NIA team
-
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్‌ను కిగాలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
ఎన్ఐఏతో విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిపై దాడి, విగ్రహ ధ్వంసంపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు విభాగానికి (ఎన్ఐఏ) అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, డీజీపీ జితేందర్‌కు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలోని ఓ హోటల్లో దేశ వ్యతిరేక శక్తులు, దాడులకు పాల్పడిన వారు నెలల తరబడి జరిపిన అక్రమ కార్యకలాపాలపై నివేదిక తెప్పించుకోవాలని గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో మూడునెలలుగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. సోమవారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు, డీజీపీ కార్యాలయంలో వేర్వేరుగా ఎంపీలు ఈటల రాజేందర్,ఎం.రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, రాకేష్‌రెడ్డి, నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ తదితరులు వినతిపత్రాలు సమరి్పంచిన వారిలో ఉన్నారు. హిందువులపై కేసులు పెడుతున్నారు : ఈటల రాజ్‌భవన్ వద్ద ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ హిందువులపైనే కేసులు పెడుతున్నారు..ఆత్మగౌరవాన్ని కించపరిస్తే క్షమించేది లేదు అని సీఎంను హెచ్చరించారు. ‘హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడు అని ముద్ర వేసి వదిలేసే ప్రయత్నం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్‌ను కోరాం’ అని ఈటల తెలిపారు. హిందూ దేవాలయాలపై దాడి జరిగినా సీఎం ఖండించలేదు : ఏలేటి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే సీఎం రేవంత్ ఇంతవరకు ఖండించలేదన్నారు. ‘నిందితుల మీద ప్రభుత్వం కేసు పెట్టకుండా ఏం చేస్తోంది? నగరంలో దాడులకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? దేవాలయాల మీద దాడి.. మా తల్లి మీద దాడిలా భావిస్తాం.. తిప్పికొడతా’ అని మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. స్లీపర్ సెల్స్ ఏమైనా కుట్రలు చేస్తున్నాయా : రఘునందన్‌రావు డీజీపీ కార్యాలయం వద్ద ఎంపీ రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ ‘ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్‌పై పూర్తిస్థాయి విచారణ జరగాలి. సంఘ విద్రోహశక్తులు, స్లీపర్ సెల్స్ ఏమైనా కుట్రలు చేస్తున్నాయా అన్నది పరిశీలించాలి. ముత్యాలమ్మ టెంపుల్‌కు సమీపంలో స్లీపర్ సెల్స్‌కు శిక్షణ ఇచ్చారా? రాష్ట్రంలో 3 నెలల వ్యవధిలో 15 గుడులపై దాడుల వెనుక కుట్రకోణంపై విచారణ జరపాలి’ అని రఘునందన్ డిమాండ్ చేశారు. -
భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్రకోణం?
చెన్నై: భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనక కుట్రకోణం ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఎన్ఐఏ, రైల్వే అధికారులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైలు ప్రమాదానికి రైల్వే ఉద్యోగులేనన్న అనుమానాలు వస్తున్నాయి.విచారణలో ప్రమాద ప్రాంతంలో స్విచ్ పాయింట్ల బోల్టులు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. లూప్ లైన్లో పట్టాలు ట్రాక్‌గా మారే చోట బోల్ట్‌నట్ విప్పడంతో గూడ్స్ ట్రాక్ మారింది. దీంతో గూడ్స్ ట్రైన్‌ను భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు.20 మందికి పైగా రైల్వే సిబ్బంది, అధికారులను సౌత్‌జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ చౌదరి ప్రశ్నించారు. బోల్ట్ విప్పింది బయటి వ్యక్తులు కాదని, రైల్వే ఉద్యోగులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతుంది. దాని వెనుక కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.కాగా, గత శుక్రవారం (అక్టోబర 11)న రాత్రి 8.27 సమయంలో తమిళనాడులో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు పొన్నేరి స్టేషన్ దాటింది. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్లైన్లోకి వెళ్లడం, ఆ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి.ఈ ప్రమాదంలో 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పార్సిల్ వ్యానులో మంటలు చెలరేగాయి. రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు,ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జరిగిన విచారణలో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై కుట్రకోణం ఉందని సమాచారం. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది -
దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం
న్యూఢిల్లీ: ముంబైలో ఎస్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య దరిమిలా దీనివెనక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తముందనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌తో సహా పలువురు పేరుమోసిన గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక వివరాలున్నాయి.లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధించిన టెర్రర్ సిండికేట్ మునుపెన్నడూ లేని విధంగా విస్తరించిందని ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం 90వ దశకంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ, తన నెట్‌వర్క్‌ను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడో.. అదే మార్గాన్ని లారెన్స్ బిష్ణోయ్ కూడా అనుసరించాడు. దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ స్మగ్లింగ్, టార్గెట్ కిల్లింగ్, దోపిడీ రాకెట్లతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత పాక్ ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుని, తన నెట్వర్క్ విస్తరించాడు. కాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన డి కంపెనీ మాదిరిగానే బిష్ణోయ్ గ్యాంగ్ చిన్న చిన్న నేరాలు చేస్తూ ఇప్పుడు ఆరు దేశాలకు విస్తరించింది.బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్‌కు చెందినవారని ఎన్ఐఎ తెలిపింది. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను విరివిగా వినియోగించుకుంలాయి. బిష్ణోయ్ ముఠా 2020-21 మధ్యకాలంలో దోపిడీల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించింది.ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితమైంది. ఆ తరువాత గోల్డీ బ్రార్‌తో జతకట్టి హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ముఠాలతో పొత్తు పెట్టుకుంది. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రస్తుతం ఉత్తర భారతదేశం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌లలో విస్తరించింది. సామాజిక మాధ్యమాలు, ఇతర పద్ధతుల ద్వారా వీరు యువతను తమ ముఠాలో చేర్చుకుంటారు. ఈ ముఠా అమెరికా, అజర్బైజాన్, పోర్చుగల్, అరబ్, రష్యా వరకూ వ్యాపించింది.కొద్ది రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16 మంది గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలోని వివరాల ప్రకారం గోల్డీ బ్రార్ కెనడా, పంజాబ్, ఢిల్లీలో ముఠాలను నిర్వహిస్తున్నాడు. రోహిత్ గోద్రా రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరబ్ కంట్రీలోని ముఠాలను పర్యవేక్షిస్తుంటాడు. అన్మోల్ బిష్ణోయ్ పోర్చుగల్, అమెరికా, ఢిల్లీ , మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లకు కమాండ్‌గా ఉన్నాడు. ఈ ముఠాకు ఆయుధాలు మధ్యప్రదేశ్‌లోని మాల్వా, మీరట్, ముజఫర్‌నగర్, యూపీలోని అలీగఢ్, బీహార్‌లోని ముంగేర్, ఖగారియా నుంచి వచ్చి చేరుతుంటాయి. అలాగే పాక్‌లోని పంజాబ్ జిల్లాతో పాటు అమెరికా, రష్యా, కెనడా, నేపాల్ దేశాల నుంచి కూడా ఈ ముఠాకు ఆయుధాలు అందుతుంటాయని ఎన్ఐఏ గుర్తించింది.ఇది కూడా చదవండి: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య? -
దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించి 22 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ, అస్సాం, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్రలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.కాగా, గత నెలలో చైన్నెతో పాటు రాష్ట్రంలో 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సెల్ఫోన్లను, లెక్కలోకి రాని నగదును సీజ్ చేశారు. ఇస్ బత్ తహీర్ పేరిట ఉన్న నిషేధిత తీవ్ర వాద సంస్థకు తమిళనాట యూట్యూబ్ ద్వారా ప్రచారం జరుగుతున్నట్టు ఇటీవల చైన్నె పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ సంస్థకు మద్దతుగా సాగుతూ వస్తున్న వీడియో ప్రచారాలు, వాటికి లైక్‌లు కొట్టే వారిని టార్గెట్ చేస్తూ తరచూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తంజావూరు, తూత్తుకుడి, తిరుచ్చి,మైలాడుతురై జిల్లాలో విస్తృతంగా సోదాలు జరిగాయి.ఇదీ చదవండి: కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం -
బెంగళూరులో కుక్కర్ పేలుడు.. రంగంలోకి ఎన్ఐఏ
బెంగళూరు: బెంగళూరులో కుక్కర్ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వంట సామాను మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు వెనక ఉగ్రవాద కోణం లేదని పోలీసులు పేర్కొన్నప్పటికీ.. తీవ్రతను పరిశీలించడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం సంఘటనా స్థలానికి రంగంలోకి దిగింది. బెంగళూరులోని జేపీ నగర్‌లోని ఉడిపి ఉపహారా ఫుడ్‌షాప్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు కుక్కర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సమీర్, మొహిసిన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరూ ఉత్తర ప్రదేశ్‌కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ‘‘పేలుడు పదార్థాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఇది ప్రెషర్ కుక్కర్ పేలుడుగా తేలింది. ఉదయం దర్యాప్తు కోసం అక్కడి సామగ్రిని పరిశీలించాం. అల్లర్లు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే పేలుడు తీవ్రతను తెలుకునేందుకు ఎన్ఐఏ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది మొదట్లో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. -
ఎంపీగా ప్రమాణ స్వీకారానికి.. రషీద్ ఇంజినీర్‌కు ఎన్ఐఏ అనుమతి
న్యూఢిల్లీ: జైలులో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర ఎంపీ షేక్ రషీద్ ఇంజినీర్‌కు లోక్‌సభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమతించింది. దీంతో ఈ నెల అయిదవ తేదీన రషీద్ లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్ఐఏ ఆయనకు కొన్ని షరతులు విధించింది.నూతన ఎంపీ మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది. కాగా షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.షేక్ అబ్దుల్ రషీద్ ఎవరు?జమ్మూకాశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఇంజనీర్ రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింద ఎన్ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అబ్దుల్ రషీద్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2008 మరియు 2014లో గెలుపొందిన జమ్మూ కశ్మీర్‌లోని లాంగేట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. -
జమ్ము కశ్మీర్: డ్రోన్ల సాయంతో ఎన్ఐఏ ‘ఉగ్ర’ వేట
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్‌కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్‌లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు. -
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
బెంగళూరు: సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో మంగళవారం(మే21) ఎన్ఐఏ పలు రాష్ట్రాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించింది. కేసులో కొందరు అనుమానితులకు సంబంధించి అందిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.రాత్రి వరకు దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణను ఎన్ఐఏ మార్చి3వ తేదీన ప్రారంభించింది. ఏప్రిల్ 12న పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ అహ్మద్, బాంబు పెట్టిన వ్యక్తిగా భావిస్తున్న ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. -
రాయదుర్గంలో ఎన్ఐఏ దాడుల కలకలం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. సోహైల్ అనే ప్రైవేట్ ఉద్యోగిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగుల బావి వీధిలో రిటైర్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.అబ్దుల్ తనయుడు సోహైల్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తోంది. అబ్దుల్ ఇద్దరు కుమారులు బెంగళూరులో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ కనిపించకపోవడంతో ఎన్ఐఎ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా షాకిచ్చారు.ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్ ఫర్ జస్టిస్’అనే సంస్థ నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు గవర్నర్ సోమవారం(మే6) సిఫారసు చేశారు.ఆమ్ఆద్మీపార్టీకి సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి ఆప్‌కు 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు. -
బెంగళూరు కేఫ్ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పక్కాగా ప్లాన్ చేసి తప్పించుకున్నారు ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది. అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.? బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్ షాజీబీ (30), తెర వెనక మాస్టర్‌మైండ్ మథీన్ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్‌లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్ చేసి చెల్లించే UPI పేమెంట్ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్‌లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది. చిక్కరు.. దొరకరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్‌ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్‌కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఈ సిమ్ కార్డులన్నీ నకిలీ అడ్రస్‌లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్ అడ్రస్‌లు, ఆధార్లతో సేకరించిన సిమ్ కార్డులు. ఈ సిమ్‌లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్‌ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. ఆడింది ఆట.. పాడింది పాట హోటల్లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్‌కతాలో మూడు హోటల్స్‌లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు. చిన్న కారణంతో చిక్కారు మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్లోని చాంద్నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్ కింద పడడంతో ఫోన్లో స్పీకర్ పాడయింది. దీన్ని రిపేర్ చేయించేందుకు.. ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్ షాప్ మైక్రోమాజిక్ ఇన్ఫోటెక్ అనే చిన్న మొబైల్ షాప్‌కు తీసుకెళ్లారు. ఫోన్‌ను పరిశీలించిన మొబైల్ షాపు మెకానిక్.. స్పీకర్ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్ కీపర్ తన దగ్గరున్న సిమ్‌ను ఫోన్లో వేసి రిపేర్ చేశాడు. అప్పటికే IMEA నంబర్‌పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్ వేయగానే దాని ఆధారంగా అడ్రస్ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్ అడ్రస్ దొరికింది. మొబైల్ లొకేషన్‌ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్ కీపర్ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఎన్ఐఏ’పై దాడి.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
కలకత్తా: పశ్చిమబెంగాల్లో వేసవితో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేడి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందంపై తూర్పు మిడ్నపూర్‌లో స్థానికులు దాడి చేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆదివారం(ఏప్రిల్ 7)న జల్పాయ్గురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఎన్ఏఐ బృందంపై దాడి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పనేనని ఆరోపించారు. తృణమూల్ నేతలకు రాజ్యాంగం, శాంతిభద్రతలు ఏవీ పట్టవని ఆరోపించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, స్వయానా సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఎన్ఐఏ ఉన్నతాధికారులను బీజేపీ నేతలు వెళ్లి కలిసిన తర్వాతే తమ పార్టీ నేతలకు బాంబు పేలుడు కేసులో నోటీసులు వచ్చాయని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. అవసరమైతే బీజేపీ నేతలు ఎన్ఐఏ పోలీసు అధికారులను కలిసిన వీడియో కూడా విడుదల చేస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ముందు టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు ఎన్ఐతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎన్ఐఏ స్పందించింది. అభిషేక్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఇదీ చదవండి.. తిరువనంతపురం ఫైట్.. కేంద్రమంత్రిపై ఈసీకి ఫిర్యాదు -
ప్రచార హోరు.. ‘తృణమూల్’పై ప్రధాని మోదీ ఫైర్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై టీఎంసీ కార్యకర్తల దాడిని ప్రధాని ఖండించారు. ఆదివారం జల్పాయ్గురిలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.‘వారి పార్టీ అవినీతి నేతలను స్వేచ్ఛగా వదిలేయాలని తృణమూల్ భావిస్తోంది. దర్యాప్తు సంస్థలు వస్తే వారిపైనే దాడి చేస్తారు. శాంతిభద్రతలను నాశనం చేయడానికి టీఎంసీ కంకణం కట్టుకుంది. వారికి రాజ్యాంగంతో పని లేదు’ అని విమర్శలు గుప్పించారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై దాడులు జరిగిన మరునాడే ప్రధాని స్పందించడం చర్చనీయంశమైంది.కాగా, ఇది ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడి కాదని వాళ్లు తూర్పు మిడ్నపూర్లోని భూపతినగర్ గ్రామ వాసులపై చేసిన దాడి అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఇదీ చదవండి.. మరో పదేళ్లు హేమమాలినీనే ఎంపీ -
ఎన్ఐఏ అధికారులపై దాడి.. గవర్నర్ ఆగ్రహం
కోల్‌కతా : యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులపై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఖండించారు. ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలను బెదిరించే ఇటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని, వాటిని పరిష్కరించాలని బోస్ పేర్కొన్నారు. పరిస్థితులను ఎదుర్కోవడంలో వేగంగా, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఈ రకమైన ‘గూండాయిజం’ సరైంది కాదని పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2022లో బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మరణించడంపై ఎన్ఐఏ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా బాంబు పేలుడు ఘటనకు సంబంధం ఉన్న మిడ్నాపూర్ జిల్లా భూపతినగర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానా, అతని సహచరులను అదుపులోకి తీసుకున్నారు. తిరిగి వస్తున్న ఎన్ఐఏ అధికారులపై స్థానికులు దాడి చేశారు.అధికారుల వినియోగించిన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక అధికారి గాయపడ్డారు. Another example of lawlessness in West Bengal under Mamata Banerjee government A team of NIA officers, which went to Bhupatinagar in East Medinipur District of West Bengal, to arrest two TMC leaders, were targeted More than 100 villagers, not only stopped the NIA team from… pic.twitter.com/aJWWSEOsh2 — Organiser Weekly (@eOrganiser) April 6, 2024 -
kolkata: ‘ఎన్ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్ఐకు అనుమతి ఉందా. ఎన్ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ -
khalistani Terrorists: నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల ఎన్ఐఏ పోలీసులు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని బిలాస్పూర్ గ్రామంలో, ఫర్దికోట్‌లోని ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖలిస్తానీ టెర్రరిస్తులు, లోకల్ మాఫియా మధ్య బలపడుతున్న నెట్‌వర్క్‌లను చేధించేందుకే విస్తృత సోదాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. సోదాల ద్వారా టెర్రస్టులకు చెందిన నగదు సీజ్ చేయడం, వారి ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటిని అటాచ్ చేయడం వీలవుతుందని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి.. గ్యాంగ్‌స్టర్,లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్‌వార్ ముప్పు -
Delhi: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతోంది. తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును సోమవారమే ఎన్ఐఏకు దర్యాప్తు నిమిత్తం అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ చేస్తున్న సోదాలు లష్కరే ఉగ్రవాది బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీలకు ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్న కేసులో జరుగుతున్నట్లు సమాచారం. పరప్పన జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నజీర్ ఉగ్రవాద బోధనలు చేస్తున్నట్లు 2023లో బెంగళూరులో పట్టుబడిన ఐదుగురు ఉగ్రవాదుల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ నేత దారుణ హత్య -
హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం హైదరాబాద్‌లో వీక్షణం పత్రిక ఎడిటర్, వరవరరావు అల్లుడు ఎన్. వేణుగోపాల్‌తోపాటు రచయిత, పౌరహక్కుల నేత రవిశర్మ నివాసాల్లో సోదాలు జరిపారు. తెల్లవారుజామున 4 గంటలకే హిమాయత్‌నగర్‌లోని ఎన్. వేణుగోపాల్ ఇంటితోపాటు ఎల్బీ నగర్ శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు పుస్తకాలు, కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి విచారణ కోసం హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఆ కేసు ఆధారంగా దర్యాప్తు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును గతేడాది సెప్టెంబర్ 15న కూకట్పల్లి పీఎస్ పరిధిలోని మలేసియా టౌన్షిప్లో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది జనవరి 3న ఎన్ఐఏ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంజయ్ దీపక్‌రావుతో ఎన్. వేణుగోపాల్, రవిశర్మకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల దృష్ట్యానే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ కేసులో వేణుగోపాల్‌ను 22వ నిందితుడిగా పేర్కొన్న ఎన్ఐఏ... రవిశర్మతోపాటు కేరళకు చెందిన మరో ముగ్గురిని సైతం నిందితులుగా చేర్చింది. కబలి దళం పేరిట సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా గురువారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సోదాల్లో మావోయిస్టు సాహిత్యంతో పాటు ఆరు సెల్ఫోన్లు, రూ. 1,37,210 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘాల ఖండన వేణుగోపాల్, రవిశర్మ ఇళ్లపై ఎన్ఐఏ దాడులను పౌరహక్కుల సంఘాల నాయకులు ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా దాడులు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేయగా అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు. నిర్బంద వ్యతిరేక వేదిక తెలంగాణ సైతం ఈ అరెస్టులను ఖండించింది. విచారణకు హాజరవ్వాలన్నారు: రవిశర్మ మన్సూరాబాద్: రవిశర్మ మీడియాతో మాట్లాడుతూ 10న విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశించారని చెప్పారు. 2016లో జనజీవన స్రవంతిలో కలిసినప్పటి నుంచి తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. 2019లో స్థానిక పోలీసులు, 2021లో ఎన్ఐఎ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తుచేశారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు: ఎన్.వేణుగోపాల్ ఎన్ఐఏ అధికారులు తనపై నమోదు చేసినది పూర్తిగా అబద్ధపు కేసని వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఆరోపించారు. ‘నేను ఒక మాస పత్రిక నడుపుతున్నాను. నేను ప్రస్తుతం విరసంలో లేను’అని మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన పేర్కొన్నారు. 2013లో నయీం బెదిరింపు లేఖలపై తాను రాసిన పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. తన మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారని, ఈ నెల 10న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు ఇచ్చారని వేణుగోపాల్ పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలుచోట్ల (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హర్యానాలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితులు, బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్లు అంకిత్ సెర్సా, ప్రియవ్రత్ ఫౌజీల కుటుంబ సభ్యులను విచారించేందుకు సోనిపట్ జిల్లాకి ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. VIDEO | NIA conducts raids in connection with #SidhuMooseWala murder case in Sonipat, Haryana. pic.twitter.com/ofm93XDhnI — Press Trust of India (@PTI_News) January 11, 2024 ఇదీ చదవండి: అశ్లీల కంటెంట్... యూట్యూబ్‌కు సమన్లు -
Karni Sena Chief’s Killing Case: కర్ణిసేన చీఫ్ హత్య..మరో నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గొగామెడి హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు అశోక్ కుమార్‌ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది. తాజా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ హత్యకు సంబంధించి రాజస్థాన్, హర్యానాల్లోని 31 ప్రదేశాల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. తాజాగా అరెస్టయిన నిందితుడు అశోక్‌కుమార్ కర్ణిసేన చీఫ్ హత్య తామే చేశామని క్లెయిమ్ చేసుకున్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారాకు సన్నిహితుడు. ‘కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం(జనవరి 3)న హర్యానా, రాజస్థాన్‌లోని 31 ప్రాంతాల్లో సోదాలు జరిపాం. వీటిలో నిందితులకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. సోదాల్లో భాగంగానే అశోక్ కుమార్ అనే నిందితుడిని రాజస్ధాన్‌లోని జున్జున్లో అరెస్టు చేశాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జైపూర్‌లోని శ్యామ్నగర్లో ఉన్న ఆయన ఇంట్లోనే కర్ణిసేన చీఫ్ గొగామెడిని ముగ్గురు షూటర్లు కాల్చిచంపారు. పట్టపగలు జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. హత్య తర్వాత రాజస్థాన్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇదీచదవండి..మహువా పిటిషన్..లోక్‌సభ సెక్రెటరీకి సుప్రీం నోటీసు -
దౌత్య కార్యాలయాలపై దాడులు.. 43 మందిని గుర్తించిన ఎన్ఐఏ
ఢిల్లీ: అమెరికా, యూకే, కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల్లో 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గుర్తించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు ఈ ఏడాది అమెరికా, యూకే, కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల కేసును జూన్‌లో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 19న లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ వర్గాలు రెండు వేర్వేరు దాడులకు పాల్పడ్డాయి. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులు జరిగాయి. ఈ ఏడాది ఆగష్టులో శాన్ ఫ్రాన్సిస్కోను ఎన్ఐఏ బృందం సందర్శించింది. మార్చి 2023లో కెనడా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ఈ కేసులో భారతదేశంలో ఇప్పటివరకు 50 చోట్ల దాడులు నిర్వహించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి సుమారు 80 మందిని విచారించారని సమాచారం. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్ -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు.. 2021నాటి పేలుళ్లతో లింక్
ఢిల్లీ: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన 2021నాటి పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2021లో అదే ప్రదేశంలో ఐఈడీ పేలుళ్లకు ప్రస్తుత దాడికి పోలికలు ఉన్నాయని సమాచారం. పేలుడు ఘటనలో ఇద్దరు అనుమానితులను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. నిందితులు ఇండియా గేట్ వైపు ఆటో రిక్షాను తీసుకెళ్తున్నట్లు పసిగట్టారు. చివరికి జామియా ప్రాంతంలో అనుమానితులను గుర్తించారు. 2021లో ఇదే ప్రదేశంలో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ కేసులోనూ నిందితులు జామియా వైపే వెళ్లారు. వారికోసం ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. ఈ రెండు పేలుళ్లలోనూ ఘటనాస్థలంలో టైప్ చేసిన అక్షరాలతో కూడిన లేఖ లభ్యమైంది. రెండు కేసుల్లోనూ ఆటోనే ఉపయోగించారు. జామియా వైపే వెళ్లారు. రెండు పేలుళ్ల ఘటనలకు పోలికలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సహా ఇతర భారత ఉగ్రవాద నిరోధక సంస్థలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి కేసును ఛేదించే పనిలో ఉన్నాయి. పేలుడు నేపథ్యంలో ఇండియాలో ఉన్న తమ దేశస్తులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద డిసెంబర్ 26న బాంబు పేలుడు సంభవించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆక్షేపిస్తూ ఓ లేఖ కూడా ఘటనాస్థలంలో లభ్యమైంది. బాంబు పేలుడు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కానీ ఎంబసీపై దాడిగానే ఇజ్రాయెల్ అధికారులు పరిగణించారు. ప్రస్తుతం ఎన్ఐఏ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు పేలుడు? లేఖ లభ్యం
ఢ్లిలీ: ఢ్లిలీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు బెదిరింపుల ఘటనలో ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు. దీంతోపాటు గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తూ ఓ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. లేఖను ఇజ్రాయెల్ జెండాలో చుట్టారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చర్యను ఎండగడుతూ ఢిల్లీలో ఆదేశ దౌత్యవేత్తకు దుండగులు లేఖ రాశారని వెల్లడించారు. ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఎంబసీపై బాంబు పేలుళ్లు జరుపుతామని బెదిరింపు కాల్ప్ వచ్చాయి. పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కానీ ఆ శబ్దం పేలుళ్లకు సంబంధించిందేనని ఇజ్రాయెల్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీపై దాడిగానే పరిగణించింది. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. #WATCH | Forensic teams and Dog squad of NSG carry out an investigation near the Israel Embassy. As per the Israel Embassy, there was a blast near the embassy at around 5:10 pm yesterday pic.twitter.com/X4lMPD2FR8 — ANI (@ANI) December 27, 2023 ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు సహా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) విస్తృతంగా గాలింపు చేపట్టగా ఓ లేఖ లభ్యమైంది. గాజాపై ఇజ్రాయెల్ చర్యను విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనపై నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఎంబసీ ప్రాంతంలో శబ్దం రసాయన పేలుడు అయి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్ఐఏ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. సమగ్రంగా దర్యాప్తు చేపడుతోంది. ఇదీ చదవండి: అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత -
ఎన్ఐఏ చేతికి కర్ణిసేన చీఫ్ హత్య కేసు
చంఢీగడ్: కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ గోగమేడి హత్య కేసును ఎన్ఐఏ చేపట్టింది. హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కర్ణిసేన అధినేతను డిసెంబర్ 5న రాజస్థాన్, జైపూర్‌లోని ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు. ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను డిసెంబర్ 9న చండీగఢ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. గోదారానే తమను సుఖ్‌దేవ్ గోగామేడి హత్యకు ఆదేశించారని పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న షూటర్లు గోదార సన్నిహితులు వీరేంద్ర చాహన్, దనరామ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొందరు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు సంబంధించి గోదార, గోగమేడి మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే హత్యకు దారితీసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: 'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్ష ఎంపీ మిమిక్రి -
పేలుళ్లకు కుట్ర.. 8మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. కర్ణాటక, ముంబయి, ఢిల్లీలో జరిపిన సోదాల్లో 8మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. Nia Foils ISIS Ballari Module’s Plans to Trigger IED Blasts Arrests 8 Terror Operatives, including Module Head, in Raids Across 4 States, Seizes Explosive Raw Materials, Weapons, Documents Exposing Terror Plans, etc. pic.twitter.com/jluje0B91b — NIA India (@NIA_India) December 18, 2023 సల్ఫర్, పొటాషియం నైట్రేట్, గన్‌పౌడర్ వంటి పేలుడు పదార్థాల నిల్వలు, ప్రతిపాదిత దాడుల వివరాలతో కూడిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. బాకులు, నగదు, డిజిటల్ పరికరాల వంటి పదునైన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. బళ్లారి మాడ్యూల్‌కు చెందిన నాయకుడు మహ్మద్ సులైమాన్ అరెస్టైన వాళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులు సమాచారం పంచుకోవడానికి IM యాప్‌లను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోపేలుళ్లు జరపడానికి కుట్ర పన్నారని అధికారులు పేర్కొన్నారు. తమ గ్యాంగ్‌లో చేర్చుకోవడానికి కళాశాల విద్యార్థులను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని గత వారం ఎన్ఐఏ 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
టార్గెట్ ఐసిస్..44 చోట్ల ఎన్ఐఏ రెయిడ్స్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్ లక్ష్యంగా కర్ణాటక,మహారాష్ట్రల్లో ఏకకాలంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)రెయిడ్స్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం 44 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలోని ఒక ప్రాంతంలో మహారాష్ట్రలో 43 చోట్ల ఎన్ఐఏ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా దాడులకు ఐసిస్ కుట్ర పన్నిందని సమాచారం రావడంతోనే ఎన్ఐఏ ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.ఈ రెయిడ్స్‌లో భాగంగా ఎన్ఐఏ ఇప్పటికే 13 మంది దాకా అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..! -
ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు ఎన్ఐఏ షాక్
టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) షాకిచ్చింది. అతడిపై పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు సోమవారం పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి, కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు పెట్టినట్టు వెల్లడించింది. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 4 న ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. సిక్కులు ఎవరూ నవంబరు 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఒకవేళ అలా ఎవరైనా ప్రయాణిస్తే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించాడు. మొత్తం 37 సెకెన్ల వీడియోలో అదే రోజు నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటూ బెదిరించడం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కలకలం రేపాయి. దీంతో హై అలర్ట్ జారీ చేసిన ఇండియా, కెనడాతోపాటు ఎయిరిండియా పయనిచంఏ ప్రయాణించే కొన్ని ఇతర దేశాలలో భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి. 2019లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ అతనిపై తొలి కేసు నమోదైంది. అప్పటికీ అతడు ఎన్ఐఏ దృష్టిలో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ,చండీగఢ్‌లోని అమృత్‌సర్‌లో ఇల్లు , కొంతభూమిని జప్తు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పన్నన్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29న అతన్ని "ప్రకటిత నేరస్థుడిగా" ప్రకటించింది. భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పేరు ప్రతిచోటా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. -
తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: తెలంగాణతో సహా దేశంలో 10 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. National Investigation Agency (NIA) is conducting raids across 10 states in connection with Human Trafficking cases. More details awaited. — ANI (@ANI) November 8, 2023 తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్లో సోదాలు జరుగుతున్నాయి. Tripura, Assam, West Bengal, Karnataka, Tamil Nadu, Telangana, Haryana, Puducherry, Rajasthan and Jammu & Kashmir are among the states being searched by the NIA in the human trafficking case. — ANI (@ANI) November 8, 2023 మరోవైపు టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కశ్మీర్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థ(ఎస్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. అనంతనాగ్, పుల్వామా జిల్లాలతో సహా దక్షిణ కశ్మీర్లో ఎస్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. #WATCH | J&K: State Investigation Agency (SIA) is conducting raids at several places in the Anantnag & Pulwama districts of South Kashmir. The raids are being conducted in connection with a terror funding case. (Visuals from Panzgam village of Kokernag area in Anantnag district) pic.twitter.com/ZWbxDUwryy — ANI (@ANI) November 8, 2023 -
19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) రెడ్ కార్నర్ నోటీసు జారీ ఏసింది. నకిలీ పాస్‌పోర్ట్‌తో రెండేళ్ల క్రితం అమెరికాకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ యోగేష్ కాద్యాన్‌పై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం లాంటి అభియోగాలతో తాజాగా ఈ నోటీసు లిచ్చింది. యోగేష్ చిన్న వయస్సులోనే ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌లో ఇతను కూడా చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం యుఎస్‌లోని బాబిన్హా గ్యాంగ్‌లో చేరిన కాద్యాన్‌కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిపోయాడనే తీవ్ర ఆరోపణలూ ఉన్నాయి. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) ఈ నేపథ్యంలోనే ఇండియాలో కాద్యాన్ ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)దాడులు చేసింది. అలాగే అతని ఆచూకీ తెలిపిన రూ.1.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా ఇంటర్‌పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అంతకుముందు, విదేశాలకు పారిపోయాడని భావిస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. వీరంతా ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను తొలగించి, అమెరికా, కెనడాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) కాగా గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌లో NIA ఇటీవల వేగం పెంచింది. దీంతోచాలా మంది గ్యాంగ్స్టర్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవడమో, లేదా యోగేష్ కడియన్ మాదిరిగా నకిలీ పాస్‌పోర్ట్‌లతో భారతదేశం నుండి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసును ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రధాన నిందితుడు. (కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!) గత నెలలో పంజాబ్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ (సుఖ దునేకే) కెనడాలో తామే హత మార్చామని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో అతను ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచాడు. గతంలో కూడా పలు మార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ఎన్ఐఏ పేరిట ఐఎస్ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే, లవ్జిహాదీలకు ప్రేరేపించే, సోషల్ మీడియాలో ముస్లింలు పెట్టే అభ్యంతరకరమైన మెసేజ్‌లపై సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) పేరిట ఓ తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యతిరేక భావజాలం ఉన్న ముస్లింల సమాచారం ఇవ్వాలంటూ ఫేక్ ఫోన్ నంబర్లతో ఎన్ఐఏ పేరిట ప్రచారం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ వర్గాన్ని ఎన్ఐఏ టార్గెట్‌గా చేసుకున్నట్టు కొన్ని తప్పుడు సందేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్నాయని వెల్లడించింది. నకిలీ ఫోన్ నంబర్లను జత చేసిన ఈ సందేశాలతో ఎన్ఐఏకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్ఐఏ అధికారులు దీనిపై ఆరా తీయగా..ఈ తరహా సందేశాలతో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మోసపూరితంగా భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ, తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను ఎన్ఐఏ అధికారులు కోరారు. -
రాష్ట్రంలో 53 చోట్ల ఎన్ఐఏ సోదాలు
సాక్షి, అమరావతి: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, మద్దతుదారులు, పౌరహక్కుల నేతల నివాసాల్లో సోమవారం సోదాలు చేసింది. విప్లవ రచయితల సంఘం (విరసం), మానవహక్కుల సంఘం, రాష్ట్ర పౌరహక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం, కులనిర్మూలన పోరాట సమితి, పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ప్రజాకళా మండలి, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ తదితర సంఘాల నేతల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కోణంలో 53 నివాసాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో ఒక నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లతోపాటు మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కూటగల్లులోని రాష్ట్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.చంద్రనర్సింహులు ఇంట్లో నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. కడపలోని ఒక ఇంట్లో రూ.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులుగా పేర్కొంటూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఎన్ఐఏ అధికారులు గుంటూరు జిల్లాలో 13 ఇళ్లలోను, శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది, ఎన్టీఆర్ జిల్లాలో ఆరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో నాలుగేసి, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మూడేసి, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, విజయనగరం, శ్రీసత్యసాయి, ఏలూరు, తిరుపతి, పల్నాడు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల జిల్లాల్లో ఒక్కో ఇంట్లో సోదాలు నిర్వహించారు. 2020లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఐఏ ఓ కేసు నమోదు చేసి 2021 మే నెలలో చార్‌్జషీట్ దాఖలు చేసింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
జిల్లాలో ఎన్ఐఏ తనిఖీలు
పొన్నూరు/తాడేపల్లి రూరల్/మంగళగిరి: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు సోమవారం జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల నేతల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పొన్నూరుకు చెందిన ప్రజావైద్యశాల డాక్టర్ టి.రాజారావు పౌరహక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నారు. సుమారు ఐదు గంటలపాటు రాజారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. డాక్టర్ రాజారావు వద్ద లభించిన కరపత్రాలు, కమ్యూనిస్టు సంబంధిత పుస్తకాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడులో నివాసముంటున్న ప్రగతిశీల సమైఖ్య సభ్యుడు బత్తుల రామయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం డోలాస్‌నగర్‌లోని పలువురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మంగళగిరి నగర పరిధిలోని నవులూరు మక్కెవారిపేటలో నివాసం ఉంటున్న చైతన్య మహిళా సంఘం సభ్యురాలు సిప్పోరా నివాసంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఒక సెల్‌ఫోన్, విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన దేవభక్త ప్రజాతంత్ర ఉద్యమ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమలపాకుల సుబ్బారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. చివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వెనుదిరిగారు. డాక్టర్ రాజారావు విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులతో సంబంధాలు, రాజకీయ పార్టీలతో సంబంధాలపై ఆరా తీశారని అన్నారు. -
వరంగల్‌పై ఎన్ఐఏ గురి! సోమవారం మళ్లీ దాడులు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉద్యమాలకు కేరాఫ్ అయిన వరంగల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురిపెట్టింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాత విప్లవ రాజకీయాలకు అడ్డాగా మారిన ఈప్రాంతంలో కార్యకలాపాలపై ఆరా తీస్తోంది. పౌరహక్కులు, ప్రజాసంఘాల కార్యకలాపాలు, నాయకుల కదలికలపై నిఘా పెట్టింది. ఈమేరకు ఎన్ఐఏ వరంగల్ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల తరచూ సోదాలు నిర్వహిస్తోంది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలతో సమావేశమైనట్లు సమాచారం ఉందని.. 152 మందిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత హరగోపాల్ సహా ఆరుగురిపై కేసులు ఎత్తివేయగా.. ప్రొఫెసర్ ఖాసీం సహా 146 మందిపై విచారణ జరుగుతోంది. గత సెప్టెంబర్‌లో విశాఖపట్నంలో నమోదైన ఓ కేసు విషయంలో హనుమకొండ హంటర్‌రోడ్డులోని సముద్రాల అనిత ఇంట్లో సోదాలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న కూడా వరంగల్‌లోని ఐదు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తాజాగా సోమవారం హంటర్‌రోడ్డు, ప్రకాశ్‌రెడ్డిపేట, పైడిపల్లిలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించి సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఓ వైపు ‘ఉపా’.. మరోవైపు సోదాలు.. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాల వ్యూహంలో భాగంగా ఎన్ఐఏ నిఘా ముమ్మరం చేసింది. ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలపై ఓ వైపు కేసులు.. మరోవైపు ఇళ్లల్లో సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి సమీపంలో మావోయిస్టు నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఇతర మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో ములుగు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అమాయక గిరిజన యువతను దళంలో చేర్చుకోవడం.. అధికారులు, అమాయక పౌరులను హత్య చేయడం, నిధుల సేకరణ వంటి లక్ష్యాలతో ఈ సమావేశం జరగ్గా, పోలీసుల రాకతో వారంతా పారిపోయారు. ఈమేరకు పస్రా సీఐ ఫిర్యాదు మేరకు అక్కడ పంచనామా నిర్వహించి ఐపీసీ 120బీ, 147, 148 రెడ్ విత్ 149.. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)’లోని సెక్షన్లు 10, 13, 18, 20, 38, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25 (1–బీ)(ఎ)ల కింద తాడ్వాయి పోలీసులు 152 మందిపై కేసు నమోదు చేశారు. మావోయిస్టు నేతలు, వారి సానుభూతిపరులు, సమావేశ స్థలం వద్ద లభించిన సాహిత్యంలో ఉన్న ఇతరుల పేర్లపై కేసులు నమోదు చేశారు. 2023 జూన్‌లో ఈ కేసు వెలుగు చూడగా.. ఈ కేసులో ప్రొఫెసర్ హరగోపా ల్, పద్మజా షా, రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్, సురేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించలేదని కేసులు ఎత్తివేశారు. ప్రొఫెసర్ కాశీం, పీఓడబ్ల్యూ నేత సంధ్య, విమలక్క సహా 146 మందిపై కేసు కొనసాగుతుంది. ఇదంతా సద్దు మణిగిన కొద్ది రోజులకే ఉమ్మడి జిల్లాలో ఎన్ఐఏ సోదాలు ఉధృతం చేయడం కలకలం రేపుతోంది. ‘కవర్ సంఘాల’ కట్టడి.. అనుమానంతో సోదాలు.. మావోయిస్టు పార్టీకి కవర్సంఘాలు పని చేస్తున్నాయంటూ పలు ప్రజాసంఘాల నాయకులపై తరచూ కేసులు నమోదు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో రాధ అనే నర్సింగ్ విద్యార్థి కొన్నేళ్ల క్రితం కిడ్నాప్ కాగా.. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులే కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోచమ్మ 2017లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై 2022న ఎన్ఐఏ కేసు టేకప్ చేసింది. ఈకేసులో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈక్రమంలో చైతన్య మహిళా సంఘంలో గతంలో చురుగ్గా పని చేసిన సముద్రాల అనిత, ఆమె తల్లిగారిళ్లలో గతేడాది సెప్టెంబర్‌లో సోదాలు నిర్వహించారు. తాజాగా సోమవారం కూడా ఆమె ఇంట్లో మళ్లీ సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలిగా వ్యవహరిస్తున్న కొత్తకొండ శాంతమ్మ ఇంట్లోనూ ఈసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. పైడిపల్లిలోని ఆమె ఇంటిని ఉదయమే పోలీసులు చుట్టుముట్టగా.. తర్వాత ఎన్ఐఏ అధికారులు ఇల్లంతా తనిఖీ చేశారు. ఇంట్లో ప్రజాకవి వరవరరావుపై ప్రొఫెసర్ కాశీం రాసిన ‘కాగితం మీద అక్షరానికి కమిటైన కవి వరవరరావు’, ‘జన హృదయం జనార్దన్.. అమరుడు సూరపనేని జనార్దన్’ తదితర పుస్తకాలు లభ్యమయ్యాయి. 2016 మార్చి 1న ఎన్కౌంటర్లో మృతిచెందిన శాంతమ్మ కూతురు కొత్తకొండ సృజన అలియాస్ నవత ఫొటోలను పరిశీలించిన అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కాగా.. ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు వివరాలు మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా వరంగల్‌లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. -
ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు..
-
ఖలిస్థానీ గురుపత్వంత్ సింగ్ పన్నున్‌పై ఎన్ఐఏ సంచలన నివేదిక..
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కెనడా-భారత్ మధ్య ఖలిస్థానీ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో కెనడాలో ఉంటున్న హిందువులను తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) నివేదికలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్.. భారత్‌ను విజజింజే కుట్ర చేసినట్టు ఎన్ఐఏ పేర్కొంది. దేశ విభజనకు బిగ్ ప్లాన్.. వివరాల ప్రకారం.. ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు సంబంధించిన కొన్ని విషయాలను ఎన్ఐఏ వెల్లడించింది. ఇందులో భాగంగా అతడు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి, ఎన్నో దేశాలు ఏర్పాటు చేయాలని భారీ కుట్ర పన్నినట్టు ఓ నివేదిక తెలిపింది. భారతదేశ ఐక్యత, సమగ్రతను అతడు సవాల్ చేసినట్టు.. ఆడియో మెసేజ్‌ల ద్వారా అధికారులు గుర్తించారు. కశ్మీర్ ప్రజల కోసం ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని, వారి కోసం ఒక ముస్లిం దేశం సృష్టించాలని, దానికి ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్’ అనే పేరు పెట్టాలని పన్నూన్ కుట్ర పట్టిన్నట్టు నివేదికలో వెల్లడించింది. Khalistani terrorist Pannun wants to divide India, create many countries: NIA report#NIA #KhalistaniTerrorist #GurpatwantSinghPannu pic.twitter.com/n66SETX3OS — Bnz English (@BnzEnglish) September 25, 2023 ఎన్ఐఏ సంచలన నివేదిక.. ఎన్ఐఏ రిపోర్టు ప్రకారం.. ఇండియా గేట్ వద్ద ఖలిస్తానీ జెండాను ఎగురవేసేవారికి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ 2.5 మిలియన్ల అమెరికా డాలర్ల బహుమతిని ఆఫర్ చేశాడు. 2021లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటలో భారత జెండాను ఎగురవేయకుండా ఆపిన పోలీసు సిబ్బందికి అతను ఒక మిలియన్ అమెరికా డాలర్లను కూడా ఆఫర్ చేసినట్లు నివేదికలో స్పష్టమైంది. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలోని ప్రముఖ ప్రదేశాలలో ఖలిస్తానీ పోస్టర్లు, జెండాలను అమర్చడానికి అతను చాలాసార్లు ప్రయత్నించాడని పేర్కొంది. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదిలా ఉండగా.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే భారత్ అతడికి స్ట్రాంగ్ కౌంటర్చింది. పన్నూన్ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. అనంతరం.. అమృత్సర్ జిల్లా ఖాన్‌కోట్‌లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. మరోవైపు అతనిపై పంజాబ్‌లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఇవి పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అలాగే హర్యానా, ఉత్తరాఖండ్‌లలో నమోదయ్యాయి. Gurpatwant Singh Pannu is nothing more than a Drama Queen! He is openly threatening Hindu diaspora of India residing in Canada in a new video & yet the Canadian govt is silent, how can one not rule out the fact that the Canadian govt is not hand in glove with this Terrorist! pic.twitter.com/pNzvWdKZPR — Racheal (@2004Racheal) September 25, 2023 ఇది కూడా చదవండి: తమిళనాట ట్విస్ట్.. ఎన్డీఏకు అన్నాడీఎంకే గుడ్‌బై.. -
రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోనూ ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్‌లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్‌లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి? ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది. -
తెలంగాణలో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ(National Investigation Agency) ఇవాళ దాడులు చేసింది. వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం.. ఈ దాడులు జరిగాయి. మావోయిస్టులకు అదునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా అవుతున్నాయనే అనుమానాలతోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. అలాగే ఈ దాడులకు సంబంధించి.. 12 మందిపై NIA కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
పక్కా ప్లాన్ ప్రకారమే కత్తితో దాడి: న్యాయవాది వెంకటేశ్వర్లు
సాక్షి, విజయవాడ: విశాఖ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసుపై సీఎం తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వెల్లడించారు. కాగా, సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నంపై కేసులో ఎన్ఐఏ 39 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు ఎన్ఐఏకి సిట్ వివరాలు అప్పగించలేదు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉంది. 2017లో శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీనివాస్ పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసింది. నాటి డీజీపీ ఎన్ఐఏకి రికార్డ్ చేయవద్దని సిట్‌కి ఆదేశాలు ఇచ్చారు. రికార్డులు ఎన్ఐఏకి పోలీసులు మొదట అప్పగించలేదు. ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?.. ఎయిర్‌పోర్టు అథారిటీకి శ్రీనివాస్ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. శ్రీనివాస్‌ది ఎయిర్‌పోర్టులో ఇల్లీగల్ ఎంట్రీ. కత్తితో ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?. శ్రీనివాస్‌పై కేసు ఉన్నందుకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేసే నాటికి శ్రీనివాస్‌పై కేసు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్ వేశారు. ప్లాన్ ప్రకారమే దాడి.. సీఎం జగన్‌పై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది. సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఎన్ఐఏ కూడా చెప్పింది. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు -
సైబర్ ఉగ్రవాదానికి ఇక చెక్
సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది. విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి. 2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్స్పైనా ఉగ్రవాదం గురి లద్దాక్‌లోని విద్యుత్ గ్రిడ్లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు. దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్‌తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్‌తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది. -
AP: హరగోపాల్ భార్య శిరీష అరెస్టు
సాక్షి, అమరావతి: కుల నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు ప్రభాకర్‌తో పాటు దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్(ఆర్కే) భార్య కందుల శిరీష అలియాస్ పద్మక్కను కూడా అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో ఛత్తీస్‌గఢ్‌లోని ట్రియ గ్రామంలో భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపిన దాడి కేసులో వారిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించింది. దీనిని ఆర్కే డైరీ కేసుగా ఎన్ఐఏ పరిగణిస్తోంది. శిరీష, దుడ్డు ప్రభాకర్‌తో పాటు ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. శిరీషను ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని ఆమె నివాసంలో, ప్రభాకర్‌ను విజయవాడలో ఆయన నివాసంలో ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల నుంచి నిధులు పొందుతూ.. ఆ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు వీరిద్దరూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. మావోయిస్టు పార్టీ అనుబంధ విభాగాల పటిష్టత కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు -
మావోయిస్టు ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్ఐఏ ప్రకటన
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ భార్య శిరీషను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. ఆమెతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. వీరిద్దరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ తెలిపింది. ఇప్పటికీ వారు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా మావోయిస్టుల కోసం రిక్రూట్మెంట్ జరుపుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. 2019లో తిరియా ఎన్కౌంటర్లో ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్‌లు పాల్గొన్నారని ఎన్ఐఏ తెలిపింది. వారోత్సవాల్లో భాగంగా వారు భారీ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించింది. ఆర్కే డైరీ ఆధారంగానే శిరీష, దుడ్డు ప్రభాకర్‌లను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. గతంలోనూ తనిఖీ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎన్ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది. ఇదీ చదవండి: ఎన్ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష -
ఎన్ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష
టంగుటూరు: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. అనంతరం ఆమెను టంగుటూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, ఐదు నిమిషాలు అక్కడ ఉంచారు. అనంతరం సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్సై శ్రీరామ్, ఒంగోలు దిశ ఎస్సై ఫిరోజ్ ఫాతిమాల సమక్షంలో ఆమెను అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లారన్నది తెలియరాలేదు. ఈ సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆమెను ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారో కూడా వెల్లడించలేదు. గతంలోనూ తనిఖీ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎన్ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది. ఆ సమయంలో శిరీష వైద్యం నిమిత్తం విజయవాడ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో విరసం నేత కళ్యాణరావును తీసుకొచ్చారు. శిరీష లేకుండా తలుపులు తీయడానికి ఆయన నిరాకరించడంతో తహసీల్దార్, వీఆర్వో సమక్షంలో తాళం పగలగొట్టారు. శిరీష ఇంటి నుంచి సాధారణ షాపుల్లో దొరికే కొన్ని పుస్తకాలు, పలు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇది అక్రమ అరెస్టు: కళ్యాణరావు శిరీషను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొన్నట్లు తెలుసుకున్న విప్లవ రచయితల సంఘం నేత గంగుల కళ్యాణరావు హుటాహుటిన స్టేషన్‌కు వచ్చారు. కళ్యాణరావు, ఇతర బంధువులు ఎస్సై శ్రీరామ్‌తో మాట్లాడారు. అనంతరం కళ్యాణరావు మీడియాతో మాట్లాడుతూ.. శిరీషను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఎన్ఐఏ బృందం తమ కుటుంబానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శిరీషను బలవంతంగా తీసుకెళ్లిందని, ఎక్కడ ఉంచారన్నదీ ఇప్పటివరకు తెలపకపోవడం దారుణమని చెప్పారు. ఎవరినైనా అరెస్టు చేసే ముందు కుటుంబ సభ్యులకు తెలపాలని అన్నారు. శిరీషను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.శిరీషపై పెట్టినవన్నీ బూటకపు కేసులేనని అన్నారు. -
ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఇవేనా?
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్ గత నెల 24న రీ–రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్ఐఏ బృందం సోమవారం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుంది. ఏటీఎస్ అధికారులతో సమావేశమైన ఈ టీమ్.. కేసు పూర్వాపరాలు తెలుసుకుంది. గత నెల 9న∙ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్ షరియత్ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసింది. వీరి టార్గెట్‌లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు ఏటీఎస్ ఆరోపిస్తోంది. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకున్నారనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ సమీకరిస్తున్న వీరి అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్‌లకు చెందిన మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్‌లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్ తీసుకురావాలని ఎన్ఐఏ నిర్ణయించింది. -
భారత్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. నేపాల్‌లో సినీ ఫక్కీలో అరెస్ట్
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ నేపాల్‌లో తలదాచుకున్న మావోయిస్టు నేత దినేష్ గోపే అరెస్ట్ అయ్యాడు. ఇక, అంతకుముందు గోపే ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, ఝార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి. వివరాల ప్రకారం.. మావోయిస్టు నేత దినేష్ గోపే మారు వేషంతో నేపాల్‌లో తలదాచుకుంటున్నాడు. మూడు రాష్ట్రాల్లో 100కుపైగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న గోపేను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. కాగా, నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన దినేష్ గోపే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ 13 నెలలుగా నేపాల్‌లో దాబా నడుపుతున్నాడు. అయితే, ఇటీవల ఆయన.. జార్ఖండ్‌లోని బీజేపీ నేతలకు ఫోన్ కాల్ చేయడంతో ఎన్ఐఏకు చిక్కాడు. అతడి ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేసిన అధికారులు.. గోపే నేపాల్‌లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు ఎంతో చాకచక్యంగా గోపేను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. గతేడాది జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్భమ్లో గోపే నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) సభ్యులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ నుంచి గోపే చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత నేపాల్ పారిపోయి అంతర్జాతీయ సరిహద్దులోని బిరత్నగర్లో ధాబా నడుపుతున్నాడు. అయితే, నిరుద్యోగులైన యువకులకు ఆయుధాల వాడకంలో శిక్షణ ఇవ్వడంతో పాటు మోటార్ బైక్స్ ఇచ్చి హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేలా చేశాడు దినేష్ గోపే. కాగా, గత 15 ఏళ్లుగా భారతీయ భద్రతా సంస్థలు, సీఆర్పీఎఫ్ ఫోర్స్ నక్సలైట్ దినేష్ గోపే కోసం వెతుకుతున్నాయి. మరోవైపు.. జార్ఖండ్, బీహార్, ఒడిశాలలో హత్యలు, కిడ్నాపులు, బెదిరింపులు, దోపిడీలు, నిధుల సేకరణ వంటి వాటికి సంబంధించి గోపేపై 102 కేసులు నమోదయ్యాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, జార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి. Most wanted Naxal Commander Dinesh Gope was living in Delhi arrested in Joint op by NIA & JH Police. He is wanted by JH, Odisha, Bihar in 100+ cases & had ₹30L reward. Has 100's of pockets all around the borders of Delhi where u have Illegal Immigrants staying in millions. pic.twitter.com/F35UuJVs0R — Kavi 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (@kavita_tewari) May 22, 2023 ఇది కూడా చదవండి: 'మా స్టాండ్‌ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ: శరద్ పవార్ -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ
కశ్మీర్: అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది. General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of 05 #IndianArmy Bravehearts, Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh & Sep Sewak Singh who laid down their lives in the line of duty at #Poonch Sector. https://t.co/7YSI1sEiEb — ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2023 అమరులైన జవాన్లు వీరే ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్‌నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్‌నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్‌గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు అసలేం జరిగిందంటే.. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్‌పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు. J&K | Visuals from Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday. (Visuals deferred by unspecified time) pic.twitter.com/331XNOeQWj — ANI (@ANI) April 21, 2023 హై అలర్ట్ పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి. మరోవైపు పూంచ్‌లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. చదవండి: Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి -
Dawood Ibrahim: రెండో పెళ్లి కలకలం..వెలుగులోకి సంచలన విషయాలు
పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ సంచలన విషయాలు వెల్లడించాడు. దావూద్ పాక్ మహిళ పఠాన్‌ను రెండో పెళ్లి చేసకున్నాడంటూ బాంబు పేల్చాడు. అలాగే అతను పాకిస్తాన్‌లోని కరాచిలోనే ఉన్నాడని కాకపోతే వేరే ప్రదేశంలోకి మకాం మార్చాడని కీలక విషయాలు చెప్పాడు. ఈ మేరకు ఉగ్రవాద నిధుల కేసుకి సంబంధించి నేషనల్ ఇన్విస్ట్‌గేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చేసిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ ఈ విషయాలను బయటపెట్టాడు. ఈ అలీషా పార్కర్ దావూద్ ఇబ్రహీం సోదరి, చనిపోయిన హసీనా పార్కర్ కుమారుడు అలిషా ఇబ్రహీం పార్కర్. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహితులపై కేసు నమోదు చేసి కొందర్ని అరెస్టు చేసింది కూడా. అదీగాక దావూద్ దేశంలో బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది. వారు తమ అరాచకాలను పెద్దపెద్ద నగరాల్లో వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సాగిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ నుంచి ఎన్ఐఏ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ మేరకు అలీషా పార్కర్ విచారణలో ...దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని, అలాగే అతడి భార్య తన వాళ్లతో టచ్‌లోనే ఉందని చెప్పాడు. అలాగే అతను ఈ కేసులో పట్టుబడకుండా ఉండేందుకే పాకిస్తాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె పేరు పఠాన్ అని చెప్పుకొచ్చాడు.ఇప్పడూ దావూద్ కరాచీలోని అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక ఉన్న రహీమ్ ఫకీ సమీపంలోని డిఫెన్స్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపాడు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను తాను కొన్ని నెలల క్రితం జులై 2022లో దుబాయ్‌లో కలిశానని చెబుతున్నాడు. అలాగే ఆమె పండుగలకు తన భార్యకు ఫోన్ చేస్తుంటుందని, వాట్సాప్ కాల్స్ ద్వారా తన భార్యతో మాట్లాడుతుందని కూడా చెప్పాడు. ప్రస్తుతం దావూద్, అతని సన్నిహితులు అనీస్ ఇబ్రహీం షేక్, ముంతాజ్ రహీమ్ ఫకీ తదితరులు తమ కుటుంబాలతో సహా పాకిస్తాన్‌లోని కరాచీలో డిఫెన్స్ కాలనీలో అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక నివశిస్తున్నారని పేర్కొన్నాడు. అతను ఇప్పుడూ ఎవరితోనూ టచ్‌లో లేడని చెబుతున్నాడు. అలాగే దావూద్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడనేది అవాస్తవం అని చెప్పాడు. దావూద్‌కి మొదటి భార్య మైజాబిన్‌తో ముగ్గురు కూమార్తెలు, ఒక కూమారుడు ఉన్నారని తెలిపాడు. అంతేగాదు అలీషా పార్కర్ విచారణలో దావూద్ నలుగురు సోదరులకు సంబంధంచిన విషయాలు కూడా దర్యాప్తు సంస్థకు వెల్లడించినట్లు సమాచారం. (చదవండి: దావూద్‌పై ఎన్ఐఏ రూ.25 లక్షల బౌంటీ.. అండర్ వరల్డ్ డాన్‌పై ఎన్ని కేసులన్నాయంటే..) -
ఆ దాడి వెనుక తెలంగాణ మావోలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా టార్రెమ్ పోలీస్‌స్టేషన్ పరిధి టేకల్ గుడియం సమీపంలో పోలీసులపై జరిగిన దాడి ఘటన వెనుక తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలే కీలకంగా వ్యవహరించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ ఘటనకు సూత్రధారులుగా 23మంది పేర్లను పేర్కొన్న ఎన్ఐఏ.. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎనిమిది మంది పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చింది. 2021 ఏప్రిల్ 3న జరిగిన ఈ దాడి ఘటనలో డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్లకు చెందిన పోలీసులు 22మంది మృతి చెందగా, 35మందికిపైగా గాయపడ్డారు. సుమారు 21 నెలలపాటు విచా రణ జరిపిన ఎన్ఐఏ అధికారులు... దాడిలో 350 నుంచి 400 మంది వరకు సాయుధ మావోయి స్టులు పాల్గొన్నప్పటికీ కేసులో (ఆర్సీ–02/ 2021/ఎన్ఐఏ/ఆర్పీఆర్) 23మందిపైన చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. సంచలనం కలిగించిన తారెం ఘటన పోలీస్ సాయుధ బలగాలపై మెరుపుదాడి చేసిన ఆ ఘటన కేసును మొదట బీజాపూర్ జిల్లాలోని టార్రెమ్ పోలీస్‌స్టేషన్ ఎఫ్ఐఆర్ నం.06/2021 ప్రకారం నమోదు కాగా, తర్వాత ఎన్ఐఏ ద్వారా 2022 జూన్ 5వ తేదీన తిరిగి నమోదు చేశారు. భద్రతా దళాలు సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులపై బారెల్ గ్రెనేడ్ లాంచర్(బీజీఎల్)లు, ఆటోమేటిక్ ఆయుధాలతో కా ల్పులు జరిపి రాకేశ్వర్ సింగ్ మన్హాస్ అనే కోబ్రా జవాన్‌ను కూడా అపహరించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తెలంగాణ అగ్రనేతలే సూత్రధారులు... 21 నెలల విచారణ తర్వాత ఎన్ఐఏ తన దర్యా ప్తులో దాడి వెనుక సీపీఐ(మావోయిస్ట్) సీనియర్ నేతల పాత్ర ఉందని తేల్చింది. ఐపీసీలోని సెక్షన్లు– 120 రెడ్‌విత్/302 – 307, 396, 149, 121 మరియు 121ఎలతో పాటు భారతీయ ఆయుధ చట్టం, 1959లోని సెక్షన్లు– 25(1ఏ) – 27, ఈ చట్టం 1908లోని సెక్షన్ – 3, 4 – 6 మరియు సెక్షన్లు– 16, 18, 18ఏ, 20, యుఏ(పీ) చట్టం, 1967లోని 38ల కింద కేసులు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కమిటీ సలహాదారుడు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతితోపాటు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ గంగన్న, కేంద్ర నాయకులు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, సుజాత అలియాస్ పోతుల కల్పన (మల్లోజుల కోటేశ్వర్రావు భార్య), ఉమ్మడి వరంగల్‌కు చెందిన సాగర్ అలియాస్ అన్నే సంతోష్, రఘు రెడ్డి అలియాస్ వికాస్, నిర్మల అలియాస్ నిర్మలక్కలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పొడియం హిద్మా అలియాస్ హిడ్మన్న, మద్నా అలియాస్ జగ్గు దాదాలతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర, దండకారణ్యం, ఏరియా కమిటీలకు చెందిన 15 మంది పేర్లను ఎన్ఐఏ ప్రధానంగా పేర్కొంది. -
వాంటెడ్ టెర్రరిస్ట్ హర్‌ప్రీత్ సింగ్ అరెస్ట్
సాక్షి న్యూఢిల్లీ: వాంటెడ్ టెర్రరిస్ట్ హర్‌ప్రీత్ సింగ్‌ను ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. లూథియానా కోర్టు పేలుడు కేసులో ప్రధాన కుట్రదారుడైన హర్‌ప్రీత్‌ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన హర్‌ప్రీత్.. ఘటన అనంతరం మలేషియాకు చెక్కేశాడు. తాజాగా భారత్‌కు రాగా పక్కా సమాచారంతో కాపుగాసిన ఎన్ఐఏ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే అతనిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. కాగా, 2021 డిసెంబర్ 23 న లూథియానా కోర్టులో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన సెల్ఫ్-స్టైల్ సంస్థ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) చీఫ్ లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడు హర్‌ప్రీత్ సింగ్ లూథియానా కోర్ట్ బిల్డింగ్ పేలుడు కుట్రదారుల్లో ఒకడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ -
సంచలనాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇప్పుడు అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు, ఎమ్మెల్యేల ఎరపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) గురించే జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో ప్రతీరోజూ పతాకశీర్షికన కథనాలు వస్తుండగా.. ఈ వ్యవహారాలన్నీ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ.. వీరు విచారిస్తున్న ప్రతీ కేసులోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ► ఉద్యమకాలం నుంచి రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర అవతరణ అనంతరం కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్రంలో టీఆర్ఎస్–బీజేపీ మధ్య రాజకీయవైరం పతాకస్థాయికి చేరడం, కేంద్ర దర్యాప్తు సంస్థలు జోరు పెంచడం, రాష్ట్ర దర్యాప్తు బృందాలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ వ్యవహారంలోనూ కరీంనగర్ వ్యక్తులే కీలకంగా మారుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ► ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ సంస్థలపై ఈడీ, ఐటీ ఆకస్మిక దాడులు నిర్వహించడం.. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అదే సమయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పార్టీలు మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలోనూ ఉమ్మడి జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ రమణకు ఈడీ సంస్థ నోటీసులు ఇవ్వడం.. శుక్రవారం ఆయన విచారణకు హాజరవడం జరిగాయి. తొలుత ఎన్ఐఏ.. నిజామాబాద్‌లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఉ గ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థలో క్రియాశీలక సభ్యుడు జగిత్యాల వాసిగా గుర్తించా రు. ఈ క్రమంలో సెప్టెంబరు 19వ తేదీన దేశవ్యాప్తంగా సదరు సంస్థపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో సదరు జగిత్యాల వాసిని కరీంనగర్‌లోని నాఖా చౌరస్తా సమీపంలోని ఓ ఇంటి నుంచి అరె స్టు చేసి తీసుకెళ్లారు. ఆ రోజు తెల్లవారుజామున కరీంనగర్ పట్టణంలో పలువురి అనుమానితుల ఇళ్లపైనా ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపి, అనుమానాస్పద ఫైళ్లను తీసుకెళ్లారని సమాచారం. జగిత్యాల, కరీంనగర్లో ఉగ్ర సంస్థతో సంబంధాలు బయటపడటం అప్పట్లో కలకలం రేపింది. ఈడీ, ఐటీ.. ఆకస్మిక సోదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి తరువాత అతిపెద్దది గ్రానైట్ పరిశ్రమ. ఈ క్రమంలో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు విదేశాలకు తరలించారన్న ఆరోపణలపై పలు కంపెనీలపై ఈ నెల 9వ తేదీన తరలించారన్న ఫిర్యాదులతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. రెండురోజులపాటు జరిగిన ఈ సోదాల్లో దాదాపు 10కిపైగా కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ► చీకోటి ప్రవీణ్ కేసినో కేసులోనూ రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. తొలుత ఈ కేసుకు కరీంనగర్‌తో సంబంధాలు లేవనుకున్నప్పటికీ.. తాజాగా ఎమ్మెల్సీ రమణకు నోటీసులు జారీ చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ► మరోవైపు ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కాంలోనూ పలువురు సిరిసిల్ల, కరీంనగర్ పట్టణవాసుల ప్రమేయం ఉందన్న ప్రచారం అప్పుడే మొదలైంది. కరీంనగర్లో ఇటీవల జరిగిన ఈడీ దాడుల సమయంలోనూ తొలుత లిక్కర్ స్కాంలో సోదాలుగానే ప్రచారం జరిగాయి. ► మరోవైపు అధికార పార్టీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’ కూడా జాతీయస్థాయిలో చర్చ లేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ పార్టీపై స్వయంగా సీఎం చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు కరీంనగర్‌తో ఉన్న లింకులు బయటపెట్టారు. కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు విమాన టికెట్లు బుక్ చేసిన ఆరోపణలపై సిట్ అధికారులు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేయడంతో మరోసారి కరీంనగర్ వార్తల్లోకెక్కింది. రాజకీయ సమరానికీ ఇక్కడే ఆజ్యం..! కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ–టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు బహిరంగంగానే పరస్పర ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీస్థాయి వరకు ఇరు పార్టీ నాయకులు తమకు ఏమాత్రం చిన్న అవకాశం లభించినా ప్రత్యర్థి వర్గాన్ని ఆరోపణలతో చీల్చిచెండాడుతున్నారు. ఈ సమరానికి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే వేదికగా నిలవడం విశేషం. ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేసే క్రమంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి చేసే ఎవరినీ వదలమంటూ హెచ్చరికలు జారీచేశారు. ► మరోవైపు సోషల్‌మీడియాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల విషయంలో పూటకో ప్రచారం వెలుగుచూస్తోంది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై, హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి సొంతగూటికి వెళ్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ‘ఘర్‌వాపసీ’ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఈటల ఖండించారు. ► శుక్రవారం ఉదయం నుంచి మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ పుట్ట మధు పార్టీ మారుతున్నారన్న సందేశం వైరల్‌గా మారింది. టీవీలు, వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పుట్ట మధు హడావిడిగా అక్కడే విలేకరుల సమావేశం పెట్టి ప్రచారాన్ని ఖండించారు. అంతకుముందు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన ఆయన తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. తాను సొంత పనుల మీద నియోజకవర్గం వీడిన ప్రతీసారి ప్రతిపక్షాలు రాస్తున్న ప్రేమలేఖలు చదివి నవ్వుకుంటున్నానని చమత్కరించారు. (క్లిక్: ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?) -
నార్కో టెర్రరిజం కేసులో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: దేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా తేవడం, వాటిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఉగ్రవాదం వ్యాప్తికి వాడుతున్నారంటూ నమోదైన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో సోదాలు జరిపింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌తో సంబంధమున్న గ్యాంగ్స్టర్ల నివాసాల్లోనూ సోమవారం దాడులు కొనసాగాయి. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులైన గ్యాంగ్స్టర్లు గోల్డీ బ్రార్, జగ్గూ భగ్‌వాన్‌పురియా ఇళ్లలో అధికారులు సోదా చేశారు. ఢిల్లీసహా 50 చోట్ల దాడులు చేసి ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారుల మధ్య ఏర్పడుతున్న కొత్త నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నంచేశామని ఒక ఎన్ఐఏ అధికారి చెప్పారు. దేశ, విదేశాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న గ్యాంగ్స్టర్లపై గత నెల 26లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఈ ముమ్మర సోదాలు జరిపింది. ఈ గ్యాంగ్స్టర్లలో కొందరు భారత్ నుంచి పారిపోయి కెనడా, పాకిస్తాన్, మలేసియా, ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడి నుంచే భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు! -
కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్!
వేలూరు: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఒక విద్యార్థి అరెస్ట్ కలకలం రేపింది. ఆంబూరు పట్టణానికి చెందిన అనార్ అలీ ఆర్కాడు దగ్గర్లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శనివారం తెల్లవారుజామున ఢిల్లీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోలీసులు, వేలూరు ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో అనార్ అలీ ఇంటిని చుట్టుముట్టారు. అతని వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థిని రహస్యంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇతర దేశాల్లోని కొందరితో నిందితుడికి పరిచయం ఉందని, వీరిలో కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ అధికారులు విద్యార్థిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అల్‌ఖైదాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన నటుడు ఉసేన్ లస్కర్‌తో ఈ విద్యార్థి చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదీ చదవండి: రాడికల్ శక్తులను కట్టడి చేయండి -
‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక!
బెంగళూరు: భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నేత ప్రవీణ్ నెట్టార్‌ను పొట్టనబెట్టుకున్న వారిపై కఠిన చర్యలుంటాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. దేశ వ్యతిరేకులు, మతతత్వ శక్తులను ఏరిపారేసేందుకు అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రవీణ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రవీణ్ హంతకులను ఎన్కౌంటర్ చేయాలని కర్ణాటక మంత్రి సీఎన్ అశ్వత్థ నారాయణ్ అన్నారు. ప్రవీణ్‌ను దక్షిణ కన్నడ జిల్లాలోని ఆయన సొంతూరులో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బైక్‌పై వెంబడించి దారుణ హత్య.. దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు ఈనెల 27న దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ప్రవీణ్ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. కాగా.. ప్రవీణ్ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్నారు. అయితే, మంగళవారం రాత్రి షాప్‌ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి మరీ నరికి చంపారు. ఇదీ చదవండి: Karnataka BJP Leader Murder: అర్ధరాత్రి టెన్షన్.. టెన్షన్.. బైక్‌పై వెంబడించి మరీ బీజేపీ నేతను చంపారు -
భారత్‌లోకి పాకిస్థాన్ ఆయుధాలు, డ్రగ్స్... వయా శ్రీలంక!
చెన్నై: శ్రీలంక నుంచి భారత్‌లోకి భారీగా ఆయుధాలు, మత్తు పదార్థాలు సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు తమిళనాడులో సోదాలు నిర్వహించింది జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ). ఈనెల 19వ తేదీన 22 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్‌కు చెందిన హాజీ సలీమ్ సహకారంతో.. సీ గునశేఖరన్, పుష్పరాజన్‌లు నిర్వహిస్తున్న శ్రీలంక డ్రగ్స్ మాఫియా అక్రమాల కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్, ఆయుధాల మాఫియా భారత్, శ్రీలంకల్లో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. లిబర టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)ని పునరుద్ధరించటం, హింసాత్మక కార్యక్రమాలను పెంచటమే వారి లక్ష్యమని తెలిపారు. చెన్నై, తిరుపుర్, చెంగళ్పట్టు, తిరుచిరపల్లి జిల్లాల్లోని పలువురు నిందితుల ఇళ్లు, పరిసరాల్లో సోదాలు చేపట్టారు అధికారులు. ఆయుధాలు, మత్తు పదార్థాల సరఫరాపై సుమోటోగా తీసుకున్న ఎన్ఐఏ జులై 8న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సోదాల్లో డిజిటల్ సర్వీసెస్, నేరాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. శ్రీలంక సైన్యం, ఎల్టీటీఈ మధ్య మూడు దశాబ్దాల పోరాటం 2009, మేలో ముగిసింది. ఆ సమయంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్ మద్దతు తెలిపింది. సామాన్య ప్రజలపై ఎల్టీటీఈ సాగించిన మారణకాండపై విచారం వ్యక్తం చేసింది. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిన ఈ సమయంలో ఆయుధాల సరఫరాపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి
అమరావతి(మహారాష్ట్ర): అమరావతికి చెందిన కెమిస్ట్ ఉమేశ్ కోల్హె హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్(35)కు కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. శనివారం నాగపూర్‌లో అరెస్ట్ చేసిన ఇర్ఫాన్‌ఖాన్‌ను ఆదివారం ఎన్ఐఏ బృందం కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించింది. అనంతరం అతడిని డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో హాజరుపరచగా 7వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినందుకు ఉమేశ్ కోల్హెను దుండగులు జూన్ జూన్ 21వ తేదీన హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ ఖాన్ ఏడో నిందితుడు. అమరావతికి చెందిన ఉమేశ్‌కు వెటరినరీ మందుల దుకాణం ఉంది. ఈయన వెటరినరీ వైద్యులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఇర్ఫాన్ ఖాన్ సభ్యుడు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇర్ఫాన్ రాహ్బర్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. వాట్సాప్ గ్రూప్‌లో నుపుర్ శర్మకు అనుకూలంగా ఉమేశ్ పెట్టిన పోస్టుపై ఇర్ఫాన్ ఆగ్రహంతో ఉన్నాడు. ఇతడే ఉమేశ్ హత్యకు పథకం వేసి, కొందరికి బాధ్యతలు అప్పగించాడు. వీరిలో నలుగురు ఇతడి స్వచ్ఛంద సంస్థకు చెందిన వారే. ఉమేశ్ హత్య అనంతరం అంత్యక్రియల్లో కూడా ఇర్ఫాన్ పాల్గొన్నాడు. కన్హయ్యాలాల్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఏకే ఈ కేసును కూడా అప్పగిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారం అధికారంగా అందాల్సి ఉందని అమరావతి పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్ చెప్పారు. దర్జీ హత్యపై భారీ నిరసన ర్యాలీ ఉదయ్‌పూర్‌లో కన్హయ్యాలాల్ అనే దర్జీ దారుణ హత్యకు నిరసనగా జైపూర్‌లో ఆదివారం భారీ ర్యాలీ జరిగింది. -
మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య
నాగపూర్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో దారుణం జరిగింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశాడన్న కారణంతో 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు కొల్హేను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. జూన్ 21న ఈ సంఘటన జరిగిందని, ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్టు చేశామని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తీసింగ్ శనివారం తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ (32)ను నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కంటే వారం ముందే ఉమేశ్ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు కన్హయ్యలాల్‌ను ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. ఉమేశ్ అమరావతి సిటీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఒక పోస్టును షేర్ చేశాడని పోలీసులు చెప్పారు. సదరు గ్రూపుల్లో అతడి కస్టమర్లతోపాటు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉమేశ్‌పై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ ఖాన్ అతడిని హత్య చేయాలని పథకం రచించాడని, ఇందుకోసం ఐదుగురిని రంగంలోకి దింపాడని తెలిపారు. హత్య చేస్తే రూ.10,000 ఇస్తానని, పోలీసులకు దొరక్కుండా పారిపోవడానికి కారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడని వివరించారు. జూన్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దుకాణం మూసివేసి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఉమేశ్‌ను మెడపై పదునైన కత్తితో నరికి, హత్య చేశారని వెల్లడించారు. నిందితులంతా కూలీలు.. ఉమేశ్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ ఖాన్, ముదాసిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫిక్(24), షోయబ్ ఖాన్(22), అతీబ్ రషీద్(22)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వీరంతా అమరావతి వాసులేనని, రోజు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య దృశ్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అమరావతికి ఎన్ఐఏ బృందం అమరావతిలో కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు హత్యపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్ఐఏ బృందం శనివారం అమరావతికి చేరుకుంది. ఆదివారం నుంచి దర్యాప్త చేపట్టనుంది. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) టీమ్ కూడా ఔరంగబాద్ నుంచి అమరావతికి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ హత్యపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. కన్హయ్య కుటుంబానికి రూ.కోటి విరాళంగా సమకూర్చి అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. -
దావూద్ అనుచరుల ఆఫీసులపై ఎన్ఐఏ దాడులు
ముంబై: ముంబైలో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులపై ఎన్ఐఏ ఒక్కసారిగా దాడులు నిర్వహిస్తోంది. దావుద్ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేతలో భాగంగా ఎన్ఐఏ నగరంలోని 20 ప్రాంతాల్లో పరారీలో ఉన్న అతని సహచరుల ఆఫీసులపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల జాబితాలో.. షార్ప్ షూటర్లు, డ్రగ్స్ దందా చేసేవాళ్లు, హవాలా ఆపరేటర్లు, దావూద్ ఇబ్రహీంకు చెందిన రియల్ ఎస్టేట్ మేనేజర్లు, క్రిమినల్ సిండికేట్‌లోని ఇతర కీలక వ్యక్తుల ఉన్నట్లు తెలుస్తోంది. బాంద్రా, నాగ్‌పడా, బోరివలి, గోరేగావ్, పరేల్, శాంతాక్రజ్‌లలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలు, దేశంలో అశాంతిని సృష్టించే లక్ష్యంతో చేసిన చర్యలకు సంబంధించి ఎన్ఐఏ ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. డీ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై నిశీతంగా పరిశీలిస్తోంది. విదేశాల్లో ఉంటూ ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిపై ఇప్పటికే ఎన్ఐఏ నిఘా పెట్టింది. కాగా ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: ఉద్ధవ్‌కు దమ్ముంటే నాపై గెలవాలి: నవనీత్ కౌర్ -
నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు
నెల్లూరు(క్రైమ్): మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్న కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు శనివారం నెల్లూరు నగరంలో తనిఖీలు నిర్వహించారు. మావోలకు నిధులు సమకూరుస్తున్నారంటూ బిహార్‌లో ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం ఏకకాలంలో బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఏపీలో సోదాలు చేపట్టింది. అందులో భాగంగా శనివారం రాంజీనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న కాంట్రాక్టర్ పెంచలయ్యనాయుడి ఇంటికి శనివారం ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసి మూడు గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ సోదాల విషయాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. గతేడాదీ నెల్లూరు అరవిందానగర్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. -
రాష్ట్రంలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు
ఒంగోలు/టంగుటూరు/చీరాల/ఆరిలోవ (విశాఖ తూర్పు)/నెల్లూరు (క్రైమ్): రాష్ట్రంలో ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, మెదక్‌లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. టంగుటూరు మండలం ఆలకూరపాడులో నివాసముంటున్న విరసం నేత కల్యాణ్‌రావు, వేటపాలెం మండలం జాండ్రపేటలోని మాచర్ల మోహన్‌రావు ఇళ్లల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన పేరుతో హైదరాబాద్‌లో పుస్తకాన్ని ముద్రించేందుకు ఆయన సతీమణి ప్రయత్నించిన నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్‌ను సైతం పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు గడ్చిరోలి ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఆర్కేకు చెందిన డైరీ లభించినట్టు తెలిసింది. 2019 జూలై 28న చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. కల్యాణ్‌రావు ఇంట్లో రెండు సంచుల పుస్తకాలను సీజ్ చేశారు. ఆయనకు ఆర్థిక సహకారం ఏమైనా అందుతుందా అనే కోణంలోనూ విచారించినట్టు సమాచారం. చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహన్‌రావు ఇంట్లో కూడావిప్లవ సాహిత్యాన్ని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో మార్కాపురం ఓఎస్డీ కె.చౌడేశ్వరి, ఐదుగురు ఎన్ఐఏ అధికారులు, 11 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళా న్యాయవాది అన్నపూర్ణ నివాసంలో.. విశాఖ ఆరిలోవలో మావోయిస్టు సానుభూతిపరురాలు ఎ.అన్నపూర్ణ నివాసముంటున్నారు. ఆమె న్యాయవాదిగా ఉంటూ ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యురాలుగా ఉన్నారు. ఆమె భర్త ఎం.శ్రీనివాసరావు కూడా న్యాయవాదే. దీంతో ఎన్ఐఏ అధికారులు ఆమె ఇంటిలో సోదాలు చేశారు. రూరల్ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇంట్లో లభించిన పలు డాక్యుమెంట్లు, పుస్తకాలు సీజ్ చేశారు. మావోయిస్టులకు సహాయసహకారాలు అందిస్తున్నారని గతంలో ఆమెను పోలీసులు రెండుసార్లు అరెస్టు చేసినట్లు తెలిసింది. రవి కుటుంబ సభ్యుల ఇంటిలో.. నెల్లూరు అరవిందానగర్లో ఎన్ఐఏ అధికారులు.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి అలియాస్ జైలాల్ అలియాస్ సునీల్ కుమార్ కుటుంబసభ్యుల ఇంటిలో సోదాలు నిర్వహించారు. రవి సోదరీమణులు.. అనూష, అన్నపూర్ణల సెల్ఫోన్లు, వారు రాసుకుంటున్న కవితల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా రవి గతేడాది జూన్‌లో జార్ఖండ్‌లోని కొల్హాన్ అటవీ ప్రాంతంలో బాణం బాంబును పరీక్షిస్తుండగా తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోనూ సోదాలు హైదరాబాద్‌లోని నాగోల్‌లో నివాసం ఉండే బీహార్, జార్ఖండ్ మావోయిస్టు పార్టీ కమిటీ నేతగా ఉన్న నార్ల రవి శర్మ, ఆయన భార్య బెల్లపు అనురాధ, అల్వాల్‌లో నివాసం ఉంటున్న అమర వీరుల బంధు మిత్రుల కమిటీ సభ్యురాలు పద్మకు మారి, న్యాయ శాస్త్ర విద్యార్థిని బి.పద్మ, కవి అరుణాంక్ లత తదితరుల ఇళ్లల్లోనూ, హిమాయత్ నగర్‌లోని అదితి ఉమెన్స్ హాస్టల్లో సోదాలు చేసి విప్లవ సాహిత్యం, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అనుమానాలతోనే సోదాలు.. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నట్లు ఆధారాలు లభించినందువల్లే సోదాలు నిర్వహించారని సమాచారం. మెయిల్స్ రూపంలో మావోయిస్టు పార్టీకి, వీరికి మధ్య సమాచార మార్పిడి జరిగిందని ఎన్ఐఏ అనుమానిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన కొందరు మళ్లీ సాయం చేస్తున్నట్లు ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన కొన్ని ఆధారాల ద్వారా బయటపడి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రశ్నించడమే నేరంగా మారింది సమాజంలో ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే నేరంగా మారింది. ఎన్ఐఏ అధికారులు ఇంట్లోని ప్రతి పుస్తకాన్ని, కాగితాన్ని పట్టిపట్టి చూశారు. నిజం మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన నిలబడేవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రాసే హక్కు రచయితకు, మాట్లాడే హక్కు మనిషికి, ఉద్యమం చేసే హక్కు ఉద్యమకారులకు ఉంది. ఇలా వేధించడం అప్రజాస్వామికం. – కల్యాణ్‌రావు, విరసం నేత కోర్టు ఆదేశాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.. ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులను అడిగాం. కోర్టు ఆదేశాలతోనే తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మా సెల్ఫోన్లు, పుస్తకాలను తీసుకెళ్లారు. తమ్ముడు రవి సుమారు ఎనిమిదేళ్ల కిందట ఉద్యోగం కోసం వెళుతున్నా అని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇటీవల మృతి చెందడంతో ఉద్యమంలో పనిచేశాడని తెలిసింది. – రవి సోదరి అన్నపూర్ణ -
డ్రగ్స్ రాకెట్ కేసు: రంగంలోకి ఎన్ఐఏ!
-
అంబానీ బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం
ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో నిండిన వాహనం లభించిన కేసుతో పాటు వాణిజ్యవేత్త మన్సుఖ్ హిరాన్ హత్య కేసులో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)అభియోగాలను నమోదు చేసింది. మాజీ పోలీసు అధికారులు సచిన్ వాజే, ప్రదీప్ శర్మ, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదు చేసిన పత్రాలను ప్రత్యేక కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జీషీటులో సచిన్ వేజ్, ప్రదీప్ శర్మ, వినాయక్ షిండే, నరేష్ గోర్, రియాజుద్దీన్ కాజీ, సునీల్ మానె, ఆనంద్ జాదవ్, సతీశ్ మోతుకూరి, మనీష్ సోని, సంతోష్ షెలార్ పేర్లు ఉన్నాయి. మరో కేసులో కూడా నిందితుడైన వినాయక్ షిండే పోలీసు శాఖ నుంచి సస్పెండ్ కాగా, కాజీ, మానెలను అరెస్ట్ చేసినప్పుడు వారు పోలీసు శాఖలోనే విధులు నిర్వహిస్తున్నారు. అరెస్టయిన వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. -
దర్భంగా బ్లాస్ట్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడింది. పాకిస్తాన్ నుండి ఇక్బాల్ ఖానా ఆదేశాలు ఇచ్చేందుకు సోషల్ మీడియా ద్వారా వాయిస్ కాల్స్ చేసినట్లు నిర్థారణ అయ్యింది. హాజీ సలీమ్‌కి ఇంటర్నెట్ పై అవగాహన లేకపోవడంతో ఖలీం అనే వ్యక్తి సహాయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఖలీం సోషల్ మీడియా ఖాతా ద్వారా హాజీ సలీమ్ తో ఇక్బాల్ ఖానా వాయిస్ కాల్స్ మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఒక్కో బ్లాస్ట్ కు కోటి రూపాయల నజరానా ఇస్తామని మాలిక్ సోదరులకు ఇక్బాల్ ఆశ చూపినట్లు విచారణలో వెల్లడైంది. 2012లో పాకిస్థాన్ ఆఫ్గన్ సరిహద్దులో ముఖ్య నేతలను కలిసినట్టు నజీర్ మాలిక్, హాజీ సలీం అంగీకరించారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. -
దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్ : దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. పండగల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నిఘా పెంచారు. కాగా, ఎన్ఐఏ అధికారులు తాజాగా హైదరాబాద్‌లో ఒకరిని, యూపీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ-హైదరాబాద్ లింకులపై ఆరా తీస్తున్నారు. ఉనికిని చాటుకునేందుకు లష్కరే తొయిబా స్లీపర్‌సెల్స్‌ను యాక్టివ్ చేసినట్లు.. విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. దర్భంగా పేలుడు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్భంగా రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటం కేసులో హైదరాబాద్ కేంద్రంగా బాంబు తయారుచేయడంతో విచారణను ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పండుగలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. -
కరుణ లేని కాఠిన్యం
ఒక మనిషి తన ప్రాణం కోసం కాకుండా, తనకు ప్రాణానికి ప్రాణమైన మనుషుల కోసం తపిం చడం పాపమా? ప్రాణం పోతోందని తెలిసినా, అదేదో తన వాళ్ళ మధ్య ప్రాణాలు వదిలితే బాగుం టుందని కోరుకోవడం నేరమా? నిరూపితం కాని నేరాన్ని సాకుగా చూపి, ఉగ్రవాదం ముసుగు వేసి, నిందితుల ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచడం ఏ చట్టం కిందైనా న్యాయమా? ఆఖరు శ్వాస విడిచేవరకు గిరిజనుల హక్కులైన ‘జల్, జంగిల్, జమీన్’ కోసమే పోరాడి, అన్యాయంగా కన్ను మూసిన క్రైస్తవ సన్యాసి 84 ఏళ్ళ ఫాదర్ స్టాన్ స్వామి గురించి విన్నా, చదివినా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వెంటాడతాయి. కరోనా కేసులు ఎక్కువున్న కిక్కిరిసిన తలోజా జైలు నుంచి మార్చమనీ, అనారోగ్య రీత్యా మధ్యంతర బెయిలు ఇవ్వమనీ కోర్టులో పదే పదే ప్రార్థించినా, ప్రాథేయ పడ్డా ఆయనది అరణ్య రోదన కావడం ఓ విషాదం. చెవులు వినిపించని, శారీరకంగా బలహీనుడైన ఓ మానవతావాది దేశంలో అశాంతి సృష్టించి, ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర చేస్తున్నారని ఎన్ఐఎ కోర్టు భావన. కానీ, అలా తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని ఐరాస ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. స్టాన్ స్వామిది మామూలు మరణం కాదు... ‘వ్యవస్థ చేసిన హత్య’ అని అనేకులు అంటున్నది అందుకే! దళితులు, అడవిబిడ్డల కోసం ఆఖరిదాకా తపించిన మనిషి సోమవారం మధ్యాహ్నం సంకెళ్ళు లేని లోకానికి, ఏ బెయిలూ అవసరం లేకుండానే శాశ్వతంగా వెళ్ళిపోయారు. అనారోగ్యంతో ఉన్నా కూడా ఈ సేవామూర్తి అయినవాళ్ళనుకున్న గిరిజనుల మధ్య ఆఖరు క్షణాలు గడిపేందుకు కాస్తంత కనికరం చూపమనే కోరడం గమనార్హం. జైలు నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి కూడా అధికారులు 10 రోజులు ఆలస్యం చేసిన స్టాన్ స్వామి ఉదంతం కన్నీరు తెప్పిస్తుంది. ఇరవై ఆరేళ్ళ క్రితం సంచలనమైన వివాదాస్పద వ్యాపారవేత్త, ‘బిస్కెట్ కింగ్’ రాజన్ పిళ్ళై కస్టడీ మరణం కేసు అనివార్యంగా గుర్తొస్తుంది. అరెస్టయి, అనారోగ్యంతో బాధపడుతూ, సమయానికి తగిన వైద్యం అందక తీహార్ జైలులో తుదిశ్వాస విడిచిన పిళ్ళై కేసు అనేక పాఠాలు నేర్పింది. జైలు యంత్రాంగం నిర్లక్ష్యానికీ, న్యాయవ్యవస్థ కాఠిన్యానికీ పిళ్ళై మరణం మచ్చుతునక. ఇప్పుడు ‘ఎల్గార్ పరిషత్ కేస్థు’ నిందితులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వాదిస్తున్న ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ), జైలు అధికారుల లోపభూయిష్ఠ వ్యవహారం అందుకేమీ తీసిపోవడం లేదు. ఇదే ఇప్పుడు పలువురి ఆవేదన. స్టాన్ స్వామితో సహా పలువురు విద్యావేత్తలు, న్యాయవాదులు, సాంస్కృతిక కార్యకర్తలపై ఇంతటి కర్కశత్వం అవసరం లేదనేదే వారి వాదన. ‘ఎల్గార్ పరిషత్’ సమావేశం, ‘భీమా – కోరేగావ్’ హింస కేసులో ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (యూఏపీఏ – ఉపా) కింద ఇప్పటికీ మరో 15 మంది జైలు గోడల మధ్య మగ్గుతున్నారు. వారిలో మన విప్లవ కవి వరవరరావు సహా సుధా భరద్వాజ్ లాంటి ప్రజాక్షేత్రంలోని ప్రసిద్ధులు పలువురు ఉన్నారు. వారందరిలోకే కాదు... ‘ఉపా’ చట్టం కింద దేశంలో ఇప్పటి దాకా అరెస్టయినవారిలోనే బహుశా అత్యంత వృద్ధుడు ఫాదర్ స్టాన్ స్వామే! పార్కిన్సన్స్ వ్యాధితో వణుకుతున్న చేతులతో అన్నం తినడానికీ, నీళ్ళు తాగడానికీ వీల్లేక, కనీసం స్ట్రా, సిప్పర్ కావాలని ప్రాథేయపడితే, ఎన్ఐఏ అందుకు 4 వారాల గడువు తీసుకుందంటే విషయం అర్థం చేసుకోవచ్చు. న్యాయపోరాటంలో అలసిపోయిన స్టాన్ స్వామి కథ చివరకు అత్యంత విషాదంగా ముగిసింది. ఇప్పుడిక మిగతా ఖైదీల విషయంలోనైనా సమయం మించిపోక ముందే సరైన నిర్ణయం తీసు కోవడం అవసరం. ఆ కేసు నిందితుల్లో అత్యధికుల శారీరక అశక్తత, ఆరోగ్య, వృద్ధాప్య సమస్యలు గుర్తించాలి. ఒకపక్క దర్యాప్తు, విచారణ కొనసాగిస్తూనే, మానవతా దృక్పథంతోనైనా వారికి మధ్యం తర జామీనివ్వడం న్యాయపరంగా తప్పేమీ కాదు. కఠిన చట్టాల ఉక్కుపాదం మోపి, రుజువు కాని దేశద్రోహం కింద వారిని ఏళ్ళ తరబడి జైలులో మగ్గబెట్టడం మానవీయతా కాదు. ‘అర్బన్ నక్సల్’ అనే కొత్తముద్ర తయారుచేసి, కర్కశత్వానికి కొత్త చిరునామాగా మారిందనే అపఖ్యాతి పాలకులకూ శోభనివ్వదు. ఇప్పటికే ఒకసారి కరోనా బారినపడి, ఆఖరు నిమిషంలో అదృష్టవశాత్తూ బయటపడ్డ వరవరరావు లాంటి వారిని చివరి రోజులైనా ప్రశాంతంగా బతకనివ్వడమే న్యాయం, సమంజసం. రాజన్ పిళ్ళై మరణించిన దశాబ్దిన్నర తరువాత ‘ఆ మరణానికి బాధ్యత ప్రభుత్వానిదే’ అంటూ న్యాయస్థానమే తప్పుబట్టింది. కానీ, అప్పటికే అంతా అయిపోయింది. అమితమైన ఆలస్యమూ అయిపోయింది. ఆలస్యమైన న్యాయం... అక్షరాలా అన్యాయమే! పోయిన ప్రాణానికి బాధ్యత వహించాల్సిన విషతుల్యమే! అందుకే, అతి వృద్ధుడైనా... కనీసం సర్కారు వారి టీకాకు కూడా నోచుకోక, అన్యాయంగా కరోనా కోరలకు చిక్కి కన్నుమూసిన స్టాన్ స్వామి ఆఖరి వీడియో సందేశం ఇక ఎప్పుడు చూసినా గుండె బరువెక్కుతూనే ఉంటుంది. వ్యవస్థలో జరిగిన అన్యాయాన్నీ, కరుణించని న్యాయదేవత కాఠిన్యాన్నీ, సమాజ వైఫల్యాన్నీ గుర్తుచేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులకూ, మానవతావాదులకూ ఇది పాలకులు మిగిల్చిన ఓ శాశ్వతమైన గుండెకోత. స్టాన్ స్వామి వెళ్ళిపోయారు... ఆయన చూపిన బాట, చేసిన పని మాత్రం మిగిలిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఫాదర్ స్టాన్ స్వామీ! మూడు దశాబ్దాల పైగా మీరు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీల మధ్యే తుదిశ్వాస విడవాలన్న మీ ఆఖరి కోరికను తీర్చలేకపోయాం. మన్నించండి! ఇప్పటికైనా వ్యవస్థలో వివేకం మేలుకోవాలని దీవించండి!! -
హైదరాబాద్ లోనే బాంబు తయారు NIA సీన్ రికన్ స్ట్రక్షన్
-
Darbhanga Blast: యూపీలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా... నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్ మాలిక్ బ్రదర్స్‌తో పాటు యూపీకి చెందిన హాజీ సలీం, కాఫీల్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పేలుడు కుట్రలో హాజీ సలీం అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. ఎన్ఐఏ అధికారుల వివరాల ప్రకారం.. హజీ సలీం, కాఫిల్ లష్కరే తోయిబాకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. దర్భంగా బ్లాస్ట్‌కు ఫిబ్రవరి 2021లో వ్యూహాలు రచించగా, యూపీలోని హాజీ సలీం ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు ఈ పేలుడుకు ప్లాన్ చేశారని వెల్లడించారు. పథకం ప్రకారం వాళ్లు రన్నింగ్ ట్రైన్లో ఐఈడీ బాంబులను ఫిక్స్ చేయాలనుకున్నట్లు తెలిపారు. లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్భాల్ ఖాన్‌కు హాజీ సలీం దగ్గరి బంధువని, పేలుడుకు సంబంధించి మాలిక్ బ్రదర్స్‌కు ఇక్భాల్ ఖాన్ కు హాజీ సలీం మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిపారు. ఇవే కాక మాలిక్ బ్రదర్స్‌కు ఇక్భాల్ ఖాన్ నుంచి నిధులు సమకూర్చింది కూడా హాజీ సలీమేనని దర్యాప్తులో తేలింది. 9 రోజులు ఎన్ఐఏ కస్డడీలో మాలిక్ బ్రదర్స్ గతనెల 30న ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ అరెస్టు కాగా శుక్రవారం వీరిని పాట్నా కోర్టులో ఎన్ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. నిందితులను 10 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేయగా, 9 రోజుల పాటు కస్టడీకి పాట్నా కోర్టు అనుమతినిచ్చింది. -
మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు
ముంబై: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కారు బాంబు పెట్టడం, మరో వ్యాపారవేత్త మన్సుఖ్ హిరానీ హత్య కేసులతో ఆయనకు సంబంధం ఉందని ఎన్ఐఏ చెబుతోంది. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసింది. లోనావాలా హిల్స్ ప్రాంతంలో అంబీవ్యాలీలో ఆయన్ను అదుపులోకి తీసుకొని, ఎన్ఐఏ ఆఫీసులో ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రదీప్ శర్మతో పాటు అరెస్టు చేసిన మరో ఇద్దరిని కూడా కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా ఈ నెల 28వ తేదీ వరకు న్యాయస్థానం వారిని ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చింది. బుధవారం సాయంత్రం నుంచి ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకోవడానికి ఎన్ఐఏ ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఆయన ఇంటితో సహా పలు చోట్ల సోదాలు జరిపింది. ఈ క్రమంలో ఎన్ఐఏకు పలు కీలక పత్రాలు కూడా దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థ సంతోష్ షెలార్, ఆనంద్ జాదవ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిని విచారిస్తుండగా ప్రదీప్ శర్మ వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం. సచిన్ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్ఐఏ ప్రదీప్ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు. చదవండి: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం చదవండి: మరో 9 నగరాల్లో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్.. జాబితాలో విశాఖ, మిర్యాలగూడ -
నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు
ముంబై: నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలువరించింది.ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులకు జైలు శిక్షను ఎన్ఐఏ కోర్టు విధించింది. ముజామిల్, సాదిక్, అక్రంకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. 2012లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హిందూ నేతలు , జర్నలిస్ట్ లు ,రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారు. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్ర పన్నారని ఎన్ఐఏ పేర్కొంది.వీరు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సిద్ధికి బిన్ ఉస్మాన్, ఫుర్ఖాన్ భాయ్ ల తో అక్రమ్ సంబంధాలు కల్గి ఉన్నారు. చదవండి: అంబానీ కారు బాంబు కేసులో మరో పోలీస్ అరెస్టు -
కిడారి హత్యకేసులో సప్లిమెంటరీ చార్జిషీట్
విజయవాడ లీగల్: విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యకేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం విజయవాడ నగర మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. 2018లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్ఐఏ 59 మందిని నిందితులుగా పేర్కొంది. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలులో ఉన్నారు. ఈ కేసులో 59వ నిందితురాలైన సాకే కళావతి అలియాస్ భవానీపై సప్లిమెంటరీ చార్జిషీటును దాఖలు చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకూరి పెద్దన్న భార్య, మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలైన కళావతి హత్య చేసిన సమయంలో ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పలు మారణాయుధాలను కళావతి ధరించిందని, కిడారి, సివిరి హత్యలకు పదిహేను రోజుల ముందు డుంబ్రిగూడలో రెక్కీ, బస చేసారని ఎన్ఐఏ తెలిపింది. చదవండి: ఇసుక రీచ్‌ల సబ్ లీజుల పేరిట భారీ మోసం -
అంబానీ కారు బాంబు కేసులో మరో పోలీస్ అరెస్టు
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట దొరికిన కారు బాంబు కేసులో ఎన్ఐఏ అధికారులు మరో పోలీసు సునీల్ మానెను అరెస్టు చేశారు. కారు ఓనర్ హిరానీ హత్యకు సునీల్ మానెకు సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు వివరించి ఈ నెల 28 వరకూ కస్టడీలోకి తీసుకుంది. సునీల్‌ను ఈ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని, దాంతో పాటు ఆయనకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను, కాల్ రికార్డులను పరిశీలించాలని భావిస్తున్నట్లు కోర్టుకు చెప్పింది. ( చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి! ) -
చెన్నై విమానాశ్రయంలో కలకలం..
సాక్షి, చెన్నై: దుబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో ఓ యువకుడి చర్యలు అనుమానాలకు దారి తీశాయి. నిషేధిత తీవ్ర వాద సంస్థ ఐసీస్‌లో శిక్షణ పొంది చెన్నైకు వచ్చినట్టుగా వచ్చిన సమాచారం కలకలం రేపింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో నిషేధిత తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో గతంలో సాగిన పేలుళ్ల తదుపరి తరచూ కేరళ నుంచి ఎన్ఐఏ వర్గాలు రాష్ట్రంలోకి రావడం, అనుమానితులు, నిషేధిత సంస్థల సానుభూతి పరులను పట్టుకెళ్లడం జరుగుతోంది. ఈ పరిణామాలతో సముద్ర తీరాల్లో, విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ విమానంలో 31 ఏళ్ల యువకుడిపై అధికారుల దృష్టి పడింది. అతడి పాస్‌పోర్టు, వీసాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒమన్‌కు ఎందుకు వెళ్లినట్టో.. ఏడాదిన్నర క్రితం ఉద్యోగ రీత్యా ఆ యువకుడు దుబాయ్ వెళ్లినట్టు గుర్తించారు. గత ఏడాది కరోనా సమయంలో ఇతడు దుబాయ్ నుంచి తిరిగి రాలేదు. అదే సమయంలో ఆరు నెలలు ఒమన్‌లో ఉండడం అనుమానాలకు దారి తీసింది. నిషేధిత ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ కార్యకలాపాలకు కేంద్రంగా ఒమన్ మారి ఉండడంతో ఆ దేశంపై భారత్ నిషేధం విధించింది. ఇక్కడకు తమిళనాడు నుంచి ఇప్పటికే పలువురు యువకులు సరిహద్దులు దాటి వెళ్లినట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ పరిస్థితుల్లో ఈ యువకుడు ఒమన్‌కు వెళ్లిరావడం అనుమానాలకు బలం చేకూరినట్టు అయింది. ఆ యువకుడు పెరంబలూరుకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అతడి కుటుంబం నేపథ్యం గురించి విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఐఏ వర్గాలు సైతం యువకుడిని విచారించారు. దుబాయ్‌లో ఉద్యోగం నచ్చక, ఒమన్‌కు వెళ్లి పనిచేసినట్టుగా ఆ యువకుడు పేర్కొంటున్నాడు. అందులో వాస్తవాలు లేవని భావించిన అధికారులు చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించే పనిలో పడ్డారు. యువకుడు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అతడికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? లేదా, అతడితో పాటుగా పెరంబలూరు నుంచి దుబాయ్‌కు వెళ్లిన వారి వివరాలను సేకరించి, విచారణను ముమ్మరం చేశారు. చదవండి: హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి.. ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’ -
సచిన్ వాజే కేసులో మరో కొత్త కోణం
ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ బెదిరింపుల కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే మరో ఇద్దరిని హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వాజ్ వారిని చంపి ఈ కేసును పరిష్కరించినట్లు చెప్పుకోవాలనుకున్నాడు. కాని ఆ ప్లాన్ పనిచేయకపోవడంతో మరో ప్లాన్ అమలు చేసి పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని ముఖేష్ అంబానీ ఇంటి ముందు నిలిపారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతున్నా సమయంలో థానేలో ఉన్న వాజ్ ఇంటిని పరిశోధిస్తున్నప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందానికి ఒక వ్యక్తి పాస్ పోర్ట్ లభించింది. పాస్ పోర్ట్ హోల్డర్, మరో వ్యక్తిని "నకిలీ ఎన్కౌంటర్"లో చంపడానికి వాజ్ ప్రణాళిక వేసినట్లు ఎన్ఐఏ బృందం అనుమానిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వారిద్దరి సహాయంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం నుంచి దొంగిలించబడిన మారుతి ఈకో వాహనంలో పేలుడు పదార్థాలను అమర్చి అంబానీ ఇంటి ముందు నిలిపి, తర్వాత వారు దోషులను నిర్దారింఛి "ఫేక్ ఎన్కౌంటర్" చేయాలనీ మొదట ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఇలా పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ కేసును పరిష్కరించి తానే ప్రశంసలు పొందాలని వాజ్ ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తుంది. అలాగే కొంత మొత్తం డబ్బులు కూడా డిమాండ్ చేయాలనీ చూసినట్లు సమాచారం. అయితే, ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏజెన్సీలలో జరిగిన "నకిలీ ఎన్ కౌంటర్" విషయాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ ఫిబ్రవరి 25న ముఖేష్ అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల ఆపి ఉంచినట్లు కనుగొనబడింది. ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ వాహన యజమాని వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ మార్చి 5న థానేలోని అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. మార్చి 13న ఎన్ఐఏ సచిన్ వాజ్‌ను అరెస్టు చేసింది. చదవండి: సచిన్‌వాజే హైఎండ్ బైక్ స్వాధీనం -
సచిన్‌వాజే హైఎండ్ బైక్ స్వాధీనం, కీలక సీసీటీవీ ఫుటేజీ
సాక్షి, ముంబై: ముంబై మాజీపోలీసు అధికారిక సచిన్‌వాజేకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోమవారం హై ఎండ్ బైక్‌ను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 25 న పారిశ్రామికవేత్త ముఖ్‌శ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ, వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంలో సచిన్ వాజ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న వాహనాల సుదీర్ఘ జాబితాలో తాజాగా బైక్ చేరింది. అలాగే సచిన్ వాజేతో సంబంధంముందని భావిస్తున్న మహిళను కూడా ఎన్ఐఏ ప్రశ్నించింది. మహిళ ఆధీనంలో ఉన్న మీరా రోడ్ ఏరియాలోని ఒక ఫ్లాట్‌ను కూడా శోధించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అలాగే కీలకమైన సిసిటివి ఫుటేజ్‌ను కూడా సాధించింది. సచిన్ వాజే మార్చి 4 న రాత్రి 7 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళుతున్నట్లు వీడియోను గుర్తించారు. అదే రోజు సీన్ రీక్రియేషన్ కోసం థానే వెళ్లారు. అయితే మార్చి 5 న థానేలోని కల్వా లేక్ వద్ద మన్సుఖ్ హిరెన్ మృతదేహం పలు అనుమానాల్ని రేకెత్తించింది. ఈ కేసును కూడా మన్సుఖ్ భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. అంబానీ ఇంటి ఎస్‌యూవీని పార్కింగ్ చేయడంలో వాజే పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు సంస్థ తన కదలికలను దాచడానికి నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. In CCTV footage (in pic), Sachin Waze was seen going to Chhatrapati Shivaji Maharaj Terminus at 7 pm on 4th March. He had taken a local train to Thane that day. He was brought to CSMT y'day for scene recreation Body of Mansukh Hiren was found at Kalwa creek in Thane on 5th March pic.twitter.com/gnMfdaMLLQ — ANI (@ANI) April 6, 2021 -
ఎన్ఐఏ దాడులు: ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విశాఖ జిల్లా ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు పౌరహక్కుల సంఘం నేత లను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాలన్నీ ముంచంగిపుట్టు ఠాణాలో నమోదైన కేసు ఆధారంగానే జరిగినట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ, తెలంగాణల్లో 31 చోట్ల సోదాలు జరిపినట్టు తెలిపింది. ఏపీలో విశాఖ పట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం,కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి, కడపతోపాటు తెలంగా ణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజి గిరి, మెదక్ జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొంది. వారికి మావోలతో లింకులపై అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్టు వివరించింది. గతేడాది కేసు నమోదు.. మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న జర్నలిస్టు పంగి నాగన్నను ముంచంగిపుట్టు పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. దీనిపై గతేడాది నవంబర్ 23న ముంచంగిపుట్టు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు గత నెల 7న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ పంగి నాగన్నను విచారించింది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు నాగన్న అంగీకరించడం తోపాటు మరో 64 మంది పౌరహక్కుల సంఘల, విరసం నేతల పేర్లు వెల్లడించడంతో వారిపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పంగి నాగన్న, అదులూరి అన్నపూర్ణ, జంగర్ల కోటేశ్వర్రావు, మానుకొండ శ్రీనివాసరావు, రేలా రాజేశ్వరి, బొప్పుడి అంజమ్మ అనే ఆరుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సాగించిన తనిఖీల్లో 40 మొబైల్ఫోన్లు, 44 సిమ్‌కార్డులు, హార్డ్‌డిస్క్, మైక్రో ఎస్డీ కార్డులు, ఫ్లాష్ కార్డులు తదితర 70 స్టోరేజ్ డివైజెస్, 184 సీడీలు/డీవీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ట్యాబ్, ఆడియో రికార్డర్, ఒక అనుమానితుని నుంచి రూ.10లక్షల నగదు, కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు మావోయిస్టు పార్టీ సాహిత్యంతో ఉన్న లేఖలు, అనేక అనుమానాస్పద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరించారని, పోలీసుల కదలికలను మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను మావోయిస్టులకు అనుకూలంగా సమీకరించి పోలీసులను అక్కడికి రాకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని, ప్రజలను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని అభియోగాలు మోపింది. సోదాలపై నిరసన.. పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆయా సంఘాలు నిరసన చేపట్టాయి. పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ ఎన్ఐఏ అధికారులు ప్రజాసంఘాల నేతల ఇళ్లపై అక్రమంగా సోదాలు చేయకూడదని హైకోర్టు ఇచ్చిన రిలీఫ్‌ఆర్డర్‌ను కూడా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజాజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? అంటూ మావోయిస్టు నేత ఆర్కే సతీమణి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. -
అసోం పోల్స్: అఖిల్ గొగోయ్ సంచలన ఆరోపణలు
సాక్షి,గౌహతి: జైల్లో తనను మానసికంగా, శారీరకంగా హింసించారని యాంటీ సీఏఏ యాక్టివిస్టు అఖిల్ గొగోయ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో చేరితే తనకు వెంటనే బెయిల్ ఇస్తామని ఎన్ఐఏ ఆశచూపిందంటూ అఖిల్ లేఖ రాశారని ఆయనకు చెందిన రైజోర్ దళ్ వెల్లడించింది. కోర్టు అనుమతిలేకుండా అఖిల్‌ను 2019 డిసెంబర్లో ఢిల్లీకి తీసుకుపోయారని తెలిపింది. అక్కడ ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో తనను బంధించారని, గాఢమైన చలిలో నేలపై పడుకోవాల్సివచ్చిందని అఖిల్ లేఖలో తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లో చేరితే బెయిల్ పొందవచ్చన్న ఆఫర్‌ను తిరస్కరించగా కావాలంటే అసెంబ్లీకి పోటీ చేసి మంత్రికావచ్చని ఆశ చూపారన్నారు. అంతేకాకుండా కేఎంఎస్ఎస్(కృషిక్ ముక్తి సంగ్రామ్ సమితి)ని వీడి ఒక ఎన్జీఓ ఆరంభించి, అసోంలో క్రిస్టియన్ మతమార్పిడులకు వ్యతిరేకంగా పనిచేస్తే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారన్నారు. ఇవేవీ తాను అంగీకరించకపోవడంతో అసోం సీఎం మరియు ఒక ప్రభావవంతమైన మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని, దీన్ని కూడా తాను వ్యతిరేకించానని తెలిపారు. దీంతో తనపై ఎన్ఐఏ తీవ్రమైన ఆరోపణలతో కూడిన కేసులు పెట్టిందన్నారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయని, పదేళ్లు జైలు జీవితం గడపాలని భయపెట్టారని తెలిపారు. కోవిడ్ కారణంగా అఖిల్‌ను గౌహతి మెడికల్ కాలేజీలో చేర్చారు. యాంటీ సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్నాడంటూ అఖిల్‌ను ఎన్ఐఏ 2019లో అరెస్టు చేసింది. అయితే అఖిల్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఇవన్నీ చౌకబారు రాజకీయాలని బీజేపీ ప్రతినిధి రూపమ్ గోస్వామి ఆరోపించారు. అసోం ఎన్నికలకు ముందు ఈ లేఖ విడుదల కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అఖిల్‌కు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. కాగా రేజర్ పార్టీ అసెంబ్లీ జనతా పరిషత్ (ఏజేపీ) తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుండి పోటీ చేస్తున్న గొగోయ్ శివసాగర్ సీటు నుండి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : కీలక వీడియో ఫుటేజ్
సాక్షి,ముంబై: వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ఇంటిముందు అనుమానాస్పద వాహనం రేపిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈకేసులో తాజాగా మరో కీలక విషయాన్ని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేతో కలిసి ఉన్న వీడియోను గుర్తించినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ప్రకటించాయి. (అంబానీ ఇంటివద్ద కలకలం : బతికుండగానే నీటిలో ) ఫిబ్రవరి 17న వీరిదద్దరూ కలిసి ఉన్నట్లు వెల్లడించే వీడియో ఫుటేజీని కనుగొన్నామని విచారణ అధికారులు తెలిపారు. ఫుటేజ్ ప్రకారం హిరేన్‌కు చెందిన నల్ల మెర్సిడెస్ బెంజ్ కారులో వాజేను కలుసుకున్నారు. వీరి సమావేశం సుమారు 10 నిమిషాల పాటు కొనసాగింది. వీడియోలో, వాజే ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని బెంజ్ కారులో వెళ్ళడాన్ని గమనించవచ్చని ఏటీఎస్ తెలిపింది. ఈ సందర్భంగా హిరేన్ స్కార్పియో కారు తాళాలను వాజేకు అప్పగించి ఉంటాడని కూడా ఏటీఎస్ అనుమానిస్తోంది. ఆ మరుసటి రోజు, ఫిబ్రవరి 18న, హిరేన్ తన స్కార్పియో చోరికి గురైందని విఖ్రోలి పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 25 న బెదిరింపులేఖతోపాటు జెలిటిన్ స్టిక్స్ ఉన్న అదే స్కార్పియోను అంబానీ నివాసం యాంటిలియా వెలుపల కనుగొన్నారు. ప్రస్తుతం వాజే వాడుతున్న బ్లాక్ బెంజ్ కారును ఇటీవల ఏటీఎస్ సీజ్ చేసింది. తాజా పరిణామంతో హిరేన్ మృతిలో వాజే పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అలాగే వాజేకు చెందిన మూడు ప్రధాన వ్యాపార సంస్థలపై నిఘాపెట్టాయి. వాజ్ డైరెక్టర్‌గా పనిచేసిన డిజీ నెక్స్ట్ మల్టీ మీడియా లిమిటెడ్, మల్టీ-బిల్డ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్, టెక్లీగల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై ఆరా తీస్తున్నాయి. ఈ సంస్థలలో ఇతర డైరెక్టర్ల పాత్రను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు థానే సెషన్స్ కోర్టులో వాజే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌కు ఏటీఎస్ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ మార్చి 30 కి వాయిదా పడింది. కాగా ఫిబ్రవరి 25న అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలు కలకలం రేపాయి. ఇందులోని ఒకవాహనం స్కార్పియో వాహనం యజమాని హిరేన్ మార్చి 5 న ముంబై సమీపంలోని ఒక కొలనులో శవమై తేలాడు. అయితే ఈ కారును సచిన్ వాజే నాలుగు నెలలు ఉపయోగించారని, ఫిబ్రవరి 5న తిరిగి ఇచ్చారని హిరేన్ భార్య విమల ఆరోపించారు. తన భర్త మరణంలో వాజ్ పాత్ర ఉందని కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మూడు కేసులను ఎన్ఐఏ, ఏటీఎస్ విచారిస్తున్నాయి. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : సంచలన ఆధారాలు
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వాహన యజమాని థానేకు చెందిన ఆటో విడిభాగాల డీలర్ మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదమరణంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ పలు కీలక విషయాలను వెల్లడించింది. దీంతో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ అధికారి సచిన్ వాజే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. (అంబానీ ఇంటి వద్ద కలకలం: మరో కీలక ట్విస్టు) సచిన్ వాజే వాడుతున్న బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారును ఎన్ఐఏ తాజాగా స్వాధీనం చేసుకుంది. ఇందులో 5లక్షల నగదు, నోట్ల లెక్కింపు మెషీన్, కొన్ని దుస్తులతోపాటు కీలక ఆధారాలను సీజ్ చేసింది. వాజే నడుపుతున్నాడని ఆరోపిస్తున్న ఈ బెంజ్‌కారులో అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో వాహనం లైసెన్స్ ప్లేట్‌ను కూడా సీజ్ చేయడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే సచిన్‌వాజేను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు ముంబైలోని క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఫోన్, డిజిటల్ వీడియో రికార్డర్‌తో పాటు థానేలోని సచిన్ వాజే నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌ను కూడా కావాలని పారేసిన వాజే ల్యాప్‌టాప్‌లోని డేటాతోపాటు, సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా డిలీట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అలాగే సీసీటీవీలో పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజేనేనని ఎన్ఐఏ స్పష్టం చేసింది. చెక్ షర్ట్, కిరోసిన్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కూడా దొరికినట్లు అధికారులు తెలిపారు. ఈ కిరోసిన్‌తోనే పీపీఈ కిట్ తగుల బెట్టాడని ఆరోపిస్తోంది. ప్రస్తుతం సచిన్ వాజే వినియోగిస్తున్న బెంజ్ కారు అసలు యజమాని ఎవరు అన్నదానిపై ఆరా తీస్తున్నామని ఎన్ఐఏ అధికారి అనిల్ శుక్లా తెలిపారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం) కాగా ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ నివాసం అంటిల్లాకు సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం కలకలం రేపింది. తన స్కార్పియో కనిపించడం లేదంటూ మన్సుఖ్ హిరేన్ ఫిబ్రవరి 17నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 5 న ముంబైకి సమీపంలోని కొలనులో హిరేన్ శవమై తేలాడు. దీంతో హిరేన్ భార్య విమల సచిన్వాజేపై ఫిర్యాదు చేసింది. మరోవైపు శివసేన ప్రభుత్వం వాజేను రక్షించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వాజేపై మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌తో ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ కేసు చివరకు ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే. -
అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రేపిన కలకలం మరింత ముదురుతోంది. ముంబైలోని అంబానీ ఇంటిముందు అనుమానాస్పందంగా కనిపించిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ (45) శవమై తేలడం వివాదాన్ని మరింత రాజేస్తోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర మాజీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో చోటుచేసుకున్న అనేక సంఘటనలు అనుమానాలకు తావిస్తోందనీ, దీనిపై ఉన్నత స్థాయి దర్యప్తు జరపాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్' మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్ వాజ్ పాత్రపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి) రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర శాసనసభలో శుక్రవారం మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబానీ బెదిరింపు కేసులో అనుమానాలకు దారితీసే అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మన్సుఖ్‌ని, వాజ్ టెలిఫోన్ సంభాషణ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు పోలీసు కమిషనరేట్‌కు సమీపంలో ఉన్న దక్షిణ ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్‌ని వాజ్ కలిశారని చెప్పుకొచ్చారు. అలాగే కొంతమంది పోలీసులు అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మన్సుఖ్ తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఇన్ని అనుమానాల నేపథ్యంలోఈ కేసు దర్యాప్తు తప్పనిసరిగా ఎన్ఐఏకు అప్పగించాలన్నారు. (అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు) మరోవైపు మన్సుఖ్ను కలిసారాన్న ఆరోపణలను సచిన్ వాజ్ ఖండించారు. మన్సుఖ్ థానేకు చెందినవాడు కాబట్టి తనకు తెలుసు అంతేకానీ, ఇటీవలి కాలంలో అతడిని కలవలేదన్నారు. అలాగే తనను వేధిస్తున్నట్టుగా మన్సుఖ్ ఫిర్యాదు చేశాడని ధృవీకరించారు. అలాగే ఈ కేసులోఅంబానీ నివాసానికి చేరుకున్న మొదటి వ్యక్తిని తాను కాదన, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గామ్దేవి అని, ఈ తరువాత క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు స్పాట్ చేరుకున్నానని వివరణ ఇచ్చారు. అలాగే క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్ను కలిశాననే ఆరోపణలు అబద్ధమని కొట్టి పారేశారు. కాగా ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ మన్సుఖ్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వాహన విడిభాగాల వ్యాపారం చేసే మన్సుఖ్, తన ఎస్‌యూవీని ఎవరో దొంగిలించారంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గురువారం రాత్రి కనిపించకుండా పోయిన మన్సుఖ్ శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. -
మై ఇండియా, కానీ ఐఎస్ కోసం పనిచేస్తా!
సాక్షి, న్యూఢిల్లీ: సూసైడ్ బాంబర్ అవడం సాదియా జీవిత లక్ష్యం. 20 ఏళ్ల అమ్మాయి సాదియా. పుణె దగ్గరి ఎరవాడ తనది. ఇప్పటికి రెండుసార్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఎ) పోలీసులు ఆమెను డీ–రాడికలైజ్ చేశారు. అంటే.. మారు మనసు పొందేలా చేయడం. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకసారి, 18 ఏళ్ల వయసులో ఒకసారి ఆమెకు డీ–రాడికలైజేషన్ జరిగింది. ‘నేను భరతమాత ముద్దుబిడ్డని’ అని వాళ్లు చెప్పమన్నట్లే చెప్పి, తన మనసు ఎక్కడుందో మళ్లీ అక్కడికే వెళ్లిపోయింది భరత మదర్ ని వదిలేసి! ఐఎస్‌తో కలిసి ఇండియాలో ‘మ్యాచ్’ కి ప్లాన్ చేస్తుండగా ఈ జులై లో సాదియా ను పట్టుకుంది ఎన్. ఐ.ఎ. ‘ఏం చేస్తున్నావు వారితో కలిసి?!’ అని అడిగితే అబద్ధమేమీ చెప్పలేదు సాదియా. ‘నా మనసు ఇండియన్ మదర్ దగ్గర లేదు’ అంది. ‘మరి ఇండియా వదిలి పోతావా?’ అంటే.. ‘పోను.. ఇది నా దేశం. నేను ఎందుకు పోవాలి?’ అంది! సెప్టెంబర్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఎన్. ఐ.ఏ. సాదియా మీద. ‘అంకుల్.. కరోనాను ఒక మనిషికి ఎక్కించి, ఆ మనిషి తో సుమారుగా ఎంతమందికి కరోనాను తెప్పించవచ్చు?’ అని ఎవరినో అడుగుతుంటే విని పోలీసులు ఆమెను పట్టుకున్నారు. సాదియా అన్వర్ షేక్ (పూర్తి పేరు) కు దేశం బయట మంచి మంచి పరిచయాలు ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్, ఆల్ ఖైదా, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ సంస్థలతో ఆమె టచ్ లో ఉంది. ఫిలిప్పీన్స్ లో ఆయిషా హమిదాన్ అని ఆన్ లైన్ ‘మోటివేటర్’ ఒకావిడ ఉన్నారు. ఇరవై ఏళ్ల లోపు పిల్లల్ని ఆదరించి, అక్కున చేర్చుకుని ఉచితంగా ఐ.ఎస్.పాఠ్యపుస్తకాలు అందించి చక్కగా తల దువ్వుతూ వారి చేత ప్రతి పేజీనీ శ్రద్ధగా చదివించడం ఆమె జీవిత లక్ష్యం. ఆమెతో కూడా టచ్ లో ఉంది సాదియా. మలేసియాలో అజ్ఞాతం లో ఉన్న ఇస్లాం మత ప్రబోధకులు డాక్టర్ జకీర్ నాయక్ కూడా సాదియా కు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఐ.ఇ.డి. ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకుంది సాదియా. ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్!! ఫేస్బుక్లో మల్టిపుల్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చెయ్యడం కూడా వచ్చు. ఇన్ని చేస్తూ కూడా ‘ఇండియా ఈజ్ మై కంట్రీ’ అంటున్న ఈ అమ్మాయిని చూస్తుంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు ముచ్చటగా ఉందట. మళ్లీ ఇంకోసారి ఆమెను డీ–రాడికలైజ్ చేసే పాపాన్నయితే వాళ్లు మూటగట్టుకోదలుచుకోలేదు. దీనికి సంబంధించి నవంబర్‌లో కేసు విచారణ మొదలు కాబోతోంది. -
ఐఎస్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
బెంగళూరు: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్‌ని ఒకదాన్ని చేధించి.. దానితో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్ట్ చేసింది. నిందితులను బెంగళూరుకు చెందిన అహ్మద్ అబ్దుల్(40), ఇర్ఫాన్ నజీర్(33)గా గుర్తించింది. అంతేకాక 2013-14 మధ్య కాలంలో 13-14 మంది వ్యక్తులు బెంగళూరు నుంచి సిరియా వెళ్లినట్లు ఏజెన్సీ గుర్తించింది. వీరిలో ఇద్దరు సిరియాలో హత్యకు గురి కాగా.. కొందరు 2014 లో నిశ్శబ్దంగా తిరిగి వచ్చారని.. చాలామంది ఇప్పటికీ పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. 2014 లో ఇరాక్, సిరియాలను ఐఎస్ అధిగమించింది. ఇరాక్ 2017 లో ఈ టెర్రర్ గ్రూపుపై విజయం సాధించినట్లు ప్రకటించింది. 2019 మార్చిలో సిరియాలో అమెరికా మద్దతు ఉన్న దళాలు ఈ బృందాన్ని ఓడించాయని, ఈ గ్రూపు ప్రాదేశిక నియంత్రణకు ముగింపు పలికాయని వెల్లడించింది. ఇక నేడు చేధించిన మాడ్యూల్‌లోని సభ్యులందరినీ ఎన్ఐఏ గుర్తించింది. వీరు సన్నిహితంగా ఉన్నవారి గురించి అలానే వీరి కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒక బ్యాంకు వ్యాపార విశ్లేషకుడు కాడర్, కుటుంబ వ్యాపారాన్ని నడుపుతున్న నాసిర్, మాడ్యూల్లో చాలా మంది సభ్యులను సమూలంగా మార్చారని కనీసం ఐదుగురు సభ్యుల ప్రయాణానికి ఆర్థిక సాయం చేశారని ఎన్ఐఏ తెలిపింది. జహన్‌జైబ్ సామి, హినా బషీర్ బేగ్ కేసుకు సంబంధించి ఆగస్టులో బెంగళూరు నుంచి అరెస్టయిన నేత్ర వైద్య నిపుణుడు అబ్దుల్ రెహ్మాన్‌ను ప్రశ్నించగా బెంగళూరు మాడ్యూల్ గురించి ఎన్ఐఏ ఏజెన్సీ అధికారులకు తెలిసింది. దాంతో వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాడర్, నాసిర్‌లను గుర్తించారు. వీరు హిజ్బ్ ఉత్ తహ్రీర్(హుట్)లో సభ్యులు. వీరు ఖురాన్ సర్కిల్ అనే మాడ్యూల్‌ని ఏర్పాటు చేసి బెంగళూరులోని వ్యక్తులను ప్రలోభాలకు గురి చేశారు. అంతేకాక వీరు నిధులు సేకరించి సిరయా పర్యటనలకు, ఐఎస్‌కు సహాయం చేడానికి, దాని భావజాల వ్యాప్తికి ఈ నిధులను వినియోగించారు. కాడర్ హుట్ నుంచి నిధులు సేకరించి తన బ్యాంక్ ఖాతా ద్వారా సిరియాకు పంపించాడని అధికారులు తెలిపారు. నేత్ర వైద్య నిపుణుడు ఐఎస్‌లో చేరడానికి బెంగళూరు నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కాడర్, నాజిర్ నిధులు సమకూర్చారు. (చదవండి: ‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!’) కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు 22 మంది సభ్యుల మాడ్యూల్ 2016 లో ఇరాక్, సిరియాకు ప్రయాణించింది. భారతదేశం నుంచి ఈ ప్రాంతానికి ప్రయాణించిన అతిపెద్ద సమూహం ఇదే అని ఎన్ఐఏ తెలిపింది.ఇరాక్, సిరియా,ఆఫ్ఘనిస్తాన్లలో ఐఎస్ ఆధీనంలో ఉన్న భూభాగాలకు 2014 నుంచి అనేక మంది కార్యకర్తలు ప్రయాణించారని, అయితే వారంతా చిన్న సమూహాలలో లేదా వ్యక్తిగతంగా వెళ్లారని అధికారులు తెలిపారు. కాసరగోడ్ మాడ్యూల్ అతిపెద్ద మాడ్యూల్ దాని తర్వాత ఇప్పుడు 13-14 మంది కలిసి వెళ్లిన ఈ తాజా బెంగళూరు మాడ్యూల్ పెద్దదిగా ఉంది" అని ఒక అధికారి తెలిపారు.