బెంగళూరు: సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో మంగళవారం(మే21) ఎన్‌ఐఏ పలు రాష్ట్రాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించింది. కేసులో కొందరు అనుమానితులకు సంబంధించి అందిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
రాత్రి వరకు దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణను ఎన్‌ఐఏ మార్చి3వ తేదీన ప్రారంభించింది. ఏప్రిల్ 12న పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ అహ్మద్, బాంబు పెట్టిన వ్యక్తిగా భావిస్తున్న ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment