పక్కా ప్లాన్‌ ప్రకారమే కత్తితో దాడి: న్యాయవాది వెంకటేశ్వర్లు | Advocate Venkateswarlu Key Comments Case Of Attack On CM Jagan | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌ ప్రకారమే కత్తితో దాడి: న్యాయవాది వెంకటేశ్వర్లు

Published Wed, Aug 30 2023 7:47 PM | Last Updated on Wed, Aug 30 2023 9:48 PM

Advocate Venkateswarlu Key Comments Case Of Attack On CM Jagan - Sakshi

సాక్షి, విజయవాడ: విశాఖ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసుపై సీఎం తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వెల్లడించారు. 

కాగా, సీఎం జగన్‌ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నంపై కేసులో ఎన్‌ఐఏ 39 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు ఎన్‌ఐఏకి సిట్‌ వివరాలు అప్పగించలేదు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉంది. 2017లో శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీనివాస్‌ పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసింది. నాటి డీజీపీ ఎన్‌ఐఏకి రికార్డ్‌ చేయవద్దని సిట్‌కి ఆదేశాలు ఇచ్చారు. రికార్డులు ఎన్‌ఐఏకి పోలీసులు మొదట అప్పగించలేదు. 

ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్‌ ఎలా తిరిగాడు?..
ఎయిర్‌పోర్టు అథారిటీకి శ్రీనివాస్‌ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. శ్రీనివాస్‌ది ఎయిర్‌పోర్టులో ఇల్లీగల్‌ ఎంట్రీ. కత్తితో ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్‌ ఎలా తిరిగాడు?. శ్రీనివాస్‌పై కేసు ఉన్నందుకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేసే నాటికి శ్రీనివాస్‌పై కేసు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్‌ వేశారు.

ప్లాన్‌ ప్రకారమే దాడి..
సీఎం జగన్‌పై పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడి జరిగింది. సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ కూడా చెప్పింది. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో శ్రీనివాస్‌ నేరాన్ని ఒప్పుకున్నాడు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement