో పోషించసాగాడు. శాశ్వత ఆసరా! తనకు వయస్సు పైబడడం, చికిత్స కోసం నెలకు దాదాపు 1500 రూపాయలు అముదకు అవసరం కావడంతో ఆమెకు శాశ్వత ఆసరా కల్పించడానికి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేశాడు. 10 సంవత్సరాల క్రితం ‘సాక్షి’ అముద గాథకు అక్షర రూపం ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ అముదకు విద్యావలంటీర్‌గా అవకాశం కల్పించాడు. కాని సెలవులు వచ్చిన సమయంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే దాదాపు 6 సంవత్సరాలు పని చేసింది. 2016వ సంవత్సరంలో మంత్రి హరీష్‌రావు చొరవతో కోదాడలోని వ్యవసాయమార్కెట్ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు 15 వేల రూపాయల వేతనం వస్తుండడంతో అముద బతుకుబండి సాఫీగా సాగుతోంది. వెండి తెరపైన అముద కథ ఎన్నో మలుపులు తిరిగిన అముద జీవితాన్ని 2008వ సంవత్సరంలో ‘సాక్షి’లో వచ్చిన కథనం చూసిన పశ్చిమగోదావరి జిల్లా వాసి వేల్పుల నాగేశ్వరరావు అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కథను ‘మళ్లీ మరో జన్మంటూ ఉంటే’ పేరుతో నాటకంగా మార్చారు. 2012 నుండి పలుచోట్ల దీన్ని ప్రదర్శించారు. తాజాగా తానే సినిమాగా వెండితెరకెక్కించాలని భావించి నాలుగు నెలల క్రితం కోదాడకు వచ్చి అముదను, ఆమెకు కొత్త జీవితాన్ని అందించిన పల్లే్ల వెంకటేశ్వర్లును కలిశారు. సినిమాలో వారి పాత్రలలో వారే నటించమని కోరారు. కాని వారు ఒప్పుకోకపోవడంతో కొత్త వారితో సినిమా షూటింగ్ ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అశ్వారావుపేట సమీపంలో పలుగ్రామాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు నాగేశ్వరరావు తెలిపారు. మతి స్వాధీనం తప్పి తిరిగే దీనులకు వెంకటేశ్వర్లు వంటి బాంధవులు దొరికితే వారి జీవితం ఇలా తప్పక బాగుపడుతుంది. చిత్రం షూటింగ్ సన్నివేశం సంరక్షకుడు పల్లే వెంకటేశ్వర్లుతో అముద – అప్పిరెడ్డి, సాక్షి, కోదాడ -
ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్ ఘటనలో గాయపడిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్‌లకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ న్యూరోసర్జన్ పి.విశ్వక్‌సేన్‌రెడ్డిని సిర్పుర్కర్ కమిషన్ గురువారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ ఆయనను ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 6న ఉదయం 8 గంటలకు కేర్ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు స్పృహలోనే ఉన్నారని విశ్వక్‌సేన్‌రెడ్డి వివరించారు. కుడి కను బొమ్మపై 2 సెంటీమీటర్ల పొడవు గాయమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు.. ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో పారాసెటమాల్ ఇచ్చామని, కడుపులోని మంటను తగ్గించే పాంటోప్, ఐవీ ఫ్లూయిడ్స్‌తో చికిత్స చేశామని కమిషన్‌కు తెలిపారు. ఇవి తప్ప వేరే ఏ రకమైన చికిత్స చేయలేదని, దీనిని రికార్డ్‌లోనూ నమోదు చేశామని వివరించారు. నొప్పి, వాపును తగ్గించే వోవెరాన్, టీటీ ఇంజెక్షన్లను కానిస్టేబుల్ బయటే ఇప్పించుకున్నారని, కేర్ ఆస్పత్రిలో ఇవ్వలేదని తెలిపారు. గాయం 2 సెంటీమీటర్లు ఉన్నట్టుగా ఎలా లెక్కించారని కమిషన్ ప్రశ్నించగా.. గాయాన్ని కొలిచే ఉపకరణం (క్యాలిబర్) తన వద్ద లేదని, కేవలం ఓ అంచనాతోనే చెప్పానని, దాన్నే రికార్డ్‌లో నమోదు చేశానని సమాధానమిచ్చారు. ‘సంచలనం సృష్టించిన లేదా మెడికో లీగల్ (ఎంఎల్సీ) కేసుల్లో డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రుల గాయాల గురించి స్పష్టంగా రాయాల్సి ఉంటుందని.. మరి మీరెందుకు నమోదు చేయలేద’ని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం సమాధానం చెప్పలేనంటూ డాక్టర్ విశ్వక్‌సేన్‌రెడ్డి దాటవేశారు. అంతర్గతంగా రక్తస్రావమైతేనే వ్యక్తి మరణిస్తారని, వేరే ఇతర సందర్భాల్లో అలా జరగదని చెప్పిన విశ్వక్సేన్.. కేర్ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లకు అలాంటి తీవ్ర గాయాలేవీ లేవని, సాధారణ గాయాలే ఉన్నాయని వివరించారు. షాద్‌నగర్ సీహెచ్‌సీ రికార్డ్‌లో కానిస్టేబుల్ స్పృహ కోల్పోయారని ఉందని, అందువల్లే ఐసీయూలో అడ్మిట్ చేశామని, అంతే తప్ప చికిత్సలో ఆ రికార్డులను అనుసరించలేదని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోజే ఉదయం 8:30 గంటలకు ఐసీయూలో చేర్చుకున్నామని.. మూడు రోజుల పాటు చికిత్స అందించామని తెలిపారు. ఫోన్లో చెప్తే రికార్డ్‌లో నమోదు మంగళవారం షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ (సీహెచ్‌సీ) సర్జన్ గోనె నవీన్ కుమార్ విచారణ అసంపూర్తిగా ముగియగా.. గురువారం ఉదయం తిరిగి కొనసాగించారు. కేర్ ఆస్పత్రి నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లకు సంబంధించిన డిశ్చార్జి సమ్మరీని ఎవరూ తన వద్దకు తీసుకురాలేదని.. ఎవరో ఫోన్లో చెబితే ఎంఎల్సీ రికార్డ్‌లో నమోదు చేశానని నవీన్‌కుమార్ తెలిపారు. డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రులకు ఎక్స్‌రే తీసినట్టు లేదని.. కానీ డాక్టర్స్ నోట్లో మాత్రం ఉందేమిటని ప్రశ్నించగా.. ‘డాక్టర్స్ నోట్‌ను ఇప్పుడే తొలిసారి చూస్తున్నా’నని నవీన్ సమాధానమిచ్చారు. కేర్ ఆస్పత్రి రికార్డుల్లో అరవింద్‌గౌడ్‌కు ఎడమ భుజం మీద సన్నని వెంట్రుకలాంటి చీలిక ఏర్పడి ఉందని, దాన్ని మీరెందుకు షాద్‌నగర్ ఎంఎల్సీ రికార్డ్‌లో నమోదు చేయలేదని ప్రశ్నించగా.. డాక్టర్ నవీన్ సమాధానం ఇవ్వకుండా 15 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు. ఎన్కౌంటర్లో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు నడుచుకుంటూ షాద్‌నగర్ సీహెచ్‌సీకి వచ్చారని నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ముందు వాంగ్మూలం ఇచ్చిన నవీన్ కుమార్.. త్రిసభ్య కమిటీ ముందు మాత్రం స్పృహ కోల్పోయి వచ్చారని తెలిపారు. పైగా ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనలేదు. దీనిపై కమిషన్ ప్రశ్నించగా.. అన్నింటికీ ‘ఏమీ లేదు’అంటూ సమాధానం ఇచ్చారు. నేడు సజ్జనార్ విచారణ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించనుంది. ఈ మేరకు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు ఇతర సాక్షుల విచారణ సుదీర్ఘంగా కొనసాగడంతో సజ్జనార్ విచారణ వాయిదా పడింది. కమిషన్ మూడు రోజుల పాటు సజ్జనార్‌ను విచారించనున్నట్టు సమాచారం. -
27 మందికి పోలీస్ పతకాలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సేవా పతకాలు తెలంగాణకు చెందిన 27 మంది పోలీసు అధికారులకు దక్కాయి. మరో ముగ్గురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ఈ పతకాలను అందించనుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాలు (పీపీఎంజీ), 628 మందికి పోలీస్ శౌర్య పతకాలు (పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 662 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ పతకాలు అందుకోనున్నారు. కాగా, పతకాలను అందుకోనున్న పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. పోలీస్ సేవా పతకాలు... ఇంటెలిజెన్స్ డీఐజీ శివకుమార్, మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్, వరంగల్ ఏసీపీ ఎం.జితేందర్‌రెడ్డి, మాదాపూర్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, పీటీసీ డీఎస్పీ ఎం.పిచ్చయ్య, టీఎస్ఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ కె. సంపత్‌కుమార్ రెడ్డి, ఎస్ఐబీ ఏఎస్ఐలు ఆనంద్‌కుమార్, డి. చంద్రశేఖర్ రావు, గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ ఆరిఫ్ అలీ, కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ ఎం. అనిల్‌గౌడ్‌కు సేవా పతకాలకు ఎంపికయ్యారు. పీఎంజీ విభాగంలో... గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి జిల్లాల్లో 2016, 2017, 2018లలో జరిగిన ఎన్కౌంటర్లలో పాల్గొని ధైర్యసాహసాలు ప్రదర్శించిన 14 మందికి పోలీస్ శౌర్య పతకాలను ప్రకటించారు. వీరిలో ఆర్ఎస్ఐ, కానిస్టేబుళ్లతో పాటు ఓ ఎస్ఐ కూడా ఉన్నారు. శౌర్యపతకాలు పొందిన వారిలో ఆర్ఎస్ఐ పి.కె.ఎస్. రమేష్, కానిస్టేబుళ్లు ఎన్.లయ, ఎం.పాపారావు, ఎం. భాస్కర్‌రావు, జి. ప్రతాప్‌సింగ్, కె. వెంకన్న, మాలోత్ రాములు, బి. మరియాదాస్, కె. పరుశురాం, అబ్దుల్ అజీమ్, కె.తిరుపతయ్య, పి.సత్యనారాయణ, వి.రమేష్‌తో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ ఉన్నారు. జైళ్ల విభాగంలో ముగ్గురికి... జైళ్ల విభాగంలో దేశ వ్యాప్తంగా 41 మందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించారు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురికి పతకాలు దక్కాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ మ హేంద్ర కృష్ణమూర్తి, చీఫ్ హెడ్‌వార్డర్ బి.నారాయణ, హెడ్ వార్డర్ వేముల జంగయ్య పతకాలను అందుకోనున్నారు. -
సామాజిక చలనాలకు కవిత్వ సాక్షి
మనసున పట్టనివ్వని అనేక తండ్లాటలు, నిలువనియ్యని మనాదులు, సిరిసిల్లా నుండి మొదలై తెలంగాణమంతటా కలెదిరిగి, దేశాన్ని పులుకు పులుకున చూసి కవిత్వ వాక్యమయ్యే మొసమర్రనితనం జూకంటి. ఎప్పుడూ చల నంలో ఉండే భూమికి ఎన్ని రుతువులున్నాయో, నిరంతరం ఎన్ని కోతలున్నాయో అన్ని జూకంటి కవిత్వంలోనూ తిరుగుతున్నాయి. దేశం అత్య వసర పరిస్థితిలోకి నెట్టబడ్డ నాటి నుండి నేటి దాకా సమాజ చలనాన్ని దుర్భిణితో చూస్తున్నది జూకంటి కవిత్వం. ప్రవహించని ప్రతి మనిషి మూలకు పడ్డ సామానుగా భావించే జూకంటి కవిత్వం నిండా ఒక చలన శీలత, భావ గాఢత, అభివ్యక్తి సాంద్రత ముప్పిరిగొంటాయి. జూకంటికి వ్యవస్థలో జరుగుతున్న మార్పు లకు కారణభూతమైన రాజకీయ శక్తి పాత్ర పట్ల ఒక చూపు ఉంది. అట్లానే, అది అధికారాన్ని సొంతం చేసుకొని చేస్తున్న పనుల వెనుక ఉన్న స్వార్థాల పట్ల లోచూపు ఉంది. తత్ఫలితంగా జరుగుతున్న మనిషి లోపలి కల్లోలం, గ్రామం లోపలి విధ్వంసం, జీవన సంబంధాల విచ్చిన్నం, అభివృద్ధి పేరుతో జరిగే అరాచకం, రాజ్యపు దళారీతనం పట్ల ఎడతెగని దుఃఖం, నిరసన ఉన్నాయి. అందుకే, అతడు సమూహం కావాలనుకుంటాడు. సమూహం కానివాడు శాపగ్రస్తుడే, ప్రపంచం కానివాడు నిలవనీరే అవుతాడంటాడు. నిరంతరం పాద ముద్రల చలనంలోకి ఇంకిపోయి, ఒక ఉద్యమ కొనసా గింపుగా ఉండాలనుకుంటాడు. పాతాళ గరిగెతో మొదలై పదిహేను కవితా సంపుటాలను వెలువరించిన జూకంటి ఒకే నిబ ద్ధతతో తేజాబ్ పట్టుకొని నడుస్తున్నాడు. అది అతనికి ప్రజల పట్ల ఉండే నిబద్ధత. సిరిసిల్లా కల్లోలాన్ని కనులతో చూసి, వలసల దుఃఖాన్ని మిత్రులతో పంచుకొని చెంచరిల్లె హృదయం. గాంధీ చౌరస్తాలో ఉదయం పూట కూలి కోసం వెతుక్కునే వారిని చూసి విలవిలలాడిపోతాడు. దేశం చౌరస్తాలో ఊరు లేబర్ అడ్డామీద నిలు చున్న కూలి కావడాన్ని చూసి రంధి పడుతాడు. ఈ మూడు నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ప్రధాన పరిణామాలను జూకంటి కవిత్వం ద్వారా తెలుసుకోవచ్చు. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు తదనంతర పరిస్థితులు, తెలంగాణలో విప్లవ పోరాటాల కల్లోల సమయాలు, ప్రపం చీకరణ దాని పరిణామాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వివిధ దశలు, అస్తిత్వ ఉద్యమాల ఛాయలు చాలా ప్రబలంగా జూకంటి కవిత్వంలో కనిపిస్తాయి. అంతా రాజకీయమే, రాజకీయం కాని దంటూ రాజ్యంలో వుండనే వుండదు, రాజ కీయం లేకుంట మనిషి వుండనే వుండడు అన్న ఎరుకతో కవిత్వాన్ని రాస్తాడు. పొలం నా బలం బలగం పొలమే నా స్వస్థలం అంటాడు. తల్లికొంగు నీడ నుంచి తరలిపోతున్న కొడుకు లను, కడుపులో బాధ నులి పెట్టగా గెదిమి కొట్ట బడుతున్న బిడ్డల వలసలను తలచుకొని తండ్లా డుతాడు. ఊళ్ళను ఖాళీ చేయించి ప్రాజె క్టులు నిర్వాసితులను చేస్తున్న సందర్భంలో ‘నా రెండు కనుగుడ్లను తీసి నా అరచేతుల్లో ప్రదర్శిస్తున్నట్టు కుప్పకూలిన పాత ఇల్లు/ దేన్నైనా కూలగొట్టడం అల్కగనే పునర్నిర్మించడమే బహుకష్టం’ అని గోసను అక్షరబద్ధం చేస్తాడు. ‘ప్రజల చేత చేతు లారా ప్రజలు స్వాధీన పరచిన అధికారంతో, ప్రజల కొరకు ప్రజల క్షేమం కొరకు, విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వం దళారై భూములు వేలం వేయబడును’ అని వాస్తవాన్ని పలుకుతాడు. ‘రాజ్యాంగంలో ఎలుకలు పడ్డయ్ /శాసన సభల్లో పందికొక్కులు సొర్రినయ్’ తీవ్ర నిరసన స్వరాన్ని వినిపిస్తాడు. ‘గ్రామం నా నామం/ ఊరు నా చిరునామా/ కన్నీరే నా వీలు నామా’ అని తన కవిత్వానికి క్షేత్రం ఊరుగా ప్రకటించుకుంటాడు. ‘కంట కన్నీరు ఉబికిన ప్పుడు, గుండె మండి కోపమచ్చినప్పుడు, ఆమె మనసు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు కవితగా నవ నవలాడిపోతాను’ అని నవనవంగా నాలుగు దశాబ్దాలుగా కవిత్వాన్ని రాస్తూనే ఉన్నాడు జూకంటి జగన్నాథం. – బూర్ల వేంకటేశ్వర్లు (జూకంటి జగన్నాథంకు నేడు ‘సినారె సాహితీ పురస్కార’ ప్రదానం సందర్భంగా) -
ఎమ్మెల్యే బాజిరెడ్డి వియ్యంకుడు మృతి
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నేత వెంకటేశ్వర్లు(వెంకులు) కరోనాలో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మికుల విభాగానికి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సీనియర్ కార్మిక నాయకుడు అయిన వెంకటేశ్వర్లుకు రాజకీయంగా జాతీయ స్థాయిలో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయన మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, కర్షక ప్రతినిధులు సంతాపం తెలిపారు. ఇటీవల వెంకటేశ్వర్లుకు కరోనా వైరస్ సోకగా, హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈయన చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస వడిచారు. ఇప్పటికే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కూడా కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. సీనియర్ రాజకీయ నాయకుడు వెంకటేశ్వర్లు మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలియజేశారు. గత ముప్పై ఏళ్లుగా కార్మిక, విద్యార్థి నాయకుడుగా, రాజకీయవేత్తగా, వెంకులు చేసిన ఎనలేని సేవలకు సంబంధించి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఎంతో ఆత్మీయంగా ఉండే వెంకులు మృతి తనకు తీరని లోటని డి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ‘కరోనా’ భయం జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుండడంతో ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు భయం పట్టుకుంది. పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘కోవిడ్’ సోకుతుండడంతో కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాలంటేనే ఉద్యోగులు జంకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తమకూ వ్యాపిస్తుందేమోనని వారికి గుబులు పట్టుకుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎక్కువ ప్రభుత్వ శాఖలు ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టరేట్‌కు జనం తాకిడి ఉండడంతో ప్రతిరోజూ భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రగతిభవన్ మెట్లు ఎక్కాలంటే జంకుతున్నారు. ఆఫీసుల్లో ఏ వస్తువును, టేబుల్, ఫైల్ ముట్టుకోవాలన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దూరం దూరంగా ఉండి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్ ఉదయం, సాయంత్రం వేళ్లలో చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. అయితే అధికారులకు వినతులు సమరి్పంచడానికి ప్రజలు కార్యాలయాల్లోకి రాకుండా కలెక్టరేట్లో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటు అన్ని శాఖల ఉద్యోగులు కూడా అప్రమత్తమయ్యారు. బయటి వ్యక్తులకు రాకుండా కార్యాలయాల ప్రధాన ద్వారాలను మూసి ఉంచుతున్నారు. ప్రగతిభవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు ఎస్సీ కార్పొరేషన్, సివిల్ సప్లయి, సివిల్ సప్లయి కార్పొరేషన్, డీఆర్డీఏ, డ్వామా కార్యాలయాలున్నాయి. పక్కనే అక్షర ప్రణాళిక భవన్లో ఐకేపీ, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య, సీపీవో, సాక్షర భారత్ కార్యాలయాలున్నాయి. ఇక కలెక్టరేట్లో ప్రధానంగా కలెక్టర్ పరిపాలనా విభాగం (డీఆర్వో కార్యాలయం) ఉంది. దాదాపు కలెక్టరేట్లో పదికి పైగా ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. కలెక్టరేట్‌కు ఆనుకునే వెల్నెస్ సెంటర్, వ్యవసాయ శాఖ, టీఎన్జీవోస్ భవన్, ఎస్బీఐ బ్యాంకు, ఇతర వాణిజ్య సముదాయాలున్నాయి. అయితే ప్రధానంగా కలెక్టరేట్లోని ఆయా శాఖల్లో ఉద్యోగులు కలిపి 400 మందికి పైగా ఉంటారు. ప్రతినిత్యం ఆఫీసులకు వచ్చి వెళ్తున్నారు. కార్యాలయాలన్నీ ఒకే దగ్గర ఉండడంతో కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఉద్యోగులు ఒక్కింత ఆందోళనలో ఉన్నారు. కొందరయితే సెలవులు పెట్టి ఆఫీసులకు రావడం లేదంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రగతిభవన్‌లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న సిబ్బంది పనిరోజులు తగ్గించాలని వేడుకోలు కరోనా భయంతో ఉద్యోగులు, అధికారులు ఆఫీసులకు రావడానికి భయపడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా విధులకు వెళ్లవద్దని కోరుతున్నారు. ఇంటి నుంచే పని చేసుకోండని ప్రాధేయపడుతున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి వారంలో మూడు రోజులు మాత్రమే పని కలి్పంచాలని ఇటీవల ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులందరికీ కరోనా టెస్టులు కూడా చేయించాలని కోరారు. డీఆర్వో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులైతే భయపడి తమకు టెస్టు చేయించాలని కలెక్టరేట్ ఏవోను ఇటీవల కలిసినట్లు తెలిసింది. రెవెన్యూ వర్గాల్లోనైతే ‘కరోనా’ మరింత కలవరపెడుతోంది. కలెక్టరేట్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను కాస్త తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం కలెక్టరేట్లోని అన్ని శాఖలతో పాటు ప్రగతిభవన్, ఎన్ఐసీ కార్యాలయాల్లో వైద్య శాఖ సిబ్బందితో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఇనుప గేట్లు, మెట్లు, జన సంచారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు. దీంతో ఉద్యోగులు కొంత సంతృప్తి చెందారు. పనిదినాలు తగ్గిస్తేనే మేలు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పనిదినాలు తగ్గించాలి. షిప్టుల వారీగా వారానికి కొంతమంది పనిచేసేలా, పనిచేస్తున్న రక్షణ చర్యలు తీసుకోవాలి. కార్యాలయాలకు బయటి వ్యక్తులు రాకుండా చూసి కార్యాలయాలు సానిటైజ్ చేయించాలి. ఉద్యోగులకు వారి కుటుంబాల ప్రాణాలు కూడా ముఖ్యం. – అలుక కిషన్, జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్ ఉద్యోగులందరికీ టెస్టులు నిర్వహించాలి రెవెన్యూ ఉద్యోగులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా పని చేస్తున్నారు. ప్రజలకు ఉద్యోగులకు మధ్య కొన్ని రోజుల పాటు సంబంధాలు లేకుండా చూడాలి. నెలలో పదిహేను రోజులు పనిదినాలు కలి్పంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. పని చేస్తున్న ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు జరపాలి. – రమణ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, రెవెన్యూ అసోసియేషన్ -
లింక్ ఓపెన్ చేయడంతో ఆమె బుక్కైపోయింది..!
సాక్షి, హైదరాబాద్; కష్టపడటం కంటే మోసగించడం ద్వారానే ఈజీగా మనీ సంపాదించొచ్చన్న దురాశతో కొంతమంది తప్పుడు మార్గాలను ఎంచుకుని జీవితాల్ని దుర్భరం చేసుకుంటున్నారు. అలాంటి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే పనుల్లో ఒకటి ఆన్లైన్ మోసం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రకమైన ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇలా ఆన్లైన్లో మోసం చేసి డబ్బులు సంపాదించడం..చేసిన తప్పు ఏదో రూపంలో బట్టబయలై నేరస్తులు కావడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నేరస్తుడిగా మారి మనిషిగా పతనమైపోవడానికి దురాశ దుఃఖానికి చేటన్న చిన్న లాజిక్‌ను మరచిపోవడమే. అలా ఓ ప్రబుద్ధుడు ఇతరుల డబ్బుల కోసం కక్కుర్తి పడి ఓ మహిళ ఫేస్బుక్ వివరాలు తస్కరించి, ఆమె స్నేహితులతో సదరు మహిళగానే చాట్ చేసి వారి నుంచి డబ్బులు తీసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఫిషింగ్ సైట్ నుంచి లింక్ పంపి.. కొద్దికాలం క్రితం బాధిత మహిళ ఫేస్బుక్ ఖాతాకు బాలాపూర్ మండలం జిల్లెలగూడ వాసి బత్తుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఓ ఫిషింగ్ వెబ్సైట్(స్పూఫ్ సైట్) నుంచి ఓ లింక్‌ను పంపించాడు. సదరు మహిళ ఆ లింక్‌ను ఓపెన్ చేయడంతో ఆమె ఫేస్బుక్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను అతడు సేకరించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి బాధిత మహిళ ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేయడంలేదు. ఇదే సమయంలో నిందితుడు వెంకటేశ్వర్లు బాధిత మహిళ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆమె స్నేహితులతో మహిళగా చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని, చికిత్స కోసం డబ్బులు సాయం చేయాలని కోరుతూ మెసేజ్‌లు పెట్టాడు. తమ స్నేహితురాలే సాయం కోరుతుందనుకుని ఆ మెసేజ్‌లకు స్పందించిన కొంతమంది అతడిచ్చిన బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు జమచేశారు. డబ్బుల పంపాలంటూ బాధిత మహిళ వ్యక్తిగత స్నేహితురాలికి మెస్సేజ్ రావడంతో ఈ విషయాన్ని నేరుగా బాధితురాలి దృష్టికి తీసుకెళ్లింది. ఫేస్బుక్ ఖాతాను బాధిత మహిళ ఓపెన్ చేసినా ఓపెన్ కాకపోవడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా..ఈ నేరానికి పాల్పడింది బీటెక్ చదివి ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ కంప్యూటర్ గ్రాఫిక్ కార్యాలయంలో పనిచేస్తున్న బత్తుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. దీంతో ఆదివారం అతడిని అరెస్టు చేశారు. బాధితమహిళనే కాకుండా ఇంకా ఎవరినైనా మోసం చేశాడా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, వెంకటేశ్వర్లు తను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు రాచకొండ సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ ఆశిష్ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సెల్‌కు కానీ, సోషల్ మీడియాలో గానీ లింక్‌లు వస్తే ఓపెన్ చేయవద్దని సూచించారు. -
షర్మిలపై దుష్ప్రచారం కేసులో నిందితుడి వ్యాజ్యం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వై.ఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన కేసులో నిందితుడు పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. షర్మిల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఏపీలోని ప్రకాశం జిల్లా వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. షర్మిల ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి సెక్షన్ 509 ఐపీఎస్, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. కేసులను కొట్టేయాలని కోరుతూ వెంకటేశ్వర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఓ మహిళపై అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెట్టారని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజారత్ తెలిపారు. ఓ సినీనటుడుతో సంబంధాలు అంటగడుతూ పోస్టింగ్‌లు పెట్టి ఆ మహిళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారన్నారు. ఇటువంటి విషయాలను తేలిగ్గా తీసుకోరాదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అవమాన భారం ఉసురు తీసింది!
► ఏసీబీ కస్టడీలో ఉన్న మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య ► అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి దూకిన వైనం ► నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఘటన ► రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఉదయమే పట్టుకున్నామన్న ఏసీబీ ► బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాల ఆందోళన సాక్షి, నిజామాబాద్: అవమాన భారం ఓ అధికారి ఉసురు తీసింది.. తాను తప్పు చేయకున్నా కావాలనే ఏసీబీకి పట్టించారనే మనస్తాపంతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సీహెచ్ వెంకటేశ్వర్లు(56) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల కస్టడీలో ఉన్న సమయంలోనే జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడతుండగా.. ఏసీబీ అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉదయం దాడి.. సాయంత్రం ఆత్మహత్య హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నిజామాబాద్‌లో కంఠేశ్వర్ ప్రాంతంలోని సత్యం అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. నిజామాబాద్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న డ్రైనేజీ, రోడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఆ పనులకు సంబంధించి బిల్లు మంజూరు కోసం రాములు అనే సబ్ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. వెంకటేశ్వర్లును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి ప్రకటించారు. తర్వాత ఆయనను స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తనకు మధుమేహం వ్యాధి ఉందని, మందుల కోసం ఇంటికి వెళ్లాలని వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను కోరారు. దీంతో అధికారులు సాయంత్రం 4 గంటల సమయంలో వెంకటేశ్వర్లును ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో బెడ్రూంలోకి వెళ్లిన ఆయన బాల్కనీ నుంచి కిందికి దూకేశారు. ఐదో అంతస్తు నుంచి పడడంతో ఆయన తలకు, ఇతర శరీరభాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటేశ్వర్లుకు భార్య నారాయణమ్మ, కుమార్తె ప్రవళిక, కుమారుడు కృష్ణ చైతన్య ఉన్నారు. కృష్ణ చైతన్య జీహెచ్ఎంసీలో సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వెంకటేశ్వర్లు మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకుని.. బోరున రోదించారు. తన భర్త లంచాలు తీసుకునే వ్యక్తి కాదని, ఎవరో ఇది కావాలనే చేసి ఉంటారంటూ నారాయణమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనతో ఆసుపత్రిలోనే సొమ్మసిల్లి పడిపోయారు. బాధ్యులైన అధికారులను అరెస్టు చేయాలి వెంకటేశ్వర్లు మరణ వార్త తెలిసిన వెంటనే మున్సిపల్, ఇతర శాఖల ఉద్యోగులు, టీఎన్జీవో, ఇతర సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలివచ్చారు. ఏసీబీ అధికారుల తీరును నిరసిస్తూ బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏసీబీ కస్టడీలో ఉన్న వెంకటేశ్వర్లు మృతికి కారణమైన ఏసీబీ డీఎస్పీని, సంబంధిత అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ విచారణ చేపడతాం ఏసీబీ కస్టడీలో ఉన్న వెంకటేశ్వర్లు ఆత్మహత్య ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపడతామని నిజామాబాద్ ఏసీపీ ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. ఆందోళన చేపట్టిన ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా వెంకటేశ్వర్లు భౌతికకాయానికి ఆదివారం న్యాయమూర్తి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా సేవలు వెంకటేశ్వర్లు స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా చీరాల. చాలా ఏళ్లుగా వారి కుటుంబం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో స్థిరపడింది. ఆయన గతంలో నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీర్‌గా, కమిషనర్‌గా పనిచేశారు. ప్రజారోగ్యశాఖలో నిజామాబాద్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశారు. సుమారు ఏడాదిన్నర నుంచి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మున్సిపల్ ఇంజనీర్‌గా బదిలీ అయ్యారు. ఆయన రెండేళ్లలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. సమగ్ర విచారణ చేపట్టాలి: కోమటిరెడ్డి మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహ త్య ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. వెంకటేశ్వర్లు నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా చాలా ఏళ్లు ఉత్తమ సేవలు అం దించారని గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వర్లు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుట్ర చేసి పట్టించారా? వెంకటేశ్వర్లు ఆయా అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారనే పేరుందని మున్సిపల్ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లడం, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంలో నిక్కచ్చిగా ఉంటారని చెబుతున్నాయి. ఈ క్రమంలో కొందరికి అది మింగుపడలేదని... అందువల్ల వ్యూహాత్మకంగా ఆయనను ఏసీబీ అధికారులకు పట్టించారని చర్చించుకుంటున్నాయి. వెంకటేశ్వర్లు మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుటుంబ సభ్యులు -
ప్రముఖ కవి పార్శీ వెంకటేశ్వర్లు కన్నుమూత
‘శబ్దం.. నిశ్శబ్దం’, ‘కవితా మయూరి’ తదితర కవితా సంకలనాలకు ప్రాచుర్యం సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు హన్మకొండ కల్చరల్ : ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనా విధానమే ఆలంబనగా.. భావ కవిత్వమే బాసటగా.. సాహితీ వ్యాసంగమే లక్ష్యంగా ముందుకుసాగిన ప్రముఖ కవి, శివునిపల్లి ముద్దుబిడ్డ పార్శీ వెంకటేశ్వర్లు స్వగ్రామంలో మంగళవారం కన్నుమూశారు. ఆయనకు భార్య ఉమాదేవి, కుమారులు నవీన్, కమల్, కుమార్తెలు రమ,ప్రణతి ఉన్నారు. వెంకటేశ్వర్లు స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని శివునిపల్లి గ్రామంలో పార్శీ రామయ్య, గోదాదేవి దంపతులకు 1936 జూలై 10న జన్మించారు. బాల్యం నుంచీ వెంకటేశ్వర్లులో పరోపకార గుణం మెండుగా ఉండేది. ఎవరైనా సాయం కోసం వస్తే.. లేదనకుండా ఎంతో కొంత ఇచ్చి పంపేవారు. అనంతర కాలంలో ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి భావాలతో ఆయన ఎంతో ప్రభావితుడయ్యారు. ఎంతగా అంటే జిడ్డు కృష్ణమూర్తి రాసిన పుస్తకాలను యువకులకు ఉచితంగా పంచేంతగా! ఆ ఆలోచనా ధోరణి గురించి అందరికీ వివరించేంతగా. కృష్ణమూర్తి వద్ద వెంకటేశ్వర్లు కొంతకాలం శిష్యరికం కూడా చేశారు. ఈక్రమంలోనే ప్రముఖ హిందీ చలనచిత్ర దర్శకుడు మహేష్‌భట్‌తో పరిచయం ఏర్పడి.. ఆత్మీయ మిత్రుడిగా మారారు. ఆ సమయంలోనే ప్రముఖ కవి వీ.ఆర్.విద్యార్థి, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, వేలూరి సదాశివరావు, బీ.సీ.రామమూర్తి, పీ.ఎల్.కాంతారావులతో పరిచయం ఏర్పడింది. ‘గొప్పవారితో స్నేహం.. గొప్ప ఆలోచనా దృక్పథాన్ని అలవరుస్తుంది’ అని పెద్దలు చెప్పిన విధంగా వెంకటేశ్వర్లు జీవన శైలి, జీవిత లక్ష్యాలకు ఆయనతో స్నేహం చేసిన గొప్పగొప్ప మేధావులే దిశానిర్దేశం చేశారు. ఈ ప్రభావంతో తన స్వగృహంలో మేధావులు, సామాజికవేత్తలతో ఆయన తాత్విక చర్చలు నిర్వహించేవారు. సాహితీ సుధ వ్యవస్థాపకులుగా.. 1985 సంవత్సరంలో తన మిత్రులు నరేందర్, బుర్ర వెంకటయ్య, భిక్షపతిలతో కలిసి ‘సాహితీ సుధ’ అనే సాహిత్య సంస్థను వెంకటేశ్వర్లు స్థాపించారు. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన నిర్వహించే సాహితీ చర్చాగోష్టులకు కాళోజీ రామేశ్వర్రావు, కాళోజీ నారాయణరావు, అనుముల కృష్ణమూర్తి, పొట్లపల్లి రామారావు తదితర సుప్రసిద్ధ సాహితీవేత్తలు హాజరయ్యేవారు. పెండ్యాల వరవరరావు లాంటి వారికి మిత్రుడిగా అభిమానాన్ని చూరగొన్నారు. ‘కవితా మయూరి’, ‘శబ్దం–నిశ్శబ్దం’ పేరిట కవితా సంపుటాలను వెలువరించారు. ‘నెలవంక’ అనే సాహితీ మాసపత్రికను ప్రచురించేవారు. అవార్డులు, బిరుదులు.. పార్శీ వెంకటేశ్వర్లును పాలకుర్తి సోమనాథ కళాపీఠం వారు ‘తత్వదర్శి’ బిరుదుతో గౌరవించారు. మడికొండ పురజనులు వైశ్యరత్న బిరుదుతో సత్కరించారు. వరంగల్ జిల్లా యంత్రాంగం ఉత్తమ సాహితీవేత్తగా సత్కరించింది. ఆయనకు 2012 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ కిషన్ చేతులమీదుగా తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందుకున్నారు. సంతాపం తెలిపిన ప్రముఖులు స్టేషన్ ఘన్పూర్ టౌన్ : మండలంలోని శివునిపల్లికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, సాహితీ సుధ వ్యవస్థాపక అధ్యక్షుడు పార్శీ వెంకటేశ్వర్లు(80) మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. జిల్లా ఒక గొప్ప సాహితీవేత్తను కోల్పోయిందని వారు అభివర్ణించారు. ఆయన సాహిత్య రంగానికి చేసిన సేవలను కొనియాడారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ మంత్రి విజయరామారావు, వాసవి క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ తెల్లాకుల రామకృష్ణ, ఎర్రం శ్రీనివాస్, యంజాల ప్రభాకర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన వారిలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వి.ఆర్.విద్యార్థి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ఆచార్య బన్న అయిలయ్య దంపతులు, పొట్లపల్లి శ్రీనివాసరావు, టి. జితేందర్‌రావు, తదితరులు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజయ్య ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. కాగా, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు పార్శీ వెంకటేశ్వర్లు నేత్రాలను లయన్స్‌క్లబ్, వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో సేకరించి ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు తరలించారు. -
'సినిమాల ప్రభావంతోనే ఆ హత్యలు'
-
'సినిమాల ప్రభావంతోనే ఆ హత్యలు'
నెల్లూరు: చిల్డ్రన్స్ పార్క్ వద్ద దోపిడి, హత్య ఘటనలో కీలక నిందితుడు సైకో వెంటేశ్వర్లును పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. గతంలో కావలి, పెద్దచెరుకూరులో పలు హత్యలు చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సెటాప్ బాక్సులు రిపేర్ చేయాలని ఇంట్లోకి ప్రవేశించి.. నగదు, నగలు దోచుకొని హత్యలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. సినిమాల ప్రభావంతో వెంకటేశ్వర్లు హత్యలకు పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. శనివారం నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఆడిటర్ నాగేశ్వరరావు ఇంట్లోకి దోపిడీ దొంగలు చొరబడి భారీ స్థాయిలో నగలు, నగదు దోచుకోవడమేకాక కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో నాగేశ్వరరావు భార్య ప్రభావతి మృతి చెందగా.. కుమారుడు, కుమార్తె గాయపడ్డారు. సైకో వెంకటేశ్వర్లు పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. -
'వాస్తు పేరుతో రైతులకు అన్యాయం'
విజయవాడ: నూజివీడులో ప్రభుత్వ భూమి 55 వేల ఎకరాలు ఉన్నప్పటికీ.. వాస్తు పేరుతో భూములు లాక్కొని చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఆదివారం హనుమాన్ జంక్షన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని పేరుతో రైతుల నుండి భూములు లాక్కొని, వాటిని 99 ఏళ్లు పరాయి దేశానికి అప్పగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాజధాని నిర్మాణంలో గ్రామాల జోలికి వెళ్లమని చెప్పిన చంద్రబాబు.. రోడ్ల నిర్మాణం పేరుతో గ్రామాలను ఖాళీ చేయించడం దారుణమైన చర్య అన్నారు. గ్రీన్ బెల్ట్ విధానం ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్న ఆయన 30 మండలాలను గ్రీన్ బెల్ట్‌గా చేయడం సబబు కాదన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్ష నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి నోరు మూయించాలనుకోవడం చంద్రబాబు అవివేకమన్నారు. -
ఆత్మహత్యలా?..హత్యలా?
దుత్తలూరు : మండలంలోని నర్రవాడ బైపాస్‌రోడ్డు సమీపంలోని చెన్నకేశవస్వామి ఆలయం వెనుక గుంతలో ఒకే కుటుంబానికి నలుగురు మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 20 రోజుల క్రితం వీరు ఇంటి నుంచి వెళ్లారు. అయితే గురువారం గుంతలో నలుగురి మృతదేహాలు ఉండటాన్ని పశువుల కాపరులు గుర్తించడంతో వెలుగుచూసింది. అయితే ఇన్ని రోజులు వీరు ఎక్కడికి వెళ్లారు.. ఏం చేస్తున్నారో కూడా తెలియనట్టుగా కుటుంబ యజమాని ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలంలో మృతదేహాలు సైతం ఒకరిపై ఒకరు పడి ఉండటం కూడా ఆత్మహత్యలా? హత్యలా? అనే అనుమానం తలెత్తుతోంది. ఉదయగిరి మండలం నేలటూరుకు చెందిన మేడేపల్లి వెంకటేశ్వర్లు (60), చెన్నమ్మ దంపతుల కుమార్తె పద్మకు దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీ మజరా గుదేవారిపాళెంకు చెందిన మద్దిపాటి హరికృష్ణతో (మేడేపల్లి చెన్నమ్మ తమ్ముడు) 18 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి హరికృష్ణ, మామ వెంకటేశ్వర్లుతో కలిసి గుంటూరులో వడ్డీ, స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో హరికృష్ణ స్వగ్రామం గుదేవారిపాళెంలో వ్యవసాయం చేసుకుందామని భార్య, మామకు చెప్పాడు. దీనికి వారిద్దరు నిరాకరించడంతో పదేళ్ల క్రితమే హరికృష్ణ వారిని గుంటూరులోనే వదిలేసి ఒక్కడే స్వగ్రామానికి వచ్చాడు. మామ వెంకటేశ్వర్లుకు వ్యాపారంలో మళ్లీ నష్టాలు రావడంతో నాలుగేళ్ల క్రితం కుమార్తె పద్మ (36), మనవరాలు శ్రావణసంధ్య(15), మనమడు శ్రావణ్‌కుమార్ (13)ను తీసుకుని గుదేవారిపాళెంలో వదిలి పెట్టాడు. వెంకటేశ్వర్లు బెంగళూరులో పని చేస్తూ అప్పుడప్పుడూ అల్లుడు, కూతురు దగ్గరికి వచ్చేవాడు. ఆయన వచ్చిన ప్రతిసారి భార్యాభర్తల నడుమ తగాదా జరుగుతుండేది. పిల్లలకు మంచి చదువు కావాలని, ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాలని వాదోపవాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు తన కూతురు ఇంటికి వచ్చి నీ భర్త ఎటువంటి సంపాదన లేకుండా జులాయిగా తిరుగుతూ తాగుడుకు అలవాటు పడ్డాడు. నీ పిల్లల భవిష్యత్ ఏమిటని బాధపడేవాడు. తనతో పాటు పిల్లలను గుంటూరుకు పంపిస్తే ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తానని తెలిపాడు. ఈ విషయం పద్మ తన భర్త హరికృష్ణకు చెబితే అతను నిరాకరించాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం హరికృష్ణ పొలానికి వెళ్లగా వెంకటేశ్వర్లు వచ్చి కుమార్తె, మనమరాలు,మనమడును తీసుకుని గుంటూరుకు వెళ్తున్నామని చుట్టు పక్కల వారికి చెప్పి వెళ్లారు. అయితే హరికృష్ణ మిన్నకుండిపోయాడు. కాగా, గురువారం నర్రవాడ బైపాస్ ప్రాంతంలో గొర్రెల కాపరి గొర్రెలు మేపుతుండగా ఆ ప్రాంతం నుంచి భరించలేని దుర్వాసన వచ్చింది. కలియ చూడగా గుడి వెనుక ఉన్న చెన్నయ్యగుంతలో కుళ్లిన స్థితిలో ఉన్న నాలుగు శవాలను గమనించి స్థానికులకు సమాచారమందించాడు. ఈ విష యం దావనంలా వ్యాపించింది. అయితే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లి శిథిలం కావడంతో గుర్తుతెలియన మృతదేహాలుగా భావించారు. స్థానికులు మృతదేహాలను పరిశీలించి గుదేవారిపాళెంకు చెందినవారివిగా గుర్తించారు. సంఘటన స్థలంలో విషగుళికల ప్యాకెట్, కూల్‌డ్రింక్ ఖాళీ బాటిల్ ఉన్నాయి. దీన్ని బట్టి వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావి స్తున్నా.. ఇన్ని రోజులుగా భార్యా బిడ్డలు కనిపించకపోయినా భర్త వారి ఆచూకీ కోసం ప్రయత్నించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఉదయగిరి సీఐ శ్రీనివాసరావు, దుత్తలూరు ఎస్సై సైదులు సంఘటన స్థలాన్ని పరిశీలించి హరికృష్ణ వద్ద ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు మృతి చెందటం చూసి పలువురు చలించి పోయారు. శ్రావణ్‌కుమార్ ప్రస్తుతం నర్రవాడ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా, శ్రావణసంధ్య గత సంవత్సరం దుత్తలూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివింది. ఈ సంవత్సరం కుటుంబ కలహాల నేపథ్యంలో ఎక్కడా చేరలేదని సమాచారం. -
తాగేందుకు డబ్బులివ్వలేదని..
భార్యను కొట్టి చంపిన భర్త కొడవలూరు : మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా కొట్టి చంపిన ఉదంతం మండలంలోని నాయుడుపాళెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నాయుడుపాళెం గమళ్లపాళెంకు చెందిన జంపాల మల్లికార్జున (40)కు ప్రకాశం జిల్లా కొత్తపట్నం గమళ్లపాళెంకు చెందిన బుద్దగిరి వెంకటేశ్వర్లు, యానాదమ్మ దంపతుల కుమార్తె ఈశ్వరమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల వినోద్ అనే మానసిక వికలాంగుడైన కుమారుడు ఉన్నాడు. కొంత కాలంగా మల్లికార్జున మద్యానికి బానిసగా మారాడు. ఈశ్వరమ్మకు పెళ్లి సమయంలో తల్లిదండ్రులు కానుకగా ఇచ్చిన బంగారు కమ్మలు కూడా అమ్మేశాడు. మల్లికార్జున పనికెళ్లడం కూడా మానేశాడు. దీంతో ఈశ్వరమ్మ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఈశ్వరమ్మ తమ సమీప బంధువుల వివాహానికి కొత్తపట్నం వెళ్లింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఈశ్వరమ్మకు కొత్తగా కమ్మలు కొని ఇచ్చారు. వాటితో ఇంటికి చేరుకున్నప్పటి నుంచి మల్లికార్జున ఆ నగలను ఇవ్వాలని తరచూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈశ్వరమ్మ కమ్మలను ఆమె అత్త చేతికి ఇచ్చి బుధవారం కూలి పనికెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకుంది. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న మల్లికార్జున భార్యతో నగలివ్వాలని గొడవకు దిగారు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో కొయ్యతో విచక్షణారహితంగా ఆమెను కొట్టాడు. దీంతో ఈశ్వరమ్మ స్పృహ కోల్పోయింది. అక్కడి నుంచి మల్లికార్జున వెళ్లిపోయాడు. బాగా పొద్దుపోయాక ఈశ్వరమ్మ అత్త ఇంటికి వచ్చేసరికి చలనం లేకుండా పడిపోయి ఉన్న ఈశ్వరమ్మను గుర్తించి ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు హుటావుటిన గ్రామానికి చేరుకున్నారు. తమ కుమార్తెను అల్లుడే కిరాతకంగా కొట్టి చంపాడని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యను హత్య చేసిన మల్లికార్జున పరారీలో ఉన్నారు. హత్యకు గురైన ఈశ్వరమ్మ కుమారుడు వినోద్ మానసిక వికలాంగుడు. అతడి ఆలనాపాలనా చూసుకునే తల్లి మృతి చెందడంతో ఆ బాలుడి పరిస్థితే మిటని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. మల్లికార్జునపై హత్య కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. -
మహిళల విభాగం చాంపియన్ వరంగల్
దుగ్గొండి : మండల కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న 34వ రాష్ట్రస్థాయి రెజ్లింగ్ క్రీడలు శనివారం ము గిశాయి. మహిళల విభాగంలో జిల్లా జట్టు చాంపియన్, సబ్ జూనియర్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో పైల్వాన్ ఫైటింగ్‌ను ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రెజ్లింగ్‌లో మహిళలు పాల్గొనడం అభినందనీయమన్నా రు. వీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలని ఆకాంక్షిం చారు. రెజ్లింగ్ అభివృద్ధికి పోలీస్ శాఖ పక్షాన సహకరి స్తామని చెప్పారు. నర్సంపేట ఎస్డీపీఓ మురళీధర్, సీఐ కిషన్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఎన్నారైలు గంప వేణుగోపాల్, శానబోయిన రాజ్‌కుమార్, అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు రాజేంద్రకుమార్, యాదగిరి సుధాకర్, కె.రాజు, రాజిలింగం, సర్పంచ్ ఆరెల్లి సువర్ణరాణి, వైస్ ఎంపీపీ ఊరటి మహిపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ బొటికె అనసూర్య, కోచ్‌లు అశోక్, గోకుల్, నారాయణ పాల్గొన్నారు. వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి చాంపియన్లు.. రెజ్లింగ్ పోటీల్లో వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు వేర్వేరు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించి చాంపియన్ షిప్ దక్కించుకున్నారుు. జూనియర్ విభాగంలో 54 పాయింట్లతో రంగారెడ్డిచాంపియన్గా నిలిచింది. 50 పాయింట్లు సాధించి హైదరాబాద్ రన్నర్‌గా నిలిచింది. సబ్ జూనియర్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారులు 73 పాయింట్లతో చాంపియన్‌గా నిలువగా వరంగల్ క్రీడాకారులు 62 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచారు. మహిళా విభాగంలో 36 పాయింట్లతో వరంగల్ జిల్లా చాంపియన్‌గా నిలవగా 30 పాయింట్లుతో కరీంనగర్ రన్నరప్‌గా నిలిచింది. క్రీడాకారులకు రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ పక్షాన పతకాలు, జ్ఞాపికలు అందించారు. మన జిల్లాకు చెందిన మహిళా రెజ్లర్లు 3 బంగారు, 4 కాంస్య పతకాలు సాధించారు. 43 కేజీల విభాగంలో పి. మానస, 65 కేజీల విభాగంలో ఆర్ . కీర్తన, 70 కేజీల విభాగంలో పి. శ్రీవేణి బంగారు పతకాలు సాధించారు. 56 కేజీల విభాగంలో జి. సుప్రియ, 43 కేజీల విభాగంలో ఎన్. వందన, 46 కేజీల విభాగంలో కే. రేష్మ, 52 కేజీల విభాగంలో జె. భవాని కాంస్య పతకాలు సాధించారు. అలాగే సబ్ జూనియర్ 76 కేజీల విభాగంలో కె. అనిరుద్ద్, 85కేజీల విభాగంలో బి,భరత్ బంగారు పతకాలు సాధించగా 100 కేజీల విభాగంలో కె. సృజన్‌కుమార్, 42 కేజీల విభాగంలో కే. విజేందర్, 50 కేజీల విభాగంలో వి.ఉదయ్‌సింగ్, 69 కేజీల విభాగంలో ఆర్. వెంకటేష్ కాంస్య పతకాలు సాధించారు. -
ఉత్తమ సేవకులకు అవార్డులు
ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలో కళాప్రదర్శనలు, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి, ఉత్తమ సేవ కార్యక్రమాలు, సామాజిక రంగాల్లో సేవలందించిన వారికి, సంఘాలకు అవార్డులు లభిస్తాయని యువజన సర్వీసుల శాఖ జిల్లా సీఈవో వెంకటేశ్వర్లు అ న్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా యువజన సర్వీసుల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని యువతీ, యువకులు, కళాకారులు, ఉద్యోగుల నుంచి ఉత్తమ అవార్డులు, పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. జాతీయ యూత్ అవార్డు కోసం 11 దరఖాస్తులు రాగా ఐ దింటిని ఎంపిక చేశామని వివరించారు. సంఘా ల విభాగంలో తాండూర్‌కు చెందిన అభినవ యూత్ ఆర్గనైజేషన్, మంచిర్యాలకు చెందిన కేజీఎన్ వాలంటీర్ల ఆర్గనైజేషన్, వ్యక్తిగత విభాగంలో తాండూర్‌కు చెందిన కె.సంతోష్, ఆదిలాబాద్ మండలం అంకోలికి చెందిన ఎర్రం న ర్సింగ్‌రావు, ఆదిలాబాద్‌కు చెందిన మిట్టు రవి ఎంపికయ్యారని తెలిపారు. పద్మ అవార్డుల కోసం 27 దరఖాస్తులు రాగా.. 13 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. సాహితీ, విద్యారంగం లో నిర్మల్‌కు చెందిన మడిపెల్లి భద్రయ్య, సా మాజిక సేవారంగంలో లక్సెట్టిపేట మండలం కొత్తూరుకు చెందిన తగరపు సత్తయ్య, తాండూర్ మండలం రేచూరి గ్రామానికి చెందిన కె.సంతోష్, కళారంగంలో నిర్మల్‌కు చెందిన జోసప్ బాపూరావు, సామాజిక సేవారంగంలో బెల్లంపల్లికి చెందిన దాసరి విజయ, నిర్మల్ చెందిన చిత్ర కళాకారుడు భాస్కర్రాజులను ఉత్తమ పద్మ అవార్డులకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించినట్లు తెలిపారు. సామాజిక సేవారంగంలో ఆదిలాబాద్ మండలం దిమ్మ గ్రామానికి చెందిన పసుపుల రాజు, చెన్నూర్ మండలానికి చెందిన గర్మిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, లోకేశ్వరం మండ లం ధర్మోర గ్రామానికి చెందిన మదిరి ఆంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన అల్లొల సంతోష్‌కుమార్, గుడిహత్నూర్ మండలం తోషం గ్రా మానికి చెందిన ఎండి.షాహిద్, కళారంగంలో కడెంకు చెందిన నల్ల రాంరెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన ఫహీమ్ సర్కార్లను పద్మ అవార్డుల కోసం ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన వారిని జాతీయస్థాయికి పంపిస్తారని, రాష్ట్రస్థాయిలో అవార్డులను ప్రకటిస్తారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, యువజన సర్వీసుల శాఖ సీఈవో, డీపీఆర్వోతో కూడిన కమిటీ వీరిని ఎంపిక చేసినట్లు తెలిపారు. సమావేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ కో ఆర్డినేటర్ ఖాన్ అరీఫ్ అహ్మద్, యూత్ కో ఆర్టినేటర్ మసూద్ పాల్గొన్నారు.